Wednesday, July 29, 2026

The Lakshmi Puja and Lakshmi Stavam Performed by Indra - ఇంద్రుడు చేసిన లక్ష్మీపూజ లక్ష్మీస్తవం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - ఇంద్రుడు చేసిన లక్ష్మీపూజ లక్ష్మీస్తవం

నారదా! ఆ సమయంలో ఇంద్రుడు చేసిన లక్ష్మీపూజ ధ్యానం స్తోత్రం సవివరంగా చెబుతాను. తెలుసుకో - అని నారాయణమహర్షి కథను కొనసాగించాడు.

ఇంద్రుడు శుద్ధోదకాలలో స్నానంచేసి ధౌతవస్త్రాలు ధరించి కలశం స్థాపించి ఆ క్షీరసముద్రతీరాన లక్ష్మీదేవిని అర్చించాడు. ముందుగా గణేశ దినేశ వహ్ని విష్ణు శివ పార్వతులను ఆవాహన చేసి పుష్పగంధాదులతో పూజించాడు. పరమైశ్వర్య స్వరూపిణి మహాలక్ష్మిని ఆవాహన చేశాడు. బ్రహ్మదేవుడు పురోహితుడై వేదమంత్రాలు చదువుతుండగా వినయవినమితగాత్రుడై భక్తిప్రపత్తులతో ఆర్చించాడు. మునీంద్రులూ దేవతలూ బ్రాహ్మణులూ బృహస్పతి హరి హరుడు అందరూ ఎట్టఎదుట నిలిచి ఆనందిస్తున్నారు. పారిజాతపుష్పం తెచ్చి దానిమీద చందనం జల్లి ధ్యానించి మహాలక్ష్మి పాదపద్మాలకు సమర్పించాడు. సామవేదోక్తమైన ధ్యానం ఆది.

వెయ్యిరేకుల తామరపువ్వు దుద్దుమీద కూర్చునే తల్లిని, కోటి శరత్పూర్ణిమలనాటి చంద్రబింబాల కాంతిని అపహరించే పరాదేవతను ధ్యానిస్తున్నాను. తేజస్సుతో ప్రజ్వరిల్లుతూ చూపులకు హాయిగొల్పుతూ కాగిన బంగారపు రంగులో రూపం ధరించి ఉన్న లక్ష్మీదేవిని ఊపాసిన్తున్నాను. పీతాంబరం ధరించి రత్నభూషణాలు అలంకరించుకొని చిరునవ్వులు చిందిస్తూ ప్రసన్నవదనంతో ప్రత్యక్షమైన సుస్థిరయౌవతిని శ్రీహరి సతిని స్తుతిస్తున్నాను. శుభంకరియై సర్వసంపదలనూ ఇచ్చే మహాలక్ష్మిని సేవిస్తున్నాను.

ఇలా స్తుతించి షోడశోపచారాలూ మంత్రపూర్వకంగా చేశాడు. విశ్వకర్మ ప్రత్యేకంగా నిర్మించి తెచ్చిన దివ్యసింహాసనం సమర్పించి, పుష్పచందనదూర్యాది సంయుతంగా గంగోదకాలనూ శంఖతీర్థాలనూ అర్ఘ్యపాద్యాలుగా ఇచ్చి, ఆమలకీఫలయుక్తంగా సుగంధి పుష్పతైలాన్ని దేహసౌందర్యవర్థకంగా సమర్పించి, విలువైన పట్టుచీరలు పెట్టి, రత్నాభరణాలు ఇచ్చి, పరిమళ భరితమైన ధూపాన్ని ఆఘ్రాణింపచేసి, జగచ్చక్షూరూపమూ తిమిరాపహమూ దీపాన్ని చూపించి, ఘుమఘుమలాడే చందనాన్ని జల్లి, షడ్రసోపేతమూ అత్యంతరుచికరమూ నైవేద్యాన్ని సమర్పించాడు. అన్నమూ పాయసమూ స్వస్తికమూ పక్వఫలాలూ కామధేనువిచ్చిన పాలూ పెరుగూ వెన్న నెయ్యి, చెరకు బెల్లం, గోధుమరవ్వతో బెల్లమూ పాలూ నెయ్యీ కలిపి వండిన (మిష్టాన్నం) ప్రసాదం - నివేదన చేశాడు.

శీతల వాయువులను విరజిమ్మే విసినకర్రనూ, కర్పూర సువాసితమై జిహ్వాజాడ్యాన్ని వదిలించే తాంబూలాన్నీ, సువాసితమూ సుశీతమూ పానీయాన్నీ, ఆచమనియాన్నీ మరో పట్టువస్త్ర యుగ్మాన్నీ, మరో రత్నభూషణాన్నీ, అన్ని ఋతువులలోనూ వాడిపోకండా నవనవలాడుతూ సువాసనలు నింపే దివ్యపుష్పమాలికనూ, గంధాన్నీ శుద్దోదకాన్నీ, రత్ననిర్మిత - పుష్పచందనచర్చిత - వస్త్ర భూషిత మనోహర తల్పాన్నీ, భక్తితో సమర్పించాడు. ఓ పరాదేవతా! ఈ భూగోళంలో ఈ స్వర్లోకంలో అపూర్వమూ దుర్లభమూ దేవభూషార్హమూ భోగార్హమూ అయిన ప్రతిద్రవ్యాన్నీ నీకు కానుకగా పూజావస్తువుగా నైవేద్యంగా సమర్పిస్తున్నాను, దయతో స్వీకరించు.

ఇలా షోడశోపచారాలూ చేసి మహాలక్ష్మీమూలమంత్రాన్ని పదిలక్షలు జపించాడు. దానితో మంత్రసిద్ధి కలిగింది. ఈ మంత్రం కల్పవృక్షంలాంటిది. బ్రహ్మదేవుడు ఉపదేశించాడు. లక్ష్మీమాయా కామవాణీ బీజాక్షరపూర్వకంగా కమలావాసిన్యై స్వాహా, ఇది వేదోక్త మంత్రరాజం. కుబేరుడు దక్షుడు సావర్ణి మనువు మంగళుడు సప్తద్వీపాధిపతులు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు కేదారనృపతి ఇత్యాదులందరూ ఈ మహామంత్రాన్ని ఉపాసించి అనుగ్రహసిద్ధులు పొందారు.

మంత్రం సిద్దించడంతోనే మహాలక్ష్మి నిజస్వరూపంతో ఇంద్రుడికి దర్శనమిచ్చింది. దివ్యవిమానం మీద వరదాభయహస్తాలతో కనిపించింది. శరీరకాంతులు సప్తద్వీపాలకూ వ్యాపిస్తున్నాయి. రత్న భూషణాల ధగధగలలో తెల్ల సంపంగిలాగా ఉంది. ప్రసన్నవదనంతో దరహాసం చేస్తోంది. భకానుగ్రహకాతర, మెడలో రత్నమాల కోటిచంద్రసమప్రభంగా మెరుస్తోంది,

పురందురుడి కళ్ళు చెమ్మగిల్లాయి. తనువు పులకించింది. బ్రహ్మదేవు డుపదేశించిన వేదోక్త స్తోత్రరత్నాన్ని అనర్గళంగా పఠించాడు. కమలవాసినికి నారాయణికి కృష్ణప్రియకు మహాలక్ష్మికి నమస్కారం. పద్మపత్రేక్షణకు పద్మాస్యకు పద్మాసనకు పద్మినికి వందనం. వైష్ణవికి సర్వసంపత్స్వరూపిణికి సర్వారాధ్యకు ఏటికోళ్ళు. హరిభక్తి ప్రదాత్రికి హర్షదాత్రికి కృష్ణవక్షఃస్థితకు కృష్టేశకు నతులు. అందమైన రత్నపద్మంలో చంద్రశోభాస్వరూపకు సంపదధిష్ఠానదేవతకు మహాదేవికి ప్రణతులు. బుద్ధిస్వరూపకు బుద్దిదాయికి శిరసువంచి అయిదు పదిచేస్తున్నాను.

నమః కమలవాసిన్యై నారాయణ్యై నమోనమః ।
కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మై నమోనమః ॥

పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమోనమః ।
పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమోనమః ॥

సర్వసంపత్స్వరూపిణ్యై సర్వారాధ్యాయై నమోనమః

హరిభక్తి ప్రదాత్య్రై చ హర్షదా
త్య్రై నమోనమః ॥

కృష్ణవక్షఃస్థితాయై చ కృష్ణేశాయై నమోనమః

చంద్రశోభా స్వరూపాయై రత్నపద్మే చ శోభవే ॥

సంపత్త్యధిష్ఠాతృదేవ్యై మహాదేవ్యై నమోనమః

నమో బుద్దిస్వరూపాయై బుద్దిదాయ్యై నమోనమః ॥

వైకుంఠంలో మహాలక్ష్మివి. క్షీరసాగరంలో మాయాలక్ష్మివి. అమరావతిలో స్వర్గలక్ష్మివి. మహారాజులకు రాజ్యలక్ష్మివి. ఇంటింటా గృహలక్ష్మివి. సాగరంలో సురభిగా(కామధేనువు) ఆవతరించావు. యజ్ఞకర్మల్లో నువ్వు దక్షిణాదేవివి. దేవమాత అదితివి నువ్వే. కమలవు, కమలాలయవు. హవిర్దానసమయంలో నువ్వు స్వాహాదేవివి. కవ్యదానంలో స్వధాదేవివి. నువ్వు విష్ణురూపవు, సర్వాధార వసుంధరవు, శుద్ధసత్త్వస్వరూపవు, నారాయణపరాయణవు, క్రోధహింసా వివర్జితవు, వరదవు, శారదవు, పరమార్థప్రదవు, హరిదాస్యప్రదాయినివి. పరాదేవతవు. నువ్వు లేకపోతే జగత్తు నిస్సారమూ భస్మప్రాయమూ ఆయిపోతుంది. విశ్వమంతా జీవన్మృతమవుతుంది. నువ్వు అందరికీ మాతృమూర్తివి. సర్వబాంధవ స్వరూపిణివి, ధర్మార్థకామమోక్షాలకు కారణరూపిణివి. శిశువులుగా ఉన్నంతవరకే కన్నతల్లులు పాలుకుడిపి బిడ్డలను సంరక్షిస్తారు. నువ్వుమాత్రం అందరికీ అన్నివేళలా అన్ని రూపాలలోనూ కన్నతల్లివై సాకుతుంటావు.

తల్లిలేని శిశువుల్ని కాపాడటానికి మానవులో దేవతలో ఉన్నారు. నువ్వులేని వాడిని కాపాడేందుకు ఇంక ఎవ్వరూ లేరు. నువ్వు నిరంతరం సుప్రసన్నవు. నాపట్లకూడా రవ్వంత ప్రసన్నవై అనుగ్రహించు. నా రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించుకున్నారు. చెయ్యిజారిపోయింది. ఓ సనాతనీ! దాన్ని మళ్ళీ నాకు ఇప్పించు. నువ్వూ నీ అనుగ్రహమూ నావెంట లేనంతవరకూ నేను బంధుహీనుణ్ణి, భిక్షుమాత్రుణ్ణి, సర్వసంపద్విరహితుణ్ణి, దరిద్రుణ్ణి. సర్వసౌభాగ్యప్రదమైన ధర్మాన్నీ జ్ఞానాన్నీ నాకు ఉపదేశించు. నా ప్రతాపాన్నీ ప్రభావాన్నీ రాజ్యాధికారాన్నీ పరాక్రమాన్నీ ఐశ్వర్యాన్నీ జయాన్నీ మళ్ళీ నాకు అందించు.

దేవేంద్రుడు ఆర్తితో అభ్యర్థించాడు. దేవతాగణాలతో సహా సాష్టాంగపడ్డాడు. వలవలా విలపించాడు. బ్రహ్మేశాన శేషధర్మ కేశవులు కూడా ఇంద్రుడి పక్షానా దేవతల పక్షానా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అభ్యర్థించారు.

మహాలక్ష్మి ప్రసన్నురాలయ్యింది. దేవతలకు అభీప్సితవరాలు అన్నీ ఇచ్చింది. కేశవుడికి పుష్పమాలిక బహూకరించింది. దేవతలు సంతోషించి తమ లోకానికి వెళ్ళిపోయారు. మహాలక్ష్మీదేవి శ్రీహరి సన్నిధికి చేరుకుంది. బ్రహ్మేశానాదులూ ఇంద్రాదిదేవతలను మనసారా ఆశీర్వదించి సంతృప్తులై తమతమ లోకాలకు వెళ్ళారు.

నారదా! పుణ్యప్రదమైన ఈ లక్ష్మీస్తవాన్ని త్రిసంధ్యలలోనూ పఠించేవారు కుబేరులవుతారు. రాజరాజేశ్వరులవుతారు. లక్ష్మీదేవి వారింటిలో స్థిరంగా నివసిస్తుంది. అయిదు లక్షలసార్లు భక్తితో పఠిస్తే స్తోత్రసిద్ధి కలుగుతుంది. అటుపైని మరొక్కనెల సిద్దసోత్ర పఠనం చేస్తే అతడు నిస్సంశయంగా మహారాజేంద్రుడూ మహాసుఖి అవుతాడు.

శౌనకాది మహామునులారా! మహాలక్ష్మీ ఉపాఖ్యానంతో నారదుడు ఆనందపరవశుడయ్యాడు. శరీరం పులకించింది. కళ్ళల్లో ఆనందబాష్పాలు జాలువారాయి. నారాయణమహర్షిని వేనోళ్ళ కొనియాడాడు.

నారాయణమహర్షీ! నువ్వు సాక్షాత్తూ నారాయణుడివి. రూప గుణ తేజో యశః కాంతులలో సమానుడివి. జ్ఞానులలో యోగులలో సిద్ధులలో ఉత్తముడివి. వేదవేత్తలలో తపస్వులలో మునీశ్వరులలో ప్రథముడివి. మహాలక్ష్మి ఉపాఖ్యానాన్ని ఆద్భుతంగా వినిపించావు. ధన్యుణ్ణి. ఇక నీ ఇష్టం. నువ్వు ఏది వినిపించాలి అనుకుంటే ఆది వినిపించు. వేదపురాణాలలో అత్యంత నిగూఢంగా ఉన్న విషయాలన్నీ నీకు కరతలామలకాలు. అటువంటి సారభూతమైన ఉపాఖ్యానం ఏదో నిశ్చయించి ఉపదేశించు.

నారదా! అటువంటివి చాలా ఉన్నాయి. ఏదని చెప్పను. అందుకని నువ్వే ఏమి వినాలనుకుంటున్నావో అడుగు. అదే చెబుతాను.

మహర్షీ! హవిర్దాన సమయంలో స్వాహాదేవి, పితృదాన కర్మల్లో స్వధాదేవి, తక్కిన క్రతువుల్లో దక్షిణాదేవి వినిపిస్తుంటారుగదా! వారి చరిత్ర ఇంతవరకూ నేను వినలేదు. నీనోటినుంచి వినాలని ఉంది.

స్వాహా వృత్తాంతం


Tuesday, July 28, 2026

Grishneshwar Jyotirlinga, Verul Village, Chhatrapati Sambhajinagar (Aurangabad) District, Maharashtra - ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం, వెరుల్ గ్రామం, ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) జిల్లా, మహారాష్ట్ర

ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం, వెరుల్ గ్రామం, ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) జిల్లా, మహారాష్ట్ర

ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగం భారతదేశంలోని పన్నెండు జ్యోతిర్లింగాలలో చివరిదైన, అత్యంత పవిత్రమైన శివక్షేత్రం. ఇది మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) జిల్లాలోని వెరుల్ గ్రామంలో, ప్రసిద్ధ ఎల్లోరా గుహలకు కేవలం ఒక కిలోమీటర్ దూరంలో ఉంది.

ఘృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం ఆలయం, శివ పురాణం ప్రకారం శివుని జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఇది ఒకటి. దీనిని కొన్నిసార్లు ఘర్నేశ్వర్ లేదా ఘుష్మేశ్వర్ అనికూడా పిలుస్తారు. ఘర్నేశ్వర అనే పదానికి "కరుణ ప్రభువు" అని అర్ధం. శైవ సంప్రదాయంలో ఈ 
జ్యోతిర్లింగ దర్శనం ఒక ముఖ్యమైన తీర్థయాత్రగా పరిగణిస్తారు. ఇది పన్నెండవ జ్యోతిర్లింగం (కాంతి లింగ). ఈ ప్రదేశం ఎల్లోరా గుహల నుండి సుమారు రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఎల్లోరాలో (వేరుల్) వద్ద ఉంది. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది. ఇది ఔరంగాబాద్ నగరం వాయవ్య దిశ నుండి 30 కి.మీ (19 మైళ్లు) దూరంలో ఉంది. ముంబై నగరానికి తూర్పు- ఈశాన్యంగా 300 కి.మీ(190 మైళ్లు ) దూరంలో ఉంది.

