రాజా! అంతలో ద్వారకా నగరమునుండి వచ్చిన అర్జునుడు కన్నులనిండ నీరు నింపుకొని, భరింపరాని దుఃఖంతో దీనుడై అన్న పాదాలపై వాలినాడు.
అల్లకల్లోలమై చాలా ఎక్కువగా కదలిపోయిన మనస్సుతో తల్లడిల్లుతున్న చిన్నతమ్ముణ్సి చూచి ధర్మరాజు ముఖం వెలవెలపోయింది. అప్పుడు అందరు వినుచుండగా ఆయన అర్జునునితో ఇట్లు పలికినాడు.
అర్జునా! మన మాతామహుడు శూరసేనునకు క్షేమమే కదా! మన మేనమామ వసుదేవునకు సుఖమే కదా! మన మేనత్తలు ఏడుగురు(రోహిణి, దేవకి, ఉపదేవి, వృకదేవి, సప్తమి, శృకంధర, జన. వీరుకాక శ్రద్ధ అనే ఒక వైశ్యకాంత కూడా ఉన్నది) సంతోషంగా ఉన్నారు కదా! వారి కొడుకులందరూ క్షేమమే కదా! అక్రూరకృతవర్మలు ఆరోగ్యముతో ఉన్నారు గదా! ఉగ్రసేన మహారాజు తిన్నగా తిరుగుతున్నాడు కదా! మానధనులైన వాసుదేవుని సోదరులు - గదుడు సారణుడు ఇంకా తక్కినవారు కుశలవంతులే కదా? మన సాత్యకికి ప్రద్యుమ్నునకు అనిరుద్ధునకు కుశలమా? మన పెద్దబావ బలరాముడు సుఖంగా ఉన్నాడా?
అంధకులు, మధువులు, భోజకులు, దశార్హులు, వృష్ణులు, సాత్వతులు మున్నుగా గల యాదవవీరులు, శ్రీకృష్ణుని కుమారులైన సాంబసుషేణాదులు, శ్రీకృష్ణుని అనుచరులైన ఉద్ధవాదులు, శ్రీకృష్ణుని మిత్రులైన సునందుడు నందుడు మొదలైనవారు, సుఖంగా ఉన్నారా? అంటూ ధర్మరాజు మరల ఈ విధంగా అర్జునునితో అన్నాడు.
అర్జునా! ఏ పురుషోత్తముని అండదండల వల్ల వైకుంఠంలో నివసించేవాళ్లవలె ద్వారకలో నివసిస్తూ యాదవ శ్రేష్టులు నిర్భయులై ఆనందంగా ఉన్నారో, ఏ మహానుభావుడు దేవతలు కొలువు తీరే సుధర్మామండపంలో తన పాదసేవకులైన భక్తులను, బంధువులను, మిత్రులను అడుగులు మోపునట్లు చేశాడో, ఏ మహాత్ముడు వజ్రాయుధంతో తన ఆటోపాన్ని ప్రదర్శించే ఇంద్రుని ఇల్లాలు శచీదేవి తన చేతులతో పాదుచేసి, అమృతం పోసిపెంచిన పారిజాతవృక్షాన్ని దివినుండి భువికి తెచ్చి తన ప్రియురాలైన సత్యభామకిచ్చి సంతృప్తిపరచాడో ఆ మహాత్ముడు వాసుదేవుడు క్షేమంగా ఉన్నాడా?
నాయనా! అర్జునా! భక్తులపై వాత్సల్యం కురిపించేవాడు, వేదధర్నాన్ని ఉద్ధరించే బ్రహ్మణ్యుడు, ఆపన్న శరణ్యుడు, సర్వేశ్వరుడు, లోకాలకు మేలు కలిగించేవాడు, ఎంతో శోభతో అప్పుడప్పుడే వికసిస్తున్న తామరరేకుల వంటి కన్నులు కలవాడు అయిన గోవిందుడు ద్వారకలో సుధర్మ సింహాసనం మధ్య అన్నగారైన బలరామునితోకూడ సుఖంగా, ఉత్సాహంగా ఉన్నాడు కదా!
