Wednesday, December 31, 2025

Undralla Tadde Katha - ఉండ్రాళ్ళ తద్దె కథ

ఉండ్రాళ్ళ తద్దె కథ

పూర్వం ఒకరాజుకు ఏడుగురు భార్యలు వున్నప్పటికీ.. అతను చిత్రాంగి అనే వేశ్యపై ఎక్కువగా మక్కువ కలిగి వుండేవాడు. ఆమెతోనే సమయాన్ని గడిపేవాడు.

ఒకనాడు భాద్రపద బహుళ తదియనాడు రాజుగారి ఏడుగురు భార్యలు ఉండ్రాళ్లతద్ది అనే నోమును నిర్వహించుకుంటున్నారని చెలికెత్తెల ద్వారా చిత్రాంగి వింటుంది. అప్పుడు ఆ చిత్రాంగి, రాజుతో.. నువ్వు వివాహం చేసుకున్న నీ భార్యలతో ఉండ్రాళ్ల తద్దీ నోము చేయించుకున్నావు. నేను ఒక వేశ్య అవడంవల్ల నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు. నీ భార్యలమీద వున్న ప్రేమ నా మీద కూడా వుంటే.. ఉండ్రాళ్ల తద్దీ నోమును అవసరమైన సరుకులను నాకోసం ఏర్పాటు చేయ మని అడిగింది.

ఆమె కోరికను రాజు అంగీకరించి.. నోముకు కావలసిన పదార్థాలను, సరుకులను ఆమెకోసం ఏర్పాటు చేస్తాడు. అవి అందగానే వేశ్య అయిన చిత్రాంగి.. భాద్రపత తృతీయనాడు సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగన స్నానాన్ని ఆచరిస్తుంది. సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుడా ఉపవాసం వుంటుంది. చీకటి పడగానే గౌరీదేవికి బియ్యపు పిండితో తయారుచేసుకున్న
ఉండ్రాళ్లు వండుకొని ముత్తయిదువును తీసుకొనివచ్చి అయిదు ఉండ్రాళ్లు నైవేద్యము పెట్టి అయిదు ఉండ్రాళ్లు వాయనము, దక్షిణతాంబూలము ముత్తయిదువ కిచ్చి యావేశ్యకాంత యధావిధిగ నోము నోచుకొనెను. ఈ ప్రకారము అయిదేండ్లు నోము నోచుకొని అయిదుగురు ముత్తయిదువులకు తలయంటి నీళ్ళుపోసి గోరింటాకిచ్చి అయిదు రవికెల గుడ్డలను, అయిదు డబ్బులును, తాంబూలములనిచ్చి యా నోము నుద్యాపనము చేసుకొనియెను. కథలోపమైనా వ్రతలోపము కాకూడదు. భక్తితప్పినా ఫలము తప్పదు. దాని ఫలితంగా ఆమె పవిత్రంగా, సద్గతిని పొందుతుంది. 

వ్రత విధానం:
భాద్రపద తృతీయనాడు స్త్రీలు ఉదయాన్నే లేచి ముందుగా అభ్యంగన స్నానం ఆచరించాలి. సాయంత్రవరకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోకుండా ఉపవాసం వుండాలి. బియ్యపు పిండితో తయారుచేసిన ఉండ్రాళ్లను చేసి, వాటిని వండుకోవాలి. గౌరిదేవిని పూజామందిరంలో ప్రతిష్టించుకున్న తరువాత పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి.

తరువాత ఐదు ఉండ్రాళ్లను గౌరిదేవికీ, మరో ఐదు ఉండ్రాళ్లను ఐదుగురు ముత్తైదువులకు వాయనమివ్వాలి. ఇలా ఐదు సంవత్సాలవరకు ఈ నోమును ఆచరించిన తరువాత వచ్చిన వారందరి పాదాలకు పసుపు-పారాణి రాసి, వారి ఆశీస్సులను పొందాలి. పెళ్లికాని అమ్మాయిలు ఈ నోమును నోచుకుంటే మంచి భర్త లభిస్తాడు.

ఇతర విశేషాలు:
భాద్రపద బహుళ తదియరోజు స్త్రీలు సద్గతులు పొందడానికి ఉండ్రాళ్ల తద్ది నోమును ప్రత్యేకంగా ఆచరించి, నిర్వహించుకుంటారు. ఈ నోమును మోదక తృతీయ అనే మరో పేరు కూడా వుంది. ఉండ్రాళ్ల నివేదన కలిగిన నోము కావడంతో.. తద్ది అనేమాట మూడవరోజు తదియ అనే అర్థంతో ఉపయోగించబడింది. దీంతో ఇది ఉండ్రాళ్ల తద్దిగా పిలువబడుతుంది. భాద్రపదంలో పూర్ణిమ వెళ్లిన మూడోరోజున బహుళ తదియనాడు ఈ నోమును నోచుకోవాలని పూర్వీకులు నిర్ణయించారు. అంతేకాదు.. సాక్షాత్తు శివుడే స్వయంగా పార్వతీదేవికి ఈ నోము గురించి వివరించాడని ఐతహ్యం.


Padaharu Kudumula Katha - పదారు కుడుముల తద్దెకథ

పదారు కుడుముల తద్దెకథ

ఒక రాజుకూతురు పూర్వజన్మమున పదారుకుడుముల తద్దినోము పట్టి యది యుల్లంఘనము చేసినందున ఆమెకు దారిద్య్రమును, వైధవ్యమును సంభవించెను. ఆ దారిద్య్రబాధకామె యనుభవింపజాలక ప్రాణములు విడువనెంచి యొకనాడొక యడవిత్రోవను బట్టి పోవుచుండెను. అప్పుడు భూపరిపాలనకై పార్వతీ పరమేశ్వరులా దారిని వచ్చుచు నాయింతిని జూచి "నీవెవరవు? ఇట్లేల నొంటరిగా నీకారడవిలో భయములేక పోవుచున్నావ"ని యడుగగా "కుడువకూడు, కట్టబట్ట, దారిద్య్రముచేత బాధపడలేక యీ యడవులబట్ట పోవుచున్నా" ని ఆమె చెప్పెను. అప్పుడు పార్వతీదేవి - "నీవు పదియారు కుడుములబెట్టి నోముపట్టి యుల్లంఘనము చేసినావు కనుక, యిట్టి బీదతనము నిన్ను బాధించుచున్నద" ని చెప్పెను. అది విని ఆ రాజకుమార్తె "అమ్మా! యాలోటు నేనెట్లు పూర్తిచేసుకొనగలుగుదును? దయచేసి చెప్పవలయున" ని ప్రార్థించెను. అందుకు పార్వతీదేవి యామెతో "నీవిప్పుడు తిరుగనింటికిపోయి భాద్రపదశుద్ద తదియనాడు నోముపట్టికథ చెప్పుకొని యక్షింతలువేసుకొని యానోము నుద్యాపనచేయు" మన, పార్వతీ పరమేశ్వరులకు భక్తితో నమస్మారముచేసి వారివద్ద సెలవుతీసుకొని, యింటికిపోయి తలంటి నీళ్ళుపోసుకొని బిళ్లకుడుములు వండుకొని, చల్ల తెచ్చుకొనుటకై పొరుగింటి కేగెను. ఆ సమయముననొక కుక్కవచ్చి యోరగిల వేసిన తలుపుతోచుకుని యా కుడుములను తినిపోయెను. అప్పుడా రాజకుమార్తెవచ్చి కుడుములు తినిపోవుచున్న యాకుక్కను చూచి, యది కుడుములతినుట గ్రహించి నిండుమనస్సుతో నాకుక్కకే తాను తెచ్చిన చల్ల మూడుముంతలు పోసెను. ఆ కుక్క గౌరిగా మారి యామెకు ప్రత్యక్షమై ఆమెకు అఖండ అయిశ్వర్యములను ఇచ్చెను.

నాటి నుండి యారాచకూతురు సిరిసంపదలు గలదై యెటేటపదియారుబిళ్ల కుడుములు నైవేద్యముచేసి పదియారు బిళ్లకుడుముల వాయనమును, దక్షిణ తాంబూలములతో నొక ముత్తయిదువకు వాయనమిచ్చి యుద్యాపచేయుచు, భూలోకలమున నధికైశ్వర్యములననుభవించెను.

పూజ విధానము: భాద్రపదశుద్దతదియ ( తెల్లవారితే వినాయకచవితి ) నాడు ఉదయమే తలంటుకొని పసుపు తో గౌరమ్మని చేసిఓ తమలపాకులో పెట్టిపూజ ప్రారంభించాలి. ముందుగా సంకల్పము చెప్పుకొనిగౌరీ దేవిని శోడషోపచారముల తో పూజించాలి. పూజ తరువాత చేతిలో అక్షింతలు పట్టుకొనినోము కథ చదువుకోవాలి. ఆ తరువాత ఆ అక్షింతలు , కొద్దిగా అమ్మవారిపై వేసికొన్ని మన నెత్తిన చల్లుకోవాలి. ఆ పై నోములో చెప్పిన విధముగా పదహారు బిళ్ళ కుడుములు (బియ్యం పిండిలో తగినంత బెల్లము పొడిచేసి వేసికొద్ది గా నెయ్యికొద్ది గా ఇలాచీపొడి వేసిబాగా కలపాలి. ఆ పిండిని పదహారు ఉండలుగా చేసిఒక్కో ఉండను కొద్దిగా వత్తిబిళ్ళలాగా చేయాలి.) చేయాలి. రెండు కొత్త చేటలు తీసుకొనివాటికి పసుపు రాసికుంకుమ బొట్టు పెట్టిఒక చాటలో పదహారు కుడుములుపసుపుకుంకుమపెట్టి రెండో చాట తో ఆ చాటను కప్పిఒక ముతైదువుకు వాయనమిచ్చిపాదనమస్కారము చేసిఆశీర్వాదము పొందాలి. ఇది ఏనోముకైనను తప్పనిసరి.

దీనికి ఉద్యాపనము- పదియారు చేటలను, చేటయొక్కంటికి పదియారెేసి బీళ్లకుడుములు, పదియారు డబ్బులును, దక్షిణ, నల్లపూసలు, లక్కబోడు పెట్టి ఉద్యాపనము చేసుకొనవలయును. కధలోపమైన వ్రతలోపము కాకూడదు. భక్తితప్పినా ఫలము తప్పదు.

పదహారు కుడుముల నోము బాద్రపదమాసములో , వినాయక చవితి రోజున కాని , బాద్రపదశుద్ధ తదియ నాడు కాని పట్టాలి . వీలైతే అదేరోజున కూడా ఉద్యాపన చేయవచ్చు. ఉద్యాపన తప్పకుండా పుట్టింటిలోనే చేయాలి . లేదా ఆఖర్చులు పుట్టింటి వారు పెట్టాలి. సామాన్యముగా అన్ని నోములు పుట్టినింటిలో అత్తింటివారి ఆద్వర్యము లోనే పడుతారు . ఉద్యాపన పుట్టింటిలోనే చేస్తారుకాని వేరేవాటికి కన్న ఈ నోముకు మాత్రము పుట్టింటివారి భాద్యత తప్పనిసరి .

ఏనోము కైనా ఆ నోముకు ప్రత్యేకముగా చెప్పిన అమ్మవారినైతే తప్పమిగితావాటికి జగన్మాత ఐన గౌరిదేవిని పూజిస్తారు.