చరిత్ర
13, 14 వ శతాబ్దాలలో ఈ ఆలయ నిర్మాణాన్ని ఢిల్లీ సుల్తానుల చేత ధ్వంసం చేయబడింది. అనేకసార్లు తిరిగి నిర్మించిన ఈ ఆలయం మొఘల్- మరాఠా వివాదంలో నాశనం చేయబడింది. మొఘల్ సామ్రాజ్యం పతనం తరువాత, 18 వ శతాబ్దంలో ఇండోర్ రాణి అహిల్యబాయి హోల్కర్ సౌజన్యంతో, ఇది ప్రస్తుతంఉన్న రూపంలో పునర్నిర్మించబడింది. ఇది హిందువుల ముఖ్యమైన, పుణ్యక్షేత్రం. దేవాలయ ప్రాంగణంలోకి, దాని లోపలి గదుల్లోకి ఎవరైనా ప్రవేశించవచ్చు. కాని ఆలయ గర్భగుడి లోపలికి ప్రవేశించడానికి, స్థానిక హిందూ సంప్రదాయం ప్రకారం పురుషులు చొక్కా ధరించకుండా మాత్రమే వెళ్లాలని నియమం.

ఘృష్ణేశ్వర్ ఆలయం నిర్మాణం, దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎర్ర రాళ్ళతో నిర్మించిన ఈ ఆలయం ఐదు అంచెల శిఖరాలతో కూడి ఉంది. ఈ ఆలయాన్ని 16 వ శతాబ్దంలో వేరుల్‌కు చెందిన మలోజీ భోసలే (ఛత్రపతి శివాజీ తాత), తరువాత 18 వ శతాబ్దంలో రాణి అహిల్యబాయి హోల్కర్ చేత తిరిగి పునర్నిర్మించబడింది.

వారణాసి లోని కాశీ విశ్వనాథ్ ఆలయం, గయ లోని విష్ణు ఆలయం, సోమనాథ్ ఆలయాల వంటి ప్రధాన హిందూ దేవాలయాలు కొన్నిటిని తిరిగి పునర్నిర్మించిన ఘనత అహిల్యబాయి హోల్కర్కు దక్కింది.

ఈ ఆలయం భారతదేశంలోని జ్యోతిర్లింగ ఆలయాలలో 240 అడుగులు పొడవు, 185 అడుగుల ఎత్తుగల అతి చిన్న ఆలయంగా చెప్పుకోవచ్చు. ఈ ఆలయానికి సగం దూరంలో విష్ణువు దశవతారాలు 24 స్తంభాలపై పెద్దవరండాలో ఎర్ర రాతితో చెక్కబడిన దేవాలయం నిర్మించబడింది. 

ఈ స్తంభాలపై శివుని వివిధ ఇతిహాసాలు, పురాణాలను సంగ్రహించే శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఇందులోని గర్బాలయం 17 అడుగులు పొడవు, 17 అడుగులు ఎత్తుకలిగిన లింగమూర్తి తూర్పు వైపుకు తిరిగిన ముఖంతో ప్రతిష్ఠంచబడింది. కోర్టు హాలులో నంది విగ్రహం ఉంది. ఈ ఆలయంలో ఇతర దేవతా శిల్పాలు ఉన్నాయి.

జ్యోతిర్లింగాలలో ఆఖరిది అయిన ఘృష్ణేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే కానీ జ్యోతిర్లింగ యాత్ర సంపూర్ణం కాదు అని అంటారు.

"ఇళాపురే రమ్య విశాల కేస్మిన్‌ సముల్లసం తంచ జగద్వరేణ్యం వందే మహోదార తర స్వభావం ఘుశ్శేశ్వరాఖ్యం శరణ్యం ప్రపద్యే"

ఈ ప్రాంతంలో ఏల్‌ అనే రాజు ఉండేవాడు. ఆయన రాజధాని ఏలాపూర్‌. అదే వేరూల్‌గా ప్రసిద్ధి చెందిందని చరిత్ర ద్వారా తెలుస్తోంది. ఒకసారిరాజు వేటకు వనానికి వెళ్తాడు. అక్కడ అడవి జంతువులతో పాటు మునుల ఆశ్రమంలో ఉండే జంతువులని కూడా సంహరిస్తాడు. అది చూసిన మునులు రాజు సర్వాంగాలకు పురుగులు పట్టాలని శపిస్తారు.

ఆ శాపం వల్ల రాజు వనాల వెంట తిరుగుతూ ఉంటాడు. ఒకనాడు బాగా దాహం వేయడంతో అడవిలోని చాలా చోట్ల తిరుగుతాడు. అయిన కూడా ఎక్కడా నీరు దొరకదు. ఒక చోట మాత్రం ఆవు డెక్కలతో చేసిన నీటికుంటలో కొద్దిగా నీరు కనిపిస్తుంది. రాజు వాటిని కొద్దిగా తాగగానే విచిత్రంగా అతని శరీరానికి పట్టిన పురుగులన్నీ మటుమాయం అవుతాయి.

రాజు ఆ సరస్సు ఉన్న ప్రదేశంలో తపస్సును ఆచరించగా బ్రహ్మ ప్రత్యక్షమవుతాడు. ఆ ప్రదేశంలో తీర్థాలను ప్రతిష్ఠిస్తాడు. దగ్గరలో ఒక సరోవరాన్ని నెలకొల్పుతాడు. బ్రహ్మ నెలకొల్పిన సరోవరమే బ్రహ్మసరోవరం. కాలక్రమేణ అది శివాలయంగా ప్రసిద్ధి గాంచింది.

పురాణగాథ
పూర్వం ఈ ప్రదేశంలో నాగజాతి ఆదివాసీలు నివాసం ఉండేవారు. అందుకే ఈ ప్రాంతాన్ని బాంబీ అనేవారు. ఆదిమతెగ భాషలో బాంబీ అంటే పాముల పుట్ట అని అర్థం. మరాఠీలో దీనిని ‘వరూల్‌’ అంటారు. కాలక్రమేణ అది వేరూల్‌గా మారింది. ఈ ప్రాంతంలో ఏలగంగా నది ప్రవహిస్తుంది. ఏలగంగా నది తీరంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతం వేరూల్‌గా ప్రసిద్ధి చెందిందని మరో కథనం.

ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ పురాణ కథ:
పూర్వం దేవగిరి దుర్గంలో సుధర్మడు అనే బ్రాహ్మణుడు తన భార్య సుదేహతో కలిసి ఉండేవాడు. వారు నిత్యం అనేక పూజలు, నైతిక కార్యక్రమాలను నిర్వహించేవాడు. కానీ వారికి సంతానం లేక బాధపడేవారు. ఆ సమయంలో సుదేహ తన చెల్లెలైన ఘుష్మను భర్తకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటుంది. వివాహానికి ముందే వారిని చూసి ఈర్ష్య పడనని వాగ్ధానం చేస్తుంది.

వివాహం అయిన తరువాతా అక్కాచెల్లెళ్లిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. కాలక్రమేన ఘుష్మకు మగ సంతానం కలిగింది. కొంతకాలానికి ఘుష్మ కుమారుడికి వివాహం జరుగుతుంది. చెల్లెలి సంతానం అభివృద్ధి చెందడం సహించలేని సుదేహ, ఘుష్మ కుమారున్ని చంపి కోనేటిలో పడేస్తోంది. శివ భక్తురాలైన ఘుష్మ "ఇదంతా పరమేశ్వరుని లీల" అనుకుంటూ ముక్కంటిని స్తుతిస్తుంది. 

అప్పుడక్కడ ప్రత్యక్షమైన పరమేశ్వరుడు జరిగిన విషయాన్ని ఘుష్మకు వివరిస్తాడు. పరమ శివుడు సుదేహని సంహరించడానికి ఉపక్రమించగా వద్దని ఘుష్మ ప్రాధేయపడుతుంది. దాంతో పరమేశ్వరుడు సుదేహకు పాపపరిహారం కల్పిస్తాడు. అప్పుడు ఘుష్మ స్వామిని తన పేరు మీద అక్కడ కొలువుతీరమని వేడుకుంటుంది. అంతట ఆ స్వామి అక్కడ స్వయంభువు కొలువయ్యాడు. ఘుష్మేశుడిగా వెలసిన పరమేశ్వరుడు ఇక్కడ నిత్యం పూజలు అందుకుంటున్నాడు. ఆ ఘుష్మేశుడే కాలక్రమంలో ఘృశ్నేశ్వరుడిగా ప్రసిద్ధి చెందాడని స్థల పురాణం.

అలాగే స్వామి ఇక్కడ వెలవడం వెనుక మరో పురాణ గాథ కూడా ఉంది. ఒకరోజు శివుడు, పార్వతి కామ్యక వనంలో ఏకాంతంలో ఉండగా పార్వతికి దాహం వేసిందట. అపుడు శివుడు పాతాళంనుంచి భోగవతి నీటిని పైకి రప్పించి ఆమె దాహం తీర్చాడట. అది నీటి కొలనుగా మారి శివాలయ తీర్థంగా పేర్గాంచింది.

పార్వతి మాత తన పాపిటను అలంకరించుకోవడానికి కుంకుమ, కేసరిలను శివాలయ తీర్థంలో కలిపిందట. ఆమె చేతిలో కుంకుమతో శివలింగం తయారయ్యిందట. ఆ లింగంనుంచి ఓ దివ్యజ్యోతి ఉద్భవించగా పార్వతిమాత ఆ దివ్య జ్యోతిర్లింగాన్ని ఒక రాతి లింగంలో వుంచి, లోక కళ్యాణంకోసం అక్కడ ప్రతిష్ఠించిందట. ఆనాటినుంచి ఆ పూర్ణ జ్యోతిర్లింగానికి కుంకుమేశ్వరుడనే పేరొచ్చింది.

సాక్షాత్తు పార్వతిమాత ప్రతిష్ఠించిన జ్యోతిర్లింగం కాబట్టే దీనికి ఇంతటి మహత్తు ఏర్పడిందంటారు

ఆలయ విశిష్టత:
పూర్వం రాజులు నిర్మించిన ఆలయం శిథిలావస్థకు చేరుతున్న స్థితిలో వేరూల్‌ గ్రామ పెద్ద, పరమ శివ భక్తుడైన భోస్లేకు ఘృశ్నేశ్వరుని మహిమ వలన పాముపుట్టలో ఒక పెద్ద నిధి లభిస్తుంది. ఆ సంపదతో అతను ఆలయానికి జీర్ణోద్ధరణ పనులు చేయిస్తాడు. అంతేకాక శిఖర సింగనపూర్‌లో ఒక చెరువును తవ్వించాడని ప్రతీతి.

ఆ తరువాత భోస్లే వంశంలో సాక్షాత్తు ఆ భోలానాథుడే జన్మించి వంశప్రతిష్ఠను పెంచాడని కథనం. తరువాతి కాలంలో ఆలయానికి అహల్యాదేవి హోల్కార్‌ జీర్ణోద్ధరణ పనులు చేయించిందని ప్రశస్తి. 240 అడుగుల ఎత్తు, 185 అడుగుల వెడల్పు ఉన్న ఈ ఆలయం నేటికి దృఢంగా, సుందరంగా నిలిచి ఉంది.

మందిరానికి సగం ఎత్తులో ఫలకంపై దశావతారాల విగ్రహాలు చెక్కబడి దర్శనమిస్తాయి. ఇతర దేవతా విగ్రహాలూ భక్తి భావం రేకిత్తిస్తాయి. 24 రాళ్ల స్తంభాలపై ప్రధాన ఆలయ సభా మండపాన్ని నిర్మించారు. నందీశ్వరుడు ఏకశిల విగ్రహంగా దర్శనిమిస్తాడు. ఇక్కడ స్వామి వారు 17 అడుగుల ఎత్తు, 17 అడుగుల వెడల్పుతో పూర్వాభిముఖంగా దర్శనమిస్తారు. భక్తులే స్వయంగా అభిషేకాలు నిర్వహించవచ్చు. గర్భగుడిలోనికి పురుషులు పై వస్త్రాన్ని విడిచి వెళ్లాలి.

రోడ్డు మార్గం: ఔరంగాబాద్‌ నుంచి ఈ క్షేత్రం ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ప్రైవేట్‌, సొంత వాహనాల్లో ఔరంగాబాద్‌ నుంచి చేరుకోవచ్చు. 
వేరూల్‌ గ్రామం నుంచి ఔరంగాబాద్‌కు బస్సులు నడుస్తుంటాయి.

రైలు మార్గం: ఔరంగాబాద్‌ రైల్వే స్టేషన్ ఇక్కడి సమీప రైల్వే స్టేషన్.

వాయు మార్గం: దిల్లీ, ముంబయి నుంచి ఔరంగాబాద్‌కు విమానాలను నడుపుతున్నారు.

Trimbakeshwar Temple, Trimbak (Nashik), Maharashtra - త్రయంబకేశ్వరాలయం, త్రయంబక్ (నాసిక్), మహారాష్ట్ర

త్రయంబకేశ్వరాలయం, త్రయంబక్ (నాసిక్), మహారాష్ట్ర

త్రయంబకేశ్వరాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. త్రయంబకేశ్వర్ శివాలయం త్రయంబక్ పట్టణంలోని ఒక పురాతన హిందూ దేవాలయం. ఈ క్షేత్రం నాసిక్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రయంబకం లేదా త్రయంబకేశ్వర్ అని పిలిచే ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థానంగా పిలుస్తారు. అయితే ఈ క్షేత్రానికి గోదావరి జన్మ స్థానం కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది.

ఇది నాసిక్ నుండి 24 నక్షిక్ రహదారిలో ఉంది. శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ వద్ద పవిత్ర గోదావరి నది మూలం త్రయంబక్ సమీపంలో ఉంది. ఇండోర్ రాష్ట్రానికి చెందిన ఫడ్నవీస్ అయిన శ్రీమంత్ సర్దార్ రావుసాహెబ్ పార్నేర్కర్ నిర్మించిన ఆలయ ప్రాంగణంలోని కుసావర్త కుంట (పవిత్రమైన చెరువు), భారతదేశం ద్వీపకల్పలో రెండవ పొడవైన నది అయిన గోదావరి నదికి మూలం. కొండ అంచున సర్దార్ ఫడ్నవీస్, అతని భార్య ప్రతిమను చూడవచ్చు. ప్రస్తుత ఆలయాన్ని మొఘల్ పాలకుడు ఔరంగజేబు ధ్వంసం చేసిన తర్వాత పేష్వా బాలాజీ బాజీరావు నిర్మించారు.

పురాణ ఇతిహాసం, చరిత్ర
త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు. 'అంబక 'మంటే 'నేత్ర' మని అర్థం. మూడు నేత్రాలు గల 
శివుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని - అనే మూడు తేజస్సులు మూడు నేత్రలుగా వెలసిన శివుడు. పాలభాగంలోని మూడవ నేత్రమే అగ్నినేత్రం. మన్మథుణ్ణి ఈ నేత్రాగ్నితోనే శివుడు భస్మం చేశాడు. స్వర్గం, ఆకాశం, భూమి - అనే మూడు స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు. 'త్రయంబకం యజామహే - సుగంధిం పుష్టి వర్ధనమ్' మృత్యుంజయ మహామంత్రంతో మృత్యువు అనగా మరణం నుండి విడుదల చేయమని భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తారు.

పురాణ కథనం:
బ్రహ్మగిరిపై గౌతమ మహర్షి అహల్యతో కలిసి నివసించేవారు. ఒకానొకప్పుడు దేశంలో క్షామం ఏర్పడి కరువుతో తినడానికి తిండి లేకుండా ఉన్న సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తితో తోటి ఋషులకు, వారి శిష్యులకు కరువు నుండి విముక్తి కలిగించి అన్నపానాలు దొరికే ఏర్పాటు చేశాడు. 

అప్పుడు ఆ ఋషులు తమకు లేని తపోశక్తులు గౌతమునికి ఉన్నాయని ఈర్ష్యతో ఒక మాయ గోవును పంపి గౌతముడి పాడిపంటలు నాశనం చేయించారు. గౌతముడు ఒక దర్భతో ఆ గోవును అదలించగా అది మరణించింది.

