పాండురాజకుమారులైన ధర్మరాజాదులు బాహువిక్రమంతో ధృతరాష్ష్రుని కొడుకులైన దుర్యోధనాదులను రణరంగంలో జయించారు. స్వచ్చమైన శరత్కాలపు పండు వెన్నెలలాంటి అఖండకీర్తిని ఆర్జించారు. అటువంటి యశస్సు అనే పూలమొగ్గలతో కౌరవరాజ్యలక్ష్మిని అలంకరించారు. ఈవిధంగా వారు విజయోల్లాసంతో రాజ్యపాలనం సాగించారు.
రాజా! యుద్దానికి ముందే విదురుడు విరక్తితో అడవికి వెళ్ళిపోయాడు. అక్కడ మునులందరూ కీర్తించే విధంగా తపస్సు చేసేవాడు, మంచి గుణాలకు విధేయుడై ఉండేవాడు అయిన మైత్రేయమహర్షిని దర్శించాడు.
ఆ మైత్రేయుని దర్శించి, ఆయన పాదాలకు తన నుదురు తగిలే విధంగా నమస్కరించి అడుగుతున్నాడు. మహర్షి! ప్రపంచాన్ని పవిత్రంచేసే ఆదర్శప్రాయమైన నడతతో అందరి ప్రశంసలు అందుకొనే శ్రీకృష్ణుడు పాండవుల మేలు కోరుకొన్నవాడై హస్తినాపురం చేరుకొని, అక్కడ కురుకులశ్రేష్టుడైన దుర్యోధనుని మందిరానికి వెళ్లలేదు.
భక్తవత్సలుడైన కృష్ణుడు దుర్యోధనుని మందిరానికి వెళ్ళక మా ఇంటికి అతిధిగా రావటానికి గల కారణం దయచేసి నాకు చెప్పవలసిందని విదురుడు మైత్రేయుని అడిగాడని శుకమహర్షి పరీక్షిన్మహారాజుకు చెప్పాడు. అలా చెప్పగా,
విదురుడు మైత్రేయుని అడిగిన విషయం విని పరీక్షిత్తు ఆశ్చర్యపోయాడు. అపుడా రాజు తనకు భాగవతకథను వినిపిస్తున్నవాడు, స్వచ్చమైన మనస్సు కలవాడు, అలసత ఎరుగనివాడు, సముద్రాన్ని చంద్రునివలె మునిజనుల మనస్సును పొంగించేవాడు, అసాధారణమైన హరిభక్తి కలవాడు అయిన శుకయోగీంద్రుని ఇలా అడిగాడు.
అటువంటి శుకయోగీంద్రుణ్ణి చూచి, పరీక్షిత్తు పలుకుతున్నాడు. మహార్షీ! పుణ్యాత్ముడైన విదురుడు ఏయే రహస్య విషయాలను అడిగాడు? మైత్రేయముని ఏమని చెప్పాడు? ఇంకా విదురుడు ఏ విధంగా పుణ్యనదులలో స్నానాలు చేశాడు? ఎక్కడ తిరుగుతూ ఉండినాడు?
స్వచ్చమైన మనస్సు కలిగి, విశేషమైన దయతోకూడిన విష్ణుమూర్తి పాదపద్మాలపై వ్రాలే తుమ్మెదవంటివాడవినీవు. గొప్ప గుణాలతో పాపాలనే చీకట్లను పోగొట్టే సూర్యునివంటివాడవైన ఓ శుకమునీ! నేనడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పండి. జ్ఞానార్థినైన నన్ను కృతార్థుని చేయుమని పరీక్షిత్తు శుకమునిని ప్రార్ధించాడు.
పరీక్షిత్తు అలా అడగ్గానే, శుకయోగీంద్రుడు చెపుతున్నాడు. రాజా! ధృతరాష్ట్రుడు తన పిల్లలను గారాబంగా పెంచుతున్నాడు. ఇదిలా ఉండగా ఆకస్మికంగా పాండురాజు మరణించటంతో తన తమ్ముని పిల్లలుకూడా పెదతండ్రియైన ఆ ధృతరాష్ట్రునే ఆశ్రయించి, ఆయన పంచకు చేరారు.
ఇలా వచ్చిన పాండవుల శౌర్యపరాక్రమాది విషయంలో అసూయాగ్రస్తులైన దుర్యోధనాదులు.
కౌరవులు వంకరబుద్ధి కలిగినవారై ధర్మమార్గం తప్పి పాండవులకు విషాన్నం పెట్టారు. త్రాళ్ళతో బంధించారు. గంగానదిలోకి నెట్టేశారు. రాజ్యంనుండి వెడలగొట్టారు.
లక్క ఇంటిలో పాండవులు నిద్రపోతుండగా వారిని చంపడమే పనిగా పెట్టుకొన్న దుర్మార్గులైన కౌరవులు ఆ ఇంటికి దారుణంగా నిప్పు పెట్టారు.
వివేకం కలవారంతా ప్రశంసించిన రాజసూయయాగంలో అపభృథమనే యాగాంతస్నానం చేయడంచేత పరమపావనమైన ద్రౌపదీదేవియొక్క అందమైన, దట్టమైన జుట్టు పట్టుకొని దుర్మార్గంగా కౌరవులు ఆమెను రాజసభలోకి ఈడ్చుకు వచ్చారు.
కౌరవులు పాండవులకు అపకారం చెయ్యని రోజంటూ లేదు. పుట్టినది మొదలు వారు అలా దురాగతాలను చేస్తున్నా ఏనాడూ ఇది తప్పని గ్రుడ్డివాడైన తమ తండ్రి వారిని మందలించలేదు.
మోసంతో జూదంలో పాండవులను ఓడించారు. వారి రాజ్యభాగాన్ని అన్యాయంగా ఆక్రమించారు. అడవులకు పంపించేశారు. వారు అలాగే అడవులకు పోయి, పదమూడేండ్ల గడువును పూర్తి చేసికొని, తిరిగి వచ్చి వారి రాజ్యాన్ని తిరిగి ఇమ్మంటే అంగీకరించలేదు.
కౌరవులు రాజ్యభాగాన్ని ఇవ్వకపోవడంచేత ధర్మరాజు సకలసృష్టికి నియంత, అందరికీ దిక్కైనవాడు, ఆశ్రితులకు పారిజాతంవంటివాడు, అంతంలేనివాడు, అంతులేని శక్తి కలవాడు, నందకమనే ఖడ్గాన్ని ధరించినవాడు, పద్మాలవంటి కన్నులు కలవాడు అయిన శ్రీకృష్ణుని రాయబారిగా పంపించాడు. అకళంకమైన భక్తికి మాత్రమే వశమయ్యై మనసు కలవాడైన వాసుదేవుడు ధర్మజుని పంపున ధృతరాష్షునివద్దకు
మహారాజా! అలా వెళ్ళిన వాసుదేవుడు అక్కడ భీష్ముడు, ద్రోణుడు, వాని కుమారుడైన అశ్వత్థామ, కృపాచార్యుడు, ఇంకా ఎందరో రాజులు విని అంగీకరించే విధంగా ధృతరాష్టమహారాజుతో ఇలా పలికాడు.
మహారాజా! (శ్రీకృష్ణుడు చెపుతున్నాడు) నీకు నీ కుమారులు, నీ తమ్ముని కొడుకులైన పాండవులు ఇరువురూ వేరు కాదు. ఒకలాంటివారే. అందువల్ల నీ కొడుకులను ఏదోవిధంగా ఒప్పించి, పాండవుల రాజ్యభాగాన్ని వారికి ఇచ్చినట్లయితే, రెండు పక్షములు హాయిగా బ్రతికి బట్టకట్టును.
శ్రీకృష్ణుడు ధర్మమార్గంలో చెప్పిన మాటలు కౌరవులకు చెవికి ఎక్కలేదు. అందువల్ల నీతికోవిదుడైన విదురుణ్ణి ఆ సభకు రప్పించుమన్నాడు వాసుదేవుడు. అప్పుడు విదురుడు ఆ సభకు చేరుకొన్నాడు.
విదురుడు కౌరవసభకు వచ్చాడు. అంతవరకు ఏమి జరిగిందో భీష్మాదులద్వారా తెలిసికొన్నాడు. అప్పుడు కౌరవపతితో ఇలా అంటున్నాడు.
కురుకుల శ్రేష్ఠుడవైన ఓ ధృతరాష్టమహారాజా! పాండురాజు ఎవరో కాదు, నీ తమ్ముడు. అందువల్ల అతని కుమారులకు చెందిన రాజ్యభాగం పంచి ఇవ్వటం ధర్మమూ, న్యాయమూ కూడ. అలా చేస్తే నీ వంశం అచంచలమైన గొప్ప సుఖాన్ని పొందుతుంది. మీ ఉభయులు కలసి మెలసి ఉండటంవల్ల శత్రువులవరూ మీవంక కన్నెత్తి చూడలేరు. అదీగాక అలా చేస్తే గోపాలచూడామణియైన శ్రీకృష్ణునికి ఆనందం కలిగించినవారౌతారు. అది చాలా క్షేమదాయకం.

