Tuesday, February 24, 2026

Fairy tales Telugu - పొడుపు కధలు

పొడుపు కధలు

1. నల్ల కుక్కకు నాలుగు చెవులు ఏమిటది ? సమాధానం : లవంగం

2. బంగారు చెంబులో వెండి గచ్చకాయ ఏమిటది ? సమాధానం : పనసగింజ

3. కుడితి తాగదు, మేత మేయదు గాని, కుండకు పాలు ఇస్తుంది..? సమాధానం : తాడి చెట్టు, ఈత చెట్టు 

4. అనగనగ ఒక అప్సరస. పేరు మధ్యలో ఒక అక్షరం తీసేస్తే మేక..? సమాధానం : మేనక

5. పూజకు పనికిరాని పత్రి ఏమిటి..?? సమాధానం : ఆసుపత్రి 

6. గీయలేని కోణం..?? సమాధానం : కుంభకోణం

7. కొట్టకుండా తగిలే దెబ్బ ఏమిటి..?? సమాధానం : వడదెబ్బ 

8. తాగలేని పాలు ఏమిటి..?? సమాధానం : పాపాలు

9. తినలేని కాయ ఏమిటి..?? సమాధానం : లెంపకాయ 

10. అందరికీ ఇష్టమైన కారం ఏమిటి..??  సమాధానం : ఉపకారం

11. అందరూ కోరుకునే సతి ఏమిటి..?? సమాధానం : వసతి 

12. కూర్చోలేని హాలు ఏమిటి..?? సమాధానం : వరహాలు

13. పగలు కూడా కనపడే నైట్ ఏమిటి..?? సమాధానం : గ్రానైట్ 

14. రుచి లేని కారం ఏమిటి..??  సమాధానం : ఆకారం 

15. ఎగిరినా ఎగురుతుంది, నడచినా నడుస్తుంది కానీ నోట మాట లేదు ? సమాధానం : నీడ 

16. కడుపు నిండా రాగాలు, వంటి నిండా గాయాలు ?  సమాధానం : వేణువు, మురళి 

17. ఇల్లు అంతా తిరిగి మూలన కూర్చుంటుంది ? సమాధానం : చీపిరి 

18. అమ్మకి తమ్ముడిని కాను, కానీ నేను అందరికి మేనమామని ఎవర్ని నేను ? 
సమాధానం : చందమామ

19. జాన కాని జాన ? సమాధానం : ఖజాన 

20. మూత తెరిస్తే, ముత్యాలు ? సమాధానం : దంతాలు 

21. చక్కని చెరువు చిక్కని నీళ్లు తెల్లని కాడ ఎర్రని పువ్వు..? సమాధానం : దీపం 

22. అడవిలో పుటింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, మహాలక్ష్మిగా మారింది..?
సమాధానం : గడప 

23. పగలేమో కటోర తపస్వి రాత్రి భయంకర రాక్షసి..? సమాధానం : గబ్బిలం 

24. పచ్చని చేలు పరిమళాల పిట్టా ఒళ్ళు విరుచుకుంది తెచ్చుకుందాం అంటే గుచ్చుకుంది..?
సమాధానం : మొగలి పువ్వు 

25. అరచేతిలో లెక్కించలేనన్ని ఇళ్ళు, వాటికి వెళ్లే దారేకాని వచ్చే దారే లేదు?
సమాధానం : జల్లెడ

26. పోకంతా పొట్టోడు, ఇంటికి గట్టోడు? సమాధానం : తాళం కప్ప

27. సన్న తోడవు తొలగిస్తే, కమ్మని వెన్నముద్ద అందరూ ఇష్టంగా ఆరగిస్తారు?
సమాధానం : అరటిపండు 

28. చారెడు కుండలో మానెడు పగడాలు?  సమాధానం : దానిమ్మ పండు 

29. చెట్టుకు కాయని కరకరలాడే కాయ? సమాధానం : కజ్జికాయ 

30. నల్ల స్తంభం పై నలుగురు దొంగలు?  సమాధానం : లవంగం మొగ్గ 

31. కాళ్ళు చేతులు ఉన్నా నడవలేనిది? సమాధానం : కుర్చీ

32. ఒళ్ళంతా ముళ్ళు, కడుపంతా చేదు? సమాధానం : కాకర కాయ.

