Sunday, December 29, 2024

VINNAPAALU VINAVALE విన్నపాలు వినవలె వింత వింతలు

 విన్నపాలు వినవలె వింత వింతలు


తాళం: ఝంప
రాగం: భూపాళం (మేళకర్త 8, తోడి  జన్యరాగ )
రూపకర్త: అన్నమాచార్య

ఆరోహణ: స రి1 గ2 ప ద1 స
అవరోహణ: స ద1 ప గ2 రి1 స

పల్లవి
విన్నపాలు వినవలె వింత వింతలు |
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా ||

చరణము
తెల్లవారె జామెక్కె దేవతలు మునులు |
అల్లనల్ల నంతనింత నదిగోవారే |
చల్లని తమ్మిరేకులు సారసపు గన్నులు |
మెల్లమెల్లనె విచ్చి మేలుకొనవేలయ్యా ||

గరుడ కిన్నరయక్ష కామినులు గములై |
విరహపు గీతముల వింతాలాపాల |
పరిపరివిధముల బాడేరునిన్నదివో |
సిరిమొగము దెరచి చిత్తగించవేలయ్యా ||

పొంకపు శేషాదులు తుంబురునారదాదులు |
పంకజభవాదులు నీ పాదాలు చేరి |
అంకెలనున్నారు లేచి అలమేలుమంగను |
వేంకటేశుడా రెప్పలు విచ్చి చూచి లేవయ్యా ||

No comments:

Post a Comment

Sri Chinnamasta Devi Hrudaya Sthotram - శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం

శ్రీ ఛిన్నమస్తా దేవీ హృదయ స్తోత్రం శ్రీ పార్వత్యువాచ : శృతం పూజాదికం సమ్యగ్భవద్వక్రాబ్జనిః స్రుతమ్  । హృదయం ఛిన్నమస్తాయాః శ్రోతుమిచ్చామి సా...