సహస్ర కవచుడు (వేయి కవచాలు కలవాడు)
ఇతను పుట్టుకతోనే వేయి కవచాలను కలిగి జన్మించాడు. ఒక కవచాన్ని ఛేదించిన తర్వాత 1000 సంవత్సరాల తపస్సు చేసి, మరో కవచాన్ని ఛేదించే వ్యక్తి మాత్రమే ఇతన్ని చంపగలరనే వరం ఈశ్వరుడి నుంచి పొందాడు. నరనారాయణులు ఇతనిని వధించారు, ఈ రాక్షసుడే కర్ణుడిగా జన్మించాడని చెబుతారు.
ఈ రాక్షసుడు ఋషి కుమారులను, సజ్జనులను బాధిస్తూ ఉంటాడు.
హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి రెండురూపాలుగా విడిపోయాడు. నర రూపం 'నరుని’గానూ, ‘సింహ’ రూపం నారాయణుని’గా దక్షప్రజాపతి కుమార్తె మూర్తికి, ధర్ముడు అనే ప్రజాపతికి నర నారాయణులు జన్మించారు. వీరు పుట్టగానే బదరికాశ్రమానికి వెళ్లి తపస్సు ఆచరించారు. లోక కళ్యాణాన్ని సమకూర్చి అన్ని ఫలాలను అందించేది, పాపాలను పోగొట్టేది తపస్సే అని లోకానికి బోధించారు. అరణ్యంలో నిద్రాహారాలు మాని శరీరాన్ని, మనసును శుష్కింపజేసుకునేది మాత్రమే తపస్సు కాదని, నిత్య జీవితంలో మనం బాగా ఇష్టపడి అనుభవిస్తున్న వాటిని ఏ కొద్దిగా తగ్గించుకున్నా తపస్సే అని లోకానికి బోధించారు.
తపో భంగం కలిగించడానికి ఇంద్రుడు పంపిన రంభ, మేనక, తిలోత్తమ లాంటి అప్సరసల అందం ఏమాత్రమని తమ ఉరువు నుంచి అతిలోక సౌందర్యరాశి ఊర్వశిని సృష్టించి ఇంద్రునికి కానుకగా పంపారు. అపకారం చేసిన వారికి ఉపకారం చేసి, కోరికను గెలిచినవాడు కాదు కోపాన్ని జయించిన వాడే దేవుడని లోకానికి నర నారాయణులు ధర్మసూక్ష్మాన్ని బోధించారు.

ఆ సమయంలో వరగర్వాంధుడైన సహస్రకవచుడు’ వారిదగ్గరకు వచ్చి, వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు నారాయణుడు అతనితో ‘రాక్షసేశ్వరా..నీ సమరోత్సాహం మాకు ఆనందం కలిగించింది. కానీ, మేమిద్దరం కలిసి నీ ఒక్కనితో యుద్ధం చెయ్యడం ధర్మం కాదు. కనుక, మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తూంటే మరొకడు తపస్సు చేసుకుంటాడు. అతని తపస్సుకు ఎలాంటి అంతరాయం కలుగకూడదు. ఇందుకు నీకు సమ్మతమైతే యుద్ధం చేస్తాను’ అన్నాడు.
సహస్రకవచుడు ఈ ఒప్పందానికి సమ్మతించాడు. నరుడు తపస్సు చేస్తున్నాడు. నారాయణుడు యుద్ధానికి దిగాడు. యుద్ధం భీకరంగా సాగుతోంది. అలా వేయి సంవత్సరాలు గడిచిన అనంతరం నారాయణుడు సహస్రకవచుని వేయి కవచాలలో ఒక కవచాన్ని భేదించగలిగాడు. అప్పటికి అలసిన నారాయణుడు తపస్సుకు ఉపక్రమించగా, నరుడు సహస్రకవచునితో యుద్ధానికి దిగాడు. మరో వేయి సంవత్సరాలు గతించిన అనంతరం నరుడు సహస్రకవచుని మరో కవచాన్ని భేదించాడు.

ఈ విధంగా నర నారాయణులు వెయ్యి కవచాలను చేధిస్తుండగా శంకరుడు తానిచ్చిన వరాన్ని మన్నించమని కోరితే అతడిని మూడు కవచాలతో వదిలాడు. తర్వాత కాలంలో త్వష్ట ప్రజాపతికి పుత్రుడు వృత్రాసురుడిగా జన్మించిన సహస్ర కవచుడు ఇంద్రుని చేతిలో మరణించినప్పుడు ఒక కవచం పోయింది. తర్వాత ఘంటాకర్ణుడను రాక్షసుడిగా జన్మించి శ్రీహరి సహరించినప్పుడు రెండో కవచాన్ని పోగొట్టుకున్నాడు.
ఇలా నరనారాయణులిరువురూ కలిసి ఆ సహస్రకవచుని తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు భేదించారు.
ఇక సహస్రకవచునికి ఉన్నది ఒకేఒక కవచం. అది గమనించిన సహస్రకవచునికి భయం పుట్టి, యుద్దరంగం వదిలి, పరుగు పరుగున సూర్యుని దగ్గరకు వెళ్లి అభయం ఇమ్మని వేడుకున్నాడు. అప్పుడు సూర్యుడు ‘కలకాలం నేను నీకు అభయం ఇవ్వలేను, నరనారాయణుల అనంతరం నీకు నానుంచి విడుదల కలిగిస్తాను’ అన్నాడు. సహస్రకవచుడు సమ్మతించి సూర్యుని దగ్గర ఉండిపోయాడు. కుంతి మంత్రబలానికి కట్టుబడి వచ్చిన సూర్యుడు ఆ సహస్రకవచునే పసిబిడ్డగా మార్చి, కుంతి చేతికి అందించాడు. అందుకే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మించాడు. ఆ కర్ణుని సంహరించడానికే నరనారాయణులిరువురూ కృష్ణార్జునులుగా జన్మించి, కురుక్షేత్ర రణభూమిలో కర్ణుని సంహరించారు.
సూర్యుడి వరంతో కుంతికి జన్మించిన కర్ణుడి అసలు పేరు వసుసేనుడు. ఈ వసుసేనుడే సహస్ర కవచుడు. జన్మతహ వచ్చిన కవచ కుండలాలను శరీరం నుంచి వేరుచేసి ఇంద్రుడికి దానంగా ఇచ్చాడు. కవచ కుండలాలను దానం చేయబట్టే అతడికి కర్ణుడు అనే పేరు వచ్చింది.

No comments:
Post a Comment