కర్దమప్రజాపతి కూతురు 'కళ'. 'మరీచికళ'లకు కశ్యపుడనే మగబిడ్డా, పూర్ణిమ అనే ఆడుబిడ్డా పుట్టారు. వీళ్లకు క్రమంగా పుట్టిన తరతరాలసంతతి వల్ల పద్నాలుగు లోకాలూ నిండిపోయాయి. ఈ 'పూర్ణిమే' మరోజన్మలో విష్ణుపాదాలు కడిగిన నీళ్లవల్ల 'గంగ' అనే పేరుతో పుట్టింది. ఈ గంగ 'దేవకుల్య' అనే ఒక కుమార్తెనూ, 'విరజుడ'నే కొడుకునూ పొందింది. ఈ విరజుడు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినాడు.
(భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక, అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళ లోకాలు పద్నాలుగు లోకాలు. ఇవే 'భువనంబులు'. వీటిల్లో మొదటి ఏడూ ఊర్ధ్వలోకాలు. తర్వాత ఏడూ అధోలోకాలు.
మూలంలో 'పూర్ణిమ' కొడుకు. తెనిగింపులో కూతురు. ఆ పూర్ణముడికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. అనువాదంలో ఒక కొడుకు. ఒక కూతురు దేవకుల్య గంగ. తెనిగింపులో పూర్ణిమ గంగ; ఈ గంగ కూతురు దేవకుల్య.
అత్రి మహాముని, అనసూయవలన (కర్దముడి కూతురు) వల్ల బ్రహ్మ, విష్ణు, శివాంశలతో ముగ్గురు కొడుకులను మిగుల ప్రీతితో కన్నాడు.
(అత్రి = ఇతడు సప్తర్షుల్లో మూడవముని. పురసూదనుడు= త్రిపురాలను దహించిన వాడని - మహేశ్వరుడని వ్యుత్పత్తి. దత్తాత్రేయుడు, దుర్వాసుడు, చంద్రుడు అత్రి కొడుకులు.)
విదురుడు మైత్రేయుణ్ణి ఇలా అడిగాడు. ఓ మునివరా! సృష్టికీ, పోషణకూ, లయానికీ కారణమైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వీరు అత్రిమహాముని ఇంట అనసూయకు త్రిమూర్తులు ఉన్నత గుణవంతులైన చక్కటి కొడుకులుగా పుట్టడానికి అసలు కారణం ఏమై ఉంటుందని విదురుడు ప్రశ్నించాడు. అతడితో మైత్రేయుడు ఇలా చెప్పసాగాడు.
ఓ మునివరా! విను. దైవప్రేరణతో అత్రిమహర్షి అనసూయతో కలిసి ఋక్షమనే కులపర్వతానికి వెళ్లి తపస్సు చేశాడు. ఆ కొండచరియల్లో నిర్వింధ్యానది పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. దాని అలల రొదలు ఊదినట్లుగా ఉంటాయి. ఆ నీటిలో ఏపుగా పెరిగిన అశోక చెట్లు, మోదుగు చెట్లు గల ఒక వనం అక్కడ ఉంది. ఆ చెట్లు విరబూసిన పూల గుత్తులతో అందంగా ఉంటాయి. అక్కడనే ఆ ముని ఒంటికాలిమీద నిలబడి గాలి ఆహారంగా ప్రాణాయామంతో సుఖదుఃఖాలను శీతోష్టాలను జయించినవాడై వంద దివ్యసంవత్సరాలు తపస్సు చేశాడు.
(ప్రాణవాయువుని నియమబద్ధంగా నిరోధించడాన్ని ప్రాణాయామం అంటారు.
మానవులకు ఒక ఏడాది దేవతలకు ఒకరోజు. అలాంటి 30 ఏళ్లు దేవతలకు ఒక నెల. ఇలాంటి 12 నెలలు (1,29,600ల రోజులు) దేవతలకు ఒక ఏడాది. దీనినే 'దివ్యవర్షం' అంటారు.
మహేంద్రం, మలయం, సహ్యం, మాల్యవంతం, బిక్షం, వింధ్యం, పారియాత్రం. ఈ ఏడింటిని 'కులపర్వతా'లంటారు.
కష్టనష్టాలు, నిందాస్తుతులు, ఆకలిదప్పులు, మానావమానాలు, రాగద్వేషాలు, సుఖదుఃఖాలు, శీతోష్టాలు మొదలైనవి 'ద్వంద్వాలు'. వీనికి లోబడనివాడు 'ద్వంద్వాతీతుడు'.)
