Tuesday, November 18, 2025

Sri Dhumavati Laghu Kavacham - శ్రీ ధూమావతీ లఘు కవచం

శ్రీ ధూమావతీ లఘు కవచం

ముఖం ధూమవతీపాతు ధూంధూం స్వాహాస్వరూపిణీ
లలాటం విజయాపాతు మాలినీ నిత్యసుందరీ
కల్యాణీ హృదయం పాతు హసరీ నాభిదేశకం
సర్వాంగం పాతుదేవేశీ నిష్కలా భగమాలినీ
సుపుణ్యం కవచం దివ్యం యఃపఠేద్భక్తి సంయుతః
సౌభాగ్య మతులం ప్రాప్యచాంతే దేవీ పురం వ్రజేత్‌

Sri Dhumavathi Kavacham - 1 - శ్రీ ధూమావతి కవచం - 1

శ్రీ ధూమావతి కవచం - 1

శ్రీ పార్వత్యువాచ :
ధూమావత్యర్చనం శంభో శ్రుతం విస్తరతో మయా
కవచం శ్రోతుమిచ్ఛామి తస్యా దేవ వదస్వ మే
 ॥ 01 ॥

శ్రీ బైరవ ఉవాచ:
శృణు దేవి పరం గుహ్యం న ప్రకాశ్యం కలౌయుగే
ధూమావత్యాస్తు కవచం శత్రువిగ్రహకారకమ్‌
 ॥ 02 ॥

బ్రహ్మాద్యా దేవి సతతం యద్వశాదరిఘాతినః
దేవా భవంతి శత్రుఘ్నా యస్యాధ్యాన ప్రభావతః
 ॥ 03 ॥

ఓం అస్యశ్రీ ధూమవతీకవచస్య పిప్పలాద ఋషిః అనుష్టుప్‌ చ్ఛందః
శ్రీ ధూమవతీ దేవతా ధూం భీజం స్వాహా శక్తిః ధూమవతీ కీలకం,
శత్రుహననే జపే వినియోగః

ఓం ధూం బీజం మే శిరఃపాతు లలాటం సదావతు
ధూమ నేత్రయుగం పాతు వతీ క
ర్ణౌ సదావతు ॥ 04 ॥

దీర్ఘాతూదరమధ్యే తు నాభిం మే మలినాంబరా
శూర్పహస్తా పాతు గుహ్యం రూక్షా రక్షతు జానునీ
 ॥ 05 ॥

ముఖం మే పాతు భీమాఖ్యా స్వాహా రక్షతు నాసికాం
సర్వవిద్యావతాత్కంఠం వివర్ణా బాహుయుగ్మకమ్‌
 ॥ 06 ॥

చంచలా హృదయం పాతు దుష్టా పార్శ్వం సదావతు
ధూమహస్తా సదా పాతు పాదౌ పాతు భయాపహా
 ॥ 07 ॥

ప్రవృద్ధరోమా పాతు భృశం కుటిలా కుటిలేక్షణా
క్షుత్పిపాసార్దితా దేవీ భయదా కలహప్రియా
 ॥ 08 ॥

సర్వాంగం పాతు మే దేవీ సర్వశత్రు వినాశినీ
ఇత్యే తత్కవచం పుణ్యం కథితం భువి దుర్లభమ్‌
 ॥ 09 ॥

న ప్రకాశ్యం న ప్రకాశ్యం న ప్రకాశ్యం కలౌయుగే
పఠనీయం మహాదేవి త్రిసంధ్యం థ్యానతత్పరైః
 ॥ 10 ॥

దుష్టాభిచారో దేవేశి తద్గాత్రం నైవ సంస్పృశేత్‌

॥ ఇతి భైరవీ భైరవ సంవాదే శ్రీ ధూమావతీ కవచమ్‌ సంపూర్ణం 

Sri Dhumavati Dyanam - శ్రీ ధూమావతీ ధ్యానం

శ్రీ ధూమావతీ ధ్యానం 

వివర్ణా చంచలా దుష్టా దీర్ఘా చ మలినాంబరా ।
విముక్తకుంతలా రూక్షా విధవా విరలద్విజా ॥ 01 ॥