విజయా! ఆ బలరామకృష్ణులను నీవు స్థిరమైన భక్తితో ఆసక్తితో సేవిస్తావు కదా! అక్కడ మనచుట్టాలు అందరు నిన్ను నిత్యం ఆప్యాయంగా అనురాగంతో ఆదరించినారు కదా!
తండ్రీ! అర్జునా! ఎందుకు కన్నీరు కారుస్తున్నావు? ఏమైంది? పూర్వం భయంకరమైన అరణ్యంలో పందికై ఫాలాక్షునితో పోరాటం సాగించినప్పుడుగాని, సర్వసన్నాహాలతో, కాలకేయాది రాక్షసులను కదనరంగంలో చెండాడినప్పుడుగాని, కౌరవేంద్రుని విడిపించటానికి గంధర్వులతో యుద్ధంలో తలపడినప్పుడు కాని కంటనీరు పెట్టి ఎరుగవే? ఇప్పుడేమి కష్టం వచ్చిందో చెప్పు. శ్రీకృష్ణుడు క్షేమంగా ఉన్నాడు కదా? అది మాత్రమే కాకుండా, మరేవైనా విశేష విషయాలున్నాయా?
అదిగాక నీవు పగవారితో పోరాడి ఓడిపోలేదు కదా! సజ్జనులను నిందించే మాటలాడలేదు కదా! పరస్త్రీలను కూడలేదు కదా! శత్రువీరుల నడుమ అభిమానాన్ని వీడలేదు కదా!
దానమిస్తానని చెప్పి అన్నమాట తప్పలేదు కదా! దొంగ సాక్ష్యం చెప్పలేదు కదా! ఇతరులు చేసిన మేలును మరువలేదు కదా! లేదా ఇతరులకు చేసిన మేలును మాటికి చెప్పలేదు కదా! శరణుజొచ్చినవారిని, బ్రాహ్మణులను, గోవులను, రోగులను, స్త్రీలను బాధించటం, కోపించటం, తరమటం చేయలేదు కదా!
పూజింపదగిన బ్రాహ్మణులను మోదినావా? పిల్లలు, ముసలివారు, పెద్దలు వెలిగా భుజించినావా? ఆశ్రయించినవారిని విడిచినావా? ఇతరుల ధనాలను దురాశతో మూటకట్టుకున్నావా? మఱి ఎందుకు నీకీ విచారం?
ధర్మరాజు ఈ విధంగా ప్రశ్నించగా అరచేతులతో అశ్రువుల తడి ఒత్తుకొంటూ, దగ్గుత్తికగల కంఠస్వరంతో, పెన్నిధిని పోగొట్టుకొన్న పేదవానివలె, వేడివేడి నిట్టూర్పులు నిగిడిస్తూ అర్జునుడు అన్న గారితో ఈ విధంగా అన్నాడు.
మహారాజా! మన సారథి, మన మంత్రి, మన వియ్యం, మన మిత్రుడు, మన బంధువు, మన గురువు, మన దేవుడు సర్వమూ తానైన వాసుదేవుడు మనలను వదలిపెట్టి వైకుంఠమునకు వెళ్లిపోయినాడయ్యా!
మనలను పలువురు క్షుద్రులైన రాజులు ఈర్య్యతో చూస్తుండగా ఆకాశంలో తిరుగుతున్న మత్స్యయంత్రాన్ని అవలీలగా బాణంతో పడగొట్టి ద్రౌపదిని స్వీకరించింది ఆ మహాత్ముని కరుణవల్లనే కదా!
రాజా! దండిగా అమరసేనలతో ఇంద్రుడు ఎదురై నిల్చినా గెల్చి ఖాండవ వనాన్ని అగ్నిదేవునికి అప్పగించి అతని నుండి గాండీవాన్ని గైకొన్నది చక్రధరుడైన ఆ శ్రీకృష్ణుని చలువవల్లనే కదా!
అన్ని దిక్కుల రాజులను జయించి ధనరాసులను గైకొన్నది, మయసభను అందుకొన్నది, రాజసూయ యాగం నిర్వర్తించింది నిజానికి వాసుదేవుడు మనకు అండగా నిలిచినందువల్లనే కదా!
