Monday, December 30, 2024

VISWAROOPAMIDIVO విశ్వరూపమిదివో

 పల్లవి 

విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో
శాశ్వతులమైతిమింక జయము నాజన్మము ||

చరణాలు 
కొండవంటి హరిరూపు గురుతైన తిరుమల
పండిన వృక్షములే కల్పతరువులు |
నిండిన మృగాదులెల్ల నిత్యముక్తజనములు
మెండుగ ప్రత్యక్షమాయె మేలువోనాజన్మము ||

మేడవంటి హరిరూపు మించైనపైడి గోపుర
మాడనే వాలిన పక్షుల మరులు |
వాడల కోనేటి చుట్ల వైకుంఠ నగరము
యీడమాకు పొడచూపె ఇహమేపోపరము ||

కోటిమదనులవంటి గుడిలో చక్కని మూర్తి
యీటులేని శ్రీ వేంకటేశుడితడు |
వాటపు సొమ్ములు ముద్ర వక్షపుటలమేల్మంగ
కూటువైనన్నేలితి యెక్కువనోనాతాపము ||

No comments:

Post a Comment

Sri Matangi Devi Sahasra Namavali - శ్రీ మాతంగి దేవి సహస్రనామావళి

శ్రీమాతంగీ దేవి సహస్రనామావళి ఓం సుముఖ్యై నమః । ఓం శేముష్యై నమః । ఓం సేవ్యాయై నమః । ఓం సురసాయై నమః । ఓం శశిశేఖరాయై నమః । ఓం సమానాస్యాయై నమః ।...