Monday, January 12, 2026

Musi Vayanala Chatala Nomu Katha - మూసివాయనాల నోము కథ

మూసివాయనాల నోము కథ

మూసివాయనాలు నోచిన భామకు మోసుకుపోయిందాకా పసుపు కుంకుమ, మూసివాయనాలు, నోచినకాంతకు, మోసుకు పోయిందాకా పాడిపంట, మూసివాయనాలు నోచిన యింతికి మోసుకుపోయిందాకా కడుపుచలువ, మూసివాయనాలు నోచిన వణలికి మోసుకుపోయిందాకా పెనిమిటి యనురాగం, మూసివాయనాలునోచిన భామకు మోసుకు పోయిందాకా చుట్టాల (పేమ, మూసివాయనాలు నోచిన మోసుకు పోయిందాకా యిహం మోసుకుపోయిందాక పరం.

ఈ పాట పాడుకొని అక్షింతలు వేసుకొనవలెను.

ఉద్యాపనము: ఈ నోము ఆరు మూసివాయనాలు ఆరుగురు ముత్తయిదువులకు ఇయ్యవలెను, పెద్ద చేటలతో ఇచ్చినవి పెద్ద మూసివాయనాలు చిన్న చేటలతో ఇచ్చినవి చిన్న మూసి వాయనాలు అందురు. ఎవరిశక్తి కొలది వారిచ్చెదరు. ఒక చేటనిండా కుంకుమపోసి పైని ఇంకొకచేట, బోర్లించి, రవికెలగుడ్డ, తాంబూలము, దక్షిణ నల్లపూసలు, లక్కజోళ్ళు పండ్లు పెట్టి యియ్యవలెను అట్లే ఒక చేట నిండా పసుపుపోసి పైన చేట బోర్లించి తాంబూలము దక్షిణ మొదలగుదానితో రెండో మూసివాయనము, ఇంకొక చేటనిండా నల్లపూసలుంచి రెండో చేట బోర్లించి తాంబూలము దక్షిణ మొదలైనవి వుంచి మూడోమూసి వాయనము, ఒకచేటనిండా పువ్వులు పోసి పైన చేట బోర్లించి తాంబూలము, దక్షణ మొదలైనవిపెట్టి నాలుగో మూసి
వాయనము, ఒకచేట నిండా పండ్లుపోసి పైన ఇంకొకచేట బోర్లించి తాంబూలము, దక్షిణ మొదలైనవి వుంచి అయిదో మూసివాయనము, ఒకచేటనిండా గాజులు పెట్టి పైన మరియొక చేట బోర్లించి తాంబూలము, దక్షిణ మొదలైనవి వుంచి ఆరో మూసివాయనము నియ్యవలెను. ఈ మూసివాయనాలన్నియు, ఒక్మమారైనను సరే, లేక ఒక్కొక్కటి చొప్పునైననుసరే రెండేసి మూడేసి చొప్పునైనను సరే వీలునుబట్టి యిచ్చు కొనవచ్చును.

No comments:

Post a Comment

vyakthigatha samvatsara sankhya - 7va sankhya - వ్యక్తిగత సంవత్సర సంఖ్య - 7వ సంఖ్య

వ్యక్తిగత సంవత్సర  సంఖ్య  - 7వ సంఖ్య ఈ 7వ సంఖ్యకు కేతువు అధిపతి. ఈ సంఖ్య కేతు ప్రభావంలో ఉంటుంది. ఈ సంవత్సరంలో అధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటా...