పుణ్యాత్ముడైన విదురా! విను. కృతయుగంలో బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించడానికి కర్దమమునీశ్వరుని నియమించాడు. కర్దముడు మనస్సులో సంతోషం కలిగినవాడై.
ధీరగుణాలుగల కర్దమమహాముని సరస్వతీ నదీతీరంలో పట్టుదలతో పదివేల దివ్యసంవత్సరాలు క్రమంగా తపస్సు చేశాడు. ఒకదినం తపోనిష్ఠలో ఉండి ఏకాగ్రచిత్తుడై అత్యంత సంతోషంతో
కర్దమమహాముని వరదుడూ, దయగలవాడూ, కోరిన కోర్కెలు నెరవేర్చడానికి వరాలు ఇచ్చే మంచి స్వభావంగలవాడూ, దురిత విదూరుడూ, చేతియందు సుదర్శన చక్రంగలవాడూ, లక్ష్మీవల్లభుడూ అయిన విష్ణువును ఆరాధించాడు. విష్ణువు దయగలవాడై ప్రత్యక్షమయ్యాడు.
సూర్యకిరణాలు సోకి వికసించిన తామరపూలతోను, చంద్రకిరణాలు సోకి వికసించిన కలువపూలతోను కట్టిన పూలమాలలు ధరించిన విలాసుడు; చేతులకు కంకణాలు, పాదాలకు అందెలు, కంఠాభరణాలు, అంగుళీయకాలు, స్వర్ణహారాలు, మకరకుండలాలు, కిరీటం ధరించి మనోజ్ఞంగా ఉన్నవాడు; సౌందర్యవతియైన లక్ష్మీదేవితో, కౌస్తుభమణితో, ఆభరణాలతో ధగధగమెరిసే వక్షఃస్థలం కలవాడు; సొగసైన చిరునవ్వువెన్నెలతో ధవళితం చేయబడిన ముద్దులొలికే చెక్కుటద్దాలతో ప్రకాశించేవాడు; శంఖం, చక్రం, గద, పద్మం నాలుగు చేతులలో ధరించినవాడు; తుమెదలవంటి నల్లనిముంగురులతో ప్రకాశించే ఫాలతలం కలవాడు; పసుపుపచ్చని పట్టువస్త్రం ధరించినవాడు; కరుణాతరంగితమైన మందహాసంతో కూడిన కటాక్ష వీక్షణాలు కలవాడు; పొక్కిలి యందు పద్మం కలవాడు అయిన విష్ణువును,
శబ్దబ్రహ్మమే శరీరంగాను, అస్తిత్వమే ఆత్మగాను కలిగి ఒక్క జ్ఞానం చేతనే తెలుసుకోదగినవాడై; గరుత్మంతుని మూపుపై పాదపద్మాలు మోపి ఉన్న జనార్దనుని చూచి కర్దమమహాముని ఆనందతరంగాలు పొంగులెత్తగా నెరవేరిన కోరికలు గలవాడవుతూ ఆ స్వామికి సాష్టాంగనమస్మారాలు సలిపాడు. ఆ తరువాత -
(శబ్దం ఆకాశానికి గుణం. ఆకాశం పరమాత్మనుండి వచ్చిన మొదటి భూతం. కాబట్టి అదికూడా బ్రహ్మమువలె కొలతలకు అందనిది.)
కరకమలాలు మోడ్చి నిర్మలమైన భక్తి భావంతో తన్నుతాను మరచిన వాడవుతూ, వికసించిన పద్మములవంటి కన్నులుగల విష్ణువు ముఖాన్ని అవలోకిస్తూ ఆయనతో కర్దమమహాముని ఇలా విన్నవించాడు.
ఓ పుండరీకాక్షా! నీవు సమస్త ప్రాణుల అంతరాత్మవుగా ప్రసిద్దుడివి. అలాంటి నీ దర్శనంకోసం అనేక జన్మలలో పుణ్యకార్యాలు చేసి పొందిన ఫలాలతో నిరంతర యోగాభ్యాస నిపుణులైన యోగీశ్వరులు మనస్సులలో పరితపిస్తూ ఉంటారు. యోగీశ్వరులకే ఈశ్వరుడవైన నీ పాదపద్మాల దర్శనం నేను పొందగలిగాను. సంసార సముద్రాన్ని దాటగలిగాను. ధన్యుడనైనాను. మాధవా! ముకుందా! దయార్ద్రహృదయా! లక్ష్మీరమణా! నాకు కన్నులున్నందుకు ఫలం లభించింది.
అదీగాక దేవా! నీ మాయవల్ల అజ్ఞానులై, బుద్ది నశించి నీచమైన కోరికలను నెరవేర్చుకోవడంకోసం సంసార సముద్రాన్ని దాటించేవి అయిన నీ చరణకమలాలను ఆరాధించే నరకగాములైన కాముకుల కోరికలను కూడా తీరుస్తూ ఉంటావు. అలాంటివాళ్లను గర్హించే నేనుకూడా పెండ్లి చేసుకోవాలనే కోరికతో ఉన్నాను. గృహయజ్ఞనిర్వహణలో గోవువలె ఉపకరించేది, అన్నిటికి మూలమైనది, ధర్మార్థకామాలను అనుష్ఠించడంలో సహాయపడేది, నాప్రవర్తనకు అనుగుణమైన ప్రవర్తన కలదీ అయిన వధువును వివాహమాడాలనే కోరికతో కల్పవృక్షమూలాలకు సమానమైన నీ పాదపద్మాలను సేవించాను.
అయినా ఒక విశేషముంది. మనవి చేస్తాను అవధరించు. పరబ్రహ్మమే ఆత్మగా కలవాడవైన నీ మాటలు అనే తాళ్లతో బంధింపబడి లోకంలోని ప్రజలు కామానికి వశులైనారట. నేనుకూడా అలాంటి కాముకులను అనుసరించినవాడనే. కాలాత్మకుడవైన నీకు ఇష్టమైనట్లు కర్మమయమైన నీ ఆజ్ఞాచక్రాన్ని అనుసరించి (సృష్టిని వృద్ధిచేయటానికి) నడచుకోవటానికే నాకు వివాహం. కామతృష్టతీర్చుకోవటానికి మాత్రంకాదు.
నీవు మాయతో నిర్మించిన కాలాత్మకమైన చక్రం మహావేగం కలది. శాశ్వతమైన భ్రమణం కలిగి పరబ్రహ్మను అనుసరించి తిరుగుతుంది. అధికమాసంతో కలిపి ఆ కాలచక్రం పదమూడు నెలలు అనే ఆకులుగలది. మూడువందల అరవై అహోరాత్రాలు (పగళ్లు, రాత్రులు) అనే కణుపులు కలది. ఆరు ఋతువులు అనే చక్రంచుట్టూ పట్టాగలది. మూడు చాతుర్మాస్యాలు అనే నడిమిబొడ్డు కలది. అపరిమితమైన సూక్ష్మ క్షణాలు అనే ఆకులతో విరాజిలేది.
కాలాత్మకమై మిక్కిలి వేగంతో కూడిన ఆ కాలచక్రం సమస్త జీవుల ఆయుస్సును మింగడానికి ఆసక్తి కలదై ఉంటుంది. అయినా కామానికి లోబడినవారిని అనుసరించే పశుస్వభావం గలవారైన లోకులను మాత్రమే ఆ కాలచక్రం పరిత్యజిస్తుంది (చీకాకు పరుస్తుంది). సంసారతాపాన్ని శాంతింపజేసే నీ పాదాలనే గొడుగునీడలను ఆశ్రయించినవారు, నీ గుణవర్ణనమనే అమృతరసాస్వాదన వైభవలహరులలో ఉంటున్నవారు, సమస్త శారీరక ధర్మాలను లెక్క చేయనివారు అయిన భగవద్భక్తజనం యొక్క ఆయువును హరించడానికి ఆ కాలచక్రం సమర్థంకాదు అని కర్దమమహాముని భగవంతునితో చెప్పాడు. ఇంకా అలా అన్నాడు.
