Wednesday, February 8, 2023
Pipaladudu-పిప్పలాదుడు
Saturday, January 28, 2023
MAHA MRUTHYUNJAYA MANTRAM - మహామృత్యుంజయ స్తోత్రం
మహామృత్యుంజయస్తోత్రం (రుద్రం పశుపతిం)
శ్రీగణేశాయ నమః ।
ఓం అస్య శ్రీమహామృత్యుంజయస్తోత్రమంత్రస్య శ్రీ మార్కండేయ ఋషిః,
అనుష్టుప్ఛందః, శ్రీమృత్యుంజయో దేవతా, గౌరీ శక్తిః,
మమ సర్వారిష్టసమస్తమృత్యుశాంత్యర్థం సకలైశ్వర్యప్రాప్త్యర్థం
జపే వినోయోగః ।
ధ్యానం
చంద్రార్కాగ్నివిలోచనం స్మితముఖం పద్మద్వయాంతస్థితం
ముద్రాపాశమృగాక్షసత్రవిలసత్పాణిం హిమాంశుప్రభమ్ ।
కోటీందుప్రగలత్సుధాప్లుతతముం హారాదిభూషోజ్జ్వలం
కాంతం విశ్వవిమోహనం పశుపతిం మృత్యుంజయం భావయేత్ ॥
రుద్రం పశుపతిం స్థాణుం నీలకంఠముమాపతిమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 01॥
నీలకంఠం కాలమూర్త్తిం కాలజ్ఞం కాలనాశనమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 02॥
నీలకంఠం విరూపాక్షం నిర్మలం నిలయప్రదమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 03॥
వామదేవం మహాదేవం లోకనాథం జగద్గురుమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 04॥
దేవదేవం జగన్నాథం దేవేశం వృషభధ్వజమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 05॥
త్ర్యక్షం చతుర్భుజం శాంతం జటామకుటధారిణమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 06॥
భస్మోద్ధూలితసర్వాంగం నాగాభరణభూషితమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 07॥
అనంతమవ్యయం శాంతం అక్షమాలాధరం హరమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 08॥
ఆనందం పరమం నిత్యం కైవల్యపదదాయినమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 09॥
అర్ద్ధనారీశ్వరం దేవం పార్వతీప్రాణనాయకమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 10॥
ప్రలయస్థితికర్త్తారమాదికర్త్తారమీశ్వరమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 11॥
వ్యోమకేశం విరూపాక్షం చంద్రార్ద్ధకృతశేఖరమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 12॥
గంగాధరం శశిధరం శంకరం శూలపాణినమ్ ।
(పాఠభేదః) గంగాధరం మహాదేవం సర్వాభరణభూషితమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 13॥
అనాథః పరమానంతం కైవల్యపదగామిని ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 14॥
స్వర్గాపవర్గదాతారం సృష్టిస్థిత్యంతకారణమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 15॥
కల్పాయుర్ద్దేహి మే పుణ్యం యావదాయురరోగతామ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 16॥
శివేశానాం మహాదేవం వామదేవం సదాశివమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 17॥
ఉత్పత్తిస్థితిసంహారకర్తారమీశ్వరం గురుమ్ ।
నమామి శిరసా దేవం కిం నో మృత్యుః కరిష్యతి ॥ 18॥
ఫలశ్రుతి
మార్కండేయకృతం స్తోత్రం యః పఠేచ్ఛివసన్నిధౌ ।
తస్య మృత్యుభయం నాస్తి నాగ్నిచౌరభయం క్వచిత్ ॥ 19॥
శతావర్త్తం ప్రకర్తవ్యం సంకటే కష్టనాశనమ్ ।
