Sunday, December 29, 2024

CHAALADAA BRAHMAMID చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు

 పల్లవి 

చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు
జాలెల్ల నడగించు సంకీర్తనం ||

చరణములు 
సంతోష కరమైన సంకీర్తనం
సంతాప మణగించు సంకీర్తనం |
జంతువుల రక్షించు సంకీర్తనం
సంతతము దలచుడీ సంకీర్తనం ||

సామజము గాంచినది సంకీర్తనం
సామమున కెక్కుడీ సంకీర్తనం |
సామీప్య మిందరికి సంకీర్తనం
సామాన్యమా విష్ణు సంకీర్తనం ||

జముబారి విడిపించు సంకీర్తనం
సమ బుద్ధి వొడమించు సంకీర్తనం |
జమళి సౌఖ్యములిచ్చు సంకీర్తనం
శమదమాదుల జేయు సంకీర్తనం ||

జలజాసనుని నోరి సంకీర్తనం
చలిగొండ సుతదలచు సంకీర్తనం |
చలువ గడు నాలుకకు సంకీర్తనం
చలపట్టి తలచుడీ సంకీర్తనం ||

సరవి సంపదలిచ్చు సంకీర్తనం
సరిలేని దిదియపో సంకీర్తనం |
సరుస వేంకట విభుని సంకీర్తనం
సరుగనను దలచుడీ సంకీర్తనం ||

No comments:

Post a Comment

Sri Chinnamasta Devi Hrudaya Sthotram - శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం

శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం శ్రీ పార్వత్యువాచ : శృతం పూజాదికం సమ్యగ్భవద్వక్రాబ్జనిః స్రుతమ్  । హృదయం ఛిన్నమస్తాయాః శ్రోతుమిచ్చామి సా...