కాకధ్వజరథారూఢా విలంబితపయోధరా ।
శూర్పహస్తాతిరూక్షాక్షా ధూతహస్తా వరాన్వితా ॥ 02 ॥

ప్రవృద్ధఘోణా తు భృశం కుటిలా కుటిలేక్షణా ।
క్షుత్పిపాసార్ధి తా ధ్యేయా భయదా కలహస్పదా ॥ 03 ॥

అత్యుచ్చా మలినాంబరాఖిలజనోద్వేగావహా దుర్మనా
రూక్షాక్షిత్రితయా విశాలదశనా సూర్యోదరీ చంచలా ।

ప్రస్వేదాంబుచితా క్షుధాకులతనుః కృష్ణాతిరూక్షప్రభా
ధ్యేయా ముక్తకచా సదాప్రియకలిర్ధూమావతీ మంత్రిణా॥ 04 ॥

ఇతి శ్రీధూమావతీ ధ్యానం

Sri Dhumavati Sthotram 2 - శ్రీ ధూమావతి స్తోత్రం-2

 శ్రీ ధూమావతి స్తోత్రం-2

ప్రాతర్యాస్యాత్కుమారీ కుసుమకలికయా జాపమాలాం జపంతీ
మధ్యాహ్నే ప్రౌఢరూపా వికసితవదనా చారునేత్రా నిశాయాం,
సంధ్యాయాం వృద్ధరూపా గలితకుచయుగా ముండమాలాం
వహంతీ సా దేవీ దేవదేవీ త్రిభువన జననీ కాళికా పాతు యుష్మాన్‌ ॥ 01 ॥

బధ్వా ఖట్వాంగకోటౌ కపిలవరజటామండలం పద్మయోనేః
కృత్వాదైత్యో త్తమాంగే స్రజమురసి శిరశ్శేఖరం తారక్ష్యపక్షైః
పూర్ణం రక్తై స్సురాణాం యమమహిషమహాశృంగ మాదాయ పాణౌ
పాయాద్వో వంద్యమాన ప్రలయ ముది తయా భైరవః కాళరాత్య్రామ్‌ ॥ 02 ॥

చర్వంతీ మస్తిఖండం ప్రకటకటకటా శబ్దసంఘాత ముగ్రం
కుర్వాణా ప్రేతమధ్యే కహకహ కహకహా హాస్యముగ్రం కృశాంగీ
నిత్యం నిత్య ప్రసక్తా డమరు డిమడిమాన్‌ స్ఫారయంతీ ముఖాబ్జం
పాయాన్నశ్చండికేయం ఝఝమఝమా  జల్పమానా భ్రమంతీ ॥ 03 ॥

టం టం టం టం టంటాప్రకర టమటమానాటఘంటాం వహం తీ
స్ఫేం స్ఫేం స్ఫేం స్ఫార కారాటకటకితహసా నాదసంఘట్టభీమా,
లోలం ముండాగ్రమాలా లల హలహలహా లోలలోలాగ్ర వాచం
చర్వంతీ చండముండం మటమటముటితే చర్వయంతీ పునాతు ॥ 04 ॥

వామేకర్ణే మృగాక ప్రళయపరిగతం దక్షిణే సూర్యబింబం
కంఠే నక్షత్ర హారం వరవికటజటాజూటకేముండమాలాం
స్కంధే కృత్వోరగేంద్రం ధ్వజనికరయుతం బ్రహ్మకంకాలభారం
సంహారే ధారయంతీ మమ హరతు భయం భద్రదా భద్రకాళీ ॥ 05 ॥

తైలాభ్య క్తైక వేణీత్రపుమయవిలసత్కర్ణికా క్రాంతకర్ణా
లోహేనై కేన కృత్వా చరణనళినకా మాత్మనః పాదశోభాం
దిగ్వాసార సభేన గ్రసతి జగదిదం యా యవాకర్ణపూరా
వర్షిణ్యాతి ప్రబద్దా ధ్వజవితతభుజా సాసి దేవి త్వమేవ॥ 06 ॥

సంగ్రామే హేతికృత్యై స్సరుధిరదశనై ర్యద్భటానాం శిరోభిః
మాలామాబద్ధ్వమూర్థ్ని ధ్వజవితతభుజా త్వంశ్మశానే ప్రవిష్టా
దృష్టా భూత ప్రభూతైః పృథుతర జఘనా బద్ధనాగేంద్రకాంచీ
శూలాగ్రవ్యగ్రహస్తా మధురుధిరవసా తామ్రనేత్రా నిశాయామ్‌ ॥ 07 ॥

