Wednesday, July 22, 2026

Remedies for Jupiter-related afflictions - గురుగ్రహ దోష నివారణ

గురుగ్రహ దోష నివారణ

నవగ్రహాల్లో బృహస్పతి గ్రహం ఒకటి. దీన్నే గురుగ్రహం అని కూడా అంటారు. ఇది పురుష గ్రహం, బ్రాహ్మణ కులంగా కూడా చెబుతారు. సత్త్వగుణ ప్రధానమైన ఈ గ్రహం భూమిపై నివసించే జీవులపై, మానవులపై ప్రభావం చూపుతుంది.

ఈ గ్రహ ప్రాబల్యం బాగా ఉన్న వారికి విద్య, బుద్ధి, జ్ఞానం బాగా ఉంటుంది. ఈ గ్రహం బాగుంటే వారు అమితమైన తేజోవంతులుగానూ, ధనవంతులుగానూ ఉంటారని శాస్త్రం చెబుతోంది. 

జాతకంలో గురు గ్రహం (బృహస్పతి) బలహీనంగా ఉన్నప్పుడు లేదా అశుభ స్థానంలో ఉన్నప్పుడు "గురుగ్రహ దోషం" ఏర్పడుతుంది. దీనివల్ల విద్యలో ఆటంకాలు, వివాహంలో జాప్యం, సంతాన లేమి, ఆర్థిక సమస్యలు, మరియు సమాజంలో గౌరవం తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. మరియు కాలేయం, వెన్నుపూస, తొడలు, చెవులు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, నత్తి, మతిమరుపు, శరీరానికి నీరు పట్టడం, కఫం వంటి వ్యాధులు గురు గ్రహ ప్రభావంతో కలుగుతాయి.

అలాగే గౌరవహాని, పండితపామరులతో వివాదం, స్థానచలనం, అధికార నష్టం, తీర్థయాత్రలలో ఇబ్బందులు, స్వార్థం, సంతానదోషం, ధననష్టం, పుత్ర విరోధం, దైవ, గురు భక్తి లోపించడం ఇవి సామాన్యంగా గురు గ్రహ బలహీనతవలన కలిగే ఇబ్బందులు, లోపాలని శాస్త్రం చెబుతుంది.

అందుకే గురుగ్రహ దోషాలు, వ్యాధుల పరిహారం కోసం మంచి పుష్యరాగ మణిని గురువారం రోజు శివ పంచాక్షరి మంత్రం, గురుగ్రహ మంత్రంతో కలిపి జపించిన తర్వాత ధరించాలి. స్త్రీలు పాదాలకు ధరించే పసుపు, గడపలకు పసుపు రాయటం, పూజా కార్యక్రమాల్లోనూ, స్నానానికి మనం వినియోగించే పసుపు ఎన్నో వ్యాధుల్ని నివారించగలదు. కాబట్టి పసుపు రంగు వేయబడిన గది గోడల మధ్య నివాసం ఈ లోపాన్ని పూరిస్తుందని శాస్త్రం చెబుతోంది.

జాతకంలో గురువు బలహీనంగా ఉంటే, సంతాన సౌఖ్యత లేక పోవటం, కీర్తి గౌరవ ప్రతిష్టలకు నశించుట, నిత్యం వాహన ప్రమాదాలు దయాదాక్షిణ్యాలు లేక పోవుట, ఇతరులను కష్ట పెట్టే విధంగా నిర్మొహమాటంగా సత్యం చెప్పుట,నీష్ఠూరంగా మాట్లాడటం, షుగర్, క్యాన్సర్, మూత్ర రోగాలు, పెద్ద పొట్టతో కలిగిన దేహం, పరులను నమ్మి సెక్యూరిటీగా ఉండటం, గురువు జాతక చక్రంలో ఏ అవయవం మీద ఆదిపత్యం వహిస్తే ఆ అవయవ పరిమాణాన్ని పెంచి పెద్దది చేస్తాడు.

వ్యాధి వస్తే తొందరగా తగ్గదు. లైఫ్ లో ఎంజాయ్ మెంట్ ఉండదు. జీవితంలో సుఖం, సంతోషం లేక పోవుట, దైవంపై నమ్మకం లేకపోవుట, పెద్దల యందు గౌరవం లేకపోవుట, ఆచారములు పాటించకుండుట, ఉన్నత విద్యకు ఆటంకాలు, నియంతగా ప్రవర్తించుట, ధనమునకు ఇబ్బందులు కలుగుట, ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా ఫలితం లేకపోవుట, జీర్ణశక్తి లేకపోవుట, లివర్‌కు సంబంధించిన వ్యాధులు కలుగుచున్నప్పుడు గురుగ్రహ దోషంగా గుర్తించి గురు గ్రహ అనుగ్రహం కొరకు గురుచరిత్ర పరాయణ చేయడం, గురువులను గౌరవించుట, దైవ క్షేత్రములు సందర్శించుట, శనగలు దానం చేయుట, పంచముఖ రుద్రాక్షను లేదా కనక పుష్యరాగమును ధరించవచ్చును.

గురు గ్రహ దోషనివారణకు పసుపు రంగు రాయి నీటిలో వేసుకొని ఆ నీటిని త్రాగిన దోష నివారణ కలుగును. పసుపు కొమ్ము గణపతిని, పసుపు రంగు(హరిద్రా)గణపతిని పూజిస్తే చాలా మంచిది. పూర్వ కాలం నందు గురుగ్రహ దోష నివారణకు ఇంద్రుడిని పూజించేవారు, ప్రస్తుతం దక్షిణామూర్తి, దత్తత్రేయ, హయగ్రీవుడిని పూజిస్తున్నారు.

ప్రతి గురువారం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల సమయంలో దగ్గరలో ఉన్న దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళి 160 ప్రదక్షిణలు చేయాలి. 16 గురువారాలు నవగ్రహములకు 160 ప్రదక్షిణలు చేసి, పసుపు వస్త్రంలో ఐదు పావుల శనగలు పోసి, మూత కట్టి, దాన్ని దానం చేయాలి.

అలాగే గురువారం రోజున ఉడికించిన శనగలు పేదలకు పంచిపెట్టాలి. కుడి చేతి చూపుడు వేలుకి కనకపుష్యరాగం ఉన్న బంగారు ఉంగరాన్ని ధరించాలి. బ్రాహ్మణుడితో గురు గ్రహ జపం చేయించి శనగలు దానం చేయాలి. గురువారం నాడు గురుగ్రహం వద్ద 16 పసుపు రంగు వత్తులతో దీపారాధన చేసి పసుపు వస్త్రాన్ని దానం చేయాలి.

16 గురువారాలు ఉపవాసము ఉండి చివరి గురువారం దక్షిణామూర్తి పూజ, గురు అష్టోత్తర పూజ చేయాలి. ప్రతిరోజూ 160 మార్లు చొప్పున 160 రోజుల పాటు గురు ధ్యాన శ్లోకాన్ని పారాయణం చేయండి.16 గురువారముల పాటు గురు గాయత్రి మంత్రాన్ని 160 సార్లు పారాయణ చేయాలి. ప్రతి రోజూ దత్త శ్లోకాన్ని పారాయణ చేస్తూ, 40 రోజుల్లో 16.000 సార్లు గురు మంత్రాన్ని జపించండి. తీరిక లేనివారు కనీసం గురుశ్లోకములు 16 సార్లు లేదా గురు మంత్రాన్ని 160 సార్లు కాని పారాయణ చేయాలి. గురు పౌర్ణమి పర్వదినమున 18 సార్లు స్తవం పారాయణ చేయాలి.

జాతకంలో గురుగ్రహ దోషం ఉన్నవారు ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రం చదివితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది.

భక్తి బావనలు, ఉన్నత విద్య, విదేశి విద్య కలగాలంటే గురుగ్రహ అనుగ్రహం ఉండాలి.

గురుగ్రహానికి అధిదేవత హయగ్రీవుడు. సకల విద్యాధి దేవతయైన శ్రీమన్నారాయణుడు ‘హయగ్రీవుని’గా అవతరించాడు.

సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని ‘హయగ్రీవ స్తోత్రం’లో దేశికాచార్యులు పేర్కొన్నారు.

హయగ్రీవోపాసన వాక్ శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపచేస్తుంది.

జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్ 

ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే


జ్ఞానం, ఆనందం, మూర్తీభవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారము.

హయగ్రీవుని పూజించడం వల్ల విద్య, ఐశ్వర్యం, అధికారం, ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయి.

విద్యార్థులు హయగ్రీవుని పూజించడం వల్ల చదువు బాగా వస్తుంది. పిల్లలున్న ఇంట హయగ్రీవ పూజ పిల్లలకు విద్యాటంకాలు తొలగించి, ఉన్నత విద్యను అందిస్తుంది.


గురుగ్రహ దోష శాంతి కోసం చేయవలసిన మరియొక పరిహారం

మేష, సింహ, ధనుర్ మాసాల్లో.. ఆది, సోమ, మంగళ, గురువారాల్లో, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలు కలిసి వచ్చిన రోజు వైష్ణవాలయం పూజారిని రాత్రి 1.30 గంటలకు స్వగృహానికి పిలిపించాలి.

గృహ మధ్య హాలులో 9 మూరల పసుపు వస్త్రం పరిచి 9 దోసిళ్ళు శెనగలు పోసి, ఆ రాశిపై బంగారు లేక ఇత్తడి చెంబును కలశంగా స్థాపించి, కలశంపై అష్ట దిక్కులకు 8 తమలపాకులను పెట్టి, వాటిపై టెంకాయను పెట్టి, విష్ణు స్వరూపమగు పసుపు కుంకుమ రేఖలు నిలువుగా పెట్టి ఆ కలశం ఈశాన్య దిశాముఖంగా పెట్టాలి.

కలశం ఎదుట ఎవ్వరూ కూర్చోకూడదు. వాయువ్య ముఖంగా వైష్ణవాలయ పూజారిని, ఆగ్నేయముఖంగా గృహస్థుడు అతని భార్య కూర్చొనాలి. తర్వాత మమ శనివర్గ జాతస్య.. లగ్నజాతకానుసారేన.. స్థాన స్థితి గురుగ్రహ పరిహారార్థం శతృరుణరోగపీడ పరిహారార్థం అని సంకల్పించాలి.

ఆ కలశమునకు పురుష సూక్త, నారాయణ సూక్తులతో ఆవాహన చేసి గురుగ్రహ సహిత శ్రీకృష్ణపర బ్రహ్మణే నమః పంచామృత అభిషేకం కరిష్యే అని చెప్పి కలశము ముందు భాగాన ఇత్తడి తట్టలో గురు గ్రహ పంచలోహ విగ్రహము, శ్రీకృష్ణుని బంగారు లేక పంచలోహ విగ్రహము పెట్టి పంచామృతములతో అభిషేకించి, కృష్ణ సహస్ర నామ, అష్టోత్తరములతో గురు అష్టోత్తరముతో పూజలు చేయాలి.

ఇలా రాత్రి మూడు గంటల వరకు పసుపు పువ్వులతో గంధాక్షత్రలతో పూజించి ఉద్వాసన పలకాలి. కలశ సహితంగా శెనగలు పసుపు, పువ్వులు, పసుపు రంగు వస్త్రం, రూ. 9 దక్షిణ ఇచ్చే మొత్తం సంఖ్య 9 వచ్చేలా చూసుకోవాలి.

ఇలా భార్యాభర్తలచే పూజపూర్తయ్యాక .. ఆ దంపతులు పూజారికి అన్నింటిని దానంగా ఇచ్చి సాష్టాంగ దండప్రణామములు ఆచరించి ఆశీర్వాదం పొందాలి. తర్వాత రాత్రి మూడు గంటల ప్రాంతాన అయ్యవారిని స్వగృహము నుంచి సాగనంపాలి. గురు గ్రహ పీడా పరిహారార్థం చేసినది కావున తీర్థప్రసాదములు తీసుకోరాదు. తర్వాత స్నానము చేయాలి.

గమనిక : ఈ పూజా కార్యక్రమము, అయ్యవారికి ఇచ్చే దానం కార్యక్రమాలు రాత్రి 3 గంటలలోపుగా ముగించాలి.

Equivalent to the sin of killing a Brahmin - bramahatyasamanaalu - బ్రహ్మహత్యాసమానాలు

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - బ్రహ్మహత్యాసమానాలు

మానినీమణీ! ఇక్కడ మరొక విశేషం నువ్వు తెలుసుకోవాలి. బ్రహ్మహత్య అంటే బ్రాహ్మణుడిని చంపడం అనేకాదు ఇంకా చాలా రకాలున్నాయి. శ్రీకృష్ణాది దేవతలపట్ల భేదబుద్ధిని పాటించి ఆదరానాదరాలు చూపిస్తే అది బ్రహ్మహత్యా సదృశం. అలాగే ఇష్టదైవమూ గురువూ తల్లిదండ్రులు - వీరిపట్ల హెచ్చుతగ్గులు పాటించినా దైవభక్తులపట్ల భేదబుద్ధిని చూపించినా విప్రపాదోదక సాలగ్రామ శిలోదకాలమధ్య భేదం పాటించినా హరిహర నైవేద్యాల మధ్య తారతమ్యం పరిగణించినా హరిహరులమధ్య భేదబుద్ది పాటించినా శక్తిభక్తులనూ శక్తి శాస్త్రాలనూ ద్వేషించినా పితృదేవతార్చనను పరిత్యజించినా హరినీ హరిభక్తులని నిందించినా అర్చించకపోయినా సర్వశక్తిస్వరూప మహాదేవిని నిందించినా కృష్ణాష్టమి శ్రీరామనవమి శివరాత్రి ఏకాదశి (ముక్కోటి) రవివారవ్రతం - ఈ అయిదు పర్వదినాలనూ జరపకపోయినా అంబువాచీ భూఖననం చేసినా (ప్రతినెలా ఆర్ద్రానక్షత్రంలో ప్రథమపాదంనుంచి మూడురోజులపాటు భూదేవి రజస్వలగా ఉంటుంది. అంబువాచి అంటారు. ఆ సమయంలో భూమిని దున్నకూడదని ధర్మశాస్త్రం.) గురు మాతాపితృభార్యాపుత్రుల్ని పోషించకపోయినా అవివాహితుడుగా సంతానం పొందినా బ్రహ్మహత్య చేసినట్టే. ఇదే ఆతిదేశిక బ్రహ్మహత్య.

గోవును కొట్టినా కొడుతున్నవారిని అడ్డుకోకపోయినా రక్షించకపోయినా గోబ్రాహ్మణులకు మధ్యనుంచి నడిచినా గోవులకు ఉచ్చిష్టం పెట్టినా వృషవాహకుడి ఆహారం కాజేసినా అగ్నినీ గోవునూ కాలితో తన్నినా కాళ్ళుకడుక్కోకుండా ఇంటిలోకి వచ్చినా తడికాళ్ళతో భోజనం చేసినా నిద్రించినా సూర్యోదయకాలంలో భుజించినా అవీరాన్న వేశ్యాన్నాలను తిన్నా యోనిజీవ్యుడైనా (తార్పుడుగాడు) సంధ్యావందనం ఎగ్గొట్టినా భర్తకూ దేవుడికీ మధ్య ఇల్లాలు భేదం పాటించినా మగడు ఇల్లాలిని కొట్టినా దేవతాప్రసాదాలను పంచిపెట్టకపోయినా అన్నింటికీ నాస్తినాస్తి అన్నా దేవగురు మిత్రద్రోహాలు చేసినా దేవ - గురు - పితృవందనం చేయకపోయినా, నమస్కరించినవాడికి ఆశీస్పూ విద్యార్థికి చదువూ అందించకపోయినా అన్నపుష్పాది పవిత్ర వస్తువులను దాటినా గోహత్య చేసినట్టే. దీన్నే ఆతిదేశిక గోహత్య అంటారు.

పురుషుడికి పరిణయమాడిన స్త్రీమాత్రమే గమ్య. తక్కిన వనితలందరూ అగమ్యులు. అంటే పొందుకోరరానివారు. అగమ్యాగమనం నూరు బ్రహ్మహత్యలతో సమానం. కుంభీపాక నరకమే శిక్ష అపరిశుద్ధుడుగా సంధ్యవార్చినా ఆసలు సంధ్యావందనమే చెయ్యకపోయినా అతడు సంధ్యాహీనుడు అవుతాడు. నరకానికి పోతాడు. వైష్ణవ శైవ శాక్త సౌర గాణప మహామంత్రాలలో ఎదో ఒకటి ఉపదేశంగా పొంది ఉపాసించాలి. అహంకరించి ఏ మంత్రోపదేశమూ పొందనివాడు అదీక్షితుడు. ఇతడికీ నరకం తప్పదు. పుణ్యక్షేత్రాలలో తీర్థాలలో అడిగి దానాలు పట్టేవాడు తీర్థవ్రతిగ్రాహి. దేవుడి పేరు చెప్పి పొట్టపోసుకునేవాడు దేవలుడు. సంధ్యాపూజాహీనుడిని ప్రమత్తుడు పతితుడు అంటారు. వీరూ వీరితోపాటు గ్రామయాజీ సూపకారుడూ (విప్రుడై ఇతరుల ఇంట భుజించేవాడు) కుంభీపాక నరకంలో పడతాడు ఇంకా ఎవరెవరు ఎయే కుండాలలో వెళ్ళిపడతారో చెబుతాను - సాధ్వీ! ఆలకించు.

సావిత్రీ! దేవతలను సేవించనిదే కర్మవినాశం కానేకాదు. సత్కర్మలు స్వర్గసుఖాలకూ జీవశుద్దికీ దుష్కర్మలు నరకయాతనలకూ దేహశుద్ధికీ హేతువులు.

వేశ్యాధనం అనుభవించేవాడూ వేశ్యాగమనం చేసిన బ్రాహ్మణుడూ కాలసూత్ర నరకకూపంలో శతవర్షాలు కష్టాలు అనుభవించి పై జన్మలో రోగపీడితుడై అటుపైని శుచి అవుతాడు. ప్రస్తావన వచ్చింది కనక స్త్రీలలో భేదాలు చెబుతాను. విను, ఒకడిని అగ్నిసాక్షిగా పరిణయమాడి త్రికరణశుద్ధిగా అతడితో జీవించేది పతివ్రత. రెండవ వాడితో సంపర్కం పెట్టుకుంటే కులట. ముగ్గురితోనైతే ధర్షిణి. నలుగురితో పుంశ్చలి. అయిదుగురితో వేశ్య. ఆర్గురితో పుంగి. ఎడుగురూ ఎనమండుగురూ ఇంకా ఆపైని పురుషులతో సంపర్కం చేస్తే మహావేశ్య. సర్వజాతుల్లోనూ ఇది అస్పృశ్య.

