Tuesday, December 31, 2024

VANDHANAMU RAGHUNANDHANA-వందనము రఘునందన

 వందనము రఘునందన

తాళం: ఆది

రాగం: శహన( మేళకర్త 28, హరి కాంభోజి  జన్యరాగ)

రూపకర్త: త్యాగరాజ


ఆరోహణ: స రి2 గ3 మ1 ప మ1 ద2 ని2 స

అవరోహణ: స ని2 ద2 ప మ1 గ3 మ1 రి2 గ3 రి2 


పల్లవి
వందనము రఘునందన - సేతు
బంధన భక్త చందన రామ

చరణము(లు)
శ్రీదమా నాతో వాదమా - నే
భేదమా ఇది మోదమా రామ

శ్రీరమా హృచ్చార మము బ్రోవ
భారమా రాయబారమా రామ

వింటిని నమ్ము కొంటిని శర
ణంటిని రమ్మంటిని రామ

ఓడను భక్తి వీడను నొరుల
వేడను జూడను రామ

కమ్మని విడె మిమ్మని వరము
కొమ్మని పలుక రమ్మని రామ

న్యాయమా నీ కాయమా ఇంక
హేయమా ముని గేయమా రామ

చూడుమీ గాపాడుమీ మమ్ము
పోడిమిగా (గూడుమీ రామ

క్షేమము దివ్య ధామము నిత్య
నీమము రామనామము రామ

వేగరా కరుణాసాగర శ్రీ
త్యాగరాజు హృదయాకర రామ

VANDHANAMU RAGHUNANDHANA-వందనము రఘునందన

వందనము రఘునందన

తాళం: ఆది

రాగం: శహన( మేళకర్త 28, హరి కాంభోజి  జన్యరాగ)

రూపకర్త: త్యాగరాజ


ఆరోహణ: స రి2 గ3 మ1 ప మ1 ద2 ని2 స

అవరోహణ: స ని2 ద2 ప మ1 గ3 మ1 రి2 గ3 రి2 


పల్లవి
వందనము రఘునందన - సేతు
బంధన భక్త చందన రామ

చరణము(లు)
శ్రీదమా నాతో వాదమా - నే
భేదమా ఇది మోదమా రామ

శ్రీరమా హృచ్చార మము బ్రోవ
భారమా రాయబారమా రామ

వింటిని నమ్ము కొంటిని శర
ణంటిని రమ్మంటిని రామ

ఓడను భక్తి వీడను నొరుల
వేడను జూడను రామ

కమ్మని విడె మిమ్మని వరము
కొమ్మని పలుక రమ్మని రామ

న్యాయమా నీ కాయమా ఇంక
హేయమా ముని గేయమా రామ

చూడుమీ గాపాడుమీ మమ్ము
పోడిమిగా (గూడుమీ రామ

క్షేమము దివ్య ధామము నిత్య
నీమము రామనామము రామ

వేగరా కరుణాసాగర శ్రీ
త్యాగరాజు హృదయాకర రామ

MARUGELARA O RAGHAVA మరుగేలరా ఓ రాఘవా!

 మరుగేలరా ఓ రాఘవా!


తాళం: దేశాధి 

రాగం: జయంతశ్రీ  (మేళకర్త 20, నట భైరవి   జన్యరాగ)

రూపకర్త: త్యాగరాజ

ఆరోహణ: స గ2 మ1 ద1 ని2 స      

అవరోహణ: స ని2 ద1 మ1 ప మ1 గ2 స


పల్లవి

మరుగేలరా ఓ రాఘవా!


అనుపల్లవి
మరుగేల - చరా చర రూప
పరాత్పర సూర్య సుధాకర లోచన

చరణం
అన్ని నీ వనుచు అంతరంగమున
తిన్నగా వెదకి తెలుసుకొంటి నయ్య
నెన్నె గాని మదిని ఎన్నజాల నొరుల
నన్ను బ్రోవవయ్య త్యాగ రాజనుత

DUDUKU GALA దుడుకు గల నన్నే దొర

దుడుకు గల నన్నే దొర


తాళం: ఆది

రాగం: గౌళ (మేళకర్త 15, మాయామాళవ గౌళ జన్యరాగ)

రూపకర్త: త్యాగరాజ

ఆరోహణ: స రి1 మ1 ప ని3 స      

అవరోహణ: స ని3 ప మ1 రి1 గ3 మ1 రి1


పల్లవి

దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో

అనుపల్లవి
కడు దుర్విషయాకృశ్టుడై గడియ గడియకు నిండారు

చరణం
శ్రీ వనితా హృత్కుముదాబ్జ వాంగ్మానసాగోచర || 1 || 

సకల భూతముల యందు నీవై యుండగ మదిలేక పోయిన || 2 || 

చిరుత ప్రాయమున నాడే భజనామృత రసవిహీన కుతర్కుడైన || 3 || 

పర ధనముల కొరకు నొరుల మదిని
కరగబలికి కడుపు నింప దిరిగినట్టి || 4 || 

తనమదిని భువిని సౌఖ్యపు జీవనమే
యనుచు సదా దినములు గడిపెడి || 5 || 

తెలియని నటవిట క్షుద్రులు వనితలు స్వవశమౌట కుపదశించి
సంతసిల్లి స్వరలయంబు లెరుంగకను శిలాత్ముడై
సుభక్తులకు సమానమను || 6 || 