రాజా! నీ తమ్ముని కొడుకులకు వారి తండ్రి భాగాన్ని పంచి ఇయ్యి. నీ భాగాన్ని నీ కొడుకులందరికీ పంచిపెట్టు. పట్టుదలకు పోకుము. మంచిబుద్ధితో ప్రవర్తించి, వంశాన్ని నిలబెట్టుము.
రాజా! నామాట విను. వెయ్యిమాటలు చెప్పనవసరం లేదు. నీ కొడుకుల పేర్లు వింటేనే చాలు, భీముడు తోక త్రొక్కిన త్రాచువలె మండిపడుతున్నాడు. ఇదంతా ముందే నీకు చెప్పాను. ఎలాగైనా నీ కుమారులకు వాని చేతిలో చావు తప్పదు.
అంతే కాకుండగా
రాజా! నీ కొడుకుల వీరత్వం, భీష్మద్రోణకృపుల భుజబలం, కర్ణుని ప్రేలాపనలు ఇవన్నీ నిజమే అనుకొంటున్నావా? అలా అయితే నేను చెప్పేది విను.
మహారాజా! ఏ పరమేశ్వరుని అనుగ్రహంవల్ల ఈ లోకాలు స్థావరజంగమాలతో కూడి ప్రకాశిస్తున్నాయో; బ్రహ్మ, శంకరుడు మొదలైన దేవతలు, మహర్షులూ అందరూ ఏ ప్రభువు దివ్యకళలనుండి జన్మించారో; ఎవ్వడు అనంతుడో; ఎవ్వడు అచ్యుతుడో; ఆ పురుషోత్తముడే దయాపయోనిధి అయిన శ్రీకృష్ణుడు.
అటువంటి జగన్నివాసుడు, మురాసురుని చంపినవాడు, పరాపరస్వరూపుడు (సర్వశ్రేష్ఠుడు) అయిన శ్రీకృష్ణుడు పాండవులకు స్నేహితుడై, వియ్యంకుడై, బంధువై, గురుడై, ప్రభువై ఎంతో ప్రేమతో ఎల్లపుడూ కాపాడుతుంటాడు కదా! అటువంటి పాండవులను కనీసం వ్రేలెత్తి చూపించేందుకు ఎవరికైనా సాధ్యమవుతుందా?
అందువల్ల పాండవులను బాధపెట్టకుండా వారి రాజ్యభాగాన్ని వారికి ఇచ్చి, దేశాన్ని కులాన్ని కుమారులను, మిగిలిన బంధువర్గాన్ని రక్షించు. అలా కాకుండా లోభియైన దుర్మార్డుడైన దుర్యోధనుని మాట విన్నాా ఉదాసీనంగా వ్యవహరించినా దానివల్ల కులనాశం, బంధునాశం కూడా జరుగుతుంది.
మహారాజా! ఒక్కడికోసం మొత్తం వంశాన్ని పాడు చేసుకుంటావా? ఇది న్యాయమేనా? నా మాట విని, ఈ దుర్యోధనుణ్ణి విడిచిపెట్టి నీ కులాన్ని ఈ దేశాన్ని నీ పరువును, ప్రతిష్టను కాపాడుకో.
విదురుడు అలా చెప్పేసరికి దుర్యోధనుడు కోపంతో ఊగిపోయాడు. తనను తాను మరచిపోయాడు. వెంటనే కర్ణుణ్ణి, శకునిని, దుశ్శాసనుణ్ణి చూచి ఇలా అన్నాడు.
కర్ణశకుని దుశ్శాసనులారా! ఈ దాసీపుత్రుడు ఏదీ పట్టనట్లుగా ఒకమూల కూర్చోదగినవాడు. ఇతనిని ఇక్కడకు ఎందుకు రానిచ్చారు. వచ్చినవాడు మౌనంగా కూర్చోకుండా నోటికి వచ్చినట్లు ప్రేలుతున్నాడు. వెంటనే ఇతనిని బయటకు గెంటివేయండి అన్నాడు దుర్యోధనుడు.
ఈ విధంగా దుర్యోధనుడు అహంకారంతో మాట్లాడిన మాటలకు ఎంతో మానసిక వ్యధను అనుభవించాడు విదురుడు. వెంటనే ఆలోచించాడు. ధైర్యం వహించాడు. మరొకమాట మాట్లాడకుండా, విల్లమ్ములు అక్కడే విడిచిపెట్టి, కోపాన్ని అణచిపెట్టుకొని, అడవికి వెళ్ళిపోయాడు.