ఇలా భయంకరమయిన తపస్సు చేస్తూ, తన మనస్సులో జగన్నాథుడయిన ఆ దైవాన్ని శరణు కోరుతాను. అతడు, నామీది ఔదార్యంతో 'తనకు సమానులైన' సంతతిని ప్రసాదించు గాక, అని అత్రిమహాముని అనుకునేంతలో
ఆ అత్రిముని శిరస్సుమీది అగ్నిజ్వాలలకు ముల్లోకాలూ ఉడికి పోవడం కళ్లారా చూశారు త్రిమూర్తులు. వారు అప్సరసలు, సురలు, సిద్ధులు, సాధ్యులు తమ కీర్తిని స్తుతిస్తుండగా ఆ మహాముని ఆశ్రమానికి వెళ్ళారు.
అలా త్రిమూర్తులు అత్రిమహర్షిఆశ్రమం చేరుకోబోతుండగా
పసిమిఛాయతో మిలమిల మెరిసిపోతున్న బ్రహ్మ చేతిలో కమండలం ఉంది. ఆయన హంస మీద వచ్చాడు. నల్లటిమబ్బు ఛాయతో ఒప్పుతున్న విష్ణువు చేతిలో సుదర్శనచక్రం ఉంది. ఆయన గరుత్మంతుడిమీద వచ్చాడు. వెన్నెల్లా తెల్లటి ఛాయగల శివుని చేతిలో త్రిశూలం ఉంది. ఆయన ఆబోతుమీద వచ్చాడు. ఇలా త్రిమూర్తులైన వాక్పతినీ, లక్ష్మీపతినీ, పార్వతీపతినీ అత్రిమహాముని కళ్లారా చూశాడు. ఆ ముని మహాతపస్సంపన్నుడు.
చల్లని చూపులతో చిరునవ్వులు చిందించే ముఖాలుగల త్రిమూర్తుల్ని అత్రిమహర్షి కనులారా చూశాడు. మహానందంతో ఎంతో పొంగిపోయాడు. సాష్టాంగ పడ్డాడు. పూలదోసిళ్లు పట్టాడు. చేతులెత్తి మొక్కాడు. వాళ్ల కాంతుల ధగధగల్లో కళ్లు చెదరి తేరిపార చూడలేక పోయాడు. ఆ మిలమిలలకు కంటిరెప్పలు మూతపడిపోయాయి. వాళ్ళ పాదాలమీదే ధ్యాస నిలిపాడు. అందరి మెప్పు పొందే చక్కటి కమ్మని లోతైన మాటలతో ఇలా స్తోత్రం చేశాడు.
ఓ పుణ్యమనస్కులార! ఇది చెప్పవలసింది. మీరు ముగ్గురూ ప్రతికల్పంలోనూ లోకాలన్నిటిని సృష్టిస్తుంటారు. పోషిస్తుంటారు. లయింప చేస్తుంటారు. మాయాగుణ వికారమైన శరీరాలు ధరిస్తుంటారు. మీరు త్రిమూర్త్యాత్మకులు. అలాంటి మీ పాదపద్మాలకు వినయపూర్వకంగా ప్రణమిల్లుతున్నాను. మీరు సకల జీవుల మనస్సులకు గోచరించనివారు. అందనివారు. మీ ముగ్గురిలో నేను పిలిచిన ఆ ఒక్కరు ఎవ్వరు. ఒక్కరిని పిలిస్తే, మీరు ముగ్గురూ ఒక్కసారిగా ప్రత్యక్షమవడం నాకు చాల ఆశ్చర్యంగా ఉంది.
అంతేకాదు. నేను సంతానంమీద అపేక్షతో ఎన్నోవిధాల పూజలు చేశాను. కాని నామనసులో స్థిరంగా ఉన్న మహానుభావుడు ఒక్కడే. అనగానే, ఆ త్రిమూర్తులు మువ్వరూ అత్రిమహామునిని చూస్తూ ఇలా తీయటి మాటలు మాట్లాడారు.
అత్రి మునీ! ఆలకించు. మేం ముగ్గురమే అయినా నిజానికి బుద్ధిపెట్టి ఆలోచించి చూస్తే మేం ఒక్కరమే. నువ్వు మనసులో కోరుకున్న కోరిక తప్పక నెరవేర్తుంది సుమా!
మా ముగ్గురియొక్క అంశాలతో మతిమంతులైన కొడుకులు పుడతారు. వారు త్రిలోకాల్లో నీ యశస్సును వ్యాప్తి గావించగల సమర్థులై ఉంటారు. ఇది నిశ్చయం సుమా!
అలా చెప్పిన సురేశ్వరులు అత్రి మహాముని మనోభీష్టాన్ని తీర్చారు. ఆ మునిచంద్రుని పూజలకు తృప్తి చెందినవారై ఇష్టానుసారంగా తిరిగి వెళ్లిపోయారు.
సుచరిత్రులు ఆ అత్రి దంపతులు. వాళ్లకు బ్రహ్మ అంశంచే చంద్రుడు పుట్టాడు. విష్ణ్వంశతో యోగవిద్యావిశారదుడైన దత్తాత్రేయుడు పుట్టాడు. శివుడి అంశతో దుర్వాసుడు పుట్టాడు. ఈ ముగ్గురూ వేలెత్తి చూపలేని పరిశుద్ధమైన చరిత్ర కలవాళ్లు.
