Tuesday, February 24, 2026

Thadasthu Devathalu - తథాస్తు దేవతలు

తథాస్తు దేవతలు

తథాస్తు దేవతలు సాయసంధ్యవేళల్లో సంచరిస్తుంటారని ప్రతీతి. చెడుమాటలు లేదా చెడు ఆలోచనలను తరచూ పునరుక్తం చేస్తూంటే ఆ మాటే జరిగిపోతుందట. ఈ తథాస్తు అనేది స్వవిషయంలోనే వర్తిస్తుంది. మనిషి తన ధర్మానికి విరుద్ధంగా అనకూడని మాట పదేపదే అనుకుంటూ ఉంటే దేవతలు వెంటనే తథాస్తు అంటూ ఉంటారు. వీరినే తథాస్తు దేవతలు అంటారు.

ఎంత ఉన్నా తరచూ డబ్బు లేదులేదు అని పలుమార్లు అంటే నిజంగా లేకుండానే పోతుంది. ఆరోగ్యంగా ఉండి అనారోగ్యంతో ఉన్నామని తరచూ అంటే నిజంగానే అనారోగ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి స్థితిగతుల గురించి అసత్యాలు, అవాస్తవాలు పలకడం మంచిది కాదు. అనారోగ్యానికి గురైనపుడు ఫలానా వైద్యుడి హస్తవాసి బాగుంటుందని అతడి దగ్గరకు వెళ్లండని సలహా ఇస్తారు. వాస్తవానికి వైద్యులందరూ ఒకే శాస్త్రాన్ని చదువుకుంటారు. ఇక్కడ హస్తవాసి గురించి కూడా మాట్లాడుతారు.. హస్తవాసి బాగుంటుందనే వైద్యుడు తన వద్దకు వచ్చే రోగులకు స్వస్థత చేకూరాలని పదే పదే కోరుకోవడంతో తథాస్తు దేవతలు ఆశీర్వదిస్తారు. దాని ప్రకారమే అతడిని సంప్రదించే వారికి వ్యాధులు తగ్గుముఖం పట్టడం, దీని వల్ల మంచి పేరు రావడం చోటు చేసుకుంటాయి.

తథాస్తు దేవతలు అంటే మనం మాట్లాడే మాటలను, కోరికలను నిత్యం గమనిస్తూ 'అలాగే జరుగుగాక' అని ఆశీర్వదించే దైవిక శక్తులు. సాయంత్రం వేళలో (సంధ్యా సమయం) వీరు భూమిపై తిరుగుతూ, మనం కోరుకునే మంచిని నిజం చేస్తారని నమ్మకం. ముఖ్యంగా వీరు అశ్వినీ దేవతలుగా, సూర్యుని పుత్రులుగా పరిగణించబడతారు.

చెడు విషయంలోనూ ఇదే వర్తిస్తుంది. ఒకరికి చెడు జరగాలని కోరుకోవడం లేదా మనకు జరుగుతుందేమోనని భయపడటం వల్ల తథాస్తు దేవతల ప్రభావంతో అవి ఫలిస్తాయి. మరికొన్ని దుష్పలితాలు చోటుచేసుకోవడంతో ఇక్కట్లు పెరుగుతాయి. కాబట్టి మంచి కోరుకుంటే అందరికీ మంచే జరుగుతుంది.


తథాస్తు దేవతల గురించిన ముఖ్య విశేషాలు:

నిజం చేసే శక్తులు: మనం నిస్వార్థంగా, మంచి కోరుకున్నప్పుడు, ఈ దేవతలు 'తథాస్తు'(అలాగే అగుగాక) అని దీవిస్తారు.

అర్థం: 'తథాస్తు' అంటే "నువ్వు కోరుకున్నది నీకు లభించుగాక" లేదా "నీ మాట నిజమగుగాక" అని అర్థం. 

సమయం: సంధ్యా సమయంలో, అంటే సూర్యాస్తమయ సమయంలో (5 గంటల ప్రాంతంలో) ఈ శక్తులు బలంగా ఉంటాయని నమ్ముతారు.

హెచ్చరిక: చెడు మాటలు, అశుభం పలకడం, ఇతరులకు కీడు కోరుకోవడం ఈ సమయంలో చేయకూడదు. ఎందుకంటే, ఆ మాటలు కూడా నిజమయ్యే ప్రమాదం ఉందని పెద్దలు హెచ్చరిస్తారు.

అశ్వినీ దేవతలు: పురాణాల ప్రకారం, సూర్య భగవానుని కుమారులైన అశ్వినీ దేవతలే 'తథాస్తు దేవతలు'గా పిలవబడతారు.

నివాసం: వీరు సత్కర్మలు, మంచి పనులు జరిగే పవిత్ర ప్రదేశాలలో ఉంటారు.

కాబట్టి, సాయంత్రం సమయంలో ఎప్పుడూ సానుకూలంగా మాట్లాడటం, మంచి కోరుకోవడం వల్ల తథాస్తు దేవతల ఆశీస్సులు లభిస్తాయని హిందూ సంప్రదాయం చెబుతోంది.

No comments:

Post a Comment

Sri Shani Ashtottara Shata Sata Naamavali - శ్రీ శని అష్టోత్తర శతనామావళి

శ్రీ శని అష్టోత్తర శతనామావళి ఓం శనైశ్చరాయ నమః ఓం శాంతాయ నమః ఓం సర్వాభీష్టప్రదాయినే నమః ఓం శరణ్యాయ నమః ఓం వరేణ్యాయ నమః ఓం సర్వేశాయ నమః ఓ...