Thursday, January 22, 2026
Magha Puranam 6 - మాఘ పురాణం 6 సుశీల చరిత్ర
సుశీల చరిత్ర
భోగాపురమను నగరంలో సదాచారుడు, దైవభక్తుడగు ఒక బ్రాహ్మణోత్తముడు నివసించుచుండెను. అతనికి అందాలభరణివంటి ఒక కుమూార్తెగలదు. ఆ కన్య పేరు సుశీల. మంచి శీలం గలది మంచి
బుద్ధిమంతురాలు చిన్నతనమునుండియూ దైవభక్తికలదై ఎల్లప్పుడూ ఏదోఓక వ్రతమును స్వీకరించుచు, పురాణ పఠనమునందే సదా మనస్సు నిలిపి కాలము గడుపుచూ, యుక్తవయస్కురాలై పున్నమి చంద్రుని బోలు మోము కలదయి యుండెను.
ఆమె గుణములు తెలుసుకొని ఆమెవద్ద అన్ని లక్షణములు వుండుటవల్ల మృగశృంగుడు సుశీలనే పెండ్లియాడదలచాడు.
"ఒకనాడు సుశీల తన ఇద్దరి స్నేహితురాండ్రతో కలసి కావేరీ నదికి స్నానమునకు బయలుదేరి వెళ్ళినది. ఆ సమయమున నొక ఏనుగు అడవినుండి ఘీం కారం పెట్టుచువచ్చి స్నానార్ధమై వచ్చిన ఆ ముగ్గురు కన్యలను తరుమజొచ్చెను. వారు భయపడి ఏదిక్కు గానక ముందు వెనుకలు జూడక పిక్కబలం కొలది పరుగిడ బోవుచుండగా దారిలో గట్టులేని నూతిలోపడి ప్రాణములు విడిచిరి. ఆ సంగతి వారి తల్లిదండ్రులకు తెలిసివచ్చి చూచుసరికి ముగ్గురూ చనిపోయివున్నారు.
ఆ వార్త మృగశృంగునకు తెలియటచే అతడునూ వచ్చి ఆ ముగ్గురి మృత దేహములను చూశాడు. ఎక్కడ లేని దుఃఖమూ కలిగినది. వారి నెటులనైనను బ్రతికించవలయునని సంకల్పించి వారి తల్లిదండ్రులతో తమ బిడ్డల మృత దేహములను కాపాడుచుండుడని చెప్పి తాను సమీపము నున్న కావేరీ నదిలో రొమ్మువరకు దిగి ధ్యానము జేయసాగాను.
అంతలో అడవి అంతా గర్జించుకుంటూ తిరిగి ఆ ఏనుగు నీటిలో దిగి తపస్సు చేసుకుంటున్న మృగశృంగుని వద్ధకు వచ్చినది. ఐననూ మృగశృంగుడు చలించలేదు. నిర్భయముగా ధ్యానిస్తునే
వున్నాడు.
ఏనుగుకూడా మృగశృంగుని కెదురుగా నిలబడి దీక్షగా చూడసాగింది. అటుల కొంచెంసేపు నిలబడి తటాలున తన తొండముతో మృగశృంగుని పట్టుకొని తన వీపుపై కెక్కించుకొన్నది. ఐననూ ఆ బ్రాహ్మణ కుమారుడు భయపడక ఇది అంతయు శుభసూచకమని తలచినాడు. నీరు మంత్రించి ఏనుగుపై చల్లెను. తన రెండుచేతులతో దాని శరీరాన్ని నిమిరాడు. క్షణంలో ఆ ఏనుగు తన రూపం వదలి ఒక దేవతారూపంలో నిలబడి తనకు శాపవిమోచనం కలిగించిన ఆ మృగశృంగునకు నమస్కరించి దేవలోకమునకు పోయెను.
వింటివా దిలీప మహారాజా! మాఘస్నాన ఫలమువలన ఏనుగు నకు శాపవిమోచనమై ఎట్లు నిజరూపం వచ్చినదో! మిగిలిన వృత్తాంతము కూడా శ్రద్ధగా ఆలకింపుడు.
Magha Puranam - మాఘ పురాణం
Magha Puranam 5 - మాఘ పురాణం 5 మృగశృంగుని చరిత్ర
మృగశృంగుని చరిత్ర
ఆ బ్రాహ్మణ యువకుడు కుత్సురుని కుమారుడు గనుక 'కౌత్సు' డని పిలవబడుచున్ననూ అతనిని మృగశృంగుడను పేరుతో పిల్చుచుండిరి. అదెటులనగా, అతడు కావేరీ నదితీరమున ఘోర తపస్సు చేసియున్నాడు గదా అప్పుడాతడు శిలవలె నిలబడి దిక్షతో తపస్సు చేసుకొను సమయములో ఆ ప్రాంత మందు తిరుగాడు మృగములు, జంతువులు, తమయొక్క శృంగములచే (కొమ్ములతో) నతనిని గీకెడివి. అందుచేత అతనికి 'మృగశృంగు'డనే పేరు సార్థకమయ్యెను.
