Sunday, July 12, 2026

Tambulam - Betel leaves - తాంబూలం - తమలపాకులు

తాంబూలం - తమలపాకులు

హిందూధర్మంలో తమలపాకులను అష్ట మంగళాలలో (1.పూలు, 2.అక్షింతలు, 3.ఫలాలు, 4. వక్క, 5.వస్త్రం, 6.తమలపాకు 7.దీపం, 8.కుంకుమ) ఒకటిగా భావిస్తారు. కలశ పూజలో, సంప్రోక్షణ చేసేటపుడు తమలపాకులనే వాడతారు. పూజలలో, నోములలో, వ్రతాలలో తమలపాకు మొట్టమొదట ఉండవలసినది గా భావిస్తారు. పసుపు గణపతినీ, గౌరీదేవినీ తమలపాకుపైనే అధిష్ఠింప చేస్తారు.

భారతదేశంలో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు. భగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదలలోనూ, దక్షిణ ఇచ్చేటపుడూ, భోజనానంతరం తమలపాకులను తప్పనిసరిగా ఉపయోగిస్తారు. దంపతులు తాంబూల సేవనం చేయడం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని పెద్దలు చెబుతారు.

తమలపాకు పూజలలో ఎందుకు ముఖ్యమైనదంటే-
క్షీరసాగర మథనం సమయంలో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకు ఒకటని స్కాంద పురాణంలో చెప్పారు. శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్లను హిమాలయాలలో నాటారని జానపద కథలు చెబుతున్నాయి. తమలపాకు యొక్క మొదటి భాగంలో కీర్తి, చివరి భాగంలో ఆయువు, మధ్య భాగంలో లక్ష్మీదేవి నిలిచి ఉంటారని పెద్దలు చెబుతారు.

తమలపాకులోని ఏయే భాగాలలో ఏయే దేవతలు ఉంటారో తెలుసుకుందాం.

తమలపాకు పై భాగంలో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారు.

సరస్వతీదేవి తమలపాకు మధ్య భాగంలో ఉంటుంది.

తమలపాకు చివరిలో మహాలక్ష్మీదేవి ఉంటుంది.

జ్యేష్టాదేవి తమలపాకు కాడకీ కొమ్మకీ మధ్యన ఉంటుంది.

విష్ణుమూర్తి తమలపాకు అంతటా ఉంటాడని ప్రతీతి.

శివుడు తమలపాకు పై భాగంలో ఉంటారు.

తమలపాకులోని ఎడమ వైపున పార్వతీ దేవి, మాంగల్యదేవి ఉంటారు.

భూమాత తమలపాకుకు కుడి భాగంలో ఉంటుంది.

సుబ్రహ్మణ్యస్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటాడు.

గృహస్థులు- పూజాలూ - ధర్మసందేహాలు

No comments:

Post a Comment

Remedies for Jupiter-related afflictions - గురుగ్రహ దోష నివారణ

గురుగ్రహ దోష నివారణ నవగ్రహాల్లో బృహస్పతి గ్రహం ఒకటి. దీన్నే గురుగ్రహం అని కూడా అంటారు. ఇది పురుష గ్రహం, బ్రాహ్మణ కులంగా కూడా చెబుతారు. సత్త్...