అయ్యయ్యో నీవంటి అన్యాయదైవము
తాళం: త్రిపుట
రాగం: ముఖారి (మేళకర్త 22, ఖరహరప్రియ జన్యరాగ)
రూపకర్త: రామదాసు
ఆరోహణ: స రి2 మ1 ప ని2 ద2 స
అవరోహణ: స ని2 ద1 ప మ1 గ2 రి2 స
పల్లవి:
అయ్యయ్యో నీవంటి అన్యాయదైవము
నెయ్యడగాననయ్య శ్రీరామయ్య
అను పల్లవి:
ఇయ్యెడ నేను కుయ్యడిన ఆలకించ
వయ్యయ్యో యేమందు అయ్యా రామచంద్ర
చరణము(లు):
ఎంతని వేడుదు ఎంతని పాడుదు
ఎంతని దూరుదు ఏమిసేతు రామ
సుంతైనగాని నీ అంతరంగమదేమో
వింత కరుగదు ఎంతో నమ్మినందుకు ||1||
శరణన్న జనముల బిరబిర బ్రోచేటి
బిరుదు గలిగినయట్టి దొరవని నే నీ
మరుగు జొచ్చినందు కరమర జేయుట
పరువే కరుణింప బరువే హరి హరి ||2||
కామిత మందార కలుష విదూర
తామసమేల తాళజాలనురా నీ
మోము జూపుము స్వామి భద్రాచల
రామదాసుని ప్రేమ రయమున నేలుము ||3||
No comments:
Post a Comment