దేవతలారా! మీకు పూర్వీకులైన సనకాదిమునులు నా కుమారులే. వారు గొప్ప పుణ్యాత్ములు- సంచారం చేసే దేవుళ్ళు. వారు తమ అపారమైన బుద్ధివిశేషంచేత మంచిచెడ్డలను గుర్తిస్తారు.
సనకాదులు ధైర్యశాలులు. ఏ కోర్కెలు లేనివాళ్ళు. ఒకరోజు భక్తితో 'శ్రీహరి పాదసేవచేయా'లనే ఆసక్తితో లోకాలన్నింట యథేచ్చగా సంచరిస్తూ వెళ్ళారు.
మహాజ్ఞానులైన ఆ సనకాదులు లోకసంచారం చేస్తూ పోయి పోయి వైకుంఠాన్ని చూచారు. ఆ వైకుంఠం నిత్వమంగళకరమైన సంపదతో అలరారుతుంది. దాన్ని దర్శించిన భక్తజనం ఆ నగరవైభవాన్ని ప్రస్తుతిస్తారు. అందులో ప్రవేశించిన వాళ్ళకు ఇక పునర్జన్మ లేదు. అది సుజనులు ప్రశంసించే ప్రదేశం. భక్తకోటిని ఆ నగరం ఎప్పుడూ కాపాడుతూ ఉంటుంది. అది శ్రేష్టమైన నగరం.
ఆ వైకుంఠపురంలో నివసించేవారు తమకు కర్మఫలత్యాగమే మహాఫలమని భావిస్తారు. మోక్షమే తమపాలిటి ధర్మంగా భావించి, వైకుంఠస్వరూపులై శ్రీహరి పాదపద్నాల్ని సేవిస్తూ సంతోషిస్తుంటారు.
(నిష్కామఫలం : సకామఫలం, నిష్కామఫలం అని ఫలితం రెండు రకాలు. చేసే కర్మకు ఫలితం ఆశిస్తే అది 'సకామఫలం' అవుతుంది. ఇది సగుణోపాసకుల ధర్మం. చేసేకర్శకు ఏ ఫలితాన్ని ఆశించనట్లయితే దాన్ని 'నిష్కామఫలం' అంటాం. ఇది నిర్గుణోపాసకుల ధర్మం.)
ఆ వైకుంఠంలో నివాసమున్న స్వామి శ్రీమన్నారాయణుడు. ఆయన రజోగుణతమోగుణాలకు దూరమైనవాడు. విస్తారమైన పేరుప్రతిష్టలు గలవాడు. సత్త్వగుణోపేతుడు. ఆయనకు చావుపుట్టుకలు లేవు. సమస్తసుఖాలు ఇచ్చేవాడు. తుదిమొదలు లేనివాడు. మహాశక్తిమంతుడు. వేదవేద్యుడు. పొరపొచ్చాలు లేని ధర్మమూర్తి. ఆ నగరమందలి ఉద్యానవనాలన్నీ ఆ భగవంతుని పేర చెలామణి అవుతున్నాయి.
అది పరాత్పరుడైన శ్రీమన్నారాయణుని నివాసం వైకుంఠం. అక్కడ నివసించేవాళ్ళు నిష్కాములై శ్రీహరిని సేవిస్తారు. శుద్ధసత్వమూర్తియైన విష్ణుమూర్తి భక్తుల కానందాన్ని కూరుస్తాడు. అక్కడ “నిశ్శ్రేయస”మనే పరమార్ధస్వరూపమైన ఒక వనముంది. ఆ వనంలో అన్ని ఋతువుల్లో పూలు పూచి, కాయలు కాచే కల్పవృక్షాలు కోకొల్లలుగా ఉన్నాయి. గంధర్వులు విమానాల్లో తమ ప్రియురాండ్రతో అక్కడికి వచ్చి భగవంతుని కథల్ని గానం చేస్తారు. ఆ సరోవరానికి దగ్గర ఒక మాధవీ లత ఉంది. దాని మధురవాసనతో కూడిన పిల్లగాలి మనసులకు హాయి గొల్పుతుంది. అందర్ని ఆకర్షిస్తుంది. అయినా భక్తుల మనస్సులు మాధవీలతలకంటెకూడ మనోజ్ఞమైన హరికథలపైననే ఉంటాయి. ఆ వనమందలి తుమ్మెదలు జుమ్మని ఝంకారాలు చేస్తూ విష్ణుకథలు గానం చేస్తుంటే పావురాలు, కోయిలలు బెగ్గురుపిట్టలు, చకోరాలు, రాయంచలు, తిత్తిరిపక్షులు, నెమళ్ళు అల్లరిచేయటం మానుకొని తుమ్మెదలు గానం చేసే విష్ణుకథలనే వింటూ తలలూపి ఆనందిస్తున్నాయి. విష్ణుదేవునికి తులసి అంటె చాలప్రీతి. కాబట్టి వనంలో ఉన్న మందారాలు, మల్లెలు, సంపెంగలు, గోరంటలు, కలువలు, తామరలు, పున్నాగాలు, నాగకేసరాలు, పారిజాతాలు మంచి పరిమళం గలవే అయినా తులసి చేసిన తపస్సే గొప్పదని దాని సౌభాగ్యాన్ని మెచ్చుకుంటాయి.