దంష్ట్రారౌద్రే ముఖేస్మిం స్తవ విశతి జగద్దేవి సర్వం క్షణార్థాత్‌
సంసారస్యాంతకాలే నరరుధిర వసాసంప్లవే భూతధూమే
కాళి కాపాలికీ సా శవశయనరతా యోగినీ యోగముద్రా
రక్తారూక్షా సభాస్థా మరణభయహర త్వం శివా చండఘంటా ॥ 08 ॥

ధూమావత్యష్టకం పుణ్యం సర్వాపద్వినివారణం
యః పఠేత్సాధకో భక్త్యా సిద్దిం విందతి వాంఛితామ్‌ ॥ 09 ॥

మహాపది మహాఘోరే మహారోగే మహారణే
శత్రూచ్చాటే మారాణాదౌ జంతూనాం మోహనేతథా ॥ 10 ॥

పఠేత్‌ స్తోత్రమిదం దేవి సర్వతః సిద్ధిభాగ్భవేత్‌
దేవదానవగంధర్వ యక్షరాక్షసపన్నగాః ॥ 11 ॥

సింహవ్యాఘ్రాదికాస్సర్వే స్తోత్రస్మరణమాత్రతః
దూరాద్దూరతరం యాంతికింపునర్మానుషాదయః ॥ 12 ॥

స్తోత్రేణానేన దేవేశి కిన్న సిధ్యతి భూతలే
సర్వ శాంతిర్భవేద్దేవి అంతే నిర్వాణతాం వజ్రేత్‌ ॥ 13 ॥

ఇత్యూర్వ్వామ్నాయే శ్రీ ధూమవతీ స్తోత్రమ్‌ సమాప్తం 

ARABIAN NIGHTS STORIES - అరేబియా రాత్రులు

 అరేబియా రాత్రులు

పర్షియా దేశంలో ఒక సుల్తాన్ ఉండేవాడు.

అతను ఎన్నోచోట్ల వెతికి ఒక గుణవంతురాలైన అందమైన స్త్రీని పెళ్ళి చేసుకున్నాడు.

అతను ఒక్క క్షణం కూడా భార్యను విడవకుండా కాలం గడిపాడు.

కొంతకాలం తర్వాత పరిపాలన గాలికి ఒదిలేయడం మంచిది కాదు అని గుర్తు చేశాడు వజీరు.

అప్పటినుంచి సుల్తాను రాణితో గడిపే సమయం తగ్గించి పాలన చూసుకోవడం ప్రారంభించాడు.

శరీర సుఖానికి రుచి మరిగిన రాణి కొంతకాలం ఆగింది. ఆ తర్వాత ఆగలేకపోయింది.

కోటలో ఎంతోమంది నీగ్రో బానిసలు సేవకులుగా ఉన్నారు.

వారిలో ఒకడ్ని చూసుకొని రంకు ప్రారంభించింది.

ఈ వ్యవహారం కొంతకాలం గుట్టుగా సాగింది.

ఒక దురదృష్టకరమైన రోజున .. రాణి తన ప్రియుడితో కులుకుతుండగా రాజు చూడనే చూశాడు.

అతని హృదయం బద్దలైపోయింది.

రాణిని ప్రాణం కన్నా‍ ఎక్కువగా ప్రేమించాడు అతను.

ఆమె కలలో కూడా తనను మోసం చేయదని నమ్మాడు అతను.

బాధ కోపంగా మారింది సుల్తాన్‌కు.

రాణి, ఆమె నీగ్రో ప్రియుడు రాజు కోపానికి బలైపోయారు.

రాణి చేసిన నమ్మకద్రోహంతో సుల్తాన్ రాక్షసుడిగా మారిపోయాడు.

లోకంలోని స్త్రీలందరూ ఇంతే .. భర్తను నమ్మించి చాటుమాటుగా రంకు నడుపుతారు అని అతను నమ్మాడు.

అంతే .. ఒక క్రూరమైన నిర్ణయం తీసుకున్నాడు.

ప్రతిరోజు ఒక అమ్మాయిని వివాహం చేసుకొనేవాడు.

ఆ రాత్రి ఆమెతో సుఖపడేవాడు.

