Sunday, September 7, 2025

Sri Bhuvaneswari Hrudhaya Stottram - శ్రీభువనేశ్వరీ హృదయ స్తోత్త్రం

శ్రీభువనేశ్వరీ హృదయ స్తోత్త్రం

దేవ్యువాచ:
భగవాన్‌ బ్రూహితత్త్సోత్రం సర్వకామ ప్రసాదనమ్‌ ।
యస్య శ్రవణ మాత్రేణ నాన్యచ్రోతమ్యమిష్యతే ॥

యదిమేఽను గ్రహఃకార్యః ప్రీతిశ్చాపి మమోపరి 

తదిదం కథయ బ్రహ్మాన్‌ విమలం యన్మహీతలే ॥

ఈశ్వర ఉవాచ:
శృణుదేవి ప్రవక్ష్యామి సర్వకామ ప్రసాధనమ్‌ ।
హృదయం భువనేశ్వర్యాః స్తోత్రమస్తి యశోప్రదమ్‌ ॥

ఓం అస్య శ్రీభువనేశ్వరీ హృదయ స్తోత్ర మంత్రస్య శక్తి బుషి,
గాయత్రీ చ్ఛందః, భువనేశ్వరీ దేవతా, కారో బీజం కారః శక్తిః
రే ఫ కీలకం, సకల మనోవాంఛిత సిద్ధ్యర్ధే పాఠే వినియోగః.

ఓం హ్రీం హృదయాయ నమః,
ఓం శ్రీం శిరసే స్వాహా,
ఓం ఐం శిఖాయై వషట్‌,
ఓం హ్రీం కవచాయ హుం,
ఓం శ్రీం నేత్రత్రయా యౌషట్‌,
ఓం ఐం అస్త్రాయ ఫట్‌ - 
ఇతి హృదయాదిన్యాసః - 
ఏవం కరన్యాసః

ధ్యానమ్‌:
ధ్యాయేద్బ్రహ్మాదికానాం కృతజని జననీం యోగినీం యోగయోనిమ్‌।
దేవీనాం జీవనాయోజ్జ్వలిత జయపరజ్యోతిరూగ్రహాం గధాత్రీమ్‌ ॥

శంఖం చక్రం చ బాణం ధనురపి దధతీం దోశ్చతుష్కాంబుజాతైః
మాయామాద్యాం విశిష్టాంభవ భవభువనాం భూభువా భార భూమిమ్‌ ॥

యదాజ్ఞయేదం గగనాద్యశేషం సృజత్యజః శ్రీపతిరౌరసంవా ।
బిభర్తి సంహతి భవస్తదంతే భజామహే శ్రీ భువనేశ్వరీం తాం॥ 01 ॥

జగజ్జనానందకరీం జయాభ్యాం యశస్వినీం యంత్ర సుయజ్ఞయోనిం ।
జితామితా మిత్ర కృత ప్రపంచాం భజాం ॥ 02 ॥

హరౌప్రసుప్తే భువనత్రయాంతే అవాతరన్నాభిజ పద్మజన్మా ।
విధిస్తతోన్థే విదధార యత్పదం భజాం ॥ 03 ॥

న విద్యతేక్వాపి తుజన్మయస్యానవా స్థితిః శాంతతి కేహ యస్యాః ।
నవానిరోథే
ఖీల కర్మయస్యా భజాం ॥ 04 ॥

కటాక్ష మోక్షాచరణోగ్రచిత్తా నివేశితార్ణా కరుణార్ద్ర చిత్తా 

సుభయేహ్యేతి సమీప్పితంయా భజాం ॥ 05 ॥

యతో జగజ్జన్మ బభూవ యోనేస్తదేవ మధ్యే ప్రతిపాతియావా ।
తదత్తి యాంతో
ఖిలముగ్ర కాళీ భజాం ॥ 06 ॥

సుషుప్తికాలే జనమధ్యయంత్వా యయాజనః స్వప్నమవైతి కించిత్‌ ।
ప్రబుద్ధయతే జాగ్రతి జీవ ఏషభజాం ॥ 07 ॥

దయాస్ఫురత్కోర కటాక్ష లాభాన్నైకత్ర యస్యాః ఫలభంతి సిద్దాః 

కవిత్వమీశిత్వ మపి స్వతంత్రా భజాం ॥ 08 ॥

లసన్ముఖాంభోరూహముస్ఫురంతే హృదిప్రణిధ్యాయ దిశి స్ఫురంతః।
యస్యాః కృపార్ద్రం ప్రవికాశయంతి భజాం ॥ 09 ॥

యదానురాగాను గతాలి చిత్రాశ్చిరంతన ప్రేమపరీప్లుతాంగాః 

సునిర్భయాః సంతి ప్రమాద్య యస్యాః భజాం ॥ 10 ॥

హరిర్విరించిః హరఈశితారః పురో
వతిష్ఠంతి ప్రపన్నభృంగాః ।
యస్యాః సమిచ్చంతి సదానుకూల్యం భజాం ॥ 11 ॥

మనుం యదీయం హరమగ్ని సంస్థం తతశ్చ వావశృతి చందసక్తమ్‌ ।
జపంతి యేస్యుర్హి సువందితాస్తే భజాం ॥ 12 ॥

ప్రసీదతు ప్రేమరసా
ర్ద్ర చిత్తా సదాహి సా శ్రీ భువనేశ్వరీమ్‌ ।
కృపాకటాక్షేణ కుబేరకల్పా భవంతి యస్యాః పదభక్తి భాజః ॥ 13 ॥

ముదా సుపాఠ్యం భువనేశ్వరీయంసదాసతాం స్తోత్రమిదం సుసేవ్యం 

సుఖప్రదం స్కాత్కలికల్మషన్నం సుశృణ్వతాం సంపఠతాం ప్రశస్త్యమ్‌ ॥ 14 ॥

ఏతాత్తు హృదయం స్తోత్రం పఠేద్యస్తు సమాహితః ।
భవేత్తస్యేష్టదా దేవిప్రసన్నా భువనేశ్వరీ ॥ 15 ॥

దదాతి ధనమాయుష్యం పుణ్యం పుణ్యమతింతథా ।
నైష్ఠికీం దైవభక్తిం చ గురుభక్తిం విశేషతః ॥ 16 ॥

పూర్ణిమాయాం చతుర్దశ్యాం కుజవారే విశేషతః ।
పఠనీయమిదం స్తోత్రం దేవసద్మని యత్నతః ॥ 17 ॥

యత్రకుత్రాపి పాఠేన స్తోత్రస్యాస్యఫలం భవేత్‌ 

సర్వస్థానేషు దేవేశ్యాః పూతదేహః సదా పఠేత్‌ ॥ 18 ॥

॥ ఇతి నీల సరస్వతీ తంత్రే భువనేశ్వరీ పటలే శ్రీ దేవేశ్వర సంవాదే
 
శ్రీ భువనేశ్వరీ దేవి హృదయస్తోత్రం సమాప్తం 

Sri Bhuvaneshvaree Panjara Stottram - శ్రీభువనేశ్వరీ పంజర స్తోత్త్రం

శ్రీభువనేశ్వరీ పంజర స్తోత్త్రం

ఇదం శ్రీ భువనేశ్వర్యాః పంజరం భువి దుర్లభం ।
యేన సంరక్షితో మర్త్యో వాణైః శస్త్రైర్న బాధ్యతే ॥ 01 ॥

జ్వరమారీపశువ్యాఘ్రకృత్యాచౌరాద్యుపద్రవైః 

నద్యంబుధరణీవిద్యుత్కృశానుభుజగారిభిః ॥ 02 ॥

సౌభాగ్యారోగ్యసంపత్తికీర్తికాంతియశో
ర్థదం ॥ 03 ॥

ఓం క్రోం శ్రీంహ్రీంఐం సౌః పూర్వే
ధిష్ఠాయ
మాం పాహి చక్రిణి భువనేశ్వరి ।

యోగవిద్యే మహామాయే యోగినీగణసేవితే ।
కృష్ణవర్ణే మహద్భూతే బృహత్కర్ణే భయంకరి ॥

దేవదేవి! మహాదేవి! మమ శత్రూన్‌ వినాశయ ।
ఉత్తిష్ఠ పురుషే కిం స్వపిషి భయం మేం సముపస్థితం ॥

యది శక్యమశక్యం తన్మే భగవతి! శమయ స్వాహా ।
త్రైలోక్యమోహిన్యై విద్మహే విశ్వజనన్యై ధీమహి
తన్నః శక్తిః ప్రచోదయాత్‌ ॥ 01 ॥

మమాగ్నేయాం స్థితా పాహి గదినీభువనేశ్వరి 

యోగవిద్యే మహామాయే యోగినీగణసేవితే ॥

కృష్ణవర్ణే మహద్భూతే లంబక
ర్ణే భయంకరి ।
దేవదేవి! మహాదేవి! మమ శత్రున్‌ వినాశయ ।
ఉత్తి
ష్ఠ పురుషే కిం స్వపిషి భయం మేం సముపస్థితం 
యది శక్యమశక్యం వా తన్మే భగవతి శమయ స్వాహా ॥

త్రైలోక్యమోహి
న్యై విద్మహే విశ్వజనన్యై ధీమహి
తన్నః శక్తిః ప్రచోదయాత్‌ ॥ 02 ॥

యామ్యే
ధిష్ఠాయ మాం పాహి శంఖినీభువనేశ్వరి 
యోగవిద్యే మహామాయే యోగినీగణసేవితే ॥

కృష్ణవర్ణే మహద్భూతే లంబక
ర్ణే భయంకరి ।
దేవదేవి! మహాదేవి! మమ శత్రున్‌ వినాశయ ।

ఉత్తి
ష్ఠ పురుషే కిం స్వపిషి భయం మేం సముపస్థితం 
యది శక్యమశక్యం వా తన్మే భగవతి శమయ స్వాహా ॥

త్రైలోక్యమోహి
న్యై విద్మహే విశ్వజనన్యై ధీమహి
తన్నః శక్తిః ప్రచోదయాత్‌ ॥ 03 ॥

నైరృత్యే మాం స్థితా పాహి ఖడ్గినీభువనేశ్వరి 

యోగవిద్యే మహామాయే యోగినీగణసేవితే ॥

కృష్ణవర్ణే మహద్భూతే లంబక
ర్ణే భయంకరి ।
దేవదేవి! మహాదేవి! మమ శత్రున్‌ వినాశయ ।

ఉత్తి
ష్ఠ పురుషే కిం స్వపిషి భయం మేం సముపస్థితం
యది శక్యమశక్యం వా తన్మే భగవతి శమయ స్వాహా ॥

త్రైలోక్యమోహిన్యై విద్మహే విశ్వజనన్యై ధీమహి
తన్నః శక్తిః ప్రచోదయాత్‌ ॥ 04 ॥

పశ్చిమే మాం స్థితా పాహి పాశినీభువనేశ్వరి 

యోగవిద్యే మహామాయే యోగినీగణసేవితే ॥

కృష్ణవర్ణే మహద్భూతే లంబక
ర్ణే భయంకరి ।
దేవదేవి! మహాదేవి! మమ శత్రున్‌ వినాశయ ।

ఉత్తి
ష్ఠ పురుషే కిం స్వపిషి భయం మేం సముపస్థితం 
యది శక్యమశక్యం వా తన్మే భగవతి శమయ స్వాహా ॥

