Sunday, December 29, 2024

KANTI NAKHILAANDA కంటి నఖిలాండ తతి కర్తనధికుని గంటి

 కంటి నఖిలాండ తతి కర్తనధికుని గంటి


తాళం: ఆది
రాగం: బృందావన సారంగ(మేళకర్త 22, ఖరహరప్రియ జన్యరాగ )
రూపకర్త: అన్నమాచార్య

ఆరోహణ: స రి2 మ1 ప ని3 స
అవరోహణ: స ని2 ప మ1 రి2 గ2 స

పల్లవి
కంటి నఖిలాండ తతి కర్తనధికుని గంటి |
కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి ||

చరణము
మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి |
బహు విభవముల మంటపములు గంటి |
సహజ నవరత్న కాంచన వేదికలు గంటి |
రహి వహించిన గోపురములవె కంటి ||

పావనంబైన పాపవినాశము గంటి |
కైవశంబగు గగన గంగ గంటి |
దైవికపు పుణ్యతీర్థములెల్ల బొడగంటి |
కోవిదులు గొనియాడు కోనేరి గంటి ||

పరమ యోగీంద్రులకు భావగోచరమైన |
సరిలేని పాదాంబుజముల గంటి |
తిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి |
తిరు వేంకటాచలాధిపు జూడగంటి ||

No comments:

Post a Comment

Sri Tara Sata Namavali - శ్రీ తారా శతనామావళి

శ్రీ తారా శతనామావళి శ్రీతారి ణ్త్య్ర   నమః । శ్రీతరలాయై నమః । శ్రీతన్వ్యై నమః  । శ్రీతారాయై నమః । శ్రీతరుణవల్లర్యై నమః । శ్రీతీవ్రరూప యై  న...