ఇక లక్ష్మీదేవి గొప్ప అందగత్తె. ఆమెది చంచలస్వభావం. ఎవ్వరిదగ్గర చాలాకాలం కాపురం ఉందదు. కాని ఆమె తన స్వభావానికి స్వస్తి చెప్పి విష్ణుమందిరంలో స్థిరంగా కాపురముంటోంది. పాదపద్మాల అందెలు ఘల్లుఘల్లు మనేట్లు వైడూర్యమణులు తాపిన బంగారుగోడలతో నిర్మించిన సుందరభవనంలో నడుస్తున్నప్పుడు ఆమె దివ్యసుందరవిగ్రహం వైడూర్యమణులపై ప్రతిఫలిస్తుంది. శ్రీదేవి నిశ్శ్రేయసవనంలో పగడపుపావంచలుగల్గి అమృతతుల్యమైన నీరుగల సరస్సులందు విహరిస్తూ వాటిలో దంతక్షతమైన తన నెమ్మోవి ప్రతిఫలిస్తే చూచి 'ఇలా తననాథుని ప్రసాదం పొందగల్గా'నని మనసులో ఉప్పాంగిపోతుంది. ఆ వనం పుణ్యానికి శరణ్యమైంది. ధర్మానికి నెలవైంది. సుకృతానికి ఆలవాలమైంది.
మాధవుడంటే గిట్టనివాళ్ళు, అన్యదేవతా విషయాల్లో ఆసక్తిగలవాళ్ళు, పాపం మూటగట్టుకొన్న వాళ్ళు, నరకానికి దారితీసేవి, అందరిచే ఈసడింపబడేవి అయిన చెడ్డకథల్లో ఆసక్తి కల్గినవాళ్లు, ఆ శ్రీనాథుని పాదపద్మాలను ఎల్లప్పుడు కొలిచే భక్తుల నివాసాన్ని(వైకుంఠం) చేరుకోలేరు.
ఇంతేగాక, ఇంకా మోక్షాధీశ్వరుడును, నిగనిగలాడే జుట్టుగలవాడును, మొదలుతుది లేనివాడును అయిన శ్రీమన్నారాయణుణ్ణి ధర్మతత్త్వజ్ఞులై, కొంత అనుభవం కూడగట్టిన కొందరు మానవులు (ఆయన్ని) సేవించాలనుకొని, ఆ సర్వేశ్వరుని మాయవల్ల వైకుంఠంలో స్వామి పాదాల్ని పొందలేకపోతున్నారు.
మంచిపనులు చేసి సుకృతాత్ములనిపించుకొనే భక్తులు వైకుంఠపు పుణ్యస్థలంలో నివసిస్తారు. ఆ పుణ్యభూముల్లో నివసించేవారు శ్రీమన్నారాయణుని పవిత్రగాథల్ని వింటూ సంతోషంతో ఉప్పాంగిన కన్నీళ్లు కారడంవల్ల వాళ్ల చెక్కిళ్లు అందంగా ఉంటాయి. బొంగురుపోయిన కంఠంతో శరీరంపై పులకలు రేగి ఉంటారు. వారికి ఏ విధమైన కోర్కెలుండవు. అహంకారం వారిలో మచ్చుకైనా కన్పించదు. (ఈ లక్షణాలు గలవాళ్ళే ఆ పుణ్యభూముల్లో ఉండటానికి అర్హులని పిండితార్థం).
