Monday, January 12, 2026

Gandala Gouri Gowri Nomu Katha -గండాల గౌరీ నోము కథ

గండాల గౌరీ నోము కథ

రాజు కూతురు, మంత్రి కూతురు గండాల గౌరీ నోము పట్టి రాజు కూతురుల్లంఘనచేస్తే, మంత్రి కూతురు భక్తి శ్రద్ధలతో నోచి ఉద్యాపనచేసింది. 
మంత్రి కూతురుకి మగనికి బిడ్డలకు, ధనానికి ధాన్యానికి దాసదాసీజనానికి, ఇండ్లకు వాకిండ్లకు, దూతలకు, దుడకలకు, కార్యాలకు, కధలకు, శుభాలకు వైభావాలకు అన్నిటికీ కూడా దీనికి యేగండం లేకుండా తీగతీసినట్టొక్కలాగు జరిగిపోతూ, ఇరుక్కి పొరుక్కి చుట్టాలకీ, బంధువులకీ అందరికి కన్నుల పండుగగా కాపురము చేసూందట. 

రాజు కూతురుకి అడుగడుగున గండాలే కదిలితే గండం. బ్రతుకంతా గండాలై పోతూందట
అలావుంటే ఆ చిన్నది పార్వతీ పరమేశ్వరులను గూర్చి తప్పస్సు చేసిందట అప్పుడు వారు ప్రత్యక్షమై "బిడ్డా గండాల గౌరీదేవి నోముపట్టి ఉల్లంఘన చేసితివని" చెప్పగా అప్పుడావిడ వారి కాళ్ళకు మొక్కి వారి యాజ్ఞ ప్రకారముగా మళ్ళీ నోముపట్టి యధావిధిగా ఉద్యాపనము చేసికొని యే గండాలు లేకుండా 
మంత్రి కూతురులాగు పెనిమిటితోను, బిడ్డలతోను, భాగ్యంతోను, భోగ్యంతోను వేయెండ్లు వర్ధిల్లి పార్వతీ సన్నిధానము కేగినదట. ఆమె పట్టిన నోమందరూ పట్టారు 

ఈ కథ చెప్పుకొని  ఏడాది అక్షతలు వేసికొనవలెను.

ఉద్యాపనము: అయిదుశేర్ల బియ్యము చలిమిడి, అయిదు శేర్ల పప్పు చిమ్మిలి చేసికొని పదమూడేసి ఉండలు క్రిందచేసి పదునిద్దరు బ్రాహ్మణులకైనా, ముత్తయిదులకైనా వాయనమియ్యవలెను. దక్షణ యుంచి తాంబూలాలు ఇవ్వలెను. పదమూడు జోడాలు తక్కెడ చిప్పలు చేయించి, ఒకచిప్పలో ఒక చిమ్ములుండా, ఒక చలిమిడుండా వుంచి ఇంకో తక్కినచిప్ప పైన మూసి, ఆ వరుసను పండ్రెండు వాయనాలియ్యవలెను. పదమూడోది నైవేద్యము పెట్టి తాను తన వాళ్ళు భుజింపవలెను.


No comments:

Post a Comment

Jeeva Karma Vipakam - జీవ కర్మ విపాకం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము - జీవ కర్మ విపాకం దేవతలు దానవులు రాక్షసులు గంధర్వులు కిన్నరులు మానవులు - వీరు మాత్రమే కర్మజనకులూ కర్మఫలభోక్తలూ....