ఓ సింహపరాక్రమా! రాజసూయ యజ్ఞాంతమందు ఆచరించే అవభృథ స్నానంతో పవిత్రమైన నీ యిల్లాలి జుట్టుపట్టిలాగి యీడ్చుకొని వచ్చి నిండు సభలో నీ శత్రువులు అవమానం చేసినప్పుడు ఆ సతి ఆవేదనతో ఆక్రోశించే వేళ ఆమెకు అభయమిచ్చి ప్రతిజ్ఞ చేసి, నీ శత్రు భార్యల కేశసంపదను వారి సౌభాగ్యాన్ని హరించి మనకు జయం కలిగించిన ఆప్తబంధుడు ఆయనే కదా!
ఆనాటి నిండు కొలువులో కట్టుకొన్న చీరలను క్రూరులైన కౌరవులు లాగివేసినప్పుడు నివారించటానికి నా భర్తలు రావటం లేదు. నీవు నిర్లక్ష్యం చేయటం తగునా? ఇక నన్ను రక్షించే వారే లేరా? వచ్చి వారింపవా? కృష్ణా! అని ద్రౌపది మానభంగ భయంతో ఒడలు ముడుచుకొని ప్రార్ధింపగా కరుణతో అక్షయవస్త్ర ప్రదానంచేసి కాపాడిన మహానుభావుడు కృష్ణుడే కదా!
పూర్వమొకనాడు ముక్కోపి అయిన దుర్వాసుడు దుర్యోధనుడు ప్రార్థించి పంపగా, పాండవులను అవమానించటానికి పదివేలమంది శిష్యులను వెంటబెట్టుకొని మనవద్దకు వచ్చినాడు. అప్పటికే మనమందరమూ, పాంచాలీ భుజించి ఉన్నాము. అదే సమయంలో ఆ మునీంద్రుడు మాకు అన్నం పెడతారా? పెట్టరా? పెట్టకపోతే నేను శాపం పెడతాను అని నీట మునగటానికి వెంటనే ఏటికిపోయినాడు. అప్పుడు పర్ణశాలలోనికి పోయి పాంచాలి పాత్రలను పరికించి చూచింది. ఎక్కడగాని ఒక్క మెతుకు కూడా కన్పించలేదు. అప్పుడు ఆమె నిశ్చలహృదయంతో శ్రీకృష్ణభగవానుణ్ణి తలచుకొన్నది. తత్‌క్షణమే ఆ దయామయుడు ప్రత్యక్షమై వంటపాత్రలో అడుగున అంటుకొని ఉన్న ఒక్క మెతుకును తన నోటిలో వేసికొన్నాడు. అంతే! ఇక ఏమున్నది? మునీశ్వరునితోపాటు పదివేలమంది శిష్యుల కడుపులన్నీ పూర్తిగా నిండిపోయాయి. వారెంతో శాంతించి తేపులతో పొట్టలు తడుముకొంటూ వెళ్లినారు. సంకల్పమాత్రం చేతనే ముల్లోకాలకు పరిపూర్ణ తృప్తిని కలిగించే అట్టి మహానుభావుడు మనకు మరెక్కడ లభిస్తాడు?
అన్నా! నేను పూర్వం అడవి పందికై శివునితో పోరాడి, అతడిచ్చిన పాశుపతమనే దివ్యాస్తాన్ని ఆ కృష్ణుని అనుగ్రహం వల్లనే కదా పొందగలిగినాను. ముల్లోకాలకు ప్రభువైన దేవేంద్రుని అర్ధసింహాసనాన్ని ఆ మహనీయుని కృపవల్లనే కదా అధిష్టించినాను. కాలకేయుడు, నివాత కవచుడు మొదలైన రాక్షసులను ఆ మహనీయుని బలంవల్లనే కదా సంహరింపగలిగినాను. ఉత్తర గోగ్రహణ సందర్భంలో కౌరవసైన్య సముద్రాన్ని ఆయన కరుణవల్లనే కదా అవలీలగా దాటగలిగినాను. ఆ సందర్భంలోనే విరాటుని కొమార్తె ఉత్తర 'బొమ్మ పొత్తికలను తెచ్చి ఇమ్మ'ని అడిగితే కర్ణ సైంధవ సుయోధనాదుల పట్టుకుచ్చుల తలపాగాలు తెచ్చి ఆమె ముచ్చటను తీర్చింది ఆ పురుషోత్తముని అండదండల వల్లనే కదా!
