Tuesday, December 31, 2024

ADUGU DHATI KADALANEEYANU - అడుగుదాటి కదలనియ్యను

 అడుగుదాటి కదలనియ్యను


తాళంరూపక (త్రిపుట)

రాగంవరాళి (మేళకర్త 39, జలవరాళి జన్యరాగ)

రూపకర్తరామదాసు

ఆరోహణస గ1 రి1 గ1 మ2 ప ద1 ని3 స
అవరోహణస ని3 ద1 ప మ2 గ1 రి1 స

పల్లవి:

అడుగుదాటి కదలనియ్యను నాకభయ మియ్యక నిన్ను విడువను.

అను పల్లవి:

గడియగడియకు తిరిగితిరిగి యడిగితిని వేసారవచ్చెను
గడువుదప్పిన నేను నిక బహు దుడుకుతనములు సేయుదును నిను.

చరణము(లు):

కుదురుగా గూర్చుండనియ్యను కోపమొచ్చిన భయము చెందను
మది నెరింగి యుండుమిక మొగమాటమేమియు లేదుగద నా
హృదయ కమలమునందు నీ మృదు పదములను బంధించివేతును || 1 ||

రేపు మాపని జరిపితే నే నాపుజేసెడివాడ గాను
ప్రాపు నీవని నమ్మిగొలిచిన పాపముల నెడబాపి దయతో
తేపతేపకు నీదు మోమిటు చూపకుండిన నోర్వసుమ్మి || 2 ||

పతితపావన బిరుదులేదా పాలనము నను సేయరాదా
ప్రతిదినంబును దేవ నిను భూపతి వటంచును వేడినను నీ
హితజనంబులు వచ్చి నన్ను బ్రతిమాలినను విడబోను నిన్ను || 3 ||

రాక్షసాంతక భక్తవరదా సారసాక్ష సుజనరక్షక
యీ క్షణంబున దీనజనుడని మోక్షమియ్యక యుంటివా నిను
సాక్షి బెట్టియు నేడు నేనొక దీక్షచే సాధింతు నిన్ను || 4 ||

భూరి భద్రాచలనివాసా భుజగశయనా భక్తపోష
కూరిమిగ నిను విడిచిపెట్టిన ధరణిలో భద్రాద్రి రాఘవ
రామదాసుం డనెడి నామము మారుపేరున బిలువు నన్ను || 5 ||

No comments:

Post a Comment

Magha Nakshatra - మఖ నక్షత్రం

మఖ నక్షత్రం రాశి : సింహ రాశి గ్రహాధిపతి : సూర్యుడు నక్షత్ర దేవత : పితృదేవతలు (పితృగణాలు – అనునాయక పితృమూర్తులు) శక్తి : "పదవులు, సన్మాన...