వివాహమాడు కన్య
మృగశృంగునకు యుక్త వయస్సు వచ్చియుండుటచే అతనికి వివాహము చేయవలయునని అతని తల్లిదండ్రులు నిశ్చయించి ఈ విషయముమృగశృంగునితో చెప్పిరి. మృగశృంగుడు వారిమాట లాలకించి ఇట్లుపలికెను, “పూజ్యులగు తల్లిదండ్రులారా! నా వివాహ విషయమై మీరు తలపెట్టిన కార్యము వివరించితిరి. ఐననూ నా అభిప్రాయముగూడ ఆలకింపుడు. అన్ని ఆశ్రమాలకంటే గృహస్థాశ్రమము మంచిదని దైవజ్ఞులు నుడివిరి. అయినను అందరూ ఆ సుఖమును పొందలేకున్నారు, దానికి కారణమేమనగా, ప్రతిపురుషునకు తనకనుకూలవతి యగు భార్య లభించినప్పుడే గృహాస్థాశ్రమము యొక్క ఫలితము సిద్ధించును. దానికి ఉదాహరణగా స్త్రీ యెటులుండవలయుననగా-
శ్లో: కార్యేషు దాసీ - కరణేషు మంత్రీ |
శయనేషు రంభ - క్షమయా ధరిత్రీ ॥
అని పెద్దలు స్త్రీనిగురించి వర్ణించియున్నారు. అనగా యింటి పనులలో దాసీవలెను, రాచ కార్యములలో భర్తకు సహాయ కారిగాను, శయన మందిరములో రంభవలెను. శాంత స్వభావములో భూదేవివలెను స్త్రీ వ్యవహరించవలెను.
అంతియేగాక చతుర్విధ పురుపార్ధములయిన ధర్మము, అర్థము, కామము, మోక్షము అని నాలుగు పురుషార్థములలో మోక్షము ప్రధానమైనది. అటువంటి మోక్షము సాధింపనెంచిన మిగతా మూడున్నూ అనవనరము. ధర్మాన్ని, అర్థాన్ని మనుజుడు ఏ విధంగా సాధించునో కామమును గూడా అట్లే సాధించవలయును.
ప్రతి మానవుడు వివాహముచేసుకొనే ముందు కన్యయొక్క గుణగణములు తెలుసుకోవలయును. జీవితసుఖములలో భార్య ప్రధానమైనది, కనుక గుణవంతురాలగు భార్యను పొందుటకన్న మరొక
స్వర్గము లేదు.
గుణవతియగు పత్నితో కాపురము చేసిన ఆ సంసారము స్వర్గతుల్యముగా నుండుటయేగాక అట్టి మనుజుడు ధర్మ-అర్థ - కామ- మోక్షముల నవలీలగా సాధించగలడు.
భార్య గయ్యాళి, వినయవిధేయతలు లేనిదై యున్నచో నాభర్త నరకమును బోలిన కష్టములనుభవించుచు మరల నరక కూవమునే కే పోగలడు. గనుక పెండ్లి చేసుకొనుటకు ముందు స్త్రీని అనేక విధములుగా పరిశీలించి వివాహమాడవలెను. అదెటులనకన్య ఆరోగ్యవతియై యే విధమైన రోగ[గస్తురాలై వుండకూడదు. ఎంత అందమయినదైననూ మంచి కుటుంబములోని కన్యయై యుండవలెను. బంధు మర్యాదలు తెలిసి విద్యావంతురాలయి, దేవ బ్రహ్మణులను పూజించునాదియై. అత్తమామల మాటలకు జవదాటనిదై యుండవలెను.
ఈ నీతులన్నీ మునుపు అగస్త్యమహాముని చెప్పియున్నారు. గాన ఆటువంటి గుణవంతురాలగు కన్యనే ఎంచుకొనవలయును. ఆయినా ఆ దెటుల సాధ్యవడును? అని మృగశృంగుడు తల్లిదండ్రులతో తన మనస్సులోనున్న సంశయములను తెలియజేసెను. కుమారుని మాటలకు తండ్రి సంతోషించి ఇట్లు పలికెను.
"కుమారా! నీ మాటలు నాకెంతయో సంతోషమును కలిగించినవి. వయస్సులో చిన్న వాడవయిననూ మంచి నీతులు నేర్చుకొన్నావు. నీయభీష్టం నెరవేరవలయునన్న నా దీనదయాళుడగు శ్రీ మన్నారాయణుడే తీర్చగలడు. భగవంతునిపై భారం వేయుము" అని పలికెను.
Sarva Siddhi Matangi Raja Matangi - సర్వసిద్ది మాతంగి రాజ మాతంగి
శ్యామల నవరాత్రులలో ఐదవ రోజు సర్వసిద్ది మాతంగి రాజ మాతంగి
మాతంగముని కుమార్తె కాబట్టి ఈమె మాతంగి అయినది. శివ సహస్రనామ స్తోత్రములో శివుడికి మతంగుడనే పేరుంది. మతంగుడి శక్తి కాబట్టి మాతంగి. మరకత వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగీదేవి వశీకరణ దేవతగా ప్రశస్తి పొందినది.