ఆ వైకుంఠ ధామం ఒక సరోవరం. అక్కడొక బంగారుశాల. దాని చెంత గోపురంతోడి మేడ. ఆ మేడ కల్గిన భవనం ఒక పద్మం. ఆ మందిరంలో ధగధగమెరుస్తున్న అనంతనామక సర్పమే తామరదుద్దు. అక్కడే అనంతశయనం. దానిపైన ఆ సిరిమగడు జుంటీగలా నివసిస్తాడు.
శ్రీహరిచే పాలింపబడునది, బంగారు గోపురంకలది, సత్పురుషుల సమూహంచే ఒప్పినట్టిది, అతిశయమైన మహిమనే ప్రకాశించునది అయిన శ్రీహరి సౌధానికి, లోకశ్రేయస్సు కోరే మునీశ్వరులు సనకసనందనాదులు సంతృప్తిమనస్కులై యోగబలంతో వడివడిగా కోరివచ్చారు.
ఆ ఋషులు అన్యచింతన మానుకొని కేవలం ఆ కమలాక్షుని చూడాలనే ఉత్సాహం గలవారై పచ్చరాళ్ళమణులు పొదిగిన ద్వార తోరణాలతో వెలిగిపోతున్న గోడలు, తలుపులు, గడపలు గల ఆరు లోగిళ్ళు దాటి ఏడవకక్ష్యలో సమానమైన ఈడుగల ఇద్దరు హరివాసపు కావలికాండ్రను చూచారు.
(షట్ సుకక్ష్యలు : ఆరు మంచిలోగిళ్ళు ఇక్కడ అంతరార్థముంది. ఆధ్యాత్మికప్రతీకలు ఈ లోగిళ్ళు. దేహం షట్‌చక్రశోభితమనీ, ఆ ఆరింటికి పైన శిరోమధ్యభాగంలో సహస్రారమనే ఏడవ చక్రముందని యోగులు చెపుతారు.
ఆరుచక్రాలు : 1) మూలాధారం - గుదస్థానం, 2) స్వాధిష్ఠానం - పొత్తికడుపు ౩) మణిపూరం - నాభినుండిపైకి 4) అనాహతం - వక్షోభాగం, 5) విశుద్ధి - కంఠభాగం, 6) ఆజ్ఞాచక్రం - ఫాలభాగం 7)సహస్రారం - మధ్యశీర్షం. దీనికి బ్రహ్మరంధ్రమనిపేరు.)
సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు నల్గురు యోగులు వైకుంఠమునకేగి అక్కడ విష్ణుమూర్తి యొక్క మందిరం ముందు నిల్చున్న ఇర్వురు ద్వార పాలకులను చూచారు. ఆ ఇద్దరు నవరత్నాలు పొదిగిన బంగారు కడియాలు, ఉంగరాలు, హారాలు, భుజకీర్తులు, కాళ్ళ అందెలు ధరించి ఉన్నారు. వారు ఎదపై ధరించిన సువాసనగల తోమాలలగంధానికి ఆకర్షింపబడి తుమ్మెదలు మూగుతున్నాయి. చేతుల్లో గదలు తాల్చి ఉన్నారు. వారికి నాల్గేసి భుజాలున్నాయి. చాలా ఉత్సాహంగా కన్పిస్తున్నారు. కళ్ళల్లో కోపాగ్ని జ్వలిస్తోంది నొసళ్ళపై ముడుతలు వంకర దిరిగి ఉన్నాయి. చేతుల్లో బెత్తాలున్నాయి. మునులు మహాబుద్ధిమంతులు మరియు గొప్ప జ్ఞానవృద్దులు. కంటికి చాలా చిన్నవారుగా కన్పిస్తారు.
ఎంతో వృద్దులైనప్పటికి ఆత్మతత్త్వజ్ఞులైన సనకాదులు నల్వురు చూచుటకు అయిదేండ్ల ప్రాయంగలవాళ్ళలా కనిపిస్తూ మనస్సులో జంకుకొంకు లేకుండ చకచక నడుస్తూ శ్రీహరిద్వారం చేరబోయారు.