33. రంగం కాని రంగం, ఏమి రంగం?  సమాధానం : వీరంగం 

34. రసం కాని రసం ? సమాధానం : నీరసం 

35. దానికి రెండే కాళ్ళు, ఏడు చేతులు? సమాధానం : నిచ్చెన

36. ఈ ఇంటికి, ఆ ఇంటికి మధ్య ఒకటే దూలం? సమాధానం : ముక్కు

37. కళ్లుండి చూడలేదు, కాళ్ళుండి నడవలేదు? సమాధానం : నవారు మంచం

38. కన్ను ఉన్నా తలలేనిది? సమాధానం : సూది

39. కాటుక రంగు, కమలము హంగు ! విప్పిన పొంగు, ముడిచిన క్రుంగు ?  సమాధానం : గొడుగు 

40. బడి కాని బడి, ఏమి బడి? సమాధానం : రాబడి 

41. ఊరికి రెండు కళ్ళు, ఒకటి తెలుపుని చూస్తే, మరొకటి నలుపుని చూస్తుంది..?
సమాధానం : ఆకాశం (రాత్రి, పగలు) 

42. చుక్కలు చుక్కల రాణిని బంగారు వెన్నెల ప్రాణిని బిత్తర చూపులు దానిని చెంగుచెంగున దూకే దాన్ని..??  సమాధానం : జింక (లేడి) 

43. కిట కిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు మూసిన చప్పుడు కావు ? 
సమాధానం : కను రెప్పలు 

44. పుట్టినపుడు పురుగు ! పెరిగితే పువ్వుల రాజు ? సమాధానం : భ్రమరము

45. హారము కాని హారము, ఏమి హారము ? సమాధానం : ఆహారము

46. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికొచ్చింది తైతక్క లాడింది ?
సమాధానం : చిల్ల కవ్వ

47. నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడ్ని పిలుస్తాను ?  సమాధానం : గుడి గంట 

48. చూస్తే చిన్నోడు, వాడి ఒంటి నిండా నారా బట్టలు ?  సమాధానం : టెంకాయ 

49. చూస్తే గజి బిజీ, తింటే కరకర ?  సమాధానం : జంతిక 

50. నాకు నోరు లేదు కానీ మాటలాడుతాను, చెవులు లేవు కానీ ఎంత చిన్నగా మాట్లాడినా విని అందరికీ తెలియచేస్తాను ? సమాధానం : మైకు 

51. చిక్కటి కారడవిలో చక్కటి దారి ?  సమాధానం : పాపిట 

52. చారల పాపకి దూది కుచ్చు! ? సమాధానం : ఉడుత 

53. కొట్టకుండా తగిలే దెబ్బ ఏమిటి ? సమాధానం : వడదెబ్బ 

54. కరవలేని పాము ?  సమాధానం : వెన్నుపాము 

55. అరచెయ్యంత పట్నంలో అరవై గదులు; గదికొక్క సిపాయి; సిపాయికొక్క తుపాకీ ?
సమాధానం : తేనె పట్టు 

56. వెలిగించలేని క్యాండిల్ ? సమాధానం : ఫిల్టర్ క్యాండిల్

57. వాహనాలకు ఉండని టైర్ ఏమిటి ? సమాధానం : సెటైర్ 

58. అంకెల్లో లేని పది ? సమాధానం : ద్రౌపది

59. ఇంటికి పెట్టలేని గేట్ ఏమిటి ? సమాధానం : ఇంట్రాగేట్ 

60. అందరికి నచ్చే బడి ఏమిటి ? సమాధానం : రాబడి 

61. మొక్కకు పూయని రోజాలు ఏమిటి ? సమాధానం : శిరోజాలు 

62. వేసుకోలేని గొడుగు ఏమిటి ? సమాధానం : పుట్టగొడుగు 

63. డబ్బులుండని బ్యాంక్ ఏమిటి ? సమాధానం : బ్లడ్ బ్యాంక్ 

64. నారి లేని విల్లు ఏమిటి ? సమాధానం : హరివిల్లు 

65. మనం ఎవ్వరికీ ఇవ్వలేని దానం ? సమాధానం : నిదానం 

66. అరచేతిలో 60 నక్షత్రాలు..? సమాధానం : జల్లెడ.

