Tuesday, February 3, 2026

Magha Puranam 26 - మాఘ పురాణం 26 సుధర్ముడు తండ్రిని చేరుట

మాఘ పురాణం - 26 వ అధ్యాయం

సుధర్ముడు తండ్రిని చేరుట

పాపమా బాలుని జాతకము ఎటువంటిదోగాని తన తల్లి అడవిలో పిలిచే చంపబడినది. ఇప్పుడు పెంపుఢుతల్లి అడవిలో విడిచి పెట్టి వెళ్ళిపోయినది. ఇక అ పిల్లవానిని దినరక్షకుడగు శ్రీహరియే రక్షించాలి. ఆ రాత్రి బాలుడు ఏడ్చి ఏడ్చి అలసి నిద్రపోయాడు. అక్కడొక తులసి మొక్క వున్నది. నిద్రలో బాలుని చెయ్యి తులసి చెట్టుపై బడినందున ఆ రాత్రి అతనికే అపాయమూా కలుగ లేదు. పైగా దైవభక్తి కలిగెను. ఉదయమే లేచునప్పటికి అడవిలో ఏకాంతముగా నున్నందున భయపడి బిగ్గరగా ఏడ్చినాడు ఆరోదనకు పక్షులు, జంతువులు, మృగములుకూడ రోదనచేసి ఆ బాలునికి రక్షణగా వుంచి ఆహారము తెచ్చి ఇచ్చుచుండెడివి. ఆ బాలుడు అడవిజంతువులచే పెంచబడుతూ దినదినాభివృద్ధి చెందూచూ ఏ తులసి చెట్టువద్ద పడివుండెనో, ఆ మొక్కకు ప్రతినిత్యము పూజలు చేయుచు కాలము గడుపుచుండెను.

అలా పెరుగుతూ పన్నెండేండ్లు ప్రాయంగలవాడయ్యెను. ప్రతి దినము తులసిపూజ భగవన్నామ స్మరణ చేస్తూ న"న్ను కాపాడుము తండ్రీ అనాధరక్షకా" అని ప్రార్ధించుచు, ఒకొక్కప్పుడు విరక్తుడై "ఛీ ఎంత ప్రార్ధించినా నాగతి ఇంతేనా? నేను బ్రతికెందుకు? అని దుఃఖించుచుండగా, ఆకాశవాణి "ఓ బాలచంద్రా! నీ విట్లు విచారింపకుము. ఈ సమీపముననే ఒక కోనేరు వున్నది. మాఘమాసము ప్రవేశించినది. అందుచే నీవా సరస్సులో స్నానము చేసిన యెడల శ్రీమన్నారాయణుడు నీకు ప్రత్యక్షమగును" అని పలికిన మాటలు ఆకాశమునుండి వినిపించినవి. వెంటనే ఆ రాజకుమారుడు సరోవరమునకు వెళ్ళి మాఘస్నానం చేసి శ్రీహరిని స్తుతించెను.

ఈ బాలుని నిష్కళంక భక్తికి, నిర్మల హృదయానికి లక్ష్మీనారాయణులు ప్రత్యక్షమై అతనిని దీవించి “బాలకా నీ కేమి కావలయునో కోరుకొనుము” అని యనగా “ప్రభూ! నాకు తండ్రి ఎవరో తల్లి ఎవరో తెలియదు. నాకు ఆలనాపాలనా చేయువారైనను లేరు. పుట్టినది మొదలు కష్టములేతప్ప సుఖమన్నది ఎరుగను. ఈవనచరములే నన్నురక్షించి పోషించుచున్నవి. గాన మీ సన్నిధానముకు నన్ను తీసుకొని పొండు. మరేమియు అక్కర లేదు.” అని ప్రార్ధించెను.

"ఓయీ రాజనందనా! నీవు ఇంకను బుకొకమునందు ధర్మముగా పరిపాలన చేయవలసిన యవసరమున్నది. నీ తండ్రియగు సులక్షణుడు వృద్ధుడై నీగురించి, నీకన్నతల్లిని గురించి బెంగతో వున్నాడు, గాన నీవు నీ తండ్రి వద్దకు పోయిరమ్ము” అని చెప్పి ఆకొలను సమీపమున తపస్సు చేసుకొనుచున్న ఒక మునీశ్వరుని తోడుయిచ్చి సులక్షణుని వద్దకు పంపెను.

అప్పటికే సులక్షణుడు తన కడసారి భార్య గర్భవతిగా వుండి ఎటుపోయెనో, పుట్టిన బిడ్డ ఏమాయెనో, యని తన రాజ్యమంతయు వెదకించి తానును వెదకి వారిజాడ తెలియనందున విచారమనస్కుడై రాచ కార్యములు చూడకుండెను. ఆటువంటి సమయములో ముని వెంట కుమారుడు వెళ్ళెను. రాజుతో ముని యా బాలుని జన్మవృత్తాంతము తెలియ జేయుసరికి సులక్షణ మవో రాజు అమి తానందభరితు డై ఇాలుని కౌగలించుకొని మునీక(రునికి oo కుమాగునికి మహారాజు అమితానందభరితుడై బాలుని కౌగలించుకొని మునీశ్వరునికి మర్యాదలుచేసి కుమారునికి సుధర్ముడని పేరుపెట్టి పట్టాభిషేకము చేసెను.