మంగళం
సతతమూ ఆరోగ్య భాగ్యంబు నొసగెడి
శ్రీ గౌరిదేవికి జయ మంగళం నిత్య శుభ మంగళం 
సర్వవిధ సౌభాగ్యములనిచ్చి బ్రోచెడి
శ్రీ గౌరిదేవికి జయ మంగళం
 నిత్య శుభ మంగళం 
ఇంటా బయట హెచ్చు పసుపు కుంకుమ పండ
స్త్రీల చల్లగ జూచు మా గౌరిదేవికి జయ మంగళం
 నిత్య శుభ మంగళం 
శక్తి కొలదైన భక్తి మెండుగ నున్న
అభయహస్తము జూపు అమ్మ శ్రీ గౌరికి
జయ మంగళం నిత్య శుభ మంగళం
జయ మంగళం నిత్య శుభ మంగళం.

Mooga Nomu - మోబేటి పద్మము (మూగనోము)

మోబేటి పద్మము (మూగనోము)

ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక శుద్ధ పూర్ణిమ వరకును మూడుపూటలు భోజనముచేసి సాయంకాల సమయమున కంఠ స్నానముచెసి శుచియై తొలియేట తులసివద్ద నాలుగు పద్మములు పెట్టుకొని నాలుగు వత్తుల దీపము పెట్టుకొని మాట్లాడకుండ నలుగురు ముత్తయిదువులకు బొట్టుపెట్టి తరువాత నాలుగు నక్షత్రములను లెక్కపెట్టవలయును.

రెండవయేట యెనిమిది పద్మములు పెట్టి యెనిమిది వత్తులదీపము వెలిగించి యెనమండుగురు ముత్తయిదువులకు బొట్టుపెట్టి యెనిమిది నక్షత్రములు లెక్కపెట్టవలయును. 

మూడవయేట పండ్రెండు పద్మములకు పండ్రెండు వత్తుల దీపమునును పెట్టి పండ్రెండుగురు ముత్తయిదువులకు బొట్టుపెట్టి పండ్రెండు నక్షత్రములు లెక్క పెట్టవలయును.

దీనికి ఉద్యాపనము - 
తొలియేట నాలుగేసి అట్లు నలుగురు ముత్తయిదువులకు వాయనమిచ్చి దక్షిణతాంబూలము, నల్లపూసలు, లక్కజోడు ఇయ్యవలెను. నోము నోచుకున్న హరలకు రెండు చేతుల మీద రెండు అట్లున్ను, రెండు డబ్బులున్నూ, రెండుకాళ్లమీద రెండు అట్లున్నను, రెండు డబ్బులున్నూవుంచి, అన్నగారు తలుపు వెనుకనుండి "తిని కుడిచే కాలానకు రాకే పెడసరగండ" అంటే "ఇప్పుడు రానా? మాపునరానా ఏం?" అని అడుగవలయును. అప్పుడు నోముపట్టిన కన్య, "యిప్పుడే రమ్ము అనవలయును". అన్న వచ్చి పుస్తకముతో నాలుగు దెబ్బలుకొట్టి నాలుగుఅట్లు, నాలుగు డబ్బులు తీసికొనవలయును. ఈ ప్రకారము రెండవయేట యెనిమిది వాయనములును, మూడవయేట పండ్రెండు వాయనములును ముత్తయిదువుల కియ్యవలెను.

నోము పాట

మోచేటి పద్మంబు పట్టేటివేళ - మొగ్గల తామర్లు పూసేటి వేళ
కాకరపువ్వుల్లు పూసేటివేళ - కడవలతో నుదకమ్ము తెచ్చేటి వేళ
అనసాపువ్వుల్లు పూసేటివేళ - అటికెలతో నుదకమ్ము తెచ్చేటి వేళ
గుమ్మడి పువ్వుల్లు పూసేటివేళ - గుండెగలతో నుదకమ్ము తెచ్చేటి వేళ
బీరపువ్వుల్లు చాలపూసేటివేళ - బిందెలతో నుదకమ్ము తేచ్చేటి వేళ
సంధివేళ దీపమ్ము పెట్టేటివేళ - చాకలి మడతలు తెచ్చెటి వేళ
ఆవూలూ గోవులూ వచ్చేటివేళ - ఆంబోతుల్లు రంకెలు వేసేటివేళ
అన్నలూ అందనా లెక్కెటి వే
ళ - తమ్ములూ తాంబూలం వేసేటి వేళ
మరుదుళ్లు మరిజూదమాడేటివేళ - కూతుళ్లు గుండిగలు దించేటివేళ
బావలూ పల్లకి లెక్కేటివేళ - మరదలూ మరిజూద మాదేటివేళ
కోడళ్ళు కొట్టుపసుపు కొట్టేటి వేళ చెల్లెలు చేమంతులు ముడిచేటివేళ

ముద్దు మొగ ముద్దానిబోలు, తన మొఖము తామర పద్మాన్నిబోలు, పద్మము
పెట్టిన చానకు పదివేళ యేండ్ల అయిదవతనమును, ముగ్గుపెట్టిన చానకు మూడువేల యేళ్ళు అయిదవతనమును, 

ఈ పాట పాడుచు తులసమ్మకు ప్రదక్షిణలు చేసి అక్షంతలు వేసికొనవలయును.

Kukshi Kukke Temple - కుక్షి కుక్కే క్షేత్రం

నాగదోష నివారణ క్షేత్రం- కుక్షి (కుక్కే)

ఉడిపితో సహా మిగిలిన అయిదు క్షేత్రాలు ఉత్తర కర్ణాటకలో సాగర తీరంలో ఉండగా ఈ ఒక్క క్షేత్రం దూరంగా దక్షిణ కర్ణాటకలో ఉంటుంది. ఈ దివ్యక్షేత్ర పురాణగాధ సత్య యుగం నాటిది. లోకకంటకులైన తారకాసుర మొదలైన రాక్షసులను సంహరించిన శివ కుమారునికి దేవేంద్రుని కుమార్తె అయిన దేవసేనతో మార్గశిర శుద్ధ షష్టినాడు ఇక్కడే జరిగిందని అంటారు. స్కందునికి మంగళ స్నానం చేయించడానికి దేవతలు అనేక పవిత్ర నదీ జలాలను తెచ్చారు. ఆ జలాల ప్రవాహమే నేటి కుమార ధార. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య కుక్కే క్షేత్రాన్ని సందర్శించినట్లుగా శంకర విజయం తెలుపుతోంది. కుక్కె నాగదోష పూజలకు ప్రసిద్ధి. గరుడుని వలన ప్రాణ భయం ఏర్పడటంతో సర్ప రాజు వాసుకి ఇక్కడ దాక్కొని సర్వేశ్వరుని గురించి తపము చేసాడు. కుమారస్వామి తన వివాహ సందర్భంగా తండ్రి ఆదేశం మేరకు నాగారాజుకి అభయమిచ్చారు. ఇద్దరూ కలిసి ఇక్కడ కొలువైనారు. అందువలన ఇక్కడ చేసే పూజలు నాగ దోషాన్ని తొలగిస్తాయి. భక్తులు వివాహం, సంతానం, ఆరోగ్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. నాగప్రతిష్టలు చేస్తుంటారు. కుమారధారలో స్నానం చేయడం వలన కుష్టు వ్యాధి లాంటివి కూడా తగ్గుతాయని విశ్వసిస్తారు. ప్రతి నిత్యం వేలాది మందికి అన్నదానం జరుగుతుందిక్కడ.



NAVA GRAHA TEMPLES - నవ గ్రహ దేవాలయాలు

నవ గ్రహ దేవాలయాలు

నవగ్రహములు తొమ్మిది. ఒకొక్క గ్రహనికి ఒక్కొక్క దేవాలయము ఉన్నది.

కుంభ‌కోణం
తమిళనాడు లోని కుంభకోణం క్షేత్రానికి అతి సమీపంలో నవగ్రహ దేవాలయాలున్నాయి. వీటిని దర్శించిన భ‌క్తులు విశేషంగా గ్రహ పీడలను తొలగించుకొంటారు. ఈ ఆలయాలనే నవగ్రహ స్థలాలు అంటారు.

సూర్యనార్ కోయిల్ - తిరుమంగళంకుడి
తమిళనాడు రాష్ట్రము లోని తంజావూరు జిల్లాలో కుంభకోణం నుండి 15 k.m దూరములో గల తిరుమంగళంకుడి అను ప్రాంతములో సూర్యనార్ కోయిల్ పిలువబడే సూర్యదేవలయము వున్నది. ఈ ఆలయములో సూర్యభగవానుడు ఆయన సతీమనులు అయిన ఉష, ఛాయా సమేతముగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఆలయాన్ని క్రీ . శ 1075 -1120 సంవత్సరాల మధ్య కాలంలో ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయ ప్రాంగణములో కాశీ విశ్వేశ్వరుడు, విశాలాక్షిని, నవగ్రహాలచే ప్రతిష్టించిన వినాయకుని దర్శించుకోవచ్చు.
ఈ ఆలయములో సూర్యభగవానుడికి తామర పుష్పాలతో పూజలు చేయడము విశేషము.
ఈ ఆలయ పూజలు చాల నిష్ఠగా జరుగుతాయి, పూజాంనతరము (పూజ తరువాత) ఆలయము చుట్టూ 9 సార్లు ప్రదక్షణ చెయ్యవలసి వుంటుంది, మరియు ఇక్కడ పూజలు చేయిస్తే ఆయురారోగ్యాలతో ఉంటారని అక్కడి భక్తుల ద్వారా తెలుస్తుంది. 
1100వ సంవత్సరంలో కులోత్తుంగ చోళ మహారాజు సూర్య దేవాలయాన్ని నిర్మించాడు. ప్రతి ఏడాది పంటలు చేతికి వచ్చే జనవరి మాసంలో సూర్యునికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు విశేషమైన ఉత్సవాన్ని ఇక్కడ నిర్వహిస్తారు.

ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. రవి సంపద ప్రదాత కూడా.

చంద్రగ్రహ దేవాలయము - తిరువైయార్
తిరువైయారుకు 5 k.m దూరములో చంద్రగ్రహ దేవాలయము వుంది. తిన్గాలుర్ కోవిల్ అని పిలువబడే చంద్ర దేవాలయములోని చంద్రభగవానుని దర్శనము సుఖాన్ని,దీర్ఘాయుస్సున్ని, ప్రసాదిస్తుందని భక్తుల నమ్మకము. మానసిక ఒత్తిడి, దుఖాన్ని తగ్గించేవాడు చంద్రుడని చెబుతారు. సెప్టెంబర్.. అక్టోబర్ మాసాలలో వొచ్చే ఫాల్గుణ నక్షత్ర సమయాలలో చంద్రకాంతి ఇక్కడి ఆలయములోని శివలింగముపై సరాసరిగా ప్రసరించడము విశేషమయినది.


అంగారక (కుజ) గ్రహ దేవాలయము - వైథీశ్వరన్ కోవిల్
తిరువైయార్‌కు ఆరు (6 km ) కిలోమీటర్ల దూరంలో కుజ దేవాలయం ఉంది. దీనికి ‘’వైథీశ్వరన్ కోవిల్’’అని పేరు. అనేక వ్యాధులను అంగారకుడు పోగోడతాడని విశ్వాసం. ధైర్యం విజయం శక్తికి అంగారకుడే కారణం. ఇక్కడే జటాయువు, గరుడుడు, సూర్యుడు అంగారకుని పూజించారని స్థల పురాణం చెపుతోంది. ఇక్కడ అనేక వ్యాధులను అంగారకుడు రూపుమపుతాడని భక్తుల విశ్వాసము, నమ్మకము. ధైర్యము, విజయము, శక్తికి అంగారకుడే కారణము. వివాహము ఆలస్యము అయితే ఈ అంగారక క్షేత్రాని దర్శిస్తే వెంటనే వివాహము అవుతుందని స్థానికులు చెపుతున్నారు .

బుధగ్రహ దేవాలయము - తిరువెన్నాడు
అంగారక ఆలయానికి 10 k.m దూరములో బుధగ్రహ దేవాలయము వున్నది. ఇక్కడి స్వామి శ్వేతారన్యేశ్వరుడు. అమ్మవారు బ్రహ్మ విద్యయంభికాదేవి. వాల్మీకి రామాయణములో ఈ దేవాలయము గురించి వుంది అని చెబుతారు. ఇక్కడ బుధగ్రహ దేవాలయము దర్శించిన వారికి వ్యాపారాని మరియు బుద్ధిని ప్రసాదిస్తాడని ఇక్కడ ప్రజలకు నమ్మకము.

బృహస్పతి (గురు) గ్రహ దేవాలయము - ఆలంగుడి
కుంభకోణానికి 18 k.m దూరములో ఆలంగుడి లో గురు గ్రహ దేవాలయము వున్నది. ఈ ఆలయాన్ని గురు దక్షిణామూర్తి ఆలయంగా భక్తులు పిలుస్తారు. ఇది తమిళనాడులో ప్రఖ్యాతి గాంచిన దివ్యక్షేత్రము. దీనిని క్రీ.శ 1131 లో విక్రమచోల చక్రవర్తి నిర్మించారు. శివుడే దేవ గురువు బృహస్పతి నామదేయముతో గురుదక్షిణామూర్తిగా పూజలు అందుకుంటూన్న పుణ్యక్షేత్రము ఇది. పార్వతి అమ్మవారు ఇక్కడి ఆలయం లోపలున్న అమృత పుష్కరిణిలో పునర్జనం పొందిందని కధనం. ఇక్కడే శివునిలో ఐక్యమైందని చెబుతారు. భోలాశంఖరుడు ఇక్కడే హాలాహలంని సేవించి గొంతులో దాచిన స్థలము ఇదే. ఆ విధముగా ఆపద నుంచి గట్టెకించిన శివుణ్ణి ' ఆపత్ సహాయేశ్వరర్ (ఆపద్భాందవుడు) గా కొలిచారు దేవతలు. గురుడికి ఇష్టమైన గురువారము నాడు, నాన బెట్టిన శనగలను పసుపుతాడుతో మాలగ చేసి గురు గ్రహానికి దండ వేసిన చదువులో ఆటంకాలు, వెనుకబడిన వారు చదువులో మరియు ఏ పని అయిన అయిపోవలిసిన వారికి, విద్యలో ఆటంకాలు, పనిలోనూ అన్నీ తొలగి పోతాయని నమ్మకము. గురు గ్రహ దోషాలు వున్నవారు దక్షిణామూర్తి గుడి చుట్టూ 24 ప్రదక్షిణలు చేసి ఈ స్వామి సన్నిధిలో నేతితో 24 దీపాలు భక్తితో వెలిగిస్తే ఆ దోషాలు తొలిగిపోయి, గ్రహ శాంతి కలుగుతుంది అని భక్తుల ప్రగాడ విశ్వాసము.

శుక్ర గ్రహ దేవాలయము - కామ్చనూరు
కంచానూర్లో సూర్య దేవాలయానికి 3 k.m దూరములో శుక్ర గ్రహ దేవాలయము వుంది. దీనికి పలాశవనం, బ్రహ్మపరి, అగ్నిస్థలము అని పేర్లు కూడా వున్నాయి. ఇక్కడే బ్రహ్మ దేవుడు పార్వతీ పరమేశ్వరుల వివాహాన్ని దర్శించాడట. ఇక్కడ తమ భార్యల ఆరోగ్యము కొరకు తమ భర్తలు పూజలు చేస్తారు.

శని గ్రహ దేవాలయము - తిరునల్లార్
ఇది కుంభకోణానికి 53 k.m కరైకాల్‌కు 5 కి.మీ దూరంలో వున్నది. ఇక్కడి నది తీర్ధములో స్నానం చేస్తే సర్వపాపాలు హరించిపోతాయి అని భక్తుల నమ్మకము. ఈ ఆలయములో వెలిసిన స్వామివారి పేరు దర్భారన్యేశ్వరుడు. ఈ దేవుడికి గరిక అంటే చాల ప్రీతి. అందుకే ఈ గుడిలో గరిక మొక్కను అతి పవిత్రముగా భావిస్తారు . అందువల్ల ఈ స్వామిని దర్భాదిపతి అని కూడా అంటారు.
ఈ దేవాలయము దర్శించినపుడు భక్తులు దర్భల కొసలు ముడివేస్తారు. ఇలా ముడివేస్తే తమ కష్టాలు గట్టు ఎక్కుతాయని భక్తుల నమ్మకము. ఇచట నలనారాయణ అనే విష్ణు దేవాలయము వున్నది. ఇక్కడ నలదమయంతుల విగ్రహాలు వున్న గుడి ఇదే. శనీశ్వరునితో పాటు నలదమయంతులను పూజ చేస్తే శని ప్రభావము ఉండదు. ఇక్కడ బ్రహ్మదండ అనే తీర్ధము కూడ వున్నది. ఇక్కడే నల మహారాజును శని పట్టుకొని పీడించటం ప్రారంభించాడని కధ. ఇక్కడి నల తీర్ధం చాలా మహిమ కలిగింది. ఇందులో స్నానం చేస్తే పాపాలన్నీ కొట్టుకు పోతాయ‌ని భ‌క్తుల న‌మ్మిక‌. ఇక్కడ శనీశ్వరునికి నిత్యము అభిషేకము జరుగుతుంది.

రాహు గ్రహ దేవాలయము - తిరునగేశ్వరాము
కుంభకోణానికి 5 k.m దూరములో వుంది. ఇక్కడ రాహు గ్రహామునకు గల దేవాలయము ఇది ఒక్కటే. ఇక్కడ నిత్యము వచ్చే రాహుకాల సమయములో పాలాభిషేకము చేస్తారు. ఆ పాలాభిషేకము జరిపినపుడు రాహువు శిరస్సు పైన నుండి పాలు పోస్తే కంట భాగము (మెడ) దగ్గరకు వచ్చేసరికి పాలు అన్ని నీలము రంగులోకి మారతాయి. మిగిలిన సమయాలలో ఇలా జరగదు. ఇక్కడి శివుడు నాగనాద స్వామి. అమ్మవారు గిరి గుజాంబికా దేవి. ఇక్కడ ఆదిశేషుడు, దక్షుడు, కారకోటుడు రాహువు స్థలమైన ఈ శివుడిని అర్చించారు. ఇక్కడ పూజలు చేసుకునేవారికి రాహు దోషాలు పోతాయి.

కేతు గ్రహ దేవాలయము - కిల్ పేరుంపళ్లమ్
తిరువేన్నాడ్ నుండి 6 k.m దూరములో వున్నది. ఈ ఆలయములో కేతు గ్రహ దోషానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయము వద్ద ఒక ప్లేటులో 7 ప్రమిదలలో దీపము వెలిగిస్తారు.
ఇక్కడ కేతు గ్రహానికి సంబందించిన నివారణ పూజలు చేస్తారు. ఇక్కడి శివుడు మహా మహిమాన్వితుడు. రాహుకేతువులు జంట సర్పాకారంలో కలిసి ఉండి, క్షీర సాగర మథనంలో శివునికి సాయం చేశారని ప్రతీతి. ఈ ఆలయాల వద్ద గల 9 పుష్కరిణిలో స్నానములు చేసి 12 వారాలు నవగ్రహాలను ఆరాదిస్తే, ఈ నవగ్రహ అనుగ్రహము లభిస్తుంది.

అదిత్యాయచ సోమాయ మంగళాయ బుదాయచ..
గురు శుక్ర శనిభ్యచ్చ రాహావే కేతవే నమః..!!

Monday, December 29, 2025

Mukkoti Ekadashi - ముక్కోటి ఏకాదశి - ఉత్తర ద్వార దర్శనం

ముక్కోటి ఏకాదశి 
వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి దక్షిణ భారతదేశంలో ప్రముఖంగా జరుపుకుంటారు. ఏకాదశి నాడు శ్రీ హరివిష్ణువును ఆరాధిస్తారు. ఉత్తర భారతదేశంలో, పౌషమాసంలో వచ్చే ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఏకాదశి ఉపవాసం పాటించే వ్యక్తులు మోక్షాన్ని (మోక్షం) పొంది స్వర్గలోకానికి చేరుకుంటారని నమ్ముతారు. ఈ ఉపవాసం జీవితంలో సానుకూలతను తెస్తుంది మరియు ప్రాపంచిక ఆనందాలతో నింపుతుంది.

విష్ణువు భక్తులకు ఏకాదశి ఎంతో ప్రాముఖ్యత ఉంది. భక్తులు ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువు అవతారములను పూజిస్తారు. 

వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత
పురాణాల ప్రకారం, ఈ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజున సముద్ర మథనం జరిగింది. ఈ సముద్ర మథనం సమయంలో అమృతం ఉద్భవించింది. కాబట్టి ఈ పవిత్రమైన రోజున మరణించిన వ్యక్తులు జీవిత మరియు మరణ చక్రం నుండి విముక్తి పొందుతారని మరియు వైకుంఠ ప్రాప్తి పొందుతారని విశ్వసిస్తారు.  

ఈ ఏకాదశిని వైకుంట ఏకాదశి అని కూడా అంటారు. పూర్వం వైఖానసుడు అనే ఒకరాజుకి.. ఒకనాడు తన తండ్రి నరకం లో ఉండిపోయి యమయాతనలు పడుతూ ఉన్నట్లు కల వచ్చింది. అందుకు వైఖానసుడు మార్గశిర శుద్ధ ఏకాదశినాడు ఉపవాసం ఉండి నియమాలతో వ్రతం చేశాడు. ఆ వ్రత ఫలితంగా అతని తండ్రి స్వర్గలోకానికి చేరాడు. తండ్రికి మోక్షం ఇప్పించిన ఏకాదశి కావడం చేత దీనికి మోక్షదైకాదశి అని పేరు వచ్చింది. ఈనాడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన వారికి జనన మరణ రహితమైన మోక్షప్రాప్తి కులుగుతుందని పెద్దలు చెబుతున్నారు.

దక్షిణాది రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశిని ప్రముఖంగా జరుపుకుంటారు. శ్రీరంగం మరియు తిరుపతి ఆలయ వేడుకలు ప్రధానంగా వైకుంఠ ఏకాదశికి ప్రసిద్ధి చెందాయి. వైకుంఠ ఏకాదశిని ప్రధానంగా శ్రీ రంగనాథస్వామి ఆలయంలో జరుపుకుంటారు మరియు ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున లక్షలాది మంది భక్తులు విచేస్తారు. ఈనాడు నామ్పెరుమాళ్ ను విలువైన పూలతో అలంకరిస్థారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి వైభవం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.