కులట నుంచి మహావేశ్యవరకూ ఎవరిని పొందినా ద్విజుడు కాలసూత్ర నరకానికి పోవడం తథ్యం. అటుపైని చేప కడుపున పుడతాడు. కులటాగామి ఒక శతాబ్దమూ ధర్షిణీ గామి నాలుగు శతాబ్దాలూ పుంశ్చలీగామి ఆరుశతాబ్దాలూ వేశ్యాగామి ఎనిమిది శతాబ్దాలూ పుంగీగామి పది శతాబ్దాలూ ఆ నరకంలో ఉంటాడు. మహావేశ్యాగామి నూరుశతాబ్దాలు నరకయాతన అనుభవిస్తాడు. అలాగే వీరు వరసగా - తిత్తిరి - వాయస - కోకిల - వృక - సూకర - శాల్మలీతరు జన్మలు ఏడేసి ఎత్తుతారు. 

సూర్యచంద్రగ్రహణాల రోజున జ్ఞానహీనుడై భోజనం చేసినవాడు అరుంతుదనరకంలో మెతుక్కి ఏడాదిగా దుఃఖాలు అనుభవిస్తాడు. అటు పైని ఉదరరోగపీడితుడుగా జన్మిస్తాడు. తనువంతా గుల్మాలతో (పుండ్లు) గుడ్డివాడుగా దంతహీనుడుగా దురపిల్లుతాడు. కడకు కర్మఫలం పూర్తయ్యి శుచి అవుతాడు.

నిశ్చయతాంబూలాలు పుచ్చుకుని మరొకడికి కన్యాదానం చేసినవాడు పాంశుకుండనరకానికి పోతాడు. పాంశువులే తింటూ నూరేళ్ళు తల్లడిల్లుతాడు. వీడిని యమదూతలు శరతల్పంమీద పొర్లిస్తారు. పార్థివలింగం చేసి భక్తితో అర్చించని విప్రుడు శివుడి కోపానికి గురి అవుతాడు. శూలప్రోతనరకంలో శతాబ్దంపాటు క్లేశాలు కుడిచి శ్వాపదంగా ఏడు జన్మలెత్తుతాడు. అటుపైని దేవలుడుగా ఎడుజన్మలు ఎత్తి కర్మఫలానుభవం పూర్తిచేసుకుంటాడు. విప్రుణ్ణి భయపెట్టినవాడూ అతడి దేవతార్చనాది సత్కర్మలకు అడ్డుతగిలినవాడూ ప్రకంపననరకంలో విప్రరోమాబ్ద పర్యంతం విలపిస్తాడు. అధికారివైపు ధిక్కారంగా కోపంగా చూసినవాడూ కటువుగా ఎదిరించి పలికినవాడూ సోల్ముకనరకంలో పడతాడు. అక్కడ నా కింకరులు రోజూ అతడి నోటిలో ఉల్కలను పడవేస్తుంటారు. వాడి శరీరంమీద వెండ్రుకలన్ని సంవత్సరాలపాటు రోజూ దండతాడనలు రుచిచూస్తూ యాతనలు పడతాడు. అటుపైని ఏడు జన్మలు ఆడదిగా పుట్టి వితంతువు అవుతాడు. అప్పటికి గానీ కర్మఫలానుభవం పూర్తికాదు.

ఇతరుడితో సంపర్కం పెట్టుకున్న బ్రాహ్మణి అంధకూపనరకానికి పోతుంది. పధ్నాలుగుమంది ఇంద్రులు మారేదాకా యమకింకరుల బాధలు అనుభవిస్తుంది. ఆటుపైని కాకిగా వెయ్యి జన్మలు ఎత్తుతుంది. పందిగా నూరుజన్మలు సృగాలిగా కుక్కుటిగా పారావతిగా వానరిగా నూరేసీ ఎడేసీ జన్మలు ఎత్తి కడపటికి మళ్ళీ మానవిగా రజక గృహంలో పుట్టి క్షయరోగ పీడితురాలై పుంశ్చలిగా మారి కుష్ఠవ్యాధికిలోనై మరణిస్తుంది. అప్పటికి దుష్కర్మఫలం పూర్తి అవుతుంది. వేశ్యలకు వేధననరకం పుంగికి దండతాడననరకం ధర్షిణీకి జలరంధ్రనరకం కులటకు దేహచూర్ణికానరకం స్వైరిణికి (మహావేశ్య) దళనకూపం ధృష్టకు (పతివంచక) శోషణనరకం తప్పవు. శతాబ్దాలపాటు ఈ నరకకుండాల్లో వారు యమయాతనలు పడతారు. మన్వంతరకాలం విణ్మూత్రభక్షణ చేస్తారు. ఆపైని విట్‌కృమిగా (మలక్రిమి) లక్షసంవత్సరాలు జన్మలెత్తితేగానీ కర్మవిశుద్ధి లభించదు. సవర్ణపారదారికులు (ఏకులంవాడు ఆ కులం పరకాంతతో) కషాయనరకకుండంలో పార్లుతారు. కషాయ తప్తోదకం తాగుతూ నూరేళ్ళు యాతనపడతారు. అనులోమ విలోమ పారదారికులు (అగ్రవర్ణ నిమ్నవర్ణ పరకాంతా సంగమం) స్త్రీపురుషులిద్దరూ శూర్పకూపంలో శూ
ర్పకారకృమి దష్టులవుతారు. యమదూతలు కాగిన మూత్రం తాగిస్తారు. దండతాడనలు సరేసరి. అటు పైని వరాహంగా ఛాగలంగా ఏడేసి జన్మలు ఎత్తి కర్మ విశుద్ది పాందాలి.

తులసీదళాన్ని చేతితో పట్టుకుని ప్రతిజ్ఞచేసి మాట తప్పినవాడు జ్వాలాముఖ నరకకూపంలోనూ గంగాజలం గోవు విప్రుడు సాక్షిగా ఆడితప్పినవాడూ దేవప్రతిమ ఎదుట శపథంచేసి జారిపోయినవాడూ కుడిచేతిలో కుడిచెయ్యివేసి ఆడితప్పినవాడూ దేవాలయంలో మాటతప్పినవాడూ - వీళ్ళంతా అదే నరకకూపంలో మటమటలాడతారు. మిత్రద్రోహి కృతఘ్నుడు విశ్వాసఘాతకుడూ కూటసాక్ష్యం చెప్పేవాడూ వీళ్ళందరికీ జ్వాలాముఖ నరకకూపమే గతి. చతుర్దశేంద్రకాల పర్యంతం శిక్ష అనుభవించి మ్లెచ్చ విట్‌కృమి బ్రహ్మకృమి సర్ప దేవల వ్యాఘ్ర నకుల గండక మండూక జన్మలు ఒక్కక్కరూ ఏడేసిఎత్తి ఎప్పటికో పరిశుద్ధులవుతారు.

నిత్యనైమిత్తిక క్రియలకు ఎగనామం పెట్టి వేదవాక్యాలను పరిహసించి వ్రతోపవాసాలను పరిహరించి పెద్దలమాటలను పెడచెవినిబెట్టి చెడు తిరుగుళ్ళు మరిగిన విప్రుడు ధూమ్రాంధకూపంలో శతాబ్దంపాటు యాతనపడి అటూ ఇటూ ఏడుతరాలుచెడి జలజంతువుగా నూరు జన్మలెత్తి కడపటికి శుచి కాగలుగుతాడు. దేవబ్రాహ్మణ పరిహాసకుడుకూడా ఇలాగే అదే నరకయాతన అనుభవిస్తాడు. వీడివంశంలో అటు పదితరాలకూ ఇటు పదితరాలకూ వీడిపాపం అంటుకుంటుంది. అటుపైని మూషకజాతిలో ఏడు జన్మలు ఎత్తుతాడు. పక్షిగా క్రిమిగా చెట్టుగా పశువుగా అనేక జన్మలెత్తి మనిషి అవుతాడు.

బ్రాహ్మణుడు దైవజ్ఞజీవి వైద్యజీవి చికిత్సకుడు లాక్షాలోహాది వ్యాపారి రసాదివిక్రయి అయినట్టయితే నాగవేష్టనరకంలో పడి సర్పవేష్టితుడవుతాడు. అటుపైని నానావిధ పక్షిజాతుల్లో పుట్టి కడపటికి నరజన్మ పాందుతాడు. అప్పుడు గణకుడుగా వైద్యుడుగా గోపాలుడుగా కర్మకారుడుగా రంగకారుడుగా ఏడేసి జన్మలూ ఎత్తి శుచి అవుతాడు.

సాధ్వీ! ప్రసిద్ధ నరకకుండాలగురించీ వాటిలో పడేవారి గురించీ యాతనల గురించీ పునర్జన్మల గురించి వివరంగా చెప్పాను. ఇవి కాక ఇంకా అప్రసిద్ద నరకకూపాలు అనేకం ఉన్నాయి. అవి చిన్నచిన్నవి. వాటిలో పడే పాతకులూ ఉన్నారు. దుష్కర్మఫలాలు అనుభవించి అనేకజన్మలు దురవస్థలనుభవించి పరిశుద్ధులవుతారు. నేను ప్రత్యక్షంగా ఎరుగుదును కనక వాటికి అధిపతిని కనక స్పష్టంగా తెలియపరిచాను. ఇంకా ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావ్‌ - అని ముగించాడు యమధర్మరాజు.

నరకనివారణ


Dushmarmafala Niruupana - దుష్మర్మఫల నిరూపణ

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - దుష్మర్మఫల నిరూపణ

సావిత్రీ ! శుభకర్మలు చేసుకున్నవారు రకరకాల స్వర్గాలకు వెళ్ళి పుణ్యఫలాలను అనుభవిస్తారు.

అవి చెల్లిపోగానే భూలోకంలో సజ్జనులై జన్మిస్తారు. వీరు ఏనాడూ నరకానికి పోరు. అలాగే దుష్కర్మలు చేసినవారు నానావిధ నరకాలకి పోతారు. ఆ నరకాలలో రకరకాల కుండాలు ఉంటాయి. లోతైన కూపాలు. ఏ దుష్కర్మకు ఏ కూపమో, దాన్ని వైశాల్యమూ లోతూ ఎంతో, ఆందులో ఎంతకాలం క్లేశాలు అనుభవించాలో అంతా శాస్త్రప్రమాణంగా నిర్ధారణ అయ్యిఉంది. అవ్వి అతిభయంకర కుండాలు, అమ్మా! ఆ గుంటలు పరమకుత్సితంగా ఉంటాయి. చూడక్కర్లేదు వింటేనే చాలు వొళ్ళు జలదరిస్తుంది.

పెద్దవి ఎనభయ్యారుకి పైగా ఉన్నాయి. చిన్నవి ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో ప్రసిద్దమైన పేర్లు కొన్ని చెబుతాను. ఆలకించు. వహ్నికుండం తప్తకుండం క్షారకుండం విట్కుండం (మలం) మూత్రకుండం శ్లేష్మకుండం గరకుండం దూషికుండం (పుసి) వసాకుండం శుక్రకుండం (10) అసృక్కుండం అశ్రుకుండం గాత్రమలకుండం కర్ణమలకుండం మజ్జాకుండం మాంసకుండం నఖకుండం రోమకుండం కేశకుండం అస్థికుండం (20) తామ్రకుండం లోహకుండం చర్మకుండం తప్తసురాకుండం కంటకకుండం విషకుండం తప్తతైలకుండం కుంతకుండం కృమికుండి (పురుగులు) పూయకుండం (30) సర్పకుండం మశక కుండం దంశకుండం గరళకుండం వజ్రదంష్టాకుండం వృశ్చికకుండం శరకుండం శూలకుండం పరశుకుండం ఖడ్గకుండం (40) గోళకుండం నక్రకుండం కాకకుండం మంథానకుండం బీజకుండం వజ్రకుండం తప్తపాషాణకుండం తీక్ష్ణపాషాణకుండం లాలాకుండం మసీకుండం (50) చూర్ణకుండం
చక్రకుండం వక్రకుండం కూర్మకుండం జ్వాలాకుండం భస్మకుండం దగ్ధకుండం ఇంకా ఇలాగే
తప్తసూచీ - అసిపత్ర - క్షురధారా (60) - సూచీముఖ - గోకాముఖ - నక్రముఖ - గజదంశ - గోముఖ -
కుంభీపాక - కాలసూత్ర - మత్స్యోద - కృమికందుక - పాంసుభోజ్య (70) - పాశవేష్ట - శూలప్రోత -
ప్రకంపన - ఉల్కాముఖ - అంధకూప - వేధన - తాడన - జాలరంధ్ర - దేహచూర్ణ - దేహదళన (80) -
దేహశోషణ - దేహకషణ - శూర్ప - జ్వాలాముఖ - ధూమాంధ - నాగవేష్టనకుండాలున్నాయి. (86)

ఇవ్వే కాదు పాపాత్ముల్ని హింసించడానికి చిన్నవీ పెద్దవీ ఇంకా చాలా కుండాలున్నాయి. కింకరులు జాగరూకులై వీటిని నిరంతరం రక్షిస్తుంటారు. వీరినే యమభటులు అంటారు. వీళ్ళందరూ దండహస్తులు. పాశహస్తులు. మదమత్తులు. అత్యంత భయంకరులు. శక్తిహస్తులు. గదాహస్తులు. అసిహస్తులు. అతిదారుణులు. తమోయుక్తులు. దయాహీనులు. అనివార్యులు. తేజస్వంతులు. శంకారహితులు. రక్తపింగళవేత్రులు. మృత్యువు ఆసన్నమైన పాపాత్ములకుమాత్రమే కనిపిస్తారు. పుణ్యాత్ములకూ యోగీశ్వరులకూ స్వధర్మనిరతులకూ వీరి దర్శనభాగ్యం లభించదు. ఇప్పటికి యమకుండాలగురించి చెప్పడమయ్యింది. ఇక ఏ పాపాత్ముడు ఏ కుండంలో పడతాడో చెబుతాను భయపడకుండా విను.

సాధ్వీలలామా ! హరిసేవారతుడూ అంతశ్శుద్దీ బహిశ్శుద్దీ ఉన్నవాడూ యోగసిద్ధుడూ
వ్రతాచరణతత్పరుడూ తపశ్శీలి బ్రహ్మచారీ - వీరు నరకం దరిదాపులకుకూడా వెళ్ళరు. ఇక మిగతావారి సంగతి చెబుతాను. బలగర్వంతో బంధువుల్ని కటువాక్కులతో హించించేవాడు ఆగ్నికుండంలో పడతాడు. తన శరీరంమీద ఎన్ని వెండ్రుకలున్నాయో అన్నేళ్ళు అందులో మాడతాడు. అటుపైని మూడు పశుజన్మలు ఎత్తుతాడు. ఆకలి దప్పులతో గుమ్మమెక్కిన బ్రాహ్మణుడికి భోజనం పెట్టకుండా పంపించిన మూఢుడు తప్తతుండకుండంలో పడతాడు. రోమప్రమాణాబ్దాలపాటు అందులో నరకయాతన అనుభవిస్తాడు. అటుపైని ఏడు జన్మలవరకూ వాడిది పక్షిబతుకే. రవివారంనాడుగానీ సంక్రాంతిరోజునగానీ అమావాస్యనాడుగానీ శ్రాద్ధసమయంలోగానీ వస్త్రాలకు క్షారసంయోగం చేస్తే (మురికి వదల్చడానికి సబ్బుసోడాలు పెట్టడం) క్షారకుండంలో పడి దారాలన్ని సంవత్సరాలపాటు దుఃఖాలు అనుభవించి మరుసటి ఏడు జన్మల్లోనూ రజకుడవుతాడు. వేద శాస్త్ర పురాణనింద చేసినా త్రిమూర్తుల్ని నిందించినా గౌరీవాణీలక్ష్ములను తూలనాడినా దేవీదూషణ చేసినా ఆ పాపాత్ముడు నిరయానికి వెళ్ళి ఎనభయ్యారింటిలోనూ అత్యంత భయానకమైన కుండంలో పడతాడు. అంతకన్నా దుఃఖప్రదమైన కుండం ఏ నరకంలోనూ ఉండదు. అనేక కల్పాలదాకా అందులో మగ్గి మగ్గి అటుపైని సర్పజాతిలో పుడతాడు. దేవతాదూషణలకు ఏవేవో ప్రాయశ్చిత్తాలున్నాయిగానీ దేవీనిందకు మాత్రం ఏ ప్రాయశ్చిత్తమూ లేదు. దేవీనిందాపరాధస్య ప్రాయశ్చిత్తం న విద్యతే.

స్వదత్తంగానీ పరదత్తంగానీ విప్రుడి సొత్తును ఆపహరించినవాడు అరవైవేల సంవత్సరాలు విట్కుండంలో పడి ఉంటాడు. అన్ని ఏళ్ళూ విడ్భోజనమే చేస్తాడు. అటుపైని విట్‌కృమిగా జన్మిస్తాడు. ఇతరుల చెరువులో తాను చెరువు తవ్విస్తే మూత్రకుండనివాసం ఫలం. రేణువులన్ని సంవత్సరాలు అదే తాగుతూ అదే తింటూ పడిఉంటాడు. పునర్జన్మలో నిండా నూరేళ్ళు వృషభమై భారతభూమిలో ఎవరికో ఒకరికి చాకిరీ చేస్తాడు. ఎవరికీ పెట్టకుండా మృష్టాన్నాన్ని ఒక్కడే తిన్నవాడు శ్లేష్మకూపంలో పడి కొట్టుకుంటాడు. నూరేళ్ళు అదే తింటూ అందులోనే పడి చస్తాడు. అటుపైని శ్లేష్మమలమూత్రాలు తినే కాకిగా జన్మించి నూరేళ్ళు బదికి పాపం వదిలించుకుని శుచి అవుతాడు.

తల్లిని తండ్రిని గురువును భార్యను సంతానాన్నీ పోషించకుండా అనాధలుగా వదిలేసినవాడు గరకుండంలో నూరేళ్ళు అదేతింటూ దుఃఖిస్తాడు. అటుపైన భూతజన్మఎత్తి మరో నూరేళ్ళు గడిపి పాప విశుద్ధుడవుతాడు. ఇంటికి వస్తున్న అతిథిని చూసి ఏవగించుకుంటూ కన్నులు చిట్లించుకున్నవాడు విడిచి పెట్టె తర్పణాలను పితృదేవతలు స్వీకరించరు సరిగదా వాడు నరకానికి పోతాడు. ఇంకా బ్రహ్మహత్యాది మహాపాతకాలు ఎవడు ఏది చేసినా దూషికాకుండంలో నూరేళ్ళు హింసలపాలై అటుపైని భూతజాతిలో జన్మించి మరో నూరేళ్ళు శోకించి కడపటికి పాపంనుంచి శుచి అవుతాడు. ఎరికైనాగాని ద్రవ్యం దానంగా ఇచ్చి మళ్ళీ వెనక్కి తీనుకున్నవాడు వసాకుండంలో శతాబ్దంపాటు అదే తింటూ కుళ్ళిపోతాడు. అటుపైని కృకలాసంగా (తొండ) ఎడుజన్మలెత్తుతాడు. తరవాత ఆతిరౌద్రుడూ ఆతి దరిద్రుడుగా ఆల్పాయుష్కుడై బతుకుతాడు. స్త్రీని పురుషుడుగానీ పురుషుణ్ణి స్త్రీగానీ శుక్లపానం చేయిస్తే శుక్లకుండపతనమే ఫలం, నూరేళ్ళ తరవాత ఏడు వ్యాఘ్రజన్మలు ఎత్తుతారు. అప్పటికి పాపశుద్ధిపాంది మానవులుగా పుడతారు.