Magha Puranam 25 - మాఘ పురాణం 25 సులక్షణ మహారాజు వృత్తాంతము

మాఘ పురాణం - 25 వ అధ్యాయం

సులక్షణ మహారాజు వృత్తాంతము

వంగదేశమును సూర్యవంశపు రాజగు సులక్షణ మహారాజు పరిపాలించుచుండెను. అతనికి నూర్గురు భార్యలు గలరు. అతడు గొప్ప ధైర్యవంతుడు, బలవంతుడు, ధర్మపాలకుడు.తన దేశ ప్రజల కేయాపద వచ్చిననూ తనదిగా భావించి తన్నివారణోపాయం చేసెడివాడు.

సులక్షణ మహారాజెంతటి రాజాధిరాజైననూ యెంతటి తరగని సంపత్తికలవాడైన నేమిలాభం? “అపుత్రస్యగతిర్నాస్తి” అనునటుల పుత్ర సంతానము లేక పోవుటచే తనకు గతులులేవు కదా! కాగా తన వంశము ఎటుల అభివృద్ధి చెందును? తనతో తన వంశము అంతరించి పోవలసినదేనా? అని దిగులు చెందుచుండెను.

ఒకనాడు తాను తన రధమెక్కి నైమిశారణ్యమున గొప్ప తపశ్శాలురున్న ప్రదేశమునకు వెళ్ళెను. అచట తపోధనులందరూ తపస్సు చేసుకొనుచుండిరి. వారికీ సులక్షణ మహారాజు నమస్కరించి యిటుల పలికెను.

"మునిశ్రేష్టులారా! నేను వంగ దేశాధీశుడను. న పేరు సులక్షణుడందురు. నాకు నూర్గురు భార్యలు అయిననేమి? ఒక్క సంతానమైనను కలుగ లేదు. గాన నాకు పుత్రసంతానం కలుగునట్లొనరింపుడు” అని అంజలి ఘటించి ప్రార్థించాడు. మహా రాజు పలుకులాలకు ముని శ్రేష్ఠులు విని జాలినొందిరి. "రాజా! నీవు సంతానహీనుడవగుటకు కారణ మేమనగా-పూర్వజన్మలో నీవు సౌరాష్ట్రముని పాలించి యుంటివి. ఆ జన్మలో ఒక్క మాఘమాసస్నానమైనా చేయలేదు. ఒక్క దానమైననూ ఇవ్వలేదు. ఒక బ్రాహ్మణునకు గుమ్మడి కాయ నైనా దానం చేసియున్నచో ఈజన్మలో పుత్రసంతతి కలిగివుండేది. గాన వెనుక కర్మ ఫలంవలననే నీకీ జన్మలో పుత్ర సంతతి కలుగ లేదు. ఎవరు మాఘమాసములో శుద్ధ సప్తమి రోజున కుష్మాండదానము చేయుదురో వారికి తప్పక పుత్రసంతానము కలుగగలదు. ఇందుకు సందేహమేమియు లేదు" అని చెప్పి ఒక ఫలమును మంత్రించి రాజునకిచ్చి “దీనిని నీ భార్యలచే జీనింపచేయుయు” అని పలికిరి. మహా భాగ్యం అని ఫలమును కండ్ల కద్దుకొని యింటికి వెళ్ళిఫోయినాడు.

భర్తరాకవిని పట్టమహిషులు ఎదురేగి మంగళహారతులిచ్చి సేద దీర్చిరి. రాజు తెచ్చిన మంత్రఫలం గురించి వివరించి "భోజనానంతరం సేవింపుడు" అని తన గదియుదు ఫలమును భద్రపరచి తాను భోజనసాలకు పత్నులతో వెడలిపోయెను. నూర్గురు భార్యలలో కడ భార్యకు మిక్కిలి ఆశకలిగి మిక్కిలి ఆశకలిగి ఫలమంతయు నేనే భుజించెదనని తలపోసి, రహాస్యమార్గమున రాజు పడక గదిలోకి వెళ్ళి ఆఫలమును భుజించి ఏమియు ఎరుగనిదానివలే అందరితో కలిసి తిరుగుచుండెను.

సులక్షణమహారాజు, అతని భార్యలు భోజనము చేసి మంత్ర ఫలమువద్దకు వచ్చిరి. బంగారు పళ్ళేమందుంచిన ఫలము కనిపించలేదు. రాజుకు యెక్కడ లేని కోపము వచ్చి సింహగర్జన చేసినాడు. మాకేమియు తెలియ" దని అందరూ ప్రమాణముగా చెప్పిరి.