ఆంధ్రప్రదేశ్లోని భద్రాచలంలోని సీతా రామచంద్రస్వామి ఆలయంలో ఈ ఏకాదశిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున రాముడు మరియు లక్ష్మణ విగ్రహాలను ఊరేగింపుగా బయటకు తీస్తారు.

విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః 
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః

ఉత్తర ద్వార దర్శనం
ముక్కోటి ఏకాదశి రోజు ఆలయాల్లో భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు. అసలు ఉత్తర ద్వార దర్శనం అంటే ఏమిటి..? ఉత్తర ద్వార దర్శనం లోని అర్ధం, పరమార్ధం ఏమిటో ఒకసారి తెలుసుకుందాం.

ఈ మార్గశిర మాసం హేమంత ఋతువులో మెదటినెల. దీనినే సౌరమానాన్ని అనుసరించి ధనుర్మాసం అని, చాంద్రమానం ప్రకారం మార్గశిర మాసమని అన్నారు. ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే, మన పెద్దలు సంవత్సరకాలాన్ని ఉత్తరాయణం, దక్షిణాయణం అని రెండు భాగాలుగా విభజించారు. ఉత్తరాయణం పుణ్యకార్యాలకు ఉత్తమమైనదనీ, ఆకాలంలో మరణించిన వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం.

ముక్కోటి ఏకాదశి రోజున ఎక్కువ మంది భక్తులు ఉత్తర ద్వారం గుండా శ్రీమన్నారాయణుని దర్శించుకోవాలని ఆరాటపడుతూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్న వైకుంఠంలోని వాకిళ్లు ఈరోజునే తెరుచుకుంటాయి. వైకుంఠం వాకిళ్లు తెరుచుకునే పర్వదినమైన ముక్కోటి ఏకాదశినాడు శ్రీమహావిష్ణువు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తాడు.

అసుర(రాక్షసుల) బాధలు భరించలేక దేవతలు బ్రహ్మతో సహా వైకుంఠం వెళ్తారు. అక్కడ ఉత్తర ద్వారం దాటి శ్రీమన్నారాయణుని దర్శించి తమ బాధలను విన్నవించుకుంటారు. దీంతో స్వామి అనుగ్రహించి రాక్షస పీడ వదిలిస్తాడు. ఉత్తరద్వారం గుండా వెళ్లి వైకుంఠ దర్శనం చేసుకోవడం వల్ల వైకుంఠ ఏకాదశిగాను, దివి నుంచి భువికి దిగి వచ్చిన మూడు కోట్ల దేవతలకు గరుడ వాహనరూఢుడైన మహావిష్ణువు దర్శనానుగ్రహం ప్రాప్తించడం వల్ల ముక్కోటి ఏకాదశిగాను ఈ పర్వదినం ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. దీన్నే ‘హరివాసరమ’ని, ‘హరిదినమ’ని, ‘వైకుంఠ దినమ’ని అంటారు. 

ఈ ఒక్క ఏకాదశి ‘మూడు కోట్ల ఏకాదశుల’తో సమానమంటున్నారు పండితులు. ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశే సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులలో శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు “వైకుంఠ ఏకదశీ వ్రతం” ఆచరించిన వారికి శుభఫలితాలుంటాయి. 

సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి ఉత్తర ద్వారం శుభ సంకేతం. దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు దాని గుండా స్వర్గంలోనికి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి.

అందుకే ఈ పర్వదినాన ఉపవాసముండి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువును షోడశోపచార విధితో ఆరాధించాలి. నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేయాలి. ద్వాదశి రోజున మళ్లీ భగవదారాధన ముగించుకుని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి.

Monday, December 22, 2025

Sri Tripura Bhairavi Sahasra Namavali - శ్రీ త్రిపురభైరవీ సహస్ర నామావళి

శ్రీ త్రిపురభైరవీ సహస్ర నామావళి

ఓం త్రిపురాయై నమః ।
ఓం పరమాయై నమః।
ఓం ఈశాన్యై నమః ।
ఓం యోగసిధ్ధ్యై నమః
ఓం నివాసిన్యై నమః ।
ఓం సర్వమంత్రమయ్యై నమః ।
ఓం దేవ్యై నమః ।
ఓం సర్వసిద్ధి ప్రవర్తిన్యై నమః ।
ఓం సర్వాధారమయ్యై దేవ్యై నమః ।
ఓం సర్వసంపత్ప్రదాయై నమః ॥ 10 ॥

ఓం శుభాయై నమః ।
ఓం యోగిన్యై నమః ।
ఓం యోగమాత్రే నమః ।
ఓం యోగసిద్ధిప్రవర్తిన్యై నమః ।
ఓం యోగిధ్యేయాయై నమః ।
ఓం యోగమయ్యై నమః ।
ఓం యోగాయై నమః ।
ఓం యోగనివాసిన్యై నమః ।
ఓం హేలాయై నమః ।
ఓం లీలాయై నమః ॥ 20 ॥

ఓం క్రీడాయై నమః ।
ఓం కాలరూపాయై నమః ।
ఓం ప్రవర్తిన్యై నమః ।
ఓం కాలమాత్రే నమః ।
ఓం కాలరాత్య్రై  నమః ।
ఓం కాల్యై నమః ।
ఓం కమలవాసిన్యై నమః ।
ఓం కమలాయై నమః ।
ఓం కాంతిరూపాయై నమః ।
ఓం కామరాజేశ్వర్యై నమః ॥ 30 ॥

ఓం క్రియాయై నమః ।
ఓం కట్వై నమః ।
ఓం కపటకేశాయై నమః ।
ఓం కపటాయై నమః ।
ఓం కులటాకృత్యై నమః ।
ఓం కుముదాయై నమః ।
ఓం చర్చికాయై నమః ।
ఓం కాంత్యై నమః ।
ఓం కాలరాత్య్రై నమః ।
ఓం సదా ప్రియాయై నమః ॥ 40 ॥

ఓం ఘోరాకారాయై నమః ।
ఓం ఘోరతరాయై నమః ।
ఓం ధర్మాధర్మప్రదాయై నమః ।
ఓం మత్యై నమః ।
ఓం ఘంటా ఘర్ఘరదాయై నమః ।
ఓం ఘంటాయై నమః ।
ఓం సదా ఘంటానాద ప్రియాయై నమః ।
ఓం సూక్ష్మాయై నమః ।
ఓం సూక్ష్మతరయై నమః ।
ఓం స్థూలాయై నమః ॥ 50 ॥

ఓం అతిస్థూలాయై నమః ।
ఓం సదామత్యై నమః ।
ఓం అతిసత్యాయై నమః ।
ఓం సత్యవత్యై నమః ।
ఓం సత్యాయై నమః ।
ఓం సంకేతవాసిన్యై నమః ।
ఓం క్షమాయై నమః ।
ఓం భీమాయై నమః ।
ఓం అభీమాయై నమః ।
ఓం భీమనాద ప్రవర్తిన్యై నమః ॥ 60 ॥

ఓం భ్రమరూపాయై నమః ।
ఓం భయహరాయై నమః ।
ఓం భయదాయై నమః ।
ఓం భయనాశిన్యై నమః ।
ఓం శ్మశానవాసిన్యై నమః ।
ఓం దేవ్యై నమః ।
ఓం శ్మశానాలయవాసిన్యై నమః ।
ఓం శవాసనాయై నమః ।
ఓం శవాహారాయై నమః ।
ఓం శవదేహాయై నమః ॥ 70 ॥

ఓం శివాయై నమః ।
ఓం అశివాయై నమః ।
ఓం కంఠదేశ శవాహారాయై నమః ।
ఓం శవకంకణ ధారిణ్యై నమః ।
ఓం దంతురాయై నమః ।
ఓం సుదత్యై నమః ।
ఓం సత్యాయై నమః ।
ఓం సత్యసంకేత వాసిన్యై నమః ।
ఓం సత్యదేహాయై నమః ।
ఓం సత్యహారాయై నమః ॥ 80 ॥

ఓం సత్యవాదినివాసిన్యై నమః ।
ఓం సత్యాలయాయై నమః ।
ఓం సత్యసంగాయై నమః ।
ఓం సత్యసంగరకారిణ్యై నమః ।
ఓం అసంగాయై నమః ।
ఓం సంగరహితాయై నమః ।
ఓం సుసంగాయై నమః ।
ఓం సంగమోహిన్యై నమః ।
ఓం మాయాయై నమః ।
ఓం మత్యై నమః ॥ 90 ॥

ఓం మహామాయాయై నమః ।
ఓం మహామఖ విలాసిన్యై నమః ।
ఓం గలద్రుధిరధారాయై నమః ।
ఓం ముఖద్వయనివాసిన్యై నమః ।
ఓం సత్యాయాసాయై నమః ।
ఓం సత్యసంగాయై నమః ।
ఓం సత్యసంగతికారిణ్యై నమః ।
ఓం అసంగాయై నమః ।
ఓం సంగనిరతాయై నమః ।
ఓం సుసంగాయై నమః ॥ 100 ॥

ఓం సంగవాసిన్యై నమః ।
ఓం సదాసత్యాయై నమః ।
ఓం మహాసత్యాయై నమః ।
ఓం మాంసపాశాయై నమః ।
ఓం సుమాంసకాయై నమః ।
ఓం మాంసాహారాయై నమః ।
ఓం మాంసధరాయై నమః ।
ఓం మాంసాశ్యై నమః ।
ఓం మాంసభక్షకాయై నమః ।
ఓం రక్తపానాయై నమః ॥ 110 ॥

ఓం రక్తరుచిరాయై నమః ।
ఓం ఆరక్తాయై నమః ।
ఓం రక్తవల్లభాయై నమః ।
ఓం రక్తాహారాయై నమః ।
ఓం రక్తప్రియాయై నమః ।
ఓం రక్తనిందకనాశిన్యై నమః ।
ఓం రక్తపానప్రియాయై నమః ।
ఓం బాలాయై నమః ।
ఓం రక్తదేశాయై నమః ।
ఓం సురక్తికాయై నమః ॥ 120 ॥

ఓం స్వయంభూకుసుమస్థాయై నమః ।
ఓం స్వయంభూకుసుమోత్సుకాయై నమః ।
ఓం స్వయంభూకుసుమాహారాయై నమః ।
ఓం స్వయంభూనిందకాసనాయై నమః ।
ఓం స్వయంభూపుష్పకప్రీతాయై నమః ।
ఓం స్వయంభూపుష్పసంభవాయై నమః ।
ఓం స్వయంభూపుష్పహారాఢ్యాయై నమః ।
ఓం స్వయంభూనిందకాంతకాయై నమః ।
ఓం కుండగోలవిలాసాయై నమః ।
ఓం కుండగోలసదామత్యై నమః ॥ 130 ॥

ఓం కుండగోలప్రియకర్యై నమః ।
ఓం కుండగోలసముద్భవాయై నమః ।
ఓం శుక్రాత్మికాయై నమః ।
ఓం శుక్రకరాయై నమః ।
ఓం సుశుక్రాయై నమః ।
ఓం సుశుక్తికాయై నమః ।
ఓం శుక్రపూజకపూజ్యాయై నమః ।
ఓం శుక్రనిందకనిందకాయై నమః ।
ఓం రక్తమాల్యాయై నమః ।
ఓం రక్తపుష్పాయై నమః ॥ 140 ॥

