Wednesday, February 4, 2026

Magha Puranam 30 - మాఘ పురాణం 30 ఫలశృతి

మాఘ పురాణం - 30 వ అధ్యాయం

ఫలశృతి

సూతమహర్షి శౌనకాదిమునులతో ఇట్లు పలికిరి-"సనకాది మునులారా! ఇంతవరకు మాఘమాస మాహాత్మ్యము, మాఘస్నానము వలన కలిగేడు ఫలమును, వశిష్ఠులవారు దిలీపునకు తెలియచేసిన విధమును మీకు వివరించితిని. మీరు తలపెట్టిన ఈ పండ్రెండు సంవత్సరముల మహాయజ్ఞము కూడా పూర్తికావస్తున్నది. రేపటిదినము మాఘమాసపు ఆఖరి దినము గాన మనమందరం గంగా నదికి పోయి స్నాన మాచరించి విష్ణువుని పూజింతుము రండి అని సూతమహాముని మాఘపురాణం చెప్పుట పూర్తి గావించిరి.

మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందు వుండగా సూర్యోదయం అయిన తరువాత నదిలో స్నానము చేయవలయును. ఆటు తర్వాత సూర్యునకు నమస్కరించి, వైష్ణవాలయమునకు పోయి
శ్రీమన్నారాయణుని పూజింపవలయును. మాఘమాసము యొక్క నెల దినములున్నూ ఈ విధముగా ఆచరించిన యెడల సకలైశ్వర్యములు, పుత్రపౌత్రాభివృద్ది కలిగి జన్మాంతమున వైకుంఠ ప్రాప్తి కలుగును.

No comments:

Post a Comment

Magha Puranam 28 - మాఘ పురాణం 28 బ్రహ్మ, ఈశ్వరుడు, శ్రీమహావిష్ణువును పూజించుట

మాఘ పురాణం - 28 వ అధ్యాయం బ్రహ్మ, ఈశ్వరుడు, శ్రీమహావిష్ణువును పూజించుట వశిష్ఠుడు దిలిపునితో మరల ఇట్లు వివరించెను. రాజా! ఒకప్పుడు బ్రహ్మ, ఈ...