Wednesday, September 20, 2023

ఋషి పంచమి Rushi Panchami

సప్తఋషిభ్యో నమః

భాద్రపద శుద్ధ పంచమిని ఋషి పంచమిగా వ్యవహరిస్తారు. ఆరోజున అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ట, విశ్వామిత్ర మహర్షుల గురించి ఒక్కసారైనా తలచుకోవాలని చెబుతారు పెద్దలు.

సప్తఋషుల గురించి తెలుసుకుందాం

కశ్యపత్రి ర్భరద్వాజో విశ్వా మిత్రోథ గౌతమః|
వసిష్ఠో జమదగ్నిశ్చ సప్తయతే ఋషయస్తథా||

భారతీయ పురాణ కథనాల ప్రకారం ప్రతివారి వంశానికి ఓ ఋషి మూలపురుషుడిగా ఉంటారు. ప్రాచీన ఋషుల వంశానుక్రమమే నేటి భారతీయ సంతతి. కొందరికి గోత్రరూపంలో వారి పూర్వ ఋషులు ప్రతిరోజూ స్మరణీయులే. మరికొందరికీ వారి పూర్వ ఋషులు తెలియకపోయినప్పటికీ వారి వంశాలకు ఋషులున్నారు.

ఎంతోమంది ఋషుల ప్రతినిధులుగా సప్తర్షులను పూజించటం ఆనవాయితీగా వస్తున్నది.

1.కశ్యపుడు
2.అత్రి
3.భరద్వాజుడు
4.విశ్వామిత్రుడు
5.గౌతముడు
6.జమదగ్ని
7.వసిష్ఠుడు

వీరు ఏడుగురు పూజ్యనీయులే.
రాక్షసులు హరించిన భగవద్దత్తమైన వేదాలను మహావిష్ణువు వ్యాసుని రూపంలో అవతరించి ఉపనిషత్తులు, పురాణాల రూపేణా మనకందించాడు.

1.కశ్యప మహర్షి

సప్తర్షుల్లో కశ్యపుడు ఒక ప్రజాపతి. మరీచి, కళల పుత్రుడు. దక్షప్రజాపతి పుత్రికల్లో 13 మందిని, వైశ్వానరుని పుత్రికల్లో ఇద్దరిని పెళ్ళాడాడు. వారి ద్వారా దైత్యులు, ఆదిత్యులు, దానవులు, సిద్ధులు, గంధర్వులు, అప్సరసలు, మానేయులు, యక్షులు, రాక్షసులు, వృక్ష లతా త్పణ జాతులు, సింహ, మృగ, సర్పాలను, పక్షులను, గోగణాలను, అనూరుడు, గరుడుడు, నాగులు, కాలకేయులను, పౌలోములను, పర్వతుడు అనే దేవర్షిని, విభండకుడు అనే బ్రహ్మర్షిని పుత్రులుగా పొందాడు.

2.అత్రి మహర్షి

సప్తర్షుల్లో రెండోవాడైన అత్రి మహర్షి బ్రహ్మ మానస పుత్రుల్లో ఒకడు. అతని భార్య అనసూయ. అత్రి తన తపోబలంతో త్రిమూర్తులను పోలిన సోమ, దూర్వాస, దత్తాత్రేయులను కుమారులుగా పొందాడు. అత్రి భార్య అనసూయ పతివ్రతా శిరోమణి.

3.భరద్వాజ మహర్షి

భరద్వాజుడు ఉతథ్యుని పుత్రుడు. తల్లి పేరు మమత. బృహస్పతి కృప వలన జన్మించి, ఘృతాచీ పట్ల చిత్తచాంచల్యం పొంది, ఘటంలో ద్రోణ జన్మకు కారకుడవుతాడు.

4.విశ్వామిత్ర మహర్షి

విశ్వామిత్రుడు రాజర్షి. త్రిశంకుని స్వర్గానికి పంపడానికి కొంత తపోఫలాన్ని, హరిశ్చంద్రునిచే అసత్యమాడించ కొంత ఫలాన్ని, మేనక వల్ల తపోవిఘ్నం పొంది శకుంతలా జననానికి మూలపురుషుడయ్యాడు. దుష్యంతుడు, శకుంతలల పుత్రుడే భారతదేశ నామకరణానికి ఆదిగా నిలిచాడు.

5.గౌతమ మహర్షి

తీవ్ర క్షామం ఏర్పడినప్పుడు ఋషులు, మునులందరికీ గౌతముడు తన తపోబలంతో భోజన వసతి కల్పించాడు. ఇతర ఋషుల ఈర్ష్య వలన మాయా గోవును దర్భతో అదిలించి, బ్రహ్మహత్యా పాతకం అంటగట్టుకొన్నాడు. ఆ దోష పరిహారం కొరకు గోదావరిని భూమిపైకి తెచ్చిన మహర్షి, తన భార్య అహల్యను శిలగా మారేటట్లు శాపమిచ్చిందీ ఆయనే.

6.వశిష్ఠ మహర్షి

ఇతని భార్య అరుంధతి. వసిష్ఠుడు బ్రహ్మమానస పుత్రుల్లో ఒకడు. వైవస్వత మన్వంతరాన సప్తర్షుల్లో ఒకడు. శక్తి మొదలైన వందమంది పుత్రులు గలవాడు. దక్ష ప్రజాపతి పుత్రిక ఊర్జ ద్వారా రజుడు, గోత్రుడు, ఊర్ధ్వబాహుడు, సువనుడు, అనఘుడు, సుతవుడు, శుక్రుడు అనే ఏడుగురు పుత్రులను పొందాడు.
సప్తర్షులు తేజస్సు గలవారు కనుక వారిని పూజిస్తే సకల దోషాలు తొలగిపోతాయంటారు.

7.జమదగ్ని మహర్షి

జమదగ్ని ఋషి- రుచికముని, సత్యవతుల కుమారుడు. జమదగ్ని కుమారుడే పరశురాముడు. జమదగ్ని భార్య రేణుక మనసులో కలిగిన అన్యపురుష వ్యామోహం వలన, ఆమెను తన కొడుకైన పరశురామునిచే నరికించాడు. ఆ తరవాత పరశురాముడి ప్రార్థన మేరకు ఆమెను పునర్జీవితురాలిని చేశారు.

అరణ్యవాసంలో సీతారాములకు అభయమిచ్చినవాడు అత్రి మహర్షి. సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు. సీతారాములకు చిత్రకూటానికి దారి చూపినవాడు భరద్వాజ మహర్షి. తన భార్య అహల్య ద్వారా రామునికి తన తపఃఫలాన్ని అందింపజేసిన మహారుషి గౌతముడు. రాముని గురువు విశ్వామిత్రుడు. కులగురువు వశిష్టుడు. విష్ణువు అంశావతారమైన పరశురాముని కన్న తండ్రి జమదగ్ని మహర్షి. దశావతారాల్లో ఒకటైన వామనుడి జనకుడు కశ్యపమహర్షి.

