Thursday, February 5, 2026

Vyasudu Vyakula Chittundai Chinthinchuta - వ్యాసుండు వ్యాకులచిత్తుండై చింతించుట

వ్యాసుండు వ్యాకులచిత్తుండై చింతించుట

ఈ విధంగా శౌనకుడు మున్నగు మునిచంద్రులు అడుగగా, వారికి సూతమహర్షి ఇలా సమాధానమిచ్చాడు. ఒక మహాయుగంలో భాగాలైన కృతత్రేతాయుగాలు గడచి, మూడోదైన ద్వాపరయుగం పూర్తయ్యే సమయంలో ఒక వృత్తాంతం జరిగింది. ఉపరిచరవసువనే ఒకరాజు ఉండెడివాడు. ఇంద్రుడిచ్చిన విమానంలో ఆకాశంలో సంచరించే వసువు కావున ఆయనకు ఉపరిచర వసువనే పేరు సార్ధకమయింది. ఆయనే వసుమహారాజు. ఆ వసువు తేజస్సువల్ల ఉద్భవించిన కన్య కావున “వాసవి” అనే పేరుతో వాసింక్కింది సత్యవతి. ఆ పవిత్రక్షేతంలో పరాశర మహర్షివల్ల నారాయణాంశతో వ్యాసుడు జన్మించాడు. ఆయన మహాజ్ఞాని. వేదవిభాగం కావించి వేదవ్యాసుడుగా ప్రసిద్ధింక్కాడు. సరస్వతీనది ప్రవహించే స్థలంలో ఆయన నివాసం. అదే బదరికాశ్రమం. ఆయన ఒకనాడు ఆ నదీజలాలలో స్నానంచేసి కాలోచిత కర్మలాచరించి పరమపవిత్రుడై ఉన్నాడు. ఏకాంతస్థలంలో ఒంటరిగా కూర్చుండి ధ్యానముద్రలో ఉన్నాడు. అంతలో సూర్యోదయమయింది. భూతభవిష్యద్వర్తమానాలు తెలిసిన ఆ ఋషి కనబడకుండా కడువేగంతో పరుగుపెట్టే కాలగమనంలో ఏర్పడే మార్పులను గమనించాడు. భూలోకంలో యుగధర్మాలు సాంకర్యం పొందుతాయని గ్రహించాడు. యుగపరిణామంవల్ల పాంచభౌతిక శరీరాలలో శక్తి సన్నగిల్లుతుందని, మానవులు సత్తువలేనివారు, ధైర్యగుణం లేనివారు, ధారణాశక్తి లేనివారవుతారని భావించాడు. అంతేకాదు. అల్పాయుష్ములు అవుతారని, బలహీనులవుతారని నిశ్చయించాడు. తన తపోదృష్టితో అంతా పరీక్షించి సర్వవర్జాలవారికి, అన్ని ఆశ్రమాల వారికి మేలు చేకూర్చాలని నిర్ణయించాడు. హోత, ఉద్గాత, అధ్వర్యుడు, బ్రహ్మ అనే నల్గురు ఋత్విక్కులద్వారా, ఆచరించడానికి వీలుండే వైదిక కర్మలద్వారా ప్రజలకు క్షేమంకరాలైన యజ్ఞాలు నిరంతరం కొనసాగాలని దృష్టి నిలిపాడు. అంతవరకు ఒక్కటిగా ఉన్న వేదాన్ని ఋక్కు, యజుస్సు, సామం, అథర్వం అనే నాలుగు భాగాలుగా విభజించాడు. ఇతిహాస పురాణాలను పంచమవేదంగా పేర్కొని, వాటికి ప్రామాణ్యాన్ని సంతరించాడు.

పైలుడు ఋగ్వేదం, జైమిని సామవేదం, వైశంపాయనుడు యజుర్వేదం, సుమంతుడు అథర్వవేదం అధ్యయనం చేశారు. నా తండ్రి రోమహర్షణుడు ఇతిహాసాలను, పురాణాలను అభ్యసించాడు. ఈ ఋషులందరు తాము నేర్చుకొన్న వేదాలను వేర్వేరుగా తమ శిష్యులకు బోధించారు. ఆ శిష్యులు అదేవిధంగా తమ తమ శిష్యులకు విభజించి ఉపదేశించారు. ఈ విధంగా భూమండలంపై బ్రాహ్మణసమూహంలో వేదవృక్షం శాఖోపశాఖలై విస్తరిల్లింది.

ఈ విధంగా క్రమక్రమంగా వేదం విభజింపబడి ఏకంగాకాక 
భిన్నభిన్న శాఖలుగా ప్రజ్ఞాపటిమ పూర్తిగాలేని వారిచే ధారణ చేయబడింది. స్త్రీలు, కర్మసంస్కారంలేని శూద్రులు, కర్మసంస్కారమున్నా ఆచరించకుండా వ్యవహరించే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు వేదాలకు, తద్విహిత ధర్మాలకు దూరంగా ఉండిపోయారు. అటువంటివారికి వేదం శ్రవణయోగ్యం కాదు. కాబట్టి సామాన్యులందరికి మేలు కలిగేలా వ్యాసుడు భారతమనే ఇతిహాసం రచించాడు. విశ్వశ్రేయస్సుకై తానింత చేసినా, ఆయన మనస్సు ఎందుకో సంతుష్టి పొందలేదు. తన అసంతృప్తికి హేతువేమిటోయని ఆయన సరస్వతీ నదీతీరంలో ఏకాంతంగా కూర్చుండి ఆలోచించసాగాడు. తనలో తాను ఈ విధంగా అనుకొన్నాడు.

కఠోరమైన బ్రహ్మచర్య వ్రతాన్ని స్వీకరించాను. వేదాలను విభజించాను. అగ్నులను వ్రేల్చను. పూజ్యులను గౌరవించాను. శాస్త్రవిహితాలైన కర్మలను ఆచరించాను. వేదార్డాన్ని, దాని ఆంతర్యాన్ని మహాభారతరూపంలో వెల్లడించాను. స్త్రీశూద్రాదులు ఒనరించే ధర్మాలన్నీ వివరించాను. ఇంత చేసినా, నా అంతరాత్మ శాంతి పొందడంలేదు. అయ్యో! నా మనస్సులో అంతరాత్మ పరమాత్మతో ఐక్యం కానట్లు, సంతుష్టుడు కానట్లు తోస్తున్నది. అన్నీ ఒనరించాను. కాని విష్ణువునకు, హరిభక్తులకు అత్యంత ప్రియాన్ని చేకూర్చే భాగవత స్వరూపాన్ని ప్రతిపాదించలేకపోయాను. పొరపాటు జరిగిపోయింది. తెలివితక్కువ పని చేశాను. ఎంత విస్మృతిపాలయ్యాను? అని వ్యాసుడు విచారించే సమయంలో

No comments:

Post a Comment

kunthi devi praying sri krishna Kunti Stuti - కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతించుట

కుంతీదేవి శ్రీకృష్ణుని స్తుతించుట కృష్ణా! నీవే ఆదిపురుషుడవు. అందరిచేత స్మరింపబడేవాడవు. జగత్తుకన్న వేరుగా ఉండేవాడవు. నాశనం లేనివాడవు. సమస్తభూ...