నిత్యమూ తర్పణము చేయుట పితృయజ్ఞముతో సమానము. నిత్యమూ చేయు పితృ తర్పణమునకు తిలలు(నల్ల నువ్వులు) అవసరం లేదు. నీటితో చేస్తే సరిపోతుంది. కానీ ఇది ఇంటి లోపల కాకుండా బయట చేయవలయును. ఇంటి బయట తూర్పు తిరిగి ఆచమనము, సంకల్పము చేసి దక్షిణముఖముగా కూర్చుండి నేలపై కొన్ని దర్భలను పరిచి వాటిపై తర్పణ చేయవలెను.
పితృదేవతల కోసం మకర సంక్రాంతి మరియు మహాలయ అమావాస్య రోజు తర్పణం విధిగా చేయాలి. పితృ తర్పణము, మీకు మీరే ఎలా చేసుకోవచ్చో తెలుసుకోండి.
ఆచమ్య :-
ఓం గోవిందాయ నమః |
పవిత్రం దృత్వా || ( దర్భ పవిత్రమును ధరించాలి)
మహస్సముద్రం వరుణస్థిరోదధే| ధీరా ఇచ్చేక్రుర్ధరుణెష్వారభం | పవిత్రం-
తేవితతం బ్రహ్మణస్పతే | ప్రభుర్గాత్రాణి పర్యేషివిశ్వతః | అతప్తతనూర్న తదామో
అశ్నుతే | శ్రుతాస ఇద్వహంతస్తథ్సమాసత |
సూ|| పవిత్రంధ్భత్వా |
పునరాచమ్య || ( మరల ఆచమనము చేయాలి )
భూతోచ్చాటన :-
ప్రాణాయామము :- (ముక్కు. బొటనవేలు,చిటికెన వేలుతొ పట్టుకొని) ఓం భూః | ఓం భువః | ఓగ్ం సువః ఓం మహః ఓం జనః | ఓం తపః | ఓగ్ం సత్యం | ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి | ధియోయోనః ప్రచోదయాత్ | ఓమాపోజ్యోతీరసోమృతం బ్రహ్మ భూర్పు వస్సువరోమ్ ||
సంకల్పం :-
మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య - శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం , శ్రీ గోవింద గోవింద గోవింద |
శ్రీ మహా విష్ణొరాజయా ! ప్రవర్తమానస్య | అద్య బ్రహ్మణ, ద్వితీయ పరార్ధే! స్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే | కలియుగే| ప్రధమ పాదే! జంబూ ద్వీపే, భరత వర్షే | భరత ఖండే! మేరోదక్షిణ దిగ్బాగే శ్రీశైలస్య ____ ప్రదేశే ,కృష్ణా కావేర్యోర్మద్యదేశే| సమస్త దేవతా బ్రాహ్మణ హరి హర గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన - వ్యావహారిక చాంద్రమానేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరే, ఉత్తరాయణే, హేమంత ఋతౌ, పుష్య మాసే కృష్ణపక్షే, ద్వాదశి తిదౌ బృహస్పతి వాసరే.| శ్రీవిష్ణు నక్షత్రే.! శ్రీవిష్ణు యోగే | శ్రీవిష్ణు కరణ | ఏవంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్యతిధౌ శ్రీమాన్ (గోత్రం పేరు) గోత్రః, (పేరు) నామధేయః
ప్రాచీనావీతి:- ( యజ్ఞోపవీతమును ఎడమ నుండి కుడి భుజము పైకి మార్చుకొనవలెను)