శుచిర్భూత్వా పథేత్స్తోత్రం సర్వసిద్ధిప్రదాయకమ్ ॥ 20॥
మృత్యుంజయ మహాదేవ త్రాహి మాం శరణాగతమ్ ।
జన్మమృత్యుజరారోగైః పీడితం కర్మబంధనైః ॥ 21॥
తావకస్త్వద్గతః ప్రాణస్త్వచ్చిత్తోఽహం సదా మృడ ।
ఇతి విజ్ఞాప్య దేవేశం త్ర్యంబకాఖ్యమనుం జపేత్ ॥ 23॥
నమః శివాయ సాంబాయ హరయే పరమాత్మనే ।
ప్రణతక్లేశనాశాయ యోగినాం పతయే నమః ॥ 24॥
శతాంగాయుర్మంత్రః ।
ఓం హ్రీం శ్రీం హ్రీం హ్రైం హ్రః
హన హన దహ దహ పచ పచ గృహాణ గృహాణ
మారయ మారయ మర్దయ మర్దయ మహామహాభైరవ భైరవరూపేణ
ధునయ ధునయ కంపయ కంపయ విఘ్నయ విఘ్నయ విశ్వేశ్వర
క్షోభయ క్షోభయ కటుకటు మోహయ మోహయ హుం ఫట్
స్వాహా ఇతి మంత్రమాత్రేణ సమాభీష్టో భవతి ॥
॥ ఇతి శ్రీమార్కండేయపురాణే మార్కండేయకృత మహామృత్యుంజయస్తోత్రం
సంపూర్ణమ్ ॥
ARUDRA DHARSHANA MAHOSTSAVAMఆరుద్ర దర్శన మహోత్సవం
TAMARESWARI TEMPLE-తామరేశ్వరి ఆలయం
KUSHMANDA DEEPAM - కూష్మాండ దీపం
MANGALA GOURI TEMPLE-మంగళ గౌరీ దేవాలయం
RATHA SAPTAMI - రథసప్తమి
ఇది నిజమా..అంతా మూఢనమ్మకం..ఇలా హేతువాదులు సైతం కొట్టిపడేయలేని ఒక ఉత్సవం,.
మానవాళికి నిజమైన బ్రహ్మోత్సవం..ఆదిదేవుని ఈ సప్తరధోత్సవం..!
ఆదిదేవ నమస్తుభ్యం..
ప్రసీద మమభాస్కరం..
దివాకర నమస్తుభ్యం..
ప్రభాకర నమోస్తుతే..
ఇది మహామంత్రమే కాదు మానవాళి ఆరోగ్యసూత్రం. సూర్యుడు ఇవ్వని వరముందా. ఆయనను నమ్మితే కలవరముందా' తన కిరణమే, నీ ఆరోగ్యానికి శరణమై, క్రిమి కీటకాలతో రణమై, నీ ఇంట ఆనందాల తోరణమై..!
ఎక్కడి సూర్యుడు.. 14.98 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి ఆతడి కిరణం నిను చేరేది ఎనిమిది క్షణాల్లో.. తీక్షణాలో..నీ వీక్షణల్లో..ఆ కిరణ స్పర్శ కోసం ఎన్నెన్ని ప్రతీక్షణాలో..!
యుగసహస్ర యోజన పరభాను..సప్త వర్ణాల కలయిక రవి తేజస్సు..జగతికి ఉషస్సు...
ప్రభాకరుని సప్తరధాలు..ఏడు రంగుల ప్రతిరూపాలు..భాస్కరుని రథ ఇరుసులు
రేయికి..పగటికి ప్రతీక..చక్రాల ఆరు ఆకులు రుతువులకు..ధ్వజం ధర్మానికి గురుతులుగా..
ఆ సూర్యనారాయణుడు మానవాళికి గురుతుల్యుడుగా..!
ఇక్కడితో మొదలయ్యే వేసవి విజృంభించే రవి.. తిమిర సంహరుడై..రోగహరుడై..ఉదయ సంధ్యలో మనోహరుడై..అస్తమయ వేళ మరింత సుమనోహరుడై..మనోవాక్కాయజం యచ్చ
జ్ఞాతాజ్ఞాతే చ యే పునః సప్తవ్యాధి సమాయుక్తం పరమాకరి సప్తమీ..!
జ్ఞాన విజ్ఞాన మోక్షదం..మహాపాపహరం తంసూర్యం ప్రణమామ్యహం..!
మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. రథసప్తమి మహా తేజం. మన ఆథ్యాత్మిక గ్రంథాల ప్రకారం మొత్తం ద్వాదశ ఆదిత్యులు అనగా పన్నేండుగురు సూర్యులు.
సంవత్సరంలో ఒక్కో నెలకు ఒక్కో సూర్యుడు ప్రాధాన్యత వహిస్తాడు.
1. చైత్ర మాసంలో వచ్చే సూర్యుడి పేరు 'ధాత'
2. వైశాఖంలో అర్యముడు ,
3. జ్యేష్టం - మిత్రుడు ,
4. ఆషాఢం - వరుణుడు ,
5. శ్రావణంలో ఇంద్రుడు ,
6. భాద్రపదం - వివస్వంతుడు ,
7. ఆశ్వయుజం - త్వష్ణ ,
8. కార్తీకం - విష్ణువు ,
9. మార్గశిరం - అంశుమంతుడు ,
10. పుష్యం - భగుడు ,
11. మాఘం - పూషుడు ,
12. ఫాల్గుణం - పర్జజన్యుడు.