ఓ విదురా! అంగిరసుడు అనే మునికి, శ్రద్ధ అనే కులకాంతకు పుట్టిన పుత్రికలు నల్గురు. వాళ్లు మంచి లక్షణాలుగల పిల్లలు. చక్కటి అందగత్తెలు.
ఆ నల్గురు కూతుల పేర్లు సినీవాలి, కుహువు, రాక, అనుమతి. ఆ తర్వాత అంగిరస, శ్రద్ధలకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వారు స్వారోచిష మన్వంతరంలో పేరు ప్రఖ్యాతులు పొందారు.
(సినీవాలి= చంద్రకళ కన్పించే అమావాస్య(కృష్ణచతుర్దశి). అంటే అంతకుముందు వేకువన చంద్రకళ సన్నగా కన్పించగా ఆ రోజు గడచివచ్చిన అమావాస్య రాత్రిని 'సినీవాలి' అంటారు. కిందటి తెల్లవారుజామున చంద్రకళ కనుపించని అమావాస్యను 'కుహువు' అంటారు. రాకా= పూర్ణిమ, అనుమతి= శుక్ష చతుర్దశి. ఇవి దర్శ పూర్ణమాసలు మొదలైన వైదిక కర్మలకు ప్రధానమైన కాలాలకు ప్రతీకలు.)
ఆ పుత్రసంతానం భగవంతుడైన ఉచథ్యుడూ, బ్రహ్మనిష్ఠుడైన బృహస్పతి అనేవారు. వీళ్లిద్దరూ చాలా ప్రసిద్ధిక్కినవారు.
పులస్త్యుడు, హవిర్భుక్కు దంపతులకు పుట్టిన మగబిడ్డ అగస్త్వుడు. ఇతడు జన్మాంతరంలో జఠరాగ్నిగా ఉన్నాడు. ఆ తర్వాత ఈ మునికే విశ్రవసుడు అనే మరో కొడుకు పుట్టాడు.
ఆ విశ్రవసుడికి ఇలబిలకు కుబేరుడు పుట్టాడు. మరోభార్య కైకసి కడుపున రావణ, కుంభకర్ణ, విభీషణులు జన్మించారు.
పులహుడివల్ల గతి అనే కాంత, కర్మశ్రేష్ఠుడు, వరీయాంసుడు, సహిష్ణువు అనే ముగ్గురు మగపిల్లల్ని కన్నది.

క్రతువుకి క్రియ అనే పత్నికి కల్గిన సంతానం అరవై వేలమంది. వీళ్ళు బ్రహ్మవర్చస్సుగల వాలఖిల్యులనే మహామునులు.
వసిష్ఠుడు ఊర్జ(అరుంధతి మారు పేరు) అనే మునిదంపతులకు కల్గిన సంతానం ఏడుగురు. వారు చిత్రకేతుడు, సురోచి, విరజుడు, మిత్రుడు, ఉల్బణుడు, వసుభృద్ధ్యానుడు, ద్యుమంతుడు. ఈయనే మరొక భార్యవల్ల 'శక్తి' మొదలైన పుత్రుల్ని పుట్టించాడు.
అథర్వుని భార్య చిత్తి గర్భాన దధ్యంచుడు పుట్టాడు. గుర్రం తలవంటి తల కల ఇతణ్ణి అశ్వశిరసుడనీ అంటారు. ఇతడు ధృతవ్రతుడు.
భృగుమహర్షికి ఖ్యాతి అనే పత్నివల్ల పొందిన సంతతి ధాత, విధాత అనే ఇద్దరు కుమారులు. శ్రీ అనే ఒక కూతురు. ఈమె భగవత్పరాయణ.
ఈ కొడుకులిద్దరూ మేరువు కుమార్తెలు. ఆయతి, నియతలవల్ల మృకండుడు, ప్రాణుడు అనే కుమారుల్ని పొందారు. మృకండుడి కొడుకే మార్కండేయుడు. ప్రాణుడి కొడుకు వేదశిరసుడు. భృగువు ఉశనల కొడుకు 'కవి'.
ఈ తీరున కర్దమ ప్రజాపతి తొమ్మిదిమంది కూతుర్ల, కుమారుల సంతానపరంపరలతో ఈ భూప్రపంచం వర్ధిల్లింది. అలాంటి కర్దమముని సంతతి క్షణాల్లో పాపాల్ని తుడిచి పెడ్తుంది. ఉత్తమోత్తమం అయినది. ఆ ముని వరుససంతతి వివరాలు చాల శ్రద్ధపెట్టి వింటున్న నీకు చెప్పాను.
ఇక దక్షప్రజాపతి వంశక్రమాన్ని తెలియచెప్తాను. విను.

No comments:
Post a Comment