అయ్యా! సూతమహార్షీ! రాజువేషంలో ఉన్న శూద్రుడు గోవును ఎందుకు తన్నినాడు? జైత్రయాత్ర గావించే రాజు పరీక్షిత్తు కలిని ఏ విధంగా నిగ్రహించినాడు? సవిస్తరంగా నాకు తెలియజేయవలసింది.
అరవిందాక్షుడైన నందనందనుని పాదారవిందాల మకరందం ఆనందంగా ఆస్వాదించి, పరవశులైన ఉత్తమ పురుషుల పవిత్ర చరిత్రలు వినకుండా మితిమీరిన మాత్సర్యంతో మతిహీనులైన దుర్జనుల దుష్టచరిత్రలకు చెవులొగ్గి సంసార వ్యామోహ బంధాలలో చిక్కుకొని పరమార్ధాన్ని మరచి, వ్యర్థంగా కాలం గడపటం ఎంత అవివేకం?
పుణ్యచరిత్రా! బ్రతుకు శాశ్వతం కాదు. మరణమే సత్యం. 'పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు' ఈ సత్యాన్ని గుర్తించి మోక్షాన్ని కాంక్షించే అల్పాయుస్సు కల మేము అపవిత్రుల అల్పచరిత్రలు ఆలకిస్తూ బంగారం వంటి కాలాన్ని పాడుచేసుకోవటం పాడికాదు. కావున మాకు గోవింద పాదారవింద మకరంద ధారలు అనుగ్రహించు. మేము చేసే ఈ సత్రయాగానికి మునీంద్రులను ఆహ్వానింపగా ఆ దినమే అంతకుడడైన యముడు ఆగంతుకుడై విచ్చేసినాడు. చూచితివా! ఈ యజ్ఞం పూర్తి అయ్యేదాక ఆయన ఏ ఒక్కరి ప్రాణాన్నికూడ తీయలేదు. ఎంతో ఆసక్తితో విష్ణుకథలు వింటూ మైమరచి అక్కడనే ఉండిపోయినాడు.
సోమరులు, మందబుద్దులు, అల్పమైన ఆయుస్సు కలవారు ప్రయోజనంలేని దారులలో కాలాన్ని వ్యయం చేస్తూ పయనిస్తున్నారు. అట్టివారికి హరిచరణ కమల సుధాధారలు చవిచూడటానికి రాత్రింబవళ్ళలో అవకాశమే లేదు.
ఆ విధంగా పలికిన శౌనకుని మాటలు విని సూతుడిట్లన్నాడు. మునీంద్రా! తన సేనాసమూహంచే కాపాడబడే కురుజాంగల దేశంలో కలిపురుషుడు ప్రవేశించినాడని పరీక్షిత్తు విన్నాడు. ఒకనాడు కదన కుతూహలంతో విల్లు ధరించి నీలమేఘములను పోలిన గుఱ్ఱాలు కట్టిన మనోరథంవంటి రథంపై ఎక్కి సింహధ్వజం వెలుగుతుండగా రథాగజతురగపదాతులతో కూడిన సేనావాహినితో విజయయాత్రకు బయలుదేరినాడు. తూర్పు దక్షిణము పడమర ఉత్తర దిశలలో సాగర తీరాల్లో ఉన్న ఇలావృతం, రమ్యకం, హిరణ్మయం, హరివర్షం, కింపురుషం, భద్రాశ్వం, కేతుమాల, భారతం అనే పేర్లు గల ఎనిమిది వర్షాలను, ఉత్తర కురుదేశాలను, జయించి, ఆయా దేశవాసులు తెచ్చి యిచ్చిన కానుకలు గ్రహించినాడు. వందిమాగధులచే పొగడబడే తన పూర్వరాజుల వృత్తాంతాలు విన్నాడు. స్తోత్ర పాఠకులు పఠించే పద్యాలవలన భక్తవత్సలుడైన శ్రీకృష్ణుడు పాండవులకు సారథిగా, ఇష్టసఖుడుగా, సచివుడుగా, సభాపతిగా, సంరక్షకుడుగా, దూతగా ఆచరించిన కృత్యాలు, అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం విరజిమ్మే అగ్నిశిఖల నుండి తనను రక్షించిన వృత్తాంతం తెలిసికొన్నాడు. యాదవులకు పాండవులకుగల పరస్పర స్నేహబాంధవ్యాలను, శ్రీకృష్ణునిపై వారికి గల భక్తిప్రపత్తులను గ్రహించినాడు. విశ్వంభరుని భక్తవాత్సల్యానికి ఆశ్చర్యచకితుడయినాడు. స్తుతి పాఠకులకు మిక్కిలి వెలగల బహుమూల్యాలైన హారములు, వస్త్రాలు, ఆభరణాలు బహూకరించినాడు. పద్మనాభుని పాదపద్మారాధనలో పరవశుడై పవిత్ర మానసంతో ఉండినాడు.