శ్రీకృష్ణుడిమీద పాటలుకట్టి తన్మయత్వంతో పాడుకుంటున్నవాణ్ణీ చూసి కళ్ళలొ నీళ్ళు తిరిగేలాగా పరిహసించిన పాపాత్ముడు అశ్రుకుండనరకంలో శతసంవత్సరాలు పడిఉంటాడు. మరుజన్మలో చండాలవంశాన పుడతాడు. మిత్రద్రోహి గాత్రమలకూపంలో నూరేళ్ళు శిక్ష అనుభవించి అటుపైని గాడిదగా మూడు జన్మలెత్తి పాపశుద్ధి పొందుతాడు. చెవిటివారిని నిందించిన కఠినాత్ముడు కర్ణవిట్‌ కూపంలో (గులుగు) పడి అదే తింటూ నూరేళ్ళు రోదిస్తాడు. బధిరుడూ దరిద్రుడుగా ఏడు జన్మలెత్తుతాడు. మరో ఏడు జన్మలకూ అంగవిహీనుడై ఆపైని శుచి అవుతాడు. లోభంతోగానీ స్వలాభంకోసంగానీ జీవహింస చేసినవాడు మజ్జాకూపంలో లక్షసంవత్సరాలు మగ్గుతాడు. ఆపైని ఏడుజన్మలు శశకంగా, ఏడు జన్మలు మీనంగా పుడతాడు. మూడు జన్మలు వరాహంగా ఏడుజన్మలు కోడిగా ఏడుజన్మలు లేడిగా ఎత్తి ఎత్తి కడకు పాతకశుద్ధి పొందుతాడు. కూతురిని పెంచి పెద్దచేసి ధనలోభంతో అమ్ముకునేవాడు మాంసకుండంలో కన్యారోమాలన్ని ఏళ్ళు పడిఉంటాడు. యమభటులు నిత్యమూ దండతాడనం చేన్తుంటారు. మాంసభారాన్ని నెత్తిమీద పెట్టి మోయిస్తారు. అందులోంచి కారే రక్తాన్ని నాకిస్తారు. అటుపైని అరవైవేల సంవత్సరాలు కన్యావిట్‌క్రిమిగా జన్మలెత్తుతాడు. ఆపైని వ్యాధుడుగా (బోయ) ఏడు జన్మలెత్తుతాడు. వరాహంగా మూడుజన్మలు కోడిగా ఏడుజన్మలు కప్పగా జలగగా కాకిగా ఏడేసి జన్మలూ ఎత్తి శుద్దుడవుతాడు.

వ్రతాలూ ఉపవాసాలూ శ్రాద్ధకర్మలూ జరిపేరోజుల్లో క్షురకర్మచేయించుకున్నవాడు నఖాదికుండాలలో ఆయా వ్రతాధిదేవతల ఆయుష్కాల పర్యంతం పడి ఉండి యమకింకరుల దండతాడనాలు అనుభవిస్తాడు. కేశదూషితంగా పార్థివలింగం తయారుచేసి ఆర్చించినవాడు రేణువులన్ని సంవత్సరాలు కేశకుండంలో తల్లడిల్లి తరువాత యవనజాతిలో పుడతాడు. హరుడికోపం తేలిగ్గా చల్లారదు. శతాబ్దం తరవాత రాక్షసజన్మఎత్తిస్తాడు. పితృదేవతలకు పిండం పెట్టనివాడు తన వెండ్రుకలన్ని యేళ్ళు అస్థికుండంలో శిక్ష అనుభవిస్తాడు. ఆపైని కుత్సితుడుగా కుంటివాడుగా (కుఖంజః) ఏడు జన్మలెత్తుతాడు. మహా దారిద్య్రం అనుభవించి శుద్ది పాందుతాడు.

గర్భిణిగా ఉన్న భార్యను కలిసినవాడు తామ్రకుండంలో నూరేళ్ళు దుఃఖాలు అనుభవిస్తాడు, అవీర (మగడూ బిడ్డలూ లేనిది) కానీ ఋతుస్నాత కానీ వండి పెట్టిన భోజనం తిన్న శ్రోత్రియుడు తప్తలోహకుండంలో శతాబ్దంపాటు ఇడుములు పడతాడు. ఏడుజన్మలు కాకిగా ఏడుజన్మలు చాకిగా (రజక) గడిపి మహావ్రణపీడుతుడై దరిద్రుడై అటు పైని పాపశుద్ధి పాందుతాడు. చర్మంతో చేసిన తొడుగులు తగిలించుకున్న చేతులతో దేవద్రవ్యాలను స్పృశించినవాడు శతవర్షాలపాటు చర్మకుండంలో శిక్షలు అనుభవిస్తాడు. భుజించరానివి భుజించిన నైష్ఠికుడు తప్తసురాకూపంలో శతాబ్దీకాలపర్యంతం పడి ఉండి ఆపైని ఏడుక్షుద్ర జన్మలు ఎత్తుతాడు. అటు పైని శుద్ది పొందుతాడు. ప్రభువును కొట్టినవాడికీ కటువుగా మాట్లాడినవాడికీ కంటకకూపనివాసమే శిక్ష. దెబ్బకు నాలుగు దెబ్బలుగా యమకింకరులు దండిస్తారు. ఆపైని గుర్రంగా ఏడు జన్మలెత్తి శుచి అవుతాడు. విషం పెట్టి జీవహింస చేసిన పాతకి విషకూపంలో వెయ్యేళ్ళు పొర్లుతాడు, అటుపైని మహావ్రణపీడితుడుగా రాజద్రోహిగా నూరుజన్మలు ఎత్తుతాడు. మరో ఏడు జన్మలు కుష్ఠురోగం అనుభవించి శుద్దుడవుతాడు.

ఆవునుగానీ ఎద్దునుగాని కర్రతో బాదిన వాడూ లేక బాదించినవాడూ తప్త తైలకుండంలో నాలుగు యుగాలపాటు మలమలావేగుతాడు. అటు పైని దాని శరీరంమీద ఉన్న వెండ్రుకలన్ని సంవత్సరాలపాటు భారతభూమిలో వృషభజన్మలు ఎత్తి ఎత్తి కడకు శుద్ది పాందుతాడు. కుంతం అనే ఆయుధంతోగాని వహ్నిలోహంతోగాని జీవహింస చేసిన పాపాత్ములు కుంతకుండంలో అయుతవత్సరాలు నివసిస్తారు. అటుపైని వ్యాధిపీడితుడుగా ఒక జన్మగడిపి పాపం నుంచి శుద్ధిపాందుతాడు.

ద్విజుడైపుట్టి లోభంతో మాంసభక్షణ చేసినవాడూ హరికి నివేదన చెయ్యకుండా పదార్థాలను భుజించినవాడూ కృమికుండంలో స్వరోమ సమవత్సరాలు శిక్ష అనుభవించి మరు జన్మలో మ్లేచ్చుడవుతాడు. బ్రాహ్మణుడైపుట్టి చేయరాని పనులు చేస్తే పూయకుండనరకంలో యమదండన అనుభవిస్తాడు. అటుపైని శూద్రుడుగా ఏడు జన్మలు ఎత్తుతాడు. మహారోగి దరిద్రుడూ బధిరుడూ అవుతాడు.

కృష్ణపాదపద్మ చిహ్నాలను పడగమీద ధరించిన జాతిపామును సంహరించిన పాపాత్ముడు స్వరోమసమవత్సరాలు సర్పకుండంలో కుందుతాడు. సర్పభక్షితుడూ యమకింకర తాడితుడూ అవుతాడు. అటుపైని సర్పజన్మ ఎత్తుతాడు. ఆ తరవాత అల్పాయుష్కమానవుడై దద్రురోగపీడ అనుభవిస్తాడు. సర్పదష్టుడై మరణిస్తాడు. అప్పటికి పాపశుద్ధి అవుతుంది.

అల్పప్రాణుల్ని పట్టుకుని హింసిస్తూ వినోదించేవారు దంశకూపంలోనూ మశీకూపంలోనూ శిక్షింపబడతారు. నిరాహారులై హాహాకారాలు చేస్తూ దంశబాధలు అనుభవిస్తారు. కాళ్ళూచేతులూ కట్టేసి యమకింకరులు దండతాడనం చేస్తారు. అటుపైని క్షుద్రజంతువులై పుడతారు. ఆపైన అంగవికల మానవజన్మ ఎత్తి పాపప్రక్షాళన పొందుతారు.

తేనెటీగలను చంపి అవి దాచుకున్న తేనెను భుజించేవాడు గరళకుండంలో గరళభక్షితుడవుతాడు. ఆపైని మక్షికాజాతిలో జన్మించి పాపకర్మ విముక్తి పొందుతాడు. నిరపరాధిని దండించినా బ్రాహ్మణుడిని హింసించినా ఆ పాపానికి ఫలం వజ్రదంష్ట్రాకూపనివాసం. యమకింకరుల దెబ్బలకు హాహాకారాలు చేస్తూ రోదిస్తూ రోమసంఖ్యాసమసంవత్సరాలు గడిపి, పందిగా ఏడు జన్మలు కాకిగా మూడు జన్మలూ ఎత్తి పాప ప్రక్షాళన చేసుకుంటాడు. ధనసంపాదనకోసం అమాయక ప్రజలను పీడించినవాడు వృశ్చికాకూపంలో పడతాడు. వృశ్చికంగా ఏడు జన్మలు ఎత్తుతాడు. అటుపైన అంగహీనుడై వ్యాధిపీడితుడై పాపశుద్ధి పాందుతాడు.

విప్రుడు శస్త్రజీవి అయినా సంధ్యావందన హరిభక్తి విహీనుడైనా స్వరోమాబ్దంగా అతడు శరకూపాదులో ఘోరశిక్షలు అనుభవిస్తాడు. కారాగారంలో బంధించి ప్రజలను ప్రమత్తుడై హింసించేవాడు గోళకుండ నరకానికి పోతాడు. అది సలసలకాగే నీటితో కుతకుతలాడే బురదతో భయంకరంగా ఉంటుండి వాడికోరలతో పెద్దపెద్ద పురుగులు ఎగురుతూ ఉంటాయి. అవి కుడుతూంటే ఆ కుండంలో ఉడుకుతాడు. హింసించిన ప్రజల శరీరాలమీద ఉన్న వెండ్రుకలన్ని సంవత్సరాలు ఈ శిక్ష అనుభవిస్తాడు. అటుపైని ప్రజలకు సేవకుడుగా జన్మించి పాపప్రక్షాళన చేసుకుంటాడు.

చెరువుల్లోనుంచి గాలికోసం ఒడ్డుకువచ్చిన మొసళ్ళనూ తాబేళ్ళనూ పట్టి హింసించేవాడు నక్రకంటక సమానాబ్దంగా నక్రకుండ మహానరకంలో హింసలు అనుభవిస్తాడు. అటుపైని తాను హింసించిన జంతువుల జాతిలో జన్మిస్తాడు.

పుణ్యక్షేత్రాలలోగానీ తీర్థస్నాననమయాలలోగానీ పరస్త్రీల గోప్యాంగాలను కాముకదృష్టితో చూసినవాడు కాకతుండకూపంలో పడి తన వెండ్రుకలన్ని సంవత్సరాలు హింసపడతాడు. కాకులు వాడీ కళ్ళు పీక్కుతింటాయి. అంధుడుగా మూడుజన్మలెత్తుతాడు. బంగారాన్ని దొంగిలించినవారు మంధానకూపంలో మథింపబడతారు. యమకింకరులు కళ్ళకు గంతలుకట్టి చావబాదుతారు. తన మలమూత్రాలను తానే తింటూ స్వరోమాబ్దకాలం గడిపి అటుపైని మూడుజన్మలూ అంధుడవుతాడు. ఏడు జన్మలు మహాదారిద్య్రం అనుభవించి స్వర్ణకారుడుగానో స్వర్ణవ్యాపారిగానో జన్మించి బంగారానికి సేవకుడవుతాడు. తామచౌర్యం లోహచౌర్యం చేసినవారు ఇలాగే బీజకుండంలో శిక్ష అనుభవిస్తారు. దేవతావిగ్రహాలను దొంగిలించినా దేవద్రవ్యాన్ని అపహరించినా స్వరోమాబ్దంగా వజ్రకుండ నరకంలో వజ్రాఘాతాలు తింటూ హాహాకారాలు చేస్తూ నిరాహారులై కింకరతాడితులై కడపటికి పాపకర్మ విముక్తులవుతారు. వెండినీ గోవులనూ వస్త్రాలనూ దొంగిలించేవారు తప్తపాషాణకుండంలో శిక్షింపబడతారు. మూడు జన్మలు బొల్లిరోగంతో పీడింపబడతారు. అటుపైని శ్వేతపక్షిగా జన్మిస్తారు. కాంస్యపాత్రలను ఆపహరించినవాడు తీక్ష్ణపాషాణ నరకంలో హింసలు అనుభవించి గుర్రంగా ఏడు జన్మలు ఎత్తి ఆపైని పాదరోగపీడితుడై పాతకవిముక్తి పాందుతాడు.

గతిలేక వాళ్ళు అమ్ముకుని జీవించే పుంశ్చలిని దోచుకునేవాడు స్వరోమాబ్దంగా లాలకుండంలో మునుగుతాడు. అటుపైని కంటిరోగంతోనూ శూలరోగంతోనూ పీడింపబడతాడు. ఎప్పటికో పాపవిశుద్ది పాందుతాడు. మసీజీవనం సాగించే విప్రుడు మసీకుండనరకంలో దుఃఖిస్తాడు. అటుపైని నల్లని పశువుగా మూడుజన్మలు ఎత్తుతాడు. మూడు జన్మలు నల్లగొర్రె అవుతాడు. ఆపైని తాడిచెట్టుగా పుడతాడు, కడపటికి విశుద్ధుడవుతాడు. ధాన్యాది సస్యాలనూ తాంబూలాన్నీ ఆసన తల్పాలను అపహరించేవాళ్ళు చూర్ణకుండ నరకకూపంలో యమబాధలు అనుభవిస్తారు. మేషజాతిలోనూ కుక్కుటజాతిలోనూ మూడేసి జన్మలు ఎత్తుతారు. ఆ పైని వానరజన్మ కాసవ్యాధిపిడ. దారిద్య్రం. అల్పాయుర్దాయం. వంశహాని. చివరికి పాపవిశుద్ధి. విప్రుల సొమ్ము హరించి (గానుగ) చక్రం చేయించుకున్నవాడు చక్రకుండనరకంలో శతాబ్దకాలం హింసలు అనుభవిస్తాడు. అటు పైని తైలకారుడుగా మూడు జన్మలు ఎత్తుతాడు. వ్యాధిపీడితుడూ వంశహీనుడూ అయ్యి పాపవిమోచనం పొందుతాడు. విప్రుల గో ధనాల విషయంలో వంకరగా వ్యవహరిస్తే వక్రకుండ నరకానికి పోతారు. ఆపైని వంకరటింకర అవయవాలతో పుడతారు. ఇలా ఏడు జన్మలయ్యాక గ్రద్దగా పందిగా పిల్లిగా నెమలిగా మూడు జన్మలు ఎత్తుతారు. అప్పటికి గానీ పాపభారం తరగదు. బ్రాహ్మణుడై పుట్టి కూర్మమాంసం తింటే కూర్మకుండంలో శతాబ్దంపాటు కూర్మాలతో భక్షింపబడతాడు. మూడు కూర్మజన్మలెత్తుతాడు. పందిగా బిడాలంగా నెమలిగా మూడేసి జన్మలు ఎత్తి క్రమంగా పాపపంకిలం వదిలించుకుంటాడు. నెయ్యిగానీ నూనెగానీ అపహరించినవాళ్ళు జ్వాలాకుండంలోనూ భస్మకుండంలోనూ నరకయాతన అనుభవిస్తారు. మత్స్యమూషక జన్మలు ఏడేసి ఎత్తి పాపభారం తొలగించుకుంటారు. సుగంధ ద్రవ్యాపహర్తలు దగ్ధకుండనరకంలో దివారాత్రాలు దగ్ధులవుతారు. అటుపైని దుర్గంధికులుగా ఏడు జన్మలెత్తుతారు. మృగనాభిగా(కస్తూరి) మూడు జన్మలు తప్పవు. ఏడు మంథాన జన్మలూ తప్పవు. అప్పటికి పాపఫలానుభవం పూర్తి అవుతుంది. బలప్రయోగంతోగానీ మోసం చేసిగానీ ఇతరుల పిత్రార్జితభూమిని కాజేసినవాళ్ళు తప్తసూచీకూపంలో పడిదగ్ధులవుతారు. ఏడు మన్వంతరాలు ఈ నరకం అనుభవించి అరవైవేల సంవత్సరాలు కృమికీటకమై తిరిగి స్వజాతిలో జన్మిస్తారు. పాపకర్మల ఫలంగా నరకయాతనలు అనుభవించి పరిశుద్ధులై స్వీయజాతిలో జన్మించాక శుభకర్మలు ఆచరించాలి. శుభఫలాలు దక్కుతాయి. మళ్ళీ పాపాలే చేస్తే ఇలాగే నరకయాతనలు తప్పవు.