మాతంగీ దేవిని రాజమాతంగి, సుముఖి, కర్ణ మాతంగి, వశ్యమాతంగి, లఘు శ్యామలా, ఉచ్చిష్ట చండాలి అనే పేర్లతో కూడా పిలుస్తుంటారు. ఈ దివ్య స్వరూపిణి ఉసాసనవల్ల వాక్సిద్ధి, సకల రాజ స్త్రీ పురుష వశీకరణాశక్తి, ఐశ్వర్య ప్రాప్తి సాధకుడికి లభిస్తాయి. సరస్వతీ దేవి యొక్క తాంత్రిక అవతారంగా మాతంగి పిలువబడుతుంది. సరస్వతి దేవివలెనే మాతంగి అమ్మవారికి కూడా సంగీతము, సాహిత్యము, వాగ్దాటి మరియు లలిత కళలకు అధినాయికగా గుర్తింపు పొందింది. ఈఅమ్మవారిని ఆరాధించటం వలన సూర్య గ్రహ దోషాలు శాంతిస్తాయి.
పచ్చలు, చిలుకల వంటి పచ్చగా, రత్న సింహాసనంపై కూర్చొని, ఎర్రని వస్త్రాలు ఆభరణాలు ధరించి, గుంజ మాలతో అలంకరించబడి, శంఖంతో చేసిన చెవి పోగులు ధరించి, ఖడ్గము, పాశము, బల్లెము మరియు అంకుశము ధరించి మనకు దర్శనమిస్తుంది. పురుషార్థ ప్రదములైన సిద్ధులకు, గృహస్తా శ్రమములో జీవితం సుఖమయం. కావటం కోసం అమ్మ ఆరాధన అత్యంత శ్రేయస్కరం.
మత్తెక్కించే ఎర్రటి కళ్ళతో ఆనందంగా ఎప్పుడూ వీణ వాయిస్తూ ఉంటుంది.అక్ష్యవక్ష్యే మహాదేవీం మాతంగీం సర్వసిద్ధిదాం ।
అస్యాః సేవన మాత్రేణ వాక్సిద్ధిం లభతే ధృవం ॥
వాక్సిద్ది కోసం పై శ్లోకాన్ని పఠిస్తే ఉత్తమం. అమ్మ పూర్ణరూపం వాగ్దేవియే. అమ్మ మూడు నేత్రాలు సోమసూర్యాగ్నులకు ప్రతీకలు. అమ్మవారి నాలుగు భుజాలు నాలుగు వేదాలకు, పాశము అవిద్యకు, అంకుశము విద్యకు ప్రతీకలు. పాశము కర్మరాశికి, శబ్దస్పర్శరస రూపగంధాలు పంచభూతాత్మక సృష్టికి, కదంబ వనము బ్రహ్మాండానికి ప్రతీకలు.
ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్
భావము: ఆశ్రయము (ఊతం) ఇచ్చి భద్రంగా చూసే విష్ణురూప (సుభద్ర) రుద్రకామినీ ఉచ్చిష్ట చండాలినిగా పేరుపొందావు. ఎరుపు వస్త్రములతో ఆభరణములతో కాంతివంతముగా కప్పుకున్న (సంపుటి) నాలుగు బాహువులు గల సరస్వతీ. నృత్య నాట్య సంగీత వాచకములకు నిధివి, ఐకమత్య బోధకురాలివి కడు పూజనీయురాలివి. ఓ మాతంగీ! ఆకుపచ్చ రంగులో శోభిల్లు బుద్ధిమంతురాలివి, ఆ లలితా మాతకు ప్రధానమంత్రిగా సంచాలకము చేస్తున్నావు అట్టి నీకు నమస్మారములు!
హిమవంతుని స్నేహితుడైన మతంగముని శ్యామలా ఉపాసకుడు. మతంగముని పత్నిని ఆకుపచ్చని శరీరకాంతితో, పద్మధారియై మాతంగి స్వప్న సాక్షాత్కారమును అనుగ్రహించెను. నిరంతర, అకుంఠితసాధనతో తల్లిని పుత్రికగా పొందగలిగెను. తత్ఫలితముగా బ్రహ్మాండ సంకేతమైన కదంబ వనములో మతంగముని ధ్యానాసక్తుడైయున్న సమయమున బ్రహ్మాండమను కదంబ వనమున ప్రసన్నవదనయై, మందస్మితముతో తల్లి సాక్షాత్మరించినది.
శక్తి సమాగమ తంత్రాను సారము లక్ష్మీనారాయణులు పార్వతీపరమేశ్వరులకు భక్తిప్రపత్తులతో మహానైవేద్యమును సమర్పించగా, కరుణతో స్వీకరించుచున్న సమయమున కొన్ని మెతుకులు క్రిందకు జారి, వాని నుండి ఒక అందమైన కన్య ఆవిర్భవించినదట. విపరీతమైన ఆకలితో ఉన్న ఆ కన్య, వారు భుజించగా మిగిలిన నైవేద్యమును భుజించి, ఉచ్చిష్ట చండికగా ప్రసిద్ధి చెందినది.
