Wednesday, January 7, 2026

Deepa Danam Nomu Katha - దీపదానము నోము కథ

దీపదానము నోము కథ

దీపదానము నోము దివ్యముగాజేసి యిహలోక సౌఖ్యము లన్నియు పొంది అంతులేని యైదవతనము, వెలలేని మేటిబిడ్డలను గాంచి ఆయురారోగ్యములు అన్ని సిరులు, చివరకు మోక్షము చెందగలరు. యెవరయినను ఈ వ్రతమెప్పుడయిన చేయు అధికారము కలదని పెద్దలు చెప్పిరి. కార్తీక మాసము నుండి ప్రతిదినము ఈ పాటపాడుకొని అక్షింతలు  వేసికొనుచుండవలయును.

"దీప దానము, నోమునోచిన నెలతకు
పాపాలు పోవును పరమ పుణ్యము వచ్చు"


ఉద్యాపనము: ప్రమిదలలో వత్తులువేసి నేతితో వెలిగించిన 33ప్రమిదలను శుక్త్యానుసారముగ దక్షిణతాంబూలములతో ఒక ముత్తయిదువునకు వాయనమియవలయును. ఆ ముత్తయిదువు బిడ్డలుగల పేదరాలగుట మంచిది. శక్తిగలిగిన వారు ఆ ప్రమిదలను యిత్తడి, రాగి, వెండి, బంగారముతో దేనిచేతనయినను చేయించి యియవచ్చును. 

వ్రతలోపమైనను భక్తి లోపము కానియెడల ఫలము దక్కును.

స్త్రీల వ్రత కథలు

నిత్య స్తోత్రావళి

పంచాంగం

No comments:

Post a Comment

Gayatri Stotram - గాయత్రీ స్తోత్రం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - గాయత్రీ స్తోత్రం గాయత్రీస్తోత్రం నారదా! గాయత్రీ హృదయం చెప్పానుగదా, ఇక గాయత్రీస్తోత్రం చెబుతున్నాను - విను....