67. హారము కాని హారము, ఏమి హారము ? సమాధానం : ఆహారము

68. పుట్టినపుడు పురుగు ! పెరిగితే పువ్వుల రాజు ? సమాధానం : భ్రమరము

69. కొమ్ములుంటాయి కానీ ఎద్దు కాదు. అంబారీ ఉంటుంది కానీ ఏనుగు కాదు ?
సమాధానం : నత్త 

70. ఇల్లంతా తిరిగి మూలన కూర్చుంటుంది ? సమాధానం : చీపురు

71. తెలిసేలా పూస్తుంది తెలియకుండా కాస్తుంది ?  సమాధానం : వేరు శనగకాయ 

72. నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది, పీక మీదకు కత్తిని తెస్తే కాని మల్లి నడవదు ?
సమాధానం : పెన్సిల్ 

73. సినిమా హాల్ కి మనతో వస్తుంది, టికెట్టు తీసుకుంటుంది కానీ సినిమా చూడదు, మనం వచ్చేవరకు ఎదురుచూస్తుంది?  సమాధానం : మన వాహనం

74. తోవలో పుట్టింది, తోవలో పెరిగింది, తోవలో పోయేవారి కొంగు పట్టింది? 
సమాధానం : ముళ్ల మొక్క

75. కళ్లుండి చూడలేదు, కాళ్ళుండి నడవలేదు? సమాధానం : నవారు మంచం

76. కన్ను ఉన్నా తలలేనిది? సమాధానం : సూది

77. కళ్ళు లేకపోయిన ఏడుస్తుంది, కాళ్ళు లేకపోయిన నడుస్తుంది ?  సమాధానం : మేఘం 

78. తిరిగే దీపం, గాలికి – వానకి ఆరని దీపం, చమురు లేని దీపం ? సమాధానం : మిణుగురుపురుగు

79. అందరిని పైకి తీసుకొని పోతుంది కాని అది మాత్రం పైకి పోదు ?  సమాధానం : నిచ్చెన 

80. ఇంటిలో ఉంటే ప్రమోదము ఒంటిలో ఉంటే ప్రమాదం ? సమాధానం : చక్కెర

81. ఆకు లేని పంట ఏమిటది ? సమాధానం : ఉప్పు 

82. అరచెయ్యంత పట్నంలో అరవై గదులు; గదికొక్క సిపాయి; సిపాయికొక్క తుపాకీ ?
సమాధానం : తేనె పట్టు 

83. ప్రపంచం మొత్తం తిరిగేది, అన్నింటి కన్నా వేగమైనది..?  సమాధానం : మనసు 

84. ముక్కుకు ముత్యం కట్టుకొని, తోకతో నీళ్ళు తాగుతుంది..??  సమాధానం : దీపం 

85. నిప్పు నన్ను కాల్చలేదు, నీరు నన్ను తడపలేదు, సూర్యుడితో వస్తాను సూర్యుడితో పోతాను..?? 
సమాధానం : నీడ 

86. మీకు సొంతమైనది కానీ.. మీ కన్నా మీ తోటి వారే ఎక్కువగా వాడుతారు..?? 
సమాధానం : మీ పేరు 

87. ఎందరు ఎక్కినా విరగని మంచం ? సమాధానం : అరుగు 

88. అన్నదమ్ములు ఇద్దరు, ఒకడు ఎంత దూరం పోతే రెండో వాడు కూడా అంతే దూరం పోతాడు ? 
సమాధానం : కాళ్ళు.