(ఈ వచనంలో కాలచక్రానికి సంబంధించిన విషయాలున్నాయి. సంవత్సరానికి పన్నెండే మాసాలు. కాని 360 అరలుగల చక్రాన 365 1/3 అహోరాత్రములుంటాయి. తిథులనుబట్టి పన్నెండు మాసాల పరిధులు ఓక సంవత్సరంగా తిరుగుతాయి. సంవత్సరానికి పది తిథుల చొప్పున ఎక్కువగా మిగిలిపోగా మూడు సంవత్సరాలకు ముప్పదితిథులు మిగిలి అధికమాసం ఏర్పడుతుంది. దానితో కలసి పదమూడు విభాగాలు ఏర్పడుతున్నాయి. సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి భూమికి కావలసిన కాలాన్ని సౌరసంవత్సరమంటారు. ఇది 365 1/3 అహోరాత్రాలు గలది. ఇదిగాక 360 అహోరాత్రాలలో సంవత్సరం కొలత మరొకటుంది. దీనికి సావన సంవత్సరమని పేరు. ఇదిగాక పన్నెండు పూర్ణిమలు, పన్నెండు అమావాస్యలతో మరొక సంవత్సరమానముంది. దీనికి చాంద్రమాన సంవత్సరమని పేరు. దీన్ని సౌరసంవత్సరంతో సరిపెట్టడానికి మూడు సంవత్సరాల కొకసారి అధికమాసం కలపాలి.
కాల స్వరూపంలో వేగం పుడుతుంది. అందులో కేంద్రం ఏర్పడి దాని చుట్టూ పరిధులు తిరుగుతూ ఉంటాయి. ఆ పరిధులలో పదమూడు విభాగాలు కనిపిస్తాయి. అదే సంవత్సరాత్మకమైన కాలచక్రం.
లోకాన్ని అనుసరిస్తూ కాలాత్మకుడైన భగవంతుని పూజిస్తూ భార్యను అడగడానికి కారణం కామవాంఛతో కాదు. దేవఋషి పితృ ఋణాలనుండి విముక్తి కోసం పుత్రకళత్రాదుల అవసరం ఉంది. అందుకే అలాంటి కోరిక కోరుతున్నానని కర్దముని అభిప్రాయం.)
పుణ్యాత్ముడవైన పరమాత్మా! విశ్వవంద్యా! సర్వేశ్వరా! ఒక్కడవే అయినా నీవు నిర్మించిన మాయవల్ల కలిగిన సత్త్వం మొదలైన శక్తులకు ఉనికి ఏర్పడుతున్నది. ఆ శక్తుల ద్వారా నీవు సాలెపురుగు సాలెగూడును తయారుచేసి మళ్లీ తనలోనే లీనం చేసుకొన్నట్లు జగత్తు పుట్టడానికి, వృద్ధి కావడానికి, నాశనం కావడానికి కారణమైన మాయామహిమతో కూడి ఉంటావు. అలాంటి గొప్పదైన నీ లీలా విలాసమనే సముద్రాన్ని దాటడానికి ఎవరికైనా సాధ్యమవుతుందా? సాధ్యంకాదని భావం.
(ఓ పుణ్యపురుషా! నీవు ఒక్కడవే అయినా నీ మాయచేత త్రిగుణరూపాలైన మూడు శక్తులుగా ప్రవర్తిస్తావు. రజోగుణంతో బ్రహ్మవై లోకాలను పుట్టిస్తావు. సత్వ గుణంతో విష్ణుడవై లోకాలను కాపాడుతావు. తమోగుణంతో రుద్రుడవై లోకాలను నశింపజేస్తావు. కాని ఈ పనులకు నీవు అంటకుండా ఉంటావు. సాలెపురుగు తన శరీరంనుండే దారాలు తీసి వేరుగా తనకొక ఇల్లు ఏర్పరచుకొంటుంది. అదే విధంగా నీవు ఇన్ని రూపాలను నీ నుండే నీకన్నా వేరుగా కల్పిస్తున్నావు. అలాంటి నిన్నుగాక లోకం మరెవ్వరని స్తుతిస్తుంది? సాలెగూడు సాలెపురుగుపై ఆధారపడినట్లు ఈ లోకాలన్నీ నీపైనే ఆధారపడి ఉన్నాయి. సృష్టి రహస్యాన్ని బోధించడానికి ఉపమానంగా గ్రహించిన ఊర్ణనాభిగతి (సాలెపురుగుపద్ధతిలో)

దేవా! శబ్దాది విషయాలచే సుఖం కలిగించేదైన సృష్టి స్వరూపాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయడమనేదంతా మమ్ములను అనుగ్రహించడానికే గాని నీకోసం కాదు. నీ మాయవల్ల ప్రవర్తితం అవుతున్న లోకవ్యాపారం కలిగి మా కోరికలనే అమృతాన్ని నిండుగా వర్షించేవాడవైన నీకు నమస్కరిస్తున్నానని కర్దమమహాముని భగవంతునితో చెప్పాడు.
(సృష్టి పంచభూతాత్మకం. అలాగే ప్రాణి శరీరం కూడా పంచభూతాత్మకమే. భూమి, నీరు, అగ్ని వాయువు, ఆకాశం పంచభూతాలు. పంచభూతాత్మకమైన ప్రాణికి కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలద్వారా సుఖదుఃఖాలు కలుగుతాయి. చెవి, చర్మం, కన్ను, నోరు, ముక్కు అనే జ్ఞానేంద్రియాలతో తెలుసుకొనేవి తన్మాత్రలు. తత్ అంటే పరమాత్మ. మాత్ర అంటే కొలమానం. అంటే పరమాత్మను తెలుసుకోడానికి ఆధారమైనవి తన్మాత్రలు. చెవి మొదలైన జ్ఞానేంద్రియాలకు తన్మాత్రలు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు. శబ్దాది విషయాలంటే ఇవే. సృష్టిలోని ప్రాణులకు సుఖాన్ని కలిగించేవి శబ్దాది విషయాలే.
లోకవ్యాపారమంటే సృష్టి స్థితిలయాలతో కూడిన విషయం. లోకవ్యాపారాలన్నీ పరమాత్మ మాయవల్ల ప్రవర్తిస్తూ ఉంటాయి. ఆత్మకూ పరమాత్మకూ మధ్యగల సంబంధం సరిగా అర్ధంకాకపోవడమే మాయ.)
అని ఈ విధంగా కర్దమముని స్తుతించగా సరోజాక్షుడైన విష్ణుదేవుడు విన్నాడు. గరుత్మంతుని మూపుపై ఒయ్యారంగా కూర్చొని అందంగా కనిపించే ఆ స్వామి ప్రేమతో కూడిన చిరునవ్వు వెన్నెలలు వెల్లివిరిసే చూపులతో, అతిశయమైన దయతో మునీశ్వరుడైన కర్దముని అవలోకించి సొగసు అతిశయిస్తూ ఉండగా ఇలా చెప్పాడు.
కర్దమమునీంద్రా! మనస్సులో ఏ కోరిక కోరి నీవు గొప్ప భక్తి శ్రద్ధలతో నన్ను ఆరాధించావో నీకు ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది సుమా!