ఆ సమయంలో వృషభాకారం ధరించి, ఒంటికాలిపై తిరిగే ధర్మదేవుడు, చెంత దూడలేని తరపి ఆవువలె పూర్తిగా కాంతిని కోల్పోయి ఆర్తితో కన్నీరు గార్చుచున్న గోరూపధారిణియైన భూదేవితో ఇట్లన్నాడు.
తల్లీ! భూదేవీ! నీ కన్నులనుండి ఏకధారగా కన్నీరు కారుచున్నది ఎందుకు? నీ దేహం వ్యాధితో కూడుకొనియున్నది. నీముఖం ఎందుకావిధంగా వాడిపోయింది? నీ ప్రియబంధువులకు భయదుఃఖాలు కలుగలేదు కదా! శూద్రులు ఒంటికాలితో కుంటినై ఉన్న నన్నుపట్టి బంధింతురని బాధపడుచుంటివా? ఎందుకు తల్లీ నీకీబాధ?
యజ్ఞాలు లేనందువల్ల దేవతలకు యాగాల్లో భాగాలు లభింపవనియా? భర్తలు భార్యలను భరింపరని, పిల్లలను తల్లిదండ్రులు కాపాడరని బాధపడుతున్నావా? సరస్వతి దుర్జనులను ఆశ్రయిస్తుందని, ఉత్తమ బ్రాహ్మణులు రాజులకు సేవలు చేస్తారని, ఇంద్రుడు వర్షాలు కురిపించనందువల్ల ప్రజలు కష్టాలపాలు ఔతారని దుఃఖించుచుంటివా? హీనవంశాలవారు రాజ్యాలు ఏలుతారని, న్యాయం నశించిపోతుందని, మానవులు ఆహార నిద్రామైథునాది కర్మలలో ఆసక్తులు ఔతారని చింతిస్తున్నావా? ఎందుకు దుఃఖిస్తున్నావు?
తల్లీ! భూభారాన్ని తగ్గించటానికి చక్రధారియైన శౌరి ఇన్ని సంవత్సరాలు మానవాకారం తాల్చి, ఆనందాన్ని కల్గించి ఇపుడు అవతారం చాలించినాడు కదా! ఇక నేను దిక్కులేని దాననైనాను. ఏ దుర్శార్గుడు ఇకపై నన్ను పాలిస్తాడో! ఎలాంటి ఇక్కట్లు కలుగుతాయో? అని దిగులుపడి తల్లడిల్లుతున్నావా?
తల్లీ! అన్ని అనర్థాలకు ఆలవాలమైన కాలంలో అనగా మహాదుర్భరమైన సందర్భంలో, దేవతలకు కూడ స్తుతిపాత్రమైన నీ సౌభాగ్యం కృష్ణుడున్నంతవరకు శోభాయమానంగా ఉండింది. కృష్ణుడు వెళ్లిపోగానే అదృష్టం మారింది. అనర్థం వాటిల్లింది.
ఏకపాదుడైన ధర్ము డావిధంగా పలుకగా భూదేవి ఈ విధంగా అన్నది.
పూర్వం ధర్మ దేవతాస్వరూపుడవైన నీవు ఈ లోకంలో నాల్గు పాదాలతో నడుస్తూ ఉంటివి. ఈనాడు ఇందిరావల్లభుడైన గోవిందుడు లేకపోవటం చేత కాలప్రభావంవల్ల ఒంటికాలితో నడుస్తున్నావు.
సత్యం, శౌచం, దయ, ఓర్పు, త్యాగం, సంతోషం, ఋజుత్వం, శమం, దమం, తపస్సు, సమభావం, తితిక్ష ఉపరతి, శుతం, జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం, శౌర్యం, తేజస్సు, సామర్థ్యం, స్మృతి, స్వాతంత్య్రం, కౌశలం, కాంతి, ధైర్యం, మృదుత్వం, ప్రతిభ, వినయం, శీలం, జ్ఞానేంద్రియ పటుత్వం, కర్మేంద్రియ పటుత్వం, మనోబలం, సౌభాగ్యం, గాంభీర్యం, స్థైర్యం, శ్రద్ధ, కీర్తి, గౌరవం, నిరహంకారం అనే ముప్పది తొమ్మది సుగుణాలే కాకుండ, వేదవిజ్ఞానం, శరణాగత పరిరక్షణం మొదలైన గొప్ప గుణగణాలు శ్రీకృష్ణపరమాత్మయందు వర్ధిల్లుచుండినవి.
