Monday, February 2, 2026

Chandiswarudu - చండీశ్వరుడు

చండీశ్వరుడు కూడా మనలాగే పుట్టాడు పాంచ భౌతిక శరీరంతో అయన పూర్వ నామధేయం విచార శర్మ. అయన వేదం చదువుకొనేవాడు. 

చిదంబర క్షేత్రంలో యచ్చదత్తుడు అనే బ్రాహ్మణుడికి విచారశర్మ అనే కుమారుడు ఉండేవాడు. విచారశర్మ చిన్నతనం నుండి శివభక్తిలో మునిగిపోయి, ఇసుకతో శివలింగాన్ని చేసి పూజించేవాడు.

ఆవుల్ని కాసే గోపాలకుడు ఒక రోజున ఆవుల్ని తోలుకుంటూ వెళుతున్నాడు. తీసుకువెళ్తూ ఒక ఈనిన ఆవు దగ్గరకు వెళ్ళాడు. ఈనిన ఆవు దగ్గరకి వెళ్ళకూడదు. ఆలా వెళితే ఆ దూడకి మనం ఏదో ఇబ్బంది చేస్తామేమో అని రక్షించడానికి మనల్ని పొడుస్తుంది. తప్పు వాడిది, వెళితే అది కొమ్ము విసిరింది. నా మీద కొమ్ము విసురుతావా అని ఆ గోపాలకుడు ఆ ఆవుని కర్ర పెట్టి నడుం మీద కొడుతున్నాడు.

వేదం చదువుకుంటున్న విచార శర్మ పరుగు పరుగున వచ్చి ఆవుని కాయడం అంటే ఇది కాదురా, కొట్టడం కాదు ఆవుని కాయడం అంటే ఆవుని కాపాడటం. నీకు చేత కాదు ఆవుల్ని కాయడం. నేను కాస్తాను ఆవుల్ని ఇది పరమ పవిత్రమైన వృత్తి.

నేనే రేపటి నుండి ఈ ఆవులను కాస్తాను.నీవు ఈ ఆవులను కొట్టవద్దు. తీసుకుని వెళ్ళవద్దు’ అని చెప్పాడు. 

బ్రాహ్మణుడు బ్రహ్మచారి వేదం చదువుకున్నవాడు ఆవులను కాపాడితే మంచిదే కదా అని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఆవుల వెనకాల ఈ పిల్లవాడిని పంపించారు.

అంత వేదం చదువుకున్నవాడేమో జగత్తునందు ఏ వస్తువును ఎలా చూడాలో తెలిసున్నవాడేమో అయన ఆవుల్ని ముట్టుకునేటప్పటికీ అవి అమృతం  కింద పాలు పట్టేసివట లోపల పట్టి వెళ్లిలా పొదుగు ముట్టుకుంటే చాలట చెంబుడు పాలిచ్చే ఆవులు నాలుగు బిందెల పాలు ఇచ్చేయడం మొదలెట్టాయి.

వాటికీ ఆలా ఇంటికి వెళ్లి యజమానులకు పాలిస్తే తృప్తి పోయిందట. కొన్నాళ్ళకి 'ఛీ' మనం యజమానులకి ఇవ్వడం ఏంటి మహానుభావుడు మన్నని పోషిస్తున్నవాడు విచారశర్మ. అయన ఏం చెసేవాడు. ఆవులన్నిటిని వదిలి వేదం పన్నాలన్నీ అన్వయం చేసుకుంటూ పైకి అవన్నీ చెప్పుకుంటూ కూర్చునేవాడు. ఆ వేదం వింటూ ఉండేవి ఆవులు అందుకని ఈయనకి పాలిద్దామనుకున్నాయట. ఈయన అడిగిన అడగకపోయినా ఆవులు పక్కకి వచ్చి పాలు వదిలేస్తుండేవి. ఉత్తినే వదిలేస్తున్నాయి కదా అని అయన ఏం చేసేవాడు అంటే కుండలు తెచ్చి క్రింద పెట్టేవాడు. ఆలా కుండలు నిండిపోయి పాలు అయ్యేవి. ఆ పాలు తను తాగేవాడు కాదు విచార శర్మ వెంటనే ఆ పక్కనున్న ఏటిలో స్నానం చేసి ఇసుకతో గుడి కట్టేవాడు.అందులో ఇసుకలింగం తయారుచేసేవాడు. ఈ కుండలలో పాలు తీసి ఒక్కొక్క పాత్రతో పాలు పట్టుకొని "నమస్తే యస్తు భగవాన్ విశ్వేశ్వరరాయ మహాదేవాయ త్య్రంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయయా సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః" అంటూ అభిషేకం చేసేవాడు. ఇక్కడ అభిషేకం పూర్తయ్యేది అసురసంధ్య వెల అయ్యేది. ఈయన ఆవుల్ని పట్టుకొని ఇంటికి వెళ్లిపోయేవాడు.

ఒకరోజున అటుగా ఒక వ్యక్తి వెళ్ళిపోతూ చూసాడు.చూస్తే ఈ పాలన్నీ పిల్లవాడు వాడు ఇసుకలో పోసేస్తున్నట్టు కనపడింది ఆయనకి. అయన వెళ్లి వూళ్ళో చెప్పాడు. మీ ఆవులు ఇంకా పాలు ఇస్తాయి.ఆ విచారశర్మ పాలు తీసి ఇసుకలో పోసేస్తున్నాడు మధ్యాహ్నం పూట్ల అని. విచారశర్మ తండ్రిని పిలిచారు. ఆయన్ని పిలిచి నీ కొడుకు ఆవుపాలు ఇసుకలో పోసేస్తున్నాడు.అందుకనీ నీ కుమారుణ్ణి మందలించమన్నారు. 

ఆ తండ్రి నిజంగా పిల్లవాడు మధ్యాహ్నం పాలు కుండలతో పాలు తీసి ఇసుకలో ఎందుకు పోస్తున్నాడో చూడడం కోసమని రహస్యంగా వచ్చి ఒక చెట్టు కెక్కి దాంట్లో కూర్చున్నాడు. మధ్యాహ్నం అయేటప్పటికీ ఆవులు పాలు పాలిచ్చాయి. ఆ పాలు తీసి పిల్లవాడు గుడికట్టి ఆ ఇసుకలింగానికి పూజ చేస్తున్నాడు. ఇది చూసాడు తండ్రి మహాగ్రహం వచ్చింది.నిజమే వీడు పాలు ఇలా పోసేస్తున్నాడు క్రింద అభిషేకం అనుకోలేదు ఈయన అంతర్ముఖుడు అయి వున్నాడు కొడుకు. ఆ పిల్లవాడిని కర్ర తీసుకొని విపరీతంగా కొట్టాడు. అంతర్ముఖుడైపోయున్నాడేమో ఆ దెబ్బలు తగలడం కూడా ఆయనకి తెలియలేదు. కానీ పక్కన వున్న కుండలో తన ప్రమేయం లేకుండా పాత్ర ముంచి పాలు తీసి అభిషేకం చేసేస్తున్నాడు. మనస్సు రమించిపోతోంది. అటువంటి స్థితిలో తండ్రి వచ్చి ఆ పాల కుండని ఎడమకాలితో తన్నాడు. కుండ పగిలిపోయింది.

అరేయ్ ఏమిరా కుండ పగిలింది అని ఇలా చూసాడు తండ్రి నిలబడివున్నాడు.అపారమైన కోపం వచ్చింది కొడుక్కి. శివాభిషేకం చేస్తున్న ఆవు పాల కుండని తన్నావు. అని అక్కడ వున్నా గొడ్డలి తీసి ఏ పాదములతో తన్నావో ఆ పాదములను తీసేస్తే తప్ప ఈ అపరాధం పోదు. నీవు తండ్రివైనా శివపరధమ్ చేసావు కనుక నీవు శిక్షితుడవు అని గొడ్డలి తీసి తండ్రి కాళ్ళ మీదకు విసిరాడు. తండ్రి రెండు కళ్ళు తెగిపోయి ఇసుకలో పడి రక్తం వరదలై పారి ఏడ్చి మరణించాడు. 



