బ్రహ్మకృత నారాయణస్తవం
మునంబ్రకాశించు నీఘనరూపవిభవంబు రూపింప దేహధారులకు దుర్వి
భావ్యంబు దలపోయ భగవంతుండవునైన పద్మాక్ష! నీ స్వరూపంబుకంటె
నన్య మొక్కటి సత్యమై బోధకంబైన యది లేదు గాన నీ యతుల దివ్య
మైన రూపంబు నాకుంబ్రత్యక్షమయ్యె, నదియుం గాక వివేకోదయమునంజేసి
వరద! నీ రూప మజ్ఞానగురుతమో ని, వారకంబయ్యె నాకు శశ్వత్ప్రదీప!
ఘన సత్పురుషానుగ్రహ, మునకై యమితావతారమూలంబగుచుం
దనరెడి నీరూపము శోభనమగు భవదీయనాభిపద్మమువలనన్.
జననం బందిన నాచే, ననయము మొదలనె గృహీత మయ్యె; జగత్పా
వన! నీదు సుస్వరూపము, ఘనరుచిరంబై స్వయంప్రకాశక మగుటన్.
తమ తమ కర్ణకుహరంబులచేత గ్రహించుదురు; వారల హృదయకమలంబులయందు భక్తిపారతంత్య్రబున గృహీత పాదారవిందంబులు గలిగి ప్రకాశింతు; వదియునుంగాక ప్రాణులకు ద్రవ్యాగార సుహృన్నిమిత్తం బయిన భయంబును దన్నాశనిమిత్తం బయిన శోకంబును, ద్రవ్యాది స్పృహయును దననిమిత్తం బయిన పరిభవంబును, మఱియు నందుం దృష్ణయు నది ప్రయాసంబున లబ్ధంబైన నార్తియు, తదీయంబైన వృథాగ్రహంబును నీ శ్రీపాదారవిందంబు లందు వైముఖ్యం బెంత కాలంబు గలుగు నంతకాలంబును బ్రాప్తంబులగుంగాని మానవాత్మనాయకుండవగు నిన్ను నాశ్రయించిన భయనివృత్తి హేతువైన మోక్షంబు గలుగు;
మఱియునుం గొందఱు సకలపాప నివర్తకంబయిన త్వదీయనామస్మరణ కీర్తనంబులందు విముఖులై కామ్యకర్మ ప్రావీణ్యంబునం జేసి నష్టమతులై యింద్రియ పరతంత్రులై యమంగళంబులైన కార్యంబులు సేయుచుందురు;దానంజేసి వాతాదిత్రిధాతు మూలంబైన క్షుత్తృడాదులచేతను, శీతోష్ణవర్ష వాతాది దుఃఖంబులచేతను, నతిదీర్ఘంబైన కామాగ్నిచేతను, నవిచ్చిన్నంబగు క్రోధంబుచేతనుం దప్యమాను లగుదురు; వారలం గనిన నా చిత్తంబు గలంకం
బొందు; జీవుండు భవదీయమాయా పరిభ్రామ్యమాణుండై యాత్మ వేఱని యెప్పుడు దెలియు, నంత కాలంబు నిరర్థకంబై దుస్తరంబైన సంసారసాగరంబు తరియింపంజాలకుండు; సన్మునీంద్రులైనను భవదీయ నామస్మరణంబు మఱచి యితరవిషయాసక్తులైరేని వారలు దివంబులందు వృథాప్రయత్నులై సంచరించుచు, రాత్రులయందు నిద్రాసక్తులై స్వప్నగోచరంబు లయిన బహువిధసంపదకు నానందించుచు, శరీరపరిణామాది
పీడలకు దుఃఖించుచుం బ్రతిహతంబులైన యుద్యోగంబుల భూలోకంబున సంసారులై వర్తింతురు; నిష్కామధర్ములై నిన్ను భజియించు సత్పురుషుల కర్ణమార్గంబులం బ్రవేశించి భవదీయ భక్తియోగ పరిశోధితంబైన హృత్సరోజ కర్ణికాపీఠంబున వసియింతు వదియునుంగాక.