ఓ తండ్రీ! లెక్కించటానికి వీలుకాని సద్గుణాలు కల చక్రధరుడు అవతార పరిసమాప్తి చేయగానే కలి పురుషుని ప్రేరణ కారణంగా భయంకర పాపకార్యాలకు పాల్పడిన ప్రజాసమూహాన్ని చూడగానే నాకు దుఃఖం పొంగి పొరలి వస్తున్నది.
ఓ పుణ్యాత్ముడా! ఈ కలియుగంలో ఒకరికననేల? దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు, ధైర్యవంతులకు, వర్ణ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు ఆచరించేవారికి, గోవులకు, నీకు, నాకు బాధలు పడే కాలం ప్రాప్తించెనే అని దుఃఖిస్తున్నాను.
తండ్రీ! బ్రహ్మాది దేవతలు ఎంతోకాలం తపస్సు చేసి ఏ దేవుని శుభప్రదమైన కడగంటిచూపు కాంక్షింతురో, పద్మాలయ అయిన లక్ష్మీదేవి తన నివాసాన్ని కూడా విడిచి ఎంతో కుతూహలంతో ఏ దేవదేవుని పాదపద్మాలు ఆరాధిస్తున్నదో, పరమనిష్టాగరిష్టులైన మునిశ్రేష్టులు తమ పవిత్ర హృదయ పీఠికలపై ఏ దేవుని పావన స్వరూపాన్ని నియమపూర్వకంగా నిలుపుకొంటున్నారో, సమస్త వేదాలు ఏ దేవుని దివ్యచరిత్రలు సరిగా వర్ణింపజాలక విస్మయం వహిస్తున్నాయో, అట్టి దేవాదిదేవుడైన వాసుదేవుని పద్మ, వజ్ర, అంకుశ, శంఖ, చక్ర, చాప, మత్స్య ధ్వజ రేఖలతో అలంకరింపబడిన శ్రీచరణము లికమీద నా మీద సోకవు గదా! అని శోకం చెందుతున్నాను.
మహాత్మా! భగవంతుని పాదపద్మాలు సోకగలిగే మహాభాగ్యం మూలంగానే నేను అఖిల లోకాలకు ఆరాధ్యురాలనై ఎంతో సంతోషించి పొంగి పులకించినాను. ఆ ప్రభువునా అభిమానపూర్వక గర్వాన్ని సర్వమూ అంతంచేసి అంతర్థనమయినాడు.
శ్రీమన్నారాయణుడు దుష్టశిక్షణ శిష్టరక్షణ గావించి, సంసారబంధాలను పెకలించటం కొఱకు, ధర్మస్వరూపుడవైన నిన్ను నాలుగు పాదాలతో నడిపించటానికి లీలామానుష రూపం ధరించినాడు.
మాధవుని లీలలు మరచిపోలేనివి. ఆ తీయతీయని మాటలు, ఆ నీతిమార్గములు, ఆ చిరునవ్వులు, ఆ కనికరాలు, ఆ ముద్దుమురిపాలు, ఆ ప్రణయ కలహాలు, ఆ సురుచిరమందయానాల సొంపులు, మనస్సులను హరించే ఆ దివ్యమధుర కటాక్షవీక్షణాలు ఇక చూడజాలమేమో? అనే విచారంతో ఒక్కస్త్రీ లేమిటి, సర్వసంగ పరిత్యాగులైన యోగులు కూడా ఆ దయామయుని వియోగాన్ని సహించలేరు.
ఆ గోపికావల్లభుడు నాపై మెల్లమెల్లగా అడుగు లిడి నడిచేటప్పుడు నా ఒడలెల్ల పారవశ్యంతో గగుర్పాటు చెందేది. ఆ సందర్భంలో నా శరీరం నిండా మొలచిన పులకాంకురాలు దట్టంగా పైరు మొలచినట్లు అడుగడుగునా దారి వెంబడి పొడచూపేది.
ఈ విధంగా ఎద్దు ఆవు రూపాలలో ఉన్న ధర్మదేవుడు భూదేవి తూర్పు వైపు పారే సరస్వతి నది ఒడ్డున మాటాడుకొనే సమయంలో అచ్చటికి రాజర్షి పరీక్షిన్మహారాజు విచ్చేసినాడు. అప్పుడు

శ్రీ మహా భాగవతము
పంచాంగం
No comments:
Post a Comment