Monday, December 30, 2024

VANDE VAASUDEVAM వందే వాసుదేవం

 పల్లవి 

వందే వాసుదేవం బృందారకాధీశ
వందిత పదాబ్జం ||

చరణములు 
ఇందీవరశ్యామ మిందిరాకుచతటీ
చందనాంకిత లసత్చారు దేహం |
మందార మాలికామకుట సంశోభితం
కందర్పజనక మరవిందనాభం ||

ధగధగ కౌస్తుభ ధరణ వక్షస్థలం
ఖగరాజ వాహనం కమలనయనం |
నిగమాదిసేవితం నిజరూపశేషప
న్నగరాజ శాయినం ఘననివాసం ||

కరిపురనాథసంరక్షణే తత్పరం
కరిరాజవరద సంగతకరాబ్జం |
సరసీరుహాననం చక్రవిభ్రాజితం
తిరు వేంకటాచలాధీశం భజే ||

No comments:

Post a Comment

Sri Tara Sata Namavali - శ్రీ తారా శతనామావళి

శ్రీ తారా శతనామావళి శ్రీతారి ణ్త్య్ర   నమః । శ్రీతరలాయై నమః । శ్రీతన్వ్యై నమః  । శ్రీతారాయై నమః । శ్రీతరుణవల్లర్యై నమః । శ్రీతీవ్రరూప యై  న...