Sunday, December 29, 2024

PUTTU BHOGULAMU MEMU పుట్టుభోగులము మేము

 పల్లవి 

పుట్టుభోగులము మేము భువి హరిదాసులము |
నట్టనడిమి దొరలు నాకియ్యవలెనా ||

చరణములు 
పల్లకీలు నందనాలు పడివాగె తేజీలు
వెల్లవిరి మహాలక్ష్మీ విలాసములు |
తల్లియాకె మగనినే దైవమని కొలిచేము
వొల్లగే మాకే సిరులు వొరులియ్యవలెనా ||

గ్రామములు వస్త్రములు గజముఖ్య వస్తువులు
ఆమని భూకాంతకు నంగభేదాలు ||
భామిని యాకె మగని ప్రాణధారి లెంక-
లము వోలి మాకాతడే యిచ్చీ వొరులియ్యవలెనా ||

పసగల పదవులు బ్రహ్మ నిర్మితములు
వెస బ్రహ్మతండ్రి శ్రీ వేంకటేశుడు |
యెసగి యాతడే మమ్మునేలి యిన్నియు నిచ్చె
వొసగిన మాసొమ్ములు వొరులియ్యవలెనా ||

No comments:

Post a Comment

Sri Tara Sata Namavali - శ్రీ తారా శతనామావళి

శ్రీ తారా శతనామావళి శ్రీతారి ణ్త్య్ర   నమః । శ్రీతరలాయై నమః । శ్రీతన్వ్యై నమః  । శ్రీతారాయై నమః । శ్రీతరుణవల్లర్యై నమః । శ్రీతీవ్రరూప యై  న...