సావిత్రీ ! ధనలోభంతో ఎదుటివాడి శిరస్సును కత్తితో నరికిన హంతకుడు అసిపత్రనరకంలో యాతనపడతాడు. పధ్నాలుగుమంది ఇంద్రులు మారేటంతకాలం అందులో కత్తికోత అనుభవిస్తాడు. బ్రాహ్మణుడిని చంపినవాడు శతమన్వంతరాలు అదే నరకంలో శిక్షింపబడతాడు. అటు పైని శతసూకరజన్మలూ సప్తకుక్కుట జన్మలూ సప్తసృగాల జన్మలూ సప్తవ్యాఘ్రజన్మలూ మూడు వృకజన్మలూ సప్తమండూక జన్మలూ ఎత్తుతాడు. అటుపైని ఒక మహిష జన్మఎత్తి పాపవిముక్తి పొందుతాడు. పల్లెలూ పట్టణాలూ తగులబెట్టేవారు క్షురధారానరకకూపంలో మూడు యుగాలపాటు యమబాధలు పడతారు. తరవాత ప్రేతాకారంలో మరిన్ని సంవత్సరాలు తిరుగుతారు. ఆపైని ఏడు జన్మలు మలభక్షకులై ఏడు జన్మలు కపోతాలై ఏడు జన్మలు శూలవ్యాధిపీడితులై ఏడు జన్మలు కుష్ఠువ్యాధి అనుభవించి శుద్ధిపాందుతారు, పరనిందాపరుడూ పరదోష ప్రచారకుడూ దేవ బ్రాహ్మణ నిందకుడూ సూచీముఖ నరకంలో యుగత్రయకాలం వేదనలు అనుభవిస్తారు. వృశ్చిక వజ్రకీట భస్మకీటజన్మలు ఏడేసి ఎత్తి మానవుడై మహావ్యాధి పీడితుడై మరణించి శుద్ధిపాందుతాడు, గోడలకు కన్నంవేసి తలుపులు బద్దలు చేసి ఇళ్ళల్లో చొరబడి వస్తువుల్ని దొంగిలించేవారు గోకాముఖనరకంలో మూడుయుగాలు యమకింకర బాధలు అనుభవిస్తారు. గిత్తలూ గొర్రెపాటేళ్ళూ మేకపోతులూ కొమ్ములతో కుమ్ముతోంటే గిట్టలతో మట్టగిస్తోంటే హాహాకారాలు చేస్తారు. ఆపైని వ్యాధిగ్రస్తమైన ఎద్దుగా ఏడుజన్మలూ మేషజాతిలో మూడుజన్మలూ ఛాగజాతిలో మూడు జన్మలూ ఎత్తి మానవుడుగా దారిద్య్రం నిత్యరోగం భార్యావియోగం బంధువియోగం అన్నీ అనుభవించి పాపకర్మ విముక్తుడవుతాడు. ఏ రకమైన ద్రవ్యాన్ని ఎవరినుంచి కాజేసినా చోరుడు నక్రముఖ కుండంలో నలిగిపోవలసిందే. మూడు శతాబ్దాలపాటు యమభటుల దండతాడనలు తినవలసిందే. ఆపైని రోగిష్ఠి ఎద్దుగా ఏడు జన్మలు దుఃఖించి మానవుడై మహారోగిగా అందరితోనూ ఏవగింపబడి కడపటికి పరిశుద్ధి పొందుతాడు. ఏనుగుల్నీ గుర్రాల్నీ పశువుల్ని చంపినవాడు గజదంశకూపంలో మూడుయుగాలపాటు యాతనలు అనుభవిస్తాడు. నాగదంతాలతో యమకింకరులు కుళ్ళబొడుస్తుంటే కుయ్యోం మొర్రోమని పెడబొబ్బలు పెడతాడు. అటుపైని ఆయా జంతువులుగా మూడేసి జన్మలు ఎత్తుతాడు. నరుడై శుచి అవుతాడు.

దప్పికతో వచ్చి నీళ్ళు తాగుతున్న గోవును తరిమివేసిన మానవుడు గోముఖనరకంలోపడి పురుగులతో కాగుతున్న నీళ్ళల్లో మగ్గుతాడు. మన్వంతరకాలం ఈ శిక్ష అనుభవిస్తాడు. నరజన్మ ఎత్తి మహారోగపీడతో మరణించి పాపప్రక్షాళన పొందుతాడు, గోహత్య బ్రాహ్మణహత్య స్త్రీహత్య భిక్షుహత్య భృణహత్య(గర్భస్రావం) చేసినవారూ పొందుకోరరాని స్త్రీని పొందినవారూ కుంభీపాకనరకంలో చతుర్దశేంద్రసమకాలం హింసలు ఆనుభవిస్తారు. యమదూతలు నలిపేస్తారు. నిప్పుల్లో తోస్తారు. ఇనపముళ్ళ పొదల్లోకి విసురుతారు. కాగుతున్న నూనెలో ముంచుతారు. సలసలలాడుతున్న తామ్ర లోహద్రవంలో వేపుతారు. ఇన్నీ అనుభవించి నూరు గ్రద్దజన్మలూ నూరు పందిజన్మలూ ఏడు కాకిజన్మలూ ఏడు సర్పజన్మలూ ఎత్తి అరవైవేల సంవత్సరాలపాటు విట్‌కృమిగా జీవించి ఆపైని ఎద్దుగా ఏడుజన్మలు ఎత్తి మనిషైపుట్టి దరిద్రుడై కుష్ఠురోగపీడితుడై అప్పటికి పాపభారం తొలగించుకుంటాడు.

బ్రహ్మహత్యాసమానాలు


Tuesday, July 21, 2026

Zodiac signs favored by Goddess Lakshmi - లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు

లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు

సనాతన ధర్మంలో లక్ష్మీదేవిని సంపదల దేవతగా కొలుస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం తనపై ఎప్పటికీ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే కొన్ని రాశులపై లక్ష్మీదేవి చల్లని చూపు ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతారు.

చంద్రుడు, గురుడు మరియు శుక్రుడు అధిపతులుగా కలిగిన రాశుల మీద లక్ష్మీ దేవి చూపు చల్లగా ఉంటుంది.

వృషభ రాశి
వృషభ రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు సంపద, సౌందర్యం, విలాసం, సౌభాగ్యానికి కారక గ్రహంగా భావిస్తారు. అందువల్ల ఈ రాశివారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎక్కువగా ఉంటుందని సంప్రదాయ జ్యోతిష్యం చెబుతుంది.

కర్కాటక రాశి
ఈ రాశికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనశ్శాంతి, కుటుంబ సౌఖ్యం, పోషణకు ప్రతీక. కుటుంబాన్ని గౌరవించే స్వభావం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని విశ్వసిస్తారు.

తులా రాశి
తులా రాశికి కూడా శుక్రుడే అధిపతి. సమతుల్యత, అందం, మంచి సంబంధాలు, ఆర్థిక ప్రణాళిక వంటి లక్షణాలు ఈ రాశివారిలో ఎక్కువగా ఉంటాయని జ్యోతిష్యం చెబుతుంది. అందుకే ఐశ్వర్య యోగాలు కలుగుతాయని భావిస్తారు.

ధనుస్సు రాశి
ఈ రాశికి అధిపతి గురుడు. గురుడు జ్ఞానం, ధర్మం, పుణ్యానికి సూచిక. ధర్మమార్గంలో నడిచేవారిపై లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని ఆధ్యాత్మిక విశ్వాసం.

మీన రాశి
మీన రాశికి కూడా గురుడే అధిపతి. భక్తి, దయ, దానం, ఆధ్యాత్మికత ఈ రాశివారి ప్రధాన లక్షణాలుగా భావిస్తారు. ఈ గుణాలు లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణమవుతాయని జ్యోతిష్య సంప్రదాయం చెబుతుంది.

లక్ష్మీదేవి అనుగ్రహం కేవలం రాశిని బట్టి మాత్రమే కాదు. భక్తి, నిజాయితీ, పరిశుభ్రత, దానం, ధర్మాచరణ, కష్టపడి పనిచేసే స్వభావం ఉన్న ప్రతి ఒక్కరిపై ఆమె కటాక్షం ఉంటుందని పురాణాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజేస్తాయి. రాశి ఒక సూచిక మాత్రమే, సత్కర్మలే లక్ష్మీ కటాక్షానికి నిజమైన మార్గం.

Monday, July 20, 2026

Henna in the month of Ashadha - ఆషాఢ మాసంలో గోరింటాకు

ఆషాఢ మాసంలో గోరింటాకు

ఆషాడ మాసంలో ఈ గోరింటాకుకు ఓ ప్రత్యేకత ఉంది. మిగతా రోజుల్లో పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, ఆషాడంలో ప్రతి ఆడపిల్ల తమ చేతులు, కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకుంటారు. అది ఎర్రగా పండితే మురిసిపోతుంటారు. అయితే, ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు.. దీని వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.

వేసవి నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది.. జోరుగా వర్షాలు దంచి కొడుతుంటాయి. ఇలాంటి మార్పు మొదలైన కాలంను ఆషాడం మాసం అని పిలుస్తాం. ఆషాడం వచ్చిదంటే చాలు వర్షాలు పడుతుంటాయి. దీంతో వతావరణం అంతా చల్లగా మారుతుంది. అంతేనా, సూక్ష్మక్రిములు పెరిగి అంటురోగాలు వ్యాపిస్తుంటాయి. అయితే, వర్షాలు ఎక్కువగా పడడం వల్ల వాతావరణం చల్లబడుతుంది కానీ, ఒంట్లో వేడి అలానే ఉంటుంది. బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారిపోతుంది. దీంతో మన శరీరంలో కొంత చికాకుగా ఉంటుంది.

గోరింటాకులో వేడిని తగ్గించే అద్భుతమై గుణం ఉంటుంది. అంతేకాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి.. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ సమయంలో గోరింటాకు పెట్టుకోవాలని మన పెద్దలు సూచిస్తుంటారు.

ఆషాఢంలోనే ఎందుకు:
ఆషాఢంలో కొత్త పెళ్లి కూతుళ్లు తమ పుట్టింటికి చేరుకోవడం తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఆ సమయంలో తమ చేతులకు గోరింటాకు పెట్టుకుని,పెట్టుకున్న గోరింటాకు ఇచ్చే రంగును చూసుకుని మురిసిపోతూ వారికి తమ సౌభాగ్యాన్ని గుర్తుచేస్తుంది. పుట్టింట ఉన్న మనసు మెట్టినింట ఉన్న భర్త ఆరోగ్యాన్ని కాంక్షిస్తుంది. వేళ్లకి గోరింట పెట్టుకోవడం వల్ల కంటికి అందంగానే కాకుండా గోళ్లు పెళుసుబారి పోకుండా, గోరుచుట్టు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది.

గోరింటాకు ఎర్రగా పండాలంటే చిట్కలు:
ఇక గోరింటాకు ఎర్రగా పండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలంటున్నారు. గోరింటాకు మెత్తగా రుబ్బిన తర్వాత అందులో నిమ్మరసం కలపాలి. వీటితో పాటు గోరింటాకు రుబ్బేటప్పుడు కొద్దిగా చింతపండు వేసినా మంచి ఉపయోగం ఉంటుంది. అదే విధంగా గోరింటాకును పెట్టుకున్నాక, అది పూర్తిగా చేతిపై ఎండిపోయి రాలిపోయే స్థితిలోకి వచ్చాక తీసేయాలి. అలా తీసేసిన వెంటనే చేతులని శుభ్రం చేసుకోవద్దు.. కనీసం ఓ అరగంట అయినా ఉంచాలి. ఆ తర్వాత చేతులని శుభ్రం చేసుకోవాలి. శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె తీసుకుని చేతులకి రాసుకుంటే ఎర్రగా మెరిసిపోతూ కనిపిస్తుంది.

Murudeshwar, Bhatkal Taluk, Uttara Kannada District, Karnataka State - మురుడేశ్వర్, భట్కల్ తాలుకా, ఉత్తర కన్నడ జిల్లా, కర్ణాటక రాష్ట్రం

మురుడేశ్వర్, భట్కల్ తాలుకా, ఉత్తర కన్నడ జిల్లా, కర్ణాటక రాష్ట్రం

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో అరేబియా సముద్ర తీరాన ఉంది. ఇది ప్రపంచంలోనే రెండవ ఎత్తైన 123 అడుగుల భారీ శివ విగ్రహానికి మరియు 20 అంతస్తుల (237 అడుగులు) రాజగోపురానికి ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ సముదాయం కందుక కొండపై ఉంది, ఇక్కడ సముద్రపు అలల హోరు మధ్య శివ దర్శనం ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది.

శివయ్యకు ప్రత్యెక్కించిన ఈ దేవాలయం పేరు మురుడేశ్వర్. మురుడేశ్వర్ అనేది శివయ్య పేరు.

ఇది ప్రపంచంలోనే రెండవ ఎత్తైన శివుని విగ్రహం అని పండితులు చెబుతున్నారు.ఈ శివుని విగ్రహాన్ని తయారు చేయడానికి దాదాపు రెండు సంవత్సరాల సమయం పట్టింది.

ఈ దేవాలయాన్ని సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు.

పురాణ కథనం:
మురుడేశ్వర పట్టణ ఇతిహాసం త్రేతాయుగం వరకు ఉంది. రావణాసురుడు, శివుని గురించి అకుంఠిత తపస్సు చేసి మెప్పించి ఆత్మలింగాన్ని భూలోకానికి తెస్తాడు. కాని శివుడిచ్చిన ఆత్మలింగం స్వభావం ప్రకారం భూమిమీద ఆలింగం ఎక్కడ పెడితే అక్కడ స్థాపితం అయి, అక్కడ నుండి తిరిగి ఎత్త శక్యం కాదని శివుడు చెబుతాడు. రావణాసురుడు ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠిస్తే ప్రతికూల చర్యలు జరుగుతాయని భావించి దేవతలు విష్ణువును వేడుకొనగా విష్ణువు తనమాయతో సూర్యాస్తమయం అయ్యేటట్లు చేస్తాడు. అప్పుడు రావణుడు సూర్యాస్తమయం అయిందని భావించి సంధ్యవార్చుకోవడానికి సంసిద్ధుడు అవుతాడు.

ఈ విషయం తెలుపుకొన్న నారదుడు వినాయకుని వద్దకు వెళ్ళి రావణాసురుడి వద్ద నుండి ఆత్మలింగం తీసుకొని భూమి మీద పెట్టాలని చెబుతాడు.అప్పుడు వినాయకుడు నారదుడు కోరినట్లు రావణాసురుడు సంధ్యవార్చుకొనే సమయానికి బ్రాహ్మణ వేషం లో వెడతాడు. ఆ బ్రాహ్మణ బాలకుడిని చూసిన వెంటనే రావణాసురుడు తాను సంధ్యవార్చుకొనవలసిన కారణమున ఆ బాలకుడిని లింగాన్ని పట్టుకొనవలసిందిగా కోరుతాడు. అప్పుడు వినాయకుడు లింగం చాలా బరువు ఉంటే తాను ఎక్కువ సేపు మోయలేనని, మోయలేకపోయే సమయం వచ్చినప్పుడు మూడు సార్లు పిలుస్తానని రావణాసురుడు రాకపోతే ఆలింగాన్ని భూమి పైన పెడతానని చెబుతాడు.

రావణాసురుడు అందుకు అంగీకరించగా, వినాయకుడు లింగాన్ని తన చేతులలోకి తీసుకొంటాడు.రావణాసురుడు సంధ్యవార్చుకోవడానికి వెళ్ళగానే గణపతి లింగాన్ని మోయలేక పోతున్నట్లు మూడు సార్లు పిలుస్తాడు. సంధ్య మధ్యలో ఉండడంతో రావణాసురుడు అక్కడకు వచ్చేటప్పటికే వినాయకుడు లింగాన్ని భూమి మీద నిలుపుతాడు. రావణాసురుడు వచ్చి లింగాన్ని భూమి మీద నిలిపినందుకు గణపటి నెత్తిమీద మొట్టుతాడు, గణపటి నెత్తికి గుంట పడుతుంది.వినాయకుడు భూమి మీద నిలిపిన స్థలం గోకర్ణ, మురుడేశ్వర లింగం పడిన భాగాలలో ఒక ప్రదేశం.

విష్ణువు తన మాయని తొలగించగా వెంటనే సూర్యుడు ఆకాశంలో మళ్ళి కనిపిస్తాడు.ఈ విషయాన్ని గ్రహించి రావణుడు ఎంతో కోపోద్రిక్తుడై ఆత్మలింగాన్ని తన చేతులతో పెకలించ ప్రయత్నం చేస్తాడు. ఆత్మలింగం పైనున్న కవచాన్ని విచ్ఛిన్నం చేసి విసిరివేస్తే గోకర్ణకు 23 కి.మి. దూరంలో సజ్జేశ్వర అనే ప్రదేశంలో పడుతుంది. లింగం పై నున్న మూత తొలగించి విసిరి వేస్తే అది గోకర్ణకు 27 కి.మి దూరంలో ఉన్న గుణేశ్వరలో పడుతుంది. లింగం పైనున్న వస్త్రాన్ని విసిరివేస్తే అది కందుక పర్వతం పై నున్న మృదేశ్వరలో పడుతుంది. ఆపేరు కాలక్రమంలో మురుడేశ్వరగా మారింది.

చరిత్ర:

ఆత్మలింగం: త్రేతాయుగంలో రావణాసురుడు శివుని కోసం తపస్సు చేసి సాధించిన ఆత్మలింగం ఈ ప్రదేశంతో ముడిపడి ఉంది.

భారీ శివ విగ్రహం: కొండపై భాగంలో ఉన్న ఈ 123 అడుగుల శివుని విగ్రహం సూర్యకాంతిలో మెరుస్తూ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

రాజగోపురం: ఆలయం వద్ద నిర్మించిన 237 అడుగుల రాజగోపురానికి లిఫ్ట్ సౌకర్యం ఉంది. దీని పైభాగానికి వెళ్లి చూస్తే అరేబియా సముద్రం మరియు మురుడేశ్వర్ పరిసరాల సుందర దృశ్యాలు కనిపిస్తాయి.

ఇతర విశేషాలు:
మురుడేశ్వర దేవాలయం: ఈ దేవాలయం కందుక పర్వతం మీద ఉంది.మూడు వైపుల అరేబియా సముద్రం ఆవరించి ఉంది.ఈ దేవాలయ గాలి గోపురం 20 అంతస్తులు ఉంది. దేవాలయానికి వెళ్ళే మార్గంలో రెండు నిజమైన ఏనుగులు ఉన్నాయి.

మురుడేశ్వర కోట: ఈ కోట మురుడేశ్వర దేవాలయం వెనుక భాగంలో ఉంది. ఈ కోటని మన హిందూ రాజులు పునరుద్ధరించాడు.

శివుని విగ్రహం: ఆలయ సముదాయంలో నున్న ఈ శివుని విగ్రహం చాలా దూరం నుండి కనిపిస్తుంది. ఆధారాల ప్రకారం ఈ విగ్రహం ప్రపంచం లోనే అతి పెద్ద శివుని విగ్రహం.
123 అడుగుల (37 మీటర్ల) ఎత్తు కలిగిన ఈ విగ్రహాన్ని చెక్కడానికి 2 ఏండ్లు పట్టింది. శివమొగ్గకు చెందిన కాశీనాథ్, ఆయన కుమారుడు శ్రీధర్, ఇతర శిల్పులు కలిసి కోటి రూపాయల ఖర్చుతో ఈ విగ్రహాన్ని చెక్కించారు. ఈ విగ్రహంలో మరో ప్రత్యేకత ఏమనగా సూర్యరశ్మి పడినప్పుడు ఈ విగ్రహం మెరుస్తుంది.

ఈ మురుడేశ్వర్ దేవాలయం బెంగళూరుకి 497 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.ఇంకా చెప్పాలంటే ఈ దేవాలయం భక్తి జ్ఞాన కేంద్రంగా వెలిసింది.