నమస్కారం
ఈశానః పితృరూపేణ మహాదేవో మహేశ్వరః ।
ప్రీయతాం భగవానీశః పరమాత్మా సదాశివః ॥ 01 ॥
దేవతాభ్యః పితృభ్యశ్చ మహాయోగిభ్య ఏవ చ ।
నమస్స్వాహాయై స్వధాయై నిత్యమేవ నమో నమః ॥ 02 ॥
మంత్రమధ్యే క్రియామధ్యే విష్ణోస్స్మరణ పూర్వకమ్ ।
యత్కించిత్క్రియతే కర్మ తత్కోటి గుణితం భవేత్ ॥ 03॥
విష్ణుర్విష్ణుర్విష్ణుః ॥
దక్షిణ ముఖంగా కూర్చొని
అర్ఘ్యపాత్ర
అర్ఘ్యపాత్రయోః అమీగంధాః । (అర్ఘ్యపాత్రలో గంధం వేయవలెను)
పుష్పార్థా ఇమే అక్షతాః । (అర్ఘ్యపాత్రలో అక్షతలు వేయవలెను)
అమీ కుశాః । (అర్ఘ్యపాత్రలో దర్భలు వేయవలెను)
ప్రాచీనావీతి (మరల ప్రాచీనావీతి చేసుకొనవలెను. ముందుగా తూర్పు కొసలుగా మూడు ధర్బలు, వాటిపై దక్షిణ కొసలుగా రెండు కూర్చలు పరిచి వాటి పై పితృదేవతలను)
ఓం ఆయంతు నః పితరస్సోమ్యాసోగ్నిష్వాత్తాః పథిభిర్దేవ యానైః ।
అస్మిన్ యజ్ఞే స్వధయా మదం త్వధి బృవంతు తే అవంత్వ స్మాన్ ॥
ఇదం పితృభ్యో నమో అస్త్వద్య యే పూర్వాసో య ఉపరాస ఈయుః ।
యే పార్థివే రజస్యా నిషత్తా యే వా నూనం సువృజనాసు విక్షు ॥
పితృదేవతాభ్యో నమః ।
("స్వధానమస్తర్పయామి' అన్నప్పుడల్లా మూడుసార్లు తిలోదకము పితృతీర్ధముగా ఇవ్వవలెను. వారి భార్య కూడా లేనట్లైతే సపత్నీకం అని, స్త్రీల విషయమున భర్త కూడా లేనట్లైతే సభర్తృకం అని చేర్చుకొనవచ్చును.
గోత్రమును,పేరును చెప్పి తర్పణ చేయాలి. ప్రతి దానికి ముందు "అస్మత్" అను శబ్దాన్ని చేర్చ వలెను. బ్రాహ్మణులైతే శర్మాణం అన్నది పనికొస్తుంది. కానీ రాజులైతే వర్మాణాం. వైశ్యులైతే గుప్తం, ఇతరులు దాసం అని మార్చి పలకాలి.)
1) పితరం (తండ్రి పేరు చెప్పి)
అస్మత్_____గోత్రం, ___శర్మాణం, వసురూపం, స్వధానమస్తర్పయామి మూడు మారులు తిల తర్పణాలు జలముతో వదలాలి.
2) పితామహం (తాత) అస్మత్_____గోత్రం, ___శర్మాణం, రుద్రరూపం, స్వధానమస్తర్పయామి.
3)ప్రపితామహం(ముత్తాత) అస్మత్____గోత్రం ___శర్మాణం ఆదిత్య రూపం స్వధానమస్తర్పయామి.
4) మాతరం (తల్లి) అస్మత్_____గోత్రం ___ దాయీం వసురూపాం స్వధానమస్తర్పయామి.
5) పితామహీం (నానమ్మ) అస్మత్_____గోత్రం,____దాయీం, రుద్రరూపాం స్వధానమస్తర్పయామి.
6) ప్రపితామహీం (నానమ్మ గారి అత్త) అస్మత్_____గోత్రం____దాయీం ఆదిత్యరూపాం
స్వధానమస్తర్పయామి.
7) సాపత్నిమాతరం (సవితి తల్లి) అస్మత్_____గోత్రం____దాయీం వసురూపాం స్వధానమస్తర్పయామి.
