Sunday, December 29, 2024

IPPUDITU KALAGANTI ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు

 రాగం: భూపాళం


పల్లవి 
ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు
అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి ||

చరణములు 
అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటి
ప్రతిలేని గోపుర ప్రభలు గంటి |
శతకోటి సూర్య తేజములు వెలుగగ గంటి
చతురాస్యు బొడగంటి చయ్యన మేల్కొంటి ||

కనకరత్న కవాట కాంతు లిరుగడగంటి
ఘనమైన దీపసంఘములు గంటి |
అనుపమ మణీమయమ్మగు కిరీటము గంటి
కనకాంబరము గంటి గ్రక్కన మేల్కొంటి ||

అరుదైన శంఖ చక్రాదు లిరుగడ గంటి
సరిలేని యభయ హస్తము గంటి |
తిరువేంకటాచలాధిపుని జూడగ గంటి
హరి గంటి గురు గంటి నంతట మేల్కంటి ||

No comments:

Post a Comment

Numerology - Number 5 - న్యూమరాలజీ - 5వ సంఖ్య

న్యూమరాలజీ - 5వ సంఖ్య గ్రహము : బుధుడు.. జన్మదిన తేదీ సంఖ్య:- 5, 14, 23 జనవరి నుండి డిసెంబరు నెలలలో ఏ నెలలో నైనాసరే 5, 14,23 ఈ తేదీలలో పుట్టి...