అన్ని మంత్రములు ఇందె ఆవహించెను
తాళం: ఆది
రాగం: అమృతవర్షిణి (మేళకర్త 66, చిత్రంభరి జన్యరాగ )
రూపకర్త: అన్నమాచార్య
ఆరోహణ: స గ3 మ2 ప ని3 స
అవరోహణ: స ని3 ప మ2 గ3 స
పల్లవి
అన్ని మంత్రములు ఇందె ఆవహించెను -
వెన్నతో నాకు గలిగె వేంకటేశు మంత్రము
చరణము
నారదుడు జపియించె నారాయణ మంత్రము -
చేరె ప్రహ్లాదుడు నారసింహ మంత్రము
కోరి విభీషణుడు చేకొనె రామ మంత్రము -
వేరెనాకు గలిగె వేంకటేశు మంత్రము
రంగగు వాసుదేవ మంత్రము ధృవుండు జపించె -
అంగవించె కృష్ణ మంత్రము అర్జునుడు
ముంగిట విష్ణు మంత్రము మొగిశుకుడు పఠించె -
వింగడమై నాకు నబ్బె వేంకటేశు మంత్రము
ఇన్ని మంత్రముల కెల్ల ఇందిరనాథుడె గుఱి -
పన్నిన దిదియే పరబ్రహ్మ మంత్రము
నన్ను గావగలిగేబో నాకు గురుడియ్యగాను -
వెన్నెల వంటిది శ్రీవేంకటేశు మంత్రము
No comments:
Post a Comment