కోరిన కోరిక తప్పక నెరవేరుతుందని చెప్పి విష్ణుదేవుడు కర్దమునితో ఇంకా ఇలా అన్నాడు. బ్రహ్మదేవుని కుమారుడు, రాజాధిరాజు అయిన స్వాయంభువమనువు బ్రహ్మావర్తదేశం ప్రధానంగా ఏడుసముద్రాల మధ్యలోగల భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు. పుణ్యాత్ముడైన ఆ మనువు శతరూప అనే తన భార్యతో కలసి పెండ్లి కావలసిన పుత్రికను వెంటబెట్టుకొని రేపు నీ చెంతకు వస్తాడు. వయస్సులో, శీలంలో, సంకల్పంలో, సుగుణాలలో నీకు తగినటువంటి తన కొమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాడు. ఆ వివాహం వల్ల నీ కోరిక సఫలమవుతుంది. నన్ను మనస్సులో నిత్యం స్మరిస్తూ ఉండే ఆ మనువు కూతురు నిన్ను పెండ్లాడి నీ తేజస్సును ధరించి ఎంతో అందగత్తెలైన తొమ్మిదిమంది తనయలను కంటుంది. ఆ తొమ్మిదిమందికి మునీశ్వరులవల్ల ఉత్తములైన కొడుకులు పుడతారు. నీవునా ఆజ్ఞను పాటించి నీవు చేసే సమస్త కర్మఫలాలను నాకే అర్పిస్తూ ఉండు. ఏకాగ్రమైన మనస్సుతో ప్రాణులకు అభయమిస్తూ, దానాలుచేస్తూ, కరుణామూర్తివి సుజ్ఞానివి అయి లోకాలన్నీ నాలోనే ఉన్నాయని, నీలో నేను ఉన్నానని తెలుసుకొని నన్ను ఆరాధిస్తూ ఉండు. అంత్యకాలంలో నన్ను చేరుకొంటావు. నేను నీ తేజస్సుతో, నా కళాంశతో నీ భార్య గర్భంలో ప్రవేశించి నీకు పుత్రుడుగా జన్మిస్తాను. నీకు తత్త్వవిద్యను బోధిస్తాను. అని తెలియజేసి కర్దమమహాముని చూస్తూ ఉండగానే విష్ణుదేవుడు అంతర్జానమయ్యాడు.
(బ్రహ్మావర్తదేశం - ఎక్కడ బ్రహ్మవిద్య ప్రభవించి విస్తరించిందో ఆ దేశం. బ్రహ్మవిద్య అంటే వేదవిద్యే. ఈ ప్రాంతంలోనే వేదవిద్య పుట్టి వికసించింది. వేదఋషులు బ్రహ్మవిద్యను ఇక్కడనుండే ప్రచారం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ నగరానికి వాయవ్య దిశగా ఉన్న ప్రాంతం అప్పటి బ్రహ్మావర్తదేశం. తత్త్వ సంహిత - అంటే తత్త్వజ్ఞానం లేక తత్త్వవిద్య. ఈ విద్యను గురించి చెప్పేది తత్త్వశాస్త్రం. మనం చూస్తూ ఉన్నలోక స్వభావం ఎలా ఉంటుందో లోతుకు దిగి విచారణ చేస్తూ పోతే ఏర్పడే యథార్థమైన జ్ఞానమే తత్త్వజ్ఞానం. తత్ అంటే అది అనగా పరబ్రహ్మ అని అర్థం. నామరూపాత్మకంగా కనిపిస్తున్నలోకం అలా భాసిస్తుందేగాని నిజానికి లోకమంతా సచ్చిదాత్మకమైన పరబ్రహ్మస్వరూపమే అని తెలుసుకోవడమే తత్త్వజ్ఞానం. ఇంకా సులువుగా చెప్పాలంటే ఆత్మ, పరమాత్మ, ప్రకృతి అనే మూడింటి సంబంధాన్ని చెప్పేదే తత్త్వజ్ఞానం.)
పవిత్రమైన సరస్వతీనదీజలంతో పెంపొందిన గున్నమామిడి చెట్లతో అందగిస్తున్న ఎత్తెన గట్లతో కూడిన బిందుసరోవరంనుండి బయలుదేరి(విష్ణుదేవుడు) ఒప్పుచున్న గరుత్మంతుని అధిరోహించి, అతని ఉన్నతమైన రెక్కల కదలికలచే పుట్టిన చప్పుళ్లు సలక్షణమైన సామవేదగానంగా ఒప్పుతూ ఉండగా పరవశత్వంతో వింటూ,
(గరుడుడు వేదస్వరూపుడు. 'వేదాత్మా విహగేశ్వరః'. గరుత్మంతుడు, సుపర్ణుడు అని కూడా గరుడునికి పేర్లు. ఈ రెండు పేర్లు ఇతని రెక్కల శక్తిని తెలుపుతాయి. ఇంద్రుని వజ్రాయుధం దెబ్బకు కూడా చలింపనివీ రెక్కలు. సుపర్ణుడనే శబ్దానికి అలాంటి చలింపని రెక్కలని అర్థం. మహావిష్ణువుకు వాహనమైన గరుడుడు ఆకాశాన ఎగురుతూ ఉంటే కదులుతూ ఉన్న రెక్కలనుండి పుట్టిన గాలి చేసే శబ్దం వేదగానంగా వినిపిస్తున్నది.)
శ్రీహరి వైకుంఠానికి వెళ్లిన తరువాత కోరికలతో కూడినవాడు, జనవంద్యుడు అయిన కర్దమముని మోహావేశంతో ఫలించబోయే కోరికలు మనస్సులో అధికమవుతూ ఉండగా వెంటనే బిందుసరోవరానికి వెళ్లాడు. అక్కడ భక్త్యతిశయమైన మనస్సుతో లక్ష్మీనాథుడైన శ్రీహరిని స్మరిస్తూ ఉన్నాడు.
(కర్దమముని దైవకార్యమైన సృష్టిని వృద్ధిచేయటానికి వివాహమాడాలని నిర్ణయించుకొన్నాడు. శ్రీహరిని ఆరాధించాడు. శ్రీహరి ప్రత్యక్షమై కోరిక నెరవేరుతుందని ఆశీర్వదించాడు. స్వాయంభువమనువు తన కొమార్తెను వెంటబెట్టుకొని రేపు నీవద్దకు వచ్చి ఆమెనిచ్చి నీకు వివాహం చేస్తాడని కూడా చెప్పాడు. ఇప్పుడు కర్దమముని తనకు కాబోయే భార్యకోసం ప్రతీక్షిస్తున్నాడు. ఆమె వస్తుంది తనకు వివాహం అవుతుంది అని తెలియడంవల్ల మనస్సు ఆనందంలో తేలిపోతూ ఉంది. 'ముందటవచ్చు కోరికల్ పిరిగొనుచుండన్' అంటే కాబోయే భార్యను, జరగబోయే వివాహాన్ని గురించి ఆలోచించినపుడు మనస్సులో కోరికలు అధికం కావడమని భావం.)
తరువాత స్వాయంభువమనువు భార్యతో కలసి బంగారు రథం ఎక్కి భర్తయందు కోరికగలదైన అనగా పెండ్లివయస్సులో ఉన్న తనయను వెంటబెట్టుకొని ఆమెకు అర్హుడైన వరుని వెదకుతూ లోకాలన్నీ కలయదిరిగాడు. కాని అలాంటి వరుడు ఎక్కడా కనపడలేదు. తిరిగి తిరిగి వచ్చి.
విష్ణుదేవుడు కర్దమమహామునిని కారుణ్యానందాతిశయంతో వీక్షించినపుడు కర్దముని కన్నులనుండి రాలిన ఆనందాశ్రువులు నేలపైపడి ఒక ప్రవాహమై సరస్వతీనదిని చుట్టుకొని ప్రవహించి బిందుసరోవరం అనే పేరుతో వర్ధిల్లింది. ఆ పుణ్యతీర్జాన్ని పండితోత్తముడైన స్వాయంభువమనువు తన కన్నుల ఎదురుగా దర్శించాడు.
(కర్దమమహామునిని శ్రీహరి ఆనందం కరుణ కలిసిన దృక్కులతో వీక్షించాడు. కర్దముడు శ్రీహరిని ఆరాధించి వివాహం చేసుకోవాలని, దైవకార్యమైన సృష్టిని అభివృద్ధి చేయాలని కోరుకోవడం శ్రీహరికి ఆనందదాయకమైంది. అదే ఆయన కర్దమునిపై కారుణ్యం వర్షించడానికి కారణమైంది. కర్దమునికి దేవహూతికి తాను కపిలుడుగా జన్మించి తత్త్వోపదేశం చేయవలసి ఉంది. కర్దముడు శ్రీహరికి తండ్రి కాబోతున్నాడు. అది ఆయన సంతోషానికి మరొక కారణం. కర్దముని కన్నులనుండి రాలిన ఆనందాశ్రువులు బిందువులుగా నేలపై పడి ప్రవాహంగా మారి సరస్వతీనది చుట్టూ ప్రవహించి ఒక సరస్సుగా రూపొందడంవల్ల బిందు సరోవరమని పేరు ప్రఖ్యాతమైంది.)
ఆ బిందుసరోవరం పక్కనే కర్దముని తపోవనం ఉన్నది. ఆ వనంలో కానుగచెట్లు, మద్దిచెట్లు, పొగడచెట్లు, ఏరుమద్దిచెట్లు, వేపచెట్లు, కడిమిచెట్లు, కలిగొట్టుచెట్లు, చందనవృక్షాలు, కొబ్బరిచెట్లు, కర్పూరవృక్షాలు, దిరిసెనపుచెట్లు, మామిడిచెట్లు, ఎర్రగంధపుచెట్లు, పోకచెట్లు, సంపెంగచెట్లు, మారేడుచెట్లు, వెలగచెట్లు, ఇప్పచెట్లు ఉన్నాయి. లవంగలతలు, మల్లెపొదలు, మొల్లపొదలు మొదలైన చక్కని పొదరిండ్లతో ఆశ్రమవాటిక అందంగా కనిపిస్తున్నది.
ఆ యాశ్రమంలో బాగా పండిన పండ్లబరువుతో చెట్ల కొమ్మలు కిందికి వంగి ఉన్నాయి. ఆ కొమ్మలమీద నివసించే పక్షులగుంపుల కలకలధ్వనులతో దిగంతాలు ప్రతిధ్వనిస్తున్నాయి. ఆ దృశ్యం చూడడానికి ఆహ్లాదకరంగా ఉంది.
పండినపండ్లను మిక్కిలి వాడిగా ఉన్న తమముక్కులతో పొడిచి ఆ సందులనుండి కారుతూ ఉన్న ఫలరసాన్ని తాగి రాచిలుకలు సంతోషంతో చేస్తున్న రుచిరార్థంతో కూడిన వేదవాక్యములరవళి వీనులవిందుగా వినిపిస్తున్నది.
లేత మామిడి చిగుళ్లను మెక్కి వగరెక్కిన గొంతులతో కోయిలలు ఎంతో రమ్యంగా అవ్యక్తమధురంగా కూస్తున్నాయి.
ఆ యాశ్రమంలో దట్టంగా ఉండిన కానుగచెట్లను చూచి మేఘాలుగా భ్రాంతిపడి నెమళ్లు పురులు విప్పి చూడముచ్చటగా నృత్యం చేస్తున్నాయి.
కన్నెలేళ్లతో, నీటికోళ్లతో, బెగ్గురు పక్షులతో, కొంగలతో, చక్రవాకాలతో, గండుతుమ్మెదలతో, కలహంసలతో, కమలాలతో, తెల్లకలువలతో, ఎర్రకలువలతో విరాజిల్లే సరోవరాలు గల ఆశ్రమం ఎంతో రమ్యంగా ఉంది.
ఆ ఆశ్రమ పరిసరాల్లో ఏనుగులు, పెద్దపులులు, తోడేళ్లు, అడవి దున్నలు, కుందేళ్లు, ఎలుగుబంట్లు, చమరీమృగాలు, సింహాలు, వరాహాలు, ఖడ్గమృగాలు, గురుపోతులు, కోతులు, ఒంటెలు మొదలైన అడవిమృగాలు సంచరిస్తున్నాయి.

(పైన కనిపించే అడవి జంతువుల్లో జింకలు, కుందేళ్ల వంటి సాధుజంతువులు కూడా ఉన్నాయి. సాధుజంతవులు, క్రూరజంతువులు కలసిమెలసి ఆశ్రమపరిసరాల్లో సంచరిస్తున్నాయి. మహర్షుల తపోమహిమవల్ల ఆశ్రమవాతావరణంలో శాంతి నెలకొని అక్కడి ప్రాణులలోగల సహజ క్రూరత్వం, వైరం అణగి పోతాయి. పెద్దజంతువులు చిన్నజంతువులను, క్రూరజంతువులు సాధుజంతువులను బాధించకుండా స్నేహంతో, ప్రేమతో కలసిమెలసి సంచరిస్తూ ఉంటాయి.)
అలాంటి కర్దమముని తపోవనం దర్శించి స్పాయంభువమనువు కొద్దిపాటి పరివారంతో ఆశ్రమంలోకి ప్రవేశించాడు.
ఆశ్రమంలో ప్రవేశించిన మనువు కర్దమమునిని దర్శించాడు. పవిత్రమైన బ్రహ్మచర్యవ్రతానికి తగిన తపః ప్రవృత్తిచేత కర్దముని శరీరం చక్కగా ప్రకాశిస్తున్నది. దేహం మిక్కిలి కృశించిపోయినప్పటికి శ్రీహరి సంకీర్తనమనే అమృతరసాన్ని చెవులనే దోసిళ్ళతో ఆస్వాదించి ఆ మాధుర్యానికి పారవశ్యం చెంది ఉండిన కారణంగా ఆ కృశత్వం కనపడలేదు. ఆయన జడలూ, నారచీరలూ, జింకచర్మమూ ధరించి విశాలమైన నేత్రాలతో కనిపిస్తున్నాడు. సానబట్టని, వెలకట్టలేని నూతన రత్నంవలె ఉన్నాడు. అలా కనిపిస్తున్న కర్దముని పాదాలకు స్వాయంభువమనువు భక్తితో నమస్కరించాడు.
(కర్దమముని కృశీభూతాంగుడైనా శ్రీహరి సంకీర్తనమనే అమృతరసాన్ని ఆస్వాదించడంవల్ల శరీర కృశత్వం కనిపించక పోవడానికి అతడు గొప్పభక్తుడు కావడం కారణం. భగవంతుడు అతనిని వాత్సల్యంతో చూడడం కూడా ఇందుకు హేతువు. కర్దముని ఈ లక్షణమే తనకూతురికి ఆయన తగిన భర్త అని మనువు అనుకొనేటట్లు చేసింది. కర్దముడు సానబట్టని, వెలకట్టలేని రత్నంవలె వెలిగిపోతున్నాడని చెప్పడంలో అతని నిగూఢమైన భక్తి తత్పరత దాగి ఉంది.
"కన్యా వరయతే రూపం మాతా విత్తం పితా శ్రుతమ్
బాన్థవాః కులమిచ్చన్తి మృష్టాన్నమితరే జనాః”
"వరునిలో కన్య రూపాన్ని కోరుకుంటుంది. తల్లి సంపదను, తండ్రి విద్యావైభవాన్ని బంధువులు కులమర్యాదను, తక్కినవారు తృప్తి కలిగించే భోజనాన్నీ కోరుకుంటారు" అనే శ్లోకాన్నిబట్టి ఈ పద్యంలో ఇంచుమించు అవన్నీ ఉన్నాయనే అర్థాన్ని కవి ధ్వనిమార్గంలో తెలియజేస్తున్నాడు. రూపవర్ణన ఉంది. తపస్సంపద కానవస్తున్నది. తండ్రి ఆయన పాదాలకు నమస్కరించటం విద్యాదీప్తీ, కులమర్యాదా అభివ్యక్తం అవుతున్నాయి.)