త్రైలోక్యమోహిన్యై విద్మహే విశ్వజనన్యై ధీమహి
తన్నః శక్తిః ప్రచోదయాత్‌ ॥ 05 ॥

వాయవ్యే మాం స్థితా పాహి శక్తినీభువనేశ్వరి 

యోగవిద్యే మహామాయే యోగినీగణసేవితే ॥

కృష్ణవర్ణే మహద్భూతే లంబక
ర్ణే భయంకరి ।
దేవదేవి! మహాదేవి! మమ శత్రున్‌ వినాశయ ।

ఉత్తి
ష్ఠ పురుషే కిం స్వపిషి భయం మేం సముపస్థితం 
యది శక్యమశక్యం వా తన్మే భగవతి శమయ స్వాహా ॥

త్రైలోక్యమోహిన్యై విద్మహే విశ్వజనన్యై ధీమహి
తన్నః శక్తిః ప్రచోదయాత్‌ ॥ 06 ॥

సౌమ్యే
ధిష్ఠాయ మాం పాహి చాపినీభువనేశ్వరి 
యోగవిద్యే మహామాయే యోగినీగణసేవితే ॥

కృష్ణవర్ణే మహద్భూతే లంబక
ర్ణే భయంకరి ।
దేవదేవి! మహాదేవి! మమ శత్రున్‌ వినాశయ ।

ఉత్తి
ష్ఠ పురుషే కిం స్వపిషి భయం మేం సముపస్థితం 
యది శక్యమశక్యం వా తన్మే భగవతి శమయ స్వాహా ॥

త్రైలోక్యమోహిన్యై విద్మహే విశ్వజనన్యై ధీమహి
తన్నః శక్తిః ప్రచోదయాత్‌ ॥ 07 ॥

ఈశే
ధిష్ఠాయ మాం పాహి శూలినీభువనేశ్వరి 
యోగవిద్యే మహామాయే యోగినీగణసేవితే ॥

కృష్ణవర్ణే మహద్భూతే లంబక
ర్ణే భయంకరి ।
దేవదేవి! మహాదేవి! మమ శత్రున్‌ వినాశయ ।

ఉత్తి
ష్ఠ పురుషే కిం స్వపిషి భయం మేం సముపస్థితం 
యది శక్యమశక్యం వా తన్మే భగవతి శమయ స్వాహా ॥

త్రైలోక్యమోహిన్యై విద్మహే విశ్వజనన్యై ధీమహి
తన్నః శక్తిః ప్రచోదయాత్‌ ॥ 08 ॥

ఊర్థ్వే
ధిష్ఠా మాం పాహి పద్మినీభువనేశ్వరి 
యోగవిద్యే మహామాయే యోగినీగణసేవితే ॥

కృష్ణవర్ణే మహద్భూతే లంబక
ర్ణే భయంకరి ।
దేవదేవి! మహాదేవి! మమ శత్రున్‌ వినాశయ ।

ఉత్తి
ష్ఠ పురుషే కిం స్వపిషి భయం మేం సముపస్థితం 
యది శక్యమశక్యం వా తన్మే భగవతి శమయ స్వాహా ॥

త్రైలోక్యమోహిన్యై విద్మహే విశ్వజనన్యై ధీమహి
తన్నః శక్తిః ప్రచోదయాత్‌ ॥ 09 ॥

అధస్తాన్మాం స్థితా పాహి వాణినీభువనేశ్వరి 

యోగవిద్యే మహామాయే యోగినీగణసేవితే ॥

కృష్ణవర్ణే మహద్భూతే లంబక
ర్ణే భయంకరి ।
దేవదేవి! మహాదేవి! మమ శత్రున్‌ వినాశయ ।

ఉత్తి
ష్ఠ పురుషే కిం స్వపిషి భయం మేం సముపస్థితం 
యది శక్యమశక్యం వా తన్మే భగవతి శమయ స్వాహా ॥

త్రైలోక్యమోహిన్యై విద్మహే విశ్వజనన్యై ధీమహి
తన్నః శక్తిః ప్రచోదయాత్‌ ॥ 10 ॥

అగ్రతో మాం సదా పాహి సాంకుశే భువనేశ్వరి ।
యోగవిద్యే మహామాయే యోగినీగణసేవితే

కృష్ణవర్ణే మహద్భూతే లంబక
ర్ణే భయంకరి ।
దేవదేవి! మహాదేవి! మమ శత్రున్‌ వినాశయ ।

ఉత్తి
ష్ఠ పురుషే కిం స్వపిషి భయం మేం సముపస్థితం 
యది శక్యమశక్యం వా తన్మే భగవతి శమయ స్వాహా ॥

త్రైలోక్యమోహిన్యై విద్మహే విశ్వజనన్యై ధీమహి
తన్నః శక్తిః ప్రచోదయాత్‌ ॥ 11 ॥

పృ
ష్ఠతో మాం స్థితా పాహి వరదే భువనేశ్వరి 
యోగవిద్యే మహామాయే యోగినీగణసేవితే ॥

కృష్ణవర్ణే మహద్భూతే లంబక
ర్ణే భయంకరి ।
దేవదేవి! మహాదేవి! మమ శత్రున్‌ వినాశయ ।

ఉత్తి
ష్ఠ పురుషే కిం స్వపిషి భయం మేం సముపస్థితం 
యది శక్యమశక్యం వా తన్మే భగవతి శమయ స్వాహా ॥

త్రైలోక్యమోహిన్యై విద్మహే విశ్వజనన్యై ధీమహి
తన్నః శక్తిః ప్రచోదయాత్‌ ॥ 12 ॥

సర్వతో మాం సదా పాహి సాయుధే భువనేశ్వరి 

యోగవిద్యే మహామాయే యోగినీగణసేవితే ॥

కృష్ణవర్ణే మహద్భూతే లంబక
ర్ణే భయంకరి ।
దేవదేవి! మహాదేవి! మమ శత్రున్‌ వినాశయ ।

ఉత్తి
ష్ఠ పురుషే కిం స్వపిషి భయం మేం సముపస్థితం 
యది శక్యమశక్యం వా తన్మే భగవతి శమయ స్వాహా ॥

త్రైలోక్యమోహిన్యై విద్మహే విశ్వజనన్యై ధీమహి
తన్నః శక్తిః ప్రచోదయాత్‌ ॥ 13 ॥

ఫలశ్రుతిః
ప్రోక్తా ద్మినవో దేవి! చతుర్దశ శుభప్రదాః

ఏతత్‌ పంజరమాఖ్యాతం సర్వరక్షాకరం నృణాం ॥

గోపనీయం ప్రయత్నేన స్వయోనిరివ పార్వతి ।
న భక్తాయ ప్రదాతవ్యం నాశిష్యాయ కదాచన ॥

సిద్ధికామో మహాదేవి! గోపయేన్మాతృజారవత్‌ ।
భయకాలే హోమకాలే పూజాకాలే విశేషతః ॥

దీపస్యారంభకాలే వై యః కుర్యాత్‌ పంజరం సుధీః 

సర్వాన్‌ కామానవాప్నోతి ప్రత్యూహైర్నాభిభూయతే ॥

రణే రాజకులే ద్యూతే సర్వత్ర విజయీ భవేత్‌ 

కృత్యారోగపిశాచాద్యైర్న కదాచిత్‌ ప్రబాధ్యతే ॥

ప్రాతఃకాలే చ మధ్యాహ్నే సంధ్యాయామర్ధరాత్రకే ।
యః కుర్యాత్‌ పంజరం మర్త్యో దేవీం ధ్యాత్వా సమాహితః ॥

కాలమృత్యుమపి ప్రాప్తం జయేదత్ర న సంశయః ।
బ్రహ్మాస్త్రాదీని శస్త్రాణి తద్గాత్రం న లగంతి చ ॥

పుత్రవాన్‌ ధనవా
ల్లోకే యశస్వీ జాయతే నరః ॥

Sri Bhuvaneswari Dyanam - శ్రీ భువనేశ్వరీ ధ్యానం

శ్రీ భువనేశ్వరీ ధ్యానం

ఉద్యదినద్యుతిమిందుకిరీటాం తుంగకుచాం నయనత్రయయక్తాం 

స్మేరముఖీం వరదాంకుశపాశాభీతికరాం ప్రభజే భువనేశ్వరీం 
॥ 01 ॥ 

సిందూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌలిస్ఫురత్‌
తారానాయకశేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం ।
పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం వందే పరామంబికాం ॥ 02 

Sri Bhuvanesvaree stottram Maha Stottram - వేదగర్భం శ్రీభువనేశ్వరీ స్తోత్త్రం అథవా శ్రీభువనేశ్వరీమహాస్తోత్రం

వేదగర్భం శ్రీభువనేశ్వరీ స్తోత్త్రం (అథవా శ్రీభువనేశ్వరీమహాస్తోత్రం)

శ్రీగణేశాయ నమః ॥

ధ్యానం
ఓం చంచ
న్మౌక్తికహేమమండనయుతా మాతాతిరక్తాంబరా
తన్వంగీ నయనత్రయాతిరుచిరా బాలార్కవద్భాసురా ।

యా దివ్యాంకుశపాశభూషితకరా దేవీ సదా భీతిహా
చిత్తస్థా భువనేశ్వరీ భవతు నః సేయం ముదః సర్వదా ॥

కర్ణస్వర్ణవిలోలకుడలధరామాపీనవక్షోరుహాం
ముక్తాహారవిభూషణాం పరిలసద్ధమ్మిల్లసన్మల్లికాం ।
లీలాలోలితలోచనాం శశిముఖీమాబద్ధకాంచీస్రజం
దీవ్యంతీం భువనేశ్వరీమనుదినం వందామహే మాతరం ॥

ఐందవ్యా కలయావతంసితశిరోవిస్తారినాదాత్మకం
తద్రూపం జనని స్మరామి పరమం సన్మాత్రమేకం తవ ।
యత్రోదేతి పరాభిధా భగవతీ భాసాం హి తాసాం పదం
పశ్యంతీ తనుమధ్యమా విహరతి స్వైరం చ సా వైఖరీ ॥ 01 ॥

ఆదిక్షాంతవిలాసలాలసతయా తాసాం తురీయా తు యా
క్రోడీకృత్య జగత్త్రయం విజయతే వేదాదివిద్యామయీ ।
తాం వాచం మయి సంప్రసాదయ సుధాకల్లోలకోలాహల-
క్రీడాకర్ణనవర్ణనీయకవితాసామ్రాజ్యసిద్ధిప్రదాం ॥ 02 ॥

కల్పాదౌ కమలాసనో
 పి కలయా విద్ధః కయాచిత్కిల
త్వాం ధ్యాత్వాంకురయాంచకార చతురో వేదాంశ్చ విద్యాశ్చ తాః ।
తన్మాతర్లలితే ప్రసీద సరలం సారస్వతం దేహి మే
యస్యామోదముదీరయంతి పులకైరంతర్గతా దేవతాః ॥ 03 ॥

మాతర్దేహభృతామహో ధృతిమయీ నాదైకరేఖామయీ
సా త్వం ప్రాణమయీ హుతాశనమయీ బిందుప్రతిష్టామయీ ।
తేన త్వాం భువనేశ్వరీం విజయినీం ధ్యాయామి జాయాం విభో-
స్త్వత్కారుణ్యవికాశిపుణ్యమతయః ఖేలంతు మే సూక్తయః ॥ 04 ॥