ఉదయాన్నే ఆమెకు మరణశిక్ష విధించేవాడు.

ఇలా ఎందరో స్త్రీలను చంపేశాడు సుల్తాన్.

అందులో చెడ్డవాళ్ళున్నారు. మంచివాళ్ళున్నారు.

చివరకు వజీరు కూతురు సుల్తాన్‌ని కోరి వివాహం చేసుకుంది.

శోభన కార్యం ముగిసిన తర్వాత ఆమె ఒక కథ చెప్పడం ప్రారంభించింది.

కథ పూర్తి కాకుండానే రాత్రి గడిచి ఉదయం అయింది.

కథ వినాలన్న కోరికతో రాజు ఆమెకు ఆ రోజు ప్రాణభిక్ష ప్రసాదించాడు.

ఇలా వెయ్యి రాత్రులు కథ చెప్పింది కొత్తరాణి.

ఆ కథలు రాజులో మార్పు తెచ్చాయి.

స్త్రీలలో చెడ్డవాళ్ళే కాదు మంచివాళ్ళు కూడా ఉంటారని అతనికి బోధపడింది.

రాజు మునుపటిలా మంచివాడయ్యాడు.

ఇక మళ్ళీ పెళ్ళి చేసుకోలేదు.

కథల ద్వారా తనలో మార్పు తెచ్చిన వజీరు కూతురు షెహర్జాదాతోనే శేషజీవితం గడిపాడు సుల్తాన్ షహర్యార్.

ఆ షెహర్జాదె సుల్తాన్‌కు వెయ్యిరాత్రులు చెప్పిన కథలే .. వెయ్యిన్నొక్క రాత్రులు లేదా అరేబియన్ నైట్స్ కథలు.

PVRK PRASAD IAS - ఐఏఎస్ అధికారి PVRK

ఐఏఎస్ అధికారి PVRK

1983 లో ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు ఆ ఐ.ఏ.ఎస్ అధికారికి పోస్టింగు ఇవ్వలేదు. అప్పటికే పాత కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడ్డారన్న కారణంగా కొందరు ఐఏఎస్ అధికారుల్ని ఆయన ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆ సస్పెన్షన్ జాబితాలో ఈ అధికారి పేరు కూడా ఉందని, నేడో రేపో జరుగుతుందని ప్రచారం. అలాంటి దశలో ఆ అధికారి పోస్టింగు కొరకు వెళ్తే, ముఖ్యమంత్రి మూడు "అవినీతి నేరాల" ప్రశ్నలతో నిలదీశారు.

ముఖ్యమంత్రి: మీరు టిటిడి నిధుల్లోంచి లక్షలాది రూపాయల్ని కేవలం బ్రాహ్మణులకే దోచిపెట్టారట. నిజమా? కాదా?

ఐ.ఏ.ఎస్: కొంతవరకు నిజమే సర్. కంచి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి సలహా ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ ఆమోదంతో టిటిడి అమలు చేసిన పథకం క్రింద చేశాను. ఎవరైతే 12-16 సంవత్సరాల పాటు వేదాధ్యయనం చేసి, ఘనాపాటీలుగా, క్రమాపాటీలుగా గుర్తింపు పొంది ఉన్నారో, వారిలో ఎవరు ప్రతిరోజూ ఎనిమిది గంటల చొప్పున తమకి సమీపంలోని దేవాలయంలో సమాజ క్షేమం కోసం వేదపారాయణ చేస్తారో వాళ్ళకి నెలకి 600 నుంచి 800 వందల రూపాయల గౌరవ వేతనాన్ని టిటిడి చెల్లిస్తుంది. అటెండర్ ఉద్యోగం చేసే వాళ్ళే నెలకి 15 వేలు సంపాదింకుంటున్నారు. 16 సంవత్సరాల పాటు కంఠ నరాలు తెగిపోయేలా వేదాధ్యయనం చేయటం అంటే ఒక పోస్ట్ గ్రాద్యుయేషన్ చేయటం వంటిది. అలా నేర్చుకున్న వేద విద్యని సమాజ శ్రేయస్సు కోసం దేవాలయాల్లో పారాయణ చేసినందుకు టిటిడి నుంచి లబ్ధి పొందిన వేదపండితుల సంఖ్య 370. ఆ పండితులకు నెలకు రూ.800 చెల్లించటం దోచిపెట్టడం అనీ, నేరమనీ నేను అనుకోవట్లేదు.