గౌతముడు తాను చేసిన గోహత్యాపాతకం నివృత్తి కోసం శివుడిని మెప్పించి గంగను భూమి మీదకు తెప్పించాడు ఆ గంగయే గోదావరి లేదా గౌతమీ నది. ఈ నదిని ఆ చనిపోయిన గోవు మీద నుండి ప్రవహింపజేసి తన గోహత్యాపాతకాన్ని విముక్తి చేసుకొన్నాడు. ఆ గోవుకి స్వర్గప్రాప్తి కలిగింది.

గౌతమ మహర్షి ప్రార్థన మేరకు శివుడు ఇక్కడ శాశ్వతంగా నివసించడానికి అంగీకరించి, త్రిమూర్తుల స్వరూపంగా (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు) ఈ జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించాడు.

ప్రత్యేకతలు త్రిమూర్తి స్వరూపం: లింగం లోపల చిన్న గుంటలు ఉండి బ్రహ్మ, విష్ణు, శివుల రూపాలను సూచిస్తాయి.

ఆలయ విశేషాలు
పూర్వపు ఆలయ విశేషాలు ఎక్కువగా లేకపోయినా ఇప్పటీ ఆలయాన్ని మాత్రం 1730 లో ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి బాజీరావు పీష్వా నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఎక్కువభాగం దేవాల నిర్మాణానికి నల్ల శాణపు రాయిని ఉపయోగించారు.

ఈ ఆలయం హేమంత్‌పంతీ శైలికి చెందిన నిర్మాణం. ఆలయం చుట్టూ నిర్మాణం లోపలివైపు చాతురస్రా కారంగానూ బయటి వైపుకు నక్షత్రాకారంగానూ ఉంటుంది.

కుశావర్తనం, గోదావరి పుట్టుక
గర్భగుడికి బైటవైపుగా నాలుగు ద్వారాలతో మండపం ఉంటుంది. గర్భగుడిలో కల శివలింగం భూమికి కొంత దిగువలో ఉంటుంది. దాని నుండి నిరంతరం నీటి ఊట ఊరుతూ ఉంటుంది. అది దేవాలయం ప్రక్కన కుశావర్తనం అనే సరోవరంలో కలుస్తూ ఉంటుంది. కుశ అంటే ధర్భ, వర్తం అంటే తీర్ధం అని అర్ధం. దీనిలో స్నానం చేయడం వలన సర్వపాపాలు, రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం.

గౌతముడు శివుని మెప్పించి గంగను తీసుకువచ్చే ప్రారంభంలో తన చేతినున్న ధర్భతో గౌతమి చుట్టూ తిప్పాడు. అలా తిప్పిన, ఆవర్తనమైన చోట బ్రహ్మగిరి నుండి గంగ నేలకు దిగి గోదావరిగా ప్రవహించడం మొదలిడిందని పురణాల ప్రకారం కథనం.

రోడ్డుమార్గం: 
నాసిక్ నుండి దేవాలయానికి 28 కిలోమీటర్లు. ఇక్కడి నుండి బస్సులు ఉంటాయి. 

రైలు మార్గం:  నాసిక్ రోడ్డు రైల్వే స్టేషన్ ఆలయానికి సుమారు 39 కిలోమీటర్ల దూరంలో ఉంది.

వాయుమార్గం: దేవాలయానికి నాసిక్ విమానాశ్రయం 55 కిలోమీటర్ల దూరంలో ఉంది.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Visveswara Jyotirlinga, Kashi, Varanasi, Uttar Pradesh state - విశ్వేశ్వర జ్యోతిర్లింగం, కాశీ, వారణాసి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం

విశ్వేశ్వర జ్యోతిర్లింగం, కాశీ, వారణాసి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం

విశ్వేశ్వర జ్యోతిర్లింగం అనగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసి (కాశీ) క్షేత్రంలో వెలసిన ప్రసిద్ధ కాశీ విశ్వనాథ ఆలయం. ఇది పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటిగా మరియు మోక్షప్రదాతగా భక్తులచే పూజింపబడుతోంది. కాశీని మోక్షపురిగా కూడా పిలుస్తారు.

కాశీ లేదా వారణాసి భారతదేశపు అతి ప్రాచీన నగరాల్లో ఒకటి. హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రము. ఇది ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోవుంది. ఇక్కడ ప్రవహించే గంగానదిలో స్నానం ఆచరిస్తే సర్వపాపాలు నశించి పునర్జన్మ నుంచి విముక్తులౌతారని హిందువుల నమ్మకం.

వరుణ, అసి అనే రెండు నదులు ఈ నగరం వద్ద గంగానదిలో కలుస్తాయి. అంచేత, ఈ క్షేత్రానికి వారణాసి అని కూడా నామాంతరం ఉంది. "కాశీ" అనే పదం "ప్రకాశించడం" లేదా "కనిపించడం" అనే పదం పాత సంస్కృత పదం "కాస్" నుండి ఉద్భవించింది. బ్రిటిషువారి వాడుకలో వారణాసి, బెనారస్ అని మారింది. కాశ్యాన్తు మరణాన్ ముక్తిః - "కాశీలో మరణిస్తే ముక్తి లభిస్తుంది" - అని హిందువులు విశ్వసిస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన విశ్వేశ్వర లింగం ఇక్కడ ఉంది. బౌద్ధులకు, జైనులకు కూడా ఇది పుణ్యక్షేత్రం. వారాణసి ప్రపంచంలోనే అవిచ్ఛిన్నంగా జనావాసం ఉన్న నగరాలలో అత్యంత పురాతనమైంది అని భావిస్తున్నారు.

ఆలయ చరిత్ర అనేక దఫాలుగా నాశనం చెయ్యబడి, పునర్నిర్మించబడిన ఘట్టాలను కలిగి ఉంది. ప్రస్తుత ఆలయం మారాఠా రాణి అహిల్యాబాయి హోల్కర్ 1780లో నిర్మించారు.

గంగా నది, హిందూమతము, హిందుస్థానీ సంగీతము, పట్టు వస్త్రాల నేత, హిందీ, సంస్కృత పండితుల పీఠం - ఇవి వారాణసి నగరపు సంస్కృతీ చిహ్నాలలో ప్రముఖంగా స్ఫురణకు వస్తాయి. హరిశ్చంద్రుడు, గౌతమ బుద్ధుడు, వేదవ్యాసుడు, తులసీదాసు, శంకరాచార్యుడు, కబీర్ దాసు, మున్షీ ప్రేమ్‌చంద్, లాల్ బహదూర్ శాస్త్రి, పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, కిషన్ మహరాజ్ వంటి ఎందరో పౌరాణిక, చారిత్రిక, సాంస్కృతిక ప్రముఖులు వారణాసి నగరం లేదా దాని పరిసర ప్రాంతాలతో ప్రగాఢమైన అనుబంధం కలిగి ఉన్నారు. వారణాసికి గంగానది ఆవలివైపున రామనగరం ఉంది. వారణాసి సమీపంలో సారనాథ్ బౌద్ధ క్షేత్రం ఉంది.

విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాలయం, విశాలాక్షి ఆలయం, వారాహీమాతాలయం, తులసీ మానస మందిరం, సంకట మోచనాలయం, కాల భైరవాలయం, దుర్గా మాత దేవాలయం, భారతమాత మందిరం, లోలార్కడు - ఇలా కాశీలో ఎన్నో దేవాలయాలున్నాయి. దశాశ్వమేథ ఘట్టం, హరిశ్చంద్ర ఘట్టం వంటి పలు స్నాన ఘట్టాలున్నాయి.

కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఇక్కడి ప్రస్తుత విద్యా సంస్థలలో ముఖ్యమైనది. వారణాసిని "మందిరాల నగరం", "దేశపు ఆధ్యాత్మిక రాజధాని", "దీపాల నగరం", "విద్యా నగరం", "సంస్కృతి రాజధాని" వంటి వర్ణనలతో కొన్ని సందర్భాలలో ప్రస్తావిస్తుంటారు.

అమెరికన్ రచయిత మార్క్ ట్వేయిన్ ఇలా వ్రాశాడు - "బెనారస్ నగరం చరిత్ర కంటే పురాతనమైంది. సంప్రదాయం కంటే పురాతనమైంది. గాథలకంటే ముందుది. వీటన్నింటినీ కలిపినా బెనారస్ నగరం కంటే తరువాతివే అవుతాయి.

వారాణసి
వారాణసి నగరానికి, గంగానదికి అవినాభావ సంబంధం ఉంది.
గంగానదితో రెండు చిన్న నదులు "వరుణ", "ఆస్సి" అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందున "వారణాసి" అనే పేరు వచ్చిందని ఒక అభిప్రాయం. వారాణసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అస్సి (ఇది చిన్న నది) నది సంగమ స్థానం ఉన్నాయి.

మరొక అభిప్రాయం ప్రకారం "వరుణ" నదికే పూర్వకాలం "వారాణసి" అనే పేరు ఉండేది. కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది. కాని ఈ రెండవ అభిప్రాయం అధికులు విశ్వసించడంలేదు.

"వారాణసి" అనే పేరును పాళీ భాషలో "బారనాసి" అని వ్రాసేవారు. అది తరువాత బనారస్‌గా మారింది. వారాణసి నగరాన్ని ఇతిహాస పురాణాలలో "అవిముక్తక", "ఆనందకానన", "మహాస్మశాన", "సురధాన", "బ్రహ్మవర్ధ", "సుదర్శన", "రమ్య", "కాశి" అనే వివిధ నామాలతో ప్రస్తావించారు.

చరిత్ర
ఇది హిందువుల ఏడు పవిత్ర నగరాలలో ఒకటి. ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కాంద పురాణం వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాలలో కాశీనగరం ప్రసక్తి ఉంది. కాశీ నగరం శివుని త్రిశులం ఆధారం చేసుకొని వుంది అని నమ్మకం. కావున, యుగపూర్వం నుండి మరియు యుగాంతం తరువాత కూడా నిలిచే ఏకైక నగరం కాశీ.

విద్యకు, పాండిత్యానికి, శిల్పం, వస్త్రం, సుగంధ ద్రవ్యాలవంటి వస్తువుల వ్యాపారానికి వారాణసి కేంద్రంగా ఉంటూ వచ్చింది. గౌతమ బుద్ధుని కాలంలో ఇది కాశీ రాజ్యానికి రాజధాని. చైనా యాత్రికుడు యువాన్ చాంగ్ ఈ నగరాన్ని గొప్ప ఆధ్యాత్మిక, విద్యా, కళా కేంద్రంగా వర్ణించాడు. ఇది గంగానదీ తీరాన 5 కిలోమీటర్ల పొడవున విస్తరించిందని వ్రాశాడు.

18వ శతాబ్దంలో వారాణసి ఒక ప్రత్యేక రాజ్యమయ్యింది. తరువాత బ్రిటిష్ పాలన సమయంలో ఈ నగరం ఆధ్యాత్మిక, వాణిజ్య కేంద్రంగా కొనసాగింది. 1910లో "రామ్‌నగర్" రాజధానిగా బ్రిటిష్ వారు ఒక రాష్ట్రాన్ని ఏర్పరచారు. కాని ఆ రాష్ట్రానికి వారాణసి నగరంపైన మాత్రం పాలనాధికారం లేదు. ఆ వంశానికి చెందిన కాశీ నరేష్ మహారాజ్ ఇప్పటికీ రామ్ నగర్ కోటలోనే నివసిస్తున్నాడు.

పురాణకథనాలు
కాశీ శివస్థాపితమని పురాణకథనాలు వివరిస్తున్నాయి. కురుక్షేత్ర యుద్ధం తరువాత పాండవులు భాతృహత్య, బ్రహ్మహత్యా పాతకాల నుండి విముక్తులవడానికి సప్తముక్తి పురాణాలలో ఒకటైన కాశీ పట్టణానికి విచ్చేసారు.అయోధ్య, మథుర, గయ, కాశి, అవంతిక, కంచి, ద్వారక నగరాలను సప్తముక్తి పురాలని హిందువుల విశ్వాసం. ఆరంభకాల పూరాతత్త్వ పరిశోధనలు వారణాశి పరిసరప్రాంతాలలో 11-12 శతాబ్ధాలలో నివాసాలు ఆరంభమయ్యాయని తెలియజేస్తున్నాయి. ఇది ఆర్యుల మత, తత్త్వ శాస్త్రాలకు మూలమని విశ్వసించబడుతుంది. ప్రపంచంలో నిరంతరంగా నివాసయోగ్యమైన ప్రదేశాలలో కాశీ ప్రథమ స్థానంలో ఉందని భావిస్తున్నారు.

పురాతత్త్వ అవశేషాలు వారణాశి వేదకాల ప్రజల అవాసమని వివరిస్తున్నాయి. కాశీ పట్టణం గురించి ప్రథమంగా అధర్వణ వేదంలో వర్ణించబడింది. అధర్వణవేదం సుమారుగా వేదకాలంలో ప్రజలిక్కడ నివసించారని భావిస్తున్న సమయానికి సరిపోతున్నాయి. ఈ ప్రాంతంలో స్థానికులు నివసించారని చెప్పడానికి తగిన ఆధారాలు లభిస్తున్నాయి.

8వ శతాబ్దంలో 23వ జైనగురువు, ఆరంభకాల తీర్ధగురువు అయిన పార్శ్వనాథుడి జన్మస్థానం వారణాసి అనడానికి ఆధారాలు లభిస్తున్నాయి.

ఆర్ధికం
వారణాశి పారిశ్రమికంగా కూడా అభివృద్ధి చెందింది. వారణాశి మస్లిన్, పట్టు వస్త్రాలకు, సెంటు, దంతపు వస్తువులు, శిల్పాలకు ప్రసిద్ధి. గౌతమబుద్ధుడు (జననం 567 సా.శ. పూ) నివసించిన కాలంలో కాశీ రాజ్యానికి కాశీ రాజధానిగా ఉండేది. సా.శ.పూ 528 బుద్ధిజం కాశీలో స్థాపించబడిందని అంచనా. గౌతమ బుద్ధుడు కాశీలోని సారనాధ్ వద్ద "ధర్మచక్రం కదిలింది (టర్నింగ్ ది వీల్ ఆఫ్ లా)" మొదటిసారిగా గంభీరఉపన్యాసం ప్రజలకు అందించాడు.

చైనా యాత్రికుడు హూయంత్సాంగ్ సా.శ. 635లో వారణాశిని దర్శించాడు. కాశీ పశ్చిమతీరంలో ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన వారణాశి మతం, కళలకు కేంద్రంగా ఉండేదని హూయంత్సాంగ్ వర్ణించాడు. 7వ శతాబ్దంలో హూయంత్సాంగ్ వారణాశిలో నివసించాడు. హూయంత్సాంగ్ వారణాశిని " పోలనైస్ " అని పేర్కొన్నాడు. 30 సన్యాదులకు సంబంధించిన 30 ఆలయాలను కూడా ఆయన వర్ణించాడు.

8వ శతాబ్దంలో శంకరాచార్యుడు శివారధన విధానాలను సాధికారంగా ఆరంభించిన తరువాత వారణాశి మతపరంగా మరింత ప్రసిద్ధి చెందింది.

ప్రముఖులు
మౌర్యుల కాలంలో తక్షశిల, పాటలీపుత్ర మద్య ఉన్న రహదారితో కాశీపట్టణం అనుసంధానించబడి ఉంది. 1194లో వారణాశి నగరం కుతుబుద్దీన్ ఐబక్ స్వాధీనమైంది. కుతుబుద్దీన్ ఐబక్ ఆదేశంతో నగరంలోని సుమారు 1000 ఆలయాలను ధ్వంసం చేయబడ్డాయి. ముస్లిం ఆక్రమణలో నగరం దాదాపు 3 శతాబ్ధాల కాలం క్షీణావస్థను చవిచూసింది. ఆఫ్ఘన్ దండయాత్ర తరువాత నగరంలో సరికొత్తగా ఆలయాలు నిర్మించబడ్డాయి. ఫెరోజ్ షాహ్ కాలంలో 1376లో వారణాశిలోని మరికొన్ని ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయి. ఆఫ్ఘన్ రాజు సికిందర్ లోడి హిందువుల అణిచివేతను కొనసాగిస్తూ 1496లో మిగిలిన హిందూ ఆలయాలను ధ్వంసం చేయించాడు.