త్వామశ్వత్థదలానుకారమధురామాధారబద్దోదరాం
సంసేవే భువనేశ్వరీమనుదినం వాగ్దేవతామేవ తాం ।
తన్మే శారదకౌముదీపరిచయోదంచత్సుధాసాగర-
స్వైరోజ్జాగరవీచివిభ్రమజితో దీవ్యంతు దివ్యా గిరః ॥ 05 ॥

లేఖప్రస్తుతవేద్యవస్తుసురభిశ్రీపుస్తకోత్తంసితో
మాతః స్వస్తికృదస్తు మే తవ కరో వామో
భిరామః శ్రియా ।
సద్యో విద్రుమకందలీసరలతాసందోహసాంద్రాంగులిర్ముద్రాం
బోధమయీం దధత్తదపరో
ప్యాస్తామపాస్తభ్రమః ॥ 06 ॥

మాతః పాతకజాలమూలదలనక్రీడాకఠోరా దృశః
కారుణ్యామృతకోమలాస్తవ మయి స్ఫూర్జంతు సిద్ధ్యర్జితాః 

ఆభిః స్వాభిమతప్రబంధలహరీసాకూతకౌతూహలా
 -
చాంతస్వాంతచతుర్ముఖోచితగుణోద్గారాం కరిష్యే గిరం ॥ 07 ॥

త్వామాధారచతుర్దలాంబుజగతాం వాగ్బీజగర్భే యజే
ప్రత్యావృత్తిభిరాదిభీః కుసుమితాం మాయాలతామున్నతాం ।
చూడామూలపవిత్రపత్రకమలప్రేంఖోలఖేలత్యుధా-
కల్లోలాసు కుచక్రచంక్రమచమత్కారైకలోకోత్తరాం ॥ 08 ॥

సోఽహం త్వత్కరుణాకటాక్షశరణ: పంచాధ్వసంచారతః
ప్రత్యాహృత్య మనో వసామి రసనాలింగం మమాలింగతు ।
శ్రీ సర్వజ్ఞవిభూషణీకృతకలానిఃస్యంద్రమానామృత-
స్వచ్చందస్ఫటికాద్రిసాంద్రితపయః శోభావతీ భారతీ ॥ 09 ॥

మాతర్మాతృకయా విదర్భితమిదం గర్భీకృతానాహత-
స్వచ్చంద్రధ్వనిపేయమధ్వనిరతం చంద్రార్కనిద్రాగిరౌ ।
సంసేవే విపరీతరీతిరచనోచ్చారాదకారావధి-
స్వాధీనామృతసింధుబంధురమహో మాయామయం తే మహః ॥ 10 ॥

తస్మాన్నందనచారుచందనతరుచ్చాయాసు పుప్పాసవ-
స్వైరాస్వాదనమోదమానమనసాముద్దామవామభ్రువాం ।
వీణాసంగితరంగితస్వరచమత్కారోఽపి సారోజితో
యేన స్యాదిహ దేహి మే తదభితః సంచారి సారస్వతం ॥ 11 ॥

ఆధారే హృదయే శిఖాపరిసరే సంధాయ మేధామయీం
త్రేధాభీజతనూమనూనకరుణాపీయూషకల్లోలినీం ।
త్వాం మాతర్జపతో నిరంకుశనిజాద్వైతామృతాస్వాదన -
ప్రజ్ఞాంభశ్చులుకైః స్ఫురంతు పులకైరంగాని తుంగాని మే ॥ 12 ॥

వాణీబీజమిదం జపామి పరమం తత్కామరాజాభిధం
మాతః సాంతపరం విసర్గసహితౌకారోత్తరం తేన మే ।
దీర్ఘాందోలితమౌలికీలితమణిప్రారబ్ధనీరాజనైధీరైః
పీతరసా నిరంతరమసౌ వాగ్జృభతామద్భుతా ॥ 13 ॥

చూడాచంద్రకలానిరతరగలత్పీయూషబిందుశ్రియా
సందేహోచితమక్షసూత్రవలయం యా బిభ్రతీ నిర్భరం ।
అంతర్మంత్రమయం స్వమేవ జపసి ప్రత్యక్షవృత్త్యక్షరం
సా త్వం దక్షిణపాణినాంబ వితర శ్రేయాంసి భూయాంసి మే ॥ 14 ॥

బద్ద్వా స్వస్తికమాసనం సితరుచిచ్చేదావదాతచ్చవి-
శ్రేణిశ్రీసుభగం భవిష్ణుసతతవ్యాజృంభమాణేఽమ్చుజే ।
దీవ్యంతీమధివామజాను రుచిరన్యస్తేన హస్తేన తాం
నిత్యం పుస్తకధారణప్రణయినీం సేవే గిరామీశ్వరీం ॥ 15 ॥

తన్మే విశ్వపథీనపీనవిలసన్నిఃసీమసారస్వత-
స్రోతోవీచివిచిత్రభంగిసుభగా విభ్రాజతాం భారతీ ।
యామాకర్ణ్య విఘూర్ణమానమనసః ప్రేంఖోలితైమీలిభి-
ర్మీలద్భిర్నయనాంచలైః సుమనసో నిందేయురిందోః కలాం ॥ 16 ॥

ఆదౌ వాగ్భవమిందుబిందుమధురం ఝాంతే చ కామాత్మకం
యోగాంతే కషయోస్తృతీయమితి తే బీజత్రయం ధ్యాయతాం ।
సార్ధం మాతృకయా విలోమవిషమం సంధాయ బంధచ్చిదా
వాచాంతర్గతయా మహేశ్వరి మయా మాత్రాశతం జప్యతే ॥ 17 ॥

తత్సారస్వతసార్వభౌమపదవీ సద్యో మమ ద్యోతతాం
యత్రాజ్ఞావిహితైర్మహాకవిశతైః స్ఫీతాం గిరం చుంబతాం ।
చైత్రోన్మీలితకేలికోకిలకుహూకారావతారంచిత-
శ్లాఘాసంచితపంచమశ్రుతిసమాహారోఽపి భారోపమః ॥ 18 ॥

వాగ్బీజం భువనేశ్వరీం వద వదేత్యుచ్చార్య వాగ్వాదిని
స్వాహావర్ణవిశీర్ణపాతకభరాం ధ్యాయామి నిత్యాం గిరం ।
వీణాపుస్తకమక్షసూత్రవలయం వ్యాజృంభమంభోరుహం
బిభ్రాణామరుణాశుభీః కరతలైరావిర్భవద్విభ్రమాం ॥ 19 ॥

తం మాతః కృపయా తరంగయతరాం విద్యాధిపత్యం మయి
జ్యోత్స్నాసౌరభచౌరకీర్తికవితాసేవ్యైకసింహాసనం ।
కాలాజ్ఞాదిశివావసానభవనప్రాగ్భారకుక్షింభరి
ప్రజ్ఞాంభఃపరిపాకపీవరపరానందప్రతిష్ఠాస్పదం ॥ 20 ॥

లేఖాభిస్తుహినద్యుతేరివ కృతం వాగ్బీజముచ్చైః స్ఫుర-
త్తారాకారకరాలబిందు పరితో మాయాత్రిధాఽఽవేష్టితం ।
పూర్ణేందోరుదరే తదేతదఖిలం పీయూషగౌరాక్షరం
స్రోతఃసంభ్రమసంభృతం స్మరతి యో జిహ్వాంచలే నిశ్చలః ॥ 21 ॥

తస్య త్వత్కరుణాకటాక్షకణికాసంక్రాంతిమాత్రాదపి
స్వాంతే శాంతిముపైతి దీర్ఘజడతా జాగ్రద్వికారాగ్రణీః ।
తస్మాదాశు జగత్త్రయాద్భుతరసాద్వైతప్రతీతిప్రదం
సౌరభ్యం పరమభ్యుదేతి వ వనాంభోజే గిరాం విభ్రమైః ॥ 22 ॥

అద్యో మౌలిరథాపరో ముఖమిఈ నేత్రే చ కర్ణావుఊ
నాసావంశపుటే ఋౠ తదనుజౌ వర్ణౌ కపోలద్వయం ।
దంతాశ్చోర్ధ్యమధస్తథోష్ఠయుగలం సంధ్యక్షరాణి క్రమా-
జ్జిహ్వామూలముదగ్రబిందురపి చ గ్రీవా విసర్గీ స్వరః ॥ 23 ॥

కాదిర్దక్షిణతో భుజస్తదపరో వర్గశ్చ వామో భుజ-
ష్ఠాదిస్తాదిరనుక్రమేణ చరణౌ కుక్షిద్వయం తే పఫౌ ।
వంశః పృష్ఠభవోఽథ నాభిహృదయే బాదిత్రయం ధాతవో
యాద్యాః సప్త సమీరణశ్చ సపరః క్షః క్రోధ ఇత్యంబికే ॥ 24 ॥

ఏవం వర్ణమయం వపుస్తవ శివే లోకత్రయవ్యాపకం
యోఽహంభావనయా భజత్యవయవేఽప్యారోపితైరక్షరైః ।
మూర్తీభూయ దినావసానకమలాకారైః శిరఃశాయిభిస్తం
విద్యాః సముపాసతే కరతలైర్దృష్టిప్రసాదోత్సుకాః ॥ 25 ॥

యే జానంతి యజంతి సంతతమభిధ్యాయంతి గాయంతి వా
తేషామాస్యముపాస్యతే మృదుపదన్యాసైర్విలాసైర్గిరాం ।
కించ క్రీడతి భూర్భువఃస్వరభితః శ్రీచందనస్యందినీ
కీర్తిః కార్తికరాత్రికైరవసమా సౌభాగ్యశోభాకరీ ॥ 26 ॥

మాయాబీజవిదర్భితం పునరిదం శ్రీకూర్మచక్రోదితం
దీపామ్నాయవిదో జపంతి ఖలు యే తేషాం నరేంద్రాః సదా ।
సేవంతే చరణౌ కిరీటవలభీవిశ్రాంతరత్నాంకుర-
జ్యోత్స్నామేదురమేదినీతలరజోమిశ్రాంగరాగశ్రియః ॥ 27 ॥

శ్రీబీజం సకలాక్షరాదిషు పునః క్రోధాక్షరాంతే భవేదేవం
యో భజతేఽమ్బ తే తనుమిమాం తస్యాగ్రతో జాగ్రతీ ।
లక్ష్మీః సిందురదానగంధలహరీలోలాంధపుష్పంధయ-
శ్రేణీబంధురశృంఖలానియమితేవాపైతి నైవ క్వచిత్‌ ॥ 28 ॥

యస్త్వాం విద్రుమపల్లవద్రవమయీం లేఖామివాలోహితా-
మాత్మానం పరితః స్ఫురత్త్రివలయాం మాయామభీధ్యాయతి ।
తస్మై నిందితవందనేందుకదలీకాంతారహారస్రజో
నిఃశ్వాసభ్రమబాష్పదాహగహనా మూర్ఛంతి తాస్తాః స్త్రియః ॥ 29 ॥

మాతః శ్రీభగమాలినీత్యభిధయా దివ్యాగమోత్తంసితాం
త్వామానందమయీమనుస్మరతి యస్తం నామ వామభ్రువః ।
బాహుస్వస్తికపీడితైః స్తనతటైర్దైన్యాంచితైశ్చాటుభి-
ర్నీరంధ్రైః పులకాంకితైర్ముకులితైర్ధ్యాయంతి నేత్రాంచలైః ॥ 30॥