అలా అన్నీ విడిచిపెట్టి వెళ్ళిన విదురుడు శ్రీహరి స్వయంగా వెలసిన పవిత్ర ప్రదేశాలను, వైష్ణవ క్షేత్రాలను, దేవతలు నిర్మించిన దివ్యస్థలాలను, గంగ మొదలైన పుణ్యనదులను, పురాణ ప్రసిద్ధములైన సిద్ధాశ్రమాలను, తపోవనాలను, ఇంకా గంధమాదనంవంటి కొండచరియలను, అక్కడి చక్కని పొదరిండ్లను, వికసించిన కలువలు, చెంగలువలు, పద్మాలలోని మకరందాన్ని త్రాగి పరవశించిన తుమ్మెదలు చేసే ఝంకారాలకు మేలుకొన్న రాజహంసల విలాసాలతో అందగించుచున్న సరోవరాలను చూస్తూ ఉన్నాడు.
అంతేకాకుండగా మునుల ఆశ్రమాలను సందర్శించాడు విదురుడు. తపోవనాలు, నదులు, వాటికి దాపుననున్న చిన్న చిన్న వనాలు, నదాలు, బోయవారు నివసించే ప్రదేశాలు, కొండగుహలు, గోశాలలు, యజ్ఞవాటికలు, జనపదాలలోని దేవాలయాలు మరెన్నో పుణ్యభూములను చూస్తూ సంచరించాడు.
విదురుడు ఆయా ప్రదేశాలు తిరుగుతున్నాడు. ఆకులు, కూరలు, నీళ్ళు తప్ప వేరే ఆహారమేదీ తీసుకోవడం లేదు. శరీరసంస్కారంకూడా చేసుకోవడం లేదు. అవధూతవేషంలో అడవులలో సంచరిస్తున్నాడు.
పరీక్షిన్మహారాజా! (శుకమహర్షి చెప్పుచున్నాడు) విదురుడు సంతోషంతో కోపాది వికారాలు లేనివాడై, భరతఖండంలో ఉన్న పుణ్యనదీనదాలనన్నిటిని చూస్తూ సంచరించాడు.
విదురుడు అలా సంచరిస్తూ క్రమంగా ప్రభాసతీర్థానికి చేరుకొన్నాడు. అప్పుడు
విదురుడు అలా సంచరిస్తూ, శ్రీ కృష్ణుని దయవల్ల సంప్రాప్తమైన రాజ్యాన్ని ధర్మరాజు పాలిస్తున్న ప్రదేశానికి చేరుకొన్నాడు. అక్కడి మద్ది, మామిడి, గురివెంద, ఎర్రగోరింట, మాలతి, పొగడ మొదలైన చెట్లు, తీగలతోకూడిన ఒక నది ఒడ్డున నివసించాడు.
పరీక్షిన్మహారాజా! ధర్మరాజు పరిపాలిస్తున్న ప్రాంతానికి చేరువలోనున్న విదురుడు మహాభారత సంగ్రామం గురించి విన్నాడు. వెదుళ్లలో పుట్టిన అగ్ని మొత్తం అడవిని కాల్చివేసినట్టు, కారవపాండవుల మధ్య పుట్టిన కలహం దుర్యోధనుడాదిగా ఎందరో మహారాజులను పొట్టన బెట్టుకొన్నదని విని ఎంతో దుఃఖించాడు.
జ్ఞాతి (దాయాది) వర్గంలో పెక్కురు యుద్ధంలో మరణించారని తెలిసి, అక్కడ ఉండడానికి కాలు నిలువలేదు విదురునికి. ఋషికల్పుడైన అతడు అక్కడనుండి బయలుదేరి, సరస్వతీనదిలో స్నానం చేశాడు. అక్కడనుండి అగ్ని, సూర్య, శుక్ర, పృథు, త్రిత, సోమ, సుదాస, కుమార, వాయు, యమ నామధేయాలతో ప్రసిద్ది పొందిన అన్ని నదులలోనూ స్నానం చేస్తూ వేగంగా ప్రయాణం సాగించాడు.
విదురుడు పుణ్యస్టలాలను చూస్తున్నాడు. పవిత్ర తీర్థాలను సేవిస్తున్నాడు. మాధవుడు కొలువుండే దేవాలయాలను, రకరకాల మణులను పొదిగిన ఆ మందిరాల తలుపులను, గడపలను, రాజగృహాలను, గోపురాలను, విమానాలను చూస్తూ, గోవిందుని పాదపద్మాలనే స్మరించుకొంటూ క్రమంగా ముందుకు సాగిపోయాడు.

No comments:
Post a Comment