భీష్మద్రోణాది మహాయోధులతో కూడిన కురుక్షేత్ర మహాసంగ్రామంలోని వివిధ వ్యూహాల్లో నాకు సారథ్యం వహించి, నొగలపై కూర్చుండి నా బాణ పరంపరలు ప్రసారం కాకముందే తన చూపులతో శత్రువుల శక్తిని ఉత్సాహాన్ని ఆయుస్సును, తదేక దీక్షను అపహరించి నాకు అమితమైన ఆనందాన్ని అందించిన సారథి ఆయనే.
మహారాజా! పూర్వం హిరణ్యకశిపుని క్రూరకార్యాలు ప్రహ్లాదునిపై పని చేయక విఫలాలైనట్లే కృపాచార్యుడు, అశ్వత్థామ, భీష్ముడు, కర్ణుడు, ద్రోణుడు ప్రయోగించిన దివ్యాస్త్రాల ప్రభావం నా వైపునకు రాకుండా ఆ మాధవుని దయగల చూపులతో ప్రక్కకు తొలగిపోయింది.
రాజా! సైంధవుని నాటి రణరంగంలో చంపేటప్పుడు శత్రువులందరు చూస్తుండగనే, భూమిని దివ్యాస్త్రాలతో వ్రయ్యలు చేసి కొలను నిర్మించి సూర్యుడు కనిపించకుండా బాణాలతో కప్పి, అలసిన గుర్రాలకు నీరుపెట్టి దప్పిక తీర్చినది, ఆ శ్రీకృష్ణుని శుభసంకల్పం నాకు రక్షణగా ఉండుటవల్లనే కదా!
రాజా! ఆ వాసుదేవునికి నాపై ఎంత ప్రేమ! ఆదరం! అభిమానం! ఒకమారు చెలికాడా! రా అని పిలిచేవాడు. ఒక పర్యాయం ముద్దులమరదీ! అని గౌరవించేవాడు. ఒకప్పుడు ఆత్మబంధువై ఆదరించేవాడు. ఒక సందర్భంలో ఎంతో ఔదార్యంతో బహుధనాలు బహూకరించేవాడు. ఒక సమయంలో మంత్రియై హితోపదేశం చేసేవాడు. ఒక్కొక్కప్పుడు గురువై కర్తవ్యబోధ సల్పేవాడు. మరొక్కమారు సారథియై చనవు చూపేవాడు. వేఱోకమారు ఆత్మీయుడై హాస్యమాడేవాడు. ఎన్నో ఆటలు పట్టించేవాడు. ఇంకొకమారు ఒకే పడుకపై ప్రక్కన కూర్చొని కన్నతండ్రివలె చేసిన తప్పులు సహించేవాడు. మరొక పర్యాయం నా చేతులు పట్టుకొని సహపంక్తిలో కూర్చొని కలిసి మెలసి ఆరగించేవాడు. అటువంటి మాధవుణ్ణి మరచిపోగలనా?
రాకపోకలు చేసేప్పుడు కృష్ణుడు చేతులుచాచి ఎంతో ఆప్యాయంగా విజయా! ధనంజయా! కపిధ్వజా! ఫల్గునా! పార్థా! పాండుకుమారా! నరుడా! ఇంద్రతనయా! మిత్రా! అర్జునా! కిరీటీ! సవ్యసాచీ అని ఒక్కొక్కమారు పిలిచేవాడు.

రాజా! అప్పుడప్పుడు అంతపురకాంతలతో ప్రణయకలహం కలిగినప్పుడు వారి పొాలయలుకను తీర్చటానికి నన్ను బతిమాలి వారి యిండ్లకు పంపే వారిజాక్షుడైన వాసుదేవుని ఎట్లు మరవగలను?
రాజా! కృష్ణుడు తానెంతో చనవుగా నా దగ్గరచేరి ఒడిలో కూర్చుండి ప్రతిదినం ప్రియురాళ్లతో తాను జరిపే రహస్య సంభాషణలను అన్నింటిని సవిస్తరంగా నా చెవిలో చెప్పుతూ ఉండేవాడు.