ఎంతో కష్టపడి మహామునుల అనుగ్రహమువలన సంపాదించిన మంత్ర ఫలమును చేతులారా పోగొట్టుకొంటిని అని దిగులు చెంది బెంగతో మంచము పట్టినాడు. మంత్ర ఫలము తినిన చిన్న భార్య భర్త కడకువచ్చి “నాధా! నా అశకొలదీ ఆఫలము నేనే తినివేసినాను క్షమింపు"మని వేడుకొనెను. అప్పటికి రాజు కొంత తృప్తి చెంది, వంశోద్ధారకుడు ఒక్కడైనా పుట్టగలడని ఊరకుండెను. గారాబముతో అమెను చూచెను.

కనిష్ఠ గర్భవతి అయినందున నవమాసములు నిండుచున్నందున మిగిలిన భార్యలు కన్నెఱ్ఱతో ఓర్వ లేకపోయారు. ఆమె పుత్రవతి అయినచో తమను రాజు సరిగా చూడడని అలోచించి ఆమె గర్భము చెడులాగున, అమె తిను ఆహారములో ఓషధము కలిపి పెట్టినారు, వరపుత్రుడుగా పుట్టుచున్నాడు గనుక గర్భములోని శిశువునకు ఏ అపాయమూ కలుగలేదు. కాని ఓషధముయొక్క తీవ్రతవలన ఆమెకు పిచ్చిఎత్తినది. ఆ పిచ్చివలన ఒకనాటి రాత్రి ఆమె అడవీలోనికి వెళ్ళిపోయినది. అప్పటికి నిండుచూలాలు అయివున్నందున ఆ యడవిలో బండరాతిమీద మగశికువును ప్రసవించినది. ఆమె ప్రసవించినచోట ఒక పులి కాచుకొని వున్నందున, వెంటనే పురిటి వాసనను పసికట్టి వచ్చి ఆమెను చంపితినెను.

పాపమాపసిబిడ్డ రక్తపుమరకలతో నుండి ఏడ్చుచుండెను. రాజహంసలు ఆహారము కొరకు తిరుగుచూ ఆ రాజబిడ్డను చూచి దగ్గరకు వచ్చి రెక్కలతో ఆ బాలుని తడియార్చి వాటిముక్కులతో
మెత్తటి గడ్డి తెచ్చి పరచి దానిపై పరుండబెట్టినవి.ఆ బాలునికి తేనె పండ్లు తినిపించి ఒక ఏడాది వరకు పెంచినవి. ఎండాకాలం వస్తున్నందున అక్కడ వాటికి నీరు దొరకవని ఆ బాలుని తీసుకొని కొంత దూరములోనున్న తమజాతి హంసలకు అప్పగించివెళ్ళిపోయినవి.

ఆ హంసలు ఆ బాలునికి కావలసిన పండ్లు, తెనె గుజ్జు మొదలగునవి తెచ్చి పెంచుచుండగా ఒక తపస్వి తనయిద్దరి భార్యలతో వచ్చి ఆ కోనేటిలో స్నానముచేసి దుస్తులు మార్చుకొనుచుండగా హంసలతో తిరుగుచు తప్పటడుగులు వేస్తూ కొలనువద్దకువస్తున్న బాలుని చూచి మక్కువ కలిగి వారి వెంట తీసుకొనిపోయిరి.

రాజకుమారుడు వారి ఆశ్రమములో మూడు సంవత్సరములు గడిపెను. కొద్దికొద్దిగా మాటలు వచ్చుచున్నవి. వానిని చూచి నాకొడుకు అని పెద్దభార్యకు ఈర్ష్యజనించెను. పిల్లవాడు సాయంత్ర సమయమున ఆడుకొనుచుండగా వానిని ఎత్తుకొనిపోయి అడవిలో దిగ బెట్టి వచ్చెను. భర్తవచ్చి పిల్లవాడేని ఆడిగననూ నిజపుసంగతి చెప్పలేదా దుర్మార్గురాలు.

Magha Puranam 24 - మాఘ పురాణం 24 విశ్వామిత్రునికి వానారముఖము కలుగుట

మాఘ పురాణం - 24 వ అధ్యాయం

విశ్వామిత్రునికి వానారముఖము కలుగుట - శూద్ర స్త్రీ వృత్తాంతము 

మాఘమాసమందలి నదీస్నానము మనుజులకే కాకా దేవతలకు గంధర్వులకు కుడా పరమపవిత్రమైనది.

ఒక మాఘమాసంలో నొక గంధర్వుడు తన భార్యతో భూలోకానికివచ్చి గంగానదిలో స్నానమాడెను. తన భార్యమాత్రం స్నాన మాచరించనని చెప్పుటచే ఆమె దేవత్వము నశించి గంధర్వలోకానికి వెళ్ళలేక వుండిపోయినది. ఆమెను విడిచిపెట్టి ఆగంధర్వుడొక్కడే వెళ్ళి పోయాడు.