ఋషిపంచమినాడు రామాయణం చదివితే ఈ మహర్షులందరినీ తలుచుకున్నట్టే.

సప్తఋషి ధ్యాన శ్లోకములు

కశ్యప ఋషి :
కశ్యపస్సర్వ లోకాఢ్యః సర్వ శాస్త్రార్థ కోవిదః|
ఆత్మయోగ బలేనైవ సృష్టి స్థిత్యంత కారకః||
ఓం అదితి సహిత కశ్యపాయ నమః

అత్రి ఋషి :
అగ్నిహోత్రరతం శాంతం సదావ్రత పరాయణమ్|
సత్కర్మనిరతం శాంత మర్చయే దత్రిమవ్యయమ్||
ఓం అనసూయా సహిత అత్రయేనమః

భరద్వాజ ఋషి :
జటిలం తపసాసిద్ధం యఙ్ఞ సూత్రాక్ష ధారిణమ్|
కమండలు ధరం నిత్యం భరద్వాజం నతోస్మ్యహమ్||
ఓం సుశీలా సహిత భరద్వాజాయ నమః

విశ్వామిత్ర ఋషి :
కృష్ణాజిన ధరం దేవం సదండ పరిధానకమ్|
దర్భపాణిం జటాజూటం విశ్వామిత్రం సనాతనమ్||
ఓం కుముద్వతీ సహిత విశ్వామిత్రాయనమః

గౌతమ ఋషి :
యోగాఢ్యః సర్వభూతానాం అన్నదానరతస్సదా|
అహల్యాయాః పతిశ్శ్రీమాన్ గౌతమస్సర్వ పావనః||
ఓం అహల్యా సహిత గౌతమాయనమః

జమదగ్ని ఋషి :
అక్షసూత్ర ధరం దేవం ఋషీనామధిపం ప్రభుమ్|
దర్భపాణిం జటాజూటం మహాతేజస్వినం భజే||
ఓం రేణుకా సహిత జమదగ్నయే నమః

వసిష్ఠ ఋషి :
శివధ్యాన రతం శాంతం త్రిదశైరభి పూజితమ్|
బ్రహ్మసూనుం మాహాత్మానం వసిష్ఠం పూజయేత్సదా||
ఓం అరుంధతీ సహిత వసిష్ఠాయ నమః

సప్తఋషిభ్యో నమః

ఋషి పంచమి వ్రత కథ:

భవిష్యోత్తర పురాణం ఈ ఋషి పంచమి వ్రత ప్రాశస్త్యమును వివరిస్తోంది. పేరుకు ఋషి పంచమి అయినా ఇది పూర్తిగా స్త్రీలకు సంబందించిన వ్రతంగా చెప్పబడినది. ఒకానొకప్పుడు సివాశ్వడు అనే రాజు స్త్రీల పాపాల్ని తక్షణమే హరించే వ్రతం గురించి అడుగగా బ్రహ్మ ఈ వ్రతాన్ని ఉపదేశించినట్లుగా " వ్రతకల్పం" పేర్కొన్నది.

పూర్వం విదర్భలో ఉత్తంగుడనే బ్రాహ్మణునకు బాలవితంతువు అయిన ఒక కుమార్తె, వేదాధ్యయనం చేసే ఒక కుమారుడు ఉన్నారు. విద్యార్ధులకు వేదం నేర్పుతూ ఈ బ్రాహ్మణుడు జీవనం చేస్తూ ఉండగా, ఒక రోజు ఆయన కుమార్తె దేహం నుండి పురుగులు రాలిపడ్డాయి. ఈ సంఘటనతో ఆ బాలిక స్పృహతప్పి పడిపోగా, ఉత్తంగుడు తన ఉపాసనా బలం వలన ఆమె పూర్వ జన్మలో రజస్వల అయి ఉండి , ఇంటిలోని అన్నపు గిన్నెలను ముట్టుకోవడం వలన ప్రస్తుతం తన కుమార్తె దేహం క్రిమిభూయిష్టమైనదని తెలుసుకున్నాడు. అప్పుడా బాపడు తన కూతురు చేత ఋషిపంచమీ వ్రతాన్ని చేయించి, గత జన్మలో ఆమె రజస్వలగా ఉన్న సమయంలో చేసిన పాపాలను హరించివేశాడు. భాద్రపద శుద్ధ పంచమి నాడు ఏ స్త్రీ అయితే ఈ వ్రతాన్ని నిష్ఠగా ఆచరిస్తుందో, ఆమె రజస్వలగా ఉండి చేసిన దోషాలన్నీ హరించబడతాయి.

పూర్వకాలంలో ఇంద్రుడు వృతాసుర వధ చేసి బ్రహ్మహత్యా పాతకం పొందాడు. అప్పుడు ఇంద్రుడు తన పాపంలో ఒక పావు వంతు భాగాన్ని స్త్రీలకు ఇచ్చాడు. ఆనాటి నుండి స్త్రీలు రజో ధర్మాన్ని పొంది, రజస్వలలు కావడం ప్రారంభమైనది. రజస్వలా కాలంలో వారు తెలిసీ తెలియక చేసే పాపాలను పోగొట్టడానికి బ్రహ్మ ఈ ఋషిపంచమి వ్రతాన్ని కల్పించాడని పురాణ కథనం.

విదర్భలో శ్వేతజితుడనే క్షత్రీయుడు, సుమిత్ర అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేవారు. శ్వేతజితుడు కృషి కర్మలో ఉండటం వలన, తెలియక రజస్వల, అయిన స్త్రీలను తాకడం, వారితో సంబాషించడం వంటి పనులు చేశాడు. సుమిత్ర కూడా రజస్వలగా ఉన్నా అందర్నీ ముట్టుకుంటూ ఉండేది. అవసానకాలంలో వారు ఇద్దరూ మృతి చెంది, సుమిత్ర కుక్క గానూ, శ్వేతజితుడు ఎద్దుగానూ సుమిత్ర కొడుకైన గంగాధరుని ఇంటినే జన్మించారు.

కాలం గడుస్తున్నది.సుమిత్ర శ్రాద్ధదినం వచ్చింది. గంగాధరుడు శ్రద్ధగా. శ్రాద్ధ క్రియ ఆచరించి, బియ్యపు పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించేలోగా, పాయసాన్ని ఒక పాము ముట్టడం చూసిన కుక్క, అతిథులకు ఆ పాయసం పెడితే మరణిస్తారని తలంచి, అందరూ చూస్తూండగానే తాను ఆ పాయసాన్ని ఎంగిలి చేసింది. కుక్కముట్టిన పాయసం పనికి రాదు కనుక వంట మనిషి మళ్ళీ పాయసం వండి అతిథులను తృప్తి పరచింది. కానీ కుక్క పాయసాన్ని ముట్టినందున కోపంతో, ఆ రోజు దానికి ఆహారం ఇవ్వలేదా వంటమనిషి.

