పసిపిల్లలకు దిష్టి తీసే విధానం
చిన్నపిల్లలకు 'దిష్టి' తగులుతుందా, లేదా అనే విషయంలో పలు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, చాలా ఇళ్లల్లో ఇప్పటికీ చిన్న పిల్లలకు దిష్టి తీస్తుంటారు. అందులో పసి పిల్లలకు ఖచ్చితంగా రోజూ దిష్టి తీయాలంటున్నారు మన పెద్దవారు.
దిష్టి తీసే విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని పెద్దలు చెబుతుంటారు. చిన్నారులకు దిష్టి తీసేటపుడు వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవరూ ఉండకూడదు. అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ దిష్టి తీయకూడదు.
పిల్లలకు తలంటు స్నానం చేయించిన తర్వాత, కర్పూరం బిళ్ల వెలిగించి పై నుంచి క్రిందికి తిప్పి, కర్పూరం వెలుగుతూ ఉండగానే బయట పడవేయాలి.
రాతి ఉప్పును ఒక చెంచాడు చొప్పున ఎడం చేతి గుప్పిటలో తీసుకుని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి, తల్లి దిష్టి అన్నీ తుడిచిపెట్టుకుపోవాలని అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు మూడుసార్లు తిప్పాలి.
చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేటులో పెట్టి పైవిధంగా మరో రెండుసార్లు చేసి నీటితో బిడ్డ కళ్లను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవ్వరూ తొక్కని చోట పడేయాలి.
అలాగే ఒక్కోసారి ఫంక్షన్లకు బయటకు వెళ్ళొచ్చినప్పుడు పిల్లలు ఎక్కువగా ఏడుస్తుంటారు. అలాంటి సమయాల్లో ఉప్పు, మిరపకాయలు కలిపిన మిశ్రమంతో తీయవచ్చు. ఇంకా కొబ్బరి కాయను కూడా దిష్టి తీయడానికి వాడవచ్చు.
Subscribe to:
Post Comments (Atom)
Budha Graham (Budhudu) Janma Vruthantham - బుధ గ్రహం (బుధుడు) జన్మ వృత్తాంతం
బుధ గ్రహం (బుధుడు) జన్మ వృత్తాంతం పురాణ కథనం ప్రకారం బుధుడు చంద్రుడి కుమారుడు. అయితే ఆయన జన్మ వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. నవగ్రహాల్లో ...
-
సూర్య ద్వాదశ నామాలు ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసన సన్నివిష్టః । కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ...
-
నిత్య పారాయణ శ్లోకాలు స్తోత్రాలు నవ గ్రహ స్తోత్రం సుబ్రహ్మణ్యాష్టకం ఆదిత్యహృదయం కనకధారా స్త్రొత్రమ్ దుర్గాసప్తశ్లోకీ దేవి మహత్యం ద్వాత్రిస న...
-
శ్రీ దేవీ భాగవతము నవమ స్కంధములోని శ్రీ సరస్వతీ కవచం ఓం శ్రీం హ్రీం సరస్వ త్త్యై స్వాహా -శిరో మే పాతు సర్వతః । ఓం శ్రీం వాగ్దేవతాయై స్వాహా -ఫ...
No comments:
Post a Comment