ముస్లిం పాలన కాలంలోనే మరొకవైపు వారణాశి మేధావులకు, తాత్వికులకు కేంద్రంగా మారింది. మద్యకాలంలో వారణాశి మతసంప్రదాయాలకు, విద్యకు కేంద్రమై విలసిల్లింది. భక్తి ఉద్యమకాలంలో వారణాశిలో 1389లో రామభక్తుడైన కబీరుదాసు జన్మించాడు. కబీరరుదాసు రచించిన భక్తిరసపూరిత కీర్తనలు 15 వ శతాబ్దంలో భారతదేశంలో కీర్తించబడ్డాయి.

అలాగే 15 వ శతాబ్దంలో సంఘసంస్కర్త, యోగి, కవి, యాత్రికుడు, మతగురువు అయిన రవిదాసు వారణాశిలో జన్మించాడు. రవిదాసు జీవనోధి కొరకు తోళ్ళపరిశ్రమలో పనిచేసాడు. అలాగే భారతదేశం, దక్షిణాసియా అంతటి నుండి అనేక ప్రఖ్యాత విద్యావేత్తలు, బోధకులు వారణాశిని సందర్శించారు. 1507లో గురునానక్ దేవ్ శివరాత్రి సందర్భంగా వారణాశిని సందర్శించాడు. ఈ సంఘటన సిక్కుమత స్థాపనలో అత్యంత ప్రాముఖ్యత వహించింది.

స్వాతంత్రానికి ముందు చరిత్ర
16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలనలో వారణాశిలో సరికొత్త సంస్కృతి మొదలైంది. ఆక్బర్ చక్రవర్తి ఆధ్వర్యంలో వారణాశిలో శివునికి, విష్ణుమూర్తికి రెండు పెద్ద ఆలయాలను నిర్మించబడ్డాయి. పూనా రాజు 200 మీటర్ల (660 అడుగులు) ఎత్తైన అన్నపూర్ణాదేవి మందిరం నిర్మించాడు. అలాగే పూనా రాజు పాలనలో శివా - విష్ణులకు అంకితమివ్వబడిన అక్బారి వంతెన కూడా నిర్మించబడింది.

16వ శతాబ్దం నుండి వారణాశికి యాత్రికుల రాక ప్రారంభమైంది. 1665లో ఫ్రెంచి యాత్రికుడైన " జీన్ బాప్టిస్ట్ ట్రావర్నియర్ " ఈ నగరాన్ని సందర్శించి వారణాశిలోని గంగాతీరంలో ఉన్న "బిందు మహాదేవాలయం" సౌందర్యాన్ని వర్ణించాడు. చక్రవర్తి షేర్ షాహ్ సూరి కాలంలో వారణాశి రహదారి పునరుద్దరినబడి కోల్‌కత నుండి పెషావర్ వరకు పొడిగించబడింది.

తరువాత బ్రిటిష్ పాలనా కాలంలో ఈ రహదారి ప్రఖ్యాతమైన " గ్రాండ్ ట్రంక్ రోడ్డుగా " అవతరించింది. 1656లో ఔరంగజేబు పలు ఆలయాలు ధ్వంసం చేయబడి మసీదులు నిర్మించబడ్డాయి. నగరం తిరిగి సంస్కృతి పరంగా వెనుకబడింది. అయినప్పటికీ ఔరంగజేబు మరణానంతరం భారాదేశంలో తిరిగి హిందూ రాజ్యాలు తలెత్తి వర్ధిల్లాయి. ప్రస్తుతం వారణాశిలో ఉన్న ఆలయాలు హిందూ రాజులైన రాజపుత్రులు, మరాఠా రాజులచేత నిర్మించబడ్డాయి.

ప్రస్తుతం వారణాసిలోని పలు నిర్మాణాలు 18వ శతాబ్దానికి చెంది ఉన్నాయి. బెనారస్ రాజు లేక కాశీ నరేష్ తో సహా ఈ రాజులు బ్రిటిష్ పాలనా సమయంలో (సా.శ. 1775-1945) కూడా కొనసాగారు. 1737లో మొగల్ చక్రవర్తుల ఆధ్వర్యంలో " బెనారస్ రాజ్యం (కింగ్డం అఫ్ బెనారస్) " పేరుతో సాధికారంగా ఏర్పాటు చేయబడి 1947 వరకు కొనసాగింది.

18వ శతాబ్దంలో మహమ్మద్ షాహ్ ఆధ్వర్యంలో గంగాతీరంలో ఉన్న మాన్ మందిరం ఘాట్ వద్ద ఒక " అబ్జర్వేటరీ " కేంద్రాన్ని నిర్మించబడింది. ఇది జ్యీతిషశాస్త్ర విషయాల పరిశీలనకు అనుకూలమైంది. 18వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి బ్రిటిష్ గవర్నర్లైన వారెన్ హేస్టింగ్, వారణాశిలో సంస్కృత కళాశాలను స్థాపించిన జూనాథాన్ డంకన్ కాలంలో వారణాశి పర్యాటకం మరింత వర్ధిల్లింది.

1867లో వరణాశిలో పురపాలక సంఘస్థాపన జరిగిన తరువాత వారణాశి నగరంలో మరింత అభివృద్ధి కొనసాగింది.

ప్రత్యేక సంఘటనలు
1897లో మార్క్ ట్వైన్, వారణాశి గురించి వర్ణిస్తూ " బెనారస్ చరిత్రకంటే పురాతనమైనది. సంప్రదాయాలకంటే పాతది, పురాణాలకంటే పురాతనమైనది అలాగే అన్నింటికంటే అత్యంత పురాతనమైనది. 1910లో బ్రిటిష్ ప్రభుత్వం వారణాశిని భారతీయ భూభాగంగా చేసి రామనగరాన్ని రాజధానిగా చేసి తన న్యాయపరిధి నుండి తొలగించింది. అయినప్పటికీ తరువాత కూడా గంగాతీరంలో వారణాశి భుభాగంలో ఉన్న రామనగర్ కోటలో కాశిరాజు నివసిస్తూ ఉన్నాడు. ప్రస్థుతం రామనగర్ కోటలో కాశిరాజులకు చెందిన వస్తుసంగ్రహాలతో మ్యూజియం నిర్వహించబడుతుంది. 18వ శతాబ్దం నుండి ఈ కోటలో కాశీరాజులు నివసిస్తూ వచ్చారని ప్రాంతీయ వాసులు వివరిస్తున్నారు. రాజు మతపరంగా అధ్యక్ష స్థానంలో ఉంటాడు అలాగే ప్రజలు రాజుని శివుని అవతారంగా భావిస్తారు. రాజు స్వయంగా అన్ని మతసంప్రదాయాల సంప్రదాయాలకు ఆధిపత్యం వహిస్తుంటాడు.

1857 లో వారణాశిలో బ్రిటిష్ సామ్రాజ్యానికి చెందిన భారతీయ సైనికులు స్వాతంత్ర సమరయోధుల మీద జరిగిపిన దమనకాండలో సామూహిక హత్యలు జరిగాయి. వారణాశిలో అనీబిసెంట్ దియోసాఫీ సిద్ధాంతం ప్రతిపాదించడమేగాక "సెంట్రల్ హిందూ కాలేజ్" స్థాపన కూడా చేసింది. తరువాత సెంట్రల్ హిందూ కాలేజ్ 1916 నుండి "బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం" గా మారింది. ఇది మతాతీతంగా విద్యాసేవలు అందిస్తుంది. అనీబిసెంట్ సెంట్రల్ హిందూ కాలేజ్ ని అన్ని మతాలకు చెందిన మనుషులు కేంద్రీకృతమై సహోదరత్వంతో కృషిచేసి భారతీయ సంస్కృతిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో స్థాపించింది.

అలాగే భారతీయ సమూహాలలో ఉన్న మూఢవిశ్వాసాలను తొలగించడం అనీబిసెంట్ లక్ష్యాలలో భాగమే. వారణాశి 1948 అక్టోబరు 15 న యూనియన్ ఆఫ్ ఇండియాకు ఇవ్వబడింది. 2000 లో విభూతి నారాయణన్ సింగ్ మరణం తరువాత ఆయన కుమారుడైన అనంత్ నారాయణ్ సింగ్ రాజయ్యాడు. రాజు కాశీరాజు సంప్రదాయాల ఆచరణ బాధ్యతను వహిస్తాడు.

భౌగోళికం
వారాణసి నగరం ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం తూర్పు భాగంలో గంగా మైదానంలో, గంగానది ఒడ్డున ఉంది. ఇక్కడ గంగానది వంపు తిరిగి ఉంది. ఇది వారాణసి జిల్లాకు కేంద్రం కూడాను. వారాణసి నగరం, దాని పరిసర ప్రాంతాలు కలిపి మొత్తం 112.26 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్నాయి. గంగానది వరదలతో ఈ ప్రాంతం నేల సారవంతంగా ఉంటుంది.

వారాణసి నగరం మాత్రం గంగ, వరుణ నదుల మధ్య ఉంది. ఈ నగరం సముద్ర మట్టం నుండి 80.71 మీటర్ల ఎత్తులో ఉంది. పెద్దగా ఉపనదులు, పిల్ల కాలువలు లేనందున ఇక్కడి భూమి అధికంగా పొడిగా ఉంటుంది.

వారాణసి నగరం రెండు సంగమ స్థానాల మధ్య ఉన్నట్లుగా చెప్పబడుతుంది. (1) గంగ, వరుణ నదుల సంగమం (2) గంగ, అస్సి నదుల సంగమం. అస్సి నది చాలా చిన్నది (కాలువ వంటిది) ఈ రెండు సంగమాల మధ్య దూరం సుమారు 2.5 కిలోమీటర్లు. ఈ రెండు సంగమ స్థానాల మధ్య (5 కిలోమీటర్ల) యాత్ర "పంచ క్రోశి యాత్ర" పవిత్రమైనదిగా భావిస్తారు. యాత్రానంతరం సాక్షి వినాయకుని మందిరాన్ని దర్శిస్తారు.

సంస్కృతి
గంగా నది ఒడ్డున ఉన్న వారణాసి ప్రతి సంవత్సరం వేలాది మంది హిందూ యాత్రికులను ఆకర్షిస్తుంది.

వారాణసి సమకాలీన జనజీవనం తక్కిన నగరాల వలెనే ఉంటుంది. అయితే వారాణసికి హిందూమతంలో ఉన్న ప్రాధాన్యత వలన ఇక్కడి గంగానది, స్నానఘట్టాలు, దేవాలయాలు, హిందూ మత సంస్థలు సంస్కృతీ చిహ్నాలుగా ప్రముఖంగా ప్రస్తావించబడుతాయి. ఇంతే కాకుండా పట్టు చీరల నేత, హిందూ-ముస్లిమ్ సహ జీవనం (మత కలహాలు కూడా), హిందూస్తానీ సంగీతం, ఘరానా, పెద్ద సంఖ్యలో వచ్చే పర్యాటకులు నగర జీవనంలో ప్రముఖంగా కానవచ్చే అంశాలు. గంగానది తీరాన, పాత నగరంలో ఇండ్లు, ఆలయాలు, దుకాణాలు ఇరుకు ఇరుకుగా ఉంటాయి. అధిక జనాభా నగరంలో ఇతర ప్రాంతాలలో నివసిస్తున్నారు.

గంగానది
గంగానదికి, వారాణసికి హిందూ మతంలో ఉన్న ప్రాముఖ్యత వలన ఈ రెండింటికి అవినాభావమైన సంబంధం ఉంది. ప్రధానమైన విశ్వేశ్వరాలయం, మరెన్నో ఆలయాలు గంగానది వడ్డున ఉన్నాయి. అనేక స్నాన ఘట్టాలు గంగానది వడ్డున ఉన్నాయి. గంగానదిలో స్నానం కాశీయాత్రలో అతి ముఖ్యమైన అంశం. ఈ మత పరమైన అంశాలే కాకుండా నీటి వనరుగా కూడా ఇది చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది.

వారణాసిలో స్నానఘట్టాలు
వారణాశిలో గంగా తీరమంతా స్నానఘట్టాలతో నిండి ఉంటుంది. స్నాఘట్టాలలో రాతిపలకతో నిర్మించబడిన మెట్లు ఉంటాయి. యాత్రీకులు స్నానం ఆచరించడానికి, సంప్రదాయక ఆచారాలను అనుష్ఠించడానికి అనువైన ఏర్పాట్లు చేయబడి ఉన్నాయి. వారాణసిలో సుమారు 84 ఘాట్‌లు ఉన్నాయి.

వీటిలో చాలా వరకు ఇక్కడ మరాఠా పరిపాలనా కాలంలో అభివృద్ధి చేయబడ్డాయి. ఈ స్నానఘట్టాలు మరాఠీలు, సింధీలు (సింధియాలు), హోల్కార్లు, భోంస్లేలు, పెషావర్లు నిర్మించబడ్డాయి. కొన్ని ఘాట్‌లు ప్రైవేటు ఆస్తులుగా ఉంటున్నాయి. ఉదాహరణకు "శివాలా ఘాట్", "కాళీ ఘాట్"లకు స్వంతదారు కాశీ మహారాజు.

ఎక్కువ ఘాట్‌లు స్నానానికి, దహనకాండలకు వాడుతారు. కొన్న ఘాట్‌లు పురాణ గాథలతో ముడివడి ఉన్నాయి. ఆధ్యాత్మిక, భౌతిక భావాలతో కూడిన పవిత్రభావాలకు ఈ స్నానఘట్టాలు ప్రతీకలుగా ప్రశంశించబడుతున్నాయి. ఈ స్నానఘట్టాలు పురాణ ఘట్టాలతో ముడివడి ఉన్నాయి. వీటిలో దశాశ్వమేధఘట్టం, పంచగంగ ఘట్టం, ధహనసంస్కారాలు జరిపించే మణికర్ణికా, హరిశ్చంద్రా ఘాట్లు ప్రత్యేకమైనవి.

ఉదయం బోటులో స్నానఘట్టాలను దర్శించడం యాత్రీకులను ఎక్కువగా ఆకర్షించే విషయాలలో ఒకటి. స్నానఘట్టాలలో అనేక ఆలయాలు కూడా ఉంటాయి.

తులసీ ఘాట్
తులసీ ఘాట్ వద్ద తులసీదాసు తులసీ రామాయణాన్ని రచించాడని విశ్వసిస్తున్నారు.

దశాశ్వమేధ ఘాట్
కాశీ విశ్వనాధ మందిరం ప్రక్కనే ఉన్న దశాశ్వమేధ ఘాట్ వారణాశిలో ఉన్న స్నాన ఘట్టాలలో అతి పురాతనమైనదిగా భావిస్తున్నారు. ఇది యాత్రికులతోను, పూజారులతోను, అమ్మకందారులతోను ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. వెనుక ప్రక్కనే అనేక మందిరాలు దర్శనమిస్తూ ఉండడంతో ఇది ఫొటోలు తీసికొనేవారికి చాలా ప్రియమైన స్థలం. బ్రహ్మ స్వయంగా ఇక్కడ పది అశ్వమేధ యాగాలు చేసి శివుడిని ఇక్కడ కొలువుండమని కోరాడని పురాణ గాథ.

ప్రతి రోజూ సాయంకాలం పూజారులు ఇక్కడ అగ్ని పూజ చేసి, శివుడిని, గంగమ్మను, సూర్యుడిని, అగ్నిని, విశ్వాన్ని కొలుస్తారు. ఇక్కడ శూలకంథేశ్వరుడు, బ్రహ్మేశ్వరుడు, వరాహేశ్వరుడు, అభయవినాయక ఆలయాలతో గంగా, బండిదేవి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి రోజు నిర్వహించే హారతి నదిలో నుండి చూడడానికి యాత్రీకులు ఇక్కడి ఇక్కడ ఉన్న పడవలను మాత్రమే ఎక్కాలి. వారు ఒకసారి ఘాట్లన్నింటిని చూపించి తిరిగి ఘాటు వద్దకు బోట్లను తీసుకువచ్చి నదిలో నిలిపి వేస్తారు. యాత్రీకులు అక్కడి నుండి హారతి చూడవచ్చు.

మణికర్ణికా ఘాట్
మణి కర్ణికా ఘట్టం ఎంతో పావనమైనదిగా హిందువులు భావిస్తారు. ఒక గాథ ప్రకారం శివుని సమక్షంలో విష్ణువు ఇక్కడ తన సుదర్శన చక్రంతో ఒక గోతిని తవ్వాడు. దానిని తన స్వేదంతో నింపుతుండగా విష్ణువు చెవి కుండలం (మణి కర్ణిక) అందులో పడింది.

మరొక కథ ప్రకారం పార్వతీదేవి తన చెవిపోగు (మణికర్ణిక)ను ఇక్కడ దాచిపెట్టి, దానిని వెతకమని శివుడిని కోరింది. దానికోసం వెతుకుతూ అక్కడే శివుడు ఉండిపోవడం వల్ల అతడు దేశద్రిమ్మరి కాడని పార్వతి ఆలోచన అట. ఇక్కడ దహనమైన శరీరం తాలూకు ఆత్మను శివుడు స్వయంగా మణికర్ణిక కనిపించిందేమోనని అడుగుతాడట.

పురాణ కథనాల ప్రకారం ఈ మణికర్ణికా ఘాట్ యజమానే హరిశ్చంద్రుడిని కొని, హరిశ్చంద్ర ఘాట్‌లో కాటిపనికి నియమించాడు. మణి కర్ణికా ఘాట్, హరిశ్చంద్రఘాట్‌లలో అధికంగా దహన సంస్కారాలు జరుగుతుంటాయి. మణికర్ణికాఘాటుకు మహాశ్మశానమని మరొక పేరుకూడా ఉంది. ఈ ఘాట్ గురించి మరొక కథనం కూడా ప్రచారంలో ఉంది.

ఈ తీర్థమును ఈశ్వరుడు చూడాలని అనుకుని పరమేష్టికై 1008 సంవత్సరములు తపస్సు చేసాడట. ఈశ్వరుడు ప్రత్యక్షమై, ఆ తీర్థం విశిష్టతను తెలుసుకుని చాల సంతోషించి తల ఊపాడట. అలా ఊపినప్పుడు కుడి చెవి మణి జారి సరస్సు మధ్యలో పడింది. కావున దాని పేరు మణికర్ణికా ఘట్టంగా పేరు.

ప్రస్తుత ఘాట్ 1032 లో నిర్మించబడింది. 4వ శతాబ్దంలో గుప్తుల కాలంలో ఈ ఘాట్ ప్రస్తావన ఉంది. ఈ ఘాట్ వద్ద ఉన్న తారకేశ్వరాలయంలో నుండి పరమశివుడు మరణిస్తున్న వారి చెవిలో తారకనామం ఉపదేశిస్తుంటాడని విశ్వసించబడుతుంది. ఇక్కడ మరణించిన వారికి మోక్షం ప్రసాదించమని పరమశివుడు విష్ణువును కోరిన ప్రదేశమిదే ఈ మణికర్ణిక ఘట్టములో మిట్ట మధ్యాహ్నం మణికర్ణిక స్తవం చదువుకుని, స్నానం చేసిన చాలా పుణ్యం వస్తుందని శంకర భగవత్పాదులవారు శివా నంద లహరిలో చెప్పారు అంతటి పుణ్యం కాశీలోని మణికర్ణిక ఘట్టంలో మధ్యాహ్న స్నానం చేసిన కలుగుతుందని, ఈ పుణ్య ఫలం కాశీలో ఒక యజ్ఞం చేసిన దాని కంటే కూడా ఎక్కువని చాగంటి తన శివ వైభవ ప్రసంగంలో చేప్పారు అని ప్రజల విశ్వాసం.

సింధియా ఘాట్
150 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఘాట్ బరువుకు ఇక్కడి శివాలయం కొంతవరకు నీట మునిగి ఉంటుంది. ఇది అగ్ని దేవుని జన్మ స్థలమని పురాణ కథనం. మగ సంతానం కావాలని కోరేవారు ఇక్కడ వీరేశ్వరుని అర్చిస్తారు. సింధియా ఘాట్‌కు ఉత్తరాన మణికర్ణికా ఘాట్ ఉంది. వెనుక ప్రక్క సిద్ధక్షేత్రంలో అనేక ముఖ్యమైన అలయాలున్నాయి.

మన మందిర్ ఘాట్
1770లో జైపూర్ రాజు మహారాజా జైసింగ్ ఈ మన మందిర్ ఘాట్‌ను, దాని వద్ద యాత్రా మందిరాన్ని నిర్మింపజేశాడు. యాత్రా మందిరం రాజస్థాన్-ఢిల్లీ శైలిలో చక్కని అలంకృత గవాక్షాలతో ఉంటుంది. ఇక్కడ భక్తులు సోమేశ్వరుని అర్చిస్తారు.

మానస-సరోవర్ ఘాట్‌
అంబర్ రాజు మాన్‌సింగ్ మానస-సరోవర్ ఘాట్‌ను నిర్మింపజేశారు.

దర్భంగా ఘాట్‌
దర్భంగా మహారాజు దర్భంగా ఘాట్‌ను నిర్మింపజేశారు.

లలితా ఘాట్
ఇది నేపాల్ రాజుచే నిర్మింపజేయబడింది. ఇక్కడ నేపాలీ శైలిలో చెక్కతో నిర్మించిన గంగా కేశవ మందిరం ఉంది. ఈ విష్ణ్వాలయంలో పాశుపతేశ్వరస్వామి విగ్రహం ఉంది.

అస్సీ ఘాట్
ఇది చాలా సుందరమైనది. అన్ని ఘాట్‌లకు చివర ఉంది. ఇది ఫొటోగ్రాఫర్లు, చిత్రకారులు, వాద్య బృందకారులతో కోలాహలంగా ఉంటుంది.

బచరాజ్ ఘాట్‌
జైన భక్తులు బచరాజ్ ఘాట్‌ను సందర్శిస్తారు. అక్కడ నది వడ్డున మూడు జైనాలయాలున్నాయి. తులసీ ఘాట్ వద్ద గోస్వామి తులసీ దాస్ రామచరిత మానస్ కావ్యాన్ని రచించాడు.

ఆలయాలు:
వారణాసి ఆలయాలకు నెలవు. చరిత్రలో వివిధ కాలాల్లో నిర్మించబడ్డ పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఇంకా ప్రతీ వీధిలోనూ ఒక ఆలయాన్ని దర్శించవచ్చు. చిన్న ఆలయాల్లో కూడా దైనందిన ప్రార్థనలు, కార్యక్రమాలు జరుగుతుంటాయి. వారణాశిలో అనేక (దాదాపు 23,000) ఆలయాలు ఉన్నాయి. అయినప్పటికీ అత్యధికంగా ఆరాధించబడే ఆలయం విశ్వనాధ మంధిరం, హనుమాన్ మందిరం, దుర్గా మందిరం (ఈ మందిర సమీపంలో నివసిస్తున్న అనేక ఉన్న కోతుల కారణంగా ఈ మందిరం కోతుల ఆలయంగా కూడా పిలువబడుతుంది).

విశ్వనాధ మందిరం
కాశీ విశ్వనాధ మందిరం వారాణసిలో ప్రధాన ఆలయంగా చెప్పుకోవచ్చును. దీని గోపురంపైన పూసిన బంగారు పూత కారణంగా దీనిని "బంగారు మందిరం" అని కూడా అంటుంటారు. ప్రస్తుతం ఉన్న మందిరాన్ని 1780లో ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ కట్టించింది. ఇందులో లింగాకారంగా కొలువై ఉన్న దేవుడు "విశ్వేశ్వరుడు", "విశ్వనాధుడు" పేర్లతో పూజలందుకొంటుంటాడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఈ విశ్వేశ్వర లింగం దర్శనం తక్కిన లింగాల దర్శనం కంటే అధిక ఫలప్రథమని భక్తుల విశ్వాసం.

ఈ ఆలయం పలుమార్లు విద్వంశం చేయబడి తిరిగి నిర్మించబడింది. ఆలయసమీపంలో ఉన్న "గ్యాంవాపీ" మసీదు ప్రాంతమే అసలైన ఆలయం ఉన్న ప్రదేశం. 1785లో అప్పటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ సూచనల మేరకు కలెక్టర్ మొహమ్మద్ ఇబ్రాహీమ్ ఖాన్ ఈ ఆలయం ముందు భాగంలో ఒక "నౌబత్ ఖానా" కట్టించాడు.

1839లో పంజాబ్ కేసరిగా పేరొందిన మహారాజా రంజిత్ సింగ్ ఈ ఆలయం రెండు గోపురాలకు బంగారపు పూత పూయించడానికి సరిపడా బంగారం సమర్పించాడు. 1983 జనవరి 28న ఈ మందిరం నిర్వహణా బాధ్యతలను ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం హస్తగతం చేసుకొని అప్పటి కాశీ రాజు డా. విభూతి నారాయణ సింగ్ అధ్వర్యంలోని ఒక ట్రస్టుకు అప్పగించింది.

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు కాలంలో అప్పటి మందరిరం విధ్వంసం చేయబడింది. తరువాత సమీపంలో మరొక మందిరం కట్టబడింది. ఈ విషయం హిందూ-ముస్లిమ్ వర్గాల మధ్య ఘర్షణలకు దారితీసే విభేదాలలో ఒకటి.

అన్నపూర్ణామందిరం
కాశీ విశ్వనాథాలయానికి సమీపంలో అన్నపూర్ణాదేవి ఉంది. విశ్వనాథుని దర్శించుకున్న తరువాత భక్తులు అన్నపూర్ణాదేవిని దర్శించడం ఆచారం.ఈ దేవాలయం లోపలనే ఉచిత అన్నదానం,దేవాలయం వారిచే నిర్వహించ బడుచున్నది.

విశాలాక్షిమందిరం
కాశీ విశ్వనాధ ఆలయానికి సమీపంలో విశాలాక్షి అమ్మవారి మంధిరం ఉంది. విశ్వనాధుని దర్శించుకున్న తరువాత భక్తులు విశాలాక్షిదేవిని దర్శించడం ఆచారం. ఈ దేవాలయ పూజలు రెండు వేళల నాట్టు కోట్టై నగర సత్తరం వారిచే నిర్వహించబడుచున్నది.

శాంక్తా మందిరం
సింధియా ఘాట్ వద్ద శాంక్త మందిరం ఉంది. శాంక్తామందిరంలో పెద్ద సింహంశిల ఉంది. అలాగే ఈ ఆలయంలో నవగ్రహాల మందిరం కూడా వున్నది.

దుర్గా మందిరం
వారణాశిలో రెండు దుర్గామందిరాలు ఉన్నాయి. 500 సంవత్సరాలకు ముందు నిర్మించిన దుర్గామందిరం ఒకటి. రెండవది "కోతుల గుడి"గా కూడా ప్రసిద్ధమైన దుర్గా మందిరం 18వ శతాబ్దంలో ఒక బెంగాలీ రాణిచే నిర్మింపబడింది. ఇక్కడ చాలా కోతులు ఉండడంవల్ల కోతుల గుడి అని కూడా అంటుంటారు. ఇక్కడ అమ్మవారు స్వయంభూమూర్తి అని భక్తుల నమ్మకం. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఆలయం గోపురం ఉత్తర భారత " నాగర"శైలిలో నిర్మింపబడింది. గుడి దగ్గరున్న కోనేరును "దుర్గా కుండ్" అంటారు. ఈ కోనేరు ఇదివరకు నదితో సొరంగమార్గం ద్వారా కలపబడి ఉండేది కాని ఆ సొరంగాన్ని తరువాత మూసివేశారు. నాగపంచమి నాడు ఇక్కడ విష్ణువు శేషశాయిగా ఉండే దృశ్యాన్ని ప్రదర్శిస్తారు.

సంకట మోచన్ హనుమాన్ మందిరం
కాశీలో ఉన్న పవిత్రాలయాలలో సంకట్ మోచన్ హనుమాన్ మందిరం ఒకటి. ఈ మందిరం "బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం" ఆవరణలో ఉన్న దుర్గా, కొత్త విశ్వనాథ్ మందిరాలకు పోయే మార్గంలో అసినదీ తీరంలో ఉంది. ప్రస్తుత ఆలయం 1900 లో విద్యావేత్త, స్వాతంత్య్ర సమరవేత్త, "బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం" వ్యవస్థాపకుడూ అయిన మదనమోహన్ మాలవ్యా చేత నిర్మించబడింది.

మద్యయుగానికి చెందిన, రామాయణ (తులసి రామాయణం) సృష్టికర్త అయిన తులసీదాసుకు హనుమంతుడు ప్రత్యక్షమైన ప్రదేశంలో నిర్మించబడినట్లు విశ్వసిస్తున్నారు. ఈ ఆలయంలో హనుమంతునికి ప్రధానమైన మంగళ, శనివారాలలో హనుమతునికి విశేష పూజలు నిర్వహించబడతాయి కనుక ఈ రెండు దినాలలో ఆలయానికి వేలాది భక్తులు వస్తుంటారు. కష్టాలనుండి భక్తులను కడతేర్చే దేవునిగా ఇక్కడ కొలువైయున్న హనుమంతుని భక్తులు ఎంతో భక్తితో ఆరాధిస్తారు. ఇక్కడ అనేక ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుంటాయి.

2006 మార్చి 7 న ఈ మందిరంలో ఉగ్రవాదులు హనుమంతునికి హారతి ఇస్తున్న సమయంలో బాంబులు పేల్చారు. అప్పుడు ఆలయంలో వివాహబృందం పూజలు నిర్వహిస్తున్న కారణంగా అధికసంఖ్యలో భక్తులు గాయాలపాలయ్యారు. అయినప్పటికీ మరునాడు ఆలయంలో పూజాదికాలు నిర్వహిచి హనుమాన్ చాలిసా, సుందరా కాండ పారాయణం నిర్వహించి తులసీదాసు విరచిత హనుమాన్ చాలిసా, సుందర కాండ పుస్తకాలు ఉచితంగా అందించబడ్డాయి. తీవ్రవాదుల దాడి తరువాత ఆలయంలో పోలీస్ రక్షణ ఏర్పాటు చేయబడింది. ఈ ఆలయ ప్రాంగణంలో హనుమంతుని ఆరాధ్యదైవాలైన సీతారాముల ఆలయం ఉంది.

తులసీ మానస మందిరం
ఇది పాలరాతితో కట్టబడిన ఆధునిక మందిరం. ఆలయం గోడలపైన తులసీదాసు రామచరిత మానస్ కావ్యం వ్రాయబడింది. రామాయణం పెక్కు చిత్రాల ద్వారా కూడా చూపబడింది. పాలరాతితో నిర్మించబడిన ఈ ఆలయం కుడ్యాల మీద తులసీ రామాయణం లిఖింపబడి ఉంది. ఈ ఆలయ దృశ్యాలు శిల్పాలరూపంలో ప్రదర్శించబడుతున్నాయి. అలాగే రామాయణ కావ్యసంబంధిత తామ్రఫలకాలు కొన్ని కూడా ఇక్కడ భద్రపరచబడి ఉన్నాయి.

భారతమాత ఆలయం
భారతదేశం జాతీయ మానవీకరణ అంకితం భారత మాతా ఆలయం, 1936 లో మహాత్మా గాంధీ చేత ప్రారంభించబడింది. ఇక్కడ పాలరాతితో చెక్కిన భారతదేశం చిత్రపటం ఉంది. బాబు శివ ప్రసాద్ గుప్తా, దుర్గా ప్రసాద్ ఖత్రీ, ప్రముఖ, పురాతన వస్తువులను అధ్యయన శాఖ, జాతీయ నేతలు, దాని నిర్మాణం కోసం విరాళంగా నిధులను అందించారు.

బిర్లా మందిరం
కాశీ హిందూ విశ్వవిద్యాలయంలో కట్టిన ఆధునిక మందిరం ఇది. బిర్లా కుటుంబంచే ఈ విశ్వనాధ మందిరం పురాతన మందిరం శైలిలోనే నిర్మించబడింది. ఈ ఆలయం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయ ఆవరణలో బిర్లాకుంటునబం చేత నిర్మ్ంచబడింది. ఈ ఆలయానికి ప్రణాళిక వేసింది పండిట్ మదన్ మోహన్ మాలవ్యా అన్నది మరొక ప్రత్యేకత.

కాలభైరవ మందిరం
కాలభైరవుడు కాశీక్షేత్రానికి క్షేత్రపాలకుడు. విశ్వేశ్వర దర్శనం చేసుకోవడానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని ఆయన అనుమతి తీసుకుని విశ్వేశ్వర దర్శనం చేసుకోవాలని పురాణకథనం వివరిస్తుంది. కనుక భక్తులు విశ్వేశ్వర దర్శనానికి ముందుగా కాలభైరవుని దర్శించుకుని విశ్వనాథ దర్శనానికి అనుమతి ఇవ్వమని ప్రార్ధిస్తారు. ఈ ఆలయం విశ్వేశ్వర్ గంజ్ ప్రధాన తపాలాఫీసు సమీపంలో ఉంది. ఈ అలయం నుండి దారానగర్ పోయే మార్గంలో మృత్యుంజయ (శివుడు) మందిరం ఉంది. ఆలయసమీపంలో ఉన్న బావికి ఒక ప్రత్యేకత ఉంది. బావిలోకి పలు అంతర్గత ప్రవాహాలనుండి నీరు ఊరుతుందని ఈ జలాలకు రోగవిముక్తి చేసే శక్తి ఉందని విశ్వసిస్తున్నారు.