89. ఎంత దానం చేసిన తరగనిది, అంతకంత పెరిగేది ? సమాధానం : విద్య 

90. తెల్లని పొలంలో నల్లని విత్తనలు చేత్తో చల్లుతారు నోటితో వేరుతారు ?  సమాధానం : పుస్తకం

91. నాలుగు కర్రల మధ్య నల్లరాయి ? సమాధానం : పలక 

92. వంకలు ఎన్ని ఉన్న పరుగులు తీసేది ? సమాధానం : నది 

93. కోస్తే తెగదు కొడితే పగలదు ? సమాధానం : నీడ 

94. గది నిండా రత్నాలు గదికి తలం ? సమాధానం : దానిమ్మపండు 

95. పళ్ళు ఉన్న నోరు లేనిదీ ?  సమాధానం : రంపం 

96. చేతికి దొరకనిది, ముక్కుకు దొరుకుతుంది ?  సమాధానం : వాసన 

97. సన్నని స్తంభం ఎక్కలేరు దిగలేరు?  సమాధానం : సూది 

98. ఆకు చిటికెడు కాయ మూరెడు?  సమాధానం : మునగకాయ

99. నేను ఒక పండు నాలో పోషకాలు నిండు నా పేరు జంతువులకు కూడా ఉండు..??
సమాధానం : డ్రాగన్ ఫ్రూట్

100. తెల్లని మొక్క ఎర్రగా పూసి పరిమళించి మాయమైపోతుంది ? సమాధానం : కర్పూరం

101. ఎంత దానం చేసిన తరగనిది అంతకంతకు పెరిగేది ? సమాధానం : విద్య

102. కోస్తే తెగదు కొడితే పగలదు ఏంటది ? సమాధానం : నీడ

103. ఐదుగురిలో బుడ్డోడు,పెళ్ళికి మాత్రం పెద్దోడు ఏమిటది ? సమాధానం : చిటికినవేలు

104. అవి తెల్లని మల్లె మొగ్గలు, పరిమళాలు వెదచల్లవు కానీ, పరిశుభ్రంగా ఉంచుతాయి?
సమాధానం : ఇయర్ బడ్స్

105. తినలేని కాయ ఏమిటి ? సమాధానం : లెంపకాయ 

106. పగలు కూడా కనపడే నైట్ ఏమిటి ? సమాధానం : గ్రానైట్ 

107. తలనుండి పొగ చిమ్ముతుంది కాని భూతం కాదు, కన్ను లెర్రగా ఉండు రాకాసి కాదు, పాకి పోవు చుండు పాము కాదు, నేను ఎవరిని ?  సమాధానం : రైలు 

108. ఇంటికి కాపలా కాస్తుంది కానీ కుక్క కాదు. పట్టుకుని వేలాడుతుంది కానీ పడుకోదు..??
సమాధానం : తాళం 

109. ఎన్ని రేట్లు పెరిగినా ఎప్పుడూ పది పైసలకు రెండు వచ్చేవి, ఏమిటవి..?? 
సమాధానం : అయిదు పైసల బిల్లలు.

110. ముక్కు మీద కెక్కు. ముందు చెవులు నొక్కు. టక్కు నొక్కుల సోకు. జారిందంటే పుటుక్కు..?
సమాధానం : కళ్లద్దాలు 

111. అడవిలో పుట్టింది, మేదరింట్లో మెలిగింది, ఒంటినిండా గాయాలు, కడుపు నిండా రాగాలు, నేను ఎవరిని..??  సమాధానం : మురళి 

112. నామము ఉంది గాని పూజారిని కాదు, తోక ఉంటుంది కానీ కోతిని కాను, నేను ఎవర్ని..?? 
సమాధానం : ఉడత 