ఆ నెలల్లో సూర్యుడి తీక్షణతను బట్టి ఆ పేర్లు వచ్చాయని చెబుతారు.
భూమి నుంచి 14.98 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుని కిరణాల ప్రయాణ వేగం ఒక సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు. అవి భూమిని చేరడానికి పట్టే కాలాన్ని 8 నిమిషాలుగా అంచనా కట్టారు ఖగోళ శాస్త్రవేత్తలు. పురాణ కథనం ప్రకారం
బాల్యంలో హనుమంతుడు సూర్యుడిని ఎర్రమి తినేపండు అనుకుని తిందామనే ఉద్దేశంతో అక్కడికి ఎగిరి వెళ్లాడట. అందుకోసం హనుమ వెళ్లిన దూరాన్ని 'యుగ సహస్ర యోజన పరాభాను' అని తులసీదాస్ హనుమాన్ చాలీసాలో చెబుతారు.
దీన్ని లెక్క కడితే 'యుగం.. 12000 ఏళ్లు , సహస్రం 1000 , యోజనం 8 మైళ్లు , మైలు 1.6 కిలోమీటర్లు కలిపి దాదాపు 15 కోట్ల కిలోమీటర్లు. ఇది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్న 14.98 కోట్ల కిలోమీటర్లకు దాదాపు సరిపోతుంది. సూర్యకాంతి ఏడు వర్ణాల కలయిక అని వైజ్ఞానికులు చెబుతుంటే,
ఆయన ఏడు గుర్రాలున్న రథం మీద లోక సంచారం చేస్తాడని వేదవాజ్మయం చెబుతోంది.
రామ రావణ యుద్ధం సమయంలో అలసిపోయిన శ్రీరాముడికి అగస్త్య మహాముని 'ఆదిత్య హృదయం' ఉపదేశించినట్లు రామాయణంలో ఉంది. ఇందులో 30 శ్లోకాలున్నాయి. వీటి స్మరణ వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుందని చెబుతారు.
సూర్యుడి రథానికి ఉన్న ఇరుసు పగలు, రాత్రికి ప్రతీక అని, చక్రాలకున్న ఆరు ఆకులు రుతువులకు, ధ్వజం ధర్మానికి ప్రతీకలని పురాణాల్లో ఉంది. అందుకే సూర్యుడి జన్మదినాన్ని ఆయన పేరుతో కాకుండా రథ సప్తమి అని పిలుస్తారు.
ఈ రోజునుండి ఆదిత్యుని శక్తి భూమికి పుష్కలంగా లభిస్తుంది. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం సమృద్ధిగా లభిస్తాయి.
ఈ రోజు సూర్యోదయ స్నానంతో సప్త జన్మల పాపాలు నశించి, రోగము, శోకము వంటి ఇబ్బందులు తొలగుతాయి.
ఈ రోజున స్నానం చేసేటప్పుడు సూర్యనారాయణుని మనసారా ధ్యానించి తలపై జిల్లేడాకులు , రేగాకులు పెట్టుకొని స్నానం చేయాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది. జిల్లేడు ఆకునకు అర్కపత్రమని పేరు. సూర్యునికి "అర్కః" అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే ఎంతో ఇష్టం. ఏడు జిల్లేడు ఆకులు సప్తాశ్వములకు చిహ్నం మాత్రమే గాక, ఏడు జన్మల్లో చేసిన పాపములను, ఏడు రకములైన వ్యాధులను నశింపజేస్తాయి. ఈ రోజు ఉపవాసముండి సూర్యసంబంధమగు రథోత్సవాది కార్యక్రమములలో కాలక్షేపం చేయాలి. ఇట్లు రథసప్తమీ వ్రతముచే సూర్యభగవానుని అనుగ్రహముచే ఆయురారోగ్యాది సకల సంపదలు పొందుతారని పురాణప్రబోధము.
Numerology - Number 6 - న్యూమరాలజీ - 6వ సంఖ్య
న్యూమరాలజీ - 6వ సంఖ్య గ్రహము : శుక్రుడు జన్మదిన తేదీ సంఖ్య : 6, 15, 24 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 6, 15, 24 ఈ తేదీలలో పుట్ట...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ శ్రీ సరస్వతీ కవచం తోటకా...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః । ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...