మత్స్య పురాణము ప్రకారము అంధకాసుర రుధిర పానార్థమై పార్వతీ దేవి తనశరీరము నుండి కౌశికీ దేవిని ఉత్పన్నము చేసినదట. మాతృ రూపిణియైన గౌరీదేవి దేహము నుండి ఉత్పన్నమైన కారణమున ఈమెను మాతంగి అంటారు.
మహాభారత కథనం ప్రకారం ఒక బ్రాహ్మణ స్త్రీకి, మంగలి యువకుడికి పుట్టినవాడు మాతంగుడని, ఇలా వర్ణసాంకర్యతో పుట్టిన మాతంగుడు జాతిపరంగా చండాలుడైనాడని, జన్మ సంస్కారం వల్ల ఎంతో తపస్సు చేసి ఇంద్రుడి వరంతో చండదేవుడు అనే పేరు పొందాడని, శ్యామలాదేవి ఇతని భార్య గర్భాన జన్మించిందని, ఇలా చండాలుడుకి జన్మించినందున చాండాలిగా, మాతంగుడి కుమార్తె గనుక మాతంగిగా, లోకంలో ఈ దేవి ప్రసిద్ధి పొందిందని తెలుస్తోంది.
అసురీ శక్తులను అంతమొందించు యుద్ధమున పరమేశ్వరి తన శరీరము నుండి ఒక అద్భుత శక్తిని ఆవిర్భవింపచేసి, సేనలకు ప్రధాన మంత్రిణిగా నియమిస్తు, తనచేతి ముద్రికను తొడిగినదని, యుద్ధమున తల్లి విషంగుడు అను రాక్షసుని అంతమొందించిన కథనము కూడా కలదు. మాతంగిని ముద్రికాదేవిగా కూడ ఆరాధిస్తారు.
అశుభములలో, అశుభ్రతలో మిళితమైన కాలుష్యశక్తిగా భావించి, మాతంగిని చండాలికగా పిలుస్తారు. చండాలిక విషయ వాసనలు అంట లేనిదే కాని మనము అంటరాని మాత కాదు. ఉగ్ర మాతంగిగా ఘోర రూపియై, శవసింహాసనయై, ఒక చేత పురైతో అరణ్య నివాసినిగా సంచరిస్తుంటుంది.
శ్యామలాదేవిగా మరకత మణివర్ణముతో, పద్మాసనస్థితయై, పద్మమును, కెంపులుపొదిగిన వీణను ధరించి, ఎర్రని వస్త్రములతో, ఎర్రని ఆభరణములతో ఎర్రని పూలమాలలతో వాక్శక్తియై అనుగ్ర హిస్తుంది.
రాజమాతంగిగా నాదస్వరూపమైన వీణను చేత ధరించి, చిలుకలకు పలుకులు నేర్పుతూ, సంగీత, సాహిత్యమనే ఘన స్తనములతో, చతుషష్టి కళారూపిణియై ఉంటుంది.
ధ్యాన మాతంగిగా నీలివర్ణముతో కదంబ మాలను ధరించి, సృష్టి- స్థితి-లయములను నడుము క్రింది మూడు వళులతో (ముడుతలతో) మూడు లోకములను ఏలుతుంటుంది. సర్వ వర్ణోపశోభిత సర్వశక్తి సమన్విత అయిన మాతంగిమాత.
మోహరాత్రియైన మాతంగి మతంగుడు అను శివశక్తిని కలుపుకొని పరిపూర్ణమవుతుంది. శ్రావణ బహుళ అష్టమి బుద్దావతారముగా భావించే తల్లికి ప్రీతిపాత్రము. మూలబిందువు నుండి వాయవ్యదిశకు విస్తరిస్తుంది. వాక్శక్తి మంత్ర శక్తియెన తల్లి సర్వతంత్రిణి.
సౌమ్యరూపియై ఉన్నప్పుడు చెరుకు విల్లు, పూలబాణములు, చిలుకను, వీణను ధరించి ఉంటుంది. ఘోర రూపియైన మాతంగి పాశాంకుశములను, దండము కృపాణమును, కపాలమును, ఖట్వాంగమును ఆయుధములుగా ధరించి ఉంటుంది.
శరీరములోని విశుద్ధి చక్రము మాతంగి నివాస స్థానము. త్రికోణము మాతంగి నివాస స్థానము. సూక్ష్మ రూపములో యంత్రముగాను, స్టూలములో మూర్తిగాను చతుషష్టి కళలలో ప్రకటితమవుతుంది. వాక్కు గాను ప్రకటింపబడుతుంటుంది. మేరు దండములా ఉన్న మన వెన్నెముకలో, తిరగబడిన ఆడ ఏనుగు తొండమువలె మాతంగి నివసిస్తుంది. తృతీయనేత్ర స్థానము నుండి బయలుదేరిన శక్తిని జిహ్వాగ్రమునకు చేర్చే సరస్వతీ నాడి యందు మాతంగి నివసిస్తుంది. శరీర మందలి విశుద్ధి చక్రములోను మాతంగి మాత నివాసం ఉంటుంది.