113. ఎంత విసిరిన చేతిలో ఉండే కర్ర ..?? సమాధానం : విసనకర 

114. అరచేతి పట్నాన అరవై రంధ్రాలు, నేను ఎవరిని..?? సమాధానం : జల్లెడ

115. అంగుళం ఆకు, అడుగున్నర కాయ, నేను ఎవరిని..?? సమాధానం : మునక్కాయ 

116. రాజులు నివసించని కోట ఏమిటి..?? సమాధానం : తులసి కోట

117. భోజనంలోకి పనికిరాని రసం ఏమిటి..?? సమాధానం : పాదరసం 

118. కనిపించని గ్రహం ఏమిటి..?? సమాధానం : నిగ్రహం 

119. ఆడలేని బ్యాట్ ఏమిటి..?? సమాధానం : దోమల బ్యాట్ 

120. నడవలేని కాలు ఏమిటి..?? సమాధానం : పంపకాలు 

121. చెట్లు లేని వనం..?? సమాధానం : భవనం 

122. స్కూల్ బ్యాగ్ లో ఉండని స్కేలు..?? సమాధానం : రిక్టార్ స్కేల్ 

123. పిల్లలు ఉండని స్కూల్ ఏమిటి..?? సమాధానం : డ్రైవింగ్ స్కూల్ 

124. గీయలేని కోణం..??  సమాధానం : కుంభకోణం 

125. పూజకు పనికిరాని పత్రి ఏమిటి ..?? సమాధానం : ఆసుపత్రి 

126. తాగలేని పాలు ఏమిటి..??  సమాధానం : పాపాలు

127. కొట్టకుండా తగిలే దెబ్బ ఏమిటి..?? సమాధానం : వడదెబ్బ 

128. అందరికీ ఇష్టమైన కారం ఏమిటి..?? సమాధానం : ఉపకారం 

129. తినలేని కాయ ఏమిటి..?? సమాధానం : లెంపకాయ 

130. కూర్చోలేని హాలు ఏమిటి..?? సమాధానం : వరహాలు 

131. అందరూ కోరుకునే సతి ఏమిటి..?? సమాధానం : వసతి 

132. రుచి లేని కారం ఏమిటి ..??  సమాధానం : ఆకారం 

133. నన్ను ఇష్టంగా తెచ్చుకుంటారు, నన్ను చంపి ఏడుస్తారు..? సమాధానం : ఉల్లిపాయ 

134. కడుపు నిండా రాగాలు, వంటి నిండా గాయాలు..? సమాధానం : మురళి 

135. అందమైన గిన్నెలో ఎర్రని పిట్ట తోకతో నీళ్లు త్రాగుతుంది..?? సమాధానం : దీపం వత్తి 

136. రాళ్ల అడుగున విల్లు, విల్లు కోనలో ముళ్లు..??  సమాధానం : తేలు 

137. రెండు కొడతాయి, ఒకటి పెడుతుంది..?? సమాధానం : ఎండ, వాన, చలి 

138. రాజాధి రాజులు కూడా ఒకరి ముందు తల వంచుకుంటారు..??  సమాధానం : మంగలివాడు

139. రెక్కలు లేని పిట్ట గూటికి సరిగా చేరింది..?? సమాధానం : ఉత్తరం 

140. మోదం కాని మోదం..??  సమాధానం : ఆమోదం 

141. మూత తెరిస్తే, ముత్యాల పేరు..?? సమాధానం : దంతాలు 

142. తెలిసేలా పూస్తుంది, తెలియకుండా కాస్తుంది..?? సమాధానం : వేరుశెనగ కాయ 

143. మొగ్గ కాని మొగ్గ, ఏమి మొగ్గ..?? సమాధానం : లవంగ మొగ్గ 

144. మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు..?? సమాధానం : తేనె పట్టు 

145. చూస్తే చూపులు - నవ్వితే నవ్వులు ఏమిటది ? సమాధానం : అద్దం

146. ఇంతింతాకు ఇస్తరాకు రాజులు మెచ్చిన రత్నాలాకు ? సమాధానం : తమలపాకు

147. జాన కాని జాన, ఏమి జాన..?? సమాధానం : ఖజాన 

148. చిన్న పాపకు చాలా చీరలు. ఏమిటది..?? సమాధానం : ఉల్లిపాయ 

149. శిత్తి లో ఇద్దరు దొంగలు కూర్చున్నారు..?? సమాధానం : వేరుశనక్కాయ 

150. వందమంది అన్నదమ్ములు - కట్టి పడేస్తే - కావలసినప్పుడు కదులుతారు - దుమ్ము ధూళీ దులుపుతారు..??  సమాధానం : చీపురు కట్ట 

