Tuesday, December 31, 2024

PALUKE BANGAARAMAAYENA పలుకే బంగారమాయెనా

 పలుకే బంగారమాయెనా


తాళం
రాగం
రూపకర్త: రామదాసు


పల్లవి

పలుకే బంగారమాయెనా, 
కోదండపాణి పలుకే బంగారమాయెనా

చరణము

పలుకే బంగారమాయె పిలచినా పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రీ || 1 ||

ఎంత వేడినగాని సుంతైన దయరాదు
పంతము సేయ నేనెంతటివాడను తండ్రీ || 2 ||

ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రీ || 3 ||

రాతి నాతిగ చేసి భూతలమున
ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రీ || 4 ||

శరణాగతత్రాణ బిరుదాంకితుడవుకాదా
కరుణించు భద్రాచల వరరామదాస పోష || 5 ||

No comments:

Post a Comment

Sri Tara Sata Namavali - శ్రీ తారా శతనామావళి

శ్రీ తారా శతనామావళి శ్రీతారి ణ్త్య్ర   నమః । శ్రీతరలాయై నమః । శ్రీతన్వ్యై నమః  । శ్రీతారాయై నమః । శ్రీతరుణవల్లర్యై నమః । శ్రీతీవ్రరూప యై  న...