ఈ దేవాలయంలోనీ 123 అడుగులు ఎత్తైన మహా శివుడిని దర్శించుకోవడం ఆధ్యాత్మికం అని భక్తులు చెబుతూ ఉంటారు.అంతే కాకుండా ఈ దేవాలయానికి మూడు వైపులా సముద్రం ఉంటుంది.అంతే కాకుండా ఇక్కడ సూర్యాస్తమయం, బీచ్, కొల్లూరు టెంపుల్ తప్పక చూడదగిన ప్రదేశాలు అని స్థానికులు చెబుతున్నారు.

రోడ్డు మార్గం:
హొన్నావర్-భట్కల్ మధ్య నున్న జాతీయ రహదారి-17 మీద మురుదేశ్వర అని ఒక తోరణం స్వాగతం పలుకుతుంది. తోరణం నుండి ఒక కి.మీ. దూరం తూర్పు వైపు వెడితే మురుదేశ్వర పట్టణం వస్తుంది. బెంగళూరు నుండి జాతీయ రహదారి-206 ద్వారా హొన్నావర్ చేరుకొని అక్కడ నుండి జాతీయ రహదారి -17 తీసుకొంటే మురుదేశ్వర వస్తుంది.బెంగళూరు నుండి 455 కి.మీ. దూరంలో మురుదెశ్వర వస్తుంది.మంగళూరు నుండి 180 కి.మీ. దూరంలో ఉంది.

రైలు మార్గం:
మురుడేశ్వర రైలు స్టేషను కొంకణ్ రైల్వే లైను మీద ఉంది. ఈ రైలు స్టేషనులో ముఖ్యంగా ప్యాసింజర్ బండ్లు మాత్రమే ఆగుతాయి. మంగళూరు నుండి మార్మగోవా వరకు నడిచే ప్యాసింజర్ రైలు ఇక్కడ నిలుస్తుంది. బెంగళూరు నుండి మురుదేశ్వరకు సరాసరి రైలు సౌకర్యం లేదు. భట్కల్ వరకు రైలు మీద వచ్చి అక్కడ నుండి కొంకణ్ రైల్వే లైను మీద మురుదేశ్వర చేరుకోవచ్చు.

విమాన మార్గం:
మురుడేశ్వరకి దగ్గర లోని విమానాశ్రయం మంగళూరు 165 కి.మీ. దూరంలో ఉంది. హుబ్లీ, పనాజీ విమానాశ్రయాలు దగ్గరలో ఉన్న వేరే విమానాశ్రయాలు.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

Bonalu - బోనాలు

బోనాలు

బోనాలు అమ్మవారుని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాదు, సికింద్రాబాదు, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాలలో జరుపుకుంటారు. సాధారణంగా జూలై లేక ఆగష్టులో వచ్చు ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ మొదటి, చివరి రోజులలో ఎల్లమ్మ దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. బోనం అంటే భోజనం దేవికి సమర్పించే నైవేద్యం అని అర్థం.

బోనాలు తెలంగాణకు చెందిన మహంకాళి దేవి సాంప్రదాయ హిందూ పండుగ. ఈ పండుగను ప్రతి సంవత్సరం హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలలో అలాగే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో జరుపుకుంటారు. ఇది ఆషాడ మాసం నెలలో జరుపుకుంటారు. పండుగ యొక్క మొదటి మరియు చివరి రోజున యెల్లమ్మ (మహాకాళి యొక్క అనేక ప్రాంతీయ రూపాలలో ఒకటి) కోసం ప్రత్యేక "పూజలు" (పూజలు/ వేడుకలు) నిర్వహిస్తారు. ప్రతిజ్ఞలను నెరవేర్చినందుకు దేవతకు కృతజ్ఞతలు తెలిపే పండుగగా కూడా ఈ పండుగ పరిగణించబడుతుంది.

బోనం అనే పదం భోజనం అనే పదం యొక్క సంకోచం , ఇది సంస్కృత రుణ పదం, దీని అర్థం తెలుగులో భోజనం లేదా విందు. ఇది మాతృమూర్తికి సమర్పించే నైవేద్యం. మహిళలు తమ తలపై కుండలను మోస్తూ, ఆలయాల మీదుగా ఉన్న అమ్మవారికి పసుపు-కుంకం, కంకణాలు మరియు చీరలతో పాటు బోనం సమర్పిస్తారు.బోనాలలో మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, నూకలమ్మ వంటి ప్రాంతీయ రూపాలలో మాతృమూర్తిని పూజిస్తారు.

ఆషాడ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం; అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది.

బోనాల సందర్భంగా వనస్థలిపురంలో పొట్టేళ్ళ రథం పై అమ్మవారి ఊరేగింపు
పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. కొంతమంది స్త్రీలు తలపై కుండని (బోనం) మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు.

పోతురాజు
పురాణాల ప్రకారం, పోతరాజు మాతృదేవత సోదరుడు. ఊరేగింపులో అతని పాత్రను చక్కగా కట్టుకున్న, ఒట్టి శరీరంతో, చిన్నగా గట్టిగా కప్పబడిన ఎర్రని ధోతీని ధరించి, తన చీలమండలపై గంటలు, మరియు అతని శరీరంపై పసుపు మరియు అతని నుదుటి పై నుంచి అభిషేకం చేస్తారు. ఊరేగింపులో డప్పు వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తాడు.

పోతరాజు ఎప్పుడూ ఊరేగింపు ముందు నృత్యం చేస్తాడు. అతను ఉత్సవాల ప్రారంభకుడిగా మరియు సమాజ రక్షకుడిగా పరిగణించబడ్డాడు. అతను మాతృ దేవత ( షిగామ్ అని పిలుస్తారు) మంత్రముగ్ధులను చేసే మహిళా నృత్యకారులను, కొరడా దెబ్బలు మరియు పచ్చ వేప ఆకులను (మార్గోసా) వారి నడుము చుట్టూ కట్టి, బాకాలు మరియు డప్పులతో ఆలయానికి నడిపిస్తాడు.

Thursday, July 16, 2026

Puri Jagannath Rath Yatra - పూరీ జగన్నాథ్ రథయాత్ర

పూరీ జగన్నాథ్ రథయాత్ర

ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచినది పూరీ జగన్నాథ రథయాత్ర. ఈ రథయాత్రలో శ్రీకృష్ణుడు, బలరాముడు, సుభద్ర విగ్రహాలను పూరీ వీధుల్లో ఊరేగిస్తారు. రథం సుమారు 45 అడుగుల ఎత్తు, 35 చదరపు అడుగుల వైశాల్యం కలిగి ఉంటుంది. దీనికి ఏడు అడుగుల వ్యాసం కలిగిన 16 చక్రాలు ఉంటాయి. దాదాపు నాలుగు వేల మంది భక్తులు కలిసి ఈ రథాన్ని లాగుతారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి భారతదేశం నలుమూలల నుంచి భక్తులు విశేషంగా తరలి వస్తారు. ప్రతి యేటా కొత్త రథాన్ని తయారు చేయడం ఇక్కడి ప్రత్యేకత. ఈ యాత్ర పూరీ నుండి గుండిచా దేవాలయం వరకు సాగుతుంది.

ప్రపంచంలో ఏ హిందూ ఆలయంలోనైనా సరే, వూరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. వూరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే. ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిశాలోని పూరీ జగన్నాథాలయం. బలభద్ర, సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. వూరేగించేందుకు ఏటా కొత్తరథాలను నిర్మిస్తారు. అందుకే, జగన్నాథుడి రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు.

ఆషాఢ శుద్ధవిదియ పూరీ క్షేత్రంలో పండుగ ఆ రోజు. భక్తిభావం వెల్లువై పొంగులెత్తుతుంటుంది. జగన్నాథ జయజయధ్వానాలతో పూరీ నగరవీధులన్నీ మారుమోగుతుంటాయి. అంతరాలయంలో రత్నపీఠికపై ఏడాదిగా కొలువున్న జగన్నాథుడు బయటికి వచ్చే సమయం కోసం వేచి చూస్తుంటారు భక్తులు. స్వామి దర్శనం కాగానే ఆనందంతో పులకించి పోతారు. భక్తిపారవశ్యంతో మైమరచిపోతారు. ఆ క్షణం అపురూపం. స్వరం జగన్నాథం.

ప్రాముఖ్యత
హిందూ మతంలో జగన్నాథ రథయాత్రకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఈ పండుగ అన్నయ్య బలభద్ర మరియు చెల్లెలు సుభద్రతో పాటు శ్రీకృష్ణుడిని పూజించడానికి అంకితం చేయబడింది. స్నాన పూర్ణిమ నుండి వేడుక ప్రారంభమవుతుంది. ఈ ఉత్సవంలో మూడు రథాలు ఆకర్షణీయంగా నిలుస్తాయి. పూరి జగన్నాథ దేవాలయం ప్రతి సంవత్సరం వివిధ రకాల పువ్వులు, రంగోలి మరియు దీపాలతో అలంకరించబడుతుంది. 12వ శతాబ్దంలో జగన్నాథ్ పూరీ ఉత్సవం ప్రారంభమైంది. ఈ ఆలయం భారతదేశంలోని పురాతన దేవాలయాలలో ఒకటి.

ఈ పవిత్రమైన రోజున, పూరీ జగన్నాథ ఆలయం నుండి బలరాం, జగన్నాథుడు మరియు సుభద్ర విగ్రహాలు బయటకు వస్తాయి. భక్తులు పెద్ద పెద్ద రథాలపై విగ్రహాలను ఉంచుతారు. ఆ తర్వాత డప్పు తాళ్లతో నగరమంతటా భక్తులు రథాలను లాగడం ద్వారా, జగన్నాథుడు భక్తులకు గొప్ప ఆనందాన్ని, శ్రేయస్సును అనుగ్రహిస్తాడని మరియు ఈ వ్యక్తులు అన్ని ఆటంకాల నుండి బయటపడి మోక్షాన్ని పొందుతారని నమ్ముతారు.

ఆచారాలు
భక్తులు రథాల వద్దకు చేరుకునే ముందు గుండిచా ఆలయాన్ని శుభ్రం చేస్తారు. జగన్నాథుని రథాన్ని నందిఘోష అని పిలుస్తారు, దీనికి 16 చక్రాలు, బలభద్రుడి రథాన్ని తలధ్వజ అని పిలుస్తారు మరియు దీనికి 14 చక్రాలు మరియు సుభద్రా దేవి రథాన్ని 12 చక్రాలు కలిగిన దర్పదలన్ అని పిలుస్తారు. సుభద్ర రథాలకు అర్జునుడు సారథి అవుతాడని మరియు అది రెండు రథాల మధ్య ఉంటుందని నమ్ముతారు.

పూరీ జగన్నాథ దేవాలయం భారతదేశం లోని ఒడిషా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన ఉన్న పూరీ పట్టణంలో గల ఒక ప్రాచీన, ప్రముఖమైన హిందూ దేవాలయము. కృష్ణ భక్తులకు లేదా విష్ణు భక్తులకు ఈ దేవాలయం ఎంతో ప్రియమైనది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తాడు.

జగన్నాథుడు (విశ్వానికి ప్రభువు) పేరుతో ఆలయ దైవం యుంటుంది. సంస్కృత భాషలో జగత్ (విశ్వం), నాథ్ (ప్రభువు) అని అర్థం. హిందూ ఆచారాల ప్రకారం, భక్తులకు ముఖ్యంగా విష్ణువు, కృష్ణుడిని ఆరాధించు వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పక దర్శించవలసిన "ఛార్ థాం" పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఉంది.

ఈ దేవాలయం ప్రతి ఏటా నిర్వహించే రథయాత్ర లేక రథ ఉత్సవానికి ప్రసిద్ధి చెందింది. ఇందులో మూడు ప్రధాన విగ్రహాలను ఎంతో గొప్పగా, అందంగా అలంకరించిన రథాలపైన ఊరేగిస్తారు. మధ్య కాలంనుంచి ఈ ఉత్సవం అధిక మత తీవ్రతతో ముడిపడి ఉంది. వైష్ణవ సంప్రదాయాలకు, ఈ ఆలయంతో దగ్గర సంబంధమున్న రామానంద స్వామి వారికి ఈ గుడి ఎంతో పవిత్రమైనది. గౌడియ వైష్ణవ మతస్థులకు కూడా ఈ ఆలయం ప్రాముఖ్యమైంది. ఈ మత వ్యవస్థాపకుడైన చైతన్య మహాప్రభు ఆలయంలోని జగన్నాథ విగ్రహానికి ఆకర్షింపబడి చాన్నాళ్ళు పూరిలోనే నివసించాడు.

ఆలయంపై జెండా
పూరీ జగన్నాధ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి. ఇందులో ఆశ్చర్యం ఏం ఉంది అనుకోకండి. అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి. దీని వెనుక రహస్యం శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు.

సుదర్శన చక్రం
20 అడుగుల ఎత్తు, టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరీ జగన్నాధ్ ఆలయ పై భాగాన ఏర్పాటు చేశారు. ఆశ్చర్యకర విషయం ఏమిటంటే పూరీ పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది. ఏ వైపు నుంచి మీరు దీనిని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపించడం విశేషం.

ఆలయంపై నుంచి విమానాలు, పక్షులు ఎగరవు
ఈ ఆలయంపై నుంచి విమానాలు, పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకర విషయం. దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించడం అరుదు.

ఆలయ నిర్మాణం
పూరీ జగన్నాధ్ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పవచ్చు. రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు.

సింఘద్వారం రహస్యం
జగన్నాధ్ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి. వీటిలో సింఘ ద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం. ఈ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించినప్పుడు మీరు శబ్ధ తరంగాలను స్పష్టంగా వినవచ్చు. ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటకు వస్తే ఆ శబ్ధం మీకు వినిపించదు. ఇది భక్తులకు ఓ అద్భుతంలా అనిపిస్తుంది.

Tuesday, July 14, 2026

The Soul's 13-Day Journey - ఆత్మ 13 రోజుల ప్రయాణం

ఆత్మ 13 రోజులు ప్రయాణం మరణం తర్వాత 13 రోజుల్లో ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? 
ఈ 13 రోజుల క్రియలు ఎందుకు చేస్తారు? ఇప్పుడు తెలుసుకుందాం 

మరణం జరిగిన వెంటనే మనిషి శరీరం విడిచిన వెంటనే, ఆత్మ సూక్ష్మ శరీరంతో ప్రయాణం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో ఆత్మకు తన శరీరంపై ఇంకా మమకారం ఉంటుంది. అందుకే శాస్త్రాల ప్రకారం శరీరాన్ని అగ్నికి అప్పగించడం ద్వారా ఆత్మకు విముక్తి మార్గం సుగమమవుతుంది. 

మొదటి 3 రోజులు మరణం తర్వాత మొదటి మూడు రోజులు ఆత్మ తన ఇల్లు, కుటుంబం చుట్టూ తిరుగుతుందని నమ్మకం. ఈ సమయంలో ఆత్మకు దారితెలియని స్థితి ఉంటుంది. అందుకే కుటుంబ సభ్యులు శాంతి, ప్రార్థనలు చేస్తారు. 

4వ రోజు నుంచి 10వ రోజు వరకు ఈ రోజుల్లో ఆత్మకు ప్రేత స్థితి ఉంటుందని గరుడ పురాణం చెబుతుంది. ప్రతిరోజూ చేసే పిండ ప్రదానం, తిల తర్పణం ఆత్మకు ఆహారం, శక్తిగా మారుతాయి. ఈ క్రియల ద్వారా ఆత్మకు సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది మరియు తదుపరి లోకానికి ప్రయాణం సులభమవుతుంది. 

11వ రోజు – ఏకోదిష్ట శ్రాద్ధం ఈ రోజు చాలా ముఖ్యమైనది. ఆత్మను పితృలోకానికి పంపే ప్రధాన క్రియ ఇది. ఇక్కడ ఆత్మను ప్రేత స్థితి నుంచి పితృ స్థితికి చేర్చుతారు. 

12వ రోజు – సపిండీకరణ ఈ రోజు మరణించిన వ్యక్తి ఆత్మ పూర్వీకులతో కలిసిపోతుంది. అంటే పితృ దేవతలలో ఒక భాగంగా మారుతుంది. ఇది లేకపోతే ఆత్మకు శాంతి దక్కదని శాస్త్రాలు చెబుతాయి. 

13వ రోజు – కర్మకాండ ముగింపు 13వ రోజుఆత్మ ప్రయాణానికి ముగింపు కాదు, కానీ ఒక కొత్త దశకు ఆరంభం. ఈ రోజు తర్వాత ఆత్మ తన కర్మల ఆధారంగా పితృలోకంలో ఉండవచ్చు లేదా మళ్లీ జన్మకు సిద్ధమవుతుంది. 

ఈ 13 రోజులు ఎందుకు ముఖ్యమైనవి? ఆత్మకు శాంతి కోసం కుటుంబానికి మానసిక ధైర్యం కోసం పూర్వీకుల ఆశీస్సులు పొందేందుకు సనాతన ధర్మం ప్రకారం మరణం ఒక ముగింపు కాదు. అది ఒక మార్పు మాత్రమే. మన కర్మలే మన తదుపరి ప్రయాణాన్ని నిర్ణయిస్తాయి. అందుకే మంచి ఆలోచనలు, మంచి కార్యాలు మన జీవితం మాత్రమే కాదు మరణానంతర ప్రయాణాన్నీ ప్రభావితం చేస్తాయి.

అంత్యక్రియలప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా?
వాస్తవానికి శరీరం ఆత్మ రెండు వేరు వేరు. కలియుగ ధర్మం ప్రకారం మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు కానీ, ఈ మందుల తిండికి ఆయుష్షు 100 సంవత్సరాల లోపు పడిపోయింది. ఇంకా కొందరైతే ఈ కొత్త కొత్త రోగాలకు 60 కే అంతిమయాత్ర అవుతుంది. 

ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే, శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో లేదు. బతికి ఉన్నంత కాలం భార్యాపిల్లలు, బంధువులు, స్నేహితులు, తాగుడు, తినుడు, పైసా సంపాదన లో లీనమై పోతుంది. 

ఎప్పుడైతే మనిషి చనిపోతాడో, శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది. శరీరాన్ని దహనం చేసే దాకా  ఆత్మ, మళ్లీ తన శరీరం లోకి చొచ్చి తిరిగి శరీరాన్ని లేపి, మళ్ళి తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. పాడె కట్టి శరీరాన్ని ఎత్తుకు పోయేటప్పుడు స్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి, చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని (డెలివరీ అయి బిడ్డ బతికి చనిపోయిన ఆడవాళ్ళకి ఆవాలను కడతారు) విప్పి కింద పోస్తారు.

ఎందుకంటే శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద తన వాళ్ళ మీద ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే శరీరం మీద చల్లిన ప్యాలాలను, ఈ బియ్యాన్ని, పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తర్వాతనే ఆత్మకి తన వాళ్లను చూడడానికి అనుమతి దొరుకుతుంది. అది కూడా సూర్యోదయం లోపు మాత్రమే. అంతలోపు లెక్కించకపోతే, మళ్ళీ తిరిగి మొదటి నుండి లెక్కించాలి. 

శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే కుండా నీ శరీరం లాంటిది, అందులో ఉన్న నీరు, నీ ఆత్మ లాంటిది. కుండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలాగైతే వెళ్లి పోయిందో నీ శరీరం నుండి నీ ఆత్మ బయటికి పోయింది. 

కుండను కింద పడేసి పగలగొడతాం అంటే, ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాము. ఇంకా నీకు ఈ శరీరం ఉండదు, నువ్వు వెల్లిపో అని ఆత్మకు మనమిచ్చే సంకేతం. హిందూ సాంప్రదాయం లో చేసే ప్రతి పనికి ఓ అర్థం దాగి ఉంటుంది.

Reasons for sleeplessness - నిద్రపట్టకపోవడానికి కారణాలు

నిద్రపట్టకపోవడానికి కారణాలు

అధిక ఒత్తిడి, ఆందోళన, భవిష్యత్తు గురించి ఆలోచించడం వలన మనసు ప్రశాంతంగా ఉండదు. దీనివల్ల నిద్రపోవడం కష్టం అవుతుంది.

రోజువారీ నిద్ర వేళలు సరిగ్గా లేకపోవడం, ఉదాహరణకు వీకెండ్స్ లో ఆలస్యంగా పడుకోవడం లేదా లేవడం వంటివి నిద్ర చక్రంపై ప్రభావం చూపుతాయి.

రాత్రిపూట అధికంగా ఆహారం తీసుకోవడం లేదా కెఫీన్ (కాఫీ, టీ) లేదా ఆల్కహాల్ వంటివి తాగడం వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది.

రాత్రిపూట మొబైల్, టీవీ, ల్యాప్ టాప్ వంటివి ఎక్కువగా వాడటం వలన వాటి నుండి వచ్చే బ్లూ లైట్ మెదడును చురుకుగా ఉంచి, నిద్ర రాకుండా చేస్తుంది.

నిద్రలేమికి కొన్ని వైద్యపరమైన కారణాలు కూడా ఉండవచ్చు. ఉదాహరణకు, స్లీప్ ఆప్నియా (నిద్రలో ఊపిరి ఆగిపోవడం), దీర్ఘకాలిక నొప్పి, లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు.

ఈ సమస్యలను అధిగమించడానికి, మీరు నిద్రపోయే ముందు చల్లని గదిలో ప్రశాంతంగా ఉండడం, మొబైల్ వాడకం తగ్గించడం, మరియు తేలికపాటి ఆహారం తీసుకోవడం వంటివి ప్రయత్నించవచ్చు. సమస్య తీవ్రంగా ఉంటే, నిపుణులను సంప్రదించడం మంచిది.


స్లీప్ బ్యాంకింగ్
టైమ్ దొరికినప్పుడు ఎక్కువ నిద్రపోయి దాన్ని బ్యాంక్ బ్యాలన్స్‌లాగా తర్వాత వాడుకోవచ్చా?

ఆరోగ్యచిట్కాలు

వారాంతం రావడానికి ముందే, అలారం ఆపేసి, కావల్సినంత సేపు నిద్ర పోవడానికి చాలామంది ప్లాన్ చేసుకుంటారు. పని రోజుల్లో మిస్సయిన రెస్ట్‌ను తిరిగి పొందేందుకు వారాంతాల్లో దొరికే ఈ సౌకర్యాన్ని వాడుకోవడం సాధారణ వ్యూహం. 
అయితే మనం దీని గురించి కరెక్టుగానే ఆలోచిస్తున్నామా?

నిద్ర లేని రాత్రుల్ని ఎదుర్కోవడానికి, వారాంతం తర్వాత వచ్చే పని రోజుల్లో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించడానికి, ముందుగానే అదనపు గంటలు నిద్ర పోవడం మంచిదేనా?

నిద్రను తర్వాతి అవసరాల కోసం 'దాచుకోవడం' వల్ల ప్రయోజనాలుంటాయా? దీని గురించి శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

స్లీప్ బ్యాంకింగ్ అంటే ఏంటి?

స్లీప్ బ్యాంకింగ్- మీరు తక్కువ నిద్రపోయే అవకాశం ఉన్న సమయానికి ముందే అనేక రాత్రులు ఎక్కువ సేపు నిద్రపోవడం.

కొంతమంది పరిశోధకుల ప్రకారం ఇది ప్రభావవంతమైన వ్యూహం కావచ్చు.

దీని వల్ల మెదడు కీలకమైన వనరులను నిల్వ చేసుకోవడంతో పాటు నిద్ర లేమి వల్ల సమస్యలు ఏర్పడినప్పుడు అప్రమత్తంగా ఉండటానికి ఇది సాయపడుతుందనేది పరిశోధకుల అభిప్రాయం.

టిక్‌టాక్‌లో వీడియోలు చేసే వెల్‌నెస్ ఔత్సాహికుల్ల ఈ ఆలోచనకు ఆదరణ పెరుగుతోంది. మానసిక ప్రశాంతత, సుదూర ప్రయాణాలు, పెద్ద కార్యక్రమాలకు ముందు స్లీప్ బ్యాంకింగ్ మంచిదని వారి అభిప్రాయం.

ఉరుకుల పరుగుల రోజులకు ముందు ఎక్కువ గంటలు నిద్ర పోవడం అనేది 'సేఫ్టీ నెట్' లాంటిదని వారి అభిప్రాయం.

స్లీప్ బ్యాంకింగ్ భావనను 2009లో అమెరికాలోని సిల్వర్ స్ప్రింగ్‌లోని వాల్టర్ రీడ్ ఆర్మీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్‌లోని స్లీప్ రీసర్చర్స్ ప్రవేశపెట్టారు.

ప్రస్తుతం యూటా స్టేట్ యూనివర్శిటీలో ఉన్న ట్రేసీ రుప్ నేతృత్వంలోని ఈ బృందం వివిధ ఆపరేషన్లు చేపట్టడానికి ముందు సైనికుల అప్రమత్తతను మెరుగుపరిచే మార్గాల్ని పరిశోధిస్తోంది.

24 మంది సైనికుల్ని రెండు గ్రూపులుగా విభజించి, ఒక గ్రూపు రాత్రి 7 గంటలు, మరో గ్రూపు 10 గంటలు నిద్రపోయేందుకు అనుమతించారు.

తర్వాత వారు తమ రోజు వారీ జీవితంలో 8 గంటల నిద్ర పోవడానికి ముందు ఒక వారం రోజులు రెండు గ్రూపుల వారిని 3 గంటలు మాత్రమే నిద్రపోనిచ్చారు.

ఈ పరిశోధనలో ఆశ్చర్యకరమైన ఫలితాలు బయటపడ్డాయి. రోజుకు 10 గంటలు నిద్రపోయినవారు 7 గంటలు నిద్రపోయిన వారి కంటే చురుగ్గా ఉన్నారు. నిద్ర వారికి నియంత్రణలో ఉంది.

నిద్ర లేని రాత్రులకు ‘స్లీప్ బ్యాంకింగ్’ అనేది మానసిక, శారీరక రోగ నిరోధకశక్తిగా పని చేస్తుందని అనేక ఏళ్లపాటు జరిగిన పరిశోధనలు చెబుతున్నాయి.

2023లో మయామిలోని ఒక ఆసుపత్రిలో వైద్యులపై పరిశోధన నిర్వహించారు. ఇందులో నైట్ షిఫ్టులో పని చేసే డాక్టర్లు మూడు రోజుల పాటు వారి రోజు వారీ నిద్ర సమయం గంటన్నర అదనంగా నిద్రపోవడం వల్ల రెండు వారాల తర్వాత షిఫ్టులలో మెరుగ్గా పని చేసినట్లు తేలింది.

క్రీడాకారుల విషయంలోనూ ఈ వ్యూహం ప్రయోజనకరంగా ఉన్నట్లు అధ్యయనాల్లో వెల్లడైంది.

సెయిలింగ్ చేసే క్రీడాకారులు స్లీప్ బ్యాంకింగ్‌ను ఫాలో అవుతారు. అదనపు సమయం నిద్ర వల్ల సెయిలర్లు రెగట్టా పోటీల్లో లోపాలు చేయకుండా, వేగంగా పడవను నడిపారు.

మూడు వారాలు రోజుకు 10 గంటలు నిద్ర పోయే రగ్బీ ఆటగాళ్లు, తమపై శారీరక ఒత్తిడి తక్కువగా ఉందని చెప్పారు.

టెన్నిస్ ఆటగాళ్లు వారం రోజుల పాటు రోజూ 9 గంటలు నిద్రపోయినప్పుడు వారు సర్వీస్ బాగా పడినట్లు తేలింది.

5 నుంచి 7 వారాలు ఎక్కువ నిద్రపోయిన బాస్కెట్ బాల్ ఆటగాళ్లలో షాట్ కొట్టే కచ్చితత్వం పెరిగింది. వాళ్లు వేగంగా పరుగెత్తగలిగారు.

స్లీప్ బ్యాంకింగ్ వల్ల ప్రయోజనాలున్నాయని పరిశోధనల్లో తేలినప్పటికీ అది వివాదాస్పదంగానే ఉంది.

మనం మనం ఎక్కువసేపు మేల్కొని ఉండాల్సిన అవసరం వచ్చినప్పుడు నిద్రను తగ్గించుకునే ఉద్దేశంతో నిద్రను 'నిల్వ చేయడం' సాధ్యం కాదని కొంతమంది పరిశోధకులు వాదిస్తున్నారు.

శరీరం నిజంగా భవిష్యత్ కోసం నిద్రను నిల్వ చేస్తుందా? లేక అంతకు ముందు శరీరానికి అందని నిర్ణీత గంటల నిద్రను భర్తీ చేస్తుందా అనేది గుర్తించడం కష్టమనేది వారి వాదన.

షిఫ్టు వర్కర్లలో స్లీప్ బ్యాంకింగ్ గురించి నిర్వహించిన కొన్ని అధ్యయనాల్లో వెల్లడైన ఫలితాలు చర్చకు దారి తీశాయి. దైనందిన సమయం కంటే ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల వారి పనితీరు మెరుగుదలలో ప్రత్యక్షంగా ఎలాంటి ఫలితం కనిపించలేదని పరిశోధకులు చెప్పారు.

ఈ వాదనకు కారణం మన శరీరానికి నిద్ర ఎందుకు అవసరం ప్రశ్న.

"మనం ఎందుకు నిద్రపోతాం అనే దానిపై అనేక సిద్ధాంతాలున్నాయి" అని హాకెన్‌సాక్ మెరిడియన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో స్లీప్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ పీటర్ పోలోస్ చెప్పారు

"నిద్రలో మన జీవక్రియ, హార్మోన్లు, నాడీ సంబంధిత సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. నిద్రపోయే సమయం మెదడుకు, మన ఆలోచనలను ఏకీకృతం చేయడానికి లేదా అందులో ముఖ్యమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వడానికి అవసరమైన సమయం అని భావిస్తారు" అని ఆయన వివరించారు.

రాత్రిపూట నిద్ర లేమితో బాధ పడేవారు పగటిపూట నిద్రపోవడం ద్వారా ఆ లోటు తీర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తగినంత నిద్ర లేకపోతే ఏమవుతుంది?
శారీరంగా చూస్తే మన శరీరంలోని వేల కోట్ల కణాలకు నిద్ర చాలా అవసరం

"మీ శరీరంలో కణాలన్నింటిలోనూ ఇంధనం నింపడానికి, వాటిని మరమ్మత్తు చేయడానికి ఆరోగ్యరమైన నిద్ర అవసరం" అని మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో న్యూరాలజీ ప్రొఫెసర్ మైఖేల్ హోవెల్ చెప్పారు.

"రోజంతా మన శరీరంలో, మెదడులో వివిధ రకాల అనేక వ్యర్థాలు పేరుకుపోతాయి. మనం నిద్ర పోయినప్పుడు మెదడు వాటిని తుడిచి పెట్టేస్తుంది" అని హోవెల్ అన్నారు.

"అనేకమంది పెద్దవాళ్లు రాత్రి పూట 7 నుంచి 9 గంటల పాటు బాగా పని చేస్తారని హోవెల్ చెప్పారు.

నాలుగైదు గంటలే నిద్రపోయే వాళ్లు చాలా అరుదుగా ఉంటారనేది ఆయన అభిప్రాయం.

అందుకే నిద్రలేమి, తీవ్రమైన నిద్ర లోపం చాలా హానికరం.

"మనకు ఒక గంట నిద్ర తక్కువైతే తట్టుకోలగం. అయితే ఇది ఎక్కువ కాలం కొనసాగితేనే సమస్య. దీని ప్రభావం మొత్తంగా మన పనితీరు మీద, సామాజిక జీవితం మీద పడుతుంది" అని పోలోస్ చెప్పారు.

తగినంత నిద్ర లేకపోతే మీ మెదడు వ్యర్థాలను బయటకు పంపదు. అంటే మీరు సరిగ్గా నిద్రపోని రాత్రి తర్వాతి రోజు ముఖ్యమైన వ్యవహారాలపై దృష్టి కేంద్రీకరించడానికి ఇబ్బంది పడవచ్చని హోవెల్ చెప్పారు.

శరీరంలో న్యూరోనల్ వేస్ట్‌ను బయటకు పంపడానికి మెదడుకు అవసరమైన మరింత సమయాన్ని స్లీప్ బ్యాంకింక్ ఇస్తుందని రుప్, ఆమె సహచరులు భావిస్తున్నారు.

అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గినప్పుడు మెదడుకు అవసరమైన గ్లైకోజెన్ స్థాయిలను నింపడానికి కూడా అదనపు నిద్ర ఉపకరిస్తుందనేది వారి వాదన.

స్లీప్ బ్యాంకింగ్ మంచిదేనా?
నిద్ర మధ్యలో మెలకువ వచ్చే వారికెవరికైనా స్లీప్ బ్యాంకింగ్ ఉపయోగకరంగా ఉంటుందని ఈ విధానాన్ని ప్రతిపాదిస్తున్న శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

"మీరు కూడా స్లీప్ బ్యాంకింగ్ కోసం ప్రయత్నించాలనుకుంటే, మీరు నిద్ర సరిపోని రోజులు ఎదురవుతాయని భావించినప్పుడు రోజుకు గంట సేపు అదనంగా నిద్రపోండి. అలా రెండు వారాలు అదనంగా మరో గంట నిద్ర పోయేందుకు ప్రయత్నించండి" అని హోవెల్ చెప్పారు.

ఇందుకోసం అలారంను ఆలస్యంగా లేచేందుకు వీలుగా పెట్టుకోవాలని ఆయన సూచించారు.

అయితే దీనికి విరుద్దంగా "కొంతమందికి ముందుగా పడుకోవడం మంచి వ్యూహం కావచ్చు. మీ శరీరం ఉదయం 6 గంటలకు లేవడానికి సిద్ధంగా ఉంటే, మీరు ఉదయం 7 గంటలకు అలారం సెట్ చేసుకోవచ్చు, కానీ మీరు ఉదయం 6 గంటలకు మేల్కొనే అవకాశం ఉంది" అని పోలోస్ చెబుతున్నారు.

మీరు ఇప్పటికే నిద్ర లేమితో బాధ పడుతూ ఉంటే స్లీప్ బ్యాంకింగ్ ప్రభావవంతంగా పని చేస్తుందా లేదా అనే దానిపై శాస్త్రవేత్తలకు స్పష్టత లేదు.

మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్, హార్వర్డ్ మెడికల్ స్కూల్‌లో న్యూరాలజీ ప్రొఫెసర్ ఎలిజబెత్ క్లెర్మాన్ ఈ ఆలోచనను తోసిపుచ్చారు.

"స్లీప్ బ్యాంకింగ్ జరుగుతుందని చూపించడానికి, ఎవరైనా అలసిపోనప్పుడు నిద్రపోగలరని మీరు చూపించాలి. అందుకు ఎలాంటిన ఆధారాలు లేవు" అని ఆమె చెప్పారు.

స్లీప్ బ్యాంకింగ్ ప్రభావవంతంగా ఉంటుందని ప్రజలు విశ్వసిస్తే, గతంలో బాగా నిద్రపోయిన వారు తర్వాతి కాలంలో తక్కువగా నిద్రపోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవని భావించే అవకాశం ఉందని క్లెర్మాన్ ఆందోళన చెందుతున్నారు.

"అలా చేయడం వల్ల వారు తమ ఆరోగ్యం, ఉల్లాసానికి ప్రాథమికమైన దాన్ని కోల్పోతారు" అని ఆమె విశ్లేషించారు.

మనం భవిష్యత్తు కోసం నిద్రపోతున్నామా లేదా మనం చెల్లించాల్సిన అప్పును తీర్చుకుంటున్నామా అనే దానితో సంబంధం లేకుండా, ప్రతి రాత్రి అదనంగా అరగంట లేదా అంతకంటే ఎక్కువ సేపు చిన్న కునుకు తీయడం ప్రయోజనకరంగా ఉంటుంది.

స్లీప్ బ్యాంకింగ్ పనిచేసినా అది దీర్ఘకాలిక పరిష్కారం కాదని పోలోస్ అంటున్నారు.

"పడుకునే, మేల్కొనే సమయాల క్రమబద్ధమైన షెడ్యూల్‌ను క్రమం తప్పకుండా పాటించడానికి ప్రయత్నించండి. తగినంత పరిమాణంలో నాణ్యమైన నిద్రను ఆస్వాదించండి" అని పోలోస్ చెప్పారు.

Maila and Suthakam - మైల మరియు సూతకం

మైల మరియు సూతకం

ఎప్పుడు ఎలా...........!!మైల, సూతకం అనే విషయాలు ధర్మసింధు అనే గ్రంథంలో వివరించబడ్డాయి. 

తాశౌచ(పురుడు) మ్రుతాశౌచ(మైల) కాలాలో అందరూ, రజోదర్శన కాలంలో(ముట్టు) స్త్రీలు అస్ప్రుశ్యులుగా భావించబడతారు. 

సూతకం రెండురకాలు. జాతాశౌచం, మృతాశౌచం. షోడశ సంస్కారాల్లో ఒకటి అశౌచం. చావు సంభవించిన ఇంటిలో నివాసముండడం మంచిది కాదనే నమ్మకంతో సంవత్సరకాలం ఆ ఇంటిని ఖాళీగా ఉంచుతారు. దీన్ని సూతకమని అంటారు. 

సూతకం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు? ఎవరి ఇంట్లో శిశువు జన్మించింది? ఎవరి ఇంట్లో మరణం సంభవించింది? ఆయా ఇళ్ళల్లో నివసించే వారందరికీ మాత్రమే వర్తిస్తుంది. జాతికి, వంశానికి, గోత్రానికి సంబంధం లేదు. 