యస్త్వాం ధ్యాయతి రాగసాగరతరత్సిందూరనౌకాంతర-
స్వైరోజ్జాగరపద్మరాగనలినీపుష్పాసనాధ్యాసినీం ।
బాలాదిత్యసపత్నరత్నరచితప్రత్యంగభూషారుచి -
శ్రేణీసమ్మిలితాంగరాగవసనాస్తస్య స్మరంత్యంగనాః ॥ 31 ॥

కర్పూరం కుముదాకరం కమలినీపత్రం కలాకౌశలం
కూజత్కోకిలకామినీకులకుహూకల్లోలకోలాహలం ।
శంకంతే ప్రలయానలం స్మరమహాపస్మారవేగాతురాః
కంపంతే నిపతంతి హంత న గిరం ముంచంతి శోచంతి చ॥ ॥ 32 ॥

శ్రీమృత్యుంజయనామధేయభగవచ్చైతన్యచంద్రాత్మికే
హ్రీంకారి ప్రథమాతమాంసి దలయ త్వం హంససంజీవిని ।
జీవం ప్రాణవిజృంభమాణహృదయగ్రంథిస్థితం మే కురు
త్వాం సేవే నిజబోధలాభరభసా స్వాహాభుజామీశ్వరీం ॥ 33 ॥

ఏవం త్వామమృతేశ్వరీమనుదినం రాకానిశాకాముకస్యాంతః
సంతతభాసమానవపుషం సాక్షాద్యజంతే తు యే।
తే మృత్యోః కవలీకృతత్రిభువనా భోగస్య మౌలౌ పదం
దత్వా భోగమహోదధౌ నిరవధి క్రీడంతి తైస్తై సుఖైః ॥ 34 ॥

జాగ్రద్వోధసుధామయూఖనిచయైరాప్లావ్య సర్వా దిశో
యస్యాః కాపి కలా కలంకరహితా షట్చక్రమాక్రామతి ।
దైన్యధ్వాంతవిదారణైకచతురా వాచం పరాం తన్వతీ
సా నిత్యా భువనేశ్వరీ విహరతాం హంసీవ మన్మానసే ॥ 35 ॥

త్వం మాతాపితరౌ త్వమేవ సుహృదస్త్వ భ్రాతరస్త్వం సఖా
త్వం విద్యా త్వముదారకీర్తిచరితం త్వం భాగ్యమత్యద్భుతం ।
కిం భూయః సకలం త్వమీహితమితి జ్ఞాత్వా కృపాకోమలే
శ్రీవిశ్వేశ్వరి సంప్రసీద శరణం మాతః పరం నాస్తి మే॥ ॥ 36॥

శ్రీసిద్ధనాథ ఇతి కోఽపి యుగే చతుర్ధే
ప్రాదుర్బభూవ కరుణావరుణాలయోఽస్మిన్‌ ।
శ్రీశంభురిత్యభిధయా స మయి ప్రసన్నం
చేతశ్చకార సకలాగమచక్రవర్తీ ॥ 37 ॥

తస్యాజ్ఞయా పరిణతాన్వయసిద్ధ్వవిద్యా-
భేదాస్పదైః స్తుతిపదైర్వచసాం విలాసైః ।
తస్మాదనేన భువనేశ్వరి వేదగర్భం
సద్యః ప్రసీద వదనే మమ సన్నిధేహి ॥ 38 ॥

యేషాం పరం న కులదైవతమంబికే త్వం
తేషాం గిరా మమ గిరో న భవంతు మిశ్రాః |
తైస్తు క్షణం పరిచితే విషయేఽపి వాసో
మా భూత్కదాచిదితి సంతతమర్థయే త్వాం ॥ 39 ॥

శ్రీశంభునాథ కరుణాకర సిద్ధనాథ
శ్రీసిద్ధనాథ కరుణాకర శంభునాథ ।
సర్వాపరాధమలినేఽపి మయి ప్రసన్నం
చేతః కురుష్వ శరణం మమ నాన్యదస్తి ॥ 40 ॥

ఇత్థం ప్రతిక్షణముదశ్రువిలోచనస్య
పృథ్వీధరస్య పురతః స్ఫుటమావిరాసీత్‌ ।
దత్వా వరం భగవతీ హృదయం ప్రవిష్టా
శాస్త్రైః స్వయం నవనవైశ్చ ముఖేఽవతీర్ణా ॥ 41 ॥

వాక్సిద్ధిమేవమతులామవలోక్య నాథః
శ్రీశంభురస్య మహతీమపి తాం ప్రతిష్ఠాం ।
స్వస్మిన్పదే త్రిభువనాగమవంద్యవిద్యా-
సింహాసనైకరుచిరే సుచిరం చకార ॥ 42 ॥

భూమౌ శయ్యా వచసి నియమః కామినీభ్యో నివృత్తిః
ప్రాతర్జాతీవిటపసమిధా దంతజిహ్వావిశుద్ధిః ।
పత్రావల్యాం మధురమశనం బ్రహ్మవృక్షస్య పుష్పైః
పూజాహోమౌ కుసుమవసనాలేపనాన్యుజ్జ్వలాని ॥ 43 ॥ 

ఇత్థం మాసత్రయమవికలం యో ప్రతస్థః ప్రభాతే
మధ్యాహ్నే వాఽస్తమితసమయే కీర్తయేదేకచిత్తః ।
తస్యోల్లాసైః సకలభువనాశ్చర్యభూతైః ప్రభూతైర్విద్యాః
సర్వాః సపది వదనే శంభునాథప్రసాదాత్‌ ॥ 44 ॥

వ్రతేన హీనోఽప్యనవాప్తమంత్రః శ్రద్ధావిశుద్దోఽనుదినం జపేద్యః ।
తస్యాపి వర్షాదనవద్యసద్యః కవిత్వహృద్యాః ప్రభవంతి విద్యాః ॥ 45 ॥

కోంఽప్యచింత్యప్రభావోఽస్య స్తోత్రస్య ప్రత్యయావహః ।
శ్రీశంభోరాజ్ఞయా సర్వాః సిద్ధయోఽస్మిన్ప్రతిష్టితాః ॥ 46 ॥

ఇతి శ్రీ సకలాగమాచార్యచక్రవర్తి శ్రీపృథ్వీధరాచార్య విరచితం
వేదగర్భం శ్రీభువనేశ్వరీస్తోత్రం అథవా శ్రీభువనేశ్వరీమహాస్తోత్రం సంపూర్ణం
 

Friday, September 5, 2025

Vishnu Krutha Bhuvaneswari Sthuthi - విష్ణుకృత శ్రీ భువనేశ్వరీ స్తుతి

విష్ణుకృత శ్రీ భువనేశ్వరీ స్తుతి

నమోదేవ్యై ప్రకృత్యై చ విధాత్రై సతతం నమః ।
కళ్యా
ణై  కామదాయై చ వృద్ద్యై సిద్ద్యై నమో నమః ॥ 01 ॥ 

సచ్చిదానంద రూపి
ణ్యై సంసారారణయే నమః ।
పంచ కృత్య విధా
త్య్రైతే భువనేశ్యై నమో నమః ॥ 02 ॥

సర్వాధిష్ఠాన రూపాయై కూటస్థా
యై నమో నమః ।
అర్థ మాత్రార్థ భూతా
యై నమో నమః ॥ 03 ॥

జ్ఞాతం మయా
ఽఖిలమిదంత్వయి సన్నివిష్టం 
తతో
స్య సంభవలయావపి మాతరద్య ।
శక్తిశ్చలే
స్య కరణే వితత ప్రభావా ॥
జ్ఞాతా
ధునా సకలలోక మయీతి నూనమ్‌ ॥ 04 ॥

విస్తార్య సర్వమఖలం సదసద్వికారమ్‌ ।
సందర్శయస్య వికలాపురుషాయకాలే ।
తత్త్వైశ్చ షోడశభి రేవ చ సప్తభిశ్చ ॥
భాసీంద్రజాల మివనః కిల రంజనాయ ॥ 05 ॥

నత్వామృతే కిమపి వస్తుగతం విభాతి ।
వ్యాప్యైవ సర్వమఖిలం త్వమవస్థితా
సి 
శక్తింవినా వ్యవహృతే పురుషో
ప్యశక్తో 
బంభణ్యతే జనని బుద్ధిమతా జనేన ॥ 06 ॥

ప్రీణాతివిశ్వ మఖిలం సతతం ప్రభావైః ।
స్వైస్తేజసా చ సకలం ప్రకీటీకరోషి ।
అత్స్యేవ దేవి తరసాకిల కల్పకాలే 

కోవేద దేవి చరితం తవవైభవస్య ॥ 07 ॥


శ్రీ భువనేశ్వరి మహా విద్యా

Sri Bhuvaneswari Stottram - శ్రీ భువనేశ్వరీ స్తోత్త్రం

శ్రీ భువనేశ్వరీ స్తోత్త్రం

అథానందమయీం సాక్షాచ్చబ్దబ్రహ్మస్వరూపిణీం
ఈడే సకలసంపత్యై జగత్కారణమంబికాం ॥ 01 ॥

విద్యామశేషజననీమరవిందయోనే -
ర్విష్ణోశ్శివస్యచవపుః ప్రతిపాదయిత్రీం
సృష్టిస్థితిక్షయకరీం జగతాం త్రయాణాం
స్తోప్యేగిరావిమలయాప్యహమంబికే త్వాం ॥ 02 ॥

పృథ్వ్యా జలేన శిఖినా మరుతాంబరేణ
హోత్రేందునా దినకరేణ చ మూర్తిభాజః
దేవస్య మన్మథరిపోః పరశక్తిమత్తా
హేతుస్త్వమేవ ఖలు పర్వతరాజపుత్రి ॥ 03 ॥

త్రిస్రోతసస్సకలదేవసమర్చితాయా
వైశిష్ట్యకారణమవైమి తదేవ మాతః
త్వత్పాదపంకజ పరాగ పవిత్రితాసు
శంభోర్జటాసు సతతం పరివర్తనం యత్‌ ॥ 04 ॥

ఆనందయేత్కుముదినీమధిపః కళానా-
న్నాన్యామినఃకమలినీ మథనేతరాంవా
ఏకస్యమోదనవిధౌ పరమేకమీష్టే
త్వం తు ప్రపంచమభినందయసి స్వదృష్ట్యా ॥ 05 ॥

అద్యాప్యశేషజగతాం నవయౌవనాసి
శైలాధిరాజతనయాప్యతి కోమలాసి
త్రయ్యాః ప్రసూరపి తయానసమీక్షితాసి
ధ్యేయాసి గౌరి మనసోనపథి స్థితాసి ॥ 06 ॥

ఆసాద్య జన్మ మనుజేషు చిరాద్దురాపం
తత్రాపిపాటవమవాస్య నిజేంద్రియాణాం
నాభ్యర్చయంతి జగతాం జనయిత్రి యేత్వాం
నిశ్రేణికాగ్రమధిరుహ్య పునః పతంతి ॥ 07 ॥

కర్పూరచూర్ణహిమవారివిలోడితేన
యే చందనేన కుసుమైశ్చ సుజాతగంధైః
ఆరాధయంతిహి భవాని సముత్సుకాస్త్వాం
తేఖల్వఖండభువనాధిభువః ప్రథంతే ॥ 08 ॥

ఆవిశ్యమధ్యపదవీం ప్రథమేసరోజే
సుప్తాహిరాజసదృశీం విరచయ్యవిశ్వం
విద్యుల్లతావలయవిభ్రమముద్వహంతీ
పద్మానిపంచ విదలయ్య సమశ్ను వానా ॥ 09 ॥