కవళీ మాత
కవళిమాత ఒకప్పుడు కాశిలో నివసిస్తూ ఉండేది. ఆమె జీవనోపాధి కొరకు గవ్వలను అమ్ముతూ ఉండేది. ఆమె సదా విశ్వేశ్వరుని భక్తిశ్రద్ధాసక్తులతో ఆరాధించేది. శివారాధనకు ముందుగా గంగానదిలో స్నానం ఆచరించేది. గంగాస్నానం తరువాత విశ్వేశ్వర దర్శనం అయిన తరువాత ఆమె ఆహారాన్ని స్వీకరించేది. ఒకనాడు ఆమె స్నానంచేసి గట్టుకు రాగానే ఒక హరిజనుడు ఆమెను స్పృజించాడు. హరిజన స్పర్శ కారణంగా ఆమె తిరిగి గంగలో స్నానానికి వెళ్ళింది. అలా ఆమె స్నానం చెయ్యడం తిరిగి హరిజనుడు స్పృజించడం తిరిగి గంగాస్నానానికి పోవడం చేస్తుండగా రాత్రి అయింది. ఆమె ఆరోజంతా భోజనం చేయలేదు. కాశీ అన్నపూర్ణా మాత క్షేత్రం కనుక ఆక్షేత్ర సరిహద్దులలో ఎవరూ భోజనం చేయకుండా ఉండకూడదు కనుక అన్నపూర్ణాదేవి స్వయంగా కవళీకి ప్రత్యక్షమై తనక్షేత్రంలో ఎవరూ పస్తులు ఉండదు కనుక భోజనం చెయ్యమని చెప్పింది. కవళీ మాత్రం విశ్వేశ్వర దర్శనం చేయకుండా భోజనం చెయ్యనని చెప్పింది. అన్నపూర్ణా మాత కోపించి ఆమెను కాశీ సరిహద్దులు దాటి వెళ్ళమని ఆదేశించింది. కవళీ కాశీ సరిహద్దులు దాటి వెళ్ళిన ఆమె విశ్వేశ్వర దర్శనం చెయ్యలేక పోయినందుకు చింతిస్తూ శివుని గురించి తపసు చేసింది. ఆమెకు శివిడు ప్రత్యక్షం కాగానే ఆమె " ఈశ్వరా! నాభక్తిలో లోపమేమిటి. నన్నిలా కాశీనుండి పంపిన తరువాత నేనిక నీదర్శనం ఎలాచేయగలను." అని ఆవేదనపడింది. ఈశ్వరుడు "కవళీ! నీ భక్తి తిరుగులేనిది అయినప్పటికీ హరిజనుడు స్పృజించాడని తిరిగి స్నానం చేయడం అపరాధమే. నాకు హరిజనులు, పురజనులే కాదు. సకల ప్రాణులూ ఒకటే. ఎవరైనా నన్ను స్పృజించి నమస్కరించడానికి అర్హులే. నీవు హరిజన స్పర్శ అపవిత్రమని భావించి చేసిన అపరాధానికే ఈ దండన లభించింది. అయినప్పటికీ నీభక్తికి, తపసుకు మెచ్చి నీకు ఒక వరం ఇస్తాను. ఇక మీదట నా భక్తులు నన్ను సందర్శించిన ఫలితం నీకు ఇస్తాను. భక్తులు నీకు కానుకలు సమర్పించి వారి దర్శన ఫలితాలను తిరిగి పొందగలరు" అని చెప్పి అదృశ్యం అయ్యాడు. అప్పటి నుండి కవళీ "కవళీ మాత" అయింది. కనుక భక్తులు కాశీ విశ్వేరదర్శనం చేసుకున్న ఫలితం కవళీ మాతకు దక్కుతుంది. అందుకు పరిహారంగా భక్తులు కవళీమాత దర్శనం చేసుకుని ఆమెతో "ఈ గవ్వలు నీకు సమర్పిస్తున్నాము. కాశీ ఫలితం నాకు ఇవ్వు" అని ప్రార్థించిన భక్తులకు కాశీ పోయిన ఫలితం దక్కుతుందని విశ్వశించబడుతుంది. కనుక కాశీవిశ్వేశ్వర దర్శనం చేసుకున్న భక్తులు కవళీమాతను కూడా దర్శించుకుంటారు.

ముఖ్య శివ లింగాలు
వారాణసిలో ఉన్న కొన్ని ముఖ్యమైన శివ లింగాల స్థలాలు

విశ్వేశ్వరుడు - గంగానది ఒడ్డున దశాశ్వమేధ ఘాట్ వద్ద
మంగళేశ్వరుడు - శంక్తా ఘాట్
ఆత్మ విశ్వేశ్వరుడు - శంక్తా ఘాట్
కుక్కుటేశ్వరుడు - దుర్గా కుండ్
త్రి పరమేశ్వరుడు - దుర్గా కుండ్
కాల మాధవుడు - కథ్ కీ హవేలీ
ప్రయాగేశ్వరుడు - దశాశ్వమేధ ఘాట్
అంగారకేశ్వరుడు - గణేష్ ఘాట్
ఆంగనేశ్వరుడు - గణేష్ ఘాట్
ఉపస్థానేశ్వరుడు - గణేష్ ఘాట్
పరమేశ్వరుడు - శంక్తా ఘాట్
హరిశ్చంద్రేశ్వరుడు - శంక్తా జీ
వశిష్టేశ్వరుడు - శంక్తా జీ
కేదారేశ్వరుడు - కేదార్ ఘాట్
నీల కంఠేశ్వరుడు - నీల కంఠా
ఓంకారేశ్వరుడు - చిట్టన్ పురా
కాశేశ్వరుడు - త్రిలోచన్
శ్రీ మహా మృత్యుంజయుడు - మైదాగిన్
శుక్రేశ్వరుడు - కాళికా గలీ

ఉత్సవాలు
మహాశివరాత్రి పర్వదినంలో శివరాత్రి ఊరేగింపు మృత్యుంజయ ఆలయం నుండి విశ్వనాథ ఆలయం వరకు కొనసాగుతుంది.

తులసీ ఘాట్ వద్ద ద్రుపదునికి అంకితం ఇవ్వబడిన ఉత్సవాలు ఐదు దినాలపాటు నిర్వహించబడుతుంది. ఇది ఫిబ్రవరి- మార్చి మాసాల మద్య నిర్వహించబడతాయి.

సంకట్ మోచన్ హనుమాన్ ఆలయంలో హనుమాన్ జయంతి (మార్చి-ఏప్రిల్) హనుమంతునికి ప్రత్యేక పూజలు, హారతి, ఊరేగింపు నిర్వహించబడతాయి. 1923 నుండి హనుమాన్ సంగీత సమారోహ్ పేరిట ఐదు దినాలపాటు సాస్కృతిక సంగీతం, నృత్య ప్రదర్శనలు నిర్వహించబడుతున్నాయి. ఈ ప్రదర్శనకు దేశం అంతటి నుండి ప్రముఖ కళాకారులు ప్రదర్శనలివ్వడానికి ఆహ్వానించబడుతుంటారు.

రామనగర్ రామలీలా వద్ద రామచరితమానసలో వర్ణించినట్లు రామాయణం ప్రదర్శించబడుతుంది. రామనగర్‌లో 31 దినాలు ప్రదర్శించే ఈ ప్రదర్శనకు కాశినరేష్ చేత నిధిసహాయం అందుతూ ఉంది. ఈ ఉత్సవాలకు రావణసంహారంతో ముగింపు పలుకుతారు. కాశీనరేష్ చేత 1830లో ఆరంభించబడిన ఈ ఉత్సవాలను ఇప్పటికీ విజయవంతంగా నిర్వహిస్తున్నారు.

భారత్ మిలాప్ పేరిట 14 సంవత్సరాల వనవాసం తరువాత రామ భరతుల సమావేశం ఉత్సవం ఘనంగా నిర్వహించబడుతుంటాయి. ఈ ఉత్సవాలను విజయదశమి మరునాడు నిర్వహించబడుతుంటాయి. కాశీరాజు తనపరివారంతో రాజరీక అలంకారలతో ఈ ఉత్సవాలలో పాల్గొంటాడు. ఈ ఉత్సవాలు అధిక సంఖ్యలో ప్రజలను ఆకర్షిస్తున్నాయి.

కార్తికమాస కృష్ణచవితి నాడు కాళీయుని మీద కృష్ణుని విజయానికి సంకేతంగా కాళీయమర్ధన దృశ్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమం కొరకు గంగాతీరంలో కదంబ వృక్ష శాఖను నాటి దాని సమీపంలో నిర్వహిస్తారు. ఈ ప్రదర్శనలో పాల్గొనే బాలలు కాళీయుని శిరసులపై నృత్యం చేసి వేణుగానం వినిపిస్తుంటాడు. ఈ దృశ్యాన్ని ప్రజలు గంగాతీరం, పడవలలో ఉండి చూస్తుంటారు.

గంగామహోత్సవాల పేరిట ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం పర్యాటక శాఖ చేత నిర్వహించబడుతుంది. ఈ ఉత్సవాలను కార్తిక పూర్ణిమనాడు నిర్వహించబడుతుంటాయి. పంటల కొరకు గంగాదేవికి కృతఙత తెలుపుతూ ఈ ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి.

గంగా హారతి. గంగామాతకు నదీతీరక్షేత్రాలలో నిర్వహించే ఈ హారతి పవిత్ర కాశీలో కూడా ఘనంగా ప్రతిరోజూ నిర్వహిస్తుంటారు. ఈ హారతి దృశ్యాలను పతిరోజూ వేలాది మంది తిలకిస్తుంటారు. వీరిలో విదేశీయులు అధికంగా ఉండడం ఒక ప్రత్యేకత. ఈ హారతులను దశాశ్వమేధ్ ఘాటులో నిర్వహిస్తారు కనుక యాత్రీకులు దశాశ్వమేధ ఘాటుకు చేరుకోవడం అవసరం.
ఈ హారతి దృశ్యాన్ని గంగాతీరంలో, పడవలలో కూర్చుని వేలాదిమంది యాత్రికులు తిలకిస్తుంటారు.

విశేషాలుప్రాముఖ్యత: ఈ క్షేత్రాన్ని ముక్తిధామం అని పిలుస్తారు. ఇక్కడ మరణించిన వారికి శివుడు తారక మంత్రం ఉపదేశిస్తాడని నమ్ముతారు.

దర్శనం: ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం వలన సకల పాపాలు హరిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో ప్రతి రోజు వేలాది మంది భక్తులు శివ దర్శనం కోసం విచ్చేస్తారు. కాశీ విశ్వనాథ దర్శనం చేసుకోవడం వల్ల పాప విమోచనం, ఆత్మశుద్ధి, మరియు మోక్ష ప్రాప్తి కలుగుతాయని పూరాణిక విశ్వాసం.

ఇది శైవ సంప్రదాయానికి కేంద్ర బిందువుగా నిలిచిన అత్యంత పవిత్రమైన క్షేత్రం.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Guru Purnima - Vyasa Purnima - గురు పూర్ణిమ - వ్యాస పూర్ణిమ

గురు పూర్ణిమ - వ్యాస పూర్ణిమ

ఆషాడ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పూర్ణిమ లేదా వ్యాస పూర్ణిమ అంటారు. ఈ రోజున శిష్యులు తమ గురువులను పూజిస్తారు. నాలుగు వేదాల జ్ఞానాన్ని అందించి మహాభారతం, అష్టాదశ పురాణాలు రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు ఇదే. అందుకే దీనిని వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు.

ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకొంటారు. తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి, ముక్తి వైపు నడిపించివందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు. గురువుల పట్ల ఇదే గౌరవం అన్నివేళలా పాటిస్తున్నప్పటికీ ఈ రోజు వ్యాస మహా ముని పుట్టిన రోజు కాబట్టి ఈ రోజుకంత ప్రాధాన్యత ఉంది.

గురువు విశిష్టత
గురువు అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధించేవాడు. చాలామంది హిందువులు తమ గురువులతో జీవితాంతం అనుబంధం ఏర్పరుచుకుని ఉంటారు. ఇది కుటుంబ సంబంధం కూడా కావచ్చు. తర తరాలకూ కొనసాగవచ్చు.

వేద వ్యాసుడు
హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధాన కర్తగా భావిస్తుంటారు. వేదవ్యాసుని మానవజాతి కంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తరువాత ఆయన్ను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు.

వేదాలను నాలుగు భాగాలుగా విభజించి హైందవ సాంప్రదాయంలో కృష్ణద్వైపాయుడుగా పిలువబడే వారు వ్యాసులవారు (12569 BCE). వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతంతో పాటు అష్టాదశపురాణాలు రచించాడు వ్యాసుడు. వ్యాసుడు సప్తచిరంజీవులలో ఒకడు.

వేదవ్యాసుడు జన్మ వృత్తాంతం అష్టాదశ పురాణాలలో పెక్కు మార్లు చెప్పబడింది. ఈ దిగువ నున్న వృత్తాంతం మహాభారతము ఆది పర్వం తృతీయాశ్వాసము నండి గ్రహించబడింది.

పూర్వకాలములో చేది రాజ్యాన్ని వసువు అనే మహారాజు పరిపాలన చేస్తుండేవాడు. ఒకరోజు వేటకు అడవికి వెళ్ళిన రాజు ఆ అడవిలో మునులు తపస్సు చేయడము చూసి తాను తపస్సు చేయడం ఆరంభించాడు. అప్పుడు ఇంద్రుడు అది గ్రహించి "నీ వర్ణాశ్రమధర్మ పరిపాలనకు, తపస్సుకు మెచ్చుకొంటున్నాను. నీవు నాతో స్నేహం చేసి నా వద్దకు వస్తూ పోతూ రాజ్యపాలనం చేస్తూ ఉండు" అని పలికి అతనికి దివ్యత్వాన్నీ, మణి సువర్ణమయమైన దివ్యవిమానాన్నీ, ఎటువంటి ఆయుధాలు తాకలేని వాడిపోని పద్మాలు కల ఇంద్రమాల అనే పద్మమాలను దుష్టశిక్షణకు, శిష్టరక్షణకు సమర్ధమైన వేణుయష్టినీ ఇచ్చాడు. ఆ వసురాజు విమానాన్ని ఎక్కి పైలోకంలో సంచరిస్తూ ఉండడం వలన అతనికి ఉపరిచరుడు అనే పేరు వచ్చింది.

వసువు నివసిస్తున్న నగరానికి ప్రక్కగా "శుక్తిమతి" అనే నది ఉంది. శుక్తిమతి అనే నది ప్రక్కన ఉన్న "కోలహలుడు" అనే పర్వతము "శుక్తిమతి" మీద మోజుపడి ఆ నదిని అడ్డగించగా, ఉపరిచరుడు ఆ పర్వతాన్ని తన కాలితో తొలగించాడు. శుక్తిమతికి, కోలహలుడికి మధ్య జరిగిన సంపర్కము వలన గిరిక అనే కుమార్తె "వసుపదుడు" అనే కుమారుడు జన్మిస్తారు. శుక్తిమతి వారివురిని వసువుకి కానుకగా ఇస్తుంది. వసువు గిరికని వివాహం చేసుకొంటాడు. వసువు వసుపదుడుని సైన్యాధిపతిగా చేస్తాడు.

ఒకరోజు వసువు వేటకు వెళ్తాడు అప్పుడు తన భార్య గిరిక గుర్తు రావడంతో రేతస్సు పడుతుంది. ఆ పడిన రేతస్సుని ఒక దొన్నెలో చేర్చి, ఆ దొన్నెని డేగకి ఇచ్చి తన భార్యకి ఇవ్వమంటాడు. ఆ డేగ ఆ దొన్నెను తీసుకొని పోవుతుండగా మరో డేగ చూసి అది ఏదో తినే పదార్థం అని ఆలోచించి, ఆ డేగతో పోట్లాడూతుంది అప్పుడు ఆ రేతస్సు యమునా నదిలో పడుతుంది.