కుక్కరూపంలో ఉన్నది తానని తెలియక కొడుకు సైతం తన పట్ల నిర్లక్ష్యం వహించడం చూసిన సుమిత్ర ఈనాడు నా కొడుకు చేసిన శ్రాద్ధం వ్యర్ధం అయింది కదా! అని ఎద్దురూపంలో ఉన్న క్షత్రియునకు చెప్పుకుంది. ఈ రెండు మూగ జీవాల భాషను తెల్సిన గంగాధరుడు మర్నాడు తన గురువు వద్దకు వెళ్ళి, వాళ్ళ శాపవృత్తాంతము తెలుసుకుని, తాను ఋషిపంచమి వ్రతాన్ని ఆచరించి, వారికి పశుజన్మల నుండి విముక్తి కలిగించి, ఉత్తమ గతులు పొందునట్లు చేసి మాతృఋణ విముక్తుడయ్యాడు.

ఈ వ్రతం ఎల ఆచరించాలి?

ఋషిపంచమి వ్రతం ప్రాయశ్చితాత్మకమైన వ్రతం. ఈ వ్రతం విధానాలు మనలో చాలామందికి తెల్సినా ఆచరించే వాళ్ళు తక్కువ! ఒకవేళ ఆచరించినా చాలా అశాస్త్రీయంగా చేయడం విచారకరం.

పంచమినాటి తెల్లవారుఝామున స్త్రీలు స్నానం చేసి పుష్పసంచయనం చేయాలి. స్నానం చేస్తున్న సమయంలోనే వ్రత సంకల్పాన్ని చెప్పుకోవాలి. అనంతరం గణపతి పూజ పూర్తిచేసి, ఉత్తరేణి మొక్కకు పూజసల్పి, దాన్ని సమూలంగా పెరికివేసి,దాని కొమ్మతో దంతధావనం (పళ్ళుతోమడం) చేయాలి. పుణ్యస్త్రీలు విభుది, గోపిచందనం, పంచగవ్యములతో స్నానించాలి. ఈ తంతు ముగియగానే ఆకాశంలోని సప్తఋషులను, అరుంధతిని చూస్తూ ఋషి పూజ చేయాలి.

పూజలో నాల్గువత్తుల దీపం ఉండాలి. పూజానంతరం, భోజనంలో బఱ్ఱె పెరుగు, వేయించిన శనగలు, తోటకూర కూరను భుజించాలి.

వివాహితలు ఈ వ్రతంవల్ల భర్త ప్రేమనూ, వితంతువులు రాబోయే జన్మలో ఆయుష్మంతుడైన భర్తను పొందుతారని " వ్రతోత్సవ చరిత్ర " స్పష్టం చేస్తున్నది. ఋషిపంచమి మధ్యాహ్నకాల వ్యాపిని అయి ఉండాలి. పంచమి తిధి ఉభయదినవ్యాపినిగా ఉంటే మొదటిరోజునే ఈ వ్రతం ఆచరించాలి.

నీలమతపురాణం ఋషిపంచమిని వరుణ పంచమి గానూ, " జ్యోతిషీ" రక్షాపంచమిగానూ, స్మృతి కౌస్తుభమౌ - చతుర్వర్గ చింతామణి - పురుషార్ధ చింతామణి వంటి పలు ప్రాచీన గ్రంథాలుఋషి పంచమి "ఋషిపంచమి" గానూ పేర్కొనడం జరుగింది. నామాలు వేరు అయినప్పటికి స్త్రీలు ఈ రోజున ఋషిపంచమి వ్రతాన్ని ఆచరించినట్లయితే జన్మ జన్మలందు రజస్వలయై చేసిన దోషములు హరించబడతాయి. ఇది స్త్రీల వ్రతం. ప్రతి స్త్రీ ఆచరించవలసిన వ్రతం.

శుభం భూయాత్

Wednesday, August 30, 2023

yagnopaveetham Dharana - యజ్ఞోపవీత ధారణ

యజ్ఞోపవీత ధారణ

ప్రార్థన:

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||

గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురు దేవో మహేశ్వరః |
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైః శ్రీ గురవే నమః ||

అపవిత్రః పవిత్రోవా సర్వావస్థాం గతోஉపివా |
యస్మరేత్ పుండరీకాక్షం న బాహ్యాభ్యంతరశ్సుచి: ||
పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్ష!
(అంటూ తల పైకి నీళ్ళు చల్లుకొనవలెను)

ఆచమనం 
ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,

1. ఓం కేశవాయ స్వాహా,
2. ఓం నారాయణాయ స్వాహా,
3. ఓం మాధవాయ స్వాహా,
(అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను. తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.)
4. ఓం గోవిందాయనమః,
5. ఓం విష్ణవే నమః,
6. ఓం మధుసూదనాయనమః,
7. ఓం త్రివిక్రమాయనమః,
8. ఓం వామనాయనమః,
9. ఓం శ్రీధరాయనమః,
10. ఓం హృషీకేశాయనమః,
11. ఓం పద్మనాభాయనమః,
12. ఓం దామోదరాయనమః,
13. ఓం సంకర్షణాయనమః,
14. ఓం వాసుదేవాయనమః,
15. ఓం ప్రద్యుమ్నాయనమః,
16. ఓం అనిరుద్ధాయనమః,
17. ఓం పురుషోత్తమాయనమః,
18. ఓం అధోక్షజాయనమః,
19. ఓం నారసింహాయనమః,
20. ఓం అత్యుతాయనమః,
21. ఓం జనార్దనాయనమః,
22. ఓం ఉపేంద్రాయనమః,
23. ఓం హరయేనమః,
24. ఓం శ్రీకృష్ణాయనమః.
అని నమస్కరించవలెను. అటు పిమ్మట:

భూతోచ్చాటన:
(చేతిలో ఉద్ధరిణి తో నీరు పోసుకుని యీ క్రింది మంత్రమును చదివిన పిమ్మట భూమిపై నీళ్ళు జల్లవలెను.)
ఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | 
యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | 
బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః | 
 దేవీ గాయత్రీచ్చందః ప్రాణాయామే వినియోగః

(ప్రాణాయామం కృత్వా కుంభకే ఇమం గాయత్రీ మంత్రముచ్ఛరేత్)

గృహస్తులు ఐదు వ్రేళ్లతో నాసికాగ్రమును పట్టుకొని మంత్రము చెప్పవలెను. బ్రహ్మచారులు బొటన వ్రేలి తో కుడి ముక్కును, అనామిక ఉంగరం వ్రేళ్లతో ఎడమ ముక్కును పట్టుకొని ఈ క్రింది మంత్రమును చెప్ప వలెను.

