Tuesday, December 31, 2024

E TEERUGA NANU DAYA CHOOCHEDAVO - ఏ తీరుగ నను దయ చూచెదవో

 ఏ తీరుగ నను దయ చూచెదవో


తాళం
రాగం
రూపకర్త: రామదాసు


పల్లవి

ఏ తీరుగ నను దయ చూచెదవో, ఇన వంశోత్తమ రామా
నా తరమా భవ సాగరమీదను, నళిన దళేక్షణ రామా

చరణము

శ్రీ రఘు నందన సీతా రమణా, శ్రితజన పోషక రామా
కారుణ్యాలయ భక్త వరద నిను, కన్నది కానుపు రామా || 1 ||

క్రూరకర్మములు నేరక చేసితి, నేరములెంచకు రామా
దారిద్ర్యము పరిహారము సేయవే, దైవ శిఖామణి రామా || 2 ||

వాసవ నుత రామదాస పోషక వందన మయోధ్య రామా
భాసుర వర సద్గుణములు కల్గిన భద్రాద్రీశ్వర రామా || 3 ||

No comments:

Post a Comment

Sri Matangi Devi Sahasra Namavali - శ్రీ మాతంగి దేవి సహస్రనామావళి

శ్రీమాతంగీ దేవి సహస్రనామావళి ఓం సుముఖ్యై నమః । ఓం శేముష్యై నమః । ఓం సేవ్యాయై నమః । ఓం సురసాయై నమః । ఓం శశిశేఖరాయై నమః । ఓం సమానాస్యాయై నమః ।...