పూర్వం బ్రహ్మ శాపం వలన "అద్రిక" అనే అప్సరస యమునా నదిలో చేపగా మారి తిరుగాడుతున్నది. ఆ యమునా నదిలో ఉన్న ఒక చేప ఆ రేతస్సుని భక్షిస్తుంది ఆ భక్షించడం వల్ల అది అండంతో కూడి పిండంగా మారుతుంది. పదినెలల తరువాత ఒకరోజు బెస్తవారు చేపలు పట్టు తుండగా ఈ చేప చిక్కుతుంది. దాని కడుపును చీల్చి అందులో ఒక కొడుకును ఒక కూతురును కనుగొని వారిని భద్రంగా తెచ్చి వెంటనే దాశరాజు నకు ఇస్తారు. అద్రిక అనే పేరుకల ఆ చేపరూపంలో ఉన్న అప్సర; మనుష్యులను కంటే తనకు శాపవిమోచనం తీరిపోతుందని బ్రహ్మ చెప్పిన విధంగా మత్స్య గర్భాన్ని వీడి దివ్యవనితగా మారి దేవలోకానికి వెళ్ళిపోతుంది.

ఆ మగ బిడ్డ పెద్దవాడై ఆ రాజ్యానికి రాజయ్యాడు. ఆ బాలిక మత్స్యగంధి పేరుతో పెద్దదయ్యింది. మత్స్యగంధి తండ్రి లేనప్పుడు యమునా నది పై నావ నడుపుతుండేది.

ఇలా జరుగుతుండగా ఒక రోజు వశిష్ట మహర్షి మనమడు, శక్తి మహర్షి కుమారుడైన పరాశరుడు ఆ నది దాటడానికి అక్కడకు వస్తాడు.

అక్కడ కనిపించిన మత్స్యగంధిని చూసి మోహించే రతి సుఖాన్ని ఇవ్వమంటాడు, అప్పుడు మత్స్యగంధి తన శరీరం అంతా చేపల వాసనతో ఉంటుందని, కన్యత్వం చెడిన తాను తన తండ్రికి ఏవిధంగా మొగము చూపగలని ప్రశ్నిస్తుంది.

అప్పుడు పరాశరుడు మత్స్యగంధి వసువు వీర్యానికి అద్రిక నే అప్సరసకి జన్మించినదని జన్మ వృత్తాంతం చెబుతాడు. చేపల వాసన పోయేటట్లుగా ఒక యోజన దూరము వరకు సుగంధం వెదజల్లేటట్లు వరాన్ని ఇస్తాడు. అప్పటి నుండి యోజన గంధిగా పేరు పొందింది. అప్పటి రతి జరపడానికి సంకోచిస్తున్న మత్స్యగంధితో పరాశరుడు ఆమె కన్యత్వం చెడకుండా ఉండే వరాన్ని ఇస్తాడు. పగటి పూట రతి సలపడం అనే విషయం వ్యక్తపరిస్తే, అక్కడా ఉన్న ప్రదేశాన్ని మేఘాలతో కప్పేస్తాడు. ఆ విధంగా రతి జరపగా ఒక తేజోవంతుడైన వ్యాసుడు జన్మిస్తాడు. ఆ శిశువు పుట్టిన వెంటనే క్షణమాత్రమున పెద్దవాడై తల్లికి తండ్రికి నమస్కరించి తపస్సుకి వెళ్ళి పోతాడు. తల్లికి ఎప్పుడైన మననం చేసుకొంటే ప్రత్యక్షమయ్యే వరాన్ని ఇస్తాడు.

ఆ తరువాత సత్యవతీ శంతనుల వివాహం జరిగింది.

సత్యవతీ శంతనుల వివాహకాలంలో దాశరాజు విధించిన షరతుల కారణంగా భీష్ముడు ఆమరణాంతం బ్రహ్మచర్య వ్రతం అవలంబిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేశాడు. శంతనుని మరణం తరువాత వారి కుమారులైన చిత్రాంగదుడు బలగర్వంతో గంధర్వుని చేతిలో మరణం చెందాడు. విచిత్రవీరుడు సుఖలాలసతో అకాలమరణం చెందాడు.

భరతవంశం వారసులను కోల్పోయిన తరుణంలో సత్యవతి భరతవంశ పునరుద్ధరణ కొరకు తన పుత్రుడైన వ్యాసుని మనన మంత్రం చేత తన వద్దకు రప్పించింది. భరతవంశాన్ని నిలపమని వ్యాసునికి ఆదేశించింది. తల్లి ఆదేశాన్ననుసరించి వ్యాసుడు అంబికకు దృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజుని, దాసికు విదురుని ప్రసాదించి తిరిగి తపోవనానికి వెళతాడు.

ఆ తరువాత వ్యాసుడు గాంధారి గర్భస్రావం సమయంలో వచ్చి గాంధారి మృత పిండం నూట ఒక్క నేతికుండలలో పెట్టి వాటిని పరిరక్షించే విధానాన్ని చెప్పి తిరిగి తనదారిన తాను వెళతాడు.

దుర్యోధనుడు భీమునిపై మూడుమార్లు హత్యాప్రయత్నం జరిపిన పిమ్మట తన తల్లికి కురువంశంలో రానున్న పెను దుష్పరిణామాలు సూచించి వాటిని ఆమె తట్టుకోవడం కష్టమని తపోవనానికి వెళ్ళి ప్రశాంత జీవితం గడపమని సూచించి తిరిగి తనదారిన తాను వెళతాడు.

తరువాత లక్క ఇంటి దహనం తరువాత హిడింబాసురుని మరణానంతరం హిడింబి భవిష్య సూచనపై శాలిహోత్రుడు నివసించిన ఆశ్రమప్రాంతంలో పాండవులు నివసించే సమయంలో వ్యాసుడు పాండవుల చెంతకు వచ్చి వారికి ఊరట కలిగించాడు.

ఆ ఆశ్రమ మహత్యం చెప్పి అక్కడ సరస్సులో జలము త్రాగిన వారికి ఆకలి దప్పులు ఉండవని, అక్కడి వృక్షముకింద నివసించే వారికి శైత్య, వాత, వర్ష, ఆతప భయములుండవని సలహా అందించాడు. భీముని వివాహమాడ కోరిన హిడింబను కోడలిగా చేసుకోవడానికి సంశయిస్తున్న కుంతీదేవికి హిడింబ పతివ్రత అని ఆమెను కోడలిగా చేసుకోవడం శుభప్రధమని ఆమె సంతానం ద్వారా పాండవులకు సహాయమందగలదని సూచించి తనదారిని తాను వెళతాడు.

ఆ తరువాతి కాలంలో ద్రౌపది స్వయంవరానికి ముందుగా పాండవులకు దర్శనమిచ్చి వారికి ద్రౌపది పూర్వజన్మ వృత్తాంతం వివరించి స్వయంవరానికి వెళ్ళమని వారికి శుభంకలుగుతందని చెప్పి ద్రౌపది వివాహం తీరు ముందుగానే సూచించి అంతర్ధాన మయ్యాడు.

ఇలా మహాభారతాన్ని రచించిన వ్యాసుడు భారతకథలో ఒకభాగమై ఉన్నాడు. అయినప్పటికీ వ్యాసుడు కర్తవ్యనిర్వహణ మాత్రమే చేస్తూ మిగిలిన వారికి కర్తవ్యబోధ చేస్తూ తిరిగి తనదారిన తాను వెళ్ళిపోతాడు.

బోనాలు: 
తెలంగాణ ప్రాంతంలో బోనాలు(నైవేద్యం) సమర్పిస్తారు.

బోనం అనే పదం భోజనం అనే పదం యొక్క సంకోచం , ఇది సంస్కృత రుణ పదం, దీని అర్థం తెలుగులో భోజనం లేదా విందు. ఇది మాతృమూర్తికి సమర్పించే నైవేద్యం. మహిళలు తమ తలపై కుండలను మోస్తూ, ఆలయాల మీదుగా ఉన్న అమ్మవారికి పసుపు-కుంకం, కంకణాలు మరియు చీరలతో పాటు బోనం సమర్పిస్తారు. బోనాలలో మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ, నూకలమ్మ వంటి ప్రాంతీయ రూపాలలో మాతృమూర్తిని పూజిస్తారు.

ఆషాడ మాసంలో దేవి తన పుట్టింటికి వెళుతుందని నమ్మకం; అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ స్వంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావనతో, భక్తి శ్రద్ధలతోనేగాక, ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో పెద్ద పండుగ, ఊరపండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఊరడే తర్వాతి కాలంలో బోనాలుగా మారింది.

బోనాల సందర్భంగా వనస్థలిపురంలో పొట్టేళ్ళ రథం పై అమ్మవారి ఊరేగింపు
పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతును బలి ఇచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. కొంతమంది స్త్రీలు తలపై కుండని (బోనం) మోస్తూ డప్పుగాళ్ళ లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు.

ఆడి పూర్ణిమ
దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా తమిళనాడు పరిసర ప్రాంతములలో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తూంటారు. ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇది ఆధ్యాత్మిక సాధనలకు మరియు శక్తి దేవి ఆరాధనకు అత్యంత శుభప్రదమైనది.

అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు.
పులిహోర (Chitrannam): చింతపండు, నిమ్మకాయ లేదా మామిడికాయ పులిహోర అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది.

దద్ధోజనం (Curd Rice): ప్రశాంతతను చేకూర్చే పెరుగు అన్నం తాలింపుతో నివేదిస్తారు.

పరమాన్నం / చక్ర పొంగల్ (Sweet Pongal): బెల్లం, బియ్యం, నెయ్యితో చేసే తియ్యటి ప్రసాదం.

రాగి జావ / అంబలి (Ragi Koozh): ఆడి మాసంలో అమ్మవారికి గ్రామ దేవతల ఆలయాలలో రాగి అంబలిని ప్రత్యేకంగా వండుతారు.

పూర్ణిమ నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు.

ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు. సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి, చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు. చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసకులు ఆహారం స్వీకరిస్తారు.

ఈ రోజున చేయాల్సిన పనులు
గురు పూర్ణిమ రోజున విష్ణువును పూజించి. మీ శక్తి మేరకు దానం చేయండి. ఈ రోజున పసుపు మిఠాయిలు, వస్త్రాలు దానం చేస్తే మంచిది. ఇలా చేయడం వల్ల జాతకంలో గురుదోషం తొలిగిపోయి అదృష్టం కలిసివస్తుంది.

మీ పెళ్లికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లయితే గురు పూర్ణిమ రోజున గురు యంత్రాన్ని స్థాపించండి దీని వల్ల మీ ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగుతాయి.

చదువులో విజయం సాధించలేకపోతున్నారా? అయితే గురు పూర్ణిమ రోజున గోవును పూజించండి. ఈ రోజున భగవద్గీతను పఠించడం ఎంతో మంచిది.

పౌర్ణమి రోజున కొన్ని పనులు చేయడం ద్వారా సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. దీని కోసం, ఒక కుండలో మంచినీటిని తీసుకొని రావి చెట్టుకు ఆ నీటిని సమర్పించండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు.

సాయంత్రం వేళల్లో భార్యాభర్తలు కలిసి చంద్రుని దర్శనం చేసుకుని పూజిస్తే వారి దాంపత్య జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి.

పౌర్ణమి సాయంత్రం తులసి మొక్క ముందు ఆవు నెయ్యి దీపం వెలిగించడం వలన అదృష్టం కలిగిస్తుంది.

గురువు అనుగ్రహం:
మహాభారతాన్ని మనకు అందించిన రోజు ఆషాడ శుద్ధ పౌర్ణమి రోజు కనుక ఆ రోజును గురుపౌర్ణమిగా జరుపుకుంటారు. మహర్షి వేదవ్యాసుడు మానవాళికి మొదటిసారిగా నాలుగు వేదాల జ్ఞానాన్ని అందించాడు. దాని కారణంగా అతనికి మొదటి గురువు బిరుదు లభించింది. పూర్ణిమ తిథి విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ రోజున శ్రీ హరిని పూజించడం చాలా ప్రయోజనకరంగా భావిస్తారు. గురు పూర్ణిమ రోజు ప్రజలు తమకు విద్యా బుద్ధులు నేర్పించిన గురువులను పూజిస్తారు.

చేయవలసిన దానాలు:
గురు పూర్ణిమ నాడు కొన్ని దానాలు చేయడం మంచిదని నమ్ముతారు. శనగపప్పు, పసుపు మిఠాయిలు, పసుపు రంగు వస్త్రాలు దానం చేస్తారు. అలాగే తిలకం ధరించి భగవద్గీత పఠనం చేయాలి. లక్ష్మీనారాయణ ఆలయంలో కొబ్బరికాయను సమర్పించడం కూడా మంచి ఫలితాలు ఇస్తుంది.

ఆర్.యస్.యస్. సంస్థాగత స్థాయిలో అధికారికంగా జరుపుకునే ఆరు పండుగలలో ఇది ఒకటి. ఇతర ఐదు పండుగలు హిందూ సామ్రాజ్య దినోత్సవం, మకర సంక్రాంతి, దశమి, ఉగాది, రక్షాబంధన్ మహోత్సవ్ గా ఉన్నాయి.

Nageshwar Jyotirlinga, Dwarka, Gujarat State - నాగేశ్వర జ్యోతిర్లింగం, ద్వారక, గుజరాత్ రాష్ట్రం

నాగేశ్వర జ్యోతిర్లింగం, ద్వారక, గుజరాత్ రాష్ట్రం

నాగేశ్వర దేవాలయం భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో ఉన్న దేవాలయం . ఇది శివ పురాణంలో ప్రస్తావించబడిన పురాణ దేవాలయాలలో ఒకటి మరియు పన్నెండు జ్యోతిర్లింగాలలో కూడా ఒకటి.

పురాణ కథనం:
శివ పురాణం నాగేశ్వర జ్యోతిర్లింగం 'దారుకావనం'లో ఉందని చెబుతుంది , ఇది భారతదేశంలోని ఒక పురాతన అడవి పేరు. కామ్యకవన , ద్వైతవన , దండకవన వంటి భారతీయ ఇతిహాసాలలో 'దారుకావన' ప్రస్తావన కనిపిస్తుంది .

దారుకావనమున దారుక అనే రాక్షసుడు తన పరివారముతో నివసించి, ఆ వనమున పోవు యాత్రికులను దోచి, నానాహింసలు పెట్టుచున్నాడు.

ఆ రాక్షసుడికి దారుక అనే రాక్షసి భార్యగా ఉండేది, ఆమె మాతా పార్వతీ దేవిని పూజించేది. ఆమె తపస్సు మరియు భక్తి ఫలితంగా, మాతా పార్వతీ దేవి ఆమె పూజలు చేసే వనం పై ఆధిపత్యం చెలాయించే శక్తిని ప్రసాదించి, ఆమె పేరు మీదే ఆ వనానికి 'దారుకావనం' అని పేరు వచ్చింది. 

దారుక ఎక్కడికి వెళ్లినా ఆ వనం ఆమెను అనుసరించేది. దారుకవనంలోని రాక్షసులను దేవతల నుండి రక్షించడానికి, దారుక పార్వతి తనకు ఇచ్చిన శక్తిని ప్రయోగించింది. ఆ తర్వాత ఆమె ఆ వనం మొత్తాన్ని సముద్రంలోకి తరలించింది, అక్కడ వారు ఋషులపై అఘాయిత్యాలు చేస్తూ వారి తపస్సుకు, యజ్ఞాలకు భంగం కలిగిస్తూ వారిని వేధించేవారు. ప్రజలను అపహరించి సాగరం  క్రింద ఉన్న తమ  నివాస ప్రాంతం లో బంధించారు, 

సుప్రియుడను వైశ్యుడు గొప్ప వ్యాపారి, గొప్ప శివ భక్తుడు. సుప్రియుడు వ్యాపార నిమిత్తం ద్వారకా వనమున పోవు చుండగా, దారుకుని అనుచరులు సుప్రియుడును, అతని తో పాటు మరికొందరిని సముద్ర సర్పాలు మరియు రాక్షసులు నివసించే దారుకావనం అనే తన నగరంలో బంధించాడు.

మహా భక్తుడగు సుప్రియుడు శివలింగదారి, మెడయందున్న లింగమును తీసి, అరచేతి యందుంచుకుని, తనతో పాటు ఇతర బందీలు శివుని పంచాక్షరీ మంత్రాన్ని జపించడం ప్రారంభించారు. దానిని చూచిన రాక్షస సేవకులు దారుకునికి చెప్పిరి. దారుకుడు సుప్రియునితో "నీవు దైవారాధన చేయవద్దు" అని చెప్పినా, శివ పంచాక్షరీ మంత్ర జపము చేయుచున్న సుప్రియుడు సమాధానము చెప్పలేదు.

