Saturday, January 10, 2026

Angaragala Nomu Katha - అంగరాగాల నోము కథ

అంగరాగాల నోము కథ

శ్లో:అంగరాగాల నోము నోచిన యతివలకు అనంత సంపదలు
      అమితానందాలు అధిక గౌరవాలు , అనురాగ దాంపత్యాలు
      అనుకున్న సంపదలు అక్షయలోకాలు ప్రాప్తించును.

అంగరాగాల నోచిన అంగతన అంగన రాగాలతో, అసమానరత్న భూషణములతో అఖండైశ్వర్యములతో, అమితశృంగారముతో, అనంత సంతానముతో, 
అనంత పాడిపంటలతో, ఆపదలెరుగని యానందముతో ఆలుమగల యేకీభావముయై. అఖిలగుణ సంపత్తితో, అనంత కాలము ఇహసుఖము లనుభవించి అక్షయలోకాలు పొందుచున్నవి.

ఈ కథ చెప్పుకొని అక్షతలు వేసుకొనవలెను.

ఉద్యాపనము: ఐదు బొట్టుపెట్టెలను చెయించి, అయిదు బొట్టుపెట్టెలలోను వారివారి శక్త్యానుసారము, కాటుక కాయలు కుంకుమ బరిణెలు, నల్లపూసలకోళ్ళు అత్తరులు, పన్నిరు, గంధపు చెక్కలు, దువ్వెనలు, సవరాలు, అగరుండలు బంగారు పువ్వులుగాని గులాబి మొదలగు పువ్వులుగాని యుంచి సబ్బుబిళ్లలుంచి శక్తిగలవారింకను వారి వారి శ
క్త్యానుసారముగా ముక్కు పుడకలు, కాసులు మొదలగు రవికెలు చీరలు మొదలగునవి నుంచవచ్చును. ఈ విధముగా మంచిగంధము మల్లెపువ్వులు మొదలగునవి వుంచి ఐదు బొట్టు పెట్టెలు దక్షిణ తాంబూలములతో అయిదుగురు ముత్తయిదువులకు భోజనము పెట్టి సమర్పింపవలయును.

No comments:

Post a Comment

Jeeva Karma Vipakam - జీవ కర్మ విపాకం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - జీవ కర్మ విపాకం దేవతలు దానవులు రాక్షసులు గంధర్వులు కిన్నరులు మానవులు - వీరు మాత్రమే కర్మజనకులూ కర్మఫలభోక్తలూ....