ముఖ్యమంత్రి: మీరు తిరుమల కొండ మీద పాపనాశనం డ్యాం నిర్మాణం విషయంలో నిబంధనల్ని కాంట్రాక్టరుకి అనుకూలంగా సవరించేసి, లక్షలాది రూపాయలు లంచం తీసుకున్నారట గదా!

ఐ.ఏ.ఎస్: నేను 1978లో టిటిడిలో చేరాను. అప్పటికే డ్యాం నిర్మాణానికి హెచ్.సి.సి అనే కంపెనీ ఎంపికయింది. వాళ్ళు పని ప్రారంభించబోయే సమయంలో ఇంజనీరింగ్ నిపుణులు - మరో 100-150 మీటర్లు దిగువన డ్యాం కడితే, నీటి నిల్వ సామర్ధ్యం మూడు రెట్లు పెరుగుతుందని చెప్పారు. అప్పటికే చాలా సమయం గడిచిపోయింది.

కొండ మీద యాత్రికులకు నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉంది. కొత్తగా టెండర్లు పిలవాలంటే ఇంకో ఆరుమాసాలు పడుతుంది. పైగా పాత కాంట్రాక్టరుకి నష్ట పరిహారం ఇవ్వాల్సి వస్తుంది. ఈ అంశాలన్నీ నేను అప్పటి ధర్మకర్తల మండలిగా ఉన్న 'పెర్సన్స్ ఇంచార్జీ‘ కమిటీ ముందు పెట్టాను. వాళ్ళ ఆమోదంతో, కొండమీద యాత్రికులకు నీటి కొరతని త్వరగా తీర్చే ప్రయత్నంలో హెచ్.సి.సి కంపెనీకే పాత రేట్లే చెల్లించే ఒప్పందం మీద ఆ ప్రాజెక్టు కేటాయించాలని 'పెర్సన్స్ ఇంచార్జి ' అంగీకరించింది. ఫలితంగా, రెండున్నర ఏళ్ళలో పూర్తి కావలసిన డ్యాం ఒకటిన్నర సంవత్సరంలోనే పూర్తయింది. మీరు రికార్డులు తెప్పించుకొని చూడవచ్చు. ఒక్క రూపాయి కూడా హెచ్.సి.సి కి అదనంగా చెల్లించకుండా, రికార్డు సమయంలో డ్యాం నిర్మాణాన్ని పూర్తిచేయించటమే నేరమైతే, అది నేను చేశాను.

ముఖ్యమంత్రి: సరే. పెద్ద నేరం ఒకటుంది. తిరుమల శ్రీనివాసుడికి వజ్ర కిరీటం చేయించటంలో మీరు కస్టమ్స్ శాఖవారి వజ్రాలు వద్దని, ప్రయివేటు వ్యాపారుల దగ్గర వజ్రాలు కొన్నారనీ, అందులో చాలా వజ్రాలను మీరు మూటగట్టుకున్నారనీ, మీ ఇంట్లో పరుపుల్లో, తలగడల్లో ఈ వజ్రాలు దాచుకున్నారనీ అంటున్నారు. ఇలా జరిగి ఉంటే అది పాపం కూడా ? నిజం చెప్పండి.

ఐ.ఏ.ఎస్: అవునండి. వజ్రాల కిరీటానికి వజ్రాలకోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారు వచ్చారు. అక్రమ రవాణాల్లో కస్టమ్స్ వారికి పట్టుబడిన వజ్రాలు టిటిడికి తక్కువధరకు వస్తాయని ఆశపడి ప్రధానమంత్రిని అడిగాను. ఆవిడ అంగీకరించారు. కొన్ని రోజులకి ఆవిడ ముఖ్య కార్యదర్శి కృష్ణస్వామి రావ్ సాహెబ్ గారు ఫోన్ చేసి, కస్టమ్స్ స్వాధీనం చేసుకునే వజ్రాలు స్మగ్లర్లు మర్మాంగాల్లో దాచి తెచ్చినవై ఉంటాయి కాబట్టి అలా అపవిత్రమైన వజ్రాలను పవిత్రమైన స్వామి వారి కిరీటానికి వాడవద్దని ప్రధానమంత్రి చెప్పారని అన్నారు. అందుకు బదులుగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన హిందూస్తాన్ డైమండ్ కార్పొరేషన్ (హెచ్.డి.సి) ద్వారా హాలండ్ నుంచి వజ్రాలు కొనుకోలు చేయించే ఏర్పాటు చేస్తామన్నారు. ఆ కంపెనీ మేనేజింగ్ డైరక్టరుతో మౌలికమైన ఇన్సూరెన్స్ వగైరా అంశాలమీద మా అధికార బృందానికి మీటింగ్ ఏర్పాటు చేశారు. అయితే ఆ వజ్రాలు దిగుమతి అయ్యేనాటికి చాలా ముందుగానే నాకు టిటిడి నుండి బదిలీ అయింది. ఆ వజ్రాలను చూసే అవకాశమే నాకు లేదే. ఇంక ....!!!

ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ఆలోచనలో పడిపోయారు.

అవమాన భారంతో రగిలిపోతున్న ఆ ఐ.ఏ.ఎస్ అధికారి తన సీట్లోంచి ఉద్వేగంతో లేచి ముఖ్యమంత్రి మీద తన ఆవేశాన్ని కుమ్మరించారు:

"సర్. మీ ప్రభుత్వం ఏర్పడే సమయానికి నేను లండన్లో ఒక కోర్సు చేస్తున్నాను. నేనంటే అసూయతో ఎవరెవరో చెప్పిన చెప్పుడు మాటలు విని మీరు నా మీద నేరాలు మోపుతున్నారు. టిటిడి లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసరుగా నేను ప్రతి పనినీ ఆ స్వామి మీద విశ్వాసంతోనే చేశాను. సత్ప్రయోజనాన్ని ఆశించే చేశాను. స్వామి ప్రేరణతో నా విధ్యుక్త ధర్మంగా భావించి మాత్రమే చేశాను. నా చిత్తశుద్ధిని, నిజాయితీని ఆ శ్రీనివాసుడు ఆమోదించినంతకాలం ఈ ప్రభుత్వం నాలో వెంట్రుక ముక్క కూడా కదిలించలేదు. మీ ఇష్టమొచ్చినన్ని విచారణలు జరిపించుకోండి... నేను నేరస్థుణ్ణి అని మీరు నమ్ముతుంటే, ఎలాంటి శిక్ష అనుభవించటానికైనా నేను సిద్ధమే. అది కూడా శ్రీనివాసుడి ప్రసాదమే అనుకుంటాను... శలవు..."

చటుక్కున ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్ లేచి, ఆ ఐ.ఏ.ఎస్ అధికారి చేతులు పట్టుకొని, "ఆవేశపడకండి బ్రదర్. మేం పాలనకి కొత్తగా వచ్చాం. ఎవరో మీమీద ఈ అభియోగాలు చేశారు. అయితే, మా కార్యదర్శులు మోహన్ కందా గారు, బెనర్జీ గారు మీమీద ఎలాంటి చర్య తీసుకోదల్చినా, అందుకు ముందుగా మీతో మేం మాట్లాడితీరాలని పదే పదే చెప్పారు. అందుకే మాట్లాడాం. అపార్థం చేసుకోవద్దు బ్రదర్..."

ఇది జరిగిన గంటలోనే ఆ ఐ.ఏ.ఎస్ అధికారికి రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంకు ఎండిగా పాత పోస్టింగు ఇచ్చారు. రెండు మాసాల్లో 'సమాచార, పౌర సంబంధాల, సాంస్కృతిక, చలనచిత్ర అభివృద్ధి శాఖల కమీషనరుగా, కార్యదర్శి’ గా అదే ఐ.ఏ.ఎస్ అధికారి శ్రీ పి.వి.ఆర్.కె.ప్రసాద్ ని నియమించింది ప్రభుత్వం.