ఆమె అడవిలో తిరుగుతూ విశ్వామిత్రుడు ఉన్న చోటుకు వెళ్ళి వయ్యారంగా క్రీగంటచూచెను. ఆమె అందము యౌవ్వనానికి, విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెనుప్రేమించుటచే ఇద్దరూ కామక్రీడలతో తేలియాడుచుండగా, మరలనాగంధర్వుడు భార్యను వెదకుకొనుచూ వచ్చిచూడగా విశ్వామిత్రుడు, గంధర్వ స్త్రీతో క్రీడించుచుండిరి. 

అదృశ్యమును చూచి మండిపడుచు "నీవు తపస్వివై యుండి కూడా కామతృష్ణ గలవాడవైతివి గాన నీకు కోతిముఖం సంభవించుగాక" యని విశ్వామిత్రుణ్ణి, “ఓసీ కులటా! నీవు పాషాణమై పడివుండు" మని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. 

విశ్వామిత్రుడు చేయునది లేక వానరముఖము కలిగివుండగా నారదుడు ఈ విషయము తెలిసికొని విశ్వామిత్రునికడకు వచ్చి "విశ్వామిత్రా! క్షణభంగుకరమైన తుచ్చ కామవాంఛకు లోనై నీ తపఃశక్తినంతా వదులుకున్నావు. సరే లెమ్ము గంగానదిలో స్నానముచేసి నీ కమండలముతో గంగాజలము తెచ్చి ఈపాషాణముపై చల్లుము అని నారదుడు వివరించగా. 

విశ్వమిత్రుడు గంగానదిలో స్నానముచేసి విష్ణువును ధ్యానించి కమాండలముతో నీరు తెచ్చి పాషాణంగామారిన గంధర్వస్త్రీ పై చల్లెను. ఆ స్త్రీ నారదునికి నమస్కరించి గంధర్వ లోకమునకు వెళ్ళిపోయెను. విశ్వమిత్రుడు తపస్సుకు విళ్ళిపోయినాడు.

Magha Puranam 23 - మాఘ పురాణం 23 బ్రాహ్మణ కన్యల విమోచనము

మాఘ పురాణం - 23 వ అధ్యాయం

బ్రాహ్మణ కన్యల విమోచనము


కొంత కాలం క్రిందట మగధరాజ్యములో పురోహితవృత్తిచే జీవించుచున్న నలుగురు బ్రాహ్మణులుండిరి. నల్గురకు నల్గురు కుమార్తె లుండిరి వారు నిండుయవ్వనవతులై ఉండిరి.

కొన్నాళ్ళకు ఆ గ్రామపు కోనేటిలో స్నానంచేయట కొక గురుకులవిద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్యలు ఆ యువకుని అందంచూచి మోహించి అతనిని సమీపించి చుట్టుముట్టి తమ్ము వివాహము చేసుకోమని బలవంతము చేయగా. ఆ బ్రాహ్మణవిద్యార్దికి విద్యపూర్తి కానందున వారికోర్కె నిరాకరించెను. అంత నా కన్యలు "నీవు పిశాచివి కమ్మని" శపించగా ఆ విద్యార్థియూ "మీరుకూడ పిశాచులగుదురుగాక" యని ప్రతిశాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలువద్దనే వుంది అందరినీ బాధించి, ఆహారము దొరికితే పెనుగులాడుచుండిరి.

కొంతకాలమునకు ఒక సిద్ధుడాకోనేటి దగ్గరకురాగా నాపిశాచములు తల్లిదండ్రులు తమ బిడ్డలకు కలిగిన పిశాచరూపం లెట్లు పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు "వీరందరిచేత మాఘమాసంలో గాయలోనున్న త్రివేణిలో స్నానము చేయించినచో వారికున్న పిశాచరూపం తొలగిపోవును" అని చెప్పగా వారట్లు చేయుటచే ఆ నాలుగురకూ యధారూపములు కలిగినవి. అట్లు జరుగుట మాఘస్నానమే కారణము.