ఇలా నమస్కరించిన స్వాయంభువమనువును కర్దమమహాముని తన ఇంటికి వచ్చిన అతిథిగా గౌరవించాడు. పూజాద్రవ్యాలు, పాదప్రక్షాళానికి జలం సమర్పించి ఆనందింపజేశాడు. ముందు విష్ణుదేవుడు ఆదేశించి ఉండిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకొని స్వాయంభువమనువుతో ఇలా అన్నాడు.
(పూజనీయులైన పెద్దవాళ్లు వచ్చినప్పుడు అర్ఘ్యం సమర్పించడం ఒక సంప్రదాయం. తేనె, పెరుగు, నెయ్యి, అక్షతలు, గరిక, నువ్వులు, పువ్వులు, దర్భ, పుష్పం - అన్నీ కలిపి అర్ఘ్యం అవుతుంది. ఇవన్నీ కలిపిన పూజాద్రవ్యంతో అర్చిస్తారు.)
శ్రేష్ఠమైన గుణాలకు స్థానమైనవాడా! భగవంతునియెడల భక్తిగలవాడవైన నీవు సజ్జనులను రక్షించడానికి, దుర్జనులను శిక్షించడానికి లోకమంతా పర్యటిస్తూ ఉంటావు గదా! ఓ పుణ్యపురుషా! సూర్య, చంద్ర, వాయు, యమ, వరుణ, ఇంద్రుల అంశలు కలవాడవు. విష్ణుస్వరూపుడవు. అలాంటి నీకు నేను పరమభక్తితో నమస్కరిస్తున్నాను. పాపరహితా! నీవు ఎప్పుడూ సమస్తలోకాలను జయించగలదైన నేమిగల మణులుతాపిన బంగారుమయమైన రథాన్ని అధిరోహించి, చేత విల్లుధరించి అడ్డూ ఆపూలేని సైనికుల పాదాల రాపిడిచేత భూమి దద్దరిల్లగా (జైత్రయాత్ర) సాగిస్తూ ఉంటావు.
రాజా! నీవు సూర్యునివలె నిరంతరం సంచరించకపోతే లోకాలన్నీ గాఢనిద్రలో మునిగిపోతాయి బ్రహ్మచే కల్పించబడిన(సృష్టింపబడిన) వర్ణాశ్రమాలు, గొప్ప సముద్రానికి చెలియలికట్టవంటి సదాచారక్రియలు భ్రష్టమై, జాతిసంకరమేర్పడి దొంగలభయంవల్ల లోకాలన్నీ ఎక్కడనో నశించిపోతాయి గదా!
(ఇక్కడ మనువు ఒక రాజుగా సూర్యునితో పోల్చబడినాడు. సూర్యుని వెలుగు లోకమంతా ప్రసరించినట్లు రాజు దృష్టికూడా అతని రాజ్యమంతా ప్రసరించాలి. అలా ప్రసరించినప్పుడే లోకంలోని మంచి చెడ్డలను గ్రహించగలుగుతాడు. లోకమంటే జనం. వర్ణాలు, ఆశ్రమాలు వాళ్లకు సంబంధించినవే. ఆ వర్ణాశ్రమాలు సాంకర్యదోషం పాలుకాకుండా చూడవలసిన బాధ్యత రాజుది. సూర్యుడు లేకపోతే ఉదయమే లేకపోవడంవల్ల లోకులు నిద్రలోనే ఉండిపోతారు. అలాగే రాజు నిరంతరం తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఉండకపోతే వర్ణాశ్రమ సాంకర్యం ఏర్పడుతుంది. వర్ణాలు ఆశ్రమాలు గొప్పవి, విస్తృతమైనవి. అందువల్లనే అవి పాథోనిధితో పోల్చబడినాయి. సదాచార సంపత్తి పాథోనిధికి చెలియలికట్ట వంటిది.)
అని చెప్పి కర్దమముని "నీ రాకకు కారణం ఏమిటి?" అని స్వాయంభువుని అడుగగా యథావిధిగా నిత్యమూ వైదికాచారాలను నిర్వర్తించేవాడైన కర్దమ మునీంద్రునితో స్వాయంభువమనువు ఇలా అన్నాడు.
(మానవులకు నిత్యములు, నైమిత్తికములు, కామ్యములు అని మూడువిధాలైన కర్మములు విధ్యుక్తములై ఉన్నాయి. అందులో సంధ్యావందనం మొదలైనవి నిత్యకర్మములు, పూర్ణిమ, అమావాస్య మొదలైన పర్వదినాలలో చేయవలసినవి నైమిత్తికములు. పుత్రకామేష్టి మొదలైనవి కామ్యములు.)
మునివరేణ్యా! బ్రహ్మదేవుడు తాను రచించిన వేదాలన్నిటిని ఈ భూమిమీద బయలుపరచడానికి మిమ్ములను తన ముఖంనుండి సృష్టించాడు.
(వేదాలు అపౌరుషేయాలన్నారు గదా! మరి బ్రహ్మ రచించినట్లు చెప్పడం ఎలా? వేదాలు పరమాత్మ నుండి లోకంలోకి వచ్చినట్లు ఒక సంప్రదాయం చెపుతున్నది. సమస్త సృష్టికి, స్థితికి, లయానికి పరమాత్మే కారణమైనప్పటికి సృష్టిచేసే అధికారం బ్రహ్మదేవుని కిచ్చి ఆయనచేతనే సృష్టికార్యం చేయించాడు. అందువల్ల బ్రహ్మకే సృష్టికర్తగా పేరొచ్చింది. అలాగే వేదాల ఆవిర్భావానికి కూడా బ్రహ్మదేవుడే కర్త అని చెప్పే సంప్రదాయం ఉంది. అంతేగాక విశ్వంలోని ప్రతిదాని ఆవిర్భావమూ బ్రహ్మద్వారానే జరిగిందని చెప్పడమూ ఉంది.)
పాపస్వరూపులైన దొంగలు కలిగించే బాధలకు గురికాకుండా సమస్తభూమినీ పరిపాలించడానికి మమ్ములను తన భుజాలనుండి బ్రహ్మ సృష్టించాడు.
బ్రహ్మదేవునికి బ్రాహ్మణులు అంతఃకరణంగా, క్షత్రియులు శరీరంగా ప్రసిద్దులైనారు. శ్రీహరికి ఈ రెండు జాతులవాళ్లు అవశ్యం రక్షింపదగిన వాళ్లు.
అందువల్ల విష్ణుస్వరూపుడవు, దుర్జనులకు కనపడనివాడవు అయిన నిన్ను దర్శించగలగడం నా అదృష్టంవల్ల ప్రాప్తించింది. నీ పాదపద్మాలలోని కేసరాలవల్ల ఎర్రనయిన నా తలా, నీ మాటలనే అమృతంతో నిండిన నా చెవులూ శుభాలకు స్థానాలై సఫలత్వాన్ని పొందాయి. నేను ధన్యుడనయ్యాను. కొమార్తెపైగల వాత్సల్యంవల్ల కలిగిన దుఃఖంతో మనస్సులో ఆందోళనపడుతూ దేశాలన్నీ(పెండ్లికొడుకు కోసం) తిరిగి అలసిపోయాను. నా ప్రార్థనను ఆలకించు అని మనువు కర్దమమహామునితో మరలా ఇలా అన్నాడు.