వారితో కలిసి కాక దూరంగా ఉండేవారికి వర్తించదు. కొత్తగా పెళ్లయిన అమ్మాయికి మేనమామ చనిపోతే మూడు రోజుల పాటు మైల ఉంటుంది. అయితే, అమ్మాయి భర్తకు ఉండదు. ఇది 12 రోజుల లోపు తెలిస్తే ఒక రోజు మైల ఉండును. 

మన తెలుగు సంప్రదాయం ప్రకారం బ్రహ్మణ, క్షత్రియ, వైశులకు, మాత్రం తప్పనిసరిగా సంవత్సరికం వరకు గృహప్రవేశాదులు, దైవరాధానులు కూడా నిషిద్ధం. సంవత్సర సూతకం దాటిన తరువాతే వీటిని నిర్వహించే అధికారం ఉంది. 

ద్వెజీతరాలకు ఈ విషయాలలో కొంత సడలింపు ఉంది. చనిపోయినా పెద్దలకు పితృపక్షంలో సంవత్సరికం చేసే ఆచారం ఉంటే గృహప్రవేశం చేసుకోవచ్చు. అలా పెద్దలో కలపకపోతే గృహ ప్రవేశం సంవత్సరికం దాటిన తరువాతే చేయడం శ్రేయస్కరం. 

తప్పనిసరి పరిస్థితి కలిగితే ఆడబిడ్డలు ఎవరైన ఉంటే ఆ దంపతులు మీ వంశికులేవ్వరు కనుక వారి చేత గృహప్రవేశం చేయించి, మీ ఇంటిలో సంవత్సర కార్యం తరువాత అ నూతన గృహంలో మీరు నివసించవచ్చు. 

ఆ సందర్భంలో కూడా గణపతి, నవగ్రహ, వాస్తు హోమాలు నిర్వహించుకొని, మీ ఇష్టదైవ వ్రతం చేసుకుంటే జీవితం సుఖప్రదంగా ఉంటుంది. 

సనాతన ధర్మశాస్త్రాలను స్మృతులు అంటారు. వాటిలో ఈ విషయాలన్నీ నిర్ణయించారు. పురుడుని జాతాశౌచం అంటారు. జాత అశౌచాన్ని దేవాలయ అర్చకులు తప్ప మిగతావారు పెద్దగా పట్టించుకోరు. కొంతమంది పురుడు కలిపేసుకుంటే శుభమని అసలు అశౌచాన్నే పాటించరు. కాని గృహంలో జరుపుకునే ఆరాధనలు ఆ సమయంలో పదోరోజు వరకు పనికిరావు. 

తల్లిదండ్రులు మరణిస్తే మృత అశౌచం తీరిపోయాక ఇంట్లో పూజలు మామూలుగానే చేసుకోవాలి. కొందరు ఏడాది దాకా దీపం కూడా పెట్టరాదంటారు. అది తప్పు. దీపారాధన మైల సమయంలో తప్ప ఎప్పుడూ ఆపకూడదు. 

మామూలుగా ఆలయాలలో దైవదర్శనం దోషం కాదు. అయితే ఉత్సవాలు నిర్వహించడం పనికిరాదు. ఒక వ్యక్తి తన తండ్రితో కలిపి మూడు తరాల వరకు పితృకార్యాలు చేయాలి తాను ఉన్నంతవరకు చేస్తాడు. ఆ తర్వాత మొదటి తరం పోయి ఇతనితో కలిపి మూడుతరాలకు అతని కొడుకు చేస్తాడు. 

వివాహం, గృహప్రవేశం ఇతర శుభకార్యాల తరవాత ఆరు నెలల తరవాత అదే గృహంలో పితృకార్యాలు చేయవచ్చు. అలాగే కర్మకాండలు జరిగిన గృహంలో వివాహాలు జరగవచ్చు.

చనిపోయినవారి కొడుకులకు సంవత్సరం వరకు వివాహం చేయరు. కూతుళ్లకు మాత్రం చనిపోయినవారికి కన్యదాన ఫలం దక్కేందుకు గాను అదే సంవత్సరం వీలైతే వివాహం చేస్తారు.

బ్రహ్మచారులకు మైల కాలం తీరిపోయాక ఇక ఏ అశౌచం ఉండదు. అశౌచ సమయాలలో ఏ పారాయణం అయినా బయటకు వినపడకుండా మనసులో చదువుకోవచ్చు. కొత్తవి చదవాల్సిన అవసరం లేదు. భగవన్నామస్మరణ అన్నివేళలా శ్రేయోదాయకమైనదే.

Meaning of the mantra - మంత్రం అర్దం

మంత్రం అర్దం

ఒక మంత్రం అర్దం తెలియకుండా, ఏదో దేవతలు ప్రసన్నం అయి వరం ఇస్తారనే భావనతో జపించడం కంటే అర్థం తెలిసి జపించడం వలన ఆ మంత్రం తాద్యాత్మికత మన అనుభవంలోకి వస్తుంది. యోగులు, ఋషులు, తపస్వులు విశ్వశక్తిని కాశ్మిక్ ఎనర్జీని ధ్యానింఛండి అంటే ఈ మంత్రం అర్దం అదే!!

రామ లక్ష్మణ భరత శతృఘ్నులు నలుగురు వశిష్ఠుడు దగ్గర విద్యాభ్యాసం చేసారు.

ఒకనాడు వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని వున్నారు. గురువు వశిష్ఠుడు వారందరి చిరు మందహాస ప్రశాంత వదనాలు చూసి - నాయన లక్ష్మణ చాలా ప్రశాంతంగా వున్నావు. అని అడుగగా, 

అవును గురువుగారు నాకు ఈ సమయం నా తల్లి చూడాలని వుంది. నా తల్లి సాన్నిహిత్యం, వారి ప్రేమ పొందాలని వుంది! అని తెలుపగా,

పక్కనున్న మరో స్నేహితుడు 'తల్లి ఇక్కడికి రాలేదు.చూడలేము కాని పాముని చూడలనుకో అదైతే ఇక్కడే వుంది. కొట్టి తీసుకురాగలను' అన్నాడు. దగ్గరున్న పాముని కొట్టి అయినా తీసుకొని రాగలము, కానీ తల్లి సాన్నిహిత్యం ప్రేమ పొందాలంటే మాత్రం వీలుకాదు. అని ఆ స్నేహితుడు అనగానే!! 

అప్పుడు వశిష్ఠుడు. "అంతే నంటవా రామ! నీవు చెప్పు దీనికి సమాధానం'. దానికి రాముడు "గురువు గారు మా తల్లి యెుక్క ప్రేమ సాన్నిహిత్యం మేము పొందగలం, ఇక్కడనుండే? అదెలా? అది ధ్యానం ద్వారా!

అదెలా చెప్పు రామా!

నిరంతరం మనస్సులో మా తల్లి భావన ద్వారా, ధ్యానం చేయడం ద్వారా!

వశిష్ఠుడు చాలా సంతోషించాడు రాముని జవాబు తో 'నీవు సరిగ్గా చెప్పావు నాయనా!
ఏ వస్తువు నైతే నిరంతరం ధ్యానిస్తామో, అంటే ఏ వస్తువు యెుక్క భావన మనస్సులో కొనసాగుతూ వుంటుందో వాటి గుణ ధర్మాలు ధ్యానం చేసే వారిలోకి ప్రవేశిస్తాయి.తల్లిని ధ్యానిస్తే తల్లి యెుక్క ప్రేమ సాన్నిధ్యం, మమత పొందుతావు. పాముని ధ్యానిస్తూ వుంఠే పాము యెుక్క ప్రవృత్తి, దాని భయం మనకు ప్రవేశిస్తుంది.

మనమందరం తేజోవంతులం కావలంటే పరమ ప్రకాశవంతమైన పరమాత్మ స్వరూపమైన సూర్యుని ధ్యానిస్తాము!

ఇప్పుడు నాకు ఒక సందేహం అని గుహుడు అడిగాడు.

పరమ తేజోవంతులైన వారంటే రాక్షసుల్లో రావాణాసురుడుు భాణసురుడు వున్నారు. వారిని ధ్యానిస్తే?

వారు తేజోవంతులైన వారైనప్పటికి వారిలో ధర్మనిరతి లేనందున వారిని మనం ద్యానిస్తే అపకీర్తి పాలు అవుతాము!

మెదటి విషయం ఏమిటంటే మనము సూర్యుని తేజస్సును ధ్యానిస్తున్నాము. అసురినిదో దైత్యునిదో కాదు!

రెండో విషయం శ్రేష్ఠమైన తేజస్సు ను ధ్యానిస్తున్నాము!

గురుదేవా! అలాంటి శ్రేష్ఠమైన తేజస్సును, పరమ చైతన్య తత్వాన్ని అనుభూతీ చెందిన వారు ఎవరైనా వున్నారా? అని అడిగాడు రాముడు! 'అవును అలాంటి దివ్వ తేజస్సు ను అనుభూతి చెందిన వారు ఒకరున్నారున్నారు. ఆ భావాన్ని ఒక మంత్రం గా చేసి ఆవిష్కరించారు! ఆ మంత్రానికి గాయిత్రి అనే చందస్సును చేర్చి లోకానికి ఆ మంత్రరాజాన్ని అందించిన వారు "బ్రహ్మర్షి విశ్వామిత్రుడు"

ఆ మంత్రం చంధస్సు గాయిత్రి కనుక ఆ మంత్రానికి గాయిత్రి మంత్రమని పేరు!

సకలదేవతల దివ్య తేజస్సును కీర్తిని దేవతాశక్తులను ఉపాసన గావిస్తుంది.

ఓం అని ప్రణవాన్ని ఉచ్చరించి, మెదట ఆ పరమ చైతన్యాన్ని స్మరిస్తాము.

భూర్భవః స్వః కనిపించే భూమి ఆకాశం అంతరిక్షం( ఇక్కడ అంతరిక్షం అంటే సకల బ్రహ్మాండాలు స్వర్గం అని అర్థం)

తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి

ఇక్కడ సవితు అంటే సూర్యుని తేజస్సుని ప్రకాశాన్ని ధీ అంటే ధ్యానిస్తున్నాము!

ధియోయోనః ప్రచోదయాత్! వారి తేజస్సు మా బుద్దులను ప్రచోదనం లేదా ప్రేరేపించును గాక! స్పందన కలుగ చేయను గాక!

ఈ పూర్తి మంత్రాన్ని ఒకసారీ నీ ముఖతః చెప్పు రామా అని వశిష్ఠుడు అనగానే

"ప్రణవ స్వరూప మైన బ్రహ్మ కి నమస్కారం! భూమి, ఆకాశం, అంతరిక్షం నందువ్యాపించిన ఆ సూర్యుని దివ్య కిరణాల తేజస్సును మేము ధ్యానిస్తున్నాము! ఆ తేజస్సు మా బుద్దులను ప్రేరించును గాక, స్పందన కలిగించును గాక!

బాగా చెప్పావు రామా! గాయిత్రి మంత్ర అర్దాన్ని! అని వశిష్ట మహర్షి ఎంతో సంతోషించాడు.

64 Yoginis - 64 యోగినీలు

64 యోగినీలు

తాంత్రిక సంప్రదాయంలో అత్యంత శక్తివంతమైన దైవిక స్త్రీ శక్తులు దుర్గా/పార్వతి యొక్క వివిధ అంశాలే ఈ 64 శక్తి స్వరూపాలు.

64 యోగినీలు - అష్టమాత్రుకల యొక్క అధీనంలో ఉంటాయి.

అష్టమాత్రుకలు - ప్రధాన నాయికా దేవతలు
1. బ్రాహ్మీ : మహావిద్యా, సరస్వతి, అంబిక, గాయత్రీ, సావిత్రీ, వాగ్దేవి, ధీశక్తి

2. మహేశ్వరి : రుద్రాణీ, కాళీ, త్రిపురభైరవి, భవానీ, శివదూతి, భైరవి, దక్షిణకాళీ

3. కౌమారి: స్కందమాత, సేనాని, శక్తి, కుమారి, గుహ్యకాళి, సుబ్రహ్మణ్యశక్తి, శక్తి దేవి

4. వైష్ణవి: మాధవి, నారాయణి, లక్ష్మీ, గోవింది, కామాక్షి, శాంతి, విష్ణుమాయ

5. వారాహీ: ధూమావతీ, బగళాముఖి, చిన్నమస్తా దేవి, త్రిపురసుందరీ, భువనేశ్వరీ, తారాదేవి, కామేశ్వరి.

6. ఇంద్రాణీ: అహల్య, శచి, వజ్రిణి, తేజస్విని, స్వర్ణకాంతి, జ్వాలాముఖి, అధితి

7. చాముండ: కాళరాత్రి, కాపాలిని, రక్తదంతికా, ఉగ్రచండా, భద్రకాళి, శూలిని, కాళీ

8. మహాలక్ష్మీ: కమలాత్మికా, అన్నపూర్ణ, శ్రీదేవి, పద్మావతి, ధనలక్ష్మీ, గజలక్ష్మీ, విజయలక్ష్మీ

అయితే వివిధ పురాణాల ప్రకారం, తంత్ర గ్రంధాల ప్రకారం వారి యొక్క పేర్లు మారుతాయి.

Names of Lord Vishnu - Meanings - విష్ణుమూర్తి పేర్లు - అర్థం

విష్ణుమూర్తి పేర్లు - అర్థం

విష్ణుమూర్తిని ఎన్నో పేర్లతో పిలుస్తుంటారు. విష్ణుమూర్తికి ఎన్ని పేర్లు ఉన్నాయి? ప్రతి పేరులో ఉన్న అర్థం ఏమిటి? విష్ణు పేరుకు సంబంధించిన పూర్తి సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

హిందూ ధర్మం లో అధికమాసం అని పిలువబడే మాసాన్ని పూర్తిగా విష్ణువుమూర్తికి అంకితం చేశారని పురాణాల్లో ఉంది. ఇది విష్ణువు ఆరాధన. హిందూ ధర్మంలో అచ్యుత, జనార్దన, శ్రీహరి, నారాయణ, అనంత మొదలైన అనేక పేర్లతో విష్ణువును పిలుస్తారు. శ్రీహరి యొక్క ప్రతి పేరు దాని స్వంత నేపథ్యం, ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది. విష్ణువు యొక్క అనేక పేర్లలో నారాయణుడు ఒకటి. నారద మహర్షుల పెదవుల నుండి ఈ పేరు మనం తరచుగా వింటూ ఉంటాము. విష్ణుమూర్తిని నారాయణ అని ఎందుకు అంటారు? ఈ పేరు యొక్క ప్రాముఖ్యత ఏంటి...? తెలుసుకుందాం..

1. పురుషోత్తమ:
విష్ణువు పేరు పురుషోత్తమ అంటే 'పురుషులలో ఉత్తముడు'. విష్ణువు యొక్క ఈ పేరు అతని అనేక అవతారాలలో ఒకదానిని సూచిస్తుంది.

2. అచ్యుత
అచ్యుత అంటే ఎప్పటికీ నశించనివాడు లేదా శాశ్వతంగా అమరుడు. విష్ణువు భూమిపై శాశ్వతుడు కాబట్టి విష్ణువుకు ఈ పేరు పెట్టారు.

3. హరి

విశ్వంలో పతనమైనప్పుడల్లా విష్ణువు వివిధ అవతారాలు ధరించి భూమిని రక్షిస్తాడని మత విశ్వాసం. అందుకే విష్ణువును విశ్వ రక్షకుడిగా పేర్కొంటారు. హరి అంటే ఒక వ్యక్తి యొక్క అన్ని బాధలను దాచేవాడు.

4. నారాయణ
ఇదివరకే మనం పురాణాలలో చెప్పుకున్నట్లుగా నారదుడు విష్ణువును నారాయణ, నారాయణ అని పిలిచేవాడు. నీరా అనేది నీటికి పర్యాయపదం, సంస్కృతంలో అమీర్ని ప్రత్యేక సందర్భాలలో నర అని కూడా పిలుస్తారు. నీరు మొదటి అధిష్ఠానం లేదా నివాసం. వైకుంఠ ధామంలో క్షీరసాగరంలో నివసించే శ్రీ హరితో ఈ నీటికి గాఢమైన అనుబంధం ఉంది. అందుకే శ్రీహరిని నారాయణ అని కూడా అంటారు.

5. విష్ణువు
లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన విష్ణువు కన్నులు తామరపువ్వులవంటివి. కౌస్తుక పూసలతో అలంకరించబడి, చతుర్భుజాలలో వివిధ ఆయుధాలను ప్రయోగించి విశ్వమంతటా తన శక్తిని ప్రదర్శిస్తాడు. అందుకే నారాయణుడిని విష్ణువు అంటారు.

Housewarming Ceremony - గృహప్రవేశం

గృహప్రవేశం

కొత్త ఇల్లు కట్టుకున్నాక లేదా కొన్నాక 'గృహప్రవేశం' చేయడం హిందూ సాంప్రదాయంలో చాలా ముఖ్యమైనది. దీని వెనుక ఉన్న ప్రధాన కారణాలు మరియు ఆంతర్యం ఇక్కడ ఉన్నాయి.

శాంతి, సుఖసంతోషాలు: గృహ ప్రవేశ పూజ శాస్త్రోక్తంగా నిర్వహించడం వల్ల ఆ ఇంట్లో నివసించే వారికి సుఖ శాంతులు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం.

దైవానుగ్రహం: కొత్త ఇంట్లోకి దేవుణ్ణి, దేవతలను ఆహ్వానించి, పూజా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆ ఇల్లు దైవానుగ్రహంతో నిండి ఉంటుందని విశ్వాసం.

వాస్తు దోష నివారణ: గృహ ప్రవేశ సమయంలో చేసే పూజలు, హోమాలు (ఉదాహరణకు వాస్తు పూజ) ఇంటి నిర్మాణంలో జరిగిన చిన్న చిన్న వాస్తు దోషాలను తొలగిస్తాయని చెబుతారు.

నకారాత్మక శక్తి తొలగింపు: పూజా కార్యక్రమాల వల్ల ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులు (Negative energies) పోయి, సానుకూల శక్తి (Positive energy) ప్రవేశిస్తుంది.

శుభారంభం: జీవితంలో కొత్త అధ్యాయాన్ని, శుభప్రదంగా ప్రారంభించడానికి ఈ పూజ ఒక మంచి ఆరంభంగా పరిగణించబడుతుంది.

సరైన సమయం: గృహప్రవేశాన్ని మంచి ముహూర్తం చూసి చేయడం వల్ల ఇంట్లో నివసించే వారి జీవితం మరింత సంతోషంగా ఉంటుందని నమ్ముతారు. వీలైతే బ్రహ్మ ముహూర్తం నుండి సూర్యోదయం లోపల చేసిన యెడల శుభం.

