Sunday, December 29, 2024

HARI YAVATAARA MITADU హరి యవతార మీతడు అన్నమయ్య

 పల్లవి 

హరి యవతార మీతడు అన్నమయ్య
అరయ మా గురుడీతడు అన్నమయ్య |

చరణములు 
వైకుంఠ నాథుని వద్ద వడి పడు చున్న వాడు
ఆకరమై తాల్లపాక అన్నమయ్య |
ఆకసపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్న వాడు
ఆకడీకడ తాల్లపాక అన్నమయ్య ||

ఈవల సంసార లీల ఇందిరేశుతో నున్న వాడు
ఆవటించి తాల్లపాక అన్నమయ్య |
భావింప శ్రీ వేంకటేశు పదములందే యున్నవాడు
హావ భావమై తాల్లపాక అన్నమయ్య ||

క్షీరాబ్ధిశాయి బట్టి సేవింపుచు నున్నవాడు
ఆరితేరి తాల్లపాక అన్నమయ్య |
ధీరుడై సూర్యమండల తేజము వద్ద నున్నవాడు
ఆరీతుల తాల్లపాక అన్నమయ్య ||

No comments:

Post a Comment

Sri Chinnamasta Devi Hrudaya Sthotram - శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం

శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం శ్రీ పార్వత్యువాచ : శృతం పూజాదికం సమ్యగ్భవద్వక్రాబ్జనిః స్రుతమ్  । హృదయం ఛిన్నమస్తాయాః శ్రోతుమిచ్చామి సా...