Magha Puranam 22 - మాఘ పురాణం 22 గంగాజల మాహాత్మ్యము

మాఘ పురాణం - 22 వ అధ్యాయం

గంగాజల మాహాత్మ్యము

ఓ కార్తవీర్యార్జునా! శివపూజ గురించి శివమాహాత్మ్యమును గురించి వివరించెదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధికట్టిన చోట శివలింగమును ప్రతిష్టించి శివుని ధ్యానించి వారధినిదాటి రావణుని చంపెను. అటులనే హనుమంతుడు  సముద్రమును దాటునపుడు శివుని 
ధ్యానించి, రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి  సముద్రమును దాటెను.అర్జునుడు యుద్ధమునకు బయలు దేరేముందు శివపూజచేసి యుద్ధరంగములో ప్రవేశించాడు. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయమును చేకూర్చుకొనిరి. స్త్రీలు తమ మనోవాంఛను ఈడేర్చుకొనిరి. గనుక పూజలందు శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగానది పరమపవిత్రమైనది. ఎటులనగా గంగాజలం విష్ణు పాదములనుండి పుట్టినదియు, శివుని శిరస్సునుండి ప్రవహించునట్టియు అయినందుననే సర్వపాపరహితమైనది. గంగాజలములో స్నానము చేసినచో మహాపాపములు సైతం హరించిపోవును. గాన గంగాజలము అంత ప్రాముఖ్యత వున్నది. ఇంకనూ గంగాజలము గురించి చెప్పబోవునది యేమనగాఏ నదిలోగాని, సెలయేరులోగాని, చెరువునందుగాని స్నానము చేయునపుడు 'గంగ గంగ గంగ!' అని మూడు పర్యాయములు అనుకొని శిరస్సున నీళ్ళు చల్లుకొనినచో అది గంగా జలముతో సమానమయినదగును.

గంగాజలము విష్ణుమూర్తి ప్రతిరూపము గనుక గంగాజలముతో సాటియగు జలము ఈ ప్రపంచమునందెచ్చటనూలేదు. అని గంగాజలమునుగురించి కార్తవీర్యార్జునునకు దత్తాత్రేయుడు వివరించెను.

Magha Puranam 21 - మాఘ పురాణం 21 దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట

మాఘ పురాణం - 21 వ అధ్యాయం

దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఉపదేశమిచ్చుట


దత్తాత్రేయుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్యరులయొక్కఅంశమున జన్మించినవాడు. అతడుకూడ లోక కళ్యాణముకొరకు ఘనకార్యములు చేసినాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించివున్నారు.

దత్తాత్రేయుని కాలములో కార్తవీర్యార్జునుడను క్షత్రియ వీరుడు మాహిష్మతియను నగరమును రాజధానిగా చేసుకొని పాలించుచుండెను. అతనికి గురువర్యులు దత్తాత్రేయుడు. ఒకనాడు దత్తాత్రేయుని యాశ్రమమునకు కార్తవీర్యార్జునుడు వెళ్ళి నమస్కరించి "గురువర్యా మీ అనుగ్రహమువలన అనేక విషయాలుతెలిసికొనివుంటిని. మాఘమాసముయొక్క మాహాత్మ్యమును వినియుండ లేదు. గాన మాఘమాసముయొక్క విశిష్టతనుగురించి, మాఘస్నాన ఫలముగురించి నాకు వివరించవలసినదిగా కోరుచున్నాను" అని దత్తాత్రేయునికోరెను. దత్తాత్రేయుడు కార్తవీర్యార్జుని కోరికన్ను మన్నించి ఈవిధముగా వివరించిరి.

"భూపాలా! భరతఖండములోనున్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచమందెచ్చటనూ లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి పండ్రెండు. అందుచేతనే వీటికి పుష్కరప్రవేశము కలుగుచున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశియందున్నపుడు ఆయనదులకు పుష్కరారంభమగును. గనుక అటువంటి నదులయందు స్నానముచేసి దానపుణ్యము లాచరించినయెడల దాని వలన కలుగు ఫలమును వర్ణించుట నాకుకూడ సాధ్యము కాదు. అందునూ మాఘమాసమందు నదిలో స్నానముచేసిన గొప్పఫలితం కలుగుటయేగాక జన్మరాహిత్యము కలుగును. గనుక ఏమానవుడైననూ మాఘమాసములో నదీస్నానము తప్పకుండ చేయవలెను. అటుల చేయనియెడల ఆ మనుజుడు జన్మజన్మలందు తాను చేసుకున్న పాపఫలము పాపఫలము అనుభవించక తప్పదు.

మాఘమాసములో సూర్యుడు మకరరాశియందుండగా మాఘ స్నానములుచేసి, ఒక సద్బ్రాహ్మణునకు దానధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసినవాడైననూ ముక్తినొందగలడు. అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జునకు ఈవిధముగా చెప్పుచున్నారు.

పూర్వ కాలమున గంగానదీతీరమున ఉత్తరభాగమున భాగ్యపురమును పట్టణము గలదు. అందు నివసించుజనులు భాగ్యవంతులు. గొప్ప వ్యాపారములు చేసి ధనము సంపాదించి అపార కుబేరునివలెనున్నారు. ఆ నగరములో హేమాంబరుడను వైశ్యుడు గలడు. అతడును గొప్ప ధనవంతుడు. బంగారునగలు, నాణెములు రాసుల కొలదీ ఉన్నవాడు.