తన్నిర్గతామృతరసైరభిషిచ్యగాత్రం
మార్గేణ తే నవిలయం పునరప్యవాప్తా
యేషాంహృది స్ఫురసిజాతు నతేభవేయు-
ర్మాతర్మహేశ్వర కుటుంబిని గర్భభాజః ॥ 10 ॥

ఆలంబికుండలభరామభిరామవ
క్త్రాం
ఆపీవరస్తనతటీం తను వృత్తమధ్యాం
చింతాక్షసూత్రకలశాలిఖీతా
ఢ్యహాసాం
ఆవర్తయామిమనసా తవ గౌరిమూర్తిమ్‌ ॥ 11 ॥

ఆస్థాయయోగమవిజిత్య చ వైరిషట్కం
అబధ్యచేంద్రియగణం మనసి ప్రసన్నే
పాశాంకుశాభయవరా
ఢ్యకరాం సువక్త్రాం
ఆలోకయంతి భువనేశ్వరి యోగినస్త్వామ్‌ ॥ 12 ॥

ఉత్తప్తహాటకనిభాం కరిభిశ్చతుర్భిః
ఆవృత్తితామృత ఘటైరభిషిచ్యమానా
హస్తద్వయేన నళినే రుచిరే వహంతీ
పద్మాపిసాభయకరా భవసి త్వమేవ ॥ 13 ॥

అష్టాభిరుగ్రవివిధాయుధవాహినీభిర్‌-
దోర్వల్లరీభిరధిరుహ్య మృగాధివాసం
దూర్వాదళద్యుతి రమాత్య విపక్షపక్షాన్‌
న్యక్కుర్వతీ త్వమసి దేవి భవాని దుర్గే ॥ 14 ॥

ఆవిర్నిదాఘ జలశీకరశోభివ
క్త్రాం
గుంజాఫలేన పరికల్పితహారయష్టిం
రత్నాంశుకామసితకాంతిమలంకృతాం త్వాం
ఆద్యాం పుళిందతరుణీమసకృన్నమామి ॥ 15 ॥

హంసైర్గతిః క్వణితనూపుర దూరదృష్టే
మూర్తేరివాప్తవచనైరనుగమ్యమానౌ
పద్మావివోర్ధ్యముఖరూఢ సుజాత నాళౌ
శ్రీకంఠపత్ని శిరసైవ దధే తవాంఘ్రీ ॥ 16 ॥

ద్వాభ్యాం సమీక్షితుమతృప్తిమతేవదృగ్భ్యాం
ఉత్పాద్యతాత్రినయనం వృషకేతనేన
సాంద్రానురాగభవనేన నిరీక్ష్యమాణే
జంఘే ఉభే అపి భవాని తవానతోస్మి ॥ 17 ॥

ఊరూ స్మరామి జితహస్తి కరావలేపౌ
స్థాల్యేనమార్దవతయా పరిభూతరంభౌ
శ్రేణీభరస్య సహనౌ పరికల్ప్యదత్తా
స్తంభావివాంగవయసా తవ మధ్యమేన ॥ 18 ॥

శ్రోణ్యౌస్తనౌచ యుగపత్ప్రథయిప్యతో
చ్యైః
బాల్యాత్పరేణవయసాపరి కృష్ణసారః
రోమావళీవిలసితేన విభావ్యమూర్తిం
మధ్యం తవ స్ఫురతు మే హృదయస్య మధ్యే ॥ 19 ॥

సఖ్యాస్మృరస్య హరనేత్ర హుతాశభీరోః
లావణ్యవారిభరితం నవయౌవనేన
ఆపాద్య దత్తమివ పల్లవమప్రవిష్టం
నాభింకదాపి తవదేవి న విస్మరేయమ్‌ ॥ 20 ॥

ఈశోపి గేహపిశునం భసితం దధానే
కాశ్మీరకర్దమ మను స్తన పంకజేన
స్నానోల్ధితస్య కరిణః క్షణలక్షఫేనౌ
సిందూరితా స్మరయతః స మదస్య కుంభౌ ॥ 21 ॥

కంఠాతిరిక్త గళదుజ్జ్వల కాంతిధారా
శోభౌ భుజౌ నిజరిపోర్మకరధ్వజేన
కంఠగ్రహాయ రచితౌ కిల దీర్ఘపాశౌ
మాతర్మమ స్మృతిపథం నవిలజ్జయేతామ్‌ ॥ 22॥

నాత్యాయతం రుచిరకంబువిలాస చౌర్యం
భూషాభరేణ వివిధేన విరాజమానం
కంఠం మనోహరగుణం గిరిరాజకన్యే
సంచిన్త్యతృప్తి ముపయామి కదాపి నాహమ్‌ ॥ 23॥

అత్యాయతాక్షమభిజాతలలాటపట్టం
మందస్మితేన దర ఫుల్లకపోలరేఖం
బింబాధరం ఖలు సమున్నతదీర్ఘనాసం
యత్తేస్మరత్య సకృతంబ స ఏవజాతః ॥ 24 ॥

ఆవిస్త్వయార కరలేఖమనల్ప గంధ
పుష్పోపరిభ్రమదళి వ్రజనిర్విశేషం
యశ్చేతసా కలయతే తవ కేశపాశం
తస్య త్వయం గలతి దేవి పురాణపాశః ॥ 25 ॥

శ్రుతి సురచితపాకం ధీమతాం స్తోత్రమేతత్‌
పఠతియ ఇహమర్త్యో నిత్యమార్ద్రాంతరాత్మా
స భవతి పదముచ్చైస్సంపదాం పాదనమ్ర
క్షితిపముకుటలక్ష్మీర్లక్షణానాంచిరాయ ॥ 26 ॥

ఇతి శ్రీభువనేశ్వరీ స్తోత్రం సమాప్తం

sri Bhuvaneswari Devi Vupasana Vidhanamu - శ్రీ భువనేశ్వరీ దేవి ఉపాసన విధానము

శ్రీ భువనేశ్వరీ దేవి ఉపాసన విధానము

శ్రీ భువనేశ్వరీదేవి ఉదయించే సూర్యుడిలాంటి కాంతితో ప్రకాశించే ఈ దేవికి భాద్రపద శుక్లపక్ష అష్టమీ తిథి ప్రీతిపాత్రమైనది. ఈ దేవి సంపూర్ణ సౌమ్యస్వరూపిణి. ఈ దేవిని ఉపాసించే సాధకుడికి మూడవ నేత్రం తెరుచుకుంటుంది. అంటే భూత భవిష్యత్‌ వర్తమానాలు తెలుసుకునే శక్తి లభిస్తుంది అంటారు. అంతేకాదు, రాజ్యధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈదేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు. దశమహావిద్యాధి దేవతలలో ముఖ్యంగా చెప్పుకోదగినది భువనేశ్వరీదేవినే అంటారు. ఈమెనే మహావిద్య అని కూడా పిలుస్తారు.

భువనేశ్వరి అంటే సమస్త భువనములకు అధిదేవత అని అర్థం. త్రిభువనములు అంటే భుః అంటే భూమి, భువః అంటే ఆకాశం, సువః స్వర్గము ఈ మూడింటిని ఏలే తల్లి అని అర్థం. ఈమెకే శ్రీ రాజరాజేశ్వరీ దేవి అనే పేరు కూడా ఉంది.

ప్రాణతోషిణి గ్రంథంలో అమ్మవారి పుట్టుకకు సంబంధించి ఒక కథ చెప్పబడివుంది. ప్రళయంలో మునిగిన ఈ సృష్టిని తిరిగి మళ్ళీ పుట్టించడానికి బ్రహ్మ తిరిగి సృష్టి చేయనారంభించాడు. సృష్టిలో తాను కోరుకున్న ప్రతీ వస్తువునీ, ప్రతీ ప్రాణినీ బ్రహ్మ సృజించాడు. కానీ ప్రాణులలో క్రియా శక్తిని మాత్రం నింపలేకపోయాడు. అందుకోసం బ్రహ్మ ఆ జగన్మాత కోసం ఘోరతపస్సు చేసాడు. బ్రహ్మ తపస్సుకు మెచ్చిన జగన్మాత ఒక చేత పాశంతో, మరో చేత అంకుశంతో, వరదాభయ ముద్రలతో, అరుణవర్ణంలో, కమలాసనయై బ్రహ్మ ఎదుట ప్రత్యక్షమైంది. అపై బ్రహ్మచే స్తుతింపబడిన జగన్మాత ఆయన కోరిక మేరకు ఈ సృష్టిలోని అణువణువులో క్రియా శక్తిగా ప్రవేశించింది.

అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం
దేవికి నేతి అన్నాన్ని నైవేద్యంగా పెట్టి సుమంగళులకు వడ్డిస్తే ఆ ఇంట్లో సుఖం, శాంతి, ప్రశాంతత, సంతోషం, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అని నమ్మకము. అంతేకాక ఈ దేవికి పాయసం అంటే కూడా ఎంతో ప్రీతి. పాయసాన్న ప్రీతమానస అయిన ఈ దేవికి పాయసాన్ని నివేదిస్తే ఎంతో సంతోషిస్తుంది.

పదునాలుగు భువనాలకు అధీశ్వరి
భువనేశ్వరి అంటే ఈ చతుర్ధశ భువనాలకీ అధీశ్వరి. పధ్నాలుగు భువనాల్లోని చరాచర జీవరాసులన్నీ ఈ దేవి ఆదీనంలోనే ఉంటాయి. ఈ మహా విద్య పరమశాంతి రూపిణీ. మూల ప్రకృతి రెండో నామాన్ని భువనేశీ అంటారు. భువనేశీ అనగా భువనేశ్వరీ. ఈ సృష్టిలోని అన్ని రూపాలూ మూల ప్రకృతి శ్రీ భువనేశ్వరీ దేవివే.

బ్రహ్మదేవుడు తపస్సు చేయగా పార్వతీదేవి బ్రహ్మ తపస్సుకు మెచ్చి విశ్వసృష్టికై భూదేవిగా అవతరించింది. విశ్వం యొక్క సృష్టి, క్రియ మరియు లయ కారకురాలు భువనేశ్వరి దేవి. ఈమె శరీరము ఎరుపు వర్ణంలో ఉంటుంది. ఈమెకు మూడు నేత్రాలు మరియు నాలుగు హస్తాలు ఉన్నాయి. ఈమె చేతులలో పాశము, అంకుశము మిగిలిన చేతులతో భయం తొలగిస్తూ స్వేచ్చను ప్రసాదిస్తూ అభయ ముద్రతో ఉంటుంది.

శాకాంబరిగా అవతరణ
పూర్వం దుర్గమాసురుడు క్రూరుడై, అభేద్య వరాలు పొంది సమస్త సృష్టిలోని ప్రాణులను, దేవతలను బాధించసాగాడు. వాడి ప్రకోపం వలన భూమిపై జలధారలు ఎండిపోయి కరువు ఏర్పడింది. ఎంతో మంది తమ ప్రాణాలు విడిచారు. అప్పుడు ఋషులు, దేవతలు హిమాలయాలకు బయలుదేరి అమ్మవారికై ప్రార్థించారు. కారుణ్యమూర్తి అయిన మాత వెంటనే వారి ఎదుట ప్రత్యక్షమైంది. వారి కష్టాలను విన్నమాత తన సహస్ర అశ్రుధారలతో భూమిపై నదులను ప్రవహింపచేసి దుర్గమాసురుడి వలన ఏర్పడిన క్షామాన్ని తరిమికొట్టింది. వెంటనే భూమిపైన జీవకళ ఉట్టిపడింది. అమ్మ స్వయంగా తన చేతులతో శాకములను, కందాది మూలాలను సృష్టించింది. అందువల్లనే అమ్మ వారికి ‘శాకంబరి' మరియు శతాక్షి అనే పేర్లు కూడా కలవు. అప్పుడు భువనేశ్వరి దేవి బాణములు, పాశము, అంకుశము మొదలైన ఆయుధాలు ధరించి దుర్గమాసురుడిని సంహరించింది.