ఓం భూః, ఓం భువః, ఓగ్ మ్ సువః, 
ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ మ్ సత్యం, 
ఓం తత్స వితుర్వరేణ్యం బర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ | 
ఓం ఆపో జ్యోతి రసోஉమృతం, బ్రహ్మ భూర్భువస్సువరోమ్||

సంకల్పం:

మమ ఉపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, ఆద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే, గంగా కావేరీయోర్మధ్యే, స్వగృహే (లేదా శోభన గృహే), సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల, పురుషార్ధ సిద్ధ్యర్ధం, ఆయుష్యాభివృద్ధ్యర్ధం, మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన యోగ్యతా ఫల సిద్ధ్యర్ధం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే

(బ్రహ్మచారులు “ధర్మపత్నీ సమేతస్య" అని చెప్పనక్కర లేదు)

యజ్ఞోపవీత ధారణ

యజ్ఞోపవీత ప్రాణ ప్రతిష్ఠాపనం కరిష్యే

శ్లో॥ ఓం అసునీతే పునరస్మాసు చక్షుః పునఃప్రాణమిహ నో ధేహి భోగమ్ ।
జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరం తమనుమతే మృడయా నః స్స్వస్తి ॥ ఋ.వే. - 10.59.6
అమృతం-వైప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపహ్వయతే

యజ్ఞోపవీత మంత్రం

శ్లో॥ యజ్ఞోపవీతే తస్య మంత్రస్య పరమేష్టి పరబ్రహ్మర్​షిః ।
పరమాత్మ దేవతా, దేవీ గాయత్రీచ్ఛందః ।
యజ్ఞోపవీత ధారణే వినియోగః

యజ్ఞోపవీతములు సంసారులు మూడు ముడుల వద్దను, మరి రెండు సమానదూర స్థలముల వద్దను, కుంకుమను తడి చేసి అలంకరించి అధిష్టాన దేవత అయిన గాయత్రిని ధ్యానించి, ప్రధమ యజ్ఞోపవీత ధారణా మంత్రము స్మరించి ఈ క్రింది విధముగా ధరించవలెను.


ప్రథమ యజ్ఞోపవీత ధారణం
యజ్ఞోప వీతే త్తస్య మంత్రస్య పరమేష్టీ పరబ్రహ్మర్షి: పరమాత్మా,
దేవతా, దేవీ గాయత్రీచ్చందః యజ్ఞోపవీత ధారణే వినియోగః ||

"ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్
ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః "
అని చెప్పి అని ప్రధమ జంధ్యాన్ని ధరించవలెను.

(మంత్ర పఠన సమయమున కుడి బాహువును పైకెత్తి శరీరము తగలకుండా జందెమును పట్టి యుంచి మంత్రాంతము నందు కుడిబాహువు మీదుగా ఎడమ బాహువు నందు ధరించవలెను.)

ద్వితీయోపవీత ధారణం:

ఆచమనం

(ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,)
1. ఓం కేశవాయ స్వాహా,
2. ఓం నారాయణాయ స్వాహా,
3. ఓం మాధవాయ స్వాహా,
అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను. తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.
4. ఓం గోవిందాయనమః,
5. ఓం విష్ణవే నమః,
6. ఓం మధుసూదనాయనమః,
7. ఓం త్రివిక్రమాయనమః,
8. ఓం వామనాయనమః,
9. ఓం శ్రీధరాయనమః,
10. ఓం హృషీకేశాయనమః,
11. ఓం పద్మనాభాయనమః,
12. ఓం దామోదరాయనమః,
13. ఓం సంకర్షణాయనమః,
14. ఓం వాసుదేవాయనమః,
15. ఓం ప్రద్యుమ్నాయనమః,
16. ఓం అనిరుద్ధాయనమః,
17. ఓం పురుషోత్తమాయనమః,
18. ఓం అధోక్షజాయనమః,
19. ఓం నారసింహాయనమః,
20. ఓం అత్యుతాయనమః,
21. ఓం జనార్దనాయనమః,
22. ఓం ఉపేంద్రాయనమః,
23. ఓం హరయేనమః,
24. ఓం శ్రీకృష్ణాయనమః.

అని నమస్కరించవలెను.
“మమ నిత్యకర్మానుష్టాన యోగ్యతా సిద్ధ్యర్ధం ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే”...."ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్
ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః "
అని చెప్పి అని ధరించవలెను. ఈ మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని రెండవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.

తృతీయ యజ్ఞోపవీత ధారణం:

ఆచమనం
ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని,
1. ఓం కేశవాయ స్వాహా,
2. ఓం నారాయణాయ స్వాహా,
3. ఓం మాధవాయ స్వాహా,
అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను. తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.
4. ఓం గోవిందాయనమః,
5. ఓం విష్ణవే నమః,
6. ఓం మధుసూదనాయనమః,
7. ఓం త్రివిక్రమాయనమః,
8. ఓం వామనాయనమః,
9. ఓం శ్రీధరాయనమః,
10. ఓం హృషీకేశాయనమః,
11. ఓం పద్మనాభాయనమః,
12. ఓం దామోదరాయనమః,
13. ఓం సంకర్షణాయనమః,
14. ఓం వాసుదేవాయనమః,
15. ఓం ప్రద్యుమ్నాయనమః,
16. ఓం అనిరుద్ధాయనమః,
17. ఓం పురుషోత్తమాయనమః,
18. ఓం అధోక్షజాయనమః,
19. ఓం నారసింహాయనమః,
20. ఓం అత్యుతాయనమః,
21. ఓం జనార్దనాయనమః,
22. ఓం ఉపేంద్రాయనమః,
23. ఓం హరయేనమః,
24. ఓం శ్రీకృష్ణాయనమః.

అని నమస్కరించవలెను.
“ఉత్తరీయార్ధం తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే”....."ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం
ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్
ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజః "
అని ఈ మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని మూడవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను.

మొత్తము మూడు ముడులు ఒకచోటకి వచ్చునట్లుగా సరిచేసుకొనవలెను.
తరువాత పాత, కొత్త జంధ్యములను కలిపి, కుడి చేతి బొటన వ్రేలు, చూపుడు వ్రేలు మధ్యలో పట్టుకొని పైన కండువా కప్పి, “దశ గాయత్రి” (పదిమారులు గాయత్రి మంత్రము) జపించి, “యధాశక్తి దశ గాయత్రీ మంత్రం గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీటిని వదలవలెను. (బ్రహ్మచారులు ఒక్క ముడినే ధరించవలయును)

గాయత్రీ మంత్రము:

“ఓం భూర్భువస్సువః
తత్ సవితుర్ వరేణ్యం
భర్గో దేవస్య ధీ మహి
ధియో యోనః ప్రచోదయాత్ "

తరువాత ఈ క్రింది విజర్జన మంత్రము చదువుతూ పాత జంధ్యమును తీసి వేయవలెను....
.
జీర్ణోపవీత విసర్జనం:

ఆచమనం 
1. ఓం కేశవాయ స్వాహా,
2. ఓం నారాయణాయ స్వాహా,
3. ఓం మాధవాయ స్వాహా,
(అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను. తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను.)
4. ఓం గోవిందాయనమః,
5. ఓం విష్ణవే నమః,
6. ఓం మధుసూదనాయనమః,
7. ఓం త్రివిక్రమాయనమః,
8. ఓం వామనాయనమః,
9. ఓం శ్రీధరాయనమః,
10. ఓం హృషీకేశాయనమః,
11. ఓం పద్మనాభాయనమః,
12. ఓం దామోదరాయనమః,
13. ఓం సంకర్షణాయనమః,
14. ఓం వాసుదేవాయనమః,
15. ఓం ప్రద్యుమ్నాయనమః,
16. ఓం అనిరుద్ధాయనమః,
17. ఓం పురుషోత్తమాయనమః,
18. ఓం అధోక్షజాయనమః,
19. ఓం నారసింహాయనమః,
20. ఓం అత్యుతాయనమః,
21. ఓం జనార్దనాయనమః,
22. ఓం ఉపేంద్రాయనమః,
23. ఓం హరయేనమః,
24. ఓం శ్రీకృష్ణాయనమః.
అని నమస్కరించవలెను.