8)మాతామహం (తల్లి గారి తండ్రి) అస్మత్_____గోత్రం____ శర్మాణం వసురూపం స్వధానమస్తర్పయామి.
9) మాతుః పితామహం (తల్లి గారి తాత) అస్మత్_____గోత్రం____ శర్మాణం రుద్రరూపం స్వధానమస్తర్పయామి.
10)మాతుఃప్రపితామహం (తల్లి యొక్క తాతగారి తండ్రి) అస్మత్_____గోత్రం____ శర్మాణం ఆదిత్య రూపం స్వధానమస్తర్పయామి.
11) మాతామహీం(అమ్మమ్మ) అస్మత్_____గోత్రం____ దాయీం వసురూపాం స్వధానమస్తర్పయామి.
12) మాతుః పితామహీం(తల్లి యొక్క నానమ్మ) అస్మత్_____గోత్రం____ దాయీం రుద్రరూపాం స్వధానమస్తర్పయామి.
13)మాతుః ప్రపితామహీం (తల్లి యొక్క నానమ్మ గారి అత్త) అస్మత్_____గోత్రం____ దాయీం ఆదిత్య రూపాం స్వధానమస్తర్పయామి.
14) ఆత్మపత్నీం (భార్య) అస్మత్_____గోత్రం____ దాయీం వసురూపం స్వధానమస్తర్పయామి.
15) సుతం (కుమారుడు) అస్మత్_____గోత్రం____శర్మాణం వసురూపం స్వధానమస్తర్పయామి.
16) జ్యేష్ఠ/కనిష్ఠ పితృవ్యం (తండ్రి సోదరుడు) అస్మత్__గోత్రం___శర్మాణం వసురూపం
స్వధానమస్తర్పయామి.
17) జ్యేష్ఠ/కనిష్ఠ భ్రాతరం (స్వంత సోదరుడు) అస్మత్_____గోత్రం____శర్మాణం, వసురూపం
స్వధానమస్తర్పయామి.
18)తత్పత్నీం (సోదరుని భార్య/వదిన) అస్మత్_____గోత్రం___దాయీం వసురూపాం, స్వధానమస్తర్పయామి.
19) పితృవ్యం (పెదనాన్న/చిన్నాన్న) అస్మత్_____గోత్రం____శర్మాణం వసురూపం స్వధానమస్తర్పయామి.
20)తత్పత్నీం (పెద్దమ్మ/ చిన్నమ్మ లు) అస్మత్_____గోత్రం____దాయీం వసురూపాం స్వధానమస్తర్పయామి.
21)తత్ పుత్రం (పెదనాన్న/చిన్నాన్న కుమారుడు) అస్మత్_____గోత్రం____శర్మాణం
వసురూపం స్వధానమస్తర్పయామి.
22) తత్పత్నీం (పెదనాన్న/చిన్నాన్న కుమారుని భార్య) అస్మత్_____గోత్రం____దాయీం
వసురూపాం స్వధానమస్తర్పయామి.
23)మాతులం (మేనమామ) అస్మత్_____గోత్రం____శర్మాణం వసురూపం స్వధానమస్తర్పయామి.
24) తత్పత్నీం(మేనమామ భార్య) అస్మత్__గోత్రం__దాయీం వసురూపాం స్వధానమస్తర్పయామి.
25) దుహితరం (కూతురు) అస్మత్_____గోత్రం____దాయీం వసురూపాంస్వధానమస్తర్పయామి.
26) ఆత్మ భగినీం ( సోదరి) అస్మత్_____గోత్రం___ దాయీం వసురూపాం, స్వధానమస్తర్పయామి.
27)దౌహిత్రం (మనుమడు) అస్మత్_____గోత్రం____శర్మాణం వసురూపం స్వధానమస్తర్పయామి.
28) తత్పత్నీం (మనుమడు భార్య) అస్మత్__గోత్రం__దాయీం వసురూపం స్వధానమస్తర్పయామి.