క్లుప్తంగా చెప్పాలంటే, కొత్త ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు వచ్చే కష్టాలను తొలగించి, ఆ ఇల్లు సుఖసంతోషాలతో, ఐశ్వర్యంతో తులతూగాలని చేసే ఒక పవిత్రమైన విధి.

vaaramu prayanamu - వారము ప్రయాణము

వారము ప్రయాణము

ప్రతిరోజు ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు పనులయందు ఆటంకం కలగకుండా ఉండాలంటే ఈ ప్రతి రోజు వారానికి తగట్టు మలుచుకోండి.

ఆదివారం
ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు... తమలపాకు నమలడం లేదా ఆకులు జేబులో ఉంచుకోవడం చేస్తే, అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.

సోమవారం
సోమవారం మీ ముఖాన్ని అద్దంలో ఒకసారి చూసుకుని ఇంట్లో నుండి బయటకు రావాలి. వీలైతే కోడి గుడ్డు ఆకారంలో ఉండే అద్దాన్ని ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర అమర్చుకోవాలి.

మంగళవారం
హనుమంతుడికి ఇష్టమైన మంగళవారం ఉదయం స్నానం చేసి, హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు నోరు తీపి చేసుకోవాలి. బెల్లం తింటే మరీ మంచిది.

బుధవారం
బుధవారం బయటకు వెళ్లేప్పుడు పుదీనా లేదా కరివేపాకు ఆకులు నోట్లో వేసుకోవాలి. ప్రతి బుధవారం ఇలా చేస్తే ఆరోగ్యంగానూ చాలా ప్రయోజనం ఉంటుంది.

గురువారం
గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు కొద్దిగా జీలకర లేదా ఆవాలు నోట్లో వేసుకోవడం మంచిది. వాటిని నమల కుండా అలానే నోట్లో ఉంచుకోవాలి. గుమ్మం దాటి బయటకు వెళ్లే వరకూ అలాగే ఉంచాలి.

శుక్రవారం
ముఖ్యమైన పనిమీద శుక్రవారం వెళ్లాల్సి వస్తే పెరుగు తిని బయలుదేరాలని హిందూ ధర్మశాస్త్రం చెబుతోంది. అలాగే ప్రతి శుక్రవారం కనీసం రెండు టేబుల్ స్పూన్ల పెరుగును ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు తీసుకోవాలి.

శనివారం
అల్లంతో కలిగే ప్రయోజనాలు అందరికీ తెలుసు. ప్రతి శనివారం కొద్దిగా అల్లం తురుము నేతితో కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల సిరిసంపదలు మీ దరిచేరతాయి.


గృహస్థులు- పూజాలూ - ధర్మసందేహాలు

నిత్య స్తోత్రావళి

పంచాంగం

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

Guru Moodami - గురు మూఢమి

గురు మూఢమి

మూఢం అనే మాట ఎన్నోసార్లు వినే ఉంటారు. అసలు మూఢం అంటే ఏంటి, ఎందు కొస్తాయి, మూఢాలతో సమస్యేంటి, ఈ రోజుల్లో శుభకార్యాలు చేయొద్దని అంటారెందుకు. ఏం చేయకూడదు, ఏం చేయొచ్చు, చేస్తే ఏమవుతుంది.

గురుమూఢమి:
నవగ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. వీటిలో భూమికూడా ఓ గ్రహమే. భూమి, సూర్యుడు ఒక గ్రహానికి ఒకే వరుసలో ఉన్నప్పుడు ఆ గ్రహం భూమీ మీద ఉన్నవారికి కనపడదు. దీన్నే అస్తంగత్వం లేదా మూఢం అంటారు. గ్రహాలకు రాజు సూర్యుడు. అంటే సూర్యుడికి అత్యంత సమీపంలోకి ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం తన శక్తిని కోల్పోతుంది. అలా గురువు సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురు మౌఢ్యం వస్తుంటాయి.

ఆ సమయంలో అవి బలహీనంగా మారిపోతుంటాయి. అందుకే దీనికి మూఢం అనే పేరు పెట్టి శుభ కార్యాలకు దూరంగా ఉండమని పండితులు చెబుతుంటారు. ఈ మూఢం అనేది ఆ గ్రహం సూర్యునికి ఎంత దగ్గరలో ఉందనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే శుభ గ్రహాలైన గురువు నకు శక్తి హీనత మాత్రమే దోషంగా పరిగణిస్తుంది.

ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే గురువు సూర్యునికి దగ్గరగా వచ్చినప్పుడు ఏర్పడే దానిని గురు మూఢం అని అంటారు. సూర్యునికి దగ్గరగా గురు, శుక్రులు వచ్చినప్పుడు, గురు శుక్రుల శక్తులు తగ్గి బలహీనమైపోతాయి, నీరసపడతాయి, వాటి శక్తి సన్నగిల్లుతుంది.

గురు, శుక్రులు శుభగ్రహాలు కాబట్టి అవి సూర్యుడికి అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు మూఢాలుగా పరిగణించి ఆ రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదు అని చెబుతారు. ఏ శుభ కార్యక్రమానికైనా గురు శుక్రులు బాగుండాలని, శక్తివంతంగా ఉంటే శుభం జరుగుతుందని విశ్వసిస్తారు.

మూఢంలో చేయకూడనివి:
శుభగ్రహాలు బలహీనంగా ఉంటాయి కాబట్టే మూఢాల్లో వివాహాది శుభకార్యాలు జరుపకూడదు.

లగ్నపత్రిక రాసుకోకూడదు, వివాహానికి సంబంధించిన మాటలు కూడా మాట్లాడుకోరాదు.

పుట్టు వెంట్రుకలు తీయించరాదు.

గృహ శంకుస్థాపనలు చేయరాదు.

ఇల్లు మారకూడదు.

మూఢంలో దోషం లేనివి:

అన్న ప్రాసన చేసుకోవచ్చు.

ప్రయాణాలు చేయవచ్చు.

ఇంటి రిపేర్లు చేసుకోవచ్చు.

భూములు కొనడం, అమ్మడం, అగ్రిమెంట్లు చేసుకోవడం చేయొచ్చు.

నూతన ఉద్యోగాల్లో చేరవచ్చు, విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లొచ్చు.

నూతన వాహనాలు కొనుగోలు చేయొచ్చు, నూతన వస్త్రాలు కొనుక్కోవచ్చు.

మూఢాల కాలంలో శుభ కార్యాలు చేస్తే:
మహర్షులు, జ్యోతిష్య పండితులు చెప్పిన దాని ప్రకారం మూఢం సమయంలో ఏదైనా శుభకార్యం చేసినా అశుభం వినాల్సి రావొచ్చు. కష్టం కలుగవచ్చు, నష్టం వాటిల్లవచ్చు.

అయితే కొన్ని ఆ సమయంలోనే తప్పనిసరిగా చేయాల్సిన పనులను మూఢంలో ముడిపెట్టడం మంచిది కాదంటారు. ఇంకా చెప్పాలంటే ఎలాంటి పట్టింపు లేనివారు నిరభ్యంతరంగా ఏ పనైనా చేసుకోవచ్చు..దీన్ని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలి అన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.


ప్రస్తుత సంవత్సరం గురు మూఢమి జూలై 15 నుంచి ఆగస్టు 12 వరకు ఏర్పడుతోంది. ఈ సమయంలో గురు జపం, దానాలు చేయడం మంచిది.

Varahi Gupta Navaratri - వారాహి గుప్త నవరాత్రులు

వారాహి గుప్త నవరాత్రులు

వారాహి గుప్త నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి, ఆషాఢ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుగుతాయి. ఈ ఏడాది వారాహి నవరాత్రులు జూలై 15, గురువారంతో ప్రారంభమై జూలై 23, గురువారం వరకు తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి.

ఈ తొమ్మిది రోజులు దుర్గామాత యొక్క 'దశ మహావిద్యలను', ముఖ్యంగా వారాహి దేవిని అత్యంత రహస్యంగా, తీవ్రమైన మంత్ర సాధనలతో పూజిస్తారు.

సాధారణ దసరా నవరాత్రుల వలె కాకుండా, ఇందులో బహిరంగ ఉత్సవాల కంటే అంతఃకరణ సాధన, మంత్ర జపం మరియు గుప్త పూజలకు ప్రాధాన్యత ఇస్తారు.

గుప్త నవరాత్రుల ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక మరియు రహస్య అభ్యాసాలు
ఆషాఢ గుప్త నవరాత్రులను ప్రధానంగా తంత్ర , శాక్త , మరియు అఘోర సంప్రదాయాలను అనుసరించేవారు పాటిస్తారు . ఈ కాలంలో ఆధ్యాత్మిక ఉన్నతి, సిద్ధులు, మరియు దుర్గా మాత ఆశీర్వాదాలను పొందడానికి రహస్యమైన కర్మకాండలు మరియు సాధనలు నిర్వహిస్తారు.

ఈ కాలంలోని శక్తులు అంతర్గత పరివర్తనకు, ఆధ్యాత్మిక జాగృతికి, మరియు దైవ సాంగత్యానికి అనుకూలంగా ఉంటాయని నమ్ముతారు.

ఆమె ఉగ్ర రూప స్త్రీ శక్తి
గుప్త నవరాత్రులు దుర్గాదేవి యొక్క నిగూఢ లేదా రహస్య రూపాలైన దశ మహావిద్యలు మరియు సప్తమాతృకలను ఆవాహన చేయడంపై ఆధారపడి ఉంటాయి, ఇందులో వరాహి దేవి ప్రధాన పాత్ర పోషిస్తుంది. సంరక్షక దేవతగా, వరాహిని శత్రువుల నుండి రక్షణ, న్యాయ వివాదాలలో విజయం, వ్యాధుల నుండి స్వస్థత మరియు ఆధ్యాత్మిక ఉన్నతి కోసం తరచుగా పూజిస్తారు.

వారాహి గుప్త నవరాత్రులు 9 రోజులు అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో అవతారంలో పూజిస్తారు. ప్రతిరోజు వారాహి దేవిని పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయని దేవి పురాణం చెబుతోంది.

లలితా దేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని అభివర్ణిస్తారు. సప్త మాతృకలలో ఒకరైన శ్రీ వారాహి అమ్మవారు సప్త మాతృకలలో అత్యంత శక్తివంతమైన రూపం. ఈమె పరమేశ్వరుడి అనుగ్రహంతో అంధకాసుర సంహారం కోసం అవతరించినట్లు దేవీ పురాణం చెబుతోంది.

వారాహీ అమ్మవారు అంటే భూదేవి. హిరణ్యాక్షుడు భూదేవిని తీసుకువెళ్ళినప్పుడు, శ్రీ మహావిష్ణువు వరాహరూపంలో అవతరించి, హిరణ్యాక్షుడిని సంహరించి, భూదేవిని రక్షిస్తాడు.

స్వామివారి మీద భక్తి తో అప్పుడు అమ్మవారు వారాహీ రూపం తీసుకుందని, అందువలన ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యానశ్లోకాల్లో కనిపిస్తుంది. అంటే వారాహీ అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మీ.

వారాహీ అమ్మవారు స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో, అష్ట భుజాలతో, శంఖ, చక్ర, హల(నాగలి),ముసల(రోకలి), పాశ, అంకుశ, వరద, అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది.

ఇది మహావారాహి(బృహద్వారాహి) యొక్క స్వరూపం. ఇంకా లఘువారాహి, స్వప్నవారాహి, ధూమ్రవారాహి, కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది.

ఆషాఢ నవరాత్రులలో వారాహి ఆరాధన వలన ప్రయోజనం ఎలా?
శక్తి యొక్క తొమ్మిది రాత్రులు: వరాహి యొక్క తొమ్మిది అవతారాల ఆరాధన

ఆషాఢ గుప్త నవరాత్రులలో ప్రతి రాత్రి వరాహి దేవి యొక్క ఒక శక్తివంతమైన రూపంతో ముడిపడి ఉంటుంది , వీటిని సమిష్టిగా నవ వరాహి అని పిలుస్తారు . ఈ తొమ్మిది అవతారాలు దివ్య వరాహిత దేవత యొక్క విభిన్న విశ్వ అంశాలను, ఆయుధాలను, శక్తులను మరియు ఆశీర్వాదాలను సూచిస్తాయి. వివిధ పురాణాలు మరియు ఇతర అనుబంధ గ్రంథాలలో వేర్వేరు కథనాలు మరియు వాటి క్రమం పేర్కొనబడినప్పటికీ, వేర్వేరు రోజులలోని రూపాలను వివరించడానికి ఈ క్రిందివి ఎంపిక చేయబడ్డాయి.

వరాహి యొక్క తొమ్మిది అవతారాల ఆరాధన:
స్వప్న వారాహి:
ప్రతికూల కలలు, మానసిక దాడులు మరియు నిగూఢ భయాల నుండి రక్షణ కోసం మొదటి రాత్రి స్వప్న వరాహిని ఆవాహన చేస్తారు. ఆమె కలలు మరియు ఆస్ట్రల్ దర్శనాల ద్వారా భక్తునికి అంతర్గత శాంతిని మరియు ఆధ్యాత్మిక స్పష్టతను ప్రసాదిస్తుంది.

చైతన్య వారాహి:
రెండవ రాత్రి, నిద్రాణంగా ఉన్న శక్తులను మేల్కొల్పడానికి మరియు ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంచడానికి చైతన్య వరాహిని పూజిస్తారు. ఆమె కుండలినీ శక్తితో సంబంధం కలిగి సాధన మార్గానికి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.

సంకట వరాహి:
మూడవ రాత్రి జీవితంలోని కష్టాలను, అడ్డంకులను మరియు దురదృష్టాలను తొలగించే సంకట వరాహిని పూజిస్తారు. ఈమెను ఆటంకాలను నాశనం చేసే దేవతగా భావిస్తారు మరియు భక్తునికి అంతర్గత శక్తిని ప్రసాదిస్తుంది.

ఉగ్ర వరాహి:
నాల్గవ రాత్రి పూజించబడే ఉగ్ర వరాహి అత్యంత భయంకరమైన రూపం. ఈమె హాలం లేదా నాగలి, ఖడ్గం లేదా కత్తి, మరియు చక్రం వంటి ఆయుధాలను ధరించి ఉంటుంది. ఈమె క్రియారూపంలో ఉన్న శక్తి స్వరూపం, రాక్షస శక్తులను మరియు అహంకారాన్ని నాశనం చేస్తుంది.

ధూమ్ర వారాహి:
ఐదవ రాత్రి పూజించబడే ధూమ్ర వరాహి , పొగ, భ్రమ మరియు నిగూఢ జ్ఞానంతో సంబంధం ఉన్న ఒక దివ్య స్వరూపం. ఈమె భక్తుడు మాయను (భ్రమను) అధిగమించి, ఉన్నతమైన గూఢ జ్ఞానాన్ని పొందడానికి సహాయపడుతుంది. ఇది జన్మ పట్టిక లేదా జాతకం ప్రకారం ఒక వ్యక్తి ఎదుర్కొంటున్న రాహువు సంబంధిత దోషాలను పరిష్కరించడానికి కూడా సహాయపడుతుంది.

క్రియా వారాహి:
ఆరవ రాత్రి, చైతన్యవంతమైన శక్తికి మరియు లక్ష్యాల విజయవంతమైన సాధనకు ప్రతీక అయిన క్రియా వరాహికి భక్తులు ప్రార్థనలు చేస్తారు . ఆమె అన్ని ఆధ్యాత్మిక మరియు భౌతిక ప్రయత్నాలు ఫలించేలా చూస్తుంది.

శాంత వరాహి:
ఏడవ రాత్రి పూజించబడే శాంతా వరాహి , శాంతపరిచే, కరుణామయ స్వరూపం. ఆమె అంతర్గత కల్లోలాన్ని, బాహ్య గందరగోళాన్ని శాంతింపజేసి, ప్రశాంతతను, ఆరోగ్యాన్ని మరియు మానసిక శాంతిని ప్రసాదిస్తుంది.

విచిత్ర వారాహి:
ఎనిమిదవ రాత్రి విచిత్ర వరాహిని పూజిస్తారు. తన అద్భుత సృష్టికి ప్రసిద్ధి చెందిన ఆమె, నిష్కపటమైన భక్తులకు ఆకస్మిక వరాలు, సిద్ధులు మరియు జీవితాన్ని మార్చే మార్పులను ప్రసాదిస్తుంది.

మహా వారాహి:
చివరి మరియు తొమ్మిదవ రాత్రి మహా వరాహిని పూజిస్తారు. ఆమె సమస్త పూర్వ రూపాలను ఏకీకృతం చేసే అంతిమ విశ్వమాత. మహా వరాహిని పూజించడం వల్ల మోక్షం, పరమ జ్ఞానం మరియు దైవిక రక్షణ లభిస్తాయి.

ఆషాఢ గుప్త నవరాత్రుల ఆచార పద్ధతులు:
రోజువారీ పూజా విధి

కలశ స్థాపన : దీనిని ఘట స్థాపన అని కూడా అంటారు మరియు దీనిని మొదటి రోజున నిర్వహిస్తారు.

ఎర్రని పువ్వులు, కుంకుమ, బియ్యం మరియు దీపంతో దేవిని పూజించడం.
ఓం వారాహ్యై నమః లేదా తాంత్రిక బీజ మంత్రాల వంటి వారాహి మంత్రాన్ని పఠించడం .
బెల్లం, దానిమ్మపండు, ఎర్రటి వస్త్రం, మినుములు మరియు నువ్వుల నూనె దీపం సమర్పణలు.
రాత్రిపూట ధ్యానం మరియు దేవీ మహాత్య పారాయణం, ముఖ్యంగా దుర్గాదేవి యొక్క ఉగ్ర రూపాలకు సంబంధించిన అధ్యాయాలు.

ఉన్నత అభ్యాసకులు అనుసరించే తాంత్రిక సాధన
కొంతమంది ఆధ్యాత్మిక సాధకులు మరియు తాంత్రికులు ఈ క్రింది వాటితో సహా రహస్య పూజలు  నిర్వహిస్తారు

యంత్ర పూజ మరియు హోమం (అగ్ని ఆచారాలు)
అజప జప (శబ్దం లేని జపం)
చక్ర ధ్యానం, ముఖ్యంగా మూలాధారం మరియు మణిపూర చక్రాలు
సప్తమాతృక ఆవాహనలు, ఇందులో వరాహి ఏడుగురు మాతృ దేవతలలో ఒకరు

ఆషాఢ గుప్త నవరాత్రులు పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు:
భూమి ఆస్తి లేదా భవనానికి సంబంధించిన వివాదాలు పరిష్కరించబడ్డాయి
భౌతిక విజయం మరియు చట్టపరమైన విజయం
అద్భుతమైన ఆశీర్వాదాలు మరియు దైవ కృప
శత్రువులు, చేతబడి మరియు దాగివున్న ప్రమాదాల నుండి రక్షణ
ప్రతికూల కర్మ మరియు పితృ దోషాల తొలగింపు
ఆధ్యాత్మిక పురోగతి మరియు అంతర్గత జాగృతి
మెరుగైన మానసిక ఆరోగ్యం మరియు మానసిక శక్తి

వారాహి