ఓం రక్తపుష్పకపుష్పకాయై నమః ।
ఓం రక్తచందనసిక్తాంగ్యై నమః ।
ఓం రక్తచందననిందకాయై నమః ।
ఓం మత్స్యాయై నమః ।
ఓం మత్స్యప్రియాయై నమః ।
ఓం మాన్యాయై నమః ।
ఓం మత్స్యభక్షాయై నమః ।
ఓం మహోదయాయై నమః ।
ఓం మత్స్యాహారాయై నమః ।
ఓం మత్స్యకామాయై నమః ॥ 150 ॥

ఓం మత్స్యనిందకనాశిన్యై నమః ।
ఓం కేకరాక్ష్యై నమః ।
ఓం క్రూరాయై నమః ।
ఓం క్రూరసైన్యవినాశిన్యై నమః ।
ఓం క్రూరాంగ్యై నమః ।
ఓం కులిశాంగ్యై నమః ।
ఓం చక్రాంగ్యై నమః ।
ఓం చక్రసంభవాయై నమః ।
ఓం చక్రదేహాయై నమః ।
ఓం చక్రహారాయై నమః ॥ 160 ॥

ఓం చక్రకంకాలవాసిన్యై నమః ।
ఓం నిమ్ననాభ్యై నమః ।
ఓం భీతిహరాయై నమః ।
ఓం భయదాయై నమః ।
ఓం భయహారికాయై నమః ।
ఓం భయప్రదాయై నమః ।
ఓం భయాయై నమః ।
ఓం భీతాయై నమః ।
ఓం అభీమాయై నమః ।
ఓం భీమనాదిన్యై నమః ॥ 170 ॥

ఓం సుందర్యై నమః ।
ఓం శోభన్యై నమః ।
ఓం సత్యాయై నమః ।
ఓం క్షేమ్యాయై నమః ।
ఓం క్షేమకర్యై నమః ।
ఓం సిందూరాయై నమః ।
ఓం అంచితసిందూరాయై నమః ।
ఓం సిందూరసదృశాకృత్యై నమః ।
ఓం రక్తాయై నమః ।
ఓం రంజితనాసాయై నమః ॥ 180 ॥

ఓం సునాసాయై నమః ।
ఓం నిమ్ననాసికాయై నమః ।
ఓం ఖర్వాయై నమః ।
ఓం లంబోదర్యై నమః ।
ఓం దీర్ఘాయై నమః ।
ఓం దీర్ఘఘోణాయై నమః ।
ఓం మహాకుచాయై నమః ।
ఓం కుటిలాయై నమః ।
ఓం చంచలాయై నమః ।
ఓం చండ్యై నమః ॥ 190 ॥

ఓం చండనాదాయై నమః ।
ఓం ప్రచండికాయై నమః ।
ఓం అతిచండాయై నమః ।
ఓం మహాచండాయై నమః ।
ఓం శ్రీచండాయై నమః ।
ఓం చండవేగిన్యై నమః ।
ఓం చాండాల్యై నమః ।
ఓం చండికాయై నమః ।
ఓం చండశబ్దరూపాయై నమః ।
ఓం చంచలాయై నమః ॥ 200 ॥

ఓం చంపాయై నమః ।
ఓం చంపావత్యై నమః ।
ఓం చోస్తాయై నమః ।
ఓం తీక్ష్ణాయై నమః ।
ఓం తీక్ష్ణప్రియాయై నమః ।
ఓం క్షత్యై నమః ।
ఓం జలదాయై నమః ।
ఓం జయదాయై నమః ।
ఓం యోగాయై నమః ।
ఓం జగతే నమః ॥ 210 ॥

ఓం ఆనందకారిణ్యై నమః ।
ఓం జగద్వంద్యాయై నమః ।
ఓం జగన్మాత్రే నమః ।
ఓం జగత్యై నమః ।
ఓం జగతః క్షమాయై నమః ।
ఓం జన్యాయై నమః ।
ఓం జలజనేత్య్రై నమః ।
ఓం జయిన్యై నమః ।
ఓం జయదాయై నమః ।
ఓం జనన్యై నమః ॥ 220 ॥

ఓం జగద్దాత్య్రై నమః ।
ఓం జయాఖ్యాయై నమః ।
ఓం జయరూపిణ్యై నమః ।
ఓం జగన్మాత్రే నమః ।
ఓం జగన్మాన్యాయై నమః ।
ఓం జయశ్రియై నమః ।
ఓం జయకారిణ్యై నమః ।
ఓం జయిన్యై నమః ।
ఓం జయమాత్రే నమః ।
ఓం జయాయై నమః ॥ 230 ॥

ఓం విజయాయై నమః ।
ఓం ఖడ్గిన్యై నమః ।
ఓం ఖడ్గరూపాయై నమః ।
ఓం సుఖడ్గాయై నమః ।
ఓం ఖడ్గధారిణ్యై నమః ।
ఓం ఖడ్గరూపాయై నమః ।
ఓం ఖడ్గకరాయై నమః ।
ఓం ఖడ్గిన్యై నమః ।
ఓం ఖడ్గవల్లభాయై నమః ।
ఓం ఖడ్గదాయై నమః ॥ 240 ॥

ఓం ఖడ్గభావాయై నమః ।
ఓం ఖడ్గదేహసముద్భవాయై నమః ।
ఓం ఖడ్గయై నమః ।
ఓం ఖడ్గధరాయై నమః ।
ఓం ఖేలాయై నమః ।
ఓం ఖడ్గన్యై నమః ।
ఓం ఖడ్గమండిన్యై నమః ।
ఓం శంఖిన్యై నమః ।
ఓం చాపిన్యై నమః ।
ఓం దేవ్యై నమః ॥ 250 ॥

ఓం వజ్రిణ్యై నమః ।
ఓం శూలిన్యై నమః ।
ఓం మత్యై నమః ।
ఓం వాలిన్యై నమః ।
ఓం భిందిపాల్యై నమః ।
ఓం పాశ్యై నమః ।
ఓం అంకుశ్యై నమః ।
ఓం శర్యై నమః ।
ఓం ధనుష్యై నమః ।
ఓం చటక్యై నమః ॥ 260 ॥

ఓం చర్మాయై నమః ।
ఓం దంత్యై నమః ।
ఓం కర్ణనాలిక్యై నమః ।
ఓం ముసల్యై నమః ।
ఓం హలరూపాయై నమః ।
ఓం తూణీరగణవాసిన్యై నమః ।
ఓం తూణాలయాయై నమః ।
ఓం తూణహరాయై నమః ।
ఓం తూణసంభవరూపిణ్యై నమః ।
ఓం సుతూణ్యై నమః ॥ 270 ॥

ఓం తూణఖేదాయై నమః ।
ఓం తూణాంగ్యై నమః ।
ఓం తూణవల్లభాయై నమః ।
ఓం నానాస్త్రధారిణ్యై నమః ।
ఓం దేవ్యై నమః ।
ఓం నానాశస్త్రసముద్భవాయై నమః ।
ఓం లాక్షాయై నమః ।
ఓం లక్షహరాయై నమః ।
ఓం లాభాయై నమః ।
ఓం సులాభాయై నమః ॥ 280 ॥

ఓం లాభనాశిన్యై నమః ।
ఓం లాభహారాయై నమః ।
ఓం లాభకరాయై నమః ।
ఓం లాభిన్యై నమః ।
ఓం లాభరూపిణ్యై నమః ।
ఓం ధరిత్య్రై నమః ।
ఓం ధనదాయై నమః ।
ఓం ధాన్యాయై నమః ।
ఓం ధాన్యరూపాయై నమః ।
ఓం ధరాయై నమః ॥ 290 ॥

ఓం ధన్వై నమః ।
ఓం ధురశబ్దాయై నమః ।
ఓం ధురాయై నమః ।
ఓం మాన్యాయై నమః ।
ఓం ధరాంగ్యై నమః ।
ఓం ధననాశిన్యై నమః ।
ఓం ధనహాయై నమః ।
ఓం ధనలాభాయై నమః ।
ఓం ధనలభ్యాయై నమః ।
ఓం మహాధన్వై నమః ॥ 300 ॥

ఓం అశాంతాయై నమః ।
ఓం శాంతిరూపాయై నమః ।
ఓం శ్వాసమార్గనివాసిన్యై నమః ।
ఓం గగణాయై నమః ।
ఓం గణసేవ్యాయై నమః ।
ఓం గణాంగాయై నమః ।
ఓం వాచే నమః ।
ఓం అవల్లభాయై నమః ।
ఓం గణదాయై నమః ।
ఓం గణహాయై నమః ॥ 310 ॥

ఓం గమ్యాయై నమః ।
ఓం గమనాయై నమః ।
ఓం ఆగమసుందర్యై నమః ।
ఓం గమ్యదాయై నమః ।
ఓం గణనాశ్యై నమః ।
ఓం గదహాయై నమః ।
ఓం గదవర్ధిన్యై నమః ।
ఓం స్థైర్యాయై నమః ।
ఓం స్థైర్యనాశాయై నమః |
ఓం స్థైర్యాంతకరణ్యై నమః ॥ 320 ॥

ఓం కులాయై నమః ।
ఓం దాత్య్రై నమః ।
ఓం కర్త్య్రై నమః ।
ఓం ప్రియాయై నమః ।
ఓం ప్రేమాయై నమః ।
ఓం ప్రియదాయై నమః ।
ఓం ప్రియవర్ధిన్యై నమః ।
ఓం ప్రియహాయై నమః ।
ఓం ప్రియభవ్యాయై నమః ।
ఓం ప్రియాయై నమః  ॥ 330 ॥

ఓం ప్రేమాంఘ్రిపాయై తన్వై నమః ।
ఓం ప్రియజాయై నమః ।
ఓం ప్రియభవ్యాయై నమః ।
ఓం ప్రియస్థాయై నమః ।
ఓం భవనస్థితాయై నమః ।
ఓం సుస్థిరాయై నమః ।
ఓం స్థిరరూపాయై నమః ।
ఓం స్థిరదాయై నమః ।
ఓం స్థైర్యబరిణ్యై నమః ।
ఓం చంచలాయై నమః  ॥ 340 ॥

ఓం చపలాయై నమః ।
ఓం చోలాయై నమః ।
ఓం చపలాంగనివాసిన్యై నమః ।
ఓం గౌర్యై నమః ।
ఓం కాల్యై నమః ।
ఓం ఛిన్నాయై నమః ।
ఓం మాయాయై నమః ।
ఓం మాన్యాయై నమః ।
ఓం హరప్రియాయై నమః ।
ఓం సుందర్యై నమః  ॥ 350 ॥

ఓం త్రిపురాయై నమః ।
ఓం భవ్యాయై నమః ।
ఓం త్రిపురేశ్వరవాసిన్యై నమః ।
ఓం త్రిపురనాశినీదేవ్యై నమః ।
ఓం త్రిపురప్రాణహారిణ్యై నమః ।
ఓం భైరవ్యై నమః ।
ఓం భైరవస్థాయై నమః ।
ఓం భైరవస్య ప్రియాయై తన్వై నమః ।
ఓం భవాంగ్యై నమః ।
ఓం భైరవాకారాయై నమః  ॥ 360 ॥

ఓం భైరవప్రియవల్లభాయై నమః ।
ఓం కాలదాయై నమః ।
ఓం కాలరాత్య్రై నమః ।
ఓం కామాయై నమః ।
ఓం కాత్యాయన్యై నమః ।
ఓం క్రియాయై నమః ।
ఓం క్రియదాయై నమః ।
ఓం క్రియహాయై నమః ।
ఓం క్లైబ్యాయై నమః ।
ఓం ప్రియప్రాణక్రియాయై నమః  ॥ 370 ॥