151. లక్కబుడ్డి నిండా లక్షల వరహాలు తినేవారే గాని, దాచి పెట్టుకొనేవారు లేరు..?? 
సమాధానం : దానిమ్మ కాయ 

152. లోకమంతటికి ఒకటే పందిరి - ఒకటే అరుగు..?? సమాధానం : ఆకాశము - భూమి 

153. రెక్కలు ముయ్యని పక్షి - రెప్పలు ముయ్యని జాణ..?? సమాధానం : తూనీగ, చేప 

154. మేసేది కాసంత మేత: కూసేది కొండంత మోత..?? సమాధానం : తుపాకి/తూట 

155. తాళము కాని తాళము, ఏమి తాళము? సమాధానం : ఆది తాళము

156. రణాలనే మించిన రణం, ఏమి రణం? సమాధానం : మరణం

157. కడుపు నిండా రాగాలు, వంటి నిండా గాయాలు? సమాధానం : మురళి

158. వాలం ఉంది కాని కోతిని కాదు, నామముంటుంది కాని పూజారిని కాదు? సమాధానం : ఉడత

159. మేకల్ని తోలేసి తడకలకి పాలు పిండుతారు? సమాధానం : తేనె పట్టు

160. మొదట చప్పన, నడుమ పుల్లన, కొస కమ్మన? సమాధానం : పాలు, పెరుగు, నెయ్యి

161. తెలిసి కుడుతుంది, తెలియక చస్తుంది? సమాధానం : చీమ, దోమ

162. చెప్పిందే చెప్తుంది కాని చిన్న పాప కాదు, ఎక్కడి పండ్లను తిన్నా దొంగ కాదు?
సమాధానం : రామ చిలుక

163. అడుగులున్నా, కాళ్ళులేనిది? సమాధానం : గజము బద్ద, మీటర్ స్కేలు 

164. పగలు తపస్వి, రాత్రి పండ్ల తోటలో రాక్షసి? సమాధానం : గబ్బిలం

165. కాటుక రంగు, కమలము హంగు! విప్పిన పొంగు, ముడిచిన క్రుంగు!!?  సమాధానం : గొడుగు

166. ఎర్రగా ఉంటాను కాని నేనెవరితో సరసాలాడను, నన్ను ముట్టుకుంటే ఊరుకోను. 
సమాధానం : నిప్పు

167. ఊరికంత ఒక్కటే దుప్పటి..?? సమాధానం : ఆకాశము

168. ఆడవారికి పుట్టినింట ఒకటి, మెట్టినింట మరోకటి..?? సమాధానం : ఇంటి పేరు

169. ఇల్లు మొత్తం వెలుగు, బల్ల కింద చీకటి..?? సమాధానం : దీపం

170. అన్నదమ్ములు ముగ్గురు, తిరిగితే ముగ్గురూ తిరుగుతారు, మానితే ముగ్గురూ మానుతారు?
సమాధానం : ఫ్యాన్

171. ఆకు లేని పంట ఏమిటది ? సమాధానం : ఉప్పు 

172. అరచెయ్యంత పట్నంలో అరవై గదులు; గదికొక్క సిపాయి; సిపాయికొక్క తుపాకీ ?
సమాధానం : తేనె పట్టు 

No comments:

Post a Comment

Shakthi Peetam - 6 Sri Bhramarambika Devi - Srisailam, Nandyal district of Andhra Pradesh - శక్తి పీఠం-6 శ్రీ భ్రమరాంబిక దేవి - శ్రీశైలం (ఆంధ్రప్రదేశ్)

శక్తి పీఠం-6 శ్రీ భ్రమరాంబిక దేవి - శ్రీశైలం (ఆంధ్రప్రదేశ్) ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా శ్రీశైలంలో కొలువైన శ్రీ భ్రమరాంబికా దేవి ఆలయం, ...