ధర్మజుండు భీమునికి కొన్ని ఉత్పాతాలు చెప్పుట
అదిగో! అటుచూడు. ఒక కుక్క మనముందే ముఖం పైకెత్తి మొరుగుతుంది. ఇక నక్క సూర్యు డుదయిస్తూండగా ఎదురుగా నోటివెంట నిప్పులమంటతో ఏడుస్తుంది. గద్దలు మొదలైనవి గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. గాడిదలు మొదలైన జంతువులు గుంపులుగా గుమిగూడి ఉన్నాయి. ఉత్తమజాతి గుఱ్ఱాలు కన్నీరు కారుస్తున్నాయి. మదపుటేనుగుల చెక్కిళ్లనుండి మదజలం కారడం మానింది. పావురాలు యమదూతలవలె పైకి వస్తున్నాయి. హోమవాటికలలో అగ్నిహోత్రుడు మండటం లేదు. దట్టంగా పొగలు దిక్కులెల్ల చుట్టుముట్టి క్రమ్ముకొన్నాయి. సూర్యబింబం మసకవేసి మలినంగా ఉంది. భూమి కంపిస్తున్నది.
విపరీతంగా గాలులు వీచినవి. దుమ్ము మొత్తం సుడులు తిరుగుతూ వడివడిగా ఆకాశాన్ని కప్పివేసింది. పైనుండి పిడుగులు పడుతున్నాయి. మేఘాలు నెత్తుటి వాన కురుస్తున్నాయి.
గ్రహాలు ఆగ్రహంతో పోరాడుకొంటున్నాయి. ఎటుచూచినా భూతాల కలకలధ్వనులే వినబడుతున్నాయి. మన్నుమిన్ను ఒక్కటై భగభగమని మండుతున్నట్లు తోస్తున్నది.
దూడలు పాలు తాగటం లేదు. ఆవులు పాలివ్వటం లేదు. పశువులకు పట్టిన వ్యాధులు వదలిపోవటం లేదు. ఆబోతులు పశువులను ఋతువునుబట్టి కలియటం లేదు. కోడెలు కొదమపిల్లలను దాటుతున్నాయి.
దేవాలయాలలోని దేవతావిగ్రహాలు కొన్ని కదలుతున్నాయి. కొన్ని కన్నీరు కార్చుతున్నాయి. మఱికొన్ని ఉక్కకు తాళలేక చెమర్చుతున్నాయి. ఇక కొన్ని గుడినుండి వెలుపలికి వెళ్లుతున్నాయి.
కాకులు కావుకావుమని అరుస్తూ ఏడుస్తున్నాయి. గుడ్లగూబలు, పట్టపగలే నగరిలో గుండ్రంగా తిరుగుతున్నాయి. లోకాలు తమ శోభను కోల్పోయి గతితప్పి పాడుబడ్డాయి.
భీమసేనా! యవధాన్యము, పద్మం, అంకుశం, చాపం, చక్రం, చేప చిహ్నముల శుభరేఖలతో అలంకరించబడిన వాసుదేవుని పాదాల జంట మోపుటచే పావనమైన భాగ్యం ఈ భూదేవికి ఇకలేదేమో! నా ఎడమ కన్ను ఎడమభుజం మాటిమాటికి అదురుతున్నాయి. ఈ లోకానికి ఇంకా ఎటువంటి భయంకర పరిస్థితులు దాపురించనున్నాయో కదా!
ఇంకను ఎన్నో ఉత్పాతాలు కలుగుతున్నవి. అచ్చట ద్వారకలో శ్రీకృష్ణుడు ఎట్లున్నాడో తెలియుటలేదు అని ధర్మజుడు భీమునితో పలుకుతూ మిగుల దిగులుతో ఉన్నాడు. ఆ సమయంలో -
అర్జునుండు ద్వారక నుండి వచ్చి కృష్ణ నిర్యాణంబు దెల్పుట
Subscribe to:
Post Comments (Atom)
Triratra Vrathadeeksha - త్రిరాత్ర వ్రతదీక్ష
త్రిరాత్ర వ్రతదీక్ష ఆ జగన్మాత దయతోనే సర్వ జగత్తూ నడయాడుతోంది. ఆ అమ్మ కరుణావల్లి, ఆ తల్లి అమృతహృదయ, ఆమె చల్లని చూపులకోసం ముల్లోకాలు ఎదురు చూస...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః । ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...
No comments:
Post a Comment