Tuesday, December 31, 2024

AMMA NANNU BROVAVE RAGHURAMUNI KOMMA - అమ్మ ననుబ్రోవవే రఘురాముని కొమ్మ

 అమ్మ ననుబ్రోవవే రఘురాముని కొమ్మ


తాళం: త్రిపుట
రాగం: సావేరి (మేళకర్త 15, మాయ మాళవ గౌళ జన్యరాగ)
రూపకర్త: రామదాసు

ఆరోహణ: స రి1 మ1 ప ద1 స
అవరోహణ: స ని3 ద1 ప మ1 గ3 రి1 స

పల్లవి:
అమ్మ ననుబ్రోవవే రఘురాముని కొమ్మ ననుగావవే

చరణము(లు):

అమ్మ నను బ్రోవవే సమ్మతితోడ మా
యమ్మ వనుచు నిన్ను నెమ్మది గొలిచెద ||1||

కన్నతల్లి నీవు కనుగొని నా పాటు
విన్నప మొనరించి వేగమే విభునితో ||2||

యుల్లములోన మీయుభయుల నెర నమ్మి
యెల్లవేళల వేడి వేసారితి నిపుడు||3||

చలముమాని భద్రశైల రామదాసు
నలసట బెట్టక యాదరణ జేసి ||4||

No comments:

Post a Comment

Sri Tara Sata Namavali - శ్రీ తారా శతనామావళి

శ్రీ తారా శతనామావళి శ్రీతారి ణ్త్య్ర   నమః । శ్రీతరలాయై నమః । శ్రీతన్వ్యై నమః  । శ్రీతారాయై నమః । శ్రీతరుణవల్లర్యై నమః । శ్రీతీవ్రరూప యై  న...