దారుకుడు కోపమును పట్టలేక తన చేతిలోని గదచే తలపై కొట్టబోవునంతలో, అప్పుడు లింగం నుంచి కోటి సూర్యుల కాంతితో ఈశ్వరుడు ఉద్భవించి రాక్షస సైన్యాన్ని హతమార్చాడు. దారకుడిని సైతం సంహరించబోగా అతడి భార్య తన భర్తను కాపాడమంటూ పార్వతీదేవిని వేడుకుంది. అప్పుడు పార్వతీదేవి ప్రత్యక్షమై తాను దారుక మాంగళ్యాన్ని కాపాడుతానని వరమిచ్చాను కాబట్టి దారకుడిని సంహరించవద్దని కోరింది. ‘భక్తులను కాపాడుతానన్న నీ మాట నిజమవ్వాలి.. అలాగే నా వరము సత్యమవ్వాలి’ అని పార్వతీదేవి తెలిపింది. నేటి నుంచి మీ రాక్షస ప్రవృత్తిని వీడి ఈ శివలింగాన్ని కలియుగాంతం వరకూ పూజించాలని చెప్పిందట. అందుకే అక్కడ శివుడు నాగేశ్వర జ్యోతిర్లింగంగా దారుకావనంలో కొలువు దీరాడని ఆలయ స్థల పురాణం చెబుతోంది.

ఈ ప్రదేశమున పూర్వకాలమున నాగజాతి ప్రజలు నివసించేవారు. కావున ఈ జ్యోతిర్లింగమునకు "నాగేశ్వర లింగము" అని పేరు వచ్చింది. పార్వతీ దేవి నాగేశ్వరిగా ప్రసిద్ధి చెందింది. తనను పూజించే వారికి సరైన మార్గాన్ని చూపిస్తానని శివుడు ప్రకటించాడు.

స్థాన వివాదం:
శివ మహాపురాణం ప్రకారం ఆ ప్రదేశం పశ్చిమ (అరేబియా) సముద్రం ఒడ్డున ఉండేదని తెలుస్తోంది. కోటిరుద్ర సంహిత, 29వ అధ్యాయంలో ఈ క్రింది శ్లోకం చెబుతుంది.

పశ్చిమే సాగరే తస్య వనం సర్వసమృద్ధిమత్ ।
యోజనానాం షోడశభిర్విస్తృతం సర్వతో దిశమ్ ॥

పురాణగాథల్లో చెప్పబడే దారుకవనం యొక్క అసలు ప్రదేశంపై ఇప్పటికీ చర్చ జరుగుతోంది. జ్యోతిర్లింగం యొక్క స్థానాన్ని సూచించే ఇతర ముఖ్యమైన ఆధారాలు ఏవీ లేవు. పశ్చిమ సముద్రంలోని 'దారుకవనం' మాత్రమే మిగిలిన ఏకైక ఆధారంగా ఉంది.

రాణి దారుక పేరు మీద వచ్చిన దారుకవన అనే పేరు, బహుశా దరువన ( దేవదారు చెట్ల అడవి , లేదా కేవలం కలప అడవి) నుండి ఉద్భవించి ఉండవచ్చు, ఇది అల్మోరాలో ఉందని భావిస్తున్నారు. దేవదారు ( దారు వృక్షం ) పశ్చిమ హిమాలయాలలో మాత్రమే సమృద్ధిగా కనిపిస్తుంది, ద్వీపకల్ప భారతదేశంలో కాదు. ప్రాచీన హిందూ గ్రంథాలలో దేవదారు చెట్లకు శివునితో సంబంధం ఉందని చెప్పబడింది. ఋషులు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి దేవదారు అడవులలో నివసించి, ధ్యానం చేసేవారు. అలాగే, ప్రాచీన గ్రంథమైన ప్రసాద్మందనం ప్రకారం ,

"హిమద్రేరూత్తరే పార్శ్వే దేవదారూవనం పరమపావనం శంకరస్థానం తత్ర్సర్వే శివార్"

ఈ కారణంగా ఉత్తరాఖండ్‌లోని అల్మోరాలో ఉన్న 'జాగేశ్వర' ఆలయాన్ని సాధారణంగా నాగేశ్వర జ్యోతిర్లింగంగా గుర్తిస్తారు.

దారుకావనం అనే లిఖిత నామాన్ని 'ద్వారకావనం' అని తప్పుగా చదివే అవకాశం ఉంది, ఇది ద్వారకలోని నాగేశ్వర ఆలయాన్ని సూచిస్తుంది. అయితే, ద్వారకలోని ఈ భాగంలో ఏ భారతీయ ఇతిహాసాలలోనూ ప్రస్తావించబడిన అడవి లేదు. శ్రీకృష్ణుని కథనాలలో సోమనాథ మరియు దానికి ఆనుకుని ఉన్న ప్రభాస తీర్థం ప్రస్తావించబడ్డాయి, కానీ ద్వారకలోని నాగేశ్వర లేదా దారుకావనం గురించి ప్రస్తావించబడలేదు.

దారుకావనం వింధ్య పర్వతాల పక్కన ఉండవచ్చు. ఇది వింధ్య పర్వతాలకు దక్షిణ - నైరుతి దిశలో ఉండి పశ్చిమాన సముద్రంలోకి విస్తరించి ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో (6), శంకరాచార్యులు ఈ జ్యోతిర్లింగాన్ని నాగనాథ అని స్తుతించారు :

" యామ్యే సదంగే నగరేతిరమ్యే
విభూషితంగం వివిధైశ్చ భోగై 
సద్భక్తిముక్తిప్రదమిశమేకం 
శ్రీనాగణనాథం శరణం ప్రపద్యే "

దీని అర్థం ఏమిటంటే, ఇది ఉత్తరాఖండ్‌లోని జాగేశ్వర ఆలయానికి దక్షిణంగా మరియు ద్వారకా నాగేశ్వరకు పశ్చిమంగా, మహారాష్ట్రలోని ఔంధ్ యొక్క ప్రాచీన నామమైన 'సడంగా' పట్టణంలో దక్షిణాన ['యమ్యే'] నెలకొని ఉంది.

ఉండే ప్రదేశం: ఈ ఎర్రని భవనం పట్టణానికి కొద్ది దూరంలో ఉంది. ఒక పెద్ద మండపం చివర శివలింగంతో కూడిన ప్రధాన గర్భగుడి ఉంది. ఆలయానికి సమీపంలో గోపీ తలావ్ తీర్థం అనే మరో ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రదేశం ఉంది. ఇది ఒక సరస్సు, గోపికలు శ్రీకృష్ణుడిని దర్శించుకుని, చివరికి ఇక్కడి మట్టిలో విలీనం కావడానికి తమ ప్రాణాలను అర్పించినట్లుగా చెప్పబడే గాథలతో దీనికి సంబంధం ఉంది.

సందర్శించడానికి ఉత్తమ సమయం: సందర్శించడానికి ఉత్తమ సమయం నవంబర్ మరియు ఫిబ్రవరి మధ్య, మరియు అత్యంత వైభవంగా జరుపుకునే శివరాత్రి సమయం.

రోడ్డు మార్గం: నాగేశ్వరాలయం ద్వారకా నగరానికి 18 కి.మీ.

రైలు మార్గం: ద్వారక మరియు ఓఖా. నాగేశ్వర ఆలయం ద్వారకా రైల్వే స్టేషన్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది.

వాయు మార్గం: జామ్‌నగర్. పోర్‌బందర్ (107 కి.మీ) మరియు జామ్‌నగర్ (126 కి.మీ) ద్వారకకు సమీప విమానాశ్రయాలు.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Monday, July 27, 2026

The Story of Svaha - స్వాహా వృత్తాంతం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - స్వాహా వృత్తాంతం

నారదా! సృష్టి ఆరంభంలో దేవతలు ఆహారంకోసం అలమటించి బ్రహ్మదేవుణ్ణి శరణువేడారు. బ్రాహ్మణక్షత్రియులు యజ్ఞాలలో సమర్పించే హవిర్దానాలు వీరికి అందడంలేదు. రాక్షసులు బలవంతంగా లాగేసుకుంటున్నారు. దేవతలు నిరాహారులయ్యారు. తాళలేక బ్రహ్మను శరణు అన్నారు. ఆయన ధ్యానమగ్నుడై శ్రీకృష్ణపరమాత్మను శరణు శరణు అన్నాడు. ఆ యజ్ఞస్వరూపుడు ప్రకృతిరూప మహాదేవిని ఉపాసించమన్నాడు. బ్రహ్మ ఉపాసించాడు. దేవి ప్రసన్నురాలై ప్రత్యక్తమయ్యింది. వరం కోరుకోమంది.

జగన్మాతా! దయచేసి నువ్వు అగ్నికి దాహకశక్తిగా ఆవతరించు. నువ్వులేనిదే అగ్ని దేనినీ దహించలేనివాడు అవ్వాలి. అగ్నిలో హవిస్సులు వేల్చేటప్పుడు ప్రతిమంత్రానికీ చివర నీపేరు ఉచ్చరించాలి. అప్పుడే అది నిశక్తితో అగ్నిదగ్దమవుతుంది. దాన్ని దేవతలు ఆనందంగా స్వీకరించి సంతృప్తులవుతారు. ఇది దేవకార్యం. దేవతల ఆకలి తీర్చడానికి సహకరించు. నువ్వు కన్నతల్లివి. అగ్నికి ఇల్లాలివై శోభ - శక్తి కలిగించు.

చతుర్వదనా! నేను శ్రీకృష్ణపరమాత్మను కోరి తపన్సు చేస్తున్నమాట నీకు తెలుసుగదా! మరి ఈ అభ్యర్థన ఎమిటి? నువ్వూ నేనూ శివుడూ ఆదిశేషుడూ ధర్ముడూ గణేశుడూ అందరం మన విధులను నిర్వర్తించగలుగుతున్నామంటే అది అంతా ఆ పరాత్పరుడి ఆజ్ఞయేకదా! ఆంతటివాడికి ఇల్లాలిని కాదలిచి ఇప్పుడు దేవతలకోసమని అగ్నికి పరిచర్యలు చెయ్యనా! ఎలాగ? ఆ కృష్ణపరమాత్మనే ధ్యానిస్తాను. ఆయన ఆజ్ఞ ఎలాఉంటే అలా చేస్తాను - అని చెప్పి ప్రకృతిదేవి ధ్యానంలో మునిగిపోయింది. తన తపన్సు కొనసాగించింది. ఒంటికాలిమీద నిలిచి లక్షసంవత్సరాలు చేసింది. శ్రీ కృష్ణపరమాత్మ దర్శనమిచ్చాడు. ఆ మనోహరరూపాన్ని చూస్తూనే ప్రకృతి కామపరవశయై మూర్చపోయింది. ఆవిడ అభిప్రాయాన్ని గ్రహించిన ఆ సర్వజ్ఞుడు మెల్లగా లేవనెత్తి తపస్సుతో అలిసిపోయిన ఆ కృశాంగిని తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు.

ప్రకృతీ! నగ్నజిత్తు కూతురుగా నాగ్నజితి పేరుతో నువ్వు నాకు ఇల్లాలివవుతావు. ఆప్పుడు నీ కోరిక తీరుతుంది. నా వరాహావతారంలో కళాంశగా వారాహివవుదువుగాని. అప్పుడూ నీ కోరిక తీరుతుంది. ఇప్పుడు అగ్నికి దాహికశక్తివై స్వాహావధువుగా దేవతలకు ఉపకారం చెయ్యి. నా ప్రసాదంగా నీకు మంత్రరూప పూజ లభిస్తుంది. అగ్నిదేవుడు ఇల్లాలిని నిన్ను భక్తిభావంతో పూజిస్తాడు. నీతో ఆనందిస్తాడు - అని చెప్పేసి అంతర్ధానం చెందాడు.

ఆంతలోకీ వహ్నిదేవుడు బ్రహ్మ ఆజ్ఞ ప్రకారం భయభక్తులతో అక్కడికి వచ్చాడు. సామవేదోక్తంగా జగదంబికను ఆ ప్రకృతిదేవిని ధ్యానించాడు. పూజించాడు. స్తుతించాడు. మంత్రపూర్వకంగా పాణిగ్రహణం చేశాడు.

ఆ దంపతులు నిర్జన ప్రదేశాలలో నూరేళ్ళపాటు కామక్రీడల్లో తేలియాడారు. స్వాహాదేవి గర్భం ధరించింది. పన్నెండు దివ్యసంవత్సరాలు మోసి దక్తిణాగ్ని గార్హపత్యాగ్ని ఆహవనీయాగ్ని అని ముగ్గురు పుత్రులను ప్రసవించింది.

ఋషులూ మునులూ బ్రాహ్మణులూ క్షత్రియులూ స్వాహాంతంగా మంత్రాలు ఉచ్చరించి హవిర్ధనాలు చేశారు. స్వాహా శబ్దాంతమైన మంత్రాన్ని ఉచ్చరిస్తే చాలు పాపాలు తొలగిపోతాయి. విషహీనమైన సర్పం వేదహీనుడైన విప్రుడు పతిసేవా విహీనయైన స్త్రీ విద్యావిహీనుడైన పురుషుడు ఫలశాఖా విహీనమైన వృక్షం ఎలా నింద్యాలూ నిష్ప్రయోజనాలో అలాగ స్వాహాశబ్ద విహీనమైన మంత్రం నిష్ఫలం. ఇలా స్వాహాంతమైన మంత్రాలతో చేసిన ఆహుతులు అందుకుంటూ దేవతలు ఆనందించారు. ఇది భుక్తి ముక్తిప్రదమైన స్వాహాదేవి ఉపాఖ్యానం. నారదా! ఇంకా ఏమి కావాలో అడుగు. అని నారాయణమహర్షి విరమించాడు.

మహర్షీ! అగ్నిదేవుడు భయభక్తులతో స్వాహాదేవిని సామవేదోక్తంగా ధ్యానించాడు, స్తుతించాడు, పూజించాడు అన్నావుకదా! వాటిని మరికాస్త వివరంగా తెలియజేసి పుణ్యంకట్టుకో - అన్నాడు నారదుడు.

బ్రహ్మపుత్రా! సావధానంగా ఆలకించు. ఏ యజ్ఞం చెయ్యాలన్నా మున్ముందుగా స్వాహాదేవిని, సాలగ్రామంలోగానీ కలశంలోగానీ ఆవాహనచేసి అర్చించాలి. ఆవిడ యజ్ఞమంత్రాలకు ప్రధానాంగం మంత్రసిద్ధిస్వరూపిణి. ఆవిడను అర్చించకపోతే యజ్ఞం సాగదు. సఫలం కాదు.

ఇలా ధ్యానించి ఆవాహన చేసి షోడశోపచారాలూ చెయ్యాలి. ఓం హ్రీం శ్రీం వహ్నిజాయాయై దేవ్యై స్వాహా అనేది మూలమంత్రం. దీనితో పూజలు చేస్తే అనుగ్రహిస్తుంది. అభీష్టాలు తీరుస్తుంది.

స్వాహా వహ్నిప్రియా వహ్నిజాయా సంతోషకారిణీ ।
శక్తిః క్రియా కాలదాత్రీ పరిపాకకరీ ధ్రువా ॥ 01 ॥

గతిః స్పదా వరాణాం చ దాహికా దహనక్షమా ।
సంసారసారరూపా చ ఘోరసంసారతారిణీ ॥ 02 ॥

దేవజీవవరూపా 
దేవపోషణకారిణీ ।
షోడశైతాని నామాని యః పఠేద్భక్తిసంయుతః ॥ 3 ॥

సర్వసిద్ధిర్భవేత్తస్య ఇహ లోకే పరత్ర చ ॥ 04 ॥

నారదా! ఇది అలనాడు అగ్నిదేవుడు స్తుతించిన షోడశనామావళి. దీన్ని భక్తితో పఠిస్తే అంగహీనుడికి కూడా క్రియాకౌశలం అబ్బుతుంది. అపుత్రులు పుత్రవంతులవుతారు. భార్యాదూరుడు భార్యా సహితుడవుతాడు. దంపతులు సుఖసంతోషాలతో వర్థిల్లుతారు.

స్వధా వృత్తాంతం


Srikrishnaastami - sri krishna janmastami - శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి

శ్రీకృష్ణాష్టమి - శ్రీ కృష్ణ జన్మాష్టమి లోకంలో అధర్మం ప్రబలినందున భూదేవి, బ్రహ్మదేవుల ప్రార్ధన మేరకు నారాయణుడు దేవకీ వసుదేవులకు జన్మిస్తాను ...