శాంతిని కోరుకునేవారికి భువనేశ్వరి
నిత్య జీవితములో పరిపూర్ణమైన శాంతిని కోరుకునే వారు శ్రీ భువనేశ్వరీ దేవిని ఉపాసించాలి. శ్రీ భువనేశ్వరీ దేవికి రాత్రి సిద్ధరాత్రి కాగా, త్రయంబకుడు శివుడుగా, పరమేశ్వరుడు భైరవుడుగా, త్రైలోక్య మోహిని యక్షిణిగా ఉంటారు.

బృహన్నీలతంత్రంలో అమ్మవారికి ఉన్న మూడు నేత్రాలు సృష్టి, స్థితి, లయలకు ప్రతీకలని వివరించబడింది. సృష్టిలో అవ్యక్తరూపంలో భువనేశ్వరి దేవి ఉంటే, వ్యక్తంగా కాళీ మాత ఉంటుంది. అందుకే ఇద్దరికీ భేదమే లేదు.

భువనం అంటే లోకం. ఈ లోకానికి సృష్టికర్త భువనేశ్వరీ. సృష్టి మొత్తం భువనేశ్వరీ అవతారమే. ఈమెనే అదితి అని కూడా అంటారు. అ+దితి అంటే ఖండం కానిదని అర్థం. ఈ అదితి దేవతలందరికీ మాతృమూర్తి. 

సమస్త భువనాలకు అధీశ్వరియైన ఈ దేవత ల సూర్యుని వలె ప్రకాశిస్తుంటుంది. కిరీటం మీద చంద్రకళ, మూడు కన్నులు, చిరునవ్వు ఆమెకు అలంకారాలు. ఈమె పరమ శాంతి స్వరూపిణి “పరమాం శాంతిం కామయ మానో భువనేశ్వరీ ముపాసీత”. సర్వజీవులు అంతిమంగా కోరేది శాంతి శృంగార వీరాది సమస్త రసాలు స్థాయి భావమును చేరుకోవాలంటే సుప్రకాశానంద చిన్మయమైన శమ స్థితిని పొందాలి. ఆ శమములో ఆనందముంది. ఆ ఆనందం ప్రేమకు లక్షణం.
ఆమె సమస్త విశ్వాన్ని ప్రేమతో చూస్తూ ఉంటుంది. 

దశమహావిద్యల వరుస క్రమాన్ని గనక మనం పరిశీలిస్తే అంతమే ఆరంభం అని తెలిపే కాళీమాత రూపం సృష్టి బీజానికి ప్రతీక ఐతే, తారా మాత ప్రారంభానికి ప్రతీక. షోడశిమాత నిర్మాణానికి ప్రతీక ఐతే, భువనేశ్వరి దేవి సృష్టి పరిపాలనకు ప్రతీక. ఈ సృష్టి పరిణామక్రమమే ముందుకు సాగుతూ కమలా దేవి వద్ద పూర్ణత్వాన్ని అందుకుంటుంది.

ఇంద్రియ విజయాన్ని కలిగించే మాత
దయామయమైన ఆమె చూపుల వల్ల భక్తులు కుబేరునితో సమానమైన సంపదలను పొందుతారు. త్రిమూర్తులు ఆమె చేతనే సృష్టించబడినారు. బ్రహ్మకు సృష్టి శక్తిని, విష్ణువునకు స్థితి శక్తిని మహే వాశ్వరునకు సంహారశక్తిని ఆమె ప్రసాదించింది. త్రిమూర్తులకు అతీతమైన ఒక మహాశక్తిగా భువనేశ్వరిని భావించవలసి ఉంటుంది. తనను ఉపాసించే వారికి ఆమె ఇంద్రియ విజయాన్ని ప్రసాదిస్తుంది. జీవులలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే ఏనుగును అంకుశంతో లొంగతీసుకొన్నట్లుగా వాటిని లొంగదీసి శాంతిని ప్రసాదిస్తుంది. హ్రీం కార బీజ రూపిణిగా, మహామాయగా, శక్తిగా, ఏకాక్షరిగాని, త్రక్షరిగాని, స్వీకరించి సంప్రదాయ క్రమంలో సాధన చేస్తే ఆ సాధకునకు భువనేశ్వరీ కరుణ అ కలుగుతుంది.

శివశక్త్యాత్మకమైన హ్రీం మంత్రాక్షరాలన్నింటికి తలమానికమైనది. పరమేశ్వరికి అత్యంత ప్రియమైన బీజమిది. జగత్‌ అంతయూ ఆమె హిరణ్యగర్భంలో ఇమిడినట్లే, తంత్ర మంత్రం సూక్ష్మాలన్నీ హ్రీం బీజంలోనే ఉన్నాయి. ఇది త్రిపుటలకు అధిష్టానం. అండ పిండ బ్రహ్మాండాలకి ఆశ్రయం.

హృల్లేఖా మంత్ర ప్రభావం
చతుర్ధశభువనాధీశ్వరి అయిన భువనేశ్వరీ దేవి, దేవీ భాగవతంలో హిమవంతుడికి యోగవిద్యను బోధిస్తూ తనను ఏ విధంగా ధ్యానించాలో ఇలా చెబుతుంది.

హకారః స్థూలదేహః స్యాద్రకారః సూక్ష్మ దేహకః
ఈకారః కారణాత్మా సౌ హ్రీం కారో హం తురీయకమ్‌

ఓ హిమవంతా మూడు అక్షరాలతో కూడిన నా దివ్య బీజాన్ని నీవు ధ్యానించాలి.
నా స్థూలదేహమైన కారాన్ని నా సూక్ష్మ దేహమైన కారాన్ని నా కారణ దేహమైన  కారాన్ని కలిపి హ్రీం అనే ప్రణవ బీజంతో నన్ను ఉపాసించాలి. నాకు చేసే ప్రతి పూజా ఈ హృల్లేఖా మంత్రంతోనే చేయాలి.

హృల్లేఖా దర్పణే నిత్యమహం తత్ప్రతిబింబితా
తస్మాత్‌ హృల్లేఖయా దత్తం సర్వమంత్రైః సమర్పితమ్‌

హృల్లేఖ అంటే సర్వ మంత్రాలకూ నాయిక వంటిది. మంత్ర మహారాజ్ఞి అయిన హ్రీం అనే ఆ మంత్ర దర్పణం (అద్దం) లో నేను ప్రతి నిత్యం ప్రతిబింబించి ఉంటాను. అందుకే నాకు సమర్పించే పూజ, జపం, తపం అన్ని హృల్లేఖా మంత్రంతో సమర్పిస్తే అది సకల మంత్రాలతో సమర్చించినట్టవుతుంది.

అందుచేత ఓ హిమవంతా నిత్యం హ్రీం భీజంతో భువనేశ్వరి అయిన నన్ను పూజిస్తూ, ఉపాసిస్తూ ఉండేవారికి లోకంలో దుర్లభమైనది ఏదీ ఉందదు. వారు శరీరం విడిచాక నా దివ్య చింతామణి గృహానికి చేరుకుంటారు అని స్వయంగా చెప్పింది కనుక అత్యంత మహిమోపేతమైన ఈ భువనేశ్వరీ మహావిద్యని నియమపూరితంగా ఉపాసించి కృతార్థులు కావచ్చు.

సుభద్రాదేవి అవతారంలో భువనేశ్వరీ
పూరీలోని జగన్నాథ ఆలయంలో కొలువైన సుభద్రాదేవిని భువనేశ్వరి దేవి అవతారంగా కొలవడం అక్కడి సంప్రదాయం. ఈ లోకాలన్నింటిని కాపాడేది తల్లే. దశమహావిద్యలలో కాళీమాత మరియు భువనేశ్వరిదేవి అతి ముఖ్యమహా విద్యలు. నారద పాంచరాత్రంలో అమ్మవారి వైభవం గురించి అత్యంత రమణీయంగా చెప్పబడి ఉంది. షోడశిమాతకి మరియు భువనేశ్వరి దేవికి సారూప్యత ఎక్కువ. మహా నిర్వాణతంత్రం ప్రకారం ఏడు కోట్ల మంది మహామంత్రిణులు ఈమె సేవలో సదా ఉంటారు.

శ్రీ విద్యకు సారం
శ్రీ లలితా సహస్రనామంలో కొన్ని కొన్ని నామాలను ఓక సమూహంగా చెప్పటం జరిగింది. దీనికి ఒక ప్రత్యేకమైన విశేషత ఉంది. ఈ ప్రకారంగా వేయి నామాలలో అనేకానేక విశేషాలు పొందుపరచబడ్డాయి. ఉదాహరణకు మొదటి ఐదు నామాలలో పరమేశ్వరి ప్రాదుర్భావాన్ని వివరిస్తే, ఆ తదుపరి ఆ తల్లి స్వరూపాన్ని మరోచోట జగన్మాత సూక్ష్మ రూపాన్ని వర్ణించారు. అదే పంచదశి మహా మంత్రం. ఇంకోచోట శ్రీ చక్రాన్ని వివరించారు. మరి కొన్ని నామాలలో ఆ పరదేవత యొక్క అర్చనా విధానాలను, ఆచారాలను, చతుషష్టిపూజా విశేషాలను, షట్చక్రా లను వివరించారు. అవస్థా పంచకము, చంద్ర విద్య, భానువిద్య, భువనేశ్వరి విద్య, కాత్యాయనీ విద్య, వాగ్వాదినీ విద్య, శివదూతి విద్య, గాయత్రీ మంత్రం, ఆత్మ విద్య... ఈ విధంగా అనేకానేక అంశాలను లలితా సహస్రంలో పొందుపరచబడినవి. ఒక్కలలితా సహస్రాన్ని పూర్తిగా పరిశీలిస్తే శ్రీ విద్య తెలుస్తుంది. అందుకే లలితా సహస్రము శ్రీ విద్యకు సారధి వంటిది.

హ్రీంకార కోశాసిలతా
1 నుండి 10 అక్షరములు గల మంత్రాలను బీజ మంత్రాలు అంటారు. 11 నుంచి 21 వరకు అక్షరాలు గల వాటిని మంత్రములుగా వ్యవహరిస్తారు. 21 మించి అక్షరములు గల వాటిని మాల మంత్రాలు అంటారు. ఖడ్గములు అంటే స్తుతి వచనాలు అని అర్థం. అందుకే 21 మించిన అక్షరాలు ఉన్నందునే ఖడ్గమాలగా వ్యవహరిస్తాం. లలితా త్రిశతిలో మూడవ హ్రీంకారాన్ని గురించి చెప్పేటప్పుడు పరమేశ్వరి హ్రీంకార కోశాసిలతా అని స్తుతించబడింది. అసి అంటే ఖడ్గము. అసిలతా అంటే ఖడ్గధారి. హ్రీంకారమనే కోశానికి పరమేశ్వరి ఖడ్గధారి. హ్రీంకారమనే కోశంలోనే ఆమె ఖడ్గము (కత్తి. తన భక్తులకు కలిగే రాగ ద్వేషాలను, అరిషడ్వర్గ వైరులను, బాధలను, దుఃఖాలను పరమేశ్వరి తన ఖడ్గంతో ఛేదిస్తుంది, తొలగిస్తుంది. అందుకే ఆ తల్లిని శ్రీ దేవి ఖడ్గమాలతో స్తుతిస్తాము.