రాజా! నా సేవలన్నియు ఈనాడు పూర్తిగా వ్యర్థములైనవి. ప్రతిదినం నన్నెంతో ఆదరించే ఆ జగదీశ్వరుడైన కృష్ణుడు ఈ లోకం వీడి వెళ్లిపోయిన తరువాత నా ప్రాణాలు కూడా ఆయనవెంట పోకుండా, ఈ కఠినకర్కశ దేహాన్ని అంటిపెట్టుకొని ఉన్నాయి. అయ్యయ్యో! పూర్వజన్మలో నేనెట్టి పాపకృత్యాలు చేసినాడనో కదా!
ఆ మహానుభావుడు దేహాన్ని చాలించిన తరువాత ఆయన అంతఃపుర కాంతలను పదహారు వేలమందిని వెంటబెట్టుకొని అరణ్యమధ్యంలో వస్తుండగా మదోన్మత్తులైన కిరాతులు ముట్టడించి చుట్టుముట్టి పట్టుకొన్నారు. వారి బారినుండి ఆ స్త్రీలను విడిపించలేక ఒక ఆడుదానివలె ఏమీ చేయలేని దుస్థితిలో చూస్తూ అట్లే ఊరక ఉండిపోయినాను.
ఆత్మేశ్వరుడైన ఆ శ్రీహరి లేకపోవటంతో పూర్వం శత్రుసమూహాన్ని నిర్మూలిస్తూ ఉండే ఆ రథం, అందున్న నేను, ఆ గుఱ్ఱాలు, ఆ విల్లు, ఆ బాణాలు అన్నీ బూడిదలో పోసిన నేయివలె, మాయావి ప్రయోగించిన మాయమైన ఇంద్రజాలంవలె చవిటినేలలో చల్లిన విత్తనాలవలె కనురెప్పపాటు కాలంలో నిరుపయోగాలైపోయాయి.
భూవల్లభా! యాదవవీరులందరు కాలకర్మవశాన విధివైపరీత్యంతో మునిశాపోపహతులై, మద్యం త్రాగి, మత్తెక్కి మైమరచి ఆగ్రహావేశాలతో, ద్వేషరోషాలతో కన్ను మిన్ను గానక, తమలో తామే పోరాడినారు. ముష్టిఘాతాలతో ఒకరినొకరు కొట్టుకొని ప్రాణాలు వదలినారు. పోయినవారు పోగా చివరకు నలుగురైదుగురు మాత్రమే మిగిలినారు. ఇది అంతా దుర్వాసాదుల శాపప్రభావమే.
ఆశ్రితవత్సలా! పరమేశ్వరుడు సర్వభూతాంతర్యామి. ఆయన ప్రాణులకు సృష్టి, సంహార, సంరక్షణలను తోటి ప్రాణులవలననే నిర్ణయిస్తాడు.
బలంగల పెద్ద చేపలు, బలంలేని చిన్న చేపలను మింగుతున్నాయి. అట్లే బలవంతులైన యదువీరులు, దయాహీనులై నిష్కారణ కోపావేశాలతో శత్రుత్వాన్ని పెంచుకొని తమతోడి యాదవులనే రూపుమాపినారు.
పృథ్వీనాథా! సర్వేశ్వరుడు, అచ్యుతుడు, అప్రమేయుడు అయిన శ్రీకృష్ణుడు బలవంతులకు, బలహీనులకు నడుమ పగలు పుట్టించి, ఒకరినాకరు సంహరించుకొనే వినాశాన్ని కలిగించి, ఈ భూభారాన్ని తీర్చి తాను వచ్చినపని పూర్తి చేసుకొని ఎంతో నిబ్బరంతో నిశ్చలబుద్ధి కలవాడై వెళ్లిపోయినాడు. ఇక ఏమని చెప్పగలను? ఆ జగదీశ్వరుని సంకల్పం ప్రకారమే అంతా జరిగిపోయింది.