జ్ఞానశ్రేష్ఠులైన సనకాదిమునులు నల్వురు శ్రీమన్నారాయణుణ్ణి చూడాలనే కోర్కెతో ముందుకు వచ్చారు. ఇంతలో ఆ ఇద్దరు వేత్రహస్తులు తమ ఆజ్ఞను జవదాటకుండా వాళ్ళని ముందుకు సాగనివ్వలేదు.
వేత్రహస్తులు లోపలికి వెళ్ళకుండా అడ్డుకొన్నారు. అక్కడ చేరిన దేవతలు చూస్తున్నారు. అప్పుడు సనకాదులు కోపంతో ఎర్రబారిన చూపులు గలవారై వాదోపవాదాలను నివారించి, ఆ ద్వారపాలకులు, మరియు అచ్చట మూగిన దేవతలు వినేటట్లు ఇలా అన్నారు.
మునులు దేవతలనుద్దేశించి "పరమాత్ముడును, భక్తుల్ని పాలించేవాడును, చెలికాడును, దేవాధిదేవుడునునైన శ్రీమన్నారాయణుణ్ణి నిరంతరం సేవించాలని ఏ ఆటంకం లేకుండా ఇచ్చటికి వచ్చాం. మా సేవకు ఇప్పుడు అడ్డుతగులుతూ, మహోత్సాహంతో కాపలా కాస్తున్న ఈ దుర్మార్గులను మీరు చూచారు గదా!"
సనకాదిమునులు జయవిజయులతో "స్వామి హితాన్ని కోరే మావంటి నిష్కపటుల్ని మందిరంలోనికి అనుమతించడమూ, మోసగాండ్రను లోనికి వెళ్ళకుండా అడ్డుపడటం అనే ఈ రెండు ప్రవృత్తులు వేత్రహస్తుల విహితలక్షణాలని భావించి మీరు మమ్మల్ని లోనికి వెళ్ళకుండా నివారించారు. వినండి. శ్రీమన్నారాయణుడు దివ్యశక్తితో విరాజిల్లువాడు. రూపనామాలు లేనివాడు ఈ చరాచరప్రపంచమంతా ఆయన కడుపులో దాగి ఉంది. ఆయన భగవంతుడు. ఆయన పొందదగింది(ప్రాష్యం), పొందించేది(ప్రాపకం), పొందటం(ప్రాప్తి) అనే ఈ త్రిపుటియందు ఏలాటి భేదం లేనివాడు. జ్ఞానులు ఆయన్ను మహాకాశంలో ఘటాకాశపటాకాశాలు విలీనమైవున్నట్లే సమస్తమైన ఆత్మలలో దాగి ఉన్నాడని భావిస్తారు. అంతేగాక లోకంలో రాజులు తప్పుచేసిన భృత్యుల్ని దండిస్తున్నట్లే, స్వామికూడ తమ్ము దండిస్తాడు గదా అనే సందేహంతో మమ్ముల అడ్డుకొన్నట్లు అనుకొంటారేమో? అలా భావించవద్దు. ఎందుకంటే బ్రాహ్మణవేషం తాల్చిన (బ్రహ్మతత్త్వజ్ఞులు) మాకు, వైకుంఠవాసుడైన హరికి భేదం లేదు. మమ్మల్ని శంకించవద్దు. ఇదంతా తెలిసికూడ మీరు తెలివిలేనివారై మాయెడ అనుచితంగా ప్రవర్తించారు. కాబట్టి మిమ్మల్ని శపిస్తున్నాం. భూలోకంలో పుట్టండి. మిమ్మల్ని 'కామం, క్రోధం, లోభం అనే శత్రువులు పట్టి పీడిస్తాయి' అని మునులు ఆ జయవిజయుల్ని శపించారు.
జయవిజయులు సనకాదుల శాపవచనాలు విని ఉలికిపడ్డారు. బ్రాహ్మణుల శాపం వాడియైన బాణాలచేతకూడ నివారింప శక్యం కానిది కావడంవల్ల వాళ్లు తల్లడిల్లి పోయారు.
