Sunday, December 29, 2024

KONDALALO NELAKONNA కొండలలో నెలకొన్న

 పల్లవి 

కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడు వాడు ||

చరణములు 
కుమ్మర దాసుడైన కురువరతి నంబి
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు |
దొమ్ములు సేసిన యట్టి తొండమాన్ చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు ||

అచ్చపు వేడుకతోడ ననంతాళ్వారుకి
ముచ్చిలి వెట్టికి మన్ని మోసినవాడు |
మచ్చిక దొలక తిరునంబి తోడుత
నిచ్చ నిచ్చ మాటలాడి నొచ్చినవాడు ||

కంచిలోన నుండు దిరుకచ్చినంబి మీద గరు-
ణించి తన యెడకు రప్పించిన వాడు |
యెంచి ఎక్కుడైన వేంకటేశుడు మనలకు
మంచివాడై కరుణ బాలించిన వాడు ||

No comments:

Post a Comment

Flowers dear to Lord Vishnu - విష్ణువుకి ఇష్టమైన పూలు

విష్ణువుకి ఇష్టమైన పూలు అహింసా ప్రథమం పుష్పం! పుష్ప మింద్రియనిగ్రహః! సర్వభూతదయా పుష్పం! క్షమా పుష్పం విశేషతః! శాంతిపుష్పం తపః పుష్పం! ద్యానప...