అని ఈ విధంగా అర్జునుడు అన్నకు చెప్పి, దేశకాలాదులను అనుసరించేవి, మానసిక సంతాపాన్ని ఉపశమింపజేసేవి ఐన వాసుదేవుని వాక్కులు తలచుకొని పరమేశ్వరాయత్తమైన చిత్తంతో మౌనం వహించినాడు. సదా గోవింద పాదారవింద సంస్మరణచే స్వచ్చమైన బుద్ధికలవాడై శోకాన్ని వదలివేసినాడు. నిరంతరం ధ్యానరూపమైన భక్తివిశేషంతో కామక్రోధాది శత్రువులను జయించినాడు. పూర్వం కురుక్షేత్రంలో కౌరవ పాండవ సేనామధ్యంలో భగవానుడు వాసుదేవుడు తనకు ప్రబోధం చేసిన గీతావాక్యాలు మననం చేసికొన్నాడు. కాలానుగుణంగా కర్మలను అనుభవించటంవల్ల మరుగుపడిన గీతావిజ్ఞానాన్ని మరల స్మరణమాత్రంతో పొందగలిగినాడు.
అర్జునుడు కార్యకారణభావాన్ని అనుసరించి శోకానికి అహంకార మమకారాలతో కూడిన ద్వైతభ్రాంతియే కారణమని, అట్టి భ్రాంతికి శరీరం, ఆ శరీరానికి లింగం, ఆ లింగానికి గుణాలు, అట్టి గుణాలకు ప్రకృతి - ఒకదానికొకటి కారణాలుగా గ్రహించినాడు. 'అహంబ్రహ్మాస్మి' అనే జ్ఞానంతో ప్రకృతి విలీనమౌతుందని అలా ప్రకృతి నశించటమే గుణరాహిత్యమని, ఈ గుణరాహిత్యమే లింగ శరీరవినాశమని, అట్టి వినాశమే జన్మరాహిత్యమని తెలుసుకొన్నాడు. ప్రకృతిని పరిత్యజించిన పురుషుడు తిరిగి స్టూల శరీరాన్ని పొందక బ్రహ్మైక్యాన్ని పొందుతాడని నిశ్చయించుకొన్న అర్జునుడు పూర్తిగా విరక్తి చెందినాడు. ధర్మజుడు భగవంతుడైన శ్రీకృష్ణుని అవతార సమాప్తిని, యాదవుల వినాశాన్ని విని పూర్వం దేవర్షి నారదుడు తనకు ప్రబోధించిన వాక్యాలను జ్ఞప్తికి తెచ్చుకొని, అచంచల హృదయుడై, నిశ్చలతత్వమే జీవన్ముక్తి అని పుణ్యలోకప్రాప్తికి ప్రయత్నాలు సాగించినాడు.
కుంతీదేవి యాదవుల మరణాన్ని మాధవుని నిర్యాణాన్ని ఆలకించి, నిర్మలమైన భక్తితో, హరిచరణ సంస్మరణయందే పరిపూర్ణ నిష్ట కలదియై ఎంతో సంతోషంతో ప్రశాంతంగా ప్రాణాలు పరిత్యజించినది.
ఈ విధంగా ముల్లుతో ముల్లును పెకలించి ఆ రెండింటిని పారవేసే విజ్ఞానివలె, పరమేశ్వరుడు, యాదవ శరీరాన్ని ధరించి, జగత్తుకు కంటకాలుగా ఉన్న ఇతరుల శరీరాలను అంతంచేసి, తన శరీరాన్ని కూడా వదలివేసినాడు. పరమేశ్వరునికి సంహార విషయంలో స్వపరదేహాలనే భేదం లేదు. రెండూ సమానమే. స్వస్వరూపంలో ప్రవర్తించే శ్రీమన్నారాయణుడు క్రీడామాత్రంగా అప్పుడప్పుడు మత్స్యకూర్మాది రూపాలు ధరించి, వాటిని విడిచి ఒక నటునివలె మెలగి చివరలో స్వస్వరూపాన్నే పొందుతాడు.
లీలామానుషరూపాన్ని దాల్చిన శ్రీమన్నారాయణుడు ఏ దినం తన అవతారమును చాలించెనో ఆనాడే అమంగళకరమైన కలియుగము ఆరంభమైనది.
ధర్మరాజు పరీక్షితునకు పట్టము గట్టి మహాప్రస్థానంబున కేగుట

No comments:
Post a Comment