భువనేశ్వరీ శక్తి వర్ణనాతీతం
భువనేశ్వరీ దేవికి ఉన్న శక్తి వర్ణణాతీతం. ఈ సృష్టి దాని స్థితి మరియు లయం కావటం అనే కార్యాలు ఈమె యొక్క శక్తికి నిదర్శనాలు. చిరునవ్వులు చిందించే ముఖంతో ఆమె భక్తులకు వరాలు ఇస్తూ ఉంటుంది. ఈమెను పూజించేవారికి సమస్త భయాలు తొలగిపోతాయి. భువనాన్ని ఏలే శక్తిగల భువనేశ్వరీదేవి కలువ పువ్వులో రాజసంగా లోకాన్ని శాసిస్తూ కూర్చుని ఉంటుంది. ఈమె మహిమలను అడ్డుకునే శక్తి నవగ్రహాలకు గానీ, త్రిమూర్తులకు గానీ లేదు అని చెబుతారు.

భువనేశ్వరీ అనగా పార్వతీ దేవి. కాళి, తార, త్రిపుర సుందరీల ప్రకాశమునకు భువనేశ్వరి తెర వంటిది. దశమహావిద్యలు వామ, కౌళ సంప్రదాయములకు చెందినవి. వామ, కౌళములు సిద్ధపురుషులకే గాని సామాన్యులకు కాదు. పరమ దేవతా అనుగ్రహము పరిపూర్ణంగా పొందాలనుకుంటే సాంప్రదాయ పరంపరాగతంగా వస్తున్న ఆ దేవి యంత్ర, మంత్ర, తంత్ర, పూజా కల విధి విధానం తెలుసుకొని అర్చించి దేవీ కృపకు పాత్రులు కావలసి ఉంటుంది.

ఈ దేవిని ఏడుకోట్ల మహా మంత్రాలు ఆరాధిస్తుంటాయి. ఈ విశ్వాన్ని సృష్టించాలనే అభిలాషతో బ్రహ్మ క్రియా శక్తిని ఆహ్వానిస్తూ తీవ్రమైన తపస్సు చేశారు. ఆ తపస్సుకు మెచ్చిన పరమేశ్వరి భూదేవి రూపంలో ప్రత్యక్షమైంది. విశ్వానికే అధిదేవత కాబట్టే భువనేశ్వరీ అని పిలుస్తారు. అవ్యక్తం నుండి వ్యక్తమైన బ్రహ్మాండ రూపం, చైతన్య స్వరూపమే భువనేశ్వరీ దేవి.

దయామయమైన భువనేశ్వరీమాత చూవుల వల్ల భక్తులు కుబేరునితో సమానమైన సంపదలను పొందుతారు. భువనానికి అధినాయికగా ఈమెను పేర్కొంటారు. ఈ దేవతను పూజించిన వారికి సమస్త భయాలు తొలగి పోతాయి. సకల భువనాలకు భువనేశ్వరీ దేవి అధి దేవత. సకల సృష్టి అమ్మ రూపంలో ఇమిడి ఉంటుంది.

భువనేశ్వరీ గాయిత్రి మంత్రం

ఓమ్‌ నారాయణైచ విద్మహే 
భువనేశ్వయై ధీమహి 
తన్నో దేవీ ప్రచోదయాత్‌!

శ్రీ భువనేశ్వరి దేవి గురించి, వివిధ రకాలైన భువనేశ్వరీ మంత్రాలు గురించి, వాటి సాధనా పద్దతుల గురించి, శ్రీ భువనేశ్వరి అష్టోత్తర, సహస్రనామాలు, కవచ హృదయ స్తోత్రాలు సాధన చేస్తే ఆ సాధకుడికి జ్ఞాన నేత్రం అంటే మూడోకన్ను తెరుచుకుంటుంది. అంతేకాదు, రాజ్యాధికారాన్ని సమస్త సిద్దుల్ని సకల సుఖభోగాల్ని ఈ దేవి అనుగ్రహంతో సాధకులు పొందవచ్చు అని అంటారు.

సంతానాధిదేవత
సంతానం కొరకై భువనేశ్వరి దేవి ఆరాధన అత్యంత ఫలప్రదమైనది. రుద్రయామల అను గ్రంథంలో అమ్మవారి కవచము, నీలసరస్వతి తంత్రంలో అమ్మవారి హృదయము మరియు సహస్రనామాలు సంకలనం చేయబడి ఉన్నాయి.

త్రిమూర్తులను స్తీ రూపాలుగా మర్చిన మాత
దేవీ భాగవతం తృతీయ స్కంధంలో శ్రీ భువనేశ్వరీదేవి రూపం అత్యంత మనోహరంగా వర్ణించబడింది. బ్రహ్మ విష్ణు, మహేశ్వరులు యోగమాయను స్తుతించి ఆదేవి అనుగ్రహంతో ఒక దివ్య విమానాన్ని ఎక్కి పర్యటిస్తూ, క్షీర సముద్రం మధ్యలో ఉన్న ఒక సుందర ద్వీపంలో ఉన్న భువనేశ్వరీ దేవిని దర్శించారు. వారు దర్శించిన భువనేశ్వరీ దేవి రూపం ఎర్రని వస్త్రాలు, ఎర్రని మాలలు ధరించి, ఎర్ర చందనాన్ని అలముకొని, కళ్ళు పెద్దగా, విశాలంగా ఎర్రగా చేసి ఉన్నది. కోటి విద్యుత్‌ రేఖల కాంతితో వెలిగిపోతూ, సూర్యబింబం లాగా ప్రకాశిస్తుంది. అత్యంత సుందర వదనంతో, పాశాంకుశాలు ధరించి, వరద అభయ హస్తాలు చూపుతూ, చిరునవ్వులు చిందిస్తూ ఉంటుంది. సర్వాలంకార భూషణాలు ధరించిన ఆ మూర్తిని పక్షి బృందాలు హ్రీం హ్రీం అని హ్రీం కార జపం చేస్తూ సేవిస్తున్నాయి. ఆమె చుట్టూ ఉన్న సేవికలు అమ్మా ! భువనేశ్వరీ, హృల్లేఖా అంటూ ఆమె దివ్య నామాన్ని జపం చేస్తున్నారు. అనంగ కుసుమా మొదలైన దేవతలందరూ ఆమె చుట్టూ కూర్చొని పూజిస్తుండగా, షట్కోణ యంత్రం మీద కూర్చొని
భువనేశ్వరీ దేవి వారికి దర్శనమిస్తుంది.

ఆ దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించిన త్రిమూర్తులలో విష్ణుమూర్తి “ఈ దివ్యమూర్తి అందానికి కారణమైన భగవతి. ఈమే మహావిద్య, ఈ తల్లే మహామాయ. ఈ దేవే పూర్ణ ప్రకృతి స్వరూపం. ఎప్పటికీ నాశనం లేని మహాశక్తే ఈ భువనేశ్వరి” అని ఆ తల్లి దివ్య స్వరూపాన్ని వర్ణిస్తాడు.

ఈ విధంగా భువనేశ్వరీ లోకానికి చేరిన త్రిమూర్తులు విమానం దిగి ఆ తల్లి లోకంలో అడుగు పెట్టిన వెంటనే కరుణారస దృష్టితో స్త్రీలుగా మారిపోతారు. ఆ స్త్రీ రూపాలతోనే భువనేశ్వరీదేవి దివ్య పాదాల్ని దర్శించి, ఆ తల్లి కాలిగోటిలోనే బ్రహ్మండాల్ని చతుర్ధశ భువనాలను చూసి ఆనందంతో ఆశ్చర్యంతో భువనేశ్వరీ మాతను ప్రస్తుతిస్తారు. వారి స్తుతి విన్న భువనేశ్వరీ మాత వారిని కరుణించి, వారికి భార్యలను ప్రసాదించి, సృష్టి, స్ధితి, లయ కార్యక్రమాలను నిర్వహించమని ఆదేశించి వారిని అచ్చటనుండి పంపుతుంది.

ఈ విధంగా దేవీభాగవతంలో భువనేశ్వరీదేవి త్రిమూర్తులకన్నా అధికమైన దేవతగా, సాక్షాత్తు వారిచేతనే మహామాయగా, మహా విద్యగా కీర్తించబడి దర్శినమిస్తుంది.

ఆకాశానికి అధిదేవత
ఆకాశానికి ఆధిదేవత భువనే శ్వరి అని తంత్ర గ్రంథాలు వర్ణి స్తాయి. భువనేశ్వరీ దేవి నాద శరీరం హ్రీం కారం. అందుకే హ్రీం కారాన్ని శక్తి బీజంగా, భువనేశ్వరీ బీజంగా పరిగణిస్తారు. దీనినే తాంత్రిక ప్రణవం (ఓం) అని, హృల్లేఖ అని కూడా అంటారు. ఈ దేవిని మహా మాయగా, ఈమె బీజం హ్రీం కారాన్ని మాయాబీజంగా సంభావిస్తారు.

ప్రపంచ సృష్టికర్త భువనేశ్వరి
భువనం అంటే ప్రపంచం. ఈ ప్రపంచానికి సృష్టికర్త భువనేశ్వరి. ఈ సృష్టి మొత్తం భువనేశ్వరీ అవతారమే అని చెబుతారు. రాత్రికి అధిష్టాతృ దేవతగా భువనేశ్వరీదేవి ఉంటుంది. ఈ సృష్టిలోని అన్ని రూపాలూ మూల ప్రకృతి శ్రీ భువనేశ్వరీ దేవియే.

వామాదేవిగా శ్రీ భువనేశ్వరీ మాత
ఈ దేవి సమస్త లోకాలను వమనం (వాంతి) చేసుకొన్నది కాబట్టి వామా అని, ఈ దేవికున్న శివమయతత్వం వల్ల జ్యేష్టా లేక కర్మ నియంత్రిణి అని జీవులను దండించే సామర్ధ్యం ఉండటం వలన రౌద్రి అని వ్యవహరిస్తారు.

పరమాత్మే వాక్‌, మనః, ప్రాణమయుడు. ఈ మూడు శక్తులు సూర్యుడిలో ఉంటాయి. సూర్యుడిలోనే షోడశకళ పరిపూర్ణ పురుషుడు వికాసంతో దర్శనమిస్తాడు. ఈ మూడు పురుషులే ఈ మూడు భువనములు. మూడు భువనాలను సృష్టించి రక్షించి సంహరించే పరమాత్మ శక్తినే భువనేశ్వరీ అంటారు. త్రిపురేశ్వరీ, త్రిపుర సుందరీ అన్నట్లుగానే త్రిభువనేశ్వరీ భువనేశ్వరీ అంటారు. ఈ భువనేశ్వరిని త్రికరణ శుద్దిగా అనగా శరీరం, మనస్సు, వాక్కులతో ఆరాధిస్తే ఆరోగ్యం, ఆనందం, బలం, సమృద్ధిగా కలుగుతాయి. మనకున్న మూడు భువనాలు అన్నమయం, మనోమయం, ప్రాణమయం. అన్నం ఆరోగ్యానికి, మనస్సు ఆనందానికి, ప్రాణం బలానికి ప్రతీకలు. లోతుగా పరిశీలించినా భువనం లేదా పురము అనగా మన శరీరమే. ఈ శరీరాన్ని ఇంద్రియాలను, ఇతర అవయవాలు శాసించేది బుద్దే. అనగా జ్ఞానశక్తి. ఆ శక్తే భువనేశ్వరీ. బుద్దికి జ్ఞాన శక్తి, శరీరానికి క్రియా శక్తి, మనస్సుకు ఇచ్చాశక్తి ఈ శక్తులకు ఈశ్వరీ త్రిపురేశ్వరీ, భువనేశ్వరిని సేవిస్తే మంచి కోరికలు కలిగి మంచి పనులు తలపెడతారు. అమ్మను సేవిస్తే పరమాత్మ జీవాత్మ కున్న సంబంధం ఇహపర లోకాల జ్ఞానం కలుగుతుంది. ఈవిధంగా మంచి కోరికలు కలిగి మంచి కార్యాలు తలపెట్టాలంటే భువనేశ్వరీ దేవిని ఆరాధించి తరించాలి.

