తాళం : ___
రాగం : పాడి (మేళకర్త __, ____ జన్యరాగ )రూపకర్త : అన్నమాచార్య
ఆరోహణ : స రి1 మ1 ప ని3 స
అవరోహణ: స ని3 ప ద1 ప మ1 రి1 స
పల్లవి
రాముడు లోకాభిరాముడు త్రైలోక్య
ధాముడు రణరంగ భీముడు వాడే ||
చరణములు
వరుడు సీతకు, ఫలాధరుడు మహోగ్రపు
శరుడు రాక్షస సంహరుడు వాడే |
స్థిరుడు సర్వగుణాకరుడు కోదండ దీక్షా
గురుడు సేవకశుభకరుడు వాడే ||
ధీరుడు లోకైకవీరుడు సకలా
ధారుడు భవబంధదూరుడు వాడే |
శూరుడు ధర్మవిచారుడు రఘువంశ
సారుడు బ్రహ్మసాకారుడు వాడే ||
బలుడు యిన్నిటా రవికులుడు భావించ,
నిర్మలుడు నిశ్చలుడవికలుడు వాడే |
వెలసి శ్రీ వేంకటాద్రి నిజనగరములోన
తలకొనె పుణ్యపాదతలుడు వాడే ||
No comments:
Post a Comment