మరికొంత కాలమునకు 
హేమాంబరుడు చనిపోయెను. తండ్రి చనిపోగానే ఇద్దరన్నదమ్ములు తండ్రిఆస్తిని భాగములు చేసి పంచుకొని ఇష్ట మొచ్చినటుల పాడు చేయుచుండిరి. ఇద్దరూ చెరొక ఉంపుడుకత్తెను చేరదీసి కులభ్రష్టులయి ఉండిరి. ఒకనాడు పెద్దకుమారుడు దైవవశమున అడవిలో పెద్దపులి నోటబడి చనిపోయినాడు. చిన్న కుమారుడు వేశ్యతో ఉద్యానవనములో విహరించుచుండగా కర్మవశాత్తు త్రాచుపాము కరుచుటచే నోటివెంట నురగలు గ్రక్కుచూ చనిపోయినాడు. ఆ విధముగా హేమాంబరునీ కమారులిద్దదూ చనిపోయినారు.

యమదూతలు వచ్చి వారిద్దరినీ యమలోకమునకు తీసుకొని వెళ్లిరి. చిత్రగుప్తుడు వారి జాబితాలు చూసి పెద్దవానిని నరకంలో పడవేయమన్నాడు. రెండవవానిని స్వర్గలోకమునకు పంపించమన్నాడు. అప్పుడా చిన్నవాడు చిత్రగుప్తునితో ఇట్లు అన్నాడు.

అయ్యా, మేమిద్దరము ఒకేతం డ్రి బిడ్డలము. ఇద్దరమూ ఒక విధముగానే పాపములు చేసి యున్నాము. అయినా అతనికి నరకమేల నాకు స్వర్గమేల ప్రాప్తించును అని అడిగెను. ఆ మాటకు చిత్రగుప్తుడు ఓయీ, వైశ్యపుత్రా! నీవు నీ మిత్రుని కలుసుగొనుటకు ప్రతీదినము గంగానదిని దాటి ఆవలగట్టునున్న నీ స్నేహితునితో సంభాషించి వచ్చుచుండెడివాడవు. అటులనే మాఘమాసములో నదిని దాటుచుండగా, కెరటాలజల్లులు నీ శిరస్సుపై పడినవి. అందువలన పవిత్రుడవైనావు, మరొకవిషయ మేమనగా - నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాతకములుకూడ నశించును. గాన విప్రుని చూచుటవలన నీకు మంచి ఫలితమే కలిగినది. అదియునుగాక, ఆ బ్రహ్మణుడు పఠించు గాయత్రీమంత్రమును కూడ నీవు వినియున్నావు. గంగానదిలోని నీరు నీ శరీరంమీద పడినది గనుగ నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను. అని చిత్రగుప్తుడు వివరించెను.

“ఆహా! ఏమి నాభాగ్యం! గంగాజలము నామీద పడనంత మాత్రముననే నా కింతటి మోక్షము కలిగినదా" అని వైశ్యకుమారుడు సంతసించి దేవతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయెను.

Monday, February 2, 2026

Magha Puranam 20 - మాఘ పురాణం 20 భీముడు ఏకాదశి వ్రతము చేయుట

మాఘ పురాణం - 20 వ అధ్యాయం

భీముడు ఏకాదశి వ్రతము చేయుట

పాండవులలో ద్వితీయుడు భీముడు. అతడు మహాబలుడు, భోజనప్రియుడు, ఆకలికి ఏమాత్రము ఆగనివాడు. బండెడన్నము అయినను చాలదు. అటువంటి భీమునకు ఏకాదశి వ్రతము చేయవలయునని కుతుహలము. కాని, ఒక విషయములో బెంగతో నుండెను, అదేమందువా? ఏకాదశినాడు భోజనము చేయకూడదు కదా! భోజనము చేసిన ఫలము దక్కదుకదా! అని విచారించి తమ పురోహితుని వద్దకుపోయి "ఓయీ పురోహితుడా! అన్ని దినముల కంటే ఏకాదశి పరమపుణ్యదినమని అనెదరుగదా! దాని విశిష్టత యేమి అని భీముడు అడిగెను.

“అవును ఆ రోజు అన్ని దినములకంటెను ప్రశస్తమయినది. శ్రీమహావిష్ణువుకు ప్రీతికరమైనది. గనుక అన్ని జాతులవారును 
ఏకాదశి వ్రతము చేయవచ్చును అని పాండవ పురోహితుడగు దౌమ్యుడు పలికెను.

"సరే నేను అటులనే చేయుదును గాని విప్రోత్తమా! నేను భోజనప్రియుడనన్న సంగతి జగద్విదిత మేకదా! ఒక గడియ అలస్యమైన ఆకలికి తాళజాలను గనుక, ఏకాదశినాడు ఉపవాసముండుట ఎటులని విచారించుచున్నాను. ఉపవాసమున్న దినముననే ఆకలి ఎక్కువగా ఉండును. గనుక ఆకలి తీరులాగున ఏకాదశీ వ్రతఫలము దక్కులాగున నాకు వివరింపుము" అని భీముడు పలికెను.