అవ్యాజ కరుణామూర్తి పాదపద్మములకు సవినయ సమర్పణము చేయుచున్న మహాకవి కాళిదాసును అనుగ్రహించుటకు అడ్డుపడుతున్న అతపి ఏడుజన్మల పాపరాశులను కాళిసతి ద్వారా ఆ ఏడు జన్మల పాపములను ఏడు క్షణములుగా మార్చి సరస్వతీ తత్త్వముతో బీజాక్షరమును అనుగ్రహించిన విధానము కూడా కనుపించుచున్నది.
ఓమ్ మాతంగ్యైచ విద్మహే
ఉచ్చిష్ఠ ఛాండాళ్యైచ ధీమహి
తన్నో దేవీ ప్రచోదయాత్ !!
ఈమెను ఉచ్చిష్ట ఛండాలిని లేద ఉచ్చిష్ట మాతంగిని అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉచ్చిష్ట అనగా మిగిలిపోయినది అని. ఈమెకు నైవేద్యంగా మిగిలిపోయిన లేదా సగం తిన్న ఆహారంను పెడతారు. సహజంగ భగవంతునికి శుభ్రమైన పదార్థములను నైవేద్యంగా సమర్పిస్తాము కానీ, మాతంగి అమ్మవారికి అపరిశుభ్రమైన పదార్థములను నైవేద్యంగా సమర్పిస్తారు. అందుకే ఈ అమ్మవారు అపరిశుభ్రతతో ముడిపడి ఉంటుంది.
ఈమెను పూజించిన వారికి అమితమైన శక్తులు సిధ్ధిస్తాయి. ముఖ్యంగ శత్రువులపై నియంత్రణ ఉంటుంది. అందరినీ ఆకట్టుకునే శక్తి లభ్యమవుతుంది. లలిత కళలపై అపారమైన పట్టు సాధ్యమవుతుంది. ఈమె చిక్కటి అందమైన కనుబొమ్మలతో, కలువ పువ్వుల్లాంటి మూడు
కన్నులతో, అలంకరించబడ్డ సింహాసనంపై ఆసీనురాలై ఉంటుంది. ఈ మాతంగి చుట్టూ వివిధ దేవతలు ఆమెకు సపరిచర్యలు చేస్తూ ఉంటారు. ఈమె నాలుగు హస్తాలలో పాశము, ఖడ్గము, డాలు, అంకుశము ఉంటాయి. ఈమె ఆకుపచ్చని వర్ణంలో ఎంతో సౌందర్యవతిగా ఉంటుంది.
మాతంగి రూపాలలో అత్యంత ప్రజాదరణ కలిగిన దేవత అయిన ఉచ్చిష్ట మాతంగి రూపం శవం మీద కూర్చుని, ఎర్రటి వస్త్రాలు ఎర్ర ఆభరణాలు, గురివింద విత్తనాల దండను ధరించి ఉంటుంది. గుండ్రంగా, పెద్దవిగా ఉన్న వక్షోజాలతో దేవత రూపం పదహారేళ్ళ కన్యగా వర్ణించ బడింది. ఆమె తన రెండు చేతుల్లో పుర్రె, కత్తిని ధరిస్తుంది. మిగిలిపోయిన ఆహార పదార్థాలను అమ్మవారికి నైవేద్యంగా పెడతారు.
తంత్రసార ధ్యాన మంత్రాల ప్రకారం మాతంగి రూపం నీలి రంగులో ఉంటుంది. నెలవంక ఆకారంలో చంద్రుడు ఆమె నుదిటిని అలంకరిస్తాడు. మూడు కళ్ళతో, నవ్వు మొహంతో ఆమె రూపం ఉంటుంది. ఆమె రకరకాల నగలు ధరించి, ఆభరణాలతో తయారు చేయబడిన సింహాసనంపై కూర్చొని ఉంటుంది. ఆమె నాలుగు చేతుల్లోని ఒక చేతిలో ఉచ్చు, మిగిలిన చేతులలో కత్తి, మేక, ఒక కర్రను కలిగి ఉంది. ఆమె నడుము సన్నగా ఉండి వక్షోజాలు బాగా అభివృద్ధి చెందిన రూపంలో మనకు మాతంగి అమ్మవారు దర్శనమిస్తారు.
పురశ్చర్యర్ణవము నుండి గ్రహించిన ధ్యాన మంత్రం ప్రకారం మాతంగి ఆకుపచ్చ రంగులోని దేహంతో నుదుటి పైన చంద్రవంకతో ఉంటుంది. పొడవాటి జుట్టుతో, పెదవులపైనా నవ్వుతో, మత్తు కళ్ళు కలిగి ఉండి కదంబ పువ్వులతో తయారు చేసిన పూలమాలతో, వివిధ ఆభరణాల దండలను ధరించి ఉంటుంది. ఆమె ముఖం చుట్టూ కొద్దిగా పట్టిన చెమటలు ఆమెకు మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. ఆమె నాభి క్రింద ఉన్న చర్మం పైన యొక్క మూడు క్షితిజ సమాంతర మడతలు అందంగా కనిపిస్తుంటాయి. బలిపీఠం మీద కూర్చుని, రెండు చిలుకలతో చుట్టుముట్ట
బడిన ఆమె చతుష్షష్టి కళలకు నిలువెత్తు రూపంగా కనిపిస్తుంటుంది.