శ్రీహరి ద్వారపాలకులిర్వురు తమపై పడిన శాపానికి బాధపడుతూ సనకాదుల పాదాలపై సాగిలపడ్డారు. అనంతరం తమ నొసటిపై దోసిలొగ్గారు.
ద్వారపాలకులు ఈ విధంగా మొరపెట్టుకున్నారు. "ఓ మహాయోగీశ్వరులారా! మీరు మమ్మల్ని యిలా చాలా కఠినంగా శపించారు. ఇక అందుకు బాధపడి ప్రయోజనం లేదు. మేము అజ్ఞానులం. మీ వంటి ఉత్తములను అవమానించినందువల్లే మాకు ఈ దుర్దశ కల్గింది. అయినా మాకు మేలే జరుగుతుంది" అని జయవిజయులు మునులతో అన్నారు.
"మహాత్ములారా! మీరు మాపై దయగలవారైతే మా కోర్కె ఒక్కటే. మేము లోభమోహాలతో కూడిన జన్మ ఎత్త బోతున్నాం. ఆ కాలంలో శ్రీమన్నారాయణుని నామోచ్చారణ మరువకుండా అనుగ్రహించండి. అందువల్ల మేము మున్ముందు ఎత్తబోయే జన్మలు తరిస్తాయి" అని జయ విజయులు మునులకు మొరపెట్టుకొన్నారు.
జగన్నాయకుడును, ఆదిమధ్యాంతాలు లేనివాడును అయిన ఆ శ్రీహరి అక్కడ సనకాదులకు, వేత్రహస్తులకు మధ్య సాగుతున్న గొడవ విని భక్తుల బాధను తొలగించాలనీ, వారికి సంతోషం కల్గించాలనీ భావించి, తన అంతఃపురంలోని లోగిళ్ళు దాటి వచ్చాడు.
ఇంతేకాక, ఇంకా లక్ష్మీదేవికూడా తొట్రుపాటుతో విష్ణువువెంట వచ్చింది. పరమహంసలైన మునీశ్వరులకు వందనీయాలైన పదారవిందాల యందలి నూతనమైన మణులు పొదిగిన బంగారు అందెలు శ్రావ్యమైన శబ్దం చేస్తూ ఉండగా ఆయన నడచి వచ్చాడు. మహానుభావులు, యోగివరేణ్యులు సేవిస్తుండగా స్వామి దర్శనమిచ్చాడు.
శ్రీహరియొక్క ముంజేతికి తొడిగిన బంగారు రత్నకంకణాలు గల్లుగల్లుమంటున్నాయి. అప్సరసలు రాయంచరెక్కలవంటి తెల్లని వింజామరలతో వీస్తున్నారు. వాటి గాలికి గొడుగుల అంచులలో వ్రేలాడుతున్న ముత్యాలహారాలు కదలాడుతుంటే ఆ హారాలనుండి స్రవించిన జలబిందువులు స్వామి శరీరంపై పడి నిగనిగలాడుతున్నాయి-
ఆ తర్వాత ఇంకా ఆ శ్రీమహావిష్ణువు వైకుంఠనగరానికే అలంకారంగా ఉన్నాడు. ఆ నగరం సమస్తలోకాలకు మకుటంగా విరాజిల్లుతోంది. ఇక ఆ స్వామి చుట్టు చేరిన ఋషీశ్వరులు పొగడుతుంటే ఆయన ముఖపద్మం చిరునవ్వుతో వెలిగిపోతోంది. చల్లని చూపులతో తన్నుతూ ఆ దైవం భక్తులహృదయాల్లో నివసిస్తున్నాడా అన్పిస్తుంది. ఆయన నిగనిగలాడే రొమ్ముపై విష్ణుమాలిక వ్రేలాడుతోంది. భక్తులను సంరక్షించాలనే దయార్ద్రదృష్టి ఆయన కన్నుల్లో తొణికిసలాడుతోంది. ఋషీంద్రులాయన్ని సేవిస్తున్నారు. ఆయన సత్పురుషుల్ని కాపాడగల దేవుడు.
