Tuesday, December 31, 2024

IKSHVAKU KULA TILAKA ఇక్ష్వాకు కులతిలకా

 ఇక్ష్వాకు కులతిలకా


తాళం
రాగం
రూపకర్త: రామదాసు


పల్లవి

ఇక్ష్వాకు కులతిలకా ఇకనైన పలుకవే రామచంద్రా
నన్ను రక్షింప కున్నను రక్షకు లెవరింక రామచంద్రా

చరణము
చుట్టు ప్రాకారములు సొంపుతో కట్టిస్తి రామచంద్రా
ఆ ప్రాకారముకు బట్టె పదివేల వరహాలు రామచంద్రా || 1 ||

భరతునకు చేయిస్తి పచ్చల పతకము రామచంద్రా
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా || 2 ||

శత్రుఘ్నునకు చేయిస్తి బంగారు మొలతాడు రామచంద్రా
ఆ మొల త్రాటికి పట్టె మొహరీలు పదివేలు రామచంద్రా || 3 ||

లక్ష్మణునకు చేయిస్తి ముత్యాల పతకము రామచంద్రా
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా || 4 ||

సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకము రామచంద్రా
ఆ పతకమునకు పట్టె పదివేల వరహాలు రామచంద్రా || 5 ||

కలికి తురాయి నీకు మెలుకువగ చేయిస్తి రామచంద్రా
నీవు కులుకుచు తిరిగేవు ఎవరబ్బ సొమ్మని రామచంద్రా || 6 ||

నీ తండ్రి దశరథ మహరాజు పెట్టెనా రామచంద్రా
లేక నీ మామ జనక మహరాజు పంపెనా రామచంద్రా || 7 ||

అబ్బ తిట్టితినని ఆయాస పడవద్దు రామచంద్రా
ఈ దెబ్బల కోర్వక అబ్బ తిట్టితినయ్యా రామచంద్రా || 8 ||

భక్తులందరిని పరిపాలించెడి శ్రీ రామచంద్రా
నీవు క్షేమముగ శ్రీ రామదాసుని యేలుము రామచంద్రా || 9 ||

No comments:

Post a Comment

Magha Nakshatra - మఖ నక్షత్రం

మఖ నక్షత్రం రాశి : సింహ రాశి గ్రహాధిపతి : సూర్యుడు నక్షత్ర దేవత : పితృదేవతలు (పితృగణాలు – అనునాయక పితృమూర్తులు) శక్తి : "పదవులు, సన్మాన...