శారదతిలకము ప్రకారం రాజ మాతంగి మాత వీణ వాయిస్తూ, శంఖాలను, గవ్వలను చెవిపోగులుగా ధరించి, పూల దండలతో దర్శన మిస్తుంది. పూల చిత్రాలను ఆమె నుదిటిపై కలిగి ఉంటుంది. ఆమె తెల్లటి తామర దండను ధరించిన రూపంలో చిత్రీకరించబడింది.
కాళిదాసు యొక్క శ్యామలదండకంలో వర్ణించిన ప్రకారం, మాతంగి రత్న ఖచితమైన వీణ మీటుతూ ఉంటుంది. తియ్యగా మాట్లాడుతుంది. చిక్కటి పచ్చరంగు, ఎర్ర కుంకుమపొడితో అభిషేకించబడిన రొమ్ములతో, నుదిటిపై నెలవంక చంద్రునితో, నాలుగు చేతులలో ఆయుధాలు ధరించి ఉంటుంది. ఆమె నాలుగు చేతులలో ఉచ్చు, మేక, చెరకువిల్లు, పూల బాణాలను కలిగి ఉంటుంది. ఈ ఆయుధాలనే త్రిపుర సుందరి దేవత కూడా ధరించి ఉంటుంది. మాతంగి మాత చిలుకను ప్రేమిస్తుందని గానమును ఎంతగానో ఇష్టపడుతుందనీ కూడా వివరించబడింది.
శ్యామలాదేవి (మాతంగి)ని కూడా కాళీదేవి యొక్క శ్యామకాళి రూపంగా భావించడం కనిపిస్తుంది. మహాకవి కాళిదాసు ఆమె రూపాన్ని వర్ణిస్తూ “మాతా మరకత శ్యామా... మాతంగీ మధుశాలినీ” అన్నాడు. అంటే.. శ్యామలాదేవి నల్లని వర్ణం కలిసిన మరకత (ఆకుపచ్చ) వర్ణంతో ప్రకాశిస్తుందిట. అందుకని మతంగ మహర్షి దర్శించిన శ్యామలా స్వరూపాన్ని కూడా శ్యామకాళిగా ఉపాసించడం కనిపిస్తుంది. శ్యామకాళిని ఉపాసిస్తే ఆ తల్లి ప్రేమ శక్తిని ప్రసాదిస్తుంది. సృష్టి రహస్యాన్ని కాలస్వరూపాన్ని తెలిసేటట్లుగా చేస్తుంది.
మాతంగి అనే పదానికి ఆడ ఏనుగు అనే అర్ధం కూడా ఉంది. ఏనుగు గణపతి రూపానికి సంకేతం. గణపతి అంటే విజ్ఞానానికి, విద్యకి ప్రతీక. మాతంగీ దేవి కూడా విద్యకి, విజ్ఞానానికి ప్రతీక. కనుక మాతంగీ అంటే విద్యా ప్రదాయిని అని కొందరు పండితులు చెప్తారు.
ఒకచేత మధుపాత్ర ధరించి, ఇంకోచేత చిలకను ధరించి, మధ్య పానముచే కైపెక్కిన కన్నులు కలిగి, చెవులకు శంఖాభరణములు ధరించి స్థన భారము చేత వీణ వాయిస్తూ, జుట్టు విరబోసుకుని వుండే దేవత “మాతంగి” మరియు “శ్యామల దేవి”. మాత ముఖ్య లక్షణము సర్వజన వశీకరణము. మాతంగి దేవత మరకత వర్ణము, ఈ మాతని ఉపాసించే వారికి సకల జనులు, రాజు, అధికార గణం వశీకృతులై ఉంటారని అంటారు.
శ్రీ రాజామాతంగి దేవిని ఉపాసించేవారికి జన వశీకరణ, ధన వశీకరణ, రాజ్యాధికార ప్రాప్తి, ఉన్నత ఉద్యోగములు, అధికార పదవులు ఈ తల్లి అవలీలగా ప్రసాదిస్తుంది. ఉద్యోగము ఉన్నతపదవులు కోరుకునే వారు ఈ తల్లిని ఆశ్రయించడం శుభకరం. ఆరోగ్యము అష్ట ఐశ్వర్యములు సంగీతము సాహిత్యాన్ని ఈ తల్లి ప్రసాదిస్తుంది. ఈ తల్లిని ప్రసన్నం చేసుకొనిన మహాకవి కాళిదాసు, తెనాలి రామలింగ కవి మొదలగు ఎందరో బహుదా కీర్తిని ఉన్నత స్థితిని పొందారు.