భీమసేనుని పలుకులకు ధౌమ్యుడు చిరునవ్వునవ్వి “రాజా! ఏకాదశీవ్రతమునకు దీక్ష అవసరము. దీక్షతో ఏ కార్యము చేసిననూ కష్టములు కనిపించవు. గాన నీవు దీక్షబూనినచో అకలి కలుగదు. రాబోవు ఏకాదశీ అనగా మాఘశుద్ధ ఏకాదశీ మహాశ్రేష్ఠమయినది. దానికిమించిన పర్వదినము మరియొకటి లేదు. ఒక్కొక్కసమయంలో మాఘఏకాదశీరోజు పుషమీనక్షత్రముతో కూడినదై యుండును అటువంటి ఏకాదశికి సమానమగునది మరియొకటి లేదు. సంవత్సరము నందు వచ్చు ఇరువదినాల్గు ఏకాదశులతో మాఘశుద్ధ ఏకాదశి మహాపర్వదినము గాన ఆ దినము ఏకాదశి వ్రతము చేసిన గొప్పఫలితము కలుగును. ఇందు ఏమాత్రము సంశయము లేదు. గాన ఓ భీమసేనా! నీవు తప్పక మాఘశుద్ధ ఏకాదశీవ్రతము ఆచరింపుము. ఆకలి గురించి దిగులుపడకము. దీక్షతో నున్న యెడల ఆకలి ఏమాత్రమూ కలుగదు. 'నియమము' తప్పకూడదు. అని దౌమ్యుడు భీమునకు వివరించెను.

ధౌమ్యునివలన సంశయము నెరవేరుటచే మాఘశుద్ధ ఏకాదశీనాడు అతినిష్టతో వ్రతముచేసి ఉపవాసముండెను. అందులకే మాఘశుద్ధఏకాదశీ 'భీమఏకాదశి' అని పిలుతురు. అంతియేగాక ఓ దిలీప మహారాజా! పరమేశ్వరునకు అత్యంత ప్రీతికరమగు శివరాత్రికూడ మాఘమాసమందే  వచ్చును. గాన మహాశివరాత్రి మహాత్మ్యమును గురించికూడ వివరించెదను. శ్రద్దాళుడవై ఆలకింపుము" అని వశిష్ఠులవారు దిలీపమహరాజుతో ఇటుల పలికిరి.

శివరాత్రి మహాత్మ్యము
ఏకాదశి మహావిష్ణువునకు ఎటుల ప్రీతికరమైన దినమో అదే విధంగా మాఘచతుర్దశీ అనగా శివచతుర్దశి. దీనినే 'శివరాత్రి'యని అందురు. అత్యంత ప్రీతివంతనుయిన ఇది మాఘమాసము నందు వచ్చు అమావాస్యకు ముందురోజు. దానినే 'మహాశివరాత్రి' యని అందరూ పిలిచెదరు.

ఇది మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశినాడు వచ్చును. ప్రతిమాసంఅందువచ్చు మాసశివరాత్రి కన్నా అత్యంత ప్రీతికరమైనది. ఆరోజు నదిలోగాని, తటాకమందుగాని, లేక నూతివద్దగాని స్నానముచేసి శంకరుని పూజించవలెను. పరమేశ్వరుని అష్టోత్తర శతనామావళీ బిల్హ్వపత్రములతో పూజించవలయిను. అటుల పూజించి, శివప్రసాదము సేవించి, ఆ రాత్రి అంతయు తప్పని సరిగా జాగరణమువుండి మరునాడు అమావాస్య స్నానంకూడా చేసిన యెడల ఎంతటి పాపములు కలిగివున్ననూ అవన్నియు వెంటనే హరించుకుపోయి, కైలాసప్రాప్తి కలుగును. శివపూజా విధానములో శివరాత్రికంటె మించినది మరియొకటిలేదు. గనుక మాఘమాసము కృష్ణ పక్షము లోవచ్చు చతుర్దశి ఉమాపతికి అత్యంత ప్రీతిపాత్రమైనది. శివరాత్రి దినమున ప్రతివారూ అనగా జాతిభేదములతో నిమి త్తం లేక అందరూ శివరాత్రివ్రత మాచరించి జాగరణ చేయవలయును.

"మున్ను శబరి నదీతీరమునందున్న అరణ్యములో కులీనుడను బోయవాడు తన భార్యాబిడ్డలతో నివసించుచుండెను. తనకు వేటతప్ప మరొక ఆలోచన లేదు.కడుమూర్ఖుడు వేటకు పోఫుట, జంతువులను చంపి వాటినికాల్చి తాను తిని తన భార్యాబిడ్డలకు తినిపించుటతప్ప మరేదియు తెలియదు. జంతువులనువేటాడుటలో నేర్పుగలవాడు.క్రూరమృగములు సహితం బోయవానిని చూచి భయపడి పారిపోయెడివి. అందుచేత అతడు వనమంతా నిర్భయంగా తిరిగేవాడు.