మహా యోగీశ్వరుడవైన కర్దమా! దేవహూతి అనే పేరుగల ఈ అందగత్తె నా కొమార్తె ఈమె మిక్కిలి సాందర్యవంతులు, గుణశ్రేష్ఠులు అయిన పురుషులను ఎవరినీ వివాహమాడడానికి అంగీకరించడంలేదు. ఇప్పుడు తొందరతో నారదమహర్షి పంపించడంవల్ల మిమ్ములను (కర్దమమునిని) వివాహమాడాలని ఇక్కడకు వచ్చింది. నీవు ఈ శుభకార్యాన్ని అంగీకరించి, స్థిరమైన సంకల్పంతో ఈ కన్యాదానాన్ని స్వీకరించు.
శుభస్వభావంగల కర్దమ మహామునీ! పవిత్రమైన గృహస్థాశ్రమ కృత్యాలకు తగిన సుగుణాలతో, మంచి స్పభావరీతులతో కూడి ఒప్పుతున్న ఈ కన్యను సంతోషంతో భార్యగా స్వీకరించు.
(గృహస్థాశ్రమం నాలుగాశ్రమాలలో అతిముఖ్యమైంది. మిగిలిన మూడు ఆశ్రమాలు గృహస్థాశ్రమం మీదనే ఆధారపడతాయి. గృహస్థాశ్రమానికి వివాహవ్యవస్థ మొదటిదశ. వివాహమై భార్యాభర్తలైన తరువాత సాగించే సంసారం గృహస్థాశ్రమధర్మాల పై ఆధారపడి సాగుతుంది. సక్రమంగా భార్యాభర్తలు గృహస్థాశ్రమధర్మాలను నిర్వర్తించాలంటే ఆ భార్యాభర్తల మధ్య చక్కని ఆనురూప్యం ఉండాలి. భర్త రూపానికి, గుణశీలాలకు తగినట్లు భార్య ఉండాలి. అలాగే భార్యరూపానికి, గుణశీలాలకు తగినట్లు భర్త ఉండాలి. ఇలా ఉన్నప్పుడే ఆ భార్యాభర్తలను చూచినవారు 'వీళ్లమధ్య ఈడూజోడూ కుదిరింది. అనుకూలమైన దాంపత్యం' అని ప్రశంసిస్తారు.)
పుణ్యాత్ముడైన ఓ కర్దమ మునీంద్రా! అనురాగం లేనివారికైనా అయాచితంగా తమంతతామే లభించిన సుఖాలను వదలిపెట్ట కూడదన్నారు పెద్దలు. అలాంటప్పుడు అనుకోకుండా లభించిన ఇష్టమైన సుఖాలను కోరికలుగలవారు వదలుకొంటారా? వదలుకోరు.
కర్దముమునీ! ఒక ప్రయోజనాన్ని ఆశించి పనిచేయడానికి పూనుకొన్నవాడు ఆ పనికోసం ఒకలోభి సాయం కోరితే అలా కోరినవాని కీర్తీ అభిమానమూ రెంటికీ భంగం కలుగుతుంది. నీవు వివాహం చేసుకోవాలనే కోరికతో ఉన్నావని తెలుసుకొని ఇక్కడికి (వచ్చాం).
(కార్యనిర్వహణలో లోభి సహకారం కోరితే కార్యం చెడడమే కాకుండా కోరినవారి అభిమానమూ చెడుతుంది. ఇది అందరూ తెలుసుకోవలసిన నీతి. మనువు తన పుత్రికను కర్దమునికిచ్చి పెండ్లి చేయాలనే తలంపుతో వచ్చాడు. కర్దముడు కాదంటే తనపని నెరవేరకపోవడడమేగాక తన అభిమానం దెబ్బతింటుంది. కర్దముడు వివాహేచ్చతో శ్రీహరిని ఆరాధించిన విషయం మనువుకు తెలుసు. కొమార్తెను తీసుకొని కర్దముని ఆశ్రమానికి వెళితే ఆమె వివాహం కర్దమునితో జరుగుతుందనే నమ్మకంతో వచ్చాడు మనువు. కార్యం జరగకపోవడం, తన కీర్త్యభిమానాలకు భంగం కలగడం ఉండవని తెలిసే ఆయన వచ్చాడు.)
ఇక్కడికి నేను వచ్చిన సంగతి విన్నవించాను. నా విన్నపాన్ని అంగీకరించి నా కొమార్తెను ఇష్టంగా భార్యగా అంగీకరించండి అన్నాడు మనువు. ఆ మాటలు వినిన కర్దమమహాముని స్వాయంభువమనువును తన వైపుకు తిప్పుకొని మిక్కిలి సంతోషంతో ఇలా చెప్పాడు.
ఓ పుణ్యాత్ముడా! ఇతరుల నందరినీ కాదని నీవు నాకోసం తీసుకొనివచ్చిన ఈ లతాంగి రూపరేఖావిలాసాలలో మనోహరమైనది. పవిత్రురాలైన లక్ష్మీదేవితో సమానురాలు. ఒకనాటి రాత్రి వెన్నెలలో తెల్లగా కనిపిస్తున్న తన మేడపై ఈమె పాదాలకు బంగారుఅందెలు అలంకరించుకొని తన చెలికత్తెలతో బంతియాట ఆడుతున్నది. ఆ సమయంలో విమానంలో వెళుతున్న విశ్వావసుడు అనే గంధర్వరాజు ఈ తరుణీమణి సౌందర్యాన్ని తిలకించి మోహంతో శరీరస్పృహ లేకుండా విమానంనుండి తూలి భూమి మీద పడ్డాడు.
(విశ్వావసుడు : ఒక గంధర్వుడు. ఇతడు దేవహూతిని చూచి మోహించాడు. ఆ పాపంతో తన స్థానంనుండి తప్పి కిందపడిపోయాడు. ఇది భాగవతంలోని విషయం. భారతంలో ఇతడొక గంధర్వరాజు. ఇతనికి మేనకవలన ప్రమద్వర అనే కూతురు కలుగుతుంది. తరువాత తల్లిదండ్రులిద్దరూ ఆ బిడ్డను వదలి వెళ్లిపోతారు.
విశ్వావసుడు వివాహానికి అధిదేవతగా శాస్త్రాలలో చెప్పబడ్డాడు. ఏ కన్యనైనా అతడు మొదట వరించి భూమిపై పడిన తరువాత భర్త కాబోయేవాడు వరించునని వేదమంత్రాలు చెపుతున్నాయి. విశ్వావసువనగా పురుషుల సంపదయగు యౌవనమధురభావం. అతడు వరించనిదే ఏ కన్యనూ ఎవరూ వరించలేరు.)
పుండరీకాక్షుడైన శ్రీహరిని ఎరుగని నరాధములు ఈ అందగత్తె జాడ తెలుసుకోలేరు. అటువంటి కాంతాలలామ అదృష్టవశాన తనంతతానుగా వచ్చి వరించినపుడు అంగీకరింపనివాడు ఎవడైనా ఉంటాడా? ఉండడు.
గుణం, రూపం, నడవడి విషయంలో ఈ కన్యామణికి నాకూ సమానత్వం కనిపిస్తున్నది. అందువల్ల ఇది పుణ్యకార్యంగా భావించి ఈమెను నేను భార్యగా స్వీకరిస్తాను.
(తనకూ(కర్దమునికి) కన్యారత్నానికి(దేవహూతికి) గుణరూపవర్తనలలో సమానత్వముందని కర్దమమహామునే చెప్పడం ఇక్కడ గమనింపదగి ఉంది. ఆయన మహర్షి కాబట్టి భార్యాభర్తలమధ్య వివాహానికి కావలసిన అంశాలేవో ఆయనకు తెలుసు.)
ఓ పుణ్యాత్ముడా! మాకు వివాహం జరగడానికి ఒక నియమం ఉంది. ఆ ఒడంబడిక ఏదో తెలియజేస్తాను విను. ఉత్తమ గుణాస్పద అయిన ఈమెకు సంతానం కలిగేవరకు సాంసారికధర్మాన్ని నిర్వర్తిస్తాను.