ఆ పిల్లవాడి భక్తికి పొంగిపోయి శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై విచారశర్మ నీకు దివ్య దేహం ఇస్తున్నాను నాకోసం ఇంత గొప్ప పని చేసావు కాబట్టి ఇవ్వాళ నుంచి మా కుటుంబంలో నిన్ను అయిదో వాడిగా తీసుకుంటున్నాను. నేను, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యుడు.అయిదవ స్థానం చండీశ్వరుడిదే.

నిన్ను చండీశ్వరుడు అని పిలుస్తారు.నాకోసం ఆవుపాలతో ఇంత తదాత్మ్యంతో అభిషేకం చేసావు కనుక ఇవ్వాళ నుంచి నా కొడుకులకి కూడా లేని అధికారాన్ని నీకు ఇస్తున్నాను. నేను భోజనం చేసిన తరువాత మిగిలిన పదార్థాలు నా కొడుకులు కూడా ముట్టుకోడానికి వీలులేదు. నీకు చూపించి నీవు తినేసిన తరువాత నువ్వు తీసుకెళ్లమని అనుగ్రహిస్తేనే వాళ్ళు తీసుకోవాలి అందుకని నీకు వరమిస్తున్నాను అని అన్నాడు. ఆ చండీశ్వరుడు ఎప్పుడూ శంకరుని ధ్యానం చేస్తూ ఉత్తరముఖంలో కూర్చుని ఉంటాడు.

చండీశ్వరుడు బహిర్ముఖుడై ఉండడు.ఎప్పుడూ కళ్ళు మూసుకుని ఉంటాడు. ఎప్పుడూ శివ ధ్యాన తత్పరుడై ఉంటాడు. 
భావసమాధిలో ఉంటాడు.ఆయనను పిలిస్తే ఆయనకు కోపం వస్తుంది. అందుకని ఆయనకు ‘ధ్వనిశ్చండుడు’ అని పేరు.

మనలో చాలామంది తెలిసీ తెలియక శివాలయంలో కొట్టిన కొబ్బరి కాయ ప్రసాదాన్ని (శివనిర్మాల్యం) ఇంటికి తీసుకు వెళ్ళకూడదని గోడల మీదపెట్టి వెళ్లిపోతుంటారు. ప్రసాద తిరస్కారం మహాదోషం. అలా వదిలి పెట్టి వెళ్ళకూడదు.

శాస్త్ర ప్రకారం ఆయన దగ్గరకు వెళ్ళినపుడు చిన్న చిటిక మాత్రం వెయ్యాలి. అందుకే ఆయనకి చిటికల చండీశ్వరుడు అని పేరు. చిటిక వేస్తే ధ్యానమునందు ఉన్నవాడు కళ్ళు విప్పి కోపంగా చూస్తాడు. ఓహో మా స్వామిని ఆరాధించావా? ప్రసాదం తీసుకున్నావా? సరి అయితే తీసుకు వెళ్ళు’ అంటాడు.

ఆయనకు చూపించిన తర్వాత ఆ ప్రసాదం మీద మీకు పూర్ణా ధికారం ఉంటుంది. దానిని మీరు ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు.లోపల శివుడికి ఒక ముక్క ఉండిపోయింది. అది చండీశ్వరునికి వెళ్ళి పోతుంది.మీకు ఇచ్చినది ప్రసాద రూపము. 
చండీశ్వరుడు అనుగ్రహిస్తేనే ఫలితం వస్తుంది.

No comments:

Post a Comment

Magha Puranam 27 - మాఘ పురాణం 27 ఋక్షక యను బ్రాహ్మణకన్య వృత్తాంతము

మాఘ పురాణం - 27 వ అధ్యాయం ఋక్షక యను బ్రాహ్మణకన్య వృత్తాంతము పూర్యము భృగుమహాముని వంశమందు ఋక్షక యను కన్య జన్మించి దినదిసాభివృద్ధి పొందుచుండెను...