Sunday, December 29, 2024

CHADUVULONE HARINA చదువులోనే హరిని జట్టిగొనవలెగాక

 పల్లవి 

చదువులోనే హరిని జట్టిగొనవలెగాక
మదముగప్పినమీద మగుడ నది గలదా ||

చరణములు 
జడమతికి సహజమే సంసారయాతన యిది
కడు నిందులో బరము గడియించవలెగాక |
తొడరి గాలప్పుడు తూర్పెత్తక తాను
విడిచి మఱచిన వెనక వెదకితే గలదా ||

భవబంధునకు విధిపాపపుణ్యపులంకె
తివిరి యిందునే తెలివి తెలుసుకోవలెగాక |
అవల వెన్నెలలోనే అల్లునేరే ళ్లింతే
నివిరి నిన్నటివునికి నేటికి గలదా ||

దేహధారికి గలదే తెగనియింద్రియబాధ
సాహసంబున భక్తి సాధించవలెగాక |
యిహలను శ్రీవేంకటేశుదాసులవలన
వూహించి గతిగానక వొదిగితే గలదా ||

No comments:

Post a Comment

Sri Chinnamasta Devi Hrudaya Sthotram - శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం

శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం శ్రీ పార్వత్యువాచ : శృతం పూజాదికం సమ్యగ్భవద్వక్రాబ్జనిః స్రుతమ్  । హృదయం ఛిన్నమస్తాయాః శ్రోతుమిచ్చామి సా...