పాలనా సామర్ధ్యం, దూరదృష్టి, ప్రణాళికా రచనలో పరిణతి, నీతి నియమాలు, నిరాడంబరత, నిజాయితీ, నిబద్ధత, సాహిత్యం-లలిత కళల పట్ల మక్కువ, విజయం పరాజయం - రెండూ భగవంతుడి అనుగ్రహమే అని నమ్మే భక్తి విశ్వాసాలు, చివరి శ్వాస వరకూ సనాతన ధర్మ పరిరక్షణకు జీవితాన్ని అంకితం చేసుకున్న వ్యక్తిత్వం .... ఇవన్నీ కలబోస్తే వచ్చే రూపం శ్రీ పి వి.ఆర్.కె.ప్రసాద్. ప్రధానమంత్రి కార్యాలయం, ఎక్సయిజ్ శాఖ, విశాఖ పోర్టు, పంచాయతీ రాజ్, ఉన్నత విద్య, ప్రకృతి వైపరీత్యాలు-పునరావాసం, మానవ వనరుల శిక్షణ తదితర ఏ పోస్టులో పని చేసినా కేవలం తన పని తీరుతో ఆ పోస్టుకి వైభవం, గుర్తింపు తీసుకు వచ్చిన విశిష్ట వ్యక్తి ప్రసాద్. టిటిడిలో పనిచేసిన 54 మాసాల కాలంలో (1978-82) అన్నమాచార్య ప్రాజెక్టు నుంచి నిత్యాన్నదాన పథకం దాకా శాశ్వతంగా నిలిచిపోయే 27 ప్రాజెక్టులను అమలు చేసి, తనదంటూ ఒక చెరగని ముద్ర వేసిన కారణజన్ముడు.

ఇప్పటి తరం ఐఏఎస్ అధికారులకు స్ఫూర్తి ప్రదాత.

2009 నాటి లోక్ సభ, అవిభక్త ఆంద్ర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల నిర్వహణలో ఒక అసాధారణమైన చరిత్ర సృష్టించి, జాతీయ స్థాయిలో ‘ఆదర్శ ఛీఫ్ ఎలెక్టోరల్ ఆఫీసర్ 'గా గుర్తింపు పొందిన ఐఏఎస్

అధికారి డాక్టర్ ఐ.వి.సుబ్బారావు మాటల్లో చెప్పాలంటే - "సంపూర్ణ మానవుడు అంటూ ఎవరన్నా ఉండి ఉంటే, అది పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారే." *(ఆగష్టు 21 పి.వి.ఆర్.కె.ప్రసాద్ వర్ధంతి, 22 జయంతి)*

*🙏మహానుభావులు... నభూతో నభవిష్యతి*🙏

Monday, November 3, 2025

Sri Dhumavati Sthotram - శ్రీ ధూమావతి స్తోత్రం

శ్రీ ధూమావతి స్తోత్రం

కల్పాదౌయా కాళికాద్యాచీ కలన్మధుకైటభౌ
కల్పాంతే త్రిజగత్సర్వం ధూమవతీం భజామి తాం ॥ 01 ॥

ఘూర్ణా ఘూర్ణ కరా ఘోరా ఘూర్ణితాక్షీ ఘనస్వనా
ఘూతినీ ఘాతుకానాం యా ధూమవతీ భజామితాం ॥ 02 ॥

చర్వంతీం అస్థిఖండానం చండ ముండ విదారిణీం
చండాట్టహాసినీం దేవీం భజే ధూమావతీ మహమ్‌ ॥ 03 ॥

ఢమరూ డిండిమారావాం ఢాకినీ గణమండితామ్‌
డాకినీం భోగసంతుష్టాం భజే ధూమవతీ మహమ్‌ ॥ 04 ॥

శంకరీం శంకర ప్రాణాం సంకట ధ్వంసం కారిణీం
శత్రు సంహారిణీం శుద్ధాం శ్రయే ధూమవతీ మహమ్‌ ॥ 05 ॥

ప్రాతర్యాస్యాత్కుమారీ కుసుమకళికయా జాపమాలాం జపంతీ
మధ్యాహ్నే ప్రౌఢ రూపా వికసిత వదనా చారునేత్రా నిశాయామ్‌॥ 06 ॥

సంధ్యాయాం వృద్ధ రూపా గలితకుచయుగా ముండమాలాం వహంతీ
సా దేవీ దేవదేవీ త్రిభువన జననీ కాళికా పాతు యుష్మాన్‌ ॥ 07 ॥

Haridra Pasupu Ganapathi Pooja - (హరిద్రా) పసుపు గణపతి పూజ

శ్రీ పసుపు గణపతి పూజ. పూర్వాంగం ॥ అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి ॥ ప్రాణప్రతిష్ఠ ఓం అసునీతే పునరస్మాసు చక్...