శ్రీహరి తాను మొలకు కట్టుకొన్న పసుపుపచ్చని పట్టుపుట్టం వల్ల మొలనూలి కాంతి జిగేలు మంటున్నది. మెడకు తాల్చిన హారకాంతులవల్ల కౌస్తుభమణికాంతులు అతిశయించాయి. మెరపు తీగెల జిగిని సైతం తిరస్కరించే చెవిపోగుల తళతళలు చెక్కిళ్ళ సోయగాన్ని ఇనుమడింపజేస్తున్నాయి. స్వామి ధరించిన నవరత్నాల కిరిటప్రభలు దిక్కులన్నింట వ్యాపించాయి.
గరుత్మంతుని వీపుపై మోపిన ఎడమచేతికి చుట్టుకొన్న బాహుపురులు శోభిల్లుతున్నాయి. ఆయన కుడిచేత అందమైన విలాసపద్మం తిరుగుతోంది.
పాదపద్మాల మనోహర కింజల్కసమూహకాంతిచేత చూడముచ్చటగా ఒకింత ఎరుపెక్కిన తులసిమాల మకరంద సువాసనతో కూడిన గాలిని పీలుస్తూ తనకు సేవచెయ్యాలని ఎదురుగా వస్తున్న సనకసనందనాదులకు మానసికానందాన్ని కలిగించేవాడై, బాహ్యేంద్రియ అంతరింద్రియాల్లో పూర్తిగా నిండిన సంతోషంచేత గగుర్పొడిచిన వెంట్రుకలు కలవాడై, ఆకర్షకం, కాంతిమంతం అయిన స్వరూపంతో రమాదేవి అందం క్రిందగునట్లు ప్రకాశిస్తూ సర్వేశ్వరుండైన శ్రీహరి పాదచారియై వచ్చాడు.
ఆ స్వామి మహావైభవంగా మునులచెంతకు పాదచారియై వచ్చాడు. ఆయన కిందిపెదవి పగడపువన్నె గలదై ఎర్రని కాంతితో ఒప్పారగా, విచ్చిన మొల్లమొగ్గలను బోలిన చిరునవ్వు మోముపై తాండవిస్తుంటే సనకాదులు చూచారు. ఆ చూపుతో వారు సంతృప్తి చెందజాలక ఆ దేవుని ముఖసౌందర్యాన్ని తదేకంగా మరల మరల అలా చూస్తూ ఉండిపోయారు.
సనకాదిమునులు అలా భగవంతుడు తమకు ఎదురుపడగానే ఆ రూపాన్ని తనివిదీరా చూస్తూ తమ చూపులను మరల్చుకోలేకపోయారు. ఎలాగో చివరకు మళ్ళించి స్వామిపాదాలను చూచారు. ఆ పాదాలు పాపరహితులైన భక్తులబాధలను నివారించగలవు. మునీశ్వరులకు హృదయానందాన్ని ప్రసాదించగలవు. వైకుంఠపువాకిలిని తెరిచి ఉంచగలవు. వాటి అందెలమ్రోతలు వేదాలకు సరికొత్త భాష్యం చెప్పగలవు. (అంతటి మహిమలు గల పాదాలను మునులు చూచారని తాత్పర్యం)
మునులు శ్రీహరి పాదాలను చూచిన తర్వాత వాటిని తమయెదలో భద్రపరుచుకొన్నారు. ఆ పాదాలకు గోళ్ళు పద్మరాగమణికాంతులు గలవై మెరిసిపోతున్నాయి. తమ కోర్కెలీడేరునట్లు ఆ స్వామిపాదాలకు ఆ మునులు సారె సారెకు నమస్కరించారు. ఆ మహాత్ముడు యోగులకు సైతం చిక్కడు.
ఆ శ్రీహరి ధ్యానగమ్యుడు. తత్త్వజ్ఞులు మాత్రమే ఆయన్ని చూడగలరు. ఆయనది భక్తజనాలకు ఆనందాన్నిచ్చేరూపం. సనకాదులు మహిమగల ఆ రూపాన్ని తమ మనస్సుల్లో నిలుపుకొన్నారు.
తమ ఎదుట కన్పిస్తున్న దివ్యస్వరూపుడు మహాతేజోనిధియైన శ్రీహరిని చూచి సనకాదులిట్లు ప్రస్తుతించారు.

No comments:
Post a Comment