29)భాగినేయకం(మేనల్లుడు) అస్మత్____గోత్రం____శర్మాణం వసురూపం స్వధానమస్తర్పయామి.
30) తత్పత్నీం (మేనల్లుడి భార్య) అస్మత్__గోత్రం__దాయీం వసురూపాం స్వధానమస్తర్పయామి.
31) పితృ భగినీం ( మేనత్త ) అస్మత్_____గోత్రం____దాయీం వసురూపాం స్వధానమస్తర్పయామి.
32) తద్భర్తారం (మేనత్త భర్త) అస్మత్____గోత్రం____శర్మాణం వసురూపం స్వధానమస్తర్పయామి.
33)మాతృ భగినీం (చిన్నమ్మ/పెద్దమ్మ) అస్మత్_____గోత్రం____దాయీం వసురూపాం స్వధానమస్తర్పయామి.
34) తద్భర్తారం (తల్లి సోదరి యొక్క భర్త) అస్మత్_____గోత్రం____శర్మాణం వసురూపం స్వధానమస్తర్పయామి.
35) జామాతరం (అల్లుడు) అస్మత్_____గోత్రం____శర్మాణం వసురూపం స్వధానమస్తర్పయామి.
36)స్నుషాం ( కోడలు) అస్మత్_____గోత్రం____దాయీం వసురూపాం స్వధానమస్తర్పయామి.
37)శ్వశురం(పిల్లనిచ్చిన మామ) అస్మత్__గోత్రం___శర్మాణం వసురూపం స్వధానమస్తర్పయామి.
38)శ్వశ్రూం ( పిల్లనిచ్చిన అత్త) అస్మత్___గోత్రం___దాయీం వసురూపాం స్వధానమస్తర్పయామి.
39)శ్యాలకం (బావమరిది) అస్మత్_____గోత్రం____శర్మాణం వసురూపం స్వధానమస్తర్పయామి.
40) తత్పత్నీం (బావమరిది భార్య) అస్మత్_గోత్రం__దాయీం వసురూపాం స్వధానమస్తర్పయామి.
41)గురుం(గురువు) అస్మత్_____గోత్రం____శర్మాణం వసురూపం స్వధానమస్తర్పయామి.
42)రిక్థినం(ధనమిచ్చినవారు) అస్మత్_____గోత్రం___శర్మాణం వసురూపం స్వధానమస్తర్పయామి.
యే బాంధవాః యే బాంధవాః యేయే అన్య జన్మని బాంధవాః |
తే సర్వే తృప్తి మాయాన్తు మయా దత్తేన. వారిణా ||
ఆ బ్రాహ్మ స్తంబ పర్యన్తం దేవర్షి పితృ మానవాః |
తృప్యంతు పితర స్సర్వే మాతృ మతామహాదయః ||
అతీత కుల కోటీనాం సప్త ద్వీప నివాసినాం |
ఆ బ్రహ్మ భువనాల్లోకా దిదమస్తు తిలోదకం ||
(యజ్ణోపవీత నిష్పీడనం)
యజ్జోపవీతమును నివీతిగా (దండలాగా) మెడలో వేసుకుని ముడిని నీటిలో ముంచి నేలపై పిండుతూ ఈ క్రింది విధంగా చదువవలెను.
||శ్లొ|| యేకే దాస్మత కులే జాతాః ఆపుత్రా గోత్రిణొ మృతాః | తే గృహ్ణంతు మయాదత్తం సూత్ర నిప్పిడనొదకం ||
( నా కులములోను, గోత్రమునందును పుత్రులు లేక మరణించిన వారందరూ నేను వదిలే ఈ ఉదకమును స్వీకరించెదరు గాక!)
శ్రీరామ రామ రామ | | అనుచూ యజ్ఞోపవీతపు ముళ్లను కళ్లకద్దుకుని సవ్యము చేసుకొనవలెను.
స్వస్థి...
No comments:
Post a Comment