వరయోగీంద్రులు యోగమార్గముల భావంబందు నే నీ మనో
హరరూపంబుందలంచి యే గుణగణధ్యానంబు గావింతు, ర
ప్పురుషశ్రేష్ఠపరిగ్రహంబునకునై పొల్పారందద్ధ్యాన గో
చరమూర్తిన్ ధరియింతు గాదె పరమోత్సాహుండవై మాధవా!
అరయ నిష్కామధర్ములై నట్టి భక్తు, లందు నీవు ప్రసన్నుండ వైనరీతి
హృదయముల బద్ధకాములై యెనయు దేవ, గణములందుంబ్రసన్నత గలుగ వీవు.

అరయ సమస్తభూతహృదయంబులయందు వసించి యేకమై
పరంగి సుహృత్క్రియనుగుణభాసితధర్ముండవుంబరాపరే
శ్వరుండవునై తనర్చుచు నసజ్జనదుర్లభా మైన యట్టి సు
స్థిరమగు సర్వభూతదయచేంబొడంగానంగా వత్తు వ చ్యుతా!
క్రతుదానోగ్రతపస్సమాధిజపసత్కర్మాగ్నిహోత్రాఖిల
వ్రతచర్యాదుల నాదరింప; వఖిలవ్యాపారపారాయణ
స్థితి నొప్పారెడి నీ పదాబ్జయుగళీసేవాభిపూజాసమ
ర్పితధర్ముండగువాని భంగి నసురారీ! దేవచూడమణీ!
తవిలి శశ్వత్స్వరూపచైతన్యభూరి, మహిమచేత నపాస్తసమస్తభేద
మోహుండ వఖిలవిజ్ఞానమునకు నాశ్ర, యుండవగు నీకు మ్రొక్కెద నో రమేశ!
జననస్థితివిలయంబుల, కనయంబును హేతుభూతమగు మాయా లీ
లను జెంది నటన సలిపెడు, ననఘాత్మక! నీ కొనర్తు నభివందనముల్.
అనఘాత్మ! మఱి భవదవతార గుణకర్మ ఘనవిడంబనహేతుకంబు లయిన
రమణీయమగు దాశరథి వసుదేవ కుమారాది దివ్యనామంబు లోలి
వెలయంగ మనుజులు వివశాత్ములై యవసానకాలంబున సంస్మరించి
జన్మ జన్మాంతర సంచిత దురితంబుం బాసి కైవల్యసంప్రాప్తు లగుదు
రట్టి దివ్యావతారంబు లవధరించు, నజుండవగు నీకు మ్రొక్కెద ననఘచరిత!
చిరశుభాకార! నిత్యలక్ష్మీవిహార! భక్తమందార! దుర్భవ భయవిదూర!
జననవృద్ధివినాశహేతుక సంగతింగల యేనునీ
వును హరుండుంద్రిశాఖలై, మనువుల్ మరీచిముఖామరుల్
దనర నందుపశాఖలై, భవదాత్మ దీనికి మూలమై
యనయమున్ భువనద్రుమాకృతివైన నీ కిదె మ్రొక్కెదన్.

పురుషాధీశ! భవత్పదాబ్జయుగళీ పూజాదికర్మక్రియా
పరతం జెందని మూఢచిత్తునిం బశుప్రాయున్ మనుష్యాధమున్
జరయున్ నాశము నొందంజేయు నతిదక్షంబైన కాలంబు; త
ద్గురు కాలాత్ముండవైన నీకు మది సంతోషంబునన్ మ్రొక్కెదన్.
