Monday, January 5, 2026

Chikkulla Gowri Nomu - చిక్కుళ్ళ గౌరీ నోము కథ

చిక్కుళ్ళ గౌరీ నోము కథ

చిక్కి చిక్కినను చిక్కుళ్ళ గౌరీనోముపట్టి మాఘ పూర్ణిమ ముందర వచ్చెడు రథసప్తమినాడు కథచెప్పి యక్షతలు వేసుకొని- "ఎత్తుకొన్న బిడ్డ లెడబాయకుండ, చంటి బిడ్డ సడలకుండ, పక్కలో బిడ్డ బాయకుండ, కంటికాటుక కదలకుండ, తగులు చెదరకుండ, కాలి మట్టుకదలకుండ, కట్టనబట్ట విడువకుండా, తొడిగిన రవిక తొడగకుండా, వంటి సొమ్ము వరఆయముతో వెంటపురుషుడు ఎడబాయకుండా వుండవనెనమ్మా! వెండి చిక్కుళ్ళు పయిడి చిక్కుళ్ళు నేను పంచి పెట్టెదను. చిక్కుళ్ళగౌరీదేవి తల్లీ! చింతలేకుండా సిరిసంపదనిమ్ము" అని కథ చెప్ప యక్షతలు వేసుకొనవలెను.

ఉద్యాపనము: ఒక బంగారు చిక్కుడు పువ్వును చేయించి చీర రవికెలగుడ్డ యిచ్చి దక్షిణ తాంబూలముంచి ఒక ముత్తయిదువునకు పిండివంటలతో భోజనము పెట్టి పైన చెప్పిన బంగారపు చిక్కుడు పూవు చీర, రవికెలగుడ్డ దక్షణ తాంబూలముతో వాయనమియ్యవలెను.

No comments:

Post a Comment

Shani Shingnapur Maharashtra - శని శింగనాపూర్ మహారాష్ట్ర

శని శింగనాపూర్,  మహారాష్ట్ర మహారాష్ట్రలోని అహ్మద నగర్ జిల్లా నేవాస  తాలూకా లో   ఉన్న శ్రీ శనైశ్వరుని దేవస్థానం శని శింగనాపూర్ ఆలయం పుణ్యక్షే...