శ్లో: ఉపవీతం ఛిన్నతంతుం కశ్మల దూషితం
విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయురస్తుమే ||

శ్లో: పవిత్రదంతా మతి జీర్ణవంతం
వేదాంత వేద్యం పరబ్రహ్మ రూపం
ఆయుష్య మగ్ర్యం ప్రతిమంచ శుభ్ర
జీర్నోపవీతం విసృజంతు తేజః ||

శ్లో: ఏతా వద్దిన పర్యంతం
బ్రహ్మత్వం ధారితం మయా
జీర్ణత్వాత్తే పరిత్యాగో గచ్ఛ సూత్ర యథా సుఖం ||

(విసర్జన సమయములో తీసివేస్తున్న పాత జందెమును పాదములకు తాకకుండా చూసుకోవలెను.)

ఆచమనం 

1. ఓం కేశవాయ స్వాహా,
2. ఓం నారాయణాయ స్వాహా,
3. ఓం మాధవాయ స్వాహా,
(అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగవలెను. తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువవలెను.)
4. ఓం గోవిందాయనమః,
5. ఓం విష్ణవే నమః,
6. ఓం మధుసూదనాయనమః,
7. ఓం త్రివిక్రమాయనమః,
8. ఓం వామనాయనమః,
9. ఓం శ్రీధరాయనమః,
10. ఓం హృషీకేశాయనమః,
11. ఓం పద్మనాభాయనమః,
12. ఓం దామోదరాయనమః,
13. ఓం సంకర్షణాయనమః,
14. ఓం వాసుదేవాయనమః,
15. ఓం ప్రద్యుమ్నాయనమః,
16. ఓం అనిరుద్ధాయనమః,
17. ఓం పురుషోత్తమాయనమః,
18. ఓం అధోక్షజాయనమః,
19. ఓం నారసింహాయనమః,
20. ఓం అత్యుతాయనమః,
21. ఓం జనార్దనాయనమః,
22. ఓం ఉపేంద్రాయనమః,
23. ఓం హరయేనమః,
24. ఓం శ్రీకృష్ణాయనమః.
అని నమస్కరించవలెను.

కొత్త యజ్ఞోపవీతముతో కనీసం పది సార్లు గాయత్రి మంత్రము జపించి

గాయత్రీ మంత్రము:
“ఓం భూర్భువస్సువః 
తత్ సవితుర్ వరేణ్యం
భర్గో దేవస్య ధీ మహి 
ధియో యోనః ప్రచోదయాత్ "

యధాశక్తి "గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీరు విడువ వలెను. ఆ తర్వాత జంధ్యం ముడులను కళ్ళకి అద్దుకొని తరువాత గాయత్రీ దేవికి నైవేద్యము సమర్పించి, ఆ ప్రసాదమునకు నమస్కరించి స్వీకరించవలెను.

(తీసివేసిన పాత జందెమును ఎవరూ తొక్కని ప్రదేశం లేదా ఏదైనా పచ్చని మొక్కపై వేయవలెను.)

సమర్పణ

యస్య స్మృత్యా చ నామోక్త్యా తపస్సంధ్యా క్రియాదిషు

న్యూనం సంపూర్ణతాం-యాతి సద్యో వందే తమచ్యుతమ్
మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం రమాపతే
యత్కృతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తు మే

అనేన యజ్ఞోపవీత ధారణేన, శ్రీ లక్ష్మీనారాయణ ప్రేరణాయ,
శ్రీ లక్ష్మీనారాయణ ప్రీయంతాం-వరదో భవతు ।

శ్రీ కృష్ణార్పణమస్తు

కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యా‌త్మనా వా ప్రకృతే స్స్వభావాత్ ।
కరోమి యద్యత్సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి

నిత్య సంధ్యా వందనం

నిత్య స్తోత్రావళి

Thursday, June 22, 2023

SRI NRUSIMHA KAVACHAM - శ్రీ నరసింహ కవచం

శ్రీ నరసింహ కవచం

నృసింహకవచం వక్ష్యే ప్రహ్లాదేనోదితం పురా ।
సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనమ్ ॥ 01 ॥

సర్వసంపత్కరం చైవ స్వర్గమోక్షప్రదాయకమ్ ।
ధ్యాత్వా నృసింహం దేవేశం హేమసింహాసనస్థితమ్ ॥ 02 ॥

వివృతాస్యం త్రినయనం శరదిందుసమప్రభమ్ ।
లక్ష్మ్యాలింగితవామాంగం విభూతిభిరుపాశ్రితమ్ ॥ 03 ॥

చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండలశోభితమ్ ।
సరోజశోభితోరస్కం రత్నకేయూరముద్రితమ్ ॥ 04 ॥ [రత్నకేయూరశోభితం]

తప్తకాంచనసంకాశం పీతనిర్మలవాసనమ్ ।
ఇంద్రాదిసురమౌళిస్థస్ఫురన్మాణిక్యదీప్తిభిః ॥ 05 ॥

విరాజితపదద్వంద్వం శంఖచక్రాదిహేతిభిః ।
గరుత్మతా సవినయం స్తూయమానం ముదాన్వితమ్ ॥06 ॥

స్వహృత్కమలసంవాసం కృత్వా తు కవచం పఠేత్ ।
నృసింహో మే శిరః పాతు లోకరక్షాత్మసంభవః ॥ 07 ॥

సర్వగోఽపి స్తంభవాసః ఫాలం మే రక్షతు ధ్వనిమ్ ।
నృసింహో మే దృశౌ పాతు సోమసూర్యాగ్నిలోచనః ॥ 08 ॥

స్మృతిం మే పాతు నృహరిర్మునివర్యస్తుతిప్రియః ।
నాసాం మే సింహనాసస్తు ముఖం లక్ష్మీముఖప్రియః ॥ 09 ॥

సర్వవిద్యాధిపః పాతు నృసింహో రసనాం మమ ।
వక్త్రం పాత్విందువదనః సదా ప్రహ్లాదవందితః ॥ 10 ॥

నృసింహః పాతు మే కంఠం స్కంధౌ భూభరణాంతకృత్ ।
దివ్యాస్త్రశోభితభుజో నృసింహః పాతు మే భుజౌ ॥ 11 ॥