సర్వేశ! కల్పాంతసంస్థితమగు జలజాతమం దేను సంజనన మంది
భవదీయ సుస్వరూపముం జూడ నర్ధించి బహువత్సరములు దపంబు సేసి
క్రతుకర్మములు పెక్కు గావించియును నినుం బొడగానంగా లేక బుద్ధి భీతిం
బొందిన నాకు నిప్పుడును నిర్హేతుక కరుణచే నఖిలలోకైకవంద్య
మాన సతత ప్రసన్న కోమల ముఖాబ్జ, కలిత భవదీయ దివ్యమంగళ విలాస
మూర్తి దర్శింపం గలిగె భక్తార్తిహిరణ, కరణ! తుభ్యం నమో విశ్వభరణ! దేవ!
అమర తిర్యఙ్మనుష్యాది చేతనయోను లందు నాత్మేచ్చచేం జెందినట్టి
కమనీయశుభమూర్తి గలవాండవై ధర్మసేతువనంగం బ్రఖ్యాతి నొంది
విషయసుఖంబుల విడిచి సంతత నిజానందానుభవసమున్నతిందనర్తు;
వది గాన పురుషోత్తమాఖ్యంజెన్నోందుదు వట్టి ని న్నెప్పుడు నభినుతింతు;
నర్ధి భవదీయపాదంబు లాశ్రయింతు; మహితభక్తిని నీకు నమస్కరింతు;
భక్తజనపోషపరితోష! పరమపురుష! ప్రవిమలాకార! సంసారభయవిదూర!
తలకొని పంచభూతప్రవర్తక మైన భూరిమాయాగుణస్ఫురణంజిక్కు
వడక, లోకంబులు భవదీయ జఠరంబులో నిల్పి ఘనసమాలోలచటుల
సర్వంకషోర్మిభీషణవార్థి నడుమను ఫణిరాజభోగతల్పంబునందు
యోగనిద్రారతి నుండంగ నొక కొంత కాలంబు సనంగ మేల్మనిన వేళ
నలఘుభవదీయ నాభితోయజమువలన, గడంగి ముల్లోకములు సోపకరణములుగం
బుట్టంజేసితి వతులవిభూతి మెఱసి, పుండరీకాక్ష! సంతతభువనరక్ష!
నిగమస్తుత! లక్ష్మీపతి!, జగదంతర్యామి వగుచు సర్గము నెల్లం
దగు భవదైశ్వర్యంబున, నగణితసౌఖ్యానుభవము నందింతు గదే!
జలజాక్ష! యెట్టి విజ్ఞానబలంబునం గల్పింతు వఖిలలోకంబు లోలి
నతజన ప్రియుండవు నాకట్టి సుజ్ఞాన మర్ధిమైం గృపసేయుమయ్య వరద!
సృష్టినిర్మాణేచ్ఛం జెంది నా చిత్తంబు దత్కర్మకౌశలిం దగిలియుండి
యును గర్మవైషమ్యమును బొందు కతమున దురితంబుం బొరయక తొలంగునట్టి
వెరవు నా కెట్లు గలుగు న వ్విధముం దలంచి, కర్మవర్తను నను భవత్కరుణ మెఱసి
తగం గృతార్థునిం జేయవే నిగమవినుత! సత్కృపామూర్తి! యో దేవచక్రవర్తి!
భవదుదరప్రభూతమగు పద్మమునందు వసించి యున్ననే
నవిరళతావకీనకలితాంశమునం దనరార విశ్వముం
దవిలి రచించుచున్ బహువిధంబులంబల్కెడి వేదజాలముల్
శివతరమై ఫలింపంగృపసేయుము భక్తఫలప్రదాయకా!

అని యనుకంప దోంప వినయంబునంజాంగిలి మ్రొక్కి చారు లో
చన సరసీరుహుండగుచు సర్వజగత్పరికల్పనారతిం
దనరిన నన్ను బ్రోచుటకుందా నిటు సన్నిధియైన యీశ్వరుం
డనయము నాడు దుఃఖము దయామతింబాపెడు నంచు నమ్రుండై.
ధనుర్మాసం
No comments:
Post a Comment