ఈ దేవిని వామాచారమార్గంలో దక్షిణాచారమార్గంలో కూడా ఉపాసించవచ్చు. సాధకుడు దేవతా వర్ణమైన చిలక పచ్చరంగు వస్త్రాలను గానీ, ఎర్రని వస్త్రాలను గానీ ధరించాలి. చిలకపచ్చ లేక ఎర్రని పూసల మాలను జపానికి ఉపయోగించాలి. అలాగే ఆసనం కూడా ఇదే రంగుల్లో ఉండాలి. ఇలా ఉచ్చిష్ట మాతంగీ దేవిని గానీ, ఆదేవి ఇతర రూపాలైన శ్రీరాజమాతంగీ, లఘుశ్యామలా, సుముఖీదేవి మంత్రాలనిగానీ నియమ పూరితంగా భక్తిశ్రద్ధలతో ఆచరిస్తే విద్య, ఐశ్వర్యం, గొప్ప వశీకరణ శక్తి సాధకుడికి లభిస్తాయని వివరిస్తారు.
Vasant Panchami - వసంత పంచమి
మాఘ శుద్ధ పంచమిని వసంత పంచమి అని కూడా అంటారు. దీనిని శ్రీ పంచమి అని మదన పంచమి అని కూడా అంటారు. మాఘశుద్ధ పంచమి సరస్వతీదేవి జన్మించిన రోజు. ఈ పండుగ యావత్ హిందూ జాతి విశేషముగా జరుపుకుంటారు. ఈ రోజు సరస్వతి దేవికి పూజ చేయవలెను.
వసంత పంచమి విశిష్టత
సరస్వతీదేవిని మాఘ పంచమి నాడు శ్రీ పంచమి పేరిట ఆరాధిస్తారు. సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఈ రోజున ఆరాధిస్తారు. సంగీత నృత్యసాహిత్యాలకు కూడా ఈ దేవీ యే మూలం కనుక ఈ తల్లిని నృత్యకేళీవిలాసాలతో స్తుతిస్తారు. ఈ తల్లిని జ్ఞానప్రాప్తి కోసం ఆరాధించమని బ్రహ్మవైవర్తపురాణం చెప్తోంది. ఈ శ్రీ పంచమినాడు సరస్వతిని ఆరాధించే విధివిధానాలను నారదునకు శ్రీమన్నారాయణుడు వివరించినట్లు దేవీ భాగవతం చెప్తోంది.
మాఘమాసం శిశిరఋతువులో వసంతుని స్వాగతచిహ్నమూగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడు కనుక వసంతుని, ప్రేమను కలిగించేవాడు మదనుడు కనుక మదనుణ్ణి, అనురాగ వల్లి అయిన రతీదేవిని ఆరాధన చేయటం కూడా శ్రీపంచమినాడే కనబడుతుంది. వీరి ముగ్గురిని పూజించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలుగుతాయి. దానివల్ల జ్ఞాన ప్రవాహాలు ఏర్పడుతాయి.
అమ్మ దగ్గర అక్షరాభ్యాసం చేయస్తే పిల్లలు జ్ఞాన రాశులు అవుతారు. సరస్వతి ఆరాధన వల్ల వాక్సుద్ధి కలుగుతుంది. అమ్మ కరుణతో సద్భుద్ధినీ పొందుతారు. మేధ, ఆలోచన, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే శారదాదేవి. అందుకే ఈ దేవిని శివానుజ అని పిలుస్తారు.
ప్రతిరోజూగాని, పంచమినాడు సప్తమి తిథులలో కాని, సరస్వతీ జన్మనక్షత్రం రోజు గాని పూజించిన వారికి ఆ తల్లి కరుణాకటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి. అహింసకు అధినాయిక సరస్వతిదేవి. సరః అంటే కాంతి. కాంతినిచ్చేది కనుక సరస్వతి అయింది. అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరం చేసి విజ్ఞాన కాంతికిరణ పుంజాన్ని వెదజల్లే దేవత సరస్వతీ.
ఈ అహింసామూర్తి తెల్లని పద్మములో ఆసీనురాలై వీణ, పుస్తకం, జపమాల, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. అహింసామూర్తి కనుకనే ఈ తల్లి చేతిలో ఎటువంటి ఆయుధాలు ఉండవు. జ్ఞానకాంతిని పొందినవారికి ఆయుధాల అవసరం ఏమీ వుండదు.
‘‘వాగేశ్వరీ, మహాసరస్వతి, సిద్ధసరస్వతి, నీలసరస్వతి, ధారణ సరస్వతి, పరాసరస్వతి, బాలాసరస్వతి’’ ఇలా అనేక నామాలున్నప్పటికీ ‘‘సామాంపాతు సరస్వతీ ’’ అని పూజించే వారు ఆ తల్లికి ఎక్కువ ప్రేమపాత్రులట.
సరస్వతీ దేవిని ఆవాహనాది షోడశోపచారాలతో పూజించి సర్వవేళలా సర్వావ స్థలయందు నాతోనే ఉండుమని ప్రార్థిస్తారు. వ్యాసవాల్మీకాదులు కూడా ఈ తల్లి అనుగ్రహంతోనే వేదవిభజన చేయడం, పురాణాలు, గ్రంథాలు, కావ్యాలు రచించడం జరిగిందంటారు. పూర్వం అశ్వలాయనుడు, ఆదిశంకరాచార్యులు కూడా ఈ తల్లిని ఆరాధించి ఉన్నారు.