("ప్రజాతన్తుం మవ్యవచ్చేత్సీః'-సంతానమనే తంతువును త్రెంపివేయవద్దు. అని వేదానుశాసనం. దాంపత్యానికి సంతానమే ముఖ్యఫలం. కర్దముడు ఆ ధర్మాన్ని మనస్సులో ఉంచుకొని ఈ నియమాన్ని ప్రకటిస్తున్నాడు.
జ్ఞానచరితా! అటు తరువాత శ్రీహరి ఆజ్ఞ ప్రకారం ఆయన ఆనతిని తలదాల్చి శమదమాదులతో కూడిన యోగమార్గాన్ని అవలంబించి సన్యాసం స్వీకరిస్తాను.
ఓ రాజా! ఆ రమాకాంతునివల్లనే ఈ ఎల్లలోకాలు ఆవిర్భవిస్తాయి. వృద్ధిపొందుతాయి. నశిస్తాయి. బ్రహ్మాదుల అభ్యుదయానికి ఆయనే కారణభూతుడై ఉన్నాడు.
అలా ఉన్నదికాబట్టి ఆ దేవదేవుని ఆజ్ఞ అతిక్రమించరానిది అన్నాడు కర్దమహాముని. ఆ మాటలు వినిన స్వాయంభువమనువు తన సుతను కర్దమునికి ఇవ్వాలని అనుకొంటున్న భార్య శతరూపయొక్క అభిప్రాయాన్ని, కర్దమునే వివాహమాడాలనుకొంటున్న కొమార్తె దేవహూతి అభిప్రాయాన్ని తెలుసుకొన్నాడు. కర్దమమునీంద్రుని నియమానికి ఒప్పుకొన్నాడు. ఎంతో సంతోషంతో ఉత్తమగుణసంపన్నుడైన ఆ కర్దమునికి దేవహూతినిచ్చి వేదశాస్రోక్త పద్ధతిననుసరించి వివాహం జరిపించాడు. ఆ తరువాత శతరూప పారిబర్హములనే పేరుగల (అరణంపేరుతో చలామణిలో ఉన్న) వివాహ సందర్భానికి తగిన దివ్యవస్త్రాలనూ, దివ్యాభరణాలనూ దేవహూతీ కర్దములకు బహూకరించింది. ఆ ప్రకారంగా తన కులాచార పద్ధతి ననుసరించి వివాహం జరిపించి బరువు బాధ్యతలు తీర్చుకొన్నాడు మనువు. కుమార్తెను వదలి వెళ్లవలసి రావడంతో ఆమె ఎడబాటు ఆయనకు ఎంతో కలతను కలిగించింది. కుమార్తెను కౌగిలించుకొన్నాడు. వాత్సల్యంతో గడ్డం నిమిరాడు. చెంపను ముద్దాడి తలను స్పృశించాడు. ప్రేమాతిశయంతో ఉబికిన కన్నీళ్లతో ఆమె శిరస్సును తడుపుతూ తల్లీ! వెల్లివస్తానన్నాడు. అల్లుడైన కర్దముని వీడ్కోలు అందుకొని తన భార్యతో కలసి రథం అధిరోహించి పరిజనంతో కూడి బయలుదేరాడు.
చలిస్తున్న అలలపంక్తులతో ఎగురుతూ అందంగా కనిపిస్తున్న బిందుసరస్సు, సరస్వతీ నదులలో పద్మాలు అధికంగా ఉన్నాయి. పక్కనే ఆశ్రమవ్ఫక్షాలు అందంగా అమరి ఉన్నాయి. బిందుసరస్సు, సరస్వతీనదుల తీరప్రాంతాలలో మహనీయులైన మునిశ్రేష్ఠులు నివాసముండే ఆశ్రమాలు చాలా ఉన్నాయి. స్వాయంభువమనువు ఆ యాశ్రమాల వైభవాలను దర్శిస్తూ ముప్పిరిగొన్న ఆనందంతో తన పట్టణమార్గాన్నిబట్టి వెళ్లాడు.
(మనువు బ్రహ్మావర్తదేశానికి సమ్రాట్టుగా ఉండినట్లు చెప్పబడింది. పురాణప్రమాణాలనుబట్టి బ్రహ్మావర్త దేశమంటే సరస్వతి-దృషద్వతి అనే రెండునదుల నడిమి ప్రదేశం. అక్కడ రురువు అనే పేరుతో నల్లజింకలు సంచరిస్తూ ఉంటాయి. అందువల్ల ఆ ప్రదేశమంతా యజ్ఞయాగాది క్రతువులతో శ్రేష్ఠమైన బ్రహ్మజ్ఞానాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తుంది. స్థూలంగా ఈ ప్రదేశమిప్పుడు ఉత్తరభారతదేశంలో హిమాలయాలకు దిగువను, వింధ్య పర్వతాలకు పైనను ఉంది. మొట్టమొదట మానవజాతి భూగోళంపై అవతరించి ప్రదేశమిదేనని చెపుతారు.)
అలా ప్రయాణం చేసి మనువు బ్రహ్మావర్తదేశం చేరాడు. బ్రహ్మావర్తదేశంలో అతని నగరం ఉంది. అక్కడ పూర్వం శ్రీహరి యజ్ఞవరాహరూపం ధరించి శరీరాన్ని గట్టిగా విదిలించగా ఆయన శరీరంపై గల వెండ్రుకలు ఆ ప్రదేశంలో రాలాయి. ఆకుపచ్చని రంగుతో కనిపించిన ఆ వెండ్రుకల నుండి శ్రేష్ఠమైన దర్భలు, రెల్లుగడ్డి, యజ్ఞకార్యాలు చేయడానికి తగిన అగ్ని పుట్టాయి. వాటితో ఋషులందరూ యజ్ఞాలు నిర్వహించారు. యజ్ఞాలకు ఆటంకాలు కలిగిస్తున్న రాక్షసులను తుదముట్టించారు. ఆ ఋషులవల స్వాయంభువమనువు కూడా అక్కడ విష్ణువునుద్దేశించి యజ్ఞం చేసి గొప్పప్రజ్ఞతో విరాజిల్లాడు. అటువంటి తన పట్టణాన్ని (ఆయన సమీపించాడు).
(వైదిక కర్మకాండలో అంటే యజ్ఞ నిర్వహణలో దర్భలకు, రెల్లుగడ్డికి ప్రాధాన్యం ఉంది. దర్భ రెల్లుగడ్డి జాతికి చెందిన తృణం. పదిరకాల దర్భలున్నాయి. కుశం, కాశం, యవం, దూర్వం, విశ్వామిత్రం, ఉసీరం, కుందురం, గోధూమం, వ్రీహి, ముంజం అనేవి ఆ పదిరకాలు. దర్భలను కృష్ణపక్షమందలి పాడ్యమినాడు మంత్రపఠనం చేస్తూ సేకరిస్తారు. దర్భలు మంత్రాలను శక్తిమంతం చేస్తాయి. యజ్ఞసమయంలో, యోగసాధన సమయంలో ఆసనంగా వాడే చాప దర్భాసనం. ఈ చాపను రెల్లుగడ్డితో తయారుచేస్తారు. యజ్ఞదీక్షలో ఉన్నవారు దర్భ ఉంగరాలను ధరిస్తారు.)
స్వాయంభువమనువు పట్టణంలో ప్రవేశించగానే పౌరులు కానుకలు సమర్పించి అనేక విధాలుగా స్తుతించారు. మంగళవాద్యాలు కోలాహలంగా ధ్వనిస్తూ ఉండగా ఆయన అంతఃపురంలో ప్రవేశించాడు.