కరౌ మే దేవవరదో నృసింహః పాతు సర్వతః ।
హృదయం యోగిసాధ్యశ్చ నివాసం పాతు మే హరిః ॥ 12 ॥

మధ్యం పాతు హిరణ్యాక్షవక్షఃకుక్షివిదారణః ।
నాభిం మే పాతు నృహరిః స్వనాభి బ్రహ్మసంస్తుతః ॥ 13 ॥

బ్రహ్మాండకోటయః కట్యాం యస్యాసౌ పాతు మే కటిమ్ ।
గుహ్యం మే పాతు గుహ్యానాం మంత్రాణాం గుహ్యరూపధృక్ ॥ 14 ॥

ఊరూ మనోభవః పాతు జానునీ నరరూపధృక్ ।
జంఘే పాతు ధరాభారహర్తా యోఽసౌ నృకేసరీ ॥ 15 ॥

సురరాజ్యప్రదః పాతు పాదౌ మే నృహరీశ్వరః ।
సహస్రశీర్షా పురుషః పాతు మే సర్వశస్తనుమ్ ॥ 16 ॥

మహోగ్రః పూర్వతః పాతు మహావీరాగ్రజోఽగ్నితః ।
మహావిష్ణుర్దక్షిణే తు మహాజ్వాలస్తు నైరృతౌ ॥ 17 ॥

పశ్చిమే పాతు సర్వేశో దిశి మే సర్వతోముఖః ।
నృసింహః పాతు వాయవ్యాం సౌమ్యాం భూషణవిగ్రహః ॥ 18 ॥

ఈశాన్యాం పాతు భద్రో మే సర్వమంగళదాయకః ।
సంసారభయదః పాతు మృత్యోర్మృత్యుర్నృకేసరీ ॥ 19 ॥

ఇదం నృసింహకవచం ప్రహ్లాదముఖమండితమ్ ।
భక్తిమాన్యః పఠేన్నిత్యం సర్వపాపైః ప్రముచ్యతే ॥ 20 ॥

పుత్రవాన్ ధనవాన్ లోకే దీర్ఘాయురుపజాయతే ।
యం యం కామయతే కామం తం తం ప్రాప్నోత్యసంశయమ్ ॥ 21 ॥

సర్వత్ర జయమాప్నోతి సర్వత్ర విజయీ భవేత్ ।
భూమ్యంతరిక్షదివ్యానాం గ్రహాణాం వినివారణమ్ ॥ 22 ॥

వృశ్చికోరగసంభూతవిషాపహరణం పరమ్ ।
బ్రహ్మరాక్షసయక్షాణాం దూరోత్సారణకారణమ్ ॥ 23 ॥

భూర్జే వా తాళపత్రే వా కవచం లిఖితం శుభమ్ ।
కరమూలే ధృతం యేన సిధ్యేయుః కర్మసిద్ధయః ॥ 24 ॥

దేవాసురమనుష్యేషు స్వం స్వమేవ జయం లభేత్ ।
ఏకసంధ్యం త్రిసంధ్యం వా యః పఠేన్నియతో నరః ॥ 25 ॥

సర్వమంగళమాంగళ్యం భుక్తిం ముక్తిం చ విందతి ।
ద్వాత్రింశతిసహస్రాణి పఠేచ్ఛుద్ధాత్మనాం నృణామ్ ॥ 26 ॥

కవచస్యాస్య మంత్రస్య మంత్రసిద్ధిః ప్రజాయతే ।
అనేన మంత్రరాజేన కృత్వా భస్మాభిమంత్రణమ్ ॥ 27 ॥

తిలకం విన్యసేద్యస్తు తస్య గ్రహభయం హరేత్ ।
త్రివారం జపమానస్తు దత్తం వార్యభిమంత్ర్య చ ॥ 28 ॥

ప్రాశయేద్యో నరో మంత్రం నృసింహధ్యానమాచరేత్ ।
తస్య రోగాః ప్రణశ్యంతి యే చ స్యుః కుక్షిసంభవాః ॥ 29 ॥

కిమత్ర బహునోక్తేన నృసింహసదృశో భవేత్ ।
మనసా చింతితం యత్తు స తచ్చాప్నోత్యసంశయమ్ ॥ 30 ॥

గర్జంతం గర్జయంతం నిజభుజపటలం స్ఫోటయంతం హఠంతం
రూప్యంతం తాపయంతం దివి భువి దితిజం క్షేపయంతం క్షిపంతమ్ ।
క్రందంతం రోషయంతం దిశి దిశి సతతం సంహరంతం భరంతం
వీక్షంతం ఘూర్ణయంతం శరనికరశతైర్దివ్యసింహం నమామి ॥

॥ ఇతి శ్రీబ్రహ్మాండపురాణే ప్రహ్లాదోక్తం శ్రీ నృసింహ కవచమ్ 

Sunday, March 19, 2023

Masa Sivaratri - మాస శివరాత్రి

మాస శివరాత్రి

"మాస శివరాత్రి వ్రతకల్పం" అనే గ్రంధంలో శివరాత్రుల విశిష్టత గురించి వివరంగా తెలియజేయబడినది.

నిత్యశివరాత్రి, పక్ష శివరాత్రి,మాస శివరాత్రి, యోగ శివరాత్రి, మహా శివరాత్రి అని వివిధ నామాలతో శివ పంచాక్షరిని జపిస్తూ శివలీలా మహత్యాలను గురించి తెలుసుకునేందుకు శివపురాణాలెన్నో మనకు వున్నాయి.

ప్రతి మాసం బహుళ పక్ష చతుర్దశి నాడు మాస శివరాత్రి వస్తుంది, భక్తులు అందరు ఈ మాస శివరాత్రిని క్రమం తప్పక పాటిస్తారు.

మాస శివరాత్రి వ్రతం చేసేవారుముందురోజు ఒక పూట భోజనం చేసి శివరాత్రి నాడు ఉపవాసం, జాగరణ చేసి వుండి మరునాడుఉదయాన్నే స్నానం చేసి శివనామం జపిస్తూ నాలుగవ ఝాము పూజ చేయాలి.

ఆ మరునాటి ఉదయాన స్నానం చేసి ఈశ్వర దర్శనం చేసుకొని, భక్తులతో కలసి భుజించి శివనామ పారాయణ చేస్తూవ్రతం సంపూర్ణం చేయాలి.

ఈ మాస శివరాత్రి వ్రతాన్ని దేవతలంతా కూడా అనుష్టించినట్లు పురాణాలలో చెప్పబడింది.