శ్రీ మహాలక్ష్మి శ్రీ మహాసరస్వతి, శ్రీ మహాపార్వతి, త్రిశక్తిస్వరూపిణి, సర్వ శక్తిరూపిణిగా, మహాశక్తి స్వరూపిణిగా భువనేశ్వరీమాత దర్శనమిస్తుంది. అమ్మ యొక్క మంత్రము హ్రీం తో అమ్మవారి ఆరాధన వలన భక్తులకు సౌభాగ్యము కలుగును, విద్య, జ్ఞాన సంపద, ఆయురా రోగ్యములు, ధన, కనక, వస్తు వాహనాది, సమృద్ధి కొరకు, పుత్ర పౌత్రాభివృద్ధి కొరకు, సర్వాపదానివారణార్ధం, సకలకార్య విఘ్ననివారణార్థం, సత్సంతాన సిధ్యర్థం, ఇష్టకామ్యార్ద సిధ్యర్థం సకల ఐశ్వర్యముల కొరకు ఈ భువనేశ్వరీ మాతను పూజించాలి. దేవి దర్శనము, అత్యంత దుర్లభమయినదే కానీ ఆ దేవిని త్రికరణ శుద్దిగా పూజ చేసి అమ్మవారి మూలమంత్రమును సాధన చేసినవారికి అమ్మదర్శనభాగ్యము లభించును అని నమ్మకము.

భువనేశ్వరీ ఉపాసకులకు సర్వ వైభవాలు
భక్తితో సాధన చేస్తే శరీరంలో అణువణువునా దేవీ వైభవమే కనిపిస్తుంది. రైతన్నలకు పాడిపంటలు, సకల సౌభాగ్యములు ఇచ్చేతల్లి భువనేశ్వరీ దేవి. ఆ భువనేశ్వరీ దేవీ ఇచ్చా జ్ఞాన క్రియాశక్తుల సంయుక్త రూపము. అందువలన భువనేశ్వరీ ఉపాసకులు సర్వ వైభవములు పొందగలరు.

చరాచర సృష్టికి ఆధార భూతమైన సర్వశక్తి సమన్విత అయిన భువనేశ్వరీ దేవి స్తోత్ర సంప్రీత, ఆశ్రిత కల్పవల్లి, స్మరణ మాత్రముననే తన కరుణను కురిపించే కన్నతల్లి, దశదిశలా వ్యాపించి సర్వశక్తి స్వరూపిణిగా విరాజిల్లే మహామహిమాన్విత మాతయే భువనేశ్వరీదేవి, సకల చరాచర సృష్టికి మూలపుటమ్మ ఓంకార స్వరూపిణి, జగత్‌ అంతా హ్రీం కారం, విశ్వమంతా శ్రీ కారం, సర్వ మహిమలకు మూలధారియై భువనేశ్వరీదేవి విలసిల్లుతుంది.

ఇష్టదైవం నామాన్ని కానీ, మంత్రాన్ని కానీ, ఒక క్రమపద్ధతిలో భక్తిగా జపించే విధానమే జపం. జపంలో కారం మరో జన్మ లేకుండా (జన్మవిచ్చేదన) చేస్తుంది.  కారం పాపాలను నశింప చేస్తుంది. పలికిన వెంటనే ఫలితం ఇస్తుంది కాబట్టి పూజ కన్నా జపానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. లింగ పురాణం ప్రకారం జపం చేయడం వల్ల యక్ష రాక్షస పిశాచాది భయంకర గ్రహాల బాధలు తొలిగిపోయి సుఖశాంతులు కలుగుతాయి. జపం చేయడం వల్ల మానసిక ఉత్తేజం కలుగుతుంది.

జపాలలోని వివిధ రకాలు
జపం మూడు రకాలుగా చేస్తారు. మొదటిది వాచికం అంటే సమీపంలోని వారికి వినపడేటట్లు జపించడం. రెండోది ఉపాంశువు అంటే పెదవులను కదిలిస్తూ ఎవ్వరికీ వినపడకుండా చేయడం, మూడోది మానసికం అంటే మనసులో జపించడం. మూడో పద్ధతిలో చేసే జపం ఎక్కువ ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

భువనేశ్వరీ మంత్రం
మంత్ర మహార్ణవం, మంత్ర మహోదధి వంటి గ్రంథాలలో వివిధ దేవతా మంత్రాలని ఏ విధంగా జపం చేయాలి? ఏ మాల ఉపయో గించాలి? ఏ ఆసనం మీద కూర్చోవాలి? ఏ సమయంలో చేయాలి? ఎలాంటి వస్త్రాల్ని ధరించాలి? పురశ్చరణ ఎలా చేయాలి? అనే విషయాలు వివరించబడ్డాయి. ఆ గ్రంథాలలో చెప్పిన విధంగా శ్రీ భువనేశ్వరీ మంత్రాన్ని పురశ్చరణా పూర్వకంగా జపించినచో మంత్రసిద్ధి జరుగుతుంది అంటారు. ఆ మూల మంత్రంతో చేసే జపం సత్ఫలితాన్నిస్తుంది అని భావన.

పురశ్చరణ పద్ధతిలో ఉపాసన
 ఏ మంతాన్నైనా శాస్త్రోక్తంగా ఒక నియమిత పద్ధతిలో సాధన చేసే విధానాన్ని పురశ్చరణ అంటారు. పురశ్చరణలో పంచాంగాలు.. జపము, హోమము, తర్పణము, మార్జనం, బ్రహ్మణ భోజనం. ఈ 5 విధాలైన కర్మతో శ్రీ భువనేశ్వరీ దేవిని ఉపాసించినచో అమ్మ కరుణ లభించగలదని అంటారు. పురశ్చరణ లేని మంత్రం కూడా నిరర్ధకమైంది కాబట్టి శ్రీ భువనేశ్వరీ దేవి మంత్రాన్ని పురశ్చరణ పూర్వకంగా ఉపాసిస్తేనే ఆ దేవత అనుగ్రహం మనకు లభీస్తుంది అని అంటారు.

ఎన్నిసార్లు పురశ్చరణ చేయాలి?
సాధారణంగా ఏ మంత్రానికైనా ఒక లక్షసార్లు (108 స సంఖ్య గల మాలతో 1000 మాలలు) మూల మంత్రాన్ని జపం చేయాలి. అందులో పదో వంతు అనగా 10,000 సార్లు ఆ మూల మంత్రంతో హోమం చేయాలి. హోమ సంఖ్యలో పదో వంతు అనగా 1000 సార్లు ఆ మూల మంత్రంతో తర్పణ చేయాలి. తర్పణ సంఖ్యలో పదో వంతు అనగా 100 సార్లు మూల మంత్రంతో మార్జన లేదా అభిషేకం చేయాలి. అందులో పదో వంతు అనగా.. పది మంది బ్రహ్మణులకు భోజనం పెట్టాలి. పై ఐదు కార్యాలతో మంత్ర పురశ్చరణ పూర్తవుతుంది. 

శ్రీ భువనేశ్వరీ మంత్రాన్ని పురశ్చరణా పూర్వకంగా అనుష్టానం చేయాలనుకునే సాధకులు శుద్ధ అష్టమి నుంచి పూర్ణిమ వరకు జపం చేస్తే సత్వర ఫలితం లభిస్తుంది. సాధారణంగా సాత్విక దేవతలందరికీ ఈ తిథులు అత్యంత ప్రీతికరమైనవి అని అంటారు.

జపం ఎక్కడ చేయాలి? ఏ ప్రదేశాలు శుభం అనే విషయానికి వస్తే.. పుణ్యక్షేత్రం, తీర్ధప్రదేశం, దేవాలయాలు, నదీ తీరం, గుహ, పర్వతాగ్రం, తీర్థ ప్రదేశాలు, సాగర సంగమ స్థలాలు, పవిత్ర వనాలు, ఉద్యానవనాలు, సముద్ర తీరాలు, స్వగృహాలు.. ఈ ప్రదేశాలను ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అంటే ప్రదేశాలలో ఎక్కడైనా జపం చేయవచ్చు. అయితే దశ మహావిద్యలు కొలువున్న అత్యంత శక్తివంతమైన స్థలాలు కూడా గురువుల సలహా మేర ఎంచుకొన్నచో ఉత్తమ ఫలితాలు లభించగలవని భావన.

నిత్యం ఒక శుభ స్థానంలో కూర్చుని జపం చేయాలి. అయితే, శ్రీ భువనేశ్వరీ మంత్రం జపం చేయడానికి ఆసనం ముఖ్యం. శ్రీ భువనేశ్వరీ దేవికి ప్రీతికరమైన రంగు ఎరుపు కనుక ఎరుపు రంగులో ఉండే ఆసనాన్ని ఉపయోగించాలి. దర్భాసనం మీద ఎర్రని రంగు గల చిత్రాసనాన్ని వేసుకుని కూడా జపం చేయవచ్చు.

జ్యోతిర్మాలాం త్రిణేత్రాం వివిధ మణిలసత్‌ కుండలాం పద్మసంస్థామ్‌
ఆద్యాం పాశాంకుశాభాం అభయవరకరాం భావయేత్  భువనేశీమ్‌

ప్రతినిత్యం శ్రీ శ్రీ భువనేశ్వరీ అమ్మవారిని దర్శిస్తూ ధ్యాన శ్లోకాన్ని పఠించిన వ్యాపార సంబంధమైన దోషములు తొలగునని శాస్త్రవచనము. ప్రతి గృహము యందు లేదా వ్యాపారస్థలముల యందు ఈ మూర్తిని తూర్పు దిశలో పడమర ముఖముగా ఉంచి ఆరాధించిన త్వరితముగా వ్యాపారాదులలో అభివృద్ధి, ప్రజల మన్నన, సేవకుల అనుకూల సహకారములు కలుగునని నమ్మకము.

భువనేశ్వరీ ఆలయాలు
శ్రీలంకలోని నైనాతివులో, తమిళనాడులోని పుదుక్కొట్టైలో, ఒడిషాలోని కటక్‌లో, గుజరాత్‌లోని గోందల్‌లో మరియు హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులు జిల్లాలో భువనేశ్వరీ అమ్మవారి ఆలయాలు ఉన్నవి.

Haridra Pasupu Ganapathi Pooja - (హరిద్రా) పసుపు గణపతి పూజ

శ్రీ పసుపు గణపతి పూజ. పూర్వాంగం ॥ అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి ॥ ప్రాణప్రతిష్ఠ ఓం అసునీతే పునరస్మాసు చక్...