ఇలా అంతఃపురంలో ప్రవేశించి స్వాయంభువమనువు ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆధిదైవికాలనే మూడు తాపాలనూ శాంతపరచే భగవద్భక్తిని పెంపొందించుకొంటూ పుత్ర మిత్ర ఆప్తబాంధవులతో కూడి పరమానందంగా ఉన్నాడు. తాపత్రయము - ఆధ్యాత్మికము - దేహసంబంధమైనరోగాదులు. ఆధిభౌతికము- ఇతర ప్రాణులవల్ల కలిగే ఆపదలు. ఆధిదైవికము- భూకంపాలు, గాలివానలు మొదలైనవి.
స్వాయంభువమనువు ప్రతిదినమూ అతిశయించిన భక్తితో శ్రీహరియందే మనస్సునిల్పి వీణను మేళవించి శ్రీహరికంకితంగా సంగీతయుక్తమైన భక్తిగీతాలు పాడుకొంటూ ఆనందంతో భోగభాగ్యాలమీద ఆసక్తి లేనివాడై, నారాయణుని సేవయందే ముఖ్యాసక్తి కలిగి అనంత మహిమతో... (ఉన్నాడు).
(ప్రాచీనకాలంలో విద్య లయబద్ధమైన గీతాలద్వారా నేర్పబడుతూ ఉండేది. గీతాలద్వారా నేర్చుకొంటే లయజ్ఞానం ద్వారా నేర్చుకొన్న అంశాలు స్మృతిలో ఉంటాయి. సంగీత విద్యకు గాంధర్వవేదమనిపేరు. వాల్మీకిమహర్షి విరచిత శ్రీమద్రామాయణకావ్యం లవకుశులు మొదట్లో పాడడంద్వారానే ప్రచారమైనట్లు పాఠ్యే గేయే చ మధురం అని ప్రసిద్ధి పొందింది. రచింపబడినవన్నీ సంగీత ప్రబంధాలే. ఇక్కడ ప్రబంధమంటే ఒక కావ్యమని కాదు. సంగీతాత్మకమైన ఒక గీతం కూడా ప్రబంధమే.)
స్వాయంభువమనువు శ్రీహరి పాదపద్మాలపై సమర్పింపబడిన తులసీదళాల పరీమళాన్ని ఆఘ్రాణిస్తూ, ఆ భగవంతుని కథలను స్మరిస్తూ, స్తుతిస్తూ, పరామర్శిస్తూ, ఆలకిస్తూ, ఆ దేవునిసేవలకు ఆటంకాలై సంసారబంధాలైన ధర్మార్థకామాలను తిరస్కరించి మోక్ష పదవి పొందడానికి కావలసిన కార్యాలు చేయడం ప్రారంభించాడు.
(ధర్మార్థకామమోక్షాలు చతుర్విధ పురుషార్థాలు. పురుషుడు సాధించవలసినవి పురుషార్థాలు. ఈ నాలుగింటిలో ధర్మం మొదటిది, ముఖ్యమైనది. అర్థకామాలు ధర్మబద్ధంగా ఉండాలని సూచించడానికే ధర్మం మొదటనే కనిపిస్తున్నది. ధర్మార్థకామాలు మానవుని లౌకిక జీవితానికి, మోక్షం అలౌకిక జీవితానికి సంబంధించినవి. ధర్మార్థకామాలను చక్కగా అనుష్టించగలిగితే మానవజీవితం శాంతిధామమవుతుంది. మోక్షమంటే ముక్తి ప్రాపంచిక జీవితంనుండి విడుదల పొందడమే మోక్షం.
వేదార్థాలకు మాత్రమే అగపడువాడనదగు శ్రీహరియొక్క కథలను ప్రస్తావించడంలో ఆసక్తిగల ఆ స్వాయంభవమనువుకు ఎన్ని జాములు గడచినా గడవనట్లుగా ఉంది.
(శ్రీహరి కథా ప్రస్తావనలో మునిగిన మనువుకు కాలం గడచిపోతున్న విషయమే తెలియడంలేదు. ఒక జాము గడచిపోయి మరొక జాము వస్తున్నట్లు తెలుస్తున్నదేగాని తెల్లవారినట్లు తెలియడం లేదు. అతనికి కాలం గడుస్తున్న విషయమే తెలియలేదని భావం. అతని ధ్యాస అంతా శ్రీహరి చరితంమీదనే ఉంది. మూడుగంటలకాలం ఒక జాము. ఒక రాత్రికి నాలుగు జాములు.)
స్వాయంభువమనువు పవిత్రమైన శ్రీహరి కథలను వింటూ, ఆయన స్వరూపాన్ని మనస్సులో నిలుపుకొంటూ, ఆయన గుణనామాలను పాడుకొంటూ, ఆయనను ఆరాధిస్తూ, తన స్వవ్న జాగ్రత్ సుషుప్తి అవస్థలకు అతీతంగా ప్రవర్తించాడు. పుణ్యాత్ముడైన మనువు విష్ణుదేవుని భక్తుడు కాబట్టి దేహానికీ, మనసుకూ చెందిన బాధలు పొందలేదు. దైవశక్తులవల్ల, మానవచేష్టలవల్ల, పంచభూతాలవల్ల కలిగే కష్టాలలో చిక్కుకోలేదు. ఉత్తమ మునీశ్వరుల ఆశయాలకు తగినట్లుగా వర్ణాశ్రమ ధర్మపద్ధతులను తప్పకుండా నడుపుతూ ఆ ధర్మాలతో సంబంధం కలిగి, ప్రాణులకు మేలుచేయడమే నడవడిగా, సాటిలేనివిధంగా ప్రఖ్యాతి పొందుతూ, ఆనందాతిశయంతో డెబ్బదియొక్కయుగాలు పాలించి సచ్చరిత్రుడై విరాజిల్లాడు.
(శ్రీహరి దివ్యమంగళ కథాకర్ణన ధ్యానాను గానాలలో మునిగిన మనువుకు స్వప్నజాగ్రత్సుషుప్తులు లేవని చెప్పడం వల్ల ఆయన నిరంతరం ఇతర చింతలన్నిటిని వదలి తదేక ధ్యానంలో ఉన్నాడని, అందువల్లనే ఆయనకు ఎలాంటి బాధలు కలగలేదని అర్థమవుతున్నది. తన్నే నమ్మి శరణాగతి చేసిన ఎలాంటి భక్తునికైనా శ్రీహరి ఎలాంటి చింతలను దరిచేరనివ్వడనడానికి మనువుకథ ఒక ఉదాహరణం.
భగవదాజ్ఞతో మనువు భూమిని పరిపాలిస్తాడు. పరిపాలకుడైనవాడు వర్ణాశ్రమ ధర్మాలను కాపాడాలని ధర్మశాస్త్రాలు చెపుతాయి. అలాకాకుంటే సమాజం సాంకర్యదోషంతో చెడిపోతుంది. ఆ దోషం పరిపాలకునికి చెందుతుంది. అందువల్ల ప్రాచీన శాస్త్ర సాహిత్యం ఈ విషయాన్ని వివరంగా పేర్కొన్నది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర- నామాలతో వర్ణాలు నాలుగు. గుణకర్మలనుబట్టి చేయబడిన విభాగమిది. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాసములనే పేర్లతో ఆశ్రమాలు నాలుగు. ఒక్కొక్క వర్ణంవారికి ఆశ్రమధర్మాలు ఒక్కొక్క విధంగా ఉంటాయి. డెబ్బెయొక్క యుగాల కాలాన్ని మన్వంతరం అంటారు.)
అలా జరిగిందని ఆ మనువుచరిత్రను మైత్రేయమహర్షి దయతో విదురునికి తెలియజేశాడు. తరువాత కర్దమమహాముని చరిత్రను తెలియజేస్తాను వినుమని సంతోషంతో అన్నాడు.
కర్దమప్రజాపతి యోగప్రభావంబుచే విమానంబు గల్పించి భార్యతో గూడి విహరించుట

No comments:
Post a Comment