చైత్రమాస బహుళ అష్టమినాడు ఉమాదేవి పూజించినది.
వైశాఖ మాస శుక్లపక్ష అష్టమి శివరాత్రినాడు సూర్యభగవానుడు పూజించాడు.
జ్యేష్ఠ మాస శుక్లపక్ష చతుర్దశి శివరాత్రి రోజున శివుడే తనను తాను పూజించుకున్నాడట.
ఆషాఢమాస బహుళ పక్షం పంచమి శివరాత్రి దినాన శివకుమారుడైన కుమారస్వామి పూజించాడు.
శ్రావణమాస శుక్ల పక్ష అష్టమి శివరాత్రి రోజున చంద్రుడు పూజించాడు.
భాద్రపద మాస శుక్లపక్ష త్రయోదశి శివరాత్రి రోజున ఆదిశేషువు పూజించాడు.
ఆశ్వీయుజ మాసశుక్ల పక్ష ద్వాదశి శివరాత్రినాడు ఇంద్రుడు పూజించాడు.
కార్తిక మాసంలోని రెండు శివరాత్రులు శుక్ల పక్ష సప్తమి, బహుళ పక్ష అష్టమి దినాలలో సరస్వతి దేవి పూజించినది.
మార్గశిరమాస శుక్ల పక్షంలోను, బహుళ పక్షంలోను వచ్చే శివరాత్రి దినాన లక్ష్మీ దేవి పూజించినది.
పుష్యమాస శుక్ల పక్షంలో నందీశ్వరుడు పూజించాడు.
మాఘ మాస బహుళ పక్షంలో దేవతలందరూ శివునిపూజించారు.
ఫాల్గుణ మాస శుక్ల పక్షంలో కుబేరుడు పూజించాడు.

జన్మ సాఫల్యానికిశివపూజకు మించినదేముంది


నిత్య స్తోత్రావళి

Sunday, March 12, 2023

Sri Varahaswamy Temple, Tirumala, Tirupati District, Andhra Pradesh - శ్రీ వరాహస్వామి ఆలయం, తిరుమల, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్

శ్రీ వరాహస్వామి ఆలయం, తిరుమల, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్

శ్రీ వరాహస్వామి ఆలయం, భూ వరాహస్వామి ఆలయం అని కూడా పిలుస్తారు, ఇక్కడి మూల విరాట్టు 
శ్రీ వరాహస్వామి. 

ఇది భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాలో ఉన్న తిరుపతిలోని తిరుమల కొండ పట్టణంలో ఉంది. స్వామి పుష్కరిణికి వాయువ్య మూలలో తిరుమలలోని వెంకటేశ్వర దేవాలయం ఉత్తర ప్రాంగణంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం వేంకటేశ్వర పుణ్యక్షేత్రం కంటే పురాతనమైనదని నమ్ముతారు.

పురాణాల ప్రకారం, హిరణ్యాక్ష రాక్షసుడి నుండి భూమిని రక్షించిన తరువాత , విష్ణువు యొక్క వరాహ అవతారం స్వామి పుష్కరిణి యొక్క ఉత్తర ఒడ్డున ఉన్న ఈ కొండపై ఉంది. అందుకే తిరుమల కొండలను(వేంకటాచలం)
 ఆది వరాహ క్షేత్రం అని కూడా అంటారు. ప్రస్తుత యుగం కలియుగం ప్రారంభంలో, వరాహ విష్ణువు యొక్క మరొక రూపమైన వేంకటేశ్వరుని కోరికపై భూమిని దానం చేశాడు. కృతజ్ఞతగా, వేంకటేశ్వరుడు తనకు సమర్పించే ముందు తొలిదర్శనం, మొదటి గంట, పూజ మరియు నైవేద్యం (అన్నదానం) హక్కును వరాహుడికి రాగిరేకు పైన వేంకటేశ్వరుడు రాసి ఇచ్చాడు. ఇది నేటికీ ఆనవాయితీగా పాటిస్తున్నారు.

భక్తులు వేంకటేశ్వరుని ముందు వరాహ దర్శనం చేసుకోవాలని ఇక్కడి నియమం. వరాహ దర్శనం లేకుండా తిరుమల యాత్ర పూర్తికాదని విశ్వసిస్తారు.

క్రీ.శ.1535లో పెద్ద తిరుమలాచార్యులు ఈ ఆలయాన్ని పునరుద్ధరించారు. రాక్ టెంపుల్ స్వామి పుష్కరిణి ఉత్తర ఒడ్డున ఉంది మరియు వెంకటేశ్వర దేవాలయం ఉత్తర మాడ వీధి నుండి చేరుకోవచ్చు.

వైకానస ఆగమ ప్రకారం నిత్య పూజలు జరుగుతాయి. వార్షిక బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ద్వాదశి, రథసప్తమి సందర్భంగా వరాహస్వామి ఆలయ ముఖ మండపంలో చక్రస్నానం కార్యక్రమం నిర్వహిస్తారు. వరాహ జయంతిని కూడా జరుపుకుంటారు.

తిరుమల బస్ స్టేషన్ నుండి 1 కి.మీ దూరంలో, శ్రీ వరాహస్వామి దేవాలయం పుష్కరిణి ఒడ్డున శ్రీ వేంకటేశ్వర ఆలయానికి ఉత్తరాన ఉంది. పురాణాల ప్రకారం, తిరుమల మొదట ఆది వరాహ క్షేత్రం మరియు అతని అనుమతితో శ్రీ వేంకటేశ్వరుడు ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు.

బ్రహ్మ పురాణం ప్రకారం, యాత్రికులు శ్రీ వేంకటేశ్వర ఆలయాన్ని సందర్శించే ముందు ముందుగా శ్రీ ఆది వరాహ స్వామికి నైవేద్యం సమర్పించాలి. అత్రి సంహిత (సమూర్తార్చనాధికార) ప్రకారం, వరాహ అవతారం ఆది వరాహ, ప్రళయ వరాహ మరియు యజ్ఞ వరాహ అనే మూడు రూపాలలో పూజించబడుతుంది. ఇక్కడ శ్రీ వరాహస్వామి విగ్రహం ఆది వరాహది.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