ఓం క్రీంకార్యై నమః ।
ఓం కమలాయై నమః ।
ఓం లక్ష్మ్యై నమః ।
ఓం శక్త్యై నమః ।
ఓం స్వాహాయై నమః ।
ఓం విభ్వై నమః ।
ఓం ప్రభ్వై నమః ।
ఓం ప్రకృత్యై నమః ।
ఓం పురుషాయ నమః ।
ఓం పురుషాయై నమః  ॥ 380 ॥

ఓం పురుషాకృత్యై నమః ।
ఓం పరమాయ పురుషాయ నమః ।
ఓం మాయాయై నమః ।
ఓం నారాయణ్యై నమః ।
ఓం మత్యై నమః ।
ఓం బ్రాహ్మ్యై నమః ।
ఓం మాహేశ్వర్యై నమః ।
ఓం కౌమార్యై నమః ।
ఓం వైష్ణవ్యై నమః ।
ఓం వారాహ్యై నమః  ॥ 390 ॥

ఓం చాముండాయై నమః ।
ఓం ఇంద్రాణ్యై నమః ।
ఓం హరవల్లభాయై నమః ।
ఓం భార్గ్యై నమః ।
ఓం మాహేశ్వర్యై నమః ।
ఓం కృష్ణాయై నమః ।
ఓం కాత్యాయన్యై నమః ।
ఓం పూతనాయై నమః ।
ఓం రాక్షస్యై నమః ।
ఓం డాకిన్యై నమః  ॥ 400 ॥

ఓం చిత్రాయై నమః ।
ఓం విచిత్రాయై నమః ।
ఓం విభ్రమాయై నమః ।
ఓం హాకిన్యై నమః ।
ఓం రాకిణ్యై నమః ।
ఓం భీతాయై నమః ।
ఓం గంధర్వాయై నమః ।
ఓం గంధవాహిన్యై నమః ।
ఓం కేకర్యై నమః ।
ఓం కోటరాక్ష్యై నమః  ॥ 410 ॥

ఓం నిర్మాంసాయై నమః ।
ఓం ఉలూకమాంసికాయై నమః ।
ఓం లలజ్జిహ్వాయై నమః ।
ఓం సుజిహ్వాయై నమః ।
ఓం బాలదాయై నమః ।
ఓం బాలదాయిన్యై నమః ।
ఓం చంద్రాయై నమః ।
ఓం చంద్రప్రభాయై నమః ।
ఓం చాంద్య్రై నమః |
ఓం చంద్రకాంతిషు తత్పరాయై నమః  ॥ 420 ॥

ఓం అమృతాయై నమః ।
ఓం మానదా
యై నమః ।
ఓం పూషాయై నమః ।
ఓం తుష్ట్యై నమః ।
ఓం పుష్ట్యై నమః ।
ఓం రత్యై నమః ।
ఓం ధృత్యై నమః ।
ఓం శశిన్యై నమః 

ఓం చంద్రికాయై నమః ।
ఓం కాంత్యై నమః
  ॥ 430 ॥

ఓం జ్యోత్స్నా
యై నమః ।
ఓం శ్రి
యై నమః 
ఓం ప్రీత్యై నమః 

ఓం అంగదా
యై నమః ।
ఓం పూర్ణా
యై నమః ।
ఓం పూర్ణామృతా
యై నమః ।
ఓం కల్పలతికాయై నమః ।
ఓం కల్పదానదాయై నమః ।
ఓం సుకల్పాయై నమః ।
ఓం కల్పహస్తాయై నమః
  ॥ 440 ॥

ఓం కల్పవృక్షకర్యై నమః ।
ఓం హన్వై నమః ।
ఓం కల్పాఖ్యాయై నమః ।
ఓం కల్పభవ్యా
యై నమః ।
ఓం కల్పా
యై నమః ।
ఓం నందకవందితాయై నమః ।
ఓం సూచీముఖ్యై నమః ।
ఓం ప్రేతము
ఖ్యైనమః ।
ఓం ఉల్కాము
ఖ్యై నమః ।
ఓం మహాముఖ్యై నమః
  ॥ 450 ॥

ఓం ఉగ్రముఖ్యై నమః 

ఓం సుముఖ్యై నమః 

ఓం కాకాస్యాయై నమః ।
ఓం వికటాననా
యై నమః ।
ఓం కృకలాస్యాయై నమః ।
ఓం సంధ్యాస్యాయై నమః ।
ఓం ముకులీశా
యై నమః ।
ఓం రమాకృత్యై నమః ।
ఓం నానాముఖ్యై నమః ।
ఓం నానాస్యాయై నమః
  ॥ 460 ॥

ఓం నానారూపప్రధారి
ణ్యై నమః ।
ఓం విశ్వార్చ్యాయై నమః ।
ఓం విశ్వమాత్రే నమః 

ఓం విశ్వాఖ్యాయై నమః ।
ఓం విశ్వభావిన్యై నమః ।
ఓం సూర్యా
యై నమః ।
ఓం సూర్యప్రభా
యై నమః 
ఓం శోభా
యై నమః ।
ఓం సూర్యమండలసంస్థితా
యై నమః ।
ఓం సూర్యకాంత్యై నమః
  ॥ 470 ॥

ఓం సూర్యకరా
యై నమః ।
ఓం సూర్యాఖ్యాయై నమః ।
ఓం సూర్యభావనాయై నమః ।
ఓం తపిన్యై నమః ।
ఓం తాపిన్యై నమః ।
ఓం ధూమ్రా
యై నమః ।
ఓం మరీచయే నమః ।
ఓం జ్వలిన్యై నమః ।
ఓం రుచ్యై నమః ।
ఓం సురదా
యై నమః  ॥ 480 ॥

ఓం భోగదాయై నమః ।
ఓం విశ్వా
యై నమః 
ఓం బోధిన్యై నమః ।
ఓం ధారి
ణ్యై నమః 
ఓం క్షమాయై నమః ।
ఓం యుగదా
యై నమః ।
ఓం యోగదాయై నమః 

ఓం యోగ్యా
యై నమః ।
ఓం యోగ్యహా
యై నమః ।
ఓం యోగవర్ధిన్యై నమః
  ॥ 490 ॥

ఓం వహ్నిమండలసంస్థా
యై నమః ।
ఓం వహ్నిమండలమధ్యగా
యై నమః ।
ఓం వహ్నిమండలరూపా
యై నమః ।
ఓం వహ్నిమండలసంజ్ఞకాయై నమః ।
ఓం వహ్నితేజసే నమః ।
ఓం వహ్నిరాగా
యై నమః ।
ఓం వ
హ్నిదాయై నమః 
ఓం వ
హ్నినాశిన్యై నమః ।
ఓం వహ్నిక్రియాయై నమః ।
ఓం వహ్నిభుజాయై నమః
  ॥ 500 ॥

ఓం సదా వహ్నౌ స్థితాయై కలాయై నమః 

ఓం ధూమ్రార్చిషాయై నమః ।
ఓం ఉజ్జ్వలిన్యై నమః 

ఓం విస్ఫులింగిన్యై నమః ।
ఓం శూలిన్యై నమః ।
ఓం సురూపాయై నమః ।
ఓం కపిలాయై నమః ।
ఓం హవ్యవాహిన్యై నమః ।
ఓం నానాతేజస్విన్యై దేవ్యై నమః ।
ఓం పరబ్రహ్మకుటుంబిన్యై నమః
  ॥ 510 ॥

ఓం జ్యోతిర్బ్రహ్మమయ్యె నమః ।
ఓం దేవ్యై నమః ।
ఓం పరబ్రహ్మస్వరూపి
ణ్యై నమః ।
ఓం పరమాత్మనే నమః ।
ఓం పరాయై నమః ।
ఓం పుణ్యాయై నమః ।
ఓం పుణ్యదాయై నమః ।
ఓం పుణ్యవర్ధిన్యై నమః ।
ఓం పుణ్యదా
యై నమః ।
ఓం పుణ్యనామ్న్యై నమః
  ॥ 520 ॥

ఓం పుణ్యగంధాయై నమః ।
ఓం ప్రియాయై తన్వై నమః ।
ఓం పుణ్యదేహాయై నమః ।
ఓం పుణ్యకరా
యై నమః ।
ఓం పుణ్యనిందకనిందకాయై నమః ।
ఓం పుణ్యకాలకరాయై నమః ।
ఓం పుణ్యాయై నమః ।
ఓం సుపుణ్యాయై నమః ।
ఓం పుణ్యమాలికాయై నమః ।
ఓం పుణ్యఖేలాయై నమః
  ॥ 530 ॥

ఓం పుణ్యకేల్యై నమః ।
ఓం పుణ్యనామసుమాయై నమః ।
ఓం పురా
యై నమః ।
ఓం పుణ్యసేవ్యాయై నమః ।
ఓం పుణ్యఖేల్యా
యై నమః ।
ఓం పురాణా
యై నమః ।
ఓం పుణ్యవల్లభా
యై నమః ।
ఓం పురుషాయై నమః ।
ఓం పురుషప్రాణా
యై నమః |
ఓం పురుషాత్మస్వరూపి
ణ్యై నమః  ॥ 540 ॥

ఓం పురుషాంగ్యై నమః ।
ఓం పురుష్యై నమః ।
ఓం పురుషస్య సదా కలాయై నమః ।
ఓం సుపుష్పాయై నమః ।
ఓం పుష్పకప్రాణాయై నమః ।
ఓం పుష్పహాయై నమః ।
ఓం పుష్పవల్లభా
యై నమః ।
ఓం పుష్పప్రియాయై నమః ।
ఓం పుష్పహారాయై నమః ।
ఓం పుష్పవందకవందకాయై నమః ।
ఓం పుష్పహాయై నమః  ॥ 550 ॥

ఓం పుష్పమాలాయై నమః ।
ఓం పుష్పనిందకనాశిన్యై నమః ।
ఓం నక్షత్రప్రాణహం
త్య్రై నమః ।
ఓం నక్షత్రాయై నమః ।
ఓం లక్ష్యవందకా
యై నమః 
ఓం లక్ష్యమాల్యాయై నమః ।
ఓం లక్షహారాయై నమః ।
ఓం లక్ష్యాయై నమః ।
ఓం లక్ష్యస్వరూపిణ్యై నమః
  ॥ 560 ॥

ఓం నక్షత్రా
ణ్యై నమః ।
ఓం సునక్షత్రాయై నమః ।
ఓం నక్షత్రాహాయై నమః ।
ఓం మహోదయాయై నమః ।
ఓం మహామాల్యా
యై నమః ।
ఓం మహామాన్యాయై నమః ।
ఓం మహత్యై నమః ।
ఓం మాతృపూజితాయై నమః ।
ఓం మహామహాకనీయాయై నమః ।
ఓం మహాకాలేశ్వర్యై నమః
  ॥ 570 ॥

ఓం మహా
యై నమః ।
ఓం మహాస్యాయై నమః ।
ఓం వందనీయాయై నమః ।
ఓం మహాశబ్దనివాసిన్యై నమః ।
ఓం మహాశంఖేశ్వర్యై నమః ।
ఓం మీనాయై నమః ।
ఓం మత్స్యగంధాయై నమః 