చంద్రుని ప్రభావంతో ఈ కర్కాటక రాశి వారు మనశ్శాంతిని పొందుతారు. ఇక ఈ రాశి వారు తూర్పు ముఖంగా కూర్చుని "ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై సరస్వత్యై నమః" అనే మంత్రాన్ని పఠించాలి. దీని వల్ల మానసిక అశాంతి తొలగిపోయి, మానసిక స్థిరత్వం, ఆరోగ్యం మెరుగుపడతాయి.
సూర్యుడి ప్రభావంతో సింహ రాశి వాళ్లకు నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఈ రాశి వాళ్లు "ఓం హ్రం హ్రీం హ్రూ సహ్ సూర్య సరస్వత్యై నమః" మంత్రాన్ని పఠించాలి. అంతే కాకుండా వీళ్లు పసుపు రంగు వస్త్రాలు ధరించి తూర్పు ముఖంగా కూర్చొని ఈ మంత్రాన్ని పఠించాలి. దీని వల్ల నాయకత్వ సామర్థ్యం, పనుల్లో విజయం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
కన్యా రాశి వాళ్లు బుధుడి ప్రభావంతో విశ్లేషణాత్మకంగా ఆలోచనలు పెరుగుతాయి. ఈ రాశి వాళ్లు "ఓం బుం బుద్ధయే సరస్వత్యై నమః" మంత్రాన్ని పఠించాలి. ఈ రాశి వాళ్లు ఆకుపచ్చ దుస్తులు ధరించి ఉత్తర దిశలో కూర్చుని ఈ మంత్రాన్ని పఠించాలి. దీని వల్ల విజయం, ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి, తెలివితేటలు పెరుగుతాయి.
తులా రాశి వాళ్లు శుక్రుడి ప్రభావంతో కళల్లో విజయం చేకూరుతుంది. ఈ రాశి వాళ్లు
ధనుస్సు రాశి వారు బృహస్పతి ప్రభావంతో బాగా జ్ఞానవంతులుగా మారుతారట. ఈ రాశి వాళ్లు
మకర రాశి వాళ్లకి శని ప్రభావంతో క్రమశిక్షణ అలవడుతుంది. ఈ రాశి వాళ్లు
కుంభ రాశి వాళ్లు శని ప్రభావంతో వినూత్న ఆలోచనలకు విశేషంగా ప్రాధాన్యం ఇస్తారు. ఈ రాశి వాళ్లు "ఓం శ్యం శనిశ్చరాయ సరస్వత్యై నమః" మంత్రాన్ని వసంత పంచమి రోజున పఠించాలి. ఈ రాశి వాళ్లు కొత్త ఆలోచనలు తీసుకోవడం, విజయం సాధించడం, సాంకేతిక రంగంలో పురోగతి సాధించడం జరుగుతుంది.
మీన రాశి వాళ్లు బృహస్పతి ప్రభావంతో ఊహాశక్తి, భావోద్వేగాలు బాగా ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశి వాళ్లు "ఓం బృహస్పతయే సరస్వత్యై నమః" అనే మంత్రాన్ని పఠించాలి. దీని వల్ల పనుల్లో విజయం, ఆధ్యాత్మిక ఎదుగుదల, సృజనాత్మకతకు సంబంధించిన రంగాల్లో విజయం వరిస్తుంది.
Sri Hasamtika Devi - శ్రీ హాసంతిక
శ్యామలా ఉపాసకులు వారు సాధన చేసే ప్రతిసారీ, వారు ముందుగా హాసంతిక దేవిని ప్రార్థించేవారు. ఆమె రూపం ముదురు గడ్డి మరియు నీలి నీలమణి రాళ్ల లాగా ఆకుపచ్చ మరియు నీలం మిశ్రమంగా ఉంటుంది.సంతోషకరమైనదిగా చేయడం ద్వారా అందరికి సహాయం చేస్తుంది.
ఆమె బంగారు జాకెట్టు మరియు మోకాళ్ల వరకు ఎర్రటి వస్త్రాన్ని ధరించిందని చెబుతారు. ఆమె శ్యామలా దేవి యొక్క పరిచారిక అని చెప్పబడింది. ఆమె చిరునవ్వు మరియు ఆనందానికి దేవత.
ఆమె ప్రతి సాధకునికి సాధనలో ఉన్న అన్ని అడ్డంకులను తొలగించి, వారి మార్గాన్ని సులభతరం చేయడం మరియు సంతోషకరమైనదిగా చేయడం ద్వారా వారికి మరియు శ్యామలాంబిక యొక్క దైవిక అనుగ్రహాన్ని పొందేలా చేస్తుంది.
ఆమె శ్యామలకి సేవకురాలిగా కష్టపడి పని చేస్తుందని చెబుతారు, అయితే ఆమె శ్యామలా రూపమే అయినా ఈ రూపంలో ఆమె సేవ, భక్తి సాధన మరియు కృషి యొక్క ఫలాలు ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇస్తాయి అన్న తత్వాన్ని చూపుతుంది ఈ హాసంతిక శ్యామలాదేవి.
శ్రీ హాసంతిక శ్యామల దేవి నమో నమః
Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య
న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః । ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...