Saturday, March 11, 2023

VANALU RAKALU - వానలు రకాలు

వానలు రకాలు
1. గాంధారివాన = కంటికి ఎదురుగా ఉన్నది కనిపించనంత జోరుగా కురిసే వాన.
2. మాపుసారివాన = సాయంత్రం కురిసే వాన.
3. మీసరవాన = మృగశిరకార్తెలో కురిసే వాన.
4. దుబ్బురువాన = తుప్పర/తుంపర వాన.
5. సానిపివాన = అలుకు(కళ్లాపి) జల్లినంత కురిసే వాన.
6. సూరునీల్లవాన = ఇంటి చూరు నుండి ధార పడేంత వాన.
7. బట్టదడుపువాన = ఒంటి మీదున్న బట్టలు తడిపేంత వాన.
8. తెప్పెవాన = ఒక చిన్న మేఘం నుంచి పడే వాన.
9. సాలువాన = ఒక నాగలిసాలుకు సరిపడా వాన.
10. ఇరువాలువాన = రెండుసాల్లకు & విత్తనాలకు సరిపడా వాన.
11. మడికట్టువాన = బురదపొలం దున్నేటంత వాన.
12. ముంతపోతవాన = ముంతతోటి పోసినంత వాన.
13. కుండపోతవాన = కుండతో కుమ్మరించినంత వాన.
14. ముసురువాన = విడువకుండా కురిసే వాన.
15. దరోదరివాన = ఎడతెగకుండా కురిసే వాన.
16. బొయ్యబొయ్యగొట్టేవాన = హోరుగాలితో కూడిన వాన.
17. రాళ్లవాన = వడగండ్ల వాన.
18. కప్పదాటువాన = అక్కడక్కడా కొంచెం కురిసే వాన.
19. తప్పడతప్పడవాన = టపటపా కొంచెంసేపు కురిసే వాన.
20. దొంగవాన = రాత్రంతా కురిసి తెల్లారి కనిపించని వాన.
21. కోపులునిండేవాన = రోడ్డు పక్కన గుంతలు నిండేంత వాన.
22. ఏక్దారవాన = ఏకధారగా కురిసే వాన.
23. మొదటివాన = విత్తనాలకు బలమిచ్చే వాన.
24. సాలేటివాన = భూమి తడిసేంత భారీ వాన.
25. సాలుపెట్టువాన = దున్నేందుకు సరిపోయేంత వాన.

Wednesday, March 8, 2023

Bhalka Tirtha, Prabhas Kshetra, Veraval, Saurashtra, Gujarat- భాల్కా తీర్థం, ప్రభాస్ క్షేత్రం, వీరవల్, సౌరాష్ట్రం, గుజరాత్

భాల్కా తీర్థం, ప్రభాస్ క్షేత్రం, వీరవల్, సౌరాష్ట్రం, గుజరాత్

భాల్కా తీర్థం (భాల్కా తీర్థయాత్ర) భారతదేశంలోని గుజరాత్ పశ్చిమ తీరంలో సౌరాష్ట్రలోని వెరావల్లో ఉంది.

పురాణ గాథ. ఇక్కడే కృష్ణుడు పడుకుని ఉండగా, జారా అనే వేటగాడు కృష్ణుడి ఎడమ పాదాన్ని జింకగా తప్పుగా భావించి, ఒక బాణం వేసి, అతనికి ప్రాణాపాయం కలిగించాడు. కృష్ణుడు అవతార సమాప్తం  చేసి, ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు.

భాల్కా భారతదేశంలోని గుజరాత్లోని వెరావల్లో ఉన్న జ్యోతిర్లింగమైన సోమనాథ్ ఆలయానికి కేవలం 4 కి.మీ దూరంలో ఉంది. సింధు లోయ నాగరికత, 2000–1200 BCE సమయంలో ప్రభాస్ పటాన్ ఆక్రమించబడినందున ఈ ప్రదేశం పురాతన చరిత్రను కలిగి ఉంది.

మహాభారతం ప్రకారం, కురుక్షేత్ర యుద్ధంలో గాంధారి యొక్క వంద మంది కుమారులు మరణించారు . దుర్యోధనుడి మరణానికి ముందు రోజు రాత్రి కృష్ణుడు గాంధారిని సందర్శించి ఓదార్చాడు. కృష్ణుడు తెలిసి తెలిసి యుద్ధాన్ని ముగించలేదని గాంధారి భావించి, ఆవేశంతో మరియు దుఃఖంతో, గాంధారి కృష్ణుడు, యదు వంశంలోని అందరితో పాటు 36 సంవత్సరాల తరువాత నశించిపోతాడని శపించింది. 

యాదవులు మిక్కిలి అహంకారము(అధర్మము) కలిగి ఉన్నారని భావించిన కృష్ణుడు ఇది జరగాలని కోరుకున్నాడు, అందుచేత అతను " తథాస్తు " (అలాగే) అని చెప్పి గాంధారి కోరికను మానించాడు.

36 సంవత్సరాలు గడిచిన తరువాత, ఒక పండుగలో యాదవుల మధ్య గొడవ జరిగింది , వారు ఒకరినొకరు చంపుకున్నారు. అతని అన్నయ్య బలరాముడు యోగా ద్వారా తన శరీరాన్ని విడిచిపెట్టాడు.

కృష్ణుడు అడవిలోకి వెళ్లి ఒక చెట్టు క్రింద ధ్యానం చేయడం ప్రారంభించాడు. మహాభారతం కృష్ణుడు లోకం నుండి నిష్క్రమించడానికి కారణంగా మారిన వేటగాడి కథను కూడా చెప్పబడింది. 

వేటగాడు జర, కృష్ణుడి ఎడమ పాదాన్ని జింకగా తప్పుగా భావించి, ఒక బాణం వేసి, అతనికి ప్రాణాపాయం కలిగించాడు. జర తప్పును గ్రహించిన తరువాత, రక్తస్రావం అవుతున్నప్పుడు, కృష్ణుడు జరతో ఇలా అన్నాడు.

"ఓ జరా, నీ పూర్వ జన్మలో నీవు వాలివి, త్రేతాయుగాన వాలి వైన నిన్ను చెట్టు చాటునుండి చంపిన ఫలితం ఇపుడు అనుభవిస్తున్నాను. కర్మ ఫలమును భగవంతుడైనను అనుభవించవలసినదే. నీవు నిమిత్తమాత్రుడవుఈ ప్రపంచంలోని అన్ని పనులు నేను కోరుకున్న విధంగానే జరుగుతాయి కాబట్టి, మీరు దీని గురించి చింతించాల్సిన అవసరం లేదు". అప్పుడు కృష్ణుడు తన భౌతిక శరీరంతో తిరిగి తన శాశ్వత నివాసమైన గోలోకానికి అధిరోహించాడు.

పురాణాల ప్రకారం శ్రీకృష్ణుని అవతార సమాప్తంతో ద్వాపర యుగం ముగిసి, కలియుగం మొదలు అయింది. ప్రస్తుత కాలమాన కొలమానాల ప్రకారం క్రీ.పూ. 3102 సంవత్సరంలో ఫిబ్రవరి 17/18 నాడు జరిగి ఉండవచ్చని ఒక అంచనా.

రోడ్డు మార్గం: భాల్క తీర్థం సోమనాథ్ ఆలయానికి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. సోమనాథ్/వెరావల్ సిటీ/భాల్కా రోడ్డు 

రైలు మార్గం: సమీప రైల్వే స్టేషన్ వెరావల్.

విమాన మార్గం: సమీప విమానాశ్రయాలు డయ్యూ & రాజ్కోట్. అహ్మదాబాద్, వడోదర, రాజ్కోట్, ద్వారక మొదలైన వాటి నుండి బస్సు సేవలు అందుబాటులో ఉన్నాయి.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

Sri Gayatri Sahasra Nama Stotram - శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్

శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్ నారద ఉవాచ: భగవన్సర్వధర్మజ్ఞ సర్వశాస్త్రవిశారద । శ్రుతిస్మృతిపురాణానాం రహస్యం త్వన్ముఖాచ్ఛ్రుతమ్ ॥ 01 ॥ సర...