ఓం మహోదర్యై నమః ।
ఓం లంబోదర్యై నమః ।
ఓం లంబోష్ఠ్యై నమః
  ॥ 580 ॥

ఓం లంబనిమ్నతనూదర్యై నమః ।
ఓం లంబో
ష్ఠ్యై నమః ।
ఓం లంబనాసాయై నమః ।
ఓం లంబఘోణాయై నమః ।
ఓం లలచ్చుకాయై నమః ।
ఓం అతిలంబా
యై నమః ।
ఓం మహాలంబాయై నమః ।
ఓం సులంబాయై నమః ।
ఓం లంబవాహిన్యై నమః ।
ఓం లంబారాయై నమః
  ॥ 590 ॥

ఓం లంబశక్త్యై నమః ।
ఓం లంబస్థా
యై నమః ।
ఓం లంబపూర్వికాయై నమః ।
ఓం చతుర్ఘంటాయై నమః ।
ఓం మహాఘంటా
యై నమః ।
ఓం సదా ఘంటానాదప్రియా
యై నమః ।
ఓం వాద్యప్రియా
యై నమః ।
ఓం వాద్యరతాయై నమః ।
ఓం సువాద్యాయై నమః ।
ఓం వాద్యనాశిన్యై నమః
  ॥ 600 ॥

ఓం రమాయై నమః ।
ఓం రామాయై నమః ।
ఓం సుబాలాయై నమః ।
ఓం రమణీయస్వభావిన్యై నమః ।
ఓం సురమ్యాయై నమః ।
ఓం రమ్యదాయై నమః ।
ఓం రంభాయై నమః ।
ఓం రంభోరవే నమః ।
ఓం రామవల్లభాయై నమః ।
ఓం కామప్రియాయై నమః  ॥ 610 ॥

ఓం కామకరాయై నమః ।
ఓం కామాంగ్యై నమః ।
ఓం రమణ్యై నమః ।
ఓం రత్యై నమః ।
ఓం రతిప్రియాయై నమః ।
ఓం రతిరత్యై నమః ।
ఓం రతిసేవ్యాయై నమః ।
ఓం రతిప్రియాయై నమః ।
ఓం సురభ్యై నమః ।
ఓం సురభియే నమః  ॥ 620 ॥

ఓం శోభాయై నమః ।
ఓం దిక్శోభాయై నమః ।
ఓం అశుభనాశిన్యై నమః ।
ఓం సుశోభాయై నమః ।
ఓం మహాశోభాయై నమః ।
ఓం అతిశోభాయై నమః ।
ఓం ప్రేతతాపిన్యై నమః ।
ఓం లోభిన్యై నమః ।
ఓం మహాలోభాయై నమః ।
ఓం సులోభాయై నమః  ॥ 630 ॥

ఓం లోభవర్ధిన్యై నమః ।
ఓం లోభాంగ్యై నమః ।
ఓం లోభవంద్యాయై నమః ।
ఓం లోభాహ్యై నమః ।
ఓం లోభభాసకాయై నమః ।
ఓం లోభప్రియాయై నమః ।
ఓం మహాలోభాయై నమః ।
ఓం లోభనిందకనిందకాయై నమః ।
ఓం లోభాంగవాసిన్యై నమః ।
ఓం గంధాయై నమః  ॥ 640 ॥

ఓం విగంధాయై నమః ।
ఓం గంధనాశిన్యై నమః ।
ఓం గంధాంగ్యై నమః ।
ఓం గంధపుష్టాయై నమః ।
ఓం సుగంధాయై నమః ।
ఓం ప్రేమగంధికాయై నమః ।
ఓం దుర్గంధాయై నమః ।
ఓం పూతిగంధాయై నమః ।
ఓం విగంధాయై నమః ।
ఓం అతిగంధికాయై నమః  ॥ 650 ॥

ఓం పద్మాంతికాయై నమః ।
ఓం పద్మవహాయై నమః ।
ఓం పద్మప్రియప్రియంకర్యై నమః ।
ఓం పద్మనిందకనిందాయై నమః ।
ఓం పద్మసంతోషవాహనాయై నమః ।
ఓం రక్తోత్పలవరాయై దేవ్యై నమః ।
ఓం సదా రక్తోత్పలప్రియాయై నమః ।
ఓం రక్తోత్పలసుగంధాయై నమః ।
ఓం రక్తోత్పలనివాసిన్యై నమః ।
ఓం రక్తోత్పలమహామాలాయై నమః  ॥ 660 ॥

ఓం రక్తోత్పలమనోహరాయై నమః ।
ఓం రక్తోత్పలసునేత్రాయై నమః ।
ఓం రక్తోత్పలస్వరూపధృషే నమః ।
ఓం వైష్ణవ్యై నమః ।
ఓం విష్ణుపూజ్యాయై నమః ।
ఓం వైష్ణవాంగనివాసిన్యై నమః ।
ఓం విష్ణుపూజకపూజ్యాయై నమః ।
ఓం వైష్ణవే సంస్థితాయై తన్వై నమః ।
ఓం నారాయణస్య దేహస్థాయై నమః ।
ఓం నారాయణమనోహరాయై నమః  ॥ 670 ॥

ఓం నారాయణస్వరూపాయై నమః ।
ఓం నారాయణమనఃస్థితాయై నమః ।
ఓం నారాయణాంగసంభూతాయై నమః ।
ఓం నారాయణప్రియాయై తన్వై నమః ।
ఓం నార్యై నమః ।
ఓం నారాయణ్యై నమః ।
ఓం గణ్యాయై నమః ।
ఓం నారాయణగ్భహప్రియాయై నమః ।
ఓం హరపూజ్యాయై నమః ।
ఓం హరశ్రేష్ఠాయై నమః  ॥ 680 ॥

ఓం హరస్య వల్లభాయై నమః ।
ఓం క్షమాయై నమః ।
ఓం సంహార్యై నమః ।
ఓం హరదేహస్థాయై నమః ।
ఓం హరపూజనతత్పరాయై నమః ।
ఓం హరదేహసముద్భూతాయై నమః ।
ఓం హరాంగవాసిన్యై నమః ।
ఓం కుహ్వై నమః ।
ఓం హరపూజకపూజ్యాయై నమః ।
ఓం హరవందకతత్పరాయై నమః  ॥ 690 ॥

ఓం హరదేహసముత్పన్నాయై నమః ।
ఓం హరక్రీడాయై నమః ।
ఓం సదాగత్యై నమః ।
ఓం సుగణాయై నమః ।
ఓం సంగరహితాయై నమః ।
ఓం అసంగాయై నమః ।
ఓం సంగనాశిన్యై నమః ।
ఓం నిర్జనాయై నమః ।
ఓం విజనాయై నమః ।
ఓం దుర్గాయై నమః  ॥ 700 ॥

ఓం దుర్గక్లేశనివారిణ్యై నమః ।
ఓం దుర్గదేహాంతకాయై నమః ।
ఓం దుర్గారూపిణ్యై నమః ।
ఓం దుర్గతస్థితాయై నమః ।
ఓం ప్రేతప్రియాయై నమః ।
ఓం ప్రేతకరాయై నమః ।
ఓం ప్రేతదేహసముద్భవాయై నమః ।
ఓం ప్రేతాంగవాసిన్యై నమః ।
ఓం ప్రేతాయై నమః ।
ఓం ప్రేతదేహవిమర్దకాయై నమః  ॥ 710 ॥

ఓం డాకిన్యై నమః ।
ఓం యోగిన్యై నమః ।
ఓం కాలరాత్య్రై నమః ।
ఓం సదా కాలప్రియాయై నమః ।
ఓం కాలరాత్రిహరాయై నమః ।
ఓం కాలాయై నమః ।
ఓం కృష్ణదేహాయై నమః ।
ఓం మహాతన్వై నమః ।
ఓం కృష్ణాంగ్యై నమః ।
ఓం కుటిలాంగ్యై నమః  ॥ 720 ॥

ఓం వజ్రాంగ్యై నమః ।
ఓం వజ్రరూపధృషే నమః ।
ఓం నానాదేహధరాయై నమః ।
ఓం ధన్యాయై నమః ।
ఓం షట్చక్రక్రమవాసిన్యై నమః ।
ఓం మూలాధారనివాస్యై నమః ।
ఓం సదా మూలాధారస్థితాయై నమః ।
ఓం వాయురూపాయై నమః ।
ఓం మహారూపాయై నమః ।
ఓం వాయుమార్గనివాసిన్యై నమః  ॥ 730 ॥

ఓం వాయుయుక్తాయై నమః ।
ఓం వాయుకరాయై నమః ।
ఓం వాయుపూరకపూరకాయై నమః ।
ఓం వాయురూపధరాయై దేవ్యై నమః ।
ఓం సుషుమ్నామార్గగామిన్యై నమః ।
ఓం దేహస్థాయై నమః ।
ఓం దేహరూపాయై నమః ।
ఓం దేహధ్యేయాయై నమః ।
ఓం సుదేహికాయై నమః ।
ఓం నాడీరూపాయై నమః  ॥ 740 ॥

ఓం మహీరూపాయై నమః ।
ఓం నాడీస్థాననివాసిన్యై నమః ।
ఓం ఇంగలాయై నమః ।
ఓం పింగలాయై నమః ।
ఓం సుషుమ్నామధ్యవాసిన్యై నమః ।
ఓం సదాశివప్రియకర్యై నమః ।
ఓం మూలప్రకృతిరూపధృషే నమః ।
ఓం అమృతేశ్యై నమః ।
ఓం మహాశాల్యై నమః ।
ఓం శృంగారాంగనివాసిన్యై నమః  ॥ 750 ॥

ఓం ఉత్పత్తిస్థితిసంహంత్య్రైనమః ।
ఓం ప్రలయాయై నమః ।
ఓం పదవాసిన్యై నమః ।
ఓం మహాప్రలయయుక్తాయై నమః ।
ఓం సృష్టిసంహారకారిణ్యై నమః ।
ఓం స్వధాయై నమః ।
ఓం స్వాహాయై నమః ।
ఓం హవ్యవాహాయై నమః ।
ఓం హవ్యాయై నమః ।
ఓం సదా హవ్యప్రియాయై నమః  ॥ 760 ॥

ఓం హవ్యస్థాయై నమః ।
ఓం హవ్యభక్షాయై నమః ।
ఓం హవ్యదేహసముద్భవాయై నమః ।
ఓం హవ్యక్రీడాయై నమః ।
ఓం కామధేనుస్వరూపాయై నమః ।
ఓం రూపసంభవాయై నమః ।
ఓం సురభ్యై నమః ।
ఓం నందిన్యై నమః ।
ఓం పుణ్యాయై నమః ।
ఓం యజ్ఞాంగ్యై నమః  ॥ 770 ॥

ఓం యజ్ఞసంభవాయై నమః ।
ఓం యజ్ఞస్థాయై నమః ।
ఓం యజ్ఞదేహాయై నమః ।
ఓం యోనిజాయై నమః ।
ఓం యోనివాసిన్యై నమః ।
ఓం అయోనిజాయై నమః ।
ఓం సత్యై నమః ।
ఓం సత్యాయై నమః ।
ఓం అసత్యై నమః ।
ఓం కుటిలాతన్వై నమః  ॥ 780 ॥

ఓం అహల్యాయై నమః ।
ఓం గౌతమ్యై నమః ।
ఓం గమ్యాయై నమః ।
ఓం విదేహాయై నమః ।
ఓం దేహనాశిన్యై నమః ।
ఓం గాంధార్యై నమః ।
ఓం ద్రౌపద్యై నమః ।
ఓం దూత్యై నమః ।
ఓం శివప్రియాయై నమః ।
ఓం త్రయోదశ్యై నమః  ॥ 790 ॥

ఓం పౌర్ణమాస్యై నమః ।
ఓం పంచదశ్యై నమః ।
ఓం పంచమ్యై నమః ।
ఓం చతుర్దశ్యై నమః ।
ఓం షష్ఠ్యై నమః ।
ఓం నవమ్యై నమః ।
ఓం అష్టమ్యై నమః ।
ఓం దశమ్యై నమః ।
ఓం ఏకాదశ్యై నమః ।
ఓం ద్వాదశ్యై నమః  ॥ 800 ॥

ఓం ద్వారరూపాయై నమః ।
ఓం అభయప్రదాయై నమః ।
ఓం సంక్రాంత్యై నమః ।
ఓం సామరూపాయై నమః ।
ఓం కులీనాయై నమః ।
ఓం కులనాశిన్యై నమః ।
ఓం కులకాంతాయై నమః ।
ఓం కృశాయై నమః ।
ఓం కుంభాయై నమః ।
ఓం కుంభదేహవివర్ధిన్యై నమః  ॥ 810 ॥

ఓం వినీతాయై నమః ।
ఓం కులవత్యై నమః ।
ఓం అర్థాయై నమః ।
ఓం అంతర్యై నమః ।
ఓం అనుగాయై నమః ।
ఓం ఉషాయై నమః ।
ఓం నద్యై నమః ।
ఓం సాగరదాయై నమః ।
ఓం శాంత్యై నమః ।
ఓం శాంతిరూపాయై నమః  ॥ 820 ॥

ఓం సుశాంతికాయై నమః ।
ఓం ఆశాయై నమః ।
ఓం తృష్ణాయై నమః ।
ఓం క్షుధాయై నమః ।
ఓం క్షోభ్యాయై నమః ।
ఓం క్షోభరూపనివాసిన్యై నమః ।
ఓం గంగాయై నమః ।
ఓం సాగరగాయై నమః ।
ఓం కాంత్యై నమః ।
ఓం శ్రుత్యై నమః  ॥ 830 ॥

ఓం స్మృత్యై నమః ।
ఓం ధృత్యై నమః ।
ఓం మహ్యై నమః ।
ఓం దివ్నే నమః ।
ఓం రాత్య్రై నమః ।
ఓం పంచభూతదేహాయై నమః ।
ఓం సుదేహకాయై నమః ।
ఓం తండులాయై నమః ।
ఓం ఛిన్నమస్తాయై నమః ।
ఓం నానాయజ్ఞోపవీతిన్యై నమః  ॥ 840 ॥

ఓం వర్ణిన్యై నమః ।
ఓం డాకిన్యై నమః ।
ఓం శక్త్యై 
నమః ।
ఓం కురుకుల్లాయై నమః ।
ఓం సుకుల్లకాయై నమః ।
ఓం ప్రత్యంగిరాపరాయై నమః ।
ఓం దేవ్యై నమః ।
ఓం అజితాయై నమః ।
ఓం జయదాయిన్యై నమః ।
ఓం జయాయై నమః  ॥ 850 ॥

ఓం విజయాయై నమః ।
ఓం మహిషాసురఘాతిన్యై నమః ।
ఓం మధుకైటభహంత్య్రై నమః ।
ఓం చండముండవినాశిన్యై నమః ।
ఓం నిశుంభశుంభహనన్యై నమః ।
ఓం రక్తబీజక్షయంకర్యై నమః ।
ఓం కాశ్యై నమః ।
ఓం కాశీనివాసాయై నమః ।
ఓం మధురాయై నమః ।
ఓం పార్వత్యై నమః  ॥ 860 ॥

ఓం పరాయై నమః ।
ఓం అపర్ణాయై నమః ।
ఓం చండికాయై నమః ।
ఓం దేవ్యై నమః ।
ఓం మృడాన్యై నమః ।
ఓం అంబికాయై నమః ।
ఓం కలాయై నమః ।
ఓం శుక్లాయై నమః ।
ఓం కృష్ణాయై నమః ।
ఓం వర్ణ్యవర్ణాయై నమః  ॥ 870 ॥

ఓం శరదిందుకలాకృత్యై నమః ।
ఓం రుక్మిణ్యై నమః ।
ఓం రాధికాయై నమః 
ఓం పార్వత్యై నమః 
ఓం మహా దేవ్యై నమః 
ఓం జగన్మాత్రేనమః 
ఓం సరస్వత్యైనమః 
ఓం చండికాయై నమః 
ఓం లోకజనన్యై నమః 
ఓం సర్వదేవాదీ దేవతాయై నమః ॥ 880 ॥

ఓం గౌర్యై నమః 
ఓం పరమాయై నమః 
ఓం ఈశాయై నమః 
ఓం నాగేంద్ర తనయాయై నమః 
ఓం సత్యై నమః 
ఓం బ్రహ్మచారిణ్యై నమః 
ఓం శర్వాణ్యై నమః 
ఓం దేవమాత్రే నమః 
ఓం త్రిలోచన్యై నమః 
ఓం బ్రహ్మణ్యై నమః ॥ 890 ॥

ఓం వైష్ణవ్యై నమః 
ఓం రోద్య్రై నమః 
ఓం కాళరాత్య్రై నమః 
ఓం తపస్విన్యై నమః 
ఓం శివదూత్యై నమః 
ఓం విశాలాక్ష్యై నమః 
ఓం చాముండాయై నమః 
ఓం విష్ణుసోదరయ్యై నమః ।
ఓం చిత్కళాయై నమః ।
ఓం చిన్మయాకారాయై నమః ॥ 900 ॥

ఓం మహిషాసుర మర్దిన్యై నమః 
ఓం కాత్యాయిన్యై నమః 
ఓం కాలరూపాయై నమః 
ఓం గిరిజాయై నమః 
ఓం మేనకాత్మజాయై నమః 
ఓం భవాన్యై నమః 
ఓం మాతృకాయై నమః 
ఓం శ్రీమాత్రే నమః 
ఓం మహాగౌర్యై నమః 
ఓం రామాయై నమః ॥ 910 ॥

ఓం శుచిస్మితాయై నమః 
ఓం బ్రహ్మస్వరూపిణ్యై నమః 
ఓం రాజ్యలక్ష్మ్యై నమః 
ఓం శివప్రియాయై నమః 
ఓం నారాయణ్యై నమః 
ఓం మాహాశక్త్యై నమః 
ఓం నవోఢాయై నమః 
ఓం భాగ్యదాయిన్యై నమః 
ఓం అన్నపూర్ణాయై నమః 
ఓం సదానందాయై నమః ॥ 920 ॥

ఓం యౌవనాయై నమః 
ఓం మోహిన్యై నమః 
ఓం అజ్ఞానశుధ్యై నమః 
ఓం జ్ఞానగమ్యాయై నమః 
ఓం నిత్యాయై నమః 
ఓం నిత్యస్వరూపిణ్యై నమః 
ఓం పుష్పాకారాయై నమః 
ఓం పురుషార్థ ప్రదాయిన్యై నమః 
ఓం మహారూపాయై నమః 
ఓం మహారౌద్య్రై నమః ॥ 930 ॥

ఓం కామాక్ష్యై నమః 
ఓం వామదేవ్యై నమః 
ఓం వరదాయై నమః 
ఓం భయనాశిన్యై నమః 
ఓం వాగ్దేవ్యై నమః 
ఓం వచన్యై నమః 
ఓం వారాహ్యై నమః 
ఓం విశ్వతోషిన్యై నమః 
ఓం వర్ధనీయాయై నమః 
ఓం విశాలాక్షాయై నమః ॥ 940 ॥

ఓం కులసంపత్ ప్రదాయిన్యై నమః 
ఓం ఆర్ధదుఃఖచ్చేద దక్షాయై నమః 
ఓం అంబాయై నమః 
ఓం నిఖిల యోగిన్యై నమః 
ఓం కమలాయై నమః 
ఓం కమలాకారయై నమః 
ఓం రక్తవర్ణాయై నమః 
ఓం కళానిధయై నమః 
ఓం మధుప్రియాయై నమః 
ఓం కళ్యాణ్యై నమః ॥ 950 ॥

ఓం కరుణాయై నమః 
ఓం జనస్థానాయై నమః 
ఓం వీరపత్న్యై నమః 
ఓం విరూపాక్ష్యై నమః 
ఓం వీరాధితాయై నమః 
ఓం హేమాభాసాయై నమః 
ఓం సృష్టిరూపాయై నమః 
ఓం సృష్టిసంహార కారిణ్యై నమః 
ఓం రంజనాయై నమః 
ఓం యౌవనాకారాయై నమః ॥ 960 ॥

ఓం పరమేశప్రియాయై నమః 
ఓం పరాయై నమః 
ఓం పుష్పిణ్యై నమః 
ఓం సదాపురస్థాయిన్యై నమః 
ఓం తరోర్మూల తలంగతాయై నమః 
ఓం హరవాహ సమాయుక్తయై నమః 
ఓం మోక్ష పరాయణాయై నమః 
ఓం ధరాధర భవాయై నమః 
ఓం ముక్తాయై నమః 
ఓం వరమంత్రాయై నమః ॥ 970 ॥

ఓం కరప్రదాయై నమః 
ఓం వాగ్బవ్యై నమః 
ఓం దేవ్యై నమః 
ఓం క్లీం కారిణ్యై నమః 
ఓం సంవిదే నమః 
ఓం ఈశ్వర్యై నమః 
ఓం హ్రీంకారబీజాయై నమః 
ఓం శాంభవ్యై నమః 
ఓం ప్రణవాత్మికాయై నమః 
ఓం శ్రీ మహాగౌర్యై నమః ॥ 980 ॥

ఓం శుభప్రదాయై నమః 
ఓం దేవాత్మనే నమః 
ఓం సర్వగాయై నమః 
ఓం అచలాయై నమః 
ఓం ఏకాయై నమః 
ఓం అనేకవిభాగస్థాయై నమః 
ఓం మాయాతీతాయై నమః 
ఓం సునిర్మలాయై నమః 
ఓం మహామాహేశ్వర్యై నమః 
ఓం సత్యాయై నమః ॥ 990 ॥

ఓం మహాదేవ్యై నమః 
ఓం నిరంజనాయై నమః 
ఓం కాష్ఠాయై నమః 
ఓం సర్వాంతరస్థాయై నమః 
ఓం చిచ్ఛక్త్యై నమః 
ఓం అతిలాలసాయై నమః 
ఓం నందాయై నమః 
ఓం సర్వాత్మికాయై నమః 
ఓం విద్యాయై నమః 
ఓం జ్యోతీరూపాయై నమః ॥ 1000 ॥

ఓం శ్రీ భైరవ్యై నమః 
ఓం శ్రీ భైరవ్యై నమః 
ఓం శ్రీ భైరవ్యై నమః 


ఇతి శ్రీ త్రిపుర భైరవీ సహస్ర నామావళి సంపూర్ణం 

శ్రీ త్రిపుర భైరవీ మహా విద్యా

Gayatri Stotram - గాయత్రీ స్తోత్రం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ స్తోత్రం గాయత్రీస్తోత్రం నారదా! గాయత్రీ హృదయం చెప్పానుగదా, ఇక గాయత్రీస్తోత్రం చెబుతున్నాను - విను....