దృష్టికి సారంబగు లలనా సదనార్భక సేనామిత ధనాదులను
దేవాది దేవ నెరనమ్మితిని గాకను పదాబ్జ భజనంబు మరచిన || 7 || 

చక్కని ముఖ కమలంబునను సదా నా మదిలో స్మరణ లేకనే
దుర్మదాంధ జనుల కోరి పరితాపములచే దగిలి నొగిలి దుర్విషయ
దురాశలను రోయలేక సతత మపరాధినై చపల చిత్తుడైన || 8 || 

మానవతను దుర్లభ మనుచు నెంచి పరమానంద మొందలేక
మద మత్సర కామ లోభ మోహములకు దాసుడై మోసబోతి గాక
మొదటి కులజుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచునుంటిని గాక
నారాధములను రోయ సారహీన మతములను సాధింప తారుమారు || 9 || 

సతులకై కొన్నాల్లాస్థికై సుతులకై కొన్నాల్లు
ధన తతులకై తిరిగితి నయ్య త్యాగరాజాప్త ఇటువంటి
దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎంతో || 10 || 

BANTU REETHI KOLUVU బంటు రీతి కొలువీయ వయ్య రామ

 బంటు రీతి కొలువీయ వయ్య రామ

తాళం: దేశాది

రాగం: హంసనాధం మేళకర్త 60, నీతిమతి  జన్యరాగ)

రూపకర్త: త్యాగరాజ


ఆరోహణ: స రి2 మ2 ప ని3 స 

అవరోహణ: స ని3 ప మ2 రి2 స  



పల్లవి
బంటు రీతి కొలువీయ వయ్య రామ

అను పల్లవి
తుంట వింటి వాని మొదలైన
మదాదుల బట్టి నేల కూలజేయు నిజ

చరణము
రోమాంచమనే, ఘన కంచుకము
రామ భక్తుడనే, ముద్రబిల్లయు
రామ నామమనే, వర ఖఢ్గమి
విరాజిల్లునయ్య, త్యాగరాజునికే

BROVA BHARAMA బ్రోవ భారమా, రఘు రామ

బ్రోవ భారమా, రఘు రామ

తాళం: దేశాధి    

రాగం: బహుధారి  మేళకర్త 28, హరి కాంభోజి   జన్యరాగ)

రూపకర్త: త్యాగరాజ

ఆరోహణ: స గ3 మ1 ప ద2 ని2 స 

అవరోహణ: స ని2 ప మ1 3 స  

పల్లవి
బ్రోవ భారమా, రఘు రామ
భువనమెల్ల నేవై, నన్నొకని

అనుపల్లవి
శ్రీ వాసుదేవ! అండ కోట్ల
కుక్షిని ఉంచుకోలేదా, నన్ను

చరణం
కలశాంబుధిలో దయతో
అమరులకై, అది గాక

గోపికలకై కొండలెత్త లేదా
కరుణాకర, త్యాగరాజుని

PARAMATMUDU VELIGE - పరమాత్ముడు వెలిగే

పరమాత్ముడు వెలిగే

తాళం: ఆది,
రాగం: వాగధీశ్వరీమేళకర్త 34, -  జన్యరాగ)
రూపకర్త: త్యాగరాజ
ఆరోహణ: స రి3 గ3 మ1 ప ద2 ని2 స
అవరోహణ: స ని2 ద2 ప మ1 గ3 రి3 
పల్లవి
పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగ తెలుసుకోరే
అనుపల్లవి
హరియట హరుడట సురులట నరులట
అఖిలాండ కోటులటయందరిలో (పరమ)

చరణము(లు)
గగనాఅనిల తేజో-జల భూ-మయమగు
మృగ ఖగ నగ తరు కోటులలో
సగుణములో విగుణములో సతతము
సాధు త్యాగరాజాదియాశ్రితులలో (పరమ)

Sri Gayatri Sahasra Nama Stotram - శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్

శ్రీ గాయత్రి సహస్ర నామ స్తోత్రమ్ నారద ఉవాచ: భగవన్సర్వధర్మజ్ఞ సర్వశాస్త్రవిశారద । శ్రుతిస్మృతిపురాణానాం రహస్యం త్వన్ముఖాచ్ఛ్రుతమ్ ॥ 01 ॥ సర...