ఒకనాడు ప్రతిదినము వేటకు వెళ్ళునట్లే బయలుదేరి వెళ్ళెను.ఆనాడు జంతువు లేమియు కంట పడలేదు. సాయంకాలమగుచున్నది. వట్టి చేతులతో ఇంటికి వెళ్ళుటకు మనస్సంగీకరీంచ నందున పొద్దుగుంకి పోయిననూ అక్కడున్న మా రేడు చెట్టుపైకెక్కి, జంతువుకొఱకు యెదురు చూచుచుండెను. తెల్లవారుతున్న కొలది చలియెక్కువగుచు మంచు కురుస్తున్ననూ కొమ్మలను దగ్గరకులాగి వాటితో తన శరీరాన్ని కప్పుకోనుచుండెను. ఆ కొమ్మలజున ఎండుటాకులు రాలి చెట్టు క్రిందవున్న శివలింగముమీద పడినవి. ఆరోజు మహాశివరాత్రి అందులో బోయవాడు రాత్రాంతట తిండితినక జాగరణ వున్నాడు. తనకు తెలియకపోయిననూ మారేడుపత్రములు శివలింగముమై పడినవి. ఇంకేమున్నది! శివరాత్రి మహిమ బోయవానికి సంప్రాప్తించెను. మాఘమాసములో కృష్ణపక్ష చతుర్ధశిరాత్రి అంతయు జాగరణ, పైగా శివలింగముపై బిల్హ్వపత్రములు పడుట తిండి లేక ఉపవాసము వుండుట ఇవన్ని ఆబోయవానికి మేలుచేసినవి.

జరామరణములకు హెచ్చుతగ్గులుగాని, శిశువృద్ధులుగాని లేవు. పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యములనుబట్టి మనుజుడు తన జీవితమును గడపవలసినదే.

మరికొన్ని సంవత్సరములకు ఆ బోయవానికి వృద్ధాప్యముకలిగి మరణమాసన్నమై ప్రాణములు విడిచెను. వెంటనే  యమభటులొచ్చి వాని ప్రాణములు తీసుకుపోవుచుండగా కైలాసమునుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలోనున్న బోయవాని జీవాత్మను తీసుకొని శివుని దగ్గరకు పోయిరి. యమభటులు చేయునదిలేక యమునితో చెప్పిరి. యముడు కొంతతడవు ఆలోచించి శివుని వద్దకు వెళ్ళెను.

శివుడు పార్వతి, గణవతి,  కుమారస్వామి, నంది, తుంబుర నారదాది గణములతో కొలువు తీర్చి వున్న సమయములో యముడు వచ్చి శివునకు నమస్కరించాడు. ఉమావతి యముని దీవించి ఉచితాసనమిచ్చి కుశలప్రశ్నలడిగి వచ్చిన కారణమేమని ప్రశ్నించెను.

అంతట యముడు మహేశా! చాల దినములకు మీ దర్శన భాగ్యం కలిగినందులకు మిక్కిలి ఆనందించుచున్నాను. నా రాకకు కారణమేమనగా, ఇంతకుముందు మీదూతలు తీసుకు వచ్చిన బోయవాడు మహాపాపి, క్రూరుడు దయాదాక్షిణ్యాలు లేక అనేక జీవహింసలు చేయుచున్నాడు. ఒక దినమున అనగా మహాశివరాత్రినాడు తాను యాదృచ్చికముగా జంతువులు దొరకనందున తిండి తినలేదు. ఆ రాత్రి చలి బాధకు తట్టుకొనలేక బిల్హ్వపత్రములను కప్పుకొన్నాడు. జంతువులను వేటాడుటకు రాత్రి అంతయు మెలకువగా వున్నాడు.కాని చిత్తశుద్ధితో తాను శివలింగమును పూజించలేదు. గనుక అతనిని కైలాసమునకు తీసుకొనివచ్చుట భావ్యమా? అంతమాత్రమున అతనికి కైవల్యము దొరుకునా!” అని యముడు విన్నవించుకున్నాడు.

యమధర్మరాజా! ప్రీతికరమైన మహాశివరాత్రి పర్వదినమున బిల్హ్వపత్రములు నాపైన వేసి, తిండిలేక జాగరణతో నున్న యీబోయవాడుకూడ పాపవిముక్తుడు కాగలడు. ఈ బోయవానికి కూడ ఆ వ్రతఫలం దక్కవలసినదే గనుక ఈ బోయవాడు పాపాత్ముడయినను, ఆనాటి శివరాత్రి  వ్రత మహిమవలన నా సాయుజ్యము ప్రాప్తమయినది. అని పరమేశ్వరుడు యమునికి వివరించెను.  యముడు చేయునది లేక చంద్రశేఖరుని వద్దనుండి వెడలిపోయెను.

Haridra Pasupu Ganapathi Pooja - (హరిద్రా) పసుపు గణపతి పూజ

శ్రీ పసుపు గణపతి పూజ. పూర్వాంగం ॥ అస్మిన్ హరిద్రాబింబే శ్రీ మహాగణపతిం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి ॥ ప్రాణప